Posts

Showing posts from August, 2025

అమ్మవారు కావ్యకళాస్వరూపురాలు - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏 " కావ్యకలా " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 798 వ నామం. " కావ్యకలా " అంటే కావ్యకళాస్వరూపురాలు, కావ్యరచనా ప్రతిభా స్వరూపురాలు. " వాక్యం రసాత్మకం కావ్యం " అన్నారు. కావ్యాలలో వాక్యాలు రసాత్మకంగా ఉంటాయి. అటువంటి రసాత్మకతను అమ్మవారు అనుగ్రహిస్తారు. " పలికెడిది భాగవతం,  అట పలికించెడివాడు రామభధ్రుండు,  అట..... " అంటారు పోతనామాత్యుడు. మరి స్వామి అనుగ్రహం లేకపోతే పోతనగారి భాగవతం అంత అద్భుతంగా ఎలా ఉంటుంది. మహాకవి కాళిదాసు, పోతనామాత్యుడు కూడా " నీ అనుగ్రహం లేకపోతే ఎలా వ్రాయగలమమ్మా " అని కీర్తించేవారుట అమ్మవారిని. కొందరు సినీ కవులు కూడా అద్భుత సాహిత్యంతో పాటలు వ్రాస్తూంటారు. అది వారి పూర్వజన్మ సుకృతం. కొందరికే అది సాధ్యం. విశ్వనాధవారు వేదవాక్యాలు చెప్పేవారే మహాకవి. అక్కడక్కడ వేదవాక్యాలు చెప్పేవారు " అక్కడక్కడ మహాకవి " అని తెలియచేసారు. అమ్మవారు వేదమాత. అందుకే వేదం అంత కళాత్మకంగా, రసాత్మకంగా ఉంటుంది. వాల్మీకి మహర్షి రామాయణంలో రావణుడు సీతమ్మను తీసుకుని పోతూన్న సన్నివేశాన్ని బుధుడు పట్టుకున...

అమ్మవారు బహునేర్పరి - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏 " ప్రగల్భా " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 938 వ నామం . " ప్రగల్భా " అంటే సృష్ట్యాది కర్మలయందు నేర్పు గలది అని అర్ధం చెప్పారు. " ప్రౌఢత్వాత్ ప్రగల్భ " అన్నారు. అమ్మవారు ఎప్పుడూ ప్రౌఢే కనుక ప్రగల్భ. బాగుగా ప్రకంటించబడడాన్ని ప్రగల్భం అంటారు. మరీ ప్రగల్భాలు చెప్పకు అనడం వింటూంటాం. అంటే గొప్పలు వద్దు అని.  అమ్మవారు చేసేవన్నీ గొప్ప పనులే. సందేహం ఏముంది. సృష్ట్యాది కర్మలు అన్నారు. అంటే సృష్టి స్థితి లయలు. సృష్టి ఎలాగూ అద్భుతమే. స్థితి అంతా ఆశ్చర్యమూ, అద్భుతమే. జీవితంలో రకరకాల మలుపులు, వింత వింత సంఘటనలు. ఒక క్షణం సుఖం, ఇంకో క్షణం దుఃఖం. ప్రేమాభిమానాలు, కక్షలు కార్పణ్యాలు. ఒకరిని ఎంతో అభిమానిస్తాం, అదే మనిషిని చిన్న అర్ధంలేని కారణంతో తరువాత ద్వేషిస్తాం, అసహ్యించుకుంటాం. ఈ రోజు ఎంతో ఇష్టపడి కష్టపడి సంపాదించిన వస్తువు తరువాత ఎందుకూ పనికిరానిదిగా అనిపిస్తుంది. ఇన్ని సమస్యలకు నిలయమయిన జీవితాన్ని ఎంతో మనోహరంగా కనిపించేలా చేస్తారు అమ్మవారు. ఎన్నో బంధాలను అనుబంధాలను కలుగచేస్తారు. వాటికోసం ఎన్నో చేయకూడని పనులు కూడా చేస...

అమ్మవారు ఆనందాన్ని అనుగ్రహిస్తారు - చీమలపాటి సూర్యనారాయణ

 🙏" శ్రీమాత్రేనమః "🙏 " సుఖకరీ " అమ్మవారి అద్భుతనామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 968 వ నామం. సుఖకరీ అంటే సుఖమును కలిగించేది, ఇచ్చేది అని. ఏది ఆనందాన్నిస్తుందో అది సుఖం.  విష్ణుసహస్రంలో స్వామిని " సుఖదః " అని పూజిస్తాం. సుఖమునొసగువారు అని అర్ధం. ఏ జీవి అయినా తన జీవితం ఆనందంగా గడిచిపోవాలనే కోరుకుంటుంది. చివరకు మరణంలో కూడా సుఖాన్నే కోరుకుంటాడు మనిషి. " అనాయాసేన మరణం, వినా దైన్యేన జీవనం....." - ఇదే కదా ఎవరైనా కోరుకునేది. " ఖం " అంటే ఆకాశం అంటే వెలుగు. దానికి సు చేరిస్తే సుఖం. అంటే మంచి ఆలోచనలు కలిగి మంచిపనులు చేస్తూ ఉంటే ఆనందంగా గడుస్తుంది. దుః కలిపితే దుఃఖం. చెడు ఆలోచనలు చేస్తూ చెడుపనులు చేస్తూ ఉంటే జీవితం బాధగా గడుస్తుంది. ఒక అక్షరం మన జీవితాన్ని మార్చేస్తుంది. ఏ అక్షరం కలుపుకోవాలి అనేది మన చేతుల్లోనే ఉంది. " అశాంతస్య కుతః సుఖం (భ.గీత 2:66)" అన్నారు పరమాత్మ. ఎప్పుడూ అశాంతితో ఉండేవారికి సుఖం ఎక్కడిది.  త్రిగుణాలప్రభావం వల్ల ప్రకృతి/సమాజం మాయ చేస్తుంది. మోహంలో పడేస్తుంది. మనల్ని మనంగా బ్రతకనివ్వదు. మరి ఏమిచెయ్యాలి?. అందుకే అమ...

అమ్మవారి వైభవానికి లోటేముంటుంది - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏 " ఉద్దామవైభవా " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 849 వ నామం.  " ఉద్దామవైభవా " అంటే హద్దులేని వైభవము గలది. అమ్మవారి వైభవానికి లోటేమిటి. కొత్తగా పాలకుడు అయి, పూర్తికాలం పదవిలో ఉంటాడో లేడో తెలియని నాయకుడి వైభవం చూస్తేనే ఆశ్చర్యం వేస్తుంది. కోట్ల విలువైన నివాసభవనం, లక్షల విలువైన వాహనాలు, రక్షణ సిబ్బంది, వందిమాగధులు, ప్రత్యేక విమాన సౌకర్యం.  మరి అమ్మవారు అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకి. శాశ్వతేశ్వరి. ఆవిడ పొందిందీ లేదు, పొందబోయేదీ లేదు. తనను నమ్ముకున్న వారికి ఇవ్వలేనిదీ లేదు. మరి అటువంటి అమ్మవారి వైభవంని అసలు ఊహించశక్యమా. ఆదిశంకరులు సౌందర్యలహరి ప్రార్ధన చేస్తూ ఇలా అంటారు: " కిరీటం వైరించం పరిహర    పురః కైటభ భిదః,   కఠోరే కోటీరే స్ఖలసి జహి    జమ్బారి మకుటం,   ప్రణమ్రే ష్వేతేషు ప్రసభ    ముపయాతస్య భవనం,   భవ స్యాభ్యుత్థానే తవ    పరిజనోక్తిర్వి జయతే " అమ్మవారు మణిద్వీపంలో కూర్చుని ఉన్నప్పుడు శివుడు వచ్చారుట. భర్త కదా, అమ్మవారు లేచి హడావుడిగా వెళ్ళబోతూంటే పరిచారికలు " జాగ్రత్తమ్మా చూసుకుని వ...

