Posts

Showing posts from May, 2024

సీతమ్మను నవ్వించిన హనుమ - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీరస్తు శుభమస్తు"🙏 హనుమ మొదటిసారి లంకలో సీతమ్మవారిని చూసి మాట్లాడినప్పుడు సీతమ్మ అంటుంది " రాముడు ఎందుకు ఇంత ఆలస్యం చేసారు " అని. " అమ్మా నా భుజాల మీద కూర్చో, క్షణంలో రాముని వద్దకు చేరుస్తాను " అని హనుమ అంటే సీతమ్మ ఫక్కున నవ్వింది. అదేమిటమ్మా అలా నవ్వావు అంటారు హనుమ.  నిన్ను నువ్వు చూసుకో ముందు అంటుంది సీతమ్మ. అప్పుడు హనుమ పిల్లిపిల్లలా ( వాల్మీకి అలా అన్నారు ) ఉంటారు. అయ్యో మర్చిపోయానమ్మా, నా నిజరూపం చూడమ్మా అని ఆకాశంలోకి ఎదిగిపోతారు హనుమ. ఎక్కడా నక్షత్రాలు కూడా కనబడటంలేదు, హనుమ అలా ఉన్నారు. ఎవరయినా చూస్తారని వెంటనే ఉపసంహరించు నీ రూపాన్ని అంటుంది సీతమ్మ. సీతమ్మ అంటుంది " నువ్వు అలా తీసుకుపోతే రాముడికి రావణుడికి తేడా ఏమి ఉంటుంది. రాముడు వచ్చి రావణుడిని వధించి నన్ను తీసుకుని వెడితేనే లోకానికి విషయం తెలుస్తుంది, హర్షిస్తుంది. అద్భుత ఘట్టాలు. హనుమ భారతజాతికి అమ్మవారు ఇచ్చిన అత్యద్భుత బహుమతి - సూర్య. శుభమస్తు

రామనామం రాముడి కన్నా గొప్పదా? - హనుమజ్జయంతి శుభాకాంక్షలు - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీరస్తు శుభమస్తు"🙏  శ్రీరామ పట్టాభిషేకం తరువాత రాముడు సభలో కొలువుదీరి ఉన్నారు. వశిష్టుడు , విశ్వామిత్రుడు మొ.గు ఋషులందరూ సభలో ఉన్నారు. నారదులు, వానర వీరులు అందరూ అక్కడ ఉన్నారు. వారికి ఓ ధర్మసందేహం వచ్చింది. భగవంతుడు గొప్పవారా భగవన్నామం గొప్పదా అని. ఎటూ తేలలేదు.  ఆ సమయంలో నారదులు హనుమ వద్దకు వచ్చి ఇంత మంది ఋషులు ఒకేసారి కనబడడం కష్టం. వారికి నమస్కరించి ఆశీర్వచనం తీసుకో అనగానే హనుమ ఆనందపడిపోయారు. ఒక్కొక్క ఋషి వద్దకు వెళ్ళి నమస్కరించారు. హడావిడిలో విశ్వామిత్రుడికి నమస్కారం చేయడం మర్చిపోయి వచ్చి కూర్చున్నారు. విశ్వామిత్రులకు కోపం తారాస్థాయికి చేరింది. రాముడు వైపు తిరిగి హనుమ ఇంతమంది ఋషుల సమక్షంలో నన్ను అవమానించాడు. రేపు సూర్యాస్తమయంలోపు అతని తలను తొలగించు అనడంతో రాముడికి మతిపోయింది. ఆయన గురువు, ఇతను ప్రియభక్తుడు. అయినా గురువు మాట వేదం కనుక అలాగే అన్నారు రాముడు. హనుమ బాధపడిపోయారు. నారదుల వద్దకు వెళ్ళి మీరు చెప్పినట్లు చేసాను ఇలా అయిందేమిటి అనగానే నారదులు " ఏమీ భయంలేదు, రేపు బ్రహ్మీ ముహూర్తంలో సరయూ నదిలో స్నానం చేసి శ్రీరామ జయరామ జయజయ రామ అనే త్రయోదశాక్షరనామ ( 13  అక...

మనస్సు నిర్మలంగా ఉంటే ఏ గొడవలు ఉండవు - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏 " శుద్ధమానసా " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 973 వ నామం. " శుద్ధమానసా " అంటే నిర్మలమయిన మనస్సుకలది అని అర్థం. సహజంగానే ఏ అమ్మ మనస్సు అయినా నిర్మలంగానే ఉంటుంది. మరి అమ్మలగన్నయమ్మ మనస్సు నిర్మలంగా ఉండకుండా ఎలా ఉంటుంది. సహజంగా ఎవరి మనస్సయినా నిర్మలంగానే ఉంటుంది. మనస్సు అంతఃకరణాలలో మొదటిది. అది సంకల్ప వికల్పాలను రెండింటినీ చేస్తుంది. వికల్పాలు అంటే చెడు పనులు/ఆలోచనలు. అటువంటివి చేయాలని ఎవరికీ ఉండదు. కాని ప్రకృతి/సమాజం అలా ఉండనివ్వదు. మాయ చేస్తుంది. నిర్మలంగా ఉన్న సరస్సులో ఓ రాయి వేస్తే తరంగాలు మొదలవుతాయి. అలాగే ఓ చెడు లేక ఇష్టంలేని సంఘటన జరగగానే మనస్సులో తరంగాలు మొదలవుతాయి. వాటిలో సుఖ, దుఃఖ తరంగాలు రెండూ ఉంటాయి. అవి జీవుడి కర్మఫలాల మీద ఆధారపడి ఉంటాయి. " వికారహేతౌ సతి విక్రయంతే   ఏషాన్నతేతాంసి    తవేయ ధీరాః "  అన్నారు కాళిదాసు. ఎదురుగా వికార సంఘటనలు జరుగుతూన్నా మనోవికారానికి లోను కానివారు ధీరులు అని. అది అంత సులభం కాకపోయినా అసాధ్యం కాదు. సంఘటన ఒకటే అయినా అందరూ ఒకేలా స్పందించరు. " అసంశయం మహాబాహో    మనో ద...

పునర్జన్మలను ప్రతిపాదించినది సనాతనధర్మం - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీరస్తు శుభమస్తు"🙏 " ప్రాప్య పుణ్యకృతాం లోకా      నుషిత్వా శాశ్వతిః సమాః   శుచీనాం శ్రీమతాం గేహే    యోగభ్రష్టో2భిజాయతే "                - భ.గీత 6:41 " అథవా యోగినామేవ    కులే భవతి ధీమతామ్ |   ఏతద్ధి దుర్లభతరం    లోకే జన్మ యదీదృశం "                - భ.గీత 6:42 " విజయవంతం కాని యోగులు, మరణం తరువాత, సద్గురువుల నివాసాలకు వెళతారు. అనేక యుగాలు అక్కడ నివసించిన తరువాత, వారు మళ్లీ భూతలంలో పుణ్యాత్ములు మరియు సంపన్నుల కుటుంబంలో జన్మిస్తారు. లేకుంటే, దీర్ఘకాలంగా యోగాభ్యాసం చేయడం వల్ల వారు వైరాగ్యాన్ని పెంచుకున్నట్లయితే, వారు దైవిక జ్ఞానంతో కూడిన కుటుంబంలో పుడతారు. అటువంటి జన్మ ఈ లోకంలో పొందడం చాలా కష్టం " అని తెలియచేసారు పరమాత్మ. ఎంత అద్భుత విషయం. పునర్జన్మ ప్రతిపాదించినది సనాతనధర్మం. ఎన్నో పురాణాలలో ఎన్నో విషయాలను పునర్జన్మల గురించి తెలియచేసారు మన ఋషులు. ఏయే కర్మలు చేస్తే ఎటువంటి పునర్జన్మలు కలుగుతాయో కూడా తెలియచేసారు.  పరమాత్మ చెప్పినది సఫలం కాని యో...

