Posts

Showing posts from December, 2024

మంత్రం అంటే పెద్దగా కఠినంగా ఉండాలనేమీ లేదు - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏 " మహామంత్రా " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 227 వ నామం. " మహామంత్రా " అంటే మంత్రస్వరూపురాలు అమ్మవారు. " మననాత్ త్రాయతే ఇతి మంత్రః " - మననం అంటే మాటిమాటికీ స్మరిస్తే రక్షిస్తుంది మంత్రం. మంత్రాన్ని గురు ముఖంగా గ్రహించాలి. తల్లిదండ్రులను గురువును స్మరించుకుని మంత్రజపం చేస్తూ ఉండాలి. " యస్య దేవే పరాభక్తిః   యధా దేవే తధా గురౌ "                 - కఠోపనిషద్ " ఏ దేవి అనుగ్రహం కోసం జపం చేస్తున్నామో ఆ దేవిమీద అఖండభక్తి ఉండాలి. అంతే భక్తి గురువుమీద ఉండాలి " అని కఠోపనిషద్ తెలియచేస్తూంది. " శ్రీరామ జయరామ జయజయ రామ " - ఇది 13 అక్షరాల మంత్రం. భక్త రామదాసు 13 కోట్ల జపం చేసారు. శ్రీరాముడి అనుగ్రహంతో చిరస్మరణీయుడు అయారు. మామేనత్తగారు దృష్టి ( దిష్టి ) మంత్రం వేసేవారు. మంగళవారం, శుక్రవారం తప్ప మిగతా రోజుల్లో సాయంత్రం సూర్యాస్తమయ సమయంలో వీభూతి మంత్రించి ఇచ్చేవారు. ప్రక్క గ్రామాలవారు కూడా వస్తూండేవారు. ఓ గ్రహణసమయంలో నేను మాగ్రామంలో ఉండడంతో ఆవిడ " రేపు గ్రహణసమయంలో స్నానం చేసి రా, మంత్రోపదేశ...

గుడికి వెళ్ళేది విగ్రహం చూడడానికి కాదు, విగ్రహంలోని దేవుడిని చూడడానికి - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏 " మహాయంత్రా " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 228 వ నామం.  " మహాయంత్రా " అంటే ప్రార్ధించడానికి ఒక సాకారవస్తువు. అది విగ్రహం కాని బీజాక్షరాలతో కూడిన లోహరేకు అవచ్చు. " విశేషేణ గ్రహతి ఇతి విగ్రహం " - విగ్రహము అంటే విశేషంగా గ్రహించేది అని అర్ధం. కట్టిపడేస్తుంది జీవులని. అందుకని అప్పుడప్పుడు గుడులను దర్శిస్తూ ఉండాలి. త్రయం అంటే తంత్రం మంత్రం యంత్రం. సాధనలో మనస్సు నిలకడగా ఉండాలంటే విగ్రహం అవసరం ఎంతయినా ఉంది. సాధన సులభమవుతుంది. కళ్ళుమూసుకుని ధ్యానం చేస్తే మనస్సు మాటిమాటికీ ఎక్కడెక్కడకో పోతూ ఉంటుంది. దాన్ని లాక్కొచ్చి కూర్చోపెడుతూ ఉండాలి. ఈ త్రయం ఒకదానితో ఒకటి ముడిపడి ఉంటుంది. ఉ.దాకు నమకం ( మంత్రం ) తెలుసు. పారాయణ ఫలితం వేరు. అదే లింగం ( యంత్రం ) మీద నమకం ( మంత్రం ) చదువుతూ పాలు పోస్తే ( తంత్రం ) లభించే ఫలితం వేరు. విగ్రహంని శాస్త్రోక్తంగా ప్రాణప్రతిష్ట చేస్తారు. అప్పుడే అది యంత్రం అవుతుంది. వివేకానందుడు " మేము విగ్రహానికి నమస్కరించం. విగ్రహం లోని దేవుడికి నమస్కరిస్తాం " అని తెలియచేసేవారు. కంచి కామాక్షి...