ఋషి పంచమి నేడు, శుభాకాంక్షలు - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏 ఋషి పంచమి నేడు. సప్త ఋషులను పూజించుకునే రోజు. ఇది స్త్రీలు చేసుకునే వ్రతం. ఉపవాసంతో రెండురోజుల కార్యక్రమం. ఇది చేయడానికి ముందు లక్షవత్తుల వ్రతం చేయాలి అని చెబుతారు. ఋషి అంటే ఎవరు? " ఋషివ్యవస్థ " అంటే పరమాత్మ ఇచ్చిన సందేశాన్ని/విజ్ఞానాన్ని లోకానికి అందించే ఏర్పాటు. మన ఋషులు ఏదిచేసినా ఏదిచెప్పినా లోకకళ్యాణాన్ని దృష్టిలో ఉంచుకునే.  రామాయణంలో 27 రకాల ఋషుల వివరణ ఉంది. 27 ఋషులుకాదు, 27 రకాల ఋషులు. కొందరు నీరునుమాత్రమే తీసుకుంటూ, కొందరు గాలిని మాత్రమే తీసుకుంటూ, కొందరు గాలిలో తేలుతూ, కొందరు సూర్యరశ్మినే అహారంగా తీసుకుంటూ ఇలా అనేక ఋషులు లోకకల్యాణం కోసం తపస్సు చేస్తున్నారు అని తెలియచేసారు. భరద్వాజ మహర్షి మహా తపస్సంపన్నుడు. ఓ సారి ఆయన వేదపఠనం చేస్తూంటే ఇంద్రుడు వచ్చి ఎంతవరకూ వచ్చింది మీ పఠనం అంటే మహర్షి ఈ జన్మ సరిపోదు అనడంతో ఇంద్రుడు మహర్షికి ఇంకో 300 సం.ల వయస్సు ఇచ్చాడు. అలా 3 సార్లు అంటే 900 సం.ల వయస్సు ప్రసాదించి మళ్ళీ వచ్చి అయిందా అంటే మహర్షి హిమాలయపర్వతాన్ని చూపెట్టి వేదం ఆ పర్వతం అయితే నేను నేర్చుకున్నది ఇది అని " గుప్పెడు ఇసుక " తీసి చూపి...

వినాయకచవితి శుభాకాంక్షలు అందరికీ - చీమలపాటి సూర్యనారాయణ

 🙏'శ్రీరస్తు శుభమస్తు"🙏 " ఆగచ్ఛోల్కాయ గంధోల్కః    పుష్పోల్కో ధూపకోల్కకః,    దీపోల్కాయ మహోల్కాయ    బలిశ్చాథ విసర్జనం "   ‌         - గరుడపురాణం  " పూజాద్రవ్యాలన్నిటినీ తేజః స్వరూపాలుగా భావించి సాధకుడు పెట్టి వెలిగించిన దీపానికి మరింత కాంతిని ప్రసాదించి వ్రతాంతం దాకా నిలుబెట్టు స్వామి " అని చేసే ప్రార్థన ఇది. దీనిలో అధికంగా " ఉల్క " అని అన్నారు. ఉల్క అంటే తేజస్సు. గణపతి పూజ అంతా ప్రకృతి ఆరాధనే. మట్టి వినాయకుడిని పూజించి నీటిలో నిమజ్జనం చేస్తాం. పూజను పత్రి, గరికతో చేస్తాం. అన్నీ తిరిగి మట్టిలో కలిసిపోయేవే. ముత్తుస్వామి దీక్షితులు గారు " వాతాపి గణపతిం భజే - హంసధ్వని రాగం, ఆది తాళం " అనే కీర్తనను గణపతిని స్తుతిస్తూ చేసారు. అందులో " భూతాది సంసేవిత చరణం, భూత భౌతికా ప్రపంచ భరణం " అని కీర్తించారు. దీని అర్ధం " పంచ భూతాలచే సేవింపబడే కాళ్ళు కలిగిన వాడా, పంచ భూతముల ఉనికికి ప్రపంచ వ్యాప్తి కి కారణం అయిన వాడా " అని.‌ పంచభూతముల ఉనికికి, వ్యాప్తికి కారకుడు గణపతి.  మనం నిముషానికి 15 ఉచ్ఛ్వాస నిశ్వాసాల చొప్పున రోజుకు 21600 శ్వా...

మంచి సంకల్పానికి అమ్మవారి అనుగ్రహం తప్పకుండా ఉంటుంది - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏 " దీక్షితా " - అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 695 వ నామం. " దీక్షితా " అంటే దీక్షగలది, జ్ఞానమును గలిగించు దీక్షగలవాని స్వరూపముగలది అని భాష్యం చెప్పారు. దీ అంటే జ్ఞానం. క్ష అంటే పాపక్షయం. ఈ రెండూ ఉన్నవారిని దీక్షితులు అంటారు. వీరికి కొన్ని కట్టుబాట్లు, బాధ్యతలు ఉంటాయి. ముఖ్యంగా నియమాలు ఉంటాయి. దీక్ష అంటే సంకల్పం. ఏదైనా పని లేక కోరిక తీరడం కోసం దీక్ష తీసుకుంటారు. ఉదా: నిరాహారదీక్ష చేస్తారు. కాలక్షేపం కోసం కాదు. దానికి ఓ కారణం ఉంటుంది. వీరు గురువు దగ్గర దీక్ష తీసుకుంటారు. అయ్యప్పస్వామిదీక్షను గురుస్వామి దగ్గర తీసుకుంటారు. నేరుగా మాల వేసుకోకూడదు. వీరికి కొన్ని రక్షణలు కూడా ఉంటాయి. మైల, పురుడు మొ.గు అశుచులు వీరికి అంటవు. దీక్షాకాలం ముగిసే వరకు. కాల నియమం కూడా ఉంటుంది. అయ్యప్ప దీక్ష అయితే నలభై రోజులు, చాతుర్మాస్య దీక్ష అయితే నాలుగు నెలలు దీక్షలో ఉంటారు. ఆ సమయంలో ఆహార నియమాలు, నడవడిక నియమాలు, ప్రత్యేక వస్త్రధారణ కలిగి ఉంటారు. దైవ నామస్మరణ చేసుకుంటూ మితభాషిగా ఉంటారు. దీక్ష సమయంలో పరుషభాష ఉపయోగించకపోవడం, ఇతరులకు హాని కలిగి...

మనం ఇష్టపడే ఆహారం మన మనస్సు పరిస్థితిపై ఆధారపడి ఉంటుంది - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః:🙏 " అన్నదా " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 669 వ నామం. " అన్నదా " అంటే జీవులకు అన్నమును ఇచ్చునది అని అర్ధం. అన్నం అంటే తినుబండారం. వేలకోట్లు ఉన్నా తెల్లవారితే కావలసినది తిండే. ఆశ్చర్యకరం ఏమిటంటే పేదవాడయినా కోటీశ్వరుడయినా తినగలిగేది కడుపు పట్టినంతే. కొద్దిగా ఎక్కువ తిన్నా అనారోగ్యంతో బాధపడాలి. మనుషులకు, జంతువులకు, పక్షులకే కాదు క్రిమికీటకాలకు కూడా ఆహారం అవసరమే. కొన్ని క్రిమికీటకాలు ఏమి తిని బ్రతుకుతున్నాయో కూడా తెలియదు. అంత అద్భుతంగా ఆహారాన్ని సమకూరుస్తున్నారు అమ్మవారు. ఆహారం వృధా చేస్తున్నారు, పాలు అభిషేకాలు చేసి, పుట్టలలో పోసి వృధా చేస్తున్నారు అని కొందరు విమర్శలు చేయడం చూస్తూంటాం. మన ఋషులు ఇవన్నీ ఆలోచించకుండా ఏర్పాటు చేసినవి కావు. ఎన్నో క్రిమికీటకాలు, సూక్ష్మజీవులు ఇలా పడేసిన ఆహారాన్ని తిని జీవిస్తున్నాయి. పరమాత్మ గీతలో ఈ ఆహారం గురించి అద్భుత విషయాలు వివరించారు: " ఆహారస్త్వపి సర్వస్య    త్రివిధో భవతి ప్రియః,   యజ్ఞస్తపస్తథా దానం    తేషాం భేదమిమం శృణు "            - భ.గీత 17:7 " ప్రజలు...