కీర్తన అంటే అమ్మవారిని కీర్తించడం - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏 " ఉదారకీర్తిః " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 848 వ నామం. " ఉదారకీర్తిః " అంటే ఉత్కృష్టమయిన విస్తరించిన కీర్తి గలవారు అమ్మవారు అని. ఉత్ అంటే ఉత్కృష్టమయిన. అర అంటే విస్తరించిన అని అర్ధం. అరవిరిసిన పువ్వు అంటే బాగా విచ్చుకున్న/విస్తరించిన పువ్వు. అసలు కీర్తి ఎవరికి ద్రక్కుతుంది. సమాజానికి పనికివచ్చే మంచిపనులు చేసేవారికి.  అమ్మవారి కన్నా అర్హులు ఎవరు ఉదారకీర్తికి. జీవుల ఆనందంకోసం మానసిక ప్రశాంతతకోసం ఎన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నారు అమ్మవారు. రకరకాల వృక్షాలు, పువ్వులు, ఫలాలు, పక్షులు, జంతువులు, జలపాతాలే కాకుండా చక్కటి గాలి, నీరు, తృణధాన్యాలు సమకూరుస్తున్నారు. అందుకే కృతజ్ఞతగా అమ్మవారి గుణగణాలను కీర్తిస్తూ ఎన్నో " కీర్తనలు " చేసారు/చేస్తున్నారు మహాకవులు/వాగ్గేయకారులు. అమ్మవారి గుణగణాలు అద్భుతం కనుకే కీర్తనలు అన్నీ అంత అద్భుతంగా ఉంటాయి. కీర్తన పాడితే చాలు అమ్మవారు మురిసిపోతుంది.  మూకశంకరులు మూగవాడు. కామాక్షీదేవి అనుగ్రహంతో మాటవచ్చి అమ్మవారిని కీర్తిస్తూ 500 శ్లోకాలు ఆశువుగా చెప్పారు. అది మూకపంచశతిగా ప్రసి...

స్వర్గం అంత అందంగా శుభ్రంగా ఎందుకుంటుంది - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీరస్తు శుభమస్తు"🙏 " మనుష్యాణాం సహస్రేషు    కశ్చిద్యతతి సిద్ధయే,   యతతామపి సిద్ధానాం    కశ్చిన్మాం వేత్తి తత్త్వతః "                      - భ.గీత 7:3 " వేల మంది వ్యక్తులలో, పరిపూర్ణత కోసం ఎవరూ ప్రయత్నించరు; మరియు పరిపూర్ణతను సాధించిన వారిలో, సత్యం గురించి ఎవరికీ తెలియదు " అన్నారు పరమాత్మ. ప్రవచనాలయినా కళ్ళు హృదయం తెరిచి వినడానికి ప్రయత్నించేది వేలమందిలో ఒకరు. అలా ప్రయత్నం చేసిన వేలమందిలో ఒకరు పరిపూర్ణతను పొందుతారు అని తెలుసుకోవాలి. స్వర్గలోకం ఎంతో అందంగా, ఆనందంగా ఉంటుందంటారు ఎలా అండీ అని అడిగాడు ఒకాయన. పండితులు చెప్పినది కోట్లమందిలో ఒకడు అక్కడకు వెడతాడు నాయనా, పుణ్యం అయిపోగానే మళ్ళీ వచ్చేస్తాడు. అందుకని అక్కడ ఎక్కువ మంది ఉండరు. అందుకని ఎప్పుడూ పరిశుభ్రంగా, అందంగానే ఉంటుంది అని. మరి ప్రవచనాలు వినడం వల్ల ఉపయోగమేమయినా ఉందా అని ఎవరికయినా సందేహం కలిగినా తప్పు పట్టకూడదు. సందేహం అంటూ వస్తేనే కదా నివృత్తి/పరిష్కారం కోసం ప్రయత్నిస్తారు. ప్రవచానలలో ఏమి చెబుతారు, దేవీదేవతల మహిమలు, వేదాలు పురాణాలు శాస్త్రాలల...

బౌద్ధం నుంచి సనాతనధర్మం ఎలా కాపాడబడింది - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీరస్తు శుభమస్తు"🙏  ఆదిశంకరులు తన మొదటి శృంగేరీ శారదాపీఠానికి అధిపతిగా మందనమిశ్రాను నియమించారు. మిశ్రాను, ఆయన భార్యను వాదనలో ఓడించి శిష్యులుగా చేసుకున్నారు శంకరులు. ఈ మిశ్రాగారి గురువు " కుమరిలభట్టు ". ఈయన వేదంలోని కర్మకాండ గొప్పదనేవారు. కర్మకాండ కొంచెం కష్టం, శ్రద్ధగా చేయవలసినది. ఖర్చుతో కూడుకున్నది. రాబోయే కాలంలో తిండికే ఎక్కువ సమయం ఖర్చుచేసే సామాన్యులు కర్మకాండ ఎలా చేస్తారు. జ్ఞానకాండ నయమని చెప్పగలిగితే ఏ జపమో, స్తోత్రమో, అష్టకమో చదువుకుని సులభంగా తరిస్తారు సామాన్యులు అని తలచిన శంకరులు ఈ కుమరిలభట్టుతో వాదించి ఓడించడానికి ప్రయాగ వెడతారు. ఈయన వెళ్ళిన సమయానికి భట్టుగారు అగ్ని ప్రవేశం చేస్తూ ఉంటారు. శంకరులను చూసి " నువ్వు బ్రహ్మసూత్రాలకు వ్రాసిన భాష్యం చూసాను. చాలా బాగుంది. దానికి వర్తీకం ( విపుల వ్యాఖ్యానం ) వ్రాద్ధామనుకున్నాను. సమయం కుదరలేదు. నువ్వు మిథిలకు వెళ్ళి నా శిష్యుడు మందనమిశ్రాతో వాదన చెయ్యి " అని తెలియచేస్తారు. శంకరులు అటునుంచి అటే మిధిల వెళ్ళి మిశ్రాను, ఆయన భార్య భారతిని వాదనలో ఓడించడం జరిగింది. ఇంతకీ భట్టుగారు అగ్నిప్రవేశం ఎందుకు చేయవలస...

శ్రీశరభజయంతి. శుభాకాంక్షలు. - చీమలపాటి సూర్యనారాయణ

 🙏" శ్రీరస్తు శుభమస్తు "🙏 కోయంబత్తూర్ సమీపంలో " ప్రత్యంగిరాదేవి " ఆలయం ఉంది. దానికి స్థలపురాణం ఉంది.  నృసింహస్వామి హిరణ్యకశిపుడిని చంపినతరువాత చాలాకాలం ఆ కోపం/ఉగ్రం లోంచి బయటకు రాలేక అడవులు పట్టితిరుగుతున్నాడు. బ్రహ్మ, ఇంద్రుడు వంటివారంతా ఎన్ని ప్రయత్నాలు చేసినా కుదరకపోవడంతో శివుడిని వేడుకున్నారు ఏదో ఒకటి చేసి ఆయన్ని మామూలుగా చెయ్యమని. శివుడు సరే అని శరభుడుగా వచ్చి స్వామికి అడ్డుగా నుంచున్నారు. ఆయన మీదకే నృసింహస్వామి కోపంగా దూసుకుని వెళ్ళారు. శరభుడి కుడిచేతిలో ప్రత్యంగిరాదేవి కూర్చుని ఉంది. శివుడి మీదకే స్వామి కోపంగా రావడంతో లేచినుంచుంది కోపంతో. ఆవిడ " సహస్రశీర్షావదనా సహస్రాక్షీ సహస్రపాత్....." - వేల శిరస్సులు, ఎర్రటి వేలకళ్ళు, ఆయుధాలతో కూడిన వేల చేతులు. కోపంతో హుంకరించేటప్పటికి నృసింహస్వామి భయపడిపోయి చల్లబడిపోయాడు. ఆవిడ " అయ్యో ఎదురుగా ఉన్నది నా సోదరుడు, ఎలా కోప్పడేదీ " అనుకోలేదు. అనుకుంటే స్వామి ఉగ్రంలోంచి బయటకు రాడు, లోకాలూ తల్లడిల్లిపోతాయి. అందుకని అవసరమయినప్పుడు కోపం తెచ్చుకోవాలి. తప్పులేదు. అమ్మవారు శివుడు వేరు కాదు. ఒకటే శివశక్తి స్వరూపం...

