భ.గీత 9:3
🙏"శ్రీరస్తు శుభమస్తు"🙏 " అశ్రద్ధధానాః పురుషా ధర్మస్యాస్య పరంతప, అప్రాప్య మాం నివర్తంతే మృత్యుసంసారవర్త్మని " - భ.గీత 9:3 పరమాత్మ " ఈ ధర్మమునందు విశ్వాసములేని పురుషులు ( అంటే మగవారు అనికాదు ) నన్ను పొందజాలరు. కనుక వారు మృత్యురూపసంసారచక్రమున పరిభ్రమించు చుందురు " అన్నారు అర్జునుడితో. ఇలా అనేసారేమిటి అనుకోనక్కరలేదు. " ఇతితేజ్ఞానమాఖ్యాతం ... ...............తధాకురు " - భ.గీత 18:63. " నేను చెప్పవలసింది అంతా చెప్పేశాను, నేను చెప్పానని కాకుండా నీ బుద్ధి/బుర్ర ని ఉపయోగించి నీకు ఏది మంచిదనిపిస్తే అది చెయ్యి " అన్నారు పరమాత్మ అన్నారు. దేనికయినా నమ్మకం ముఖ్యం. వంట్లో బావుండలేదు. వైద్యుడిదగ్గరకు వెళ్ళాం. మందు వ్రాసిచ్చాడు. మందులషాపులో కొనుక్కుని ఇంటికి వెళ్ళివేసుకున్నాం. టాబ్లెట్టులో పారాసిటమాల్ 250 మిల్లీగ్రాములు ఉందని చూస్తాం. లేబరేటరీకి వెళ్ళి 250 ఉందో లేదో పరీక్షిస్తామా. ఎక్కడో ముంబయిలోనో లేక వేరే దేశంలోనో తయా...