అందరికీ ఆసరా అయిన అమ్మవారికి ఆసరా దేనికి?- చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏 " నిరాలంబా " - అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 877వ నామం. నిరాలంబా అంటే వేరొక ఆధారం లేనిది. జగత్తుకు అమ్మవారు ఆధారం. మరి అమ్మవారికి ఏమిటి ఆధారం. ఏమీలేదు, అవసరమూ లేదు. సాధారణంగా అతనికి ఏ ఆధారం లేదండీ అని ఎవరయినా అనగానే " అయ్యో పాపం " అంటాం. కాని ఏ ఆధారం లేకుండా జీవించడం ఒక గొప్ప విషయం. ఎంతో ఆత్మవిశ్వాసం ఉండాలి. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఇక్కడ కూడా " ఆలంబన " ఉంది. అతని ఆత్మవిశ్వాసమే అతనికి ఆలంబన. ఏపని చేయాలన్నా ఆఖరికి పూజ/ధ్యానం చేయాలన్నా ఆలంబన అవసరం. ధ్యానం చేసేటప్పుడు కూడా ఒక మూర్తినో లేక శ్వాసనో ఆలంబనంగా చేసుకుంటాం. లేకపోతే మనస్సు నిలవదు. విగ్రహారాధన దీనికోసమే ఏర్పాటు చేశారు మన ఋషులు. వారికి పనీ పాటా లేకకాదు. ఎవరికయినా ధనం దానం చేసాం. ధనాన్ని మనం సృష్టించామా. ఇంకొకరి నుంచి రావలసిందే. ఆ ఇంకొకరికి ఇంకొకరినుంచి రావాలి. అదే ఆలంబన. ఇలా ఆ ఆలంబనకు ఆలంబన ఏమిటి అని వెతుకుతూ ఉంటే చివరకు అమ్మవారి దగ్గర ముగుస్తుంది. ఎందుకంటే అమ్మవారికి ఆలంబన లేదు, అవసరం లేదు కనుక. ఇదే విషయాన్ని పరమాత్మ కూడా తెలియచేసారు: " అనన్...

పోలాలమ్మ అమావాస్య శుభాకాంక్షలు - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏 " సదాశివకుటుంబినీ " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్య నామాలలో 911వ నామం. " సదాశివకుటుంబినీ " అంటే సదాశివుని భార్య, సదాశివకుటుంబానికి అధిపతి. జీవులందరూ సదాశివ కుటుంబ సభ్యులే. " త్రిగుణాతీతమై లోకాతీతమై సర్వాతీతమై శాంతమైన తత్వమే శివతత్వం " - ఆ స్థితిలో అంతా ఆనందమే. అదే సత్యం శివం సుందరం. విష్ణుసహస్రంలో " శివః " అని ఒక నామం. ఆ నామానికి " శాశ్వతుడు " అని భాష్యం చెప్పారు ఆదిశంకరులు. శ్రీ శంకరాచార్య విరచిత అన్నాపూర్ణాష్టకంలో ఇలా ప్రార్థిస్తాం: " మాతా చ పార్వతీ దేవీ    పితా దేవో మహేశ్వరః   బాంధవా శ్శివభక్తాశ్చ    స్వదేశో భువనత్రయమ్‌ " పార్వతీదేవి నా తల్లి, మహేశ్వరుడు నా తండ్రి, శివభక్తులు నా బంధువులు, మూడు ప్రపంచాలు నా సొంత దేశం. ఎంత అద్భుత భావన. ఇటువంటి భావనతో జీవిస్తూంటే అమ్మవారు చల్లగా చూడకుండా ఎలా ఉండగలదు. మామూలుగానే ఆవిడ అవ్యాజకరుణామూర్తి. మేము సదాశివకుటుంబీకులం అని చెప్పుకుంటే ఎంత గర్వంగా, అద్భుతంగా ఉంటుంది. విభీషణుడు రావణుడిని విడిచిపెట్టి రాముడు దగ్గరకు వచ్చినప్పుడు వానరవీరులందరూ శతృవ...

వికార సంఘటనలు చూసి కూడా నిగ్రహంతో ఉండాలి - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏 " ధీరా " - అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 916 వ నామం.  ధీరా అంటే ధీరురాలు/పండితురాలు అని అర్ధం. " పునంతి ధీరాః అపసో మనీషా " - వికారాలకు లొంగిపోని ధృఢమైన చిత్తం, బుద్ధికలిగి ఉండేవారు ధీరులు అని చెబుతూది వేదం.  " వికారహేతౌ సతి విక్రయంతే   ఏషాన్నతేతాంసి తవేయ ధీరాః "             - మహాకవికాళిదాసు  ఎదురుకుండా వికారాలు కనబడుతూన్నా/జరుగుతూన్నా మనసు చలించనివారు ధీరులు అన్నారు మహాకవి కాళిదాసు. ఇటువంటి వారిలో అమ్మవారు స్థితులై ఉంటారు.  పరమాత్మ ఇదే విషయాన్ని గీతలో ఇలా తెలియచేసారు: " జితాత్మనః ప్రశాంతస్య     పరమాత్మా సమాహితః,   శీతోష్ణసుఖదుఃఖేషు           తథామానావమానయోః "              - భ.గీత 6:7 శీతోష్ణములు, సుఖదుఃఖములు, మానావమానములు మున్నగు  ద్వంద్వముల యందు అంతఃకరణవృత్తులు నిశ్చలముగా (చలింపక) ఉండి, స్వాధీనమైన ఆత్మగల పురుషుని జ్ఞానమునందు పరమాత్మ చక్కగా స్థితుడైయుండును.   " అగాధమౌ జలనిధిలోన  ...

క్షోభ/కదలిక ముఖ్యం మనిషికి - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏 " క్షోభిణీ " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 466 వ నామం . " క్షోభిణీ " అంటే సృష్టి చేయుటకై భగవంతునియందు క్షోభను కలిగించినది అని అర్ధం చెప్పారు. క్షోభ అంటే కదలిక. శ్రీ బాలాత్రిపురసుందరీదేవికి అష్టోత్తర శతనామావళి పూజ చేస్తూ అమ్మవారిని " ఓం సర్వసంక్షోభిణ్యైనమః " అని పూజిస్తాం. మంచి కదలికలను కలిగిస్తుంది తల్లి. విష్ణుసహస్రంలో క్షోభణః అని ఒక నామం. దానికి సృష్టికాలమునందు కల్లోలము కలిగించువాడు అని భాష్యం చెప్పారు ఆదిశంకరులు. మనిషికి ఈ కదలిక చాలా ముఖ్యం. కదలిక లేకపోతే ఉత్సాహం ఉండదు. అసలు జీవితానికి అర్ధమే ఉండదు. కదలిక లేకుండా పడుకుని ఉంటే అతనికే కాదు, అతని సంబంధించిన వారికందరికీ నరకమే. " యోజనానాన్ సహస్రాణి    యాతిగచ్ఛన్ పిపీలికాః,    అగచ్ఛన్ వైనతేయో2పి    పదమేకం నగచ్ఛతి "  " నడక మొదలెడితే చీమలు కూడా వ్రేలమైళ్ళు వెడతాయి కాని మొదలుపెట్టకపోతే గరుత్మంతుడు కూడా ఒక్కడుగు ( పదమేకం ) కూడా వెళ్ళలేడు  " అని తెలియచేస్తూంది సుభాషితం. క్షోభని బాధకు బదులుగా వాడుతూంటారు సాధారణంగా. క్షోభ పెట్టకండి అంటూంటారు. ...