శ్రీనృసింహజయంతి శుభాకాంక్షలు - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీరస్తు శుభమస్తు"🙏 ఈ రోజు పరమపవిత్రమైన శ్రీనృసింహజయంతి. సనాతనధర్మరక్షణకై శంకరాచార్యులు అంత చిన్న వయస్సులో దేశమంతా మూడుసార్లు కాలినడకన తిరిగారంటే అద్భుతంగా అనిపిస్తుంది. మరి ఆయనపై ఈగకూడా వాలకుండా చూసుకున్న వారి శిష్యులు ఎంతటి అదృష్టవంతులు, కారణజన్ములు. వాదనల్లో ఒక్కొక్కరిని ఓడించుకుంటూ ముందుకు సాగుతూంటే శంకరులని కడతేర్చడానికి పలు కుట్రలు జరిగాయి. ఓ అద్భుత విషయం చూద్దాం. ఓ సారి కొందరు ఓ కాపాలికుడిని కలిసి శంకరులని చంపమని అడిగారు. అతను శంకరులని కలిసి నమస్కరిస్తే " ఏమికావాలి " అని అడిగారు. మిమ్మల్ని బలి ఇస్తే నాకు కొన్నిశక్తులు వస్తాయి, సహకరించండి " అని అడిగాడు. ఆయన అన్నారు నేను సరే అని అన్నా నా శిష్యులు అది కుదరనివ్వరు, వారు దూరంగా ఉన్నప్పుడు ప్రయత్నించు అని చెప్పారు.  ఓ రోజు శంకరులు శ్రీశైలం కొండమీద ఉన్నారు, శిష్యులు ఏదో పనిమీద కొండ దిగువకు వెళ్ళారు. విషయం తెలిసి కాపాలికుడు వచ్చేసాడు. శంకరుల శిష్యుడు పద్మపాదుడికి ఎక్కడో ఏదో పొరపాటు జరుగుతూందనిపించింది. గురువుగారిని వంటరిగా వదిలి వచ్చి పొరపాటుచేసామా అనుకున్నాడు. కాని కొండదిగువున ఉన్నాడు తను, ఏమి చెయ్యాలి. అ...

33 కోట్ల దేవతలేమిటండీ బాబూ అంటూంటారు - చీమలపాటి సూర్యనారాయణ

 🙏" శ్రీరస్తు శుభమస్తు "🙏 హిందువులకు ఇంతమంది దేవుళ్ళేమిటండి, 33 కోట్లదేవతలా అని ఆశ్చర్యపోతూంటారు చాలామంది. " త్రయి త్రింశతి " అంటే 33 విధాలయిన/వర్గాలయిన దేవతలు. కోటి అనేపదానికి సంస్కృతంలో అర్ధం వర్గము/విధము. ఈ 33 వర్గాలు ఏమిటంటే - 12 ఆదిత్యులు, 11 రుద్రులు, 8 ( అష్ట ) వసువులు, ఇంద్రుడు, ప్రజాపతి - మొత్తం 33 వర్గాలు. 12 ఆదిత్యులు - ద్వాదశాదిత్యులు. ఒక్కో నెలకు ఒక ఆదిత్యుడు ఉంటారు. వీరు ధాత ( చైత్రం మొదలు ), అర్యముడు, మిత్రుడు, వరుణుడు, ఇంద్రుడు, వివస్వంతుడు, అంశుమంతుడు, త్వష్ట, విష్ణువు, భగుడు, పూషుడు, క్రతువు.  భగవద్గీతలో పరమాత్మ " ఆదిత్యానాం అహం విష్ణుః ( 10:21 ) " అన్నారు. 11 మంది రుద్రులు ( శివతత్వరత్నాకరం ప్రకారం ) - శివుడు, మహేశ్వరుడు, శంభుడు, శ్రీకంఠుడు, భవుడు, ఈశ్వరుడు, మహాదేవుడు, పశుపతి, నీలకంఠుడు, వృషధ్వజుడు, పరమేశుడు. అష్టవసువులు - ఆపుడు ( వరుణుడు ), ధృవుడు, సోముడు, ధరుడు, అనిలుడు, అనలుడు, ప్రత్యూషుడు, ప్రభాసుడు. ఇంద్ర ప్రజాపతి మొత్తం 33 వర్గాలు. " రాముడితో కపివరుండు ఇట్లనియే " అన్న వాక్యం ముద్రణాదోషంతో " రాముడి తోక పివరు.......

మా మనసుల్లో ఎప్పుడూ మంచి ఆలోచనలే కలిగించు తల్లీ - చీమలపాటి సూర్యనారాయణ

 🙏" శ్రీరస్తు శుభమస్తు "🙏 మైఖేల్ మమస్ అని ఒకాయన అమెరికాలో పుట్టారు. చిన్నప్పటినుంచి కొంచెం ఆధ్యాత్మికంగా ఉండేవారు. ఈయన మానసికశాంతికోసం మనదేశానికి వచ్చి హిమాలయాలలో తిరగడం మొదలెట్టారు. ఒకరోజున ఈయన అలా తిరుగుతూండగా ఓ గుహలోంచి ఒక ముని బయటకు వచ్చి ఈయనకు ఒక శివలింగం, శ్రీచక్రం ఇచ్చి, అమెరికాలో ప్రతిష్ఠించు, శాంతి కలుగుతుంది అని చెప్పి అంతర్ధానమయారు. వాటిని జాగ్రత్తగా భద్రపరచుకుని ఈయన మనదేశమంతా తిరిగారు. ఎందరో పండితులని కలిసి ఇష్టంతో సంస్కృతం నేర్చుకుని ఎన్నో గ్రంధాలను చదివారు. వేదాలను వేదవిజ్ఞానాన్ని అద్భుతసంపదగా భావించి అవే ప్రపంచశాంతిని ఇవ్వగలవనే నమ్మకంతో అమెరికాకి తిరిగివెళ్ళి నార్త్ కరోలినాలోని బ్లూ రిడ్జ్ పర్వతాలలో ఓ పర్వతాన్ని కొన్నారు. అది 450 ఎకరాలు. దానికి సోమపర్వతం అనిపేరుపెట్టి దానిమీద శ్రీసోమేశ్వర దేవాలయాన్ని కట్టారు. అందులోనే గణపతి హనుమ నవగ్రహాల విగ్రహాలను ప్రతిష్ఠించి వేదపాఠశాలను స్థాపించారు. ఇప్పుడు అక్కడ ఎందరో సంస్కృతవిద్యను అభ్యసిస్తున్నారు. కొందరు పండితులనేది మన ఋషి ఒకరు ప్రపంచమంతా మన వేదవిజ్ఞానాన్ని వ్యాప్తిచేయడానికని ఈయనగా పునర్జన్మ తీసుకున్నారని. పూజ్యులు సామ...