తత్రం అంటే తంతు, కార్యక్రమం - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏 " మహాతంత్రా " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 226 వ నామం.  " మహాతంత్రా " అంటే తంత్రస్వరూపురాలు. తంత్రం అంటే తంతు, పని. పనే దైవం అంటారు. ఏదయినా పని మొదలుపెడితే కార్యక్రమం చాలానే ఉంటుంది. " త్రాసాత్ త్రాణాత్ తంత్రః " - భయాలనుంచి రక్షించేది తంత్రం. మనం చేసే పూజలు జపాలు అన్నీ తంత్రం. దీనికి మంత్రాలు, యంత్రాలు అవసరమవుతాయి. ఋగ్వేదంలో ఇలా ఉంది: " నరుతే శ్రాంతస్య సఖ్యాయదేవాః "  అంటే " ఎవడైతే కష్టపడడో వానికి దేవుడు కూడా సహాయపడడు " అని. అంటే శ్రద్ధగా మనసుపెట్టి పనిచేసేవారికి దేవతలు సహాయపడతారు అని అర్ధం.  మన పూర్వీకులు ఏపని అయినా ఎంత ఇష్టంగా ప్రత్యేకశ్రద్ధతో చేసేవారో తెలుసుకోవడానికి ఎక్కువ కష్టపడక్కరలేదు. మన గుడులు, స్థూపాలూ చూస్తే చాలు. మధురై మీనాక్షి అమ్మవారి ఆలయం కట్టి 2500 సం.లు, తంజావూరు బృహదీశ్వరాలయం కట్టి 1000 సం.లు అయింది. విష్ణుధ్వజం ( ఇప్పుడు కుతుబ్ మినార్ అంటున్నారు ) కట్టి కనీసం 1000 సం.లు అయింది. ఆశ్చర్యం ఏమిటంటే ఇవన్నీ చెక్కు చెదరకుండా ఉన్నాయి, ఇంకా కొన్ని వేల సంవత్సరాలు ఇలాగే ఉంటాయ...

అమ్మవారు ఏమీ చదువుకోలేదు, అవిద్యాస్వరూపురాలు - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏 " అమతిః " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 537 వ నామం . " అమతిః " అంటే అవిద్యాస్వరూపురాలు అని అర్ధం. విద్య అంటే కేవలం అమ్మవారి గురించి తెలుసుకునే జ్ఞానం మాత్రమే అని వేదం చెబుతూంది. మిగతావన్నీ అవిద్యలే. ఉద్యోగాల కోసం చదివే మన చదువులన్నీ ఎంత పెద్దవి అయినా అవిద్యలే. మరి అమ్మవారు విద్యాస్వరూపురాలు కాని అవిద్యాస్వరూపురాలు ఎలా?.  సైద్ధాంతిక జ్ఞానం వేదం, పురాణాలు, పుస్తకాలు, గురువు నుండి పొందవచ్చు. ఆచరణాత్మక సాక్షాత్కారం సాధనతో వస్తుంది.  అమ్మవారి అంశ/చైతన్యం పండితులలోనే కాదు, పశుపక్ష్యాదులు, క్రిమికీటకాలలో కూడా ఉంటుంది. మరి సాలెపురుగు తన రక్షణ, ఆహారం కోసం చక్కటి గూడు ఎలా అల్లుకుంటూంది. పక్షి తమ పిల్లల కోసం గూడు ఎలా కట్టుకుంటూంది. వీటికి పుస్తక/బ్రహ్మ జ్ఞానం లేదు. సాధనజ్ఞానం ఉంది. దానిని అమ్మవారు " అవిద్యాస్వరూపురాలు " గా ప్రసాదిస్తారు. పరమాత్మ గీతలో ఇలా తెలియచేసారు: " న హి జ్ఞానేన సదృశం    పవిత్రమిః విద్యతే,   తత్స్వయం యోగసంసిద్ధ:    కాలేనాత్మని విన్దతి "           - భ.గీత 4:38 ఈ ప్రపంచంల...

స్వర్గం మాకు వద్దు అనే భక్తులు కూడా ఉంటారు - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏 " స్వర్గాపవర్గదా " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 764 వ నామం . " స్వర్గాపవర్గదా " స్వర్గమును, మోక్షమును ఇచ్చునది అని అర్ధం. స్వర్గం తాత్కాలికసుఖం. మళ్ళీ భూమిమీద పుట్టి సంసారచక్రబంధంలో పడే అవకాశం ఉంది. మోక్షం అంటే జన్మరాహిత్యం. అమ్మవారు రెండూ అనుగ్రహిస్తారు వారి వారి కోరికకు, సాధనకు తగ్గట్టుగా. కఠోపనిషత్తు సాధనకు రెండు మార్గాలు ప్రతిపాదించింది: " శ్రేయస్చ ప్రేయస్చ మనుష్యమేతః   తౌ సంపరీత్య వివినక్తి ధీరః "                           - 1.2.2 జీవనయానంలో మానవుని ముందు రెండు మార్గాలున్నాయి.  మొదటిది శ్రేయోమార్గం - ఇది జ్ఞాన సముపార్జన ద్వారా శ్రేయస్సు వైపుకు నడిపించి శాశ్వతానందాన్ని, పరిపూర్ణతను చేకూరుస్తుంది - మోక్షం . రెండవది ప్రేయో మార్గం - ఇది ప్రియం కలుగజేసేది.  కర్మానుష్టానం ద్వారా కొంత అభ్యుదయం కలిగించినా అది అశాశ్వతము, దుఃఖ హేతువు అవుతుంది - స్వర్గం. ముద్గలుడు అని ఓ బ్రాహ్మణుడు ఉండేవారు. సత్యనిష్ఠాగరిష్టుడు. " పక్ష ఉపవాసం " అనే వ్రతం పాటించేవాడు - అంటే పాడ్యమి ...