అమ్మవారు ధ్యానంతోనే పొందగలుగుతారు - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏 " ధ్యానగమ్యా " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 641 వ నామం .  " ధ్యానగమ్యా " అంటే మాటిమాటికీ ధ్యానముచేతనే పొందదగినది అని అర్ధం. ధ్యానం అంటే మనస్సును అదుపులో ఉంచుకోవడం. అది అంత సులభం కాదు. మనస్సు సంకల్పవికల్పాలు రెండూ చేస్తూ మాయ చేస్తుంది.  పరమాత్మ గీతలో ఇలా అంటారు: " అథ చిత్తం సమాధాతుం        న శక్నోషి మయి స్థిరం  !   అభ్యాసయోగేన తతో           మామిచ్ఛాప్తుం ధనంజయ"               - భ.గీత 12:9 మనస్సును సుస్థిరముగా నాయందే నిల్పుటకు సమర్ధుడవు కానిచో అర్జునా, అభ్యాసయోగముద్వారా నన్ను పొందుటకు ప్రయత్నింపుము. అభ్యాసం అంటే భగవంతుని నామగుణముల శ్రవణం, కీర్తనం , మననం, అట్లే శ్వాసద్వారా జపము, భగవత్ప్రాప్తికి సంబంధించిన శాస్త్రముల పఠనం మొదలగు క్రియలను భగవత్ప్రాప్తికై  మాటిమాటీకి చేయుటనే అభ్యాసము అంటారు. త్యాగయ్య 96 కోట్ల రామజపం చేసారంటే ఆశ్చర్యం వేస్తుంది. కాని మొదలుపెట్టి చేయగా చేయగా అదే వ్యాపకం అయిపోతుంది. వేరే ధ్యాసే ఉండదు. అలా చేయడానికి అమ...

అమ్మవారు సంసార బాధలను తగ్గిస్తారు - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏 " భవరోగఘ్నీ " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 842 వ నామం . " భవరోగఘ్నీ " అంటే సంసారమనెడి రోగమును పోగొట్టునది. భవ అంటే సంసారం. ఇక్కడ భవరోగం అన్నారు. అంటే సంసారం పూర్తిగా ప్రక్కన పెట్టనక్కరలేదు అనుకోవాలి. ఏ రోగానికి అయినా మందు ఉంటుంది, నయమవడానికి. సంసారంని రోగంలా భావించి జాగ్రత్త పడమని. మూక శంకరులు స్తుతిశతకంలో ఇలా ప్రార్థిస్తారు: " నతానామ్మదానాం..... స్మరమధనజీవాతుకలికాం "  " సంసారపు సంకెలలో కట్టుబడుటచేత వ్యాకులత చెంది బుద్ధి మందగించినవారు నమస్కరించినంత మాత్రమునే వారి అజ్ఞానమను చీకటిని తొలగిస్తున్నావు కదమ్మా " అని  ఇక్కడ అర్ధం చేసుకోవలసినది సంసారం ఆనందదాయకంగా, ఆకర్షణీయంగా ఉండేలా చూస్తారు అమ్మవారు. సంసారబాధలతో సతమతమయే వారికి మాత్రం చికిత్స చేస్తారు. అగ్నిద్యోతనుడికి లేఖ ఇచ్చి కృష్ణపరమాత్మకి ఇవ్వమని పంపించింది రుక్మిణీదేవి. లేఖలో విదర్భకు వచ్చి తనను తీసుకుని వెళ్లి వివాహం చేసుకోమని కోరింది. అదెలా కుదురుతుంది, పిలవనిపేరంటం, బావుండదేమో అనలేదు పరమాత్మ. విదర్భ వచ్చారు, రధం మీద రుక్మిణీదేవిని తీసుకుని వె...

అమ్మవారు ఆనందాన్ని అనుగ్రహిస్తారు - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏 " శర్మదా " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 953 వ నామం .  " శర్మదా " సుఖమును ఇచ్చునది. అసలు సుఖం అంటే ఏమిటి? జీవితం హాయిగా ఆనందంగా ఏ బాధలూ లేకుండా గడిచిపోవాలని కోరుకుంటారు ఎవరయినా. సుఖాలు లేకపోయినా పరవాలేదు, బాధలు ఉండకూడదు అనుకుంటారు. ఆఖరికి మరణంలో కూడా ఏ బాధలూ ఉండకూడదు అని కోరుకుంటాం. " అనాయాసేన మరణం    వినాదైన్యేన జీవనం   దేహాంతే తవ సాయుజ్యం     దేహిమే పరమేశ్వరా " ఎవరిమీదా ఆధారపడకుండా జీవించడం, అనాయాసంగా మరణించడం, మరణం తరువాత భగవసన్నిధికి చేరడం చాలా కష్టం. అదే అసలయిన సుఖం. దానిని అమ్మవారు తనను నమ్ముకున్నవారికి ప్రసాదిస్తారు. మూక శంకరులు స్తుతిశతకంలో ఇలా ప్రార్థిస్తారు కామాక్షీదేవిని: " ధనేన న రమామహే..... .........చరణపల్లవోపాసనాం "               - శ్లోకం 85 " అమ్మా మాకు ధనమున సంతోషం కలుగదు. దుర్మార్గులను సేవించు చాపల్యం పొందము. సంసారభయం లేదు. ఎందుకంటే నీ పాదాలను స్ధిరంగా పూజిస్తున్నాం కదా " అని. అందరం అమ్మవారి పాదాలను ఆశ్రయించి అటువంటి సుఖమును ప్రసాదించమని వేడుకుందాం. ఏతత...

జ్ఞానాన్ని ఆచరణలో పెట్టడమే విజ్ఞానం - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏 " విజ్ఞానకలనా " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 902 వ నామం. " విజ్ఞానకలనా " అంటే విజ్ఞానాన్ని కలిగించునది అని అర్థం. కలనా అంటే కలిగించునది అని. వేదం, శాస్త్రాలు అమ్మవారి నిలయం. అవి జ్ఞానంని ఇస్తాయి. ఆ జ్ఞానాన్ని ఆచరణలో పెట్టడమే విజ్ఞానం.  గీతలో పరమాత్మ జ్ఞానం, విజ్ఞానం గురించి విడివిడిగా రెండు అధ్యాయాలలో తెలియచేసారు. ఓ ఉదాహరణ చూద్దాం. కారును నడపడం అంటే స్టార్ట్ చేయడం, గేరు ( ఉంటే‌ ) వేయడం, యాక్సిలేటర్ నొక్కడం, ఎదరకి పోవడం, అవసరమయితే బ్రేకు నొక్కడం. ఇది పుస్తక జ్ఞానం. మరి అలా కారులో వెళ్ళిపోవచ్చా?. అంటే కుదరదు. చిక్కుల్లో పడతాం, ప్రాణాలు కూడా పోవచ్చు. నడపడం నేర్పే గురువును పట్టుకోవాలి. 7/10 రోజులు ఆయన చెప్పినట్టు చేస్తూ నడపడం నేర్చుకోవాలి. అప్పుడు విజ్ఞానం/నేర్పరితనం వస్తుంది. ప్రయాణం సాఫీగా సాగుతుంది. శాస్త్రజ్ఞానం పొందాక దాన్ని ఆచరణలో పెట్టాలి. అప్పుడే జీవితం ఒడిదుడుకులు లేకుండా ఆనందదాయకంగా సాగుతుంది. సూర్యుడు వెలుగు ఇస్తున్నారు అనుకుంటాం. కాని వెలుగే ఆయన. అలాగే అమ్మవారు విజ్ఞానాన్ని కలిగిస్తారు అంటే విజ్ఞానమే అమ్...