చెట్టు ముందా, విత్తు ముందా? - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీరస్తు శుభమస్తు"🙏 "సర్వయోనిషు కౌన్తేయ   మూర్తయః సమ్భవంతి యాః,   తాసాం బ్రహ్మ మహద్యోని  రహం బీజప్రదః పితా "  " కౌంతేయా - సర్వజీవ సముదాయము భౌతిక ప్రకృతి యందు జన్మించుట చేతనే సృష్టించబడుచున్నదనియు మరియు నేనే వాటికి బీజప్రదాతనైన తండ్రిననియు అవగాహన చేసుకొనవలెను " అన్నారు పరమాత్మ. మగవారి బీజం ఆడువారి అండంతో కలిస్తే సంతానం కలుగుతూంది. మరి ఆ బీజం ఎక్కడినుంచి వచ్చింది. వారి తండ్రినుంచి. మరి వారి తండ్రికి ఎక్కడినుంచి వచ్చింది. వారి తండ్రినుంచి. దీనినే ఇప్పుడు జీన్స్ అంటున్నారు. ఇలా బీజం మూలాల గురించి వెనక్కి వెళ్ళగా వెళ్ళగా పరమాత్మ వద్ద ముగుస్తుంది. అదే పరమాత్మ తెలియచేసినది. " మాతా చ పార్వతీదేవీ    పితా దేవో మహేశ్వరః ( అన్నపూర్ణాష్టకం )" అని ప్రార్థిస్తాం మనం.‌ ఎంత అద్భుతం. పరమాత్మ " సర్వయోనిషు " అన్నారు. అంటే అన్ని జీవులు. ఇది మనుషులకే అనుకోకూడదు. జంతువులకు, పక్షులకు, చెట్లకు, సూక్ష్మజీవులకు అలా అన్నిటికీ వర్తిస్తుంది. ఇప్పుడు ఒక అద్భుత విషయం చూద్దాం. " చెట్టు ముందా విత్తు ముందా " అని ఓ విచిత్రమైన సందేహం అందరికీ, మనకు కూడా. ఈ శ...

భక్తులకు సంపదలు తృణప్రాయం - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీరస్తు శుభమస్తు"🙏 " యం లబ్ధ్వా చాపరంలాభం     మన్యతే నాధికం తతః,   యస్మిన్ స్థితో న దుఃఖేన           గురుణాపి విచాల్యతే  "                 - భ.గీత 6:22  " పరమాత్మప్రాప్తిరూప లాభమును పొందినవాడు ( అనగా భగవత్సాక్షాత్కారమును పొందినవాడు) మఱేయితర లాభమునుగూడ దానికంటె అధికమైన దానినిగా తలంపడు.   బ్రహ్మానందానుభవస్థితిలోనున్న యోగిని ఎట్టి బలవద్దుఃఖములును చలింపజేయజాలవు " అన్నారు పరమాత్మ.    భక్త రామదాసు ప్రజలు కట్టిన పన్నులను ప్రభుత్వానికి కట్టకుండా ఆ డబ్బుతో రాములవారికి గుడి కట్టించాడు, నగలు చేయించాడు. జైలులో పెట్టించినా, శిక్షించినా తొందరగా వచ్చి రక్షించమని రాముడినే వేడుకున్నాడు కాని రాజును వేడుకోలేదు.  పోతనామాత్యుడిని భాగవతాన్ని ఎవరికయినా ఓ రాజుకి అంకితమిస్తే కావలసినంత ధనం ఇచ్చి సత్కరిస్తారని ఎందరో నచ్చచెప్పాలని చూసారు. పోతన ససేమిరా అన్నారు. రాములవారికి అంకితమిచ్చారు, నా బాగోగులు ఆయనే చూసుకుంటారు అని నమ్మారు. త్యాగయ్యని అన్నగారు కూడా " ఈ పాటలు కూడు పెట్టవు...

అమ్మవారి రక్షణ 24x7 - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏 " సదోదితా " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 920వ నామం. " సదోదితా ( సదా + ఉదితా ) అంటే ఎల్లప్పుడూ ప్రకాశించునది అని అర్ధం. ప్రకాశించడం అంటే ఎప్పుడూ మెలకువగా, అప్రమత్తంగా ఉండడం. 14 లోకాలలోని 84 లక్షల జీవరాశుల బాగోగులు సదా చూస్తూ ఉండాలన్నా, తన సృష్టి అంతా లయబద్ధంగా ఆకర్షణీయంగా వింతగొలిపేదిగా ఉండాలన్నా అమ్మవారు ఎంత అప్రమత్తంగా ఉండాలి. మనం అప్పుడప్పుడు వింటూంటాం, చదువుతూంటాం. ఫలానా నాయకుడు రోజుకు 18 గం.లు పనిచేస్తారు, ఎప్పుడూ ఒకరోజు కూడా సెలవు తీసుకోడు అని. మరి ఒక దేశనాయకుడే అలా ఉండవలసి వస్తే అమ్మవారు ఎంత అప్రమత్తంగా ఉంటారు. పూజ్యులు గరికిపాటివారు ఓసారి ప్రవచనం చేస్తూ చమత్కారంగా ఓ విషయం తెలియచేసారు. సూర్యుడు ప్రత్యక్షనారాయణుడు కదా ఆయన్ని నమ్ముకుంటే నయమా అమ్మవారిని నమ్ముకుంటే నయమా అని సందేహం కలిగిందిట ఒకాయనకు. ఈయన అన్నారు " రాత్రి మనకు ఏదయినా సమస్య వస్తే ఉదయం సూర్యుడు ఉదయించేదాకా ఆగాలి. అమ్మవారి రక్షణ అయితే 24x7 " అని.  అమ్మవారి పాదాలను ఆశ్రయిద్దాం, నిశ్చింతగా జీవిద్దాం.  ఏతత్ సర్వం శ్రీపరదేవతార్పణమస్తు - సూర్య. శుభ...

" అవ్యాజకరుణామూర్తి " సీతమ్మ జయంతి నేడు - శుభాకాంక్షలు - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీరస్తు శుభమస్తు"🙏 " ఇయం సీతా మమ సుతా    సహధర్మచరీ తవ,   ప్రతీచ్ఛ చైనాం భద్రం తే    పాణిః గృహ్ణీష్వ పాణినా "            - వాల్మీకి రామాయణం. జనకుడు సీతమ్మతల్లి చేతిని రాముని చేతిలో పెట్టి అలా అంటారు. ఇక్కడ " భద్రం తే " అంటారు. మా అమ్మాయి " నీకు క్షేమం కలిగిస్తుంది " అని. ఆశ్చర్యంగా లేదూ.  ఋష్యాశ్రమాన్నించి వీరు బయలుదేరి వెడుతూంటే సీతమ్మతల్లి అంటుంది రాముడితో - " ఎంత జాగ్రత్తగా ఉన్నా అధర్మం ఏదో ఒక సందుచూసుకుని మనిషిలో ప్రవేశిస్తుంది. దానికి 3 మార్గాలు ఉన్నాయి. అవి అసత్యమాడడం, పరదారాభిగమనం ( దారా అంటే భార్య. పరుల భార్యలపై మనసు పడడం అని అర్ధం ), వైరంలేని యుద్ధం. మొదటి రెండు మిమ్మల్ని దరిచేరవు కాని 3వది మనకు అవసరమా. రాక్షసులతో మనకు వైరంలేదు. వనవసానికి వచ్చాం, గుట్టుగా పూర్తిచేసుకోక ఎందుకివన్నీ. ఆయుధాలే మనకు అవసరంలేదు కదా " అని అంటుంది. సీతమ్మ భార్యగా శ్రీరాముడిని ఎల్లవేళలా ధర్మమార్గంలోనే గడిపేలా సహకరించింది. అందుకే భార్యని " ధర్మపత్ని " అంది సనాతనధర్మం. భార్య సహకారం లేకపోతే పోతన అయినా, త్యాగయ్య అయినా ఇంకొకరయినా అటువంటి ఉ...