అమ్మవారు మన కర్మలకు కేవలం సాక్షి మాత్రమే - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏 " నిష్క్రియా " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 182 వ నామం . " నిష్క్రియా " అంటే ఏ క్రియలు లేనిది. క్రియ, అంటే పని, ఎప్పుడు చేస్తాం. ఏదయినా కోరిక తీరడం కోసం. మరి అమ్మవారికి కోరికలు ఏముంటాయి. ఆవిడ‌ పొందవలసినదీ లేదు, పొందిందీ లేదు.  జీవుడు జన్మలు తీసుకునేదే సంచితకర్మఫలం అంతా అనుభవించి ముక్తి పొందడానికి. ఆత్మజ్ఞానం గొప్పది. ఏది మంచో ఏది చెడో తెలుసుకునే విచక్షణ ఉంది ఆత్మకు. ప్రారబ్దకర్మ సంచితకర్మలో భాగం. కర్మఫలం అనుభవంలోకి రావడం, మొదలవడమే ప్రారబ్దకర్మ. అనుభవించేస్తే కొంత తగ్గిపోతుంది. కాని ప్రకృతి మాయ చేస్తుంది. జీవుడు మాయలో పడిపోయి తప్పులు చేస్తూనే ఉంటాడు. పునరపి మరణం, పునరపి జననం - సంసారచక్రం తిరుగుతూనే ఉంటుంది. కేనోపనిషత్తు జ్ఞాన, కర్మేంద్రియాలు,మనస్సు కూడా జడమే, వీటిచేత ఆత్మ చేతనంగా ఉండి పనిచేయిస్తూంది అని తెలియచేస్తూంది. మరి ఆత్మ చేతనంగా ఉండి ఇంద్రియాల చేత తన శక్తితో పనిచేయిస్తూందంటే, ఇవన్నీ ఇలా పనిచెయ్యాలనే ఇచ్ఛ ఆత్మకు ఉందా?. లేదంటుంది ఈ ఉపనిషత్తు.  ఆత్మ వాటికి దగ్గరగా ఉండడం వల్ల శక్తినిస్తుంది తప్ప అవి ఎలా పని చె...

భక్తులకు అడగకుండానే అన్నీ సమకూరుస్తారు పరమాత్మ - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీరస్తు శుభమస్తు"🙏 " భక్త్వా మామభిజానాతి      యావాన్యశ్చాస్మి తత్వతః,   తతో మాం తత్వతో   జ్ఞాత్వా విశతే తదనంతరం "            - భ.గీత 18:55 " బ్రహ్మభూతుడైన యోగి ఈ పరాభక్తిద్వారా నేనెవరినో, ఎంతటివాడనో యధాతధముగ నా తత్వమును తెలిసికొనును.  అట్లు భక్తితో నా తత్వమును గ్రహించిన వెంటనే అతడు నాలో లీనమగును ". కుచేలుడు భార్య కోరికననుసరించి కృష్ణుడిని కలవడానికి వెడతాడు.  " కుచైలం మలినం క్షామం    ద్విజం ధమనిసంతతం "     - భాగవతం 10(2):80:23 కుచేలుడు మాసిపోయిన చిరుగుల వస్త్రంలో నరాలు కనిపిస్తూ కరువుకు మారురూపంలా ఉన్న పేద బ్రాహ్మణుడు. అసలు తనను లోపలికి వెళ్ళనిస్తారా. కృష్ణుడి దర్శనం అవుతుందా, నన్ను గుర్తుపడతాడా. అన్నీ సందేహాలే కుచేలుడికి. ఇలా ఆలోచన చేస్తూండగానే కృష్ణుడి అంతఃపుర ద్వారం ముందరకు చేరాడు. భక్తులకు ఏ అడ్డంకులూ లేకుండా చూస్తారు పరమాత్మ. అతనిని చూడగానే కృష్ణుడు ఒక్క అంగలో వెళ్ళి గాఢంగా ఆలింగనం చేసుకున్నారు. కుచేలుడు కన్నీళ్ళ పర్యంతమయాడు. కుచేలుడు ఊహించని అనుగ్రహం ఇది. కుచేలుడిని హంసతూలికా తల్పం పై క...