శ్రీశ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీరస్తు శుభమస్తు"🙏 " కృష్ణం వందే జగద్గురుం - ఏకో దేవో దేవకీ పుత్రః " శ్రావణ బహుళ అష్టమి శ్రీకృష్ణాష్టమి. స్వామి అవతరించిన రోజు. స్వామిని ధ్యానించుకుని తరిద్దాం. పరమాత్మే స్వయంగా తెలియచేసారు గీతలో " పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం, ధర్మసంస్థాపనార్ధాయ సంభవామి యుగే యుగే ( భ.గీత 4:8 )" అని. ధర్మసంస్థాపన కోసమే స్వామి అవతారం స్వీకరించినది. ఇక్కడ " సంభవామి " అన్నారు పరమాత్మ. విష్ణుసహస్రనామాలలో " సంభవః " అని ఒక నామం. " స్వేచ్ఛయా సమీచీనం భవనం అస్యేతి సంభవః " - స్వేచ్ఛగా సంపూర్ణంగా కలుగుతారు అని. భవః అంటే కలుగుట/పుట్టుట. మన పుట్టుకలు, మరణాలు మన చేతిలో ఉండవు. స్వామి అవతార ప్రారంభం, పరిసమాప్తి ఆయన అధీనంలోనే ఉంటాయి, అవతారం సంపూర్ణంగా ఉంటుంది. అందుకే స్వామిది సంభవం.  " నతస్య ప్రాకృతామూర్తిః " - ఆయన మూర్తి ప్రాకృతములు కాదు. అంటే పంచభూత వికారములతో కూడిన దేహము కాదు. అప్రాకృతిక దివ్యమంగళవిగ్రహం కృష్ణుడిది. పుట్టినప్పుడే చతుర్భుజాలతో, శంఖ చక్ర గదా పద్మాలతో దర్శనమిచ్చారు దేవకీ వసుదేవులకు.  కృష్ణుడు చిన్నతనంలోనే ఎన్నో లీలలు...

అమ్మవారు పండితులచే పూజింపబడుతారు - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏 " ధీరసమర్చితా " - అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్య నామాలలో 917వ నామం.  " ధీరసమర్చితా " అంటే పండితులచే/ధీరులచే బాగుగా పూజింపబడినది. ఇటువంటి వారికి ప్రాపంచిక విషయాలు పట్టవు. ఎప్పుడూ భగవంతుడి ధ్యాసే. శౌనకమహర్షి అడుగుతారు సూతమహర్షిని " శుకులకు మోక్షప్రాప్తి తప్ప వేరే కోరికలే లేవుకదా, ఆయన భాగవతం ఎందుకు అభ్యసించారు ( అవసరం ఏమిటి ) " అని. అప్పుడు సూతమహర్షి అంటారు ఇలా: " ధీరులు నిరపేక్షులు    నాత్మారాములునైన మునులు    హరిభజనము నిష్కారణమ    చేయుచుందురు   నారాయణుఁ డట్టివాఁడు నవ్య చరిత్రా‌ "                 ‌ - పోతనభాగవతం. అటువంటి వారు చేసే జపాలకు, పారాయణలకు, పూజలకు కూడా కారణమేమీ ఉండదు. అదో వ్యాపకం అయిపోతుంది వారికి. స్వామి రామతీర్థ ( వేదాంత గురు ) ఋషికేష్ లో ఉండగా ఒక బంధువు వచ్చి " మురళీవాలాలో ఉన్న నీ కుమారుడు మరణించాడు " అని చెబుతే ఆయన అన్నారు " గాలి వీచడం, నీరు ప్రవహించడం లాగే జననమరణాలు కూడా అతి సహజ ప్రక్రియ. ఎక్కువ ఆలోచన చేయనక్కరలేదు వాటి గురించి " అని. స్థితప్రజ్ఞులు. కంచి పర...

అమ్మవారు కల్పన కాదు - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏 " కల్పనారహితా " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 858 వ నామం. " కల్పనారహితా " అంటే తయారుచేయబడినది కాదు అని. అదంతా కల్పనండీ అంటూంటాం. కల్పన అంటే అబద్ధం, మాయ అనే భావనలో వాడుతూంటాం. కాని అది సరికాదు. ఈ కల్పనలు/తయారీలు అన్నీ జీవుల పనులు. మనస్సు రకరకాల కల్పనలు చేస్తూంటుంది.  " వాసనామయ్యో దృశ్య వీచయః " అంది వేదాంతం. గతజన్మ వాసనలు తరంగాలు కలిగిస్తూ ఉంటాయి. గతజన్మ కర్మలను బట్టి సుఖ, దుఃఖ తరంగాలు ఒకటి తరువాత ఒకటి కలుగుతూనే ఉంటాయి.  అద్దం మీద మరక/మురికి ఉంటే మనరూపం సరిగ్గా కనబడదు. దోషం కన్నుది కాదు కదా. మనస్సు నిర్మలంగానే ఉంటుంది. కాని కర్మఫలాల వాసనలు మనస్సుకు తగులుకుంటాయి. ఉదా:కు ఓ ధారావాహిక చూస్తూంటాం. దానిలో పాత్రలు, సంభాషణలు అన్నీ కల్పనలే అని తెలుసు. కాని తరువాత ఏమయిందో ఏమిటో అని మరునాడు అదే సమయందాకా ఒకటే ఆరాటం. కొన్ని పాత్రలపై జాలి, కొన్ని పాత్రలపై కోపం, అసహ్యం. ఇవన్నీ స్వయంకృతాలు. మనస్సు చేసే మాయలు. లేని విషయాలకోసం కూడా ఆనందం, విచారం, కోపం, ద్వేషం.  ఇటువంటి అలజడిలేని మానసిక స్థితే కల్పనారహితం, అమ్మవారు. శుద్ధమయ...

అమ్మవారు ఎల్లప్పుడూ భక్తులకు తోడుగా ఉంటారు - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏 " సదోదితా " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 920వ నామం. " సదోదితా ( సదా + ఉదితా ) అంటే ఎల్లప్పుడూ ప్రకాశించునది అని అర్ధం. ప్రకాశించడం అంటే ఎప్పుడూ మెలకువగా, అప్రమత్తంగా ఉండడం. 14 లోకాలలోని 84 లక్షల జీవరాశుల బాగోగులు సదా చూస్తూ ఉండాలన్నా, తన సృష్టి అంతా లయబద్ధంగా ఆకర్షణీయంగా వింతగొలిపేదిగా ఉండాలన్నా అమ్మవారు ఎంత అప్రమత్తంగా ఉండాలి. మనం అప్పుడప్పుడు వింటూంటాం, చదువుతూంటాం. ఫలానా నాయకుడు రోజుకు 18 గం.లు పనిచేస్తారు, ఎప్పుడూ ఒకరోజు కూడా సెలవు తీసుకోడు అని. మరి ఒక దేశనాయకుడే అలా ఉండవలసి వస్తే అమ్మవారు ఎంత అప్రమత్తంగా ఉంటారు. పూజ్యులు గరికిపాటివారు ఓసారి ప్రవచనం చేస్తూ చమత్కారంగా ఓ విషయం తెలియచేసారు. సూర్యుడు ప్రత్యక్షనారాయణుడు కదా ఆయన్ని నమ్ముకుంటే నయమా అమ్మవారిని నమ్ముకుంటే నయమా అని సందేహం కలిగిందిట ఒకాయనకు. ఈయన అన్నారు " రాత్రి మనకు ఏదయినా సమస్య వస్తే ఉదయం సూర్యుడు ఉదయించేదాకా ఆగాలి. అమ్మవారి రక్షణ అయితే 24x7 " అని.  అమ్మవారి పాదాలను ఆశ్రయిద్దాం, నిశ్చింతగా జీవిద్దాం.  ఏతత్ సర్వం శ్రీపరదేవతార్పణమస్తు - సూర్య. శుభ...