నేడు కాటన్ దొర జయంతి - స్మరించుకుని గౌరవించుకుందాం - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీరస్తు శుభమస్తు"🙏  మా గ్రామానికి 2 కి.మీల దూరంలో ఉన్న గోదావరీనది మీద ఆక్వాడక్ట్ కడదామని నిర్ణయించి సలహాదారు కోరికతో ముహూర్తం పెట్టమని మా అక్కగారి మామగారి తండ్రిగారి దగ్గరకి వచ్చారు కాటన్ గారు. మూహూర్తం పెట్టి కట్టడం వయస్సు 100 సంలు అని, 100వ ఏట ఫలానా స్థంభం వద్ద బీటతీస్తుందని మరమ్మత్తు చేసుకుంటే ఇంకో 100 సంలు వాడుకలో ఉంటుందని చెప్పారుట. అలాగే 100వ ఏట జరగడం మరమ్మత్తు చేయడం జరిగింది. ముహూర్తం పెట్టినందుకు దక్షిణ ఏమి ఇవ్వమంటారు అని అడిగితే " మా గ్రామస్తుల పొలాల్లో ఉన్న తాటిచెట్లు వారే వాడుకోవడానికి ( గోశాలకి యాగశాలకి తాటి దుంగలు, ఆకులు ముఖ్యం ) అనుమతి ఇవ్వండి " అని అడగడం కాటన్ గారు అనుమతి ఇవ్వడం జరిగింది. విషయమేమిటంటే అప్పుడు కట్టే వంతెనలన్నింటికీ తాటి దుంగలు వాడేవారు. అందుకని ఇప్పుడు మంచిగంధం మొక్కలమీద ఉన్నట్లుగా అప్పుడు తాటిచెట్లు కొట్టడం మీద నిషేధం ఉండేది.  గోదావరిని అతి దగ్గరగా తీసుకొనివచ్చి ప్రతిదినం స్నానం చేసే అవకాశం కల్పించిన కాటన్ మహాశయునకు కూడా త్రిసంధ్యలలోనూ అర్ఘ్య ప్రదానం ఇచ్చేవారు అందరూ ఆ రోజుల్లో.  గోదావరిజిల్లాలవారికి ముఖ్యంగా కోనసీమవాసులకు చిరస్...

అధర్మం పెరుగుతూన్నప్పుడు కులస్త్రీలు బాధపడతారు - చీమలపాటి సూర్యనారాయణ

 🙏 " శ్రీరస్తు శుభమస్తు "🙏 " అధర్మాభిభవాత్ కృష్ణ,    ప్రదూష్యంతి కులస్త్రియః,    స్త్రీషు దుష్టాసు వార్షేయ,    జాయతే వర్ణసంకరః "                     - భ.గీత 1:41 " అధర్మం పాపం పెరిగిపోయినప్పుడు కులస్త్రీలు ఎక్కువ దూషితలగుదురు. అప్పుడు వర్ణసంకరము ఏర్పడును " అన్నారు పరమాత్మ. ఆశ్చర్యకరంగా స్త్రీలే ఎక్కువగా దూషితలవుతారు అన్నారు పరమాత్మ. ఇక్కడ కులస్త్రీలు అంటే సత్యం ధర్మం నిష్ఠ పాటించేవారు.  సంప్రదాయకుటుంబాలలో పుట్టినా కొందరు స్త్రీలు లవ్ జిహాద్, పరకులవివాహాలు వంటి వాటికి గురవుతున్నారంటే నేరం వారిది కాదు, సమాజంలో పెరిగిపోయిన " అధర్మం, పాపం " లది.  ధర్మానికి " తపస్సు, శౌచం, దయ, సత్యం " నాలుగు పాదాలు. తపస్సు మోహం కారణంగానూ, శౌచం దుష్టసాంగత్యం కారణంగానూ, దయ గర్వం కారణంగానూ పతనమౌతాయి. ఇలా 3 పాదాలు పతనమవడం కారణంగా సత్యం కుంటి నడక నడుస్తుంది.  కొందరు ఆచారాలను పాటిస్తూ సంప్రదాయంగా ఉంటారు. వీరి పరిచయస్తులు ఏ ఆచారాలను, సంప్రదాయాలను పాటించరు. ఇటువంటి వారితో సాంగత్యంవలన వీరిలో కూడా క్రమేపీ మార్పు ...

ఆలంబన లేకుండా జీవించడం ఒక గొప్ప యోగం - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏 " నిరాలంబా " - అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 877వ నామం. నిరాలంబా అంటే వేరొక ఆధారం లేనిది. జగత్తుకు అమ్మవారు ఆధారం. మరి అమ్మవారికి ఏమిటి ఆధారం. ఏమీలేదు, అవసరమూ లేదు. సాధారణంగా అతనికి ఏ ఆధారం లేదండీ అని ఎవరయినా అనగానే " అయ్యో పాపం " అంటాం. కాని ఏ ఆధారం లేకుండా జీవించడం ఒక గొప్ప విషయం. ఎంతో ఆత్మవిశ్వాసం ఉండాలి. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఇక్కడ కూడా " ఆలంబన " ఉంది. అతని ఆత్మవిశ్వాసమే అతనికి ఆలంబన. ఏపని చేయాలన్నా ఆఖరికి పూజ/ధ్యానం చేయాలన్నా ఆలంబన అవసరం. ధ్యానం చేసేటప్పుడు కూడా ఒక మూర్తినో లేక శ్వాసనో ఆలంబనంగా చేసుకుంటాం. లేకపోతే మనస్సు నిలవదు. విగ్రహారాధన దీనికోసమే ఏర్పాటు చేశారు మన ఋషులు. వారికి పనీ పాటా లేకకాదు. ఎవరికయినా ధనం దానం చేసాం. ధనాన్ని మనం సృష్టించామా. ఇంకొకరి నుంచి రావలసిందే. ఆ ఇంకొకరికి ఇంకొకరినుంచి రావాలి. అదే ఆలంబన. ఇలా ఆ ఆలంబనకు ఆలంబన ఏమిటి అని వెతుకుతూ ఉంటే చివరకు అమ్మవారి దగ్గర ముగుస్తుంది. ఎందుకంటే అమ్మవారికి ఆలంబన లేదు, అవసరం లేదు కనుక. ఇదే విషయాన్ని పరమాత్మ కూడా తెలియచేసారు: " అనన్...

మనిషి జీవితకాలం 120 సం.లు దాటదా? - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏 " భవదావ సుధావృష్టిః,    పాపారణ్యా దవానలా,    దౌర్భాగ్యతూలవాతూలా,    జ్వరాధ్వాంత రవిప్రభా "  ఇవి అమ్మవారి అద్భుతనామాలు. ఇవి శ్రీలలితాసహస్రరహస్యనామాల్లో 742,743,744,745 వ నామాలు.  ఈ నామాలను రోజూ పారాయణ చేస్తే " జాతకం " చూపెట్టుకోవలసిన అవసరం లేదని పండితులు చెబుతారు. అంటే గ్రహదోషాలు అనేవి ఉండనే ఉండవు అని గ్రహించాలి. వీటి అర్ధం చూద్దాం. అమ్మవారు సంసారమనెడి దావాగ్నికి అమృతవర్షం అవుతుంది, పాపమనెడి అరణ్యానికి దావాగ్నిలా వస్తుంది, దారిద్రమనెడి దూదికి ( తూల అంటే దూది ) సుడిగాలి అవుతుంది, ముసలితనం ( జ్వర అంటే ముసలితనం ) అనెడి చీకటికి సూర్యకాంతిలా వస్తుంది. అంటే జీవుణ్ణి బాధలనుంచి రక్షించడానికి అవసరమైనప్పుడు వర్షం, అగ్ని, గాలి, సూర్యకాంతి రూపంలో వచ్చి ఆదుకుంటుందని అర్ధం. శరణువేడిన వారికి అన్ని బాధలనుంచి ఉపశమనం కలిగిస్తుంది. ఇప్పుడొక అద్భుతమైన విషయం చూద్దాం. అమ్మవారు సృష్టిలో కాలచక్రం ఏర్పాటుచేద్దామనుకున్నప్పుడు సూర్యుడు ఉద్భవించాడుట. ఆయనవల్ల పగలు రాత్రి ఏర్పడి రోజు వచ్చింది. వారాలు నెలలు సంవత్సరం ఏర్పడ్డాయి.  జీవుల జీవితకాలం ఏర్...