కోరిక తప్పు కాదు, అది ధర్మబద్ధంగా ఉండాలి - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏 " త్రివర్గదాత్రీ " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 760 వ నామం .  " త్రివర్గదాత్రీ " అంటే ధర్మార్ధకామములను ఇచ్చునది అని అర్ధం. చతుర్వర్గాలలో ఈ మూడింటికి మోక్షం కూడా కలుస్తుంది. ధర్మార్ధకామములు మూడూ ఒకదానికొకటి ఆధారం. ఆకలేస్తూంది. అన్నం కావాలన్నది కోరిక. అన్నం దొరికింది అంటే అర్ధం దక్కింది. ఎవరో ఆకలితో వచ్చాడు. కొంచెం అన్నం పెట్టాం. అది ధర్మం అయింది.  కోరిక తప్పు కాదు. ఉండాలి. లోకకళ్యాణం కోసం యజ్ఞం చేయాలన్నది కూడా కోరికే. కాని కోరిక ధర్మంతో కూడుకున్నదవుతే అమ్మవారు అర్ధం/ధనం కూడా సమకూరుస్తారు. పరమాత్మ గీతలో ఇలా తెలియచేసారు: " కర్మణః సుకృతస్యాహుః      సాత్వికం నిర్మలం ఫలం,   రజసస్తు ఫలం దుఃఖం             అజ్ఞానం తమసః ఫలం "            - భ.గీత 14:16 " శ్రేష్ఠములైన కర్మలను ఆచరించుటవలన సాత్విక ఫలము అనగా సుఖము, జ్ఞానము, వైరాగ్యము మొదలగు నిర్మలఫలములు కలుగును. రాజసకర్మలకు ఫలము దుఃఖము.  తామసకర్మలకు ఫలము అజ్ఞానము " అని. మంచి చేయకపోయినా పరవాలేదు కాని చెడు ...

మనస్సు శుద్ధి అవుతే సమాజంలో శాంతి, సుఖం వెల్లివిరుస్తాయి - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏 " శుద్ధా " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 765 వ నామం.  " శుద్ధా " అంటే పరిశుద్ధమయినది, అవిద్యచే కలిగిన మాలిన్యములు లేనిది. అవిద్య అంటే అజ్ఞానం. అజ్ఞానం వలన కామక్రోధలోభాల వంటి దోషాలు/మాలిన్యాలు అలవడుతాయి. అమ్మవారు ఇవేవీ లేకుండా శుద్ధంగా ఉంటారు. శుచి వేరు, శుద్ధి వేరు. శుచి అంటే మామూలుగా శుభ్రపరచుకోవడం. రోజూ చేసుకునేది. శుద్ధి అంటే మంత్రపూర్వకంగా శుభ్రపరచుకోవడం. అశౌచాలు ఏర్పడినప్పుడు శుద్ధి చేసుకుంటారు.  శుద్ధి గురించి మహాభాగవతంలో వ్యాసర్షి ఇలా తెలియచేసారు: " కాలేన స్నానశౌచాభ్యాం    సంస్కారైస్తపసేజ్యయా,   శుధ్యంతి దానైః సంతుష్ట్యా    ద్రవ్యాణ్యాత్మాఽఽత్మవిద్యయా "           - మహాభాగవతం 10:05:04 మానవుడు సకాలంలో చేయవలసిన కార్యాలు చేస్తే శుద్ధుడవుతాడు అంది శాస్త్రం. స్నానం, శౌచం అంటే సదాచారంతో దేహం శుద్ధమవుతుంది. ఉతకడం వలన వస్త్రం, దున్నడం వలన భూమి, చెక్కడం వలన కర్ర, గర్భాదానాది సంస్కారములచేత గర్భం, తపస్సు చేత ఇంద్రియములు, యాగముచేత బ్రాహ్మణుడు, దానంచేత ధనం, సంతోషంచేత మనస్సు, ఆత్మవిద్యచే...