అమ్మవారు అనవసర బంధాలను తగ్గిస్తారు - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏 " భవనాశినీ " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 175 వ నామం. " భవనాశినీ " అంటే సంసార(బంధ)మును నశింపచేయునది అని అర్ధం. నశింపచేయడం అంటే ఎవరినో ఒకరిని చంపేయడం కాదు, బంధాన్ని తగ్గిస్తుంది అని. అసలు తగ్గించడం దేనికి?. కపిలమహర్షి తన తల్లికి తత్వం భోదిస్తూ ఇలా తెలియచేసారు: " ఏవం స్వభరణాకల్పం    తత్ కళత్రా యస్తధా   నాత్రియంతే యధా పూర్వం    హీనా సాయివ గోజరం " గోజరం అంటే ముసలి ఎద్దు. " ఎవరి ఆనందంకోసం అయితే జీవితమంతా ఏదోరకంగా ( అధర్మంగా నైనా ) సంపాదిస్తావో ఆ భార్యాపిల్లలు ముసలితనంలో నిన్ను సంపాదించినప్పుడు చూసినట్లుగా చూడరు. వ్యవసాయదారుడు ముసలి ఎద్దును ప్రక్కన పెట్టినట్లుగా నిన్ను మూలన పడేస్తారు భార్యాపిల్లలు " అన్నారు.  భార్యాపిల్లల అవసరాలు తీర్చడం భర్త బాధ్యతే. కాని బంధం పెరిగే కొలదీ వారి ఆనందంకోసం పాపకర్మలు/అధర్మసంపాదన ఎక్కువ అవుతాయి. పాపహేతువు. అమ్మవారితో బంధం పెంచుకుంటే ప్రాపంచికబంధాన్ని తగ్గిస్తుంది. అప్పుడు మనస్సు ప్రశాంతంగా, జీవితం ధర్మబద్ధంగా ఉంటుంది. " జరామరణమోక్షాయ             ...

అమ్మవారు మన హృదయంలోనే ఉంటారు - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏 " హృదయస్థా " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 595 వ నామం. " హృదయస్థా " అంటే హృదయంలో నివసిస్తుంది అని. ఎవరి హృదయంలో అని ఆలోచించనక్కరలేదు. భక్తుల హృదయంలో అని తెలుసుకోవాలి. అమ్మవారు అన్నారు: " నాహం తీర్థే, న కైలాసే,    వైకుంఠేవా న కర్హచిత్ " అని. అంటే తీర్థాలలోనూ, కైలాసంలోనూ ఆఖరికి వైకుంఠంలోనూ ఉండను నేను " అని. " వసామికింతు " - మరి ఎక్కడుంటావమ్మా అని ఋషులు అడిగితే ఆవిడ అన్నారు " మత్ జ్ఞాని హృదయాంభోజమధ్యమే " అంటే జ్ఞానుల హృదయాలలో ఉంటాను అని. జ్ఞానులు అంటే ఎవరు?.  శంకరాచార్యులు  " బ్రహ్మ సత్యం, జగన్మిధ్య,    జీవో బ్రహ్మ ఏవ నపరః " అన్నారు.  ఈ ప్రపంచమంతా మిధ్యే, బ్రహ్మ మాత్రమే సత్యం. జీవుడు బ్రహ్మ ఒకరే అని తెలుసుకున్నవారు జ్ఞానులు. పూజ్యగురువులు సామవేదంవారు ఓసారి ప్రవచనం చేస్తూ ఓ అద్భుత విషయం తెలియచేసారు. మన ఇంట్లో వివాహం జరిగింది. ఓ పెద్దాయన ఓ బహుమతి ఇచ్చారు. ఆ పెట్టె రంగురంగుల ముచ్చికాగితాలతో చుట్టి ఉంది. మెరిసిపోతూ ఉంది. ఎంత బాగుందో అనుకున్నాం. 4 రోజులదాకా దాన్ని అలాగే ఉంచి వ...

అమ్మవారి అనుగ్రహం సులభమే కొద్దిగా కష్టపడితే - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏 " దురాధర్షా " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 772వ నామం. " దురాధర్షా " అంటే కష్టమయిన తపముచే స్వాధీనము చేసుకొనుట గలది - అమ్మవారిని స్వాధీనం చేసుకొనుట అంత సులభము కాదు - అని అర్థం. అమ్మవారిని ఎలా చూడగలమో బ్రహ్మాండపురాణం తెలియచేసింది: " ధ్యానైక దృశ్యా జ్ఞానాంగీ    విద్యాక్షా హృదయా స్పదా    ఆత్మైక్యాత్ వ్యక్తమాయాతి    చిరానుష్టాన గౌరవాత్ "  అమ్మవారు జీవుడి హృదయంలోనే ఉంది. అనుష్టానం అంటే ఎడతెగని సాధనతో అమ్మవారిని చేరగలం అని తెలియచేస్తూంది పురాణం. ఎంత కఠిన సాధన చేయాలో తెలుస్తూంది. మూకశంకరులు కామాక్షీ అమ్మవారిని ఇలా స్తుతిస్తారు: " చింతితఫలపరిపోషణ   చింతామణిరేవ కాంచినిలయా మే    చిరతరసుచరితసులభా   చిత్తం శిశిరయతు చిత్సుధాధారా "               - మూకపంచశతి -3 ఇందులో " చిరతరసుచరితసులభా " అన్నారు. అంటే ఎంతోకాలము చేసిన సత్కర్మాచరణములచే సులభముగా లభించునది అని అర్ధము. ఎంతో కాలము అంటే ఎన్నో జన్మలు కూడా పట్టవచ్చు. సాధన చేయగా చేయగా చివరి జన్మలో " పరమాచార్య " వంటి జన్...

" శ్రావణ పౌర్ణమి - హయగ్రీవ జయంతి - జంధ్యాల పౌర్ణమి " శుభాకాంక్షలు - చీమలపాటి సూర్యనారాయణ

 " శ్రీమాత్రేనమః " 🙏 హయగ్రీజయంతి " శ్రావణ పౌర్ణమి - హయగ్రీవ జయంతి - జంధ్యాల పౌర్ణమి "  అమ్మవారు శ్రీలలితాదేవి మణిద్వీపంలో సింహాసనాధీశురాలై కొలువై ఉంటారు. దుర్గాసూక్తంలో అమ్మవారిని " తాం అగ్నివర్ణాం " అని పూజిస్తాం. ఆవిడ అగ్నిరంగులో ( ఎరుపు పసుపు కలిసిన రంగులో ) మెరిసిపోతూ ఉంటుంది. ఆవిడకి ఎప్పుడూ 16 ఏళ్ళ వయస్సే. అందుకే ఈ సృష్టి ఇంత అద్భుతంగా క్రమం తప్పకుండా నడుస్తూ ఉంది. ఆవిడ చుట్టూ వశిన్యాది వాగ్దేవతలు కూర్చుని ఆమెని స్తుతిస్తూ ఉంటారు ఎల్లప్పుడూ. ఆ స్తుతే శ్రీలలితాసహస్ర ( రహస్య ) నామాలు. ఓ రోజు హయగ్రీవులు ( విష్ణువు ఒక అవతారం ) అమ్మవారి దర్శనానికి రావడం, ఆ స్తుతిని విని ఆనందించడం జరిగింది. ఈ విషయం అగస్త్యమహాముని తెలుసుకుని వాటిని తనకు తెలియచేయమని అడుగుతాడు హయగ్రీవుణ్ణి. ఆయన అవి రహస్యనామాలు, అమ్మవారి అనుమతిలేదు, కుదరదంటారు. వందల సంవత్సరాలు హయగ్రీవుని అనుగ్రహం కోసం తపస్సు చేస్తాడు అగస్త్యుడు. ఇంక అగస్త్యులు పట్టువదిలేలా లేరని తలచి హయగ్రీవులు " అమ్మా, అగస్త్యుడు మీ నామాలకోసం తపస్సు చేస్తున్నారు ఇవ్వమంటారా " అని అమ్మవారిని అడుగుతారు. ఆవిడ లోకకల్యాణం...