నేడు " మాతృదినోత్సవం" - శుభాకాంక్షలు - చీమలపాటి సూర్యనారాయణ

 🙏" శ్రీరస్తు శుభమస్తు "🙏  నేడు " మాతృదినోత్సవం"  మన వేదాలని ( 20500 మంత్రాలు ), ఉపనిషత్తులని, పురాణాలని, శాస్త్రాలని, రామాయణం ( 24000 శ్లోకాలు ), మహాభారతం ( 100700 శ్లోకాలు ), శృతులు, స్మృతులు ముఖ్యంగా మనుస్మృతిని రకరకాల కట్టుకధలు చెప్పి చెప్పి భ్రష్టుపట్టించేసారు.  వేదవిజ్ఞానం ఎంత ఉత్కృష్టమయినది. ఎన్నిరకాల శాఖలు ఎన్ని ఋక్కులు ఎన్ని సూక్తాలు. ఒక వేదంలోని ఒకశాఖని పూర్తిగా చదివి అర్ధం చేసుకోవడానికి దశాబ్దాలు పడుతుంది. అ ఆ లు రానివాడు కూడా వేదాలు గురించి మాట్లాడడమే. మనుస్మృతి లో " నస్త్రీ స్వాతంత్ర్యమర్హసి ( 9:3 ) " అని ఉందిట. స్త్రీకి స్వాతంత్ర్యం అక్కరలేదంటాడా, అలా ఎలా అంటాడు అని ఓ చర్చ. ఆయనే " యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః ( 3:56 ) " అన్నారు కదా. దానిగురించి మాట్లాడరు. దేవతలందరికీ అధిపతి అమ్మవారు. మొదటగా " మాతృదేవోభవ " అనమన్నారు, అమ్మ తరువాతే ఎవరయినా. యమద్వితీయ నాడు మగవారు అందరూ వారి సొదరీమణుల ఇంటికి వెళ్ళి భోజనం ( భగినీ హస్త భోజనం ) చేస్తే ఆయుష్షు పెరుగుతుందని తెలియచేస్తున్నాయి పురాణాలు. శ్రావణపౌర్ణమి నాడు రాఖీ కట్టమన్నా...

మంచి గురువును కూడా పరమాత్మే ఏర్పాటు చేస్తారు - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీరస్తు శుభమస్తు"🙏 " తద్విద్ధి ప్రణిపాతేన    పరిప్రశ్నేన సేవయా,    ఉపదేక్ష్యంతి తే జ్ఞానం    జ్ఞానినస్తత్త్వదర్శినః "                - భ.గీత 4:34 అర్జునుడు అడుగుతాడు పరమాత్మని " మనస్సుని నిగ్రహించుకోవడం, జ్ఞానం పొందడం అంత సులభమా " అని. అప్పుడు పరమాత్మ అంటారు: " మంచి గురువును పట్టుకో, శ్రద్ధగా సేవచేసుకో, మంచి ప్రశ్నలు వేసి మంచి జ్ఞానం పెంచుకో " అని. స్వామి " పరిప్రశ్నేన " అన్నారు. అంటే ప్రశ్న గౌరవంగా ఉండాలి అని. ప్రశ్న మంచిదయితే జవాబు మంచిదయి జ్ఞానాన్ని ఇచ్చేదిగా ఉంటుంది.  " గురువును పట్టుకో " అన్నారు స్వామి కాని భక్తితో కోరుకుంటే మంచి గురువును ఆయనే పంపిస్తారు. పరీక్షిత్ మహారాజు శాపం కారణంగా 7 రోజులలో మరణిస్తానని తెలుసుకుని గంగాతీరంలో దర్భలమీద కూర్చుంటారు పరమాత్మని పొందడం ఎలాగా అని ఆలోచనచేస్తూ. వ్యాసర్షి, నారదుడు, అత్రి, వశిష్టుడు, భరద్వాజుడు మొ.గు ఋషులందరూ వేంచేసి పరీక్షిత్తు పరమపదించేవరకూ అక్కడే ఉండాలని నిశ్చయించుకుంటారు. పరమాత్మని పొందాలి, ఎలా అనే ధ్యాస తప్పుతే వేరే ఆలోచనలేదు పరీక్షిత్తుకి. అదుగో ఆ ...

శ్రీపరశురామజయంతి శుభాకాంక్షలు.

 🙏"శ్రీరస్తు శుభమస్తు"🙏  నేడు శ్రీపరశురామజయంతి. విష్ణువు ఆరవ అవతారం.  ఈయన ప్రస్తావన రామాయణంలోనూ భారతంలోనూ కూడా వస్తుంది. పరశు అంటే గొడ్డలి, అది శివుడు ప్రసాదించినది. ఈయన తండ్రి జమదగ్ని కోపం నుంచి తల్లిని కాపాడిన విధం అద్భుతం. తమ తల్లి శిరస్సు ఖండించమని తన కుమారులను ఆదేశిస్తాడు జమదగ్ని.  అదేమిటి, అంత తపస్సంపన్నుడు సకలశాస్త్రపారంగతుడు అంత " అవివేకం " గా భార్యని చంపేయమనడం ఏమిటి అని అనుకోవనక్కరలేదు. " దైవీహ్యేషా గుణమయీ  ‌  మమమాయా దురత్యయా "                 - భ.గీత 7:14) అన్నారు పరమాత్మ. వశిష్టుడయినా విశ్వామిత్రుడయినా శ్రీరాముడయినా ఆఖరికి సీతమ్మయినా పరిస్థితుల ప్రభావంవలన వివేకం కోల్పోవడానికి అవకాశం ఉంది.  జమదగ్ని కొడుకులెవరూ తల్లిని చంపడానికి ముందుకురారు. అప్పుడు పరశురాముడిని తల్లిని సోదరులను సంహరించమంటాడు. వెంటనే సంహరిస్తాడు. సంతోషించిన జమదగ్ని వరం కోరుకోమంటే తల్లిని సోదరులను బ్రతికించమంటాడు.  ఆయన భీష్ముడికి, ద్రోణుడికి కూడా గురువులు.  21 సార్లు దండెత్తి రాజులను చంపేసిన తరువాత పాపహరణంకోసం తను జయించిన భూమం...

ధీరుల పూజలకు కారణం ఉండదు - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏 " ధీరసమర్చితా " - అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 917వ నామం.  " ధీరసమర్చితా " అంటే పండితులచే/ధీరులచే బాగుగా పూజింపబడినది. ఇటువంటి వారికి ప్రాపంచిక విషయాలు పట్టవు. ఎప్పుడూ భగవంతుడి ధ్యాసే. శౌనకమహర్షి అడుగుతారు సూతమహర్షిని " శుకులకు మోక్షప్రాప్తి తప్ప వేరే కోరికలే లేవుకదా, ఆయన భాగవతం ఎందుకు అభ్యసించారు ( అవసరం ఏమిటి ) " అని. అప్పుడు సూతమహర్షి అంటారు ఇలా: " ధీరులు నిరపేక్షులు    నాత్మారాములునైన      మునులు హరిభజనము     నిష్కారణమ      చేయుచుందురు   నారాయణుఁ డట్టివాఁడు    నవ్య చరిత్రా‌ "            - పోతనభాగవతం. అటువంటి వారు చేసే జపాలకు, పారాయణలకు, పూజలకు కూడా కారణమేమీ ఉండదు. అదో వ్యాపకం అయిపోతుంది వారికి. స్వామి రామతీర్థ ( వేదాంత గురు ) ఋషికేష్ లో ఉండగా ఒక బంధువు వచ్చి " మురళీవాలాలో ఉన్న నీ కుమారుడు మరణించాడు " అని చెబుతే ఆయన అన్నారు " గాలి వీచడం, నీరు ప్రవహించడం లాగే జననమరణాలు కూడా అతి సహజ ప్రక్రియ. ఎక్కువ ఆలోచన చేయనక్కరలేదు వాటి గురించి " ...

