Posts

Showing posts from January, 2026

భీష్మ ఏకాదశి నేడు. పరమ పవిత్రమయిన రోజు. భీష్ముడిని ధ్యానించుకుని తరిద్దాం - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీరస్తుశుభమస్తు"🙏 " శతానందః " విష్ణు సహస్రనామాలలో ఒక అద్భుత నామం.  అనంతమైన ఆనందములు, వందలాది ఆనందములు కలవాడు అని భాష్యం చెప్పారు ఆదిశంకరులు.  మహాభారతంలో భీష్ముడు జీవుల ఉన్నతి కోసం అతి పవిత్రమైన విష్ణు సహస్రనామాలు ప్రసాదించారు. దీనిలో శతానందః అని ఒక అద్భుత నామం.  వందలాది ఆనందములు అన్నారు ఏమిటి శంకరులు అని ఆశ్చర్యం వే‌స్తుంది కదా. తైత్తిరీయోపనిషత్తు ఆనందాల గురించి ఇలా తెలియచేస్తూంది: మనుషులలో కొందరు ఉత్తములు పొందే ఆనందాన్ని మానుషానందం అంటారు. మానుషానందంకి 100 రెట్లు దేవమానుషానందం. దానికి వందరెట్లు గంధర్వానందం. దానికి వంద రెట్లు దేవగంధర్వానందం. దానికి వంద రెట్లు దేవతానందం. దానికి వంద రెట్లు బృహస్పతానందం. దానికి వంద రెట్లు బ్రహ్మానందం - ఈ ఆనందాలన్నీ కలిగినవారు శతానందః - ఆయన మహావిష్ణువు.  ఈ ఆనందానికి మించినది లేదు.  మానుష్యానందం అంటే ఉదాహరణకు భూలోకానికి చక్రవర్తి ఒకాయన. ఆయనకు శతృవు ఉండకూడదు, అన్నీ అనుకూలిస్తూ ఉండాలి. ఆరోగ్యం బాగుండాలి. అందరూ ఆయనకు అనుకూలంగా ఉండాలి‌ - ఇన్ని ఉన్న ఆయనకు ఏ కోరికా లేకపోతే అతను పొందే ఆనందాన్ని మానుషానందం అంటారుట. భూలోకంలో ఇటువం...

శ్రీ పురందరదాసు ఆరాధనోత్సవం నేడు. స్మరించుకుని తరిద్దాం - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీరస్తుశుభమస్తు"🙏 " ప్రాప్య పుణ్యకృతాం   లోకానుషిత్వా శాశ్వతిః సమాః,   శుచీనాం శ్రీమతాం గేహే   యోగభ్రష్టో2భిజాయతే"            - భ.గీత 6:41 " అథవా యోగినామేవ   కులే భవతి ధీమతామ్,   ఏతద్ధి దుర్లభతరం   లోకే జన్మ యదీదృశం "            - భ.గీత 6:42 కృష్ణ పరమాత్మ " ఈ జన్మలో సాధన మొదలు పెట్టి పూర్తికాని యోగులు మళ్ళీ జన్మ తీసుకుని సాధన కొనసాగిస్తారు " అన్నారు గీతలో. పురందరదాసు జీవితం దీనికి ఓ చక్కని ఉదాహరణ శ్రీనివాసనాయక  అనే ఆయన ఒక వజ్రాలవ్యాపారి కొడుకు. లోభి. పిల్లికి కూడా బిచ్చం వేసేవాడుకాడు. 20 ఏట తల్లితండ్రులు పోవడంతో వ్యాపారం చూసుకోవడం మొదలు పెట్టాడు. విపరీతంగా సంపాదించాడు. ఆరోజుల్లోనే ఆయన్ని " నవకోటిపతి " అని పిలిచేవారు. అంతటి జమీందారు. ఇతను ఓరోజు ఓ పేదబ్రాహ్మణుడు వచ్చి " నాకొడుకు ఉపనయనం, ఏమయినా సహాయం చెయ్యండి " అని బ్రతిమిలాడినా వ్యంగ్యంగా దూషించి పొమ్మని బయటకు వెళ్ళిపోతాడు. బ్రాహ్మణుడు వ్యాపారి భార్యను బ్రతిమిలాడుతాడు. ఆవిడ జాలిపడి తన ముక్కుపుడకను ఇస్తుంది. ఇతను ఆ ముక్కుపుడకను అమ్మడా...