అమ్మవారు కరుణామయురాలు - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏 " సుఖారాధ్యా " - అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 681వ నామం. " సుఖారాధ్యా " అంటే సుఖముగా ఆరాధింపదగినది అని అర్థం. అమ్మవారిని ఆరాధించడానికి, అనుగ్రహం పొందడానికి ఎక్కువ కష్టపడనక్కరలేదు. అంటే కఠినమయిన నియమాలేమీ ఉండవు. తెల్లవారుజామున చన్నీళ్ళస్నానం, రోజుల తరబడి ఉపవాసం/నిరాహారంగా ఉండడం, కష్టమయిన ఆసనంలో కూర్చోవడం/నిలబడడం లాంటివి చేయనక్కర్లేదని భావం. శరణాగతి అంటే నువ్వు తప్ప వేరే దిక్కు లేదు నాకు అని అమ్మవారికి నమస్కరించుకుని నామజపం చేసుకుంటే చాలు అమ్మవారు అనుగ్రహిస్తారు. కపిలమహర్షి తన తల్లికి తరించడానికని గీత భోదిస్తారు. అది " కపిలగీత " గా ప్రసిద్ధి చెందింది. అష్టాంగయోగంలో " సదా ఆసనజయం " అని ఒక విషయం వివరిస్తారు. శరీరాన్ని బాధపెట్టేవి, ధ్యానాన్ని ఆటంకపరిచేవి అయిన ఆసనాల్లో కూర్చోనక్కరలేదు సాధనకు. ధ్యానానికి శరీరం ఒక ముఖ్యమయిన సాధనం. శరీరం ఆరోగ్యంగా, సౌకర్యంగా ఉండాలి. అప్పుడే సాధన వీలవుతుంది. అదే పరమాత్మ గీత ( అధ్యాయం )లో తెలియచేసారు. " ఏకాంతంగా అంత ఎత్తు పల్లం కాని మెత్తటి ఆసనం మీద కూర్చుని కనుబొమల...

శ్రీవరలక్ష్మీదేవీ వ్రతదిన శుభాకాంక్షలు - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీరస్తు శుభమస్తు"🙏 శ్రీసూక్తంలో అమ్మవారిని " మనసః కామమాకూతిం " - " మనసులో కలిగే కోరికలన్నీ సంతోషాన్నిచ్చేవిగా అనుగ్రహించు, అంటే మంచి కోరికలే కలిగేలా చెయ్యి తల్లీ‌ " అని ప్రార్ధన చేస్తాం. " ధనమగ్ని ర్ధనంవాయుః   ధనంసూర్యో ధనంవసుః   ధనమింద్రో బృహస్పతిః   వరుణం ధనమశ్నుతే " అగ్నిదేవుడు, వాయుదేవుడు, సూర్యుడు, అష్టవసువులు, ఇంద్రుడు, బృహస్పతి, వరుణుడు తమతమ సంపదలను నీ కృపతో అనుభవిస్తున్నారు తల్లీ. ఎంత అద్భుతం అమ్మవారి ఐశ్వర్యం. ఎవరినైనా ఆశీర్వదించినప్పుడు " ఆయురారోగ్య ఐశ్వర్యాది భోగభాగ్యములతో జీవించుము " అని అంటారు. ఆయువు, ఆరోగ్యం, ఐశ్వర్యములంటే తెలిసినవే. భోగాలంటే సౌకర్యాలూ, పనిమనుషులు మొ.గునవి. మరి భాగ్యం ఏమిటి. ముందర నాలుగూ అంటే " ఆయువు ఆరోగ్యం ఐశ్వర్యం భోగాలు " ఉన్నా సుఖం ఉండదు చాలామందికి.  " అశాంతస్య కుతః సుఖం " - ఎప్పుడూ " అశాంతిగా ఉండేవానికి సుఖం ఎక్కడిది " అన్నారు పరమాత్మ గీతలో - భ.గీత 2:66 " భాగ్యం " అంటే ఈ శాంతే. ఇది ఉన్న మనిషే సుఖంగా ఉండగలడు, ఏది లేకపోయినా. ఈ శాంతిని కలుగచేసేది అమ్మవారు ల...

పాపపు భవంతులకు పునాది మోహం - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏 " మోహనాశినీ " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 163 వ నామం. మోహనాశినీ అంటే మోహానికి అడ్డుకట్ట.  అందుబాటులో లేని కోరికను తీర్చుకోవాలనుకోవడాన్ని మోహం అంటారు. ఇది అధర్మము, చెడుపనులకు దారి తీస్తుంది. ఉదాహరణకు ఒకతను మంచివాడే. ఓ చక్కని ఉద్యోగం చేసుకుంటూ భార్యాపిల్లలతో సంతోషంగా గడుపుతూ ఉంటాడు. ఓ ఖరీదయిన ప్రాంతంలో ఓ ఇల్లు కొనుక్కోవాలనే కోరిక కలుగుతుంది. అది మోహంగా బలపడుతుంది. డబ్బు కోసం చెడ్డదారులు త్రొక్కడం మొదలుపెడతాడు. చిక్కుల్లో పడతాడు. కోరిక తీరదు కాని చిక్కులు మిగులుతాయి. ఈ విషయాన్నే పరమాత్మ గీతలో ఇలా చెబుతారు: " స్వభావజేన కౌంతేయ    నిబద్ధః స్వేన కర్మణా,    కర్తుం నేచ్ఛసి యన్మోహనాత్    కరిష్య స్వవశో2పి తత్ "             - భ.గీత 18:60 " కౌంతేయా, మోహప్రభావమున నీవు చేయుటకు ఇష్టపడని కర్మనుకూడా నీ పురాకృత స్వాభావిక కర్మలచే బంధింపబడి తత్ప్రభావమున నీవు అవశుడవై చేయుదువు " అని. ఓ కోరిక కలగగానే తన స్థాయి ఏమిటి, అది తనకు ఎంతవరకూ అవసరం అని ఆలోచనచేయాలి.‌ కాని అది అంత సులభం కాదు. అమ్మవారి ...

అమ్మవారు ఏమయినా అనుగ్రహించగలరు - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏 "అనుగ్రహదా " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 273 వ నామం. " అనుగ్రహదా " అంటే అనుగ్రహిస్తారు అని. ఏమి అనుగ్రహిస్తారు?. ఏమయినా ఇవ్వగలరు. అమ్మవారు ఇవ్వలేనిది ఏముంటుంది. అలా అమ్మవారి అంతులేని అనుగ్రహం పొందాలంటే మనం ఏమి చేయాలి అన్నది ఆలోచించుకోవాలి. శంకరులు శివానందలహరి చేస్తూ ఇలా ప్రార్థిస్తారు: " కంచిత్కాలముమామహేశ    భవతః పాదారవిందార్చనైః   కంచిద్ధ్యానసమాధిభిశ్చ నతిభిః    కంచిత్కథాకర్ణనైః,   కంచిత్కంచిదవేక్షణైశ్చ నుతిభిః    కంచిద్దశామీదృశీం   యః ప్రాప్నోతి ముదా త్వదర్పిత   మనా జీవన్ స ముక్తః ఖలు"                                   - 81 " ఓ గౌరీవల్లభా - కొద్దిసేపు నీ పాదకమలాలను ఆరాధించి, కొద్దిసేపు నీ ధ్యానంలో గడిపి, కొద్దిసేపు నీకు నమస్కరిస్తూ, కొంతసేపు నీ కధాశ్రవణం చేస్తూ, కొద్ది సమయం నీ దర్శనం చేస్తూ, కొంతసేపు నిన్ను స్తుతిస్తూ, కొన్ని క్షణాలు మనస్సు నీపై ఉంచే అవస్థను అలవరచుకున్నవారు జీవన్ముక్తులు అవుతున్నా...