వికారాలకు లొంగిపోనివారు ధీరులు - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏 " ధీరా " - అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 916 వ నామం.  ధీరా అంటే ధీరురాలు/పండితురాలు అని అర్ధం. " పునంతి ధీరాః అపసో  మనీషా "  - వికారాలకు లొంగిపోని ధృఢమైన చిత్తం, బుద్ధికలిగి ఉండేవారు ధీరులు అని చెబుతూది వేదం.  " వికారహేతౌ సతి విక్రయంతే   ఏషాన్నతేతాంసి తవేయ ధీరాః "             - మహాకవి కాళిదాసు  ఎదురుకుండా వికారాలు కనబడుతూన్నా/జరుగుతూన్నా మనసు చలించనివారు ధీరులు అన్నారు మహాకవి కాళిదాసు. ఇటువంటి వారిలో అమ్మవారు స్థితులై ఉంటారు.  పరమాత్మ ఇదే విషయాన్ని గీతలో ఇలా తెలియచేసారు: " జితాత్మనః ప్రశాంతస్య     పరమాత్మా సమాహితః  !   శీతోష్ణసుఖదుఃఖేషు           తథామానావమానయోః "                - భ.గీత 6:7 శీతోష్ణములు, సుఖదుఃఖములు, మానావమానములు మున్నగు  ద్వంద్వముల యందు అంతఃకరణవృత్తులు నిశ్చలముగా (చలింపక) ఉండి, స్వాధీనమైన ఆత్మగల పురుషుని జ్ఞానమునందు పరమాత్మ చక్కగా స్థితుడైయుండును. ...

గణపతి నామంలో అంత మహత్తు ఉందా?- చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీరస్తు శుభమస్తు"🙏 సోమకాంతుడు అనే చక్రవర్తి ఉండేవాడు. ఎన్నో యజ్ఞయాగాలు చేసాడు. ఎన్నో రాజ్యాలను జయించాడు. ధర్మపాలన చేస్తూ ప్రజలను కన్నబిడ్డల్లా చూసుకుంటున్నాడు. రాజ్యం సుభిక్షంగా ఉంది. పిల్లలు పెద్దవారయారు. అంతా సవ్యంగా సాగుతూన్న సమయంలో రాజుకి కుష్టువ్యాధి సోకింది. రాజవైద్యులు మందు ఇస్తున్నారు. దేశదేశాలనించి వైద్యులు వచ్చి మందులు ఇచ్చారు కాని తగ్గుముఖం పట్టలేదు సరికదా ముదురుతూంది. రాజు పుణ్యనదులలో స్నానం, పుణ్యతీర్థాల దర్శనం చేస్తే పాపపరిహారమైనా అవుతుంది అని తలచి కొడుకులకు రాజ్యం అప్పగించి బయలుదేరబోతే భార్య తనూ వస్తానంది. మంత్రులు ఇతర అధికారులు కూడా " ఇంతకాలం మీ పరిపాలనలో ఎంతో హాయిగా గడిపాం. ఈ కష్టసమయంలో మీకు తోడుగా మేమూ వస్తాము " అన్నారు. అలా అందరూ బయలుదేరారు. ఓ రోజు ఓ నదివైపు స్నానానికి వెడుతూంటే నదీస్నానం చేసి వస్తూన్న ఓ ముని కుమారుడు వీరిని చూసి ఆశ్చర్యపోయాడు. రాజు అతని భార్య ముఖవర్ఛస్సు చూసి ఎవరు మీరు అని అడగడం వారు తమ వృత్తాంతమంతా చెప్పడం జరిగింది. వెళ్ళిరండి అని ముని కుమారుడు వెళ్ళిపోయాడు. ఆ ముని కుమారుడి పేరు చ్యవనుడు. భృగుమహర్షి కుమారుడు. ఆశ్రమానికి వ...

కబీర్ దాసు రామభక్తుడు ఎలా అయాడు? - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీరస్తు శుభమస్తు"🙏 " యస్య దేవే పరాభక్తిః   యధా దేవే తధా గురౌ "                 - కఠోపనిషద్ " ఏ దేవి అనుగ్రహం కోసం జపం చేస్తున్నామో ఆ దేవిమీద అఖండభక్తి ఉండాలి. అంతే భక్తి గురువుమీద ఉండాలి " అని కఠోపనిషద్ తెలియచేస్తూంది. కబీర్ దాసు కాశీలో ఉండేవారు. ఆయనకు శ్రీరాముడు అంటే అపరిమితమైన భక్తి, నమ్మకం. రామజపం పారాయణ చేయాలని, చేసి తరించాలని కోరిక.  కాశీలోనే ఉన్న రామానంద అనే రామభక్తుడిని రామనామం ఉపదేశం చేయమని కోరారు. ఆయన అన్యమతస్తులకి చేయలేనని సున్నితంగా తిరస్కరించారు. ఎందరో రామభక్తులని, పండితులని కలిసాడు, బ్రతిమాలాడు. ఎవరూ కనికరించలేదు. ఓరోజు ఉదయాన్నే సూర్యుడు ఇంకా ఉదయించలేదు. రామభక్తుడు రామానంద గంగలో స్నానం చేసి ఇంటికి తిరిగి వస్తున్నారు. కొద్దిగా చీకటిగానే ఉంది. ఆ సమయంలో కబీర్ చెట్టుచాటునుంచి హఠాత్తుగా వచ్చి రామానందగారి కాళ్ళకు నమస్కరించబోయాడు. రామానందగారు " రామ రామ " అని వెనక్కు ఉరికారు. కబీర్ " చాలు గురువుగారూ. ఇదే మీ ఉపదేశంగా స్వీకరిస్తున్నాను " అని నమస్కారం చేసి సంతోషంగా ఇంటికి వెళ్ళిపోయారు. రామజపం నిరంతరం పారాయణ చేసి శ్రీరా...

మనమందరం సదాశివకుటుంబీకులం - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏 " సదాశివకుటుంబినీ " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 911వ నామం. " సదాశివకుటుంబినీ " అంటే సదాశివుని భార్య, సదాశివకుటుంబానికి అధిపతి. జీవులందరూ సదాశివ కుటుంబ సభ్యులే. " త్రిగుణాతీతమై లోకాతీతమై సర్వాతీతమై శాంతమైన తత్వమే శివతత్వం " - ఆ స్థితిలో అంతా ఆనందమే. అదే సత్యం శివం సుందరం. విష్ణుసహస్రంలో " శివః " అని ఒక నామం. ఆ నామానికి " శాశ్వతుడు " అని భాష్యం చెప్పారు ఆదిశంకరులు. శ్రీ శంకరాచార్య విరచిత అన్నపూర్ణాష్టకంలో ఇలా ప్రార్థిస్తాం: " మాతా చ పార్వతీ దేవీ    పితా దేవో మహేశ్వరః   బాంధవా శ్శివభక్తాశ్చ    స్వదేశో భువనత్రయమ్‌ " పార్వతీదేవి నా తల్లి, మహేశ్వరుడు నా తండ్రి, శివభక్తులు నా బంధువులు, మూడు ప్రపంచాలు నా సొంత దేశం. ఎంత అద్భుత భావన. ఇటువంటి భావనతో జీవిస్తూంటే అమ్మవారు చల్లగా చూడకుండా ఎలా ఉండగలదు. మామూలుగానే ఆవిడ అవ్యాజకరుణామూర్తి. మేము సదాశివకుటుంబీకులం అని చెప్పుకుంటే ఎంత గర్వంగా, అద్భుతంగా ఉంటుంది. విభీషణుడు రావణుడిని విడిచిపెట్టి రాముడు దగ్గరకు వచ్చినప్పుడు వానరవీరులందరూ శతృవున...

హోమాలు, యాగాలవల్ల ఉపయోగమేమయినా ఉందా? - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీరస్తు శుభమస్తు"🙏 " అగ్నౌ ప్రాప్తాహుతి సమ్యక్    ఆదిత్యముపతిష్ఠతే   ఆదిత్యాత్ జాయతే వృష్టిః   వృష్టేరన్నం తధా ప్రజాః "                 - వేదమంత్రం " అగ్నిలో/హోమంలో వేసిన హవిస్సులను అగ్నిదేవుడు ఆదిత్యమండలానికి తీసుకుని వెడతారు. అక్కడనుండి దేవతలందరికీ చేరుతుంది " అని తెలియచేస్తూంది వేదం. " అగ్ని ముఖావై దేవాః " - అగ్నిముఖంగానే ఏదయినా దేవతలకు చేరుతుంది. అసలు యాగం/హోమం చేసినప్పుడు అగ్నిలోనే ఎందుకు వేయడం.  " పురుషసూక్తం " లో విరాట్ పురుషుని వర్ణన చేస్తూ " ముఖాత్ ఇంద్రశ్చాగ్నిశ్చ " అని ప్రార్ధిస్తాం. విరాట్పురుషుని నోటిలోంచి అగ్ని ఇంద్రుడు వచ్చారు. ముఖం అంటే నోరు. అగ్ని విరాట్పురుషుని నోరుగా తెలుస్తూంది. ఆహారాన్ని దేనినయినా నోటిలోనేగా వేస్తాం. అందుకే దేవతలకు సమర్పించేవన్నీ అగ్నిలో వేస్తాం అంటే అగ్నిముఖంగా ఇస్తాం. హోమాలవల్ల మనకు, సమాజానికి, పర్యావరణానికి ఏమయినా ఉపయోగముందా?. ఓ చక్కటి విషయం చూద్దాం: పోలండ్ దేశంలో " హోమా థెరపీ" అనే చికిత్సావిధానం ఉంది. ఏదయినా అనారోగ్యం కలిగినప్పుడు పిలిస్తే ఈ సంస్థవారు వచ్చి తగిన హోమం చ...

ఇష్టం లేని పనులు కూడా ఎందుకు చేస్తూంటారు - చీమలపాటి సూర్యనారాయణ

 🙏" శ్రీరస్తు శుభమస్తు "🙏  " స్వభావజేన కౌంతేయ    నిబద్ధః స్వేన కర్మణా,    కర్తుం నేచ్ఛసి యన్మోహాత్    కరిష్యస్యవశో2పి తత్ "                 - భ.గీ 18:60. " నీవు చేయుటకు ఇష్టపడని పనులు కూడా పురాకృత స్వాభావిక కర్మలచే బంధింపబడి చేయుదువు " అన్నారు పరమాత్మ. మనల్ని మనలా ఉండనివ్వదు సమాజం. పరిస్థితుల ప్రభావానికి లోనై జీవుడు తను చేయాలని అనుకోని, చేయకూడని పనులు కూడా చేస్తూంటాడు. ఆవేశంలో చేసే ఎన్నో ఘోరాలు తరచుగా చూస్తూంటాం. " ఏవం బుద్ధిశ్చ తేజశ్చ  ‌  ప్రతిపత్తిశ్చ భారత,    భవంతి భవకాలేషు    విపద్యంతే విపర్యయే "  వ్యాసమహర్షి అంటారు అర్జునుడితో " ఇవే బుద్ధి తేజస్సు ఇతరపరికరాలు అంటే శక్తి, మనస్సు వంటివి ఉంటాయి - కాలం కలిసివచ్చినప్పుడు రాణిస్తాయి, కలిసి కలిసిరానప్పుడు ఏవీ పనికిరాకుండా పోతాయి " అని. కాలప్రభావం చాలా భయంకరమైనది. ఎంతటి వారినైనా వంచేసి మాయలో ముంచేస్తుంది.  పరీక్షిత్ మహారాజు చక్కటి పాలన చేయడమేకాదు కలిప్రభావ వాసనలు కనబడుతూండడంతో దేశసంచారం చేస్తూ అధర్మం ఎక్కడా జరగకుండ...

గురువు దేవుడూ సమానమే - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీరస్తు శుభమస్తు"🙏 " గురుమూర్తిః " - అమ్మవారి అద్భుతనామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాల్లో 603 వ నామం.  " గురుమూర్తిః " అంటే గురుస్వరూపురాలు. " మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్యదేవోభవ అతిధిదేవోభవ " అంది తైత్తిరీయ ఉపనిషత్తు. తల్లిని తండ్రిని ఆచార్యు( గురువు)ని, అతిధిని భగవంతునిగా భావించి గౌరవించు అంది సనాతనధర్మం. " ఆచరతి ఆచారయతి ఇతి ఆచార్యః " అన్నాయి శాస్త్రాలు. అంటే తను ఆచరిస్తూ ( ధర్మాన్ని ) ఆచరింపచేసేవాడు ఆచార్యుడు అని. " కౌసల్యా సుప్రజా రామా  ‌  పూర్వాసంధ్యా ప్రవర్తతే,    ఉత్తిష్ఠ నరశార్దూలా    కర్తవ్యం దైవమాహ్నికం "  విశ్వామిత్రుడు తెల్లవారకముందే తాను లేచి కార్యక్రమాలు పూర్తిచేసుకుని శ్రీరాముడిని " తెలవారుతూంది, లేచి నీ కర్తవ్యం నిర్వహించు " అంటారు. అదీ ఆచార్యుని లక్షణం. అందరు గురువులు పాఠాలు చెబుతారు కాని కొందరు గురువుల జీవితాలే పాఠాలవుతాయి. ఇలాంటివారిని " ఆచార్యులు " అని పిలుస్తారు. కంచిపరమాచార్యులు, రామకృష్ణపరమహంస, రమణమహర్షి లాంటివారు ఈ కోవలోకి వస్తారు. గురువుల లక్షణాలు ఎలా ఉండాలో శాస్త్రాలు స్ఫష్టం...

పాపమయినా పుణ్యమయినా అనుభవిస్తేనే తరుగుతుంది - చీమలపాటి సూర్యనారాయణ

 🙏" శ్రీరస్తు శుభమస్తు "🙏 "ధర్మఏవ మనః కృష్ణే స్వభావ"  ధర్మరాజు ద్రౌపదితో అంటారు " ధర్మం నా స్వభావం మరి ( ఏమి చేయమంటావు )" అని. 12 ఏళ్ల అరణ్యవాసానికి వెడుతూన్నప్పుడు ద్రౌపది " ఎప్పుడూ ధర్మం ధర్మం అంటారు. ధర్మంని అనుసరిస్తూన్న మీరు అరణ్యం పాలయ్యారు. అధర్మం చేస్తూన్నవారు రాజ్యం ఏలుతున్నాడు " అని అంటే అప్పుడు ధర్మజుడు " ధర్మం నా స్వభావం మరి ( ఏమి చెయ్యమంటావు )" అంటారు. ఇదే ధర్మరాజు భీష్ముని అడుగుతాడు " తాతా, పరిస్థితులు గమనిస్తే పాపాత్ములే ఎక్కువ సుఖపడుతూన్నట్లు, పుణ్యాత్ములు కష్టాలు అనుభవిస్తూన్నట్లు కనిపిస్తుంది, ఎలా " అని.  అప్పుడు భీష్ముడు అంటారు " అది నీ భ్రమ " అని. పాపం పుణ్యం వేరువేరుగా అనుభవించాలి. పాపం 100, పుణ్యం 80 అంటే ఇక మిగిలిన పాపం 20 అని కాదు.  ఏన్నో జన్మలుగా ప్రొగుచేసుకున్న పుణ్యం వల్ల ఈ రోజు అలా సుఖపడుతూన్నట్లు కనిపిస్తాడు. చేసిన పాపాలను కూడా ఇంకో రోజు ఘనంగా అనుభవిస్తాడు అని. " ప్రారబ్దం భోగతో నశ్యేత్ " - పాపమయినా పుణ్యమయినా అనుభవిస్తేనే తరుగుతుంది. బ్యాంకులో డబ్బు కట్టగానే క్షణాలలో ఖాతాలో జ...