అమ్మవారి మనస్సు నిర్మలం - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏 " శుద్ధమానసా " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 973 వ నామం. " శుద్ధమానసా " అంటే నిర్మలమయిన మనస్సుకలది అని అర్థం. సహజంగానే ఏ అమ్మ మనస్సు అయినా నిర్మలంగానే ఉంటుంది. మరి అమ్మలగన్నయమ్మ మనస్సు నిర్మలంగా ఉండకుండా ఎలా ఉంటుంది. సహజంగా ఎవరి మనస్సయినా నిర్మలంగానే ఉంటుంది. మనస్సు అంతఃకరణాలలో మొదటిది. అది సంకల్ప వికల్పాలను రెండింటినీ చేస్తుంది. వికల్పాలు అంటే చెడు పనులు/ఆలోచనలు. అటువంటివి చేయాలని ఎవరికీ ఉండదు. కాని ప్రకృతి/సమాజం అలా ఉండనివ్వదు. మాయ చేస్తుంది. నిర్మలంగా ఉన్న సరస్సులో ఓ రాయి వేస్తే తరంగాలు మొదలవుతాయి. అలాగే ఓ చెడు లేక ఇష్టంలేని సంఘటన జరగగానే మనస్సులో తరంగాలు మొదలవుతాయి. వాటిలో సుఖ, దుఃఖ తరంగాలు రెండూ ఉంటాయి. అవి జీవుడి కర్మఫలాల మీద ఆధారపడి ఉంటాయి. " వికారహేతౌ సతి విక్రయంతే   ఏషాన్నతేతాంసి తవేయ ధీరాః "  అన్నారు కాళిదాసు. ఎదురుగా వికార సంఘటనలు జరుగుతూన్నా మనోవికారానికి లోను కానివారు ధీరులు అని. అది అంత సులభం కాకపోయినా అసాధ్యం కాదు. సంఘటన ఒకటే అయినా అందరూ ఒకేలా స్పందించరు. " అసంశయం మహాబాహో    మనో దుర్...

అమ్మవారు బంధాలను తగ్గిస్తారు - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏 " బంధమోచనీ " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 546 వ నామం. " బంధమోచనీ " అంటే " అజ్ఞాన ( సంసార ) బంధము నుండి విడిపించునది.  బంధము అంటే అజ్ఞాన బంధం. ధర్మబద్ధమయిన బంధం ఉండాలి. లేకపోతే జీవితం నిస్సారం. కాని బంధాలు శాశ్వతం అనుకుంటూ అదే లోకంలో ఉండకూడదు. ఓ ఉదాహరణ చూద్దాం. మీ సంతానం బాగుకోసం, అభివృద్ధికోసం మీరు ఎంతో కష్టపడి ఉంటారు, త్యాగాలు చేసి ఉంటారు. వారి సంతానం కోసం వారు కష్టపడతారు. మనుమల విషయంలో మీరెందుకు ప్రతీదానిలోనూ కలుగజేసుకుని బాధపడడం. అదే అజ్ఞానబంధం.  రాముడిని ఎలాగయినా అరణ్యవాసం మానిపించి అయోధ్యకు తీసుకుని వెళ్ళాలని అందరూ ప్రయత్నం చేసారు. జాబాలి దశరధుని సలహాదారు. ఆయన రాముడితో " అస్తమానూ తండ్రికిచ్చిన మాట అంటావు. తండ్రి ఎవరు, కొడుకు ఎవరు. ఈ బంధాలేమిటి " అంటారు. రాముడు కోపంతో " నా తండ్రికి నీవంటివారు సలహాదారుగా ఉన్నందుకు నేను సిగ్గు పడుతున్నాను " అన్నారు.  ఇంద్రజాలం జరుగుతూంది. దానికి రుసుం ఉంటుంది. ఇంద్రజాలికుడు చేసేవేవీ నిజాలు కావని తెలుసు. కాని రుసుం కట్టి సమయం వృధా చేసుకుని మరీ ఎందుకు చూ...

ఈ రోజు " మిత్రుల దినోత్సవం " - శుభాకాంక్షలు అందరికీ - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏 " మిత్రరూపిణి " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 565 వ నామం.  మిత్రరూపిణి అంటే స్నేహానికి ప్రతిరూపం. మంచి స్నేహితుడు ఒక వరం.  " ఉపకారఫలం మిత్రం    విదితం మే మహాకపేః " రామసుగ్రీవులు అగ్నిసాక్షిగా మైత్రీబంధం ఏర్పరుచుకున్నాక రాముడు సుగ్రీవుడిని అడుగుతారు " నేను నీకు ఏవిధంగా సహాయపడగలను " అని. రాముడు సీతమ్మను వెదుకుతూ సుగ్రీవుడి దగ్గరకు వచ్చారు. రాముడు " నాకు ఈ సహాయం చెయ్యి " అని అడగాలి. కాని రాముడు అలా అడగలేదు. నీకు ఏమి సహాయం కావాలి అని అడిగారు. అదీ ఉత్తమ స్నేహితుడి లక్షణం. అంతేకాని ఎప్పుడూ " నాకు ఏమిస్తావు " అన్నట్లుగా ఉండకూడదు. స్నేహితుడి లక్షణాలను భర్తృహరి 6 విధాలు అని తెలియచేసారు. అవి 1. పాపం చెయ్యకుండా ఆపడం 2. ఏది మంచి చేస్తుందో అది చేయించడం 3. రహస్యాలు ( మిత్రుడివి ) కాపాడడం 4. మంచిగుణాలను అందరికీ చెప్పడం 5. ఆపదల్లో విడవకుండా తోడుగా ఉండడం 6. ఎప్పుడు ఏది అవసరమో అది ఇవ్వడం.  స్నేహితుల మధ్య ఇంతకన్నా మించిన పరస్పర సహకారం ఏమీ ఉండదు. స్నేహం అనేది ఏకవచనం కాదు. ఎప్పుడూ బహువచనమే. కనీసం ఇద్దరు ...

అమ్మవారు సందేహాలను తొలగిస్తారు - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏 " సంశయఘ్నీ " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 173 వ నామం. " సంశయఘ్నీ " అంటే సందేహములను పోగొట్టునది అని అర్ధం. సంశయం అంటే అజ్ఞానం. ఇది ధర్మమా, అధర్మమా, మంచా, చెడా అనేటువంటి అనేక సందేహాలు కలుగుతూంటాయి మనకు. కొన్ని సమస్యలు కలిగినప్పుడు అసలు బయట పడగలమా అనే సందేహం కలుగుతూంటుంది.‌ కాని మనకే ఆశ్చర్యం కలిగేలా బయట పడిపోతూంటాం.  సమాజానికి మంచికోసం త్యాగాలు చేసిన మంచివారికి కూడా ఎన్నో కష్టాలు, అవమానాలు ఎదురవుతాయి‌. కాని కష్టము సుఖమూ కూడా శాశ్వతం కాదు, తాత్కాలికమే అనే భావనే జ్ఞానం. అటువంటి జ్ఞానాన్ని అమ్మవారు కలుగచేస్తుంది. ఇదే విషయాన్ని పరమాత్మ గీతలో ఇలా తెలియచేసారు: " తద్విద్ధి ప్రణిపాతేన    పరిప్రశ్నేన సేవయా,    ఉపదేక్ష్యంతి తే జ్ఞానం    జ్ఞానినస్తత్త్వదర్శినః "            - భ.గీత 4:34 అర్జునుడు అడుగుతాడు పరమాత్మని " జ్ఞానం పొందడం అంత సులభమా " అని. అప్పుడు పరమాత్మ అంటారు: " మంచి గురువును పట్టుకో, శ్రద్ధగా సేవచేసుకో, మంచి ప్రశ్నలు వేసి మంచి జ్ఞానం పెంచుకో " అని. అమ్మవారు " గురురూపిణి "....