శరణాగతి అంటే చాలు అమ్మవారు ఎలా పూజించినా ముక్తిని ఇస్తారు - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏 " ముక్తిరూపిణీ " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 737 వ నామం .  " ముక్తిరూపిణీ " అంటె మోక్షమే స్వరూపముగా గలది. అమ్మవారు అమృతమూర్తి. చూపులతో అమృతాన్ని కురిపిస్తారు. జీవుడు అర్ధకామాలనే కోరుకున్నా అవి ధర్మబద్ధమవుతే అమ్మవారు మోక్షాన్ని కూడా అనుగ్రహిస్తారు. ఎవరికి ఎలా మోక్షం ఇద్దామా అని ఆలోచనచేస్తూ అవకాశాలను ఇస్తూ ఉంటారు. ఆ అవకాశాలను సద్వినియోగం చేసుకునేవారు మోక్షం పొందుతారు. నేరుగా అమృతం త్రాగిన బ్రహ్మాది దేవతలు మళ్ళీ జన్మ తీసుకోవలసిరావచ్చేమో కాని అమ్మవారి అమృతాన్ని పొందినవారు మోక్షం, జన్మరాహిత్యం పొందుతారు. అరుణోపనిషత్తునందు " నా శరీరమునంతను అమృతమునందుంచుము. 72 వేల నాడులను తడుపుము. నన్ను విశ్వమునందు పుట్టినవానిగా ఎరుంగుము‌ " అని ప్రార్థిస్తాం పరమేశ్వరుడిని. భాగవతమునందు ఓ అద్భుత ఘట్టం ఉంది. కృష్ణుడు గోపబాలురతో దూడలను త్రోలుకుంటూ యమున వడ్డుకు వెడతారు. దాహంతో కొందరు బాలురు అక్కడ మడుగులో దిగి నీరు త్రాగి చనిపోతారు. ఆ మడుగులో కాళీయుడు అనే సర్పరాజు ఉండడంవల్ల నీరు విషపూరితం అయిపోయింది. పోతనగారు అద్భుత పద్యం వ్రాసారు...

అమ్మవారు అద్భుత సౌందర్యవతి - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏 " అనాకలితసాదృశ్య చుబుకశ్రీవిరాజితా " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 29 వ నామం. " అనాకలితసాదృశ్య చుబుకశ్రీవిరాజితా " అంటే సాటిలేని సొగసుగల చుబుకం/గడ్డంతో ప్రకాశించుచున్నది అని భాష్యం చెప్పారు. ముఖానికి అద్భుత సౌందర్యంని ఇచ్చేది చుబుకమే. చిన్న పిల్లలని ముద్దు చేసేటపుడు చుబుకాన్ని పట్టుకుంటారు.  చిన్నపిల్లలను ఆత్మీయులను ఏదయినా విషయంలో నచ్చచెప్పే ప్రయత్నం చేసేటప్పుడు చుబుకం/గడ్డం పట్టుకుంటారు. శంకరులు సౌందర్యలహరి గానంచేస్తూ అమ్మవారి చుబుకం మీద అద్భుతమయిన శ్లోకం చెప్పారు:  " కరాగ్రేణ స్పృష్టం తుహినగిరిణా    వత్సలతయా గిరీశేనోదస్తం    ముహురధరపానాకులతయా,   కరగ్రాహ్యం శంభోర్ముఖముకురవృన్తం    గిరిసుతే కథంకారం  బ్రూమస్తవ   చుబుకమౌపమ్యరహితమ్ "                              - 67 ఓ పార్వతీదేవీ! ఉపమానరహితమైన నీ చుబుకమును(గడ్డమును) మేమెలా వర్ణించగలము? దానిని నీ తండ్రి అయిన హిమాచలుడు వాత్సల్యప్రేమతో తన వ్రేళ్ళతో నిమిరాడు. గిరీశుడ...

అమ్మవారి ఆభరణాల ధ్వనులు మన దుఃఖాన్ని పోగొడుతాయి - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏 " సర్వాభరణ భూషితా " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 51 వ నామం.  " సర్వాభరణ భూషితా " అంటే సమస్తమైన నగలతో అలంకరింపబడినట్టిది అని భాష్యం చెప్పారు. కల్పసూత్రమందు అమ్మవారికి 40 రకాల ఆభరణాలు చెప్పారు. కాళికాపురాణమందు శిరోభూషణమునుండి కాలి చుట్లవరకూ ఆభరణములను వర్ణించారు. గాయత్రీదేవి ధ్యానశ్లోకంలో " ఇందు నిబద్ధ రత్నమకుటాం " అని ప్రార్థిస్తాం. చంద్రకళతో కూడిన కిరీటం ధరించారు అమ్మవారు అని. శ్రీసూక్తంలో అమ్మవారిని " హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజాం " అని స్తుతిస్తాం. సువర్ణరజతస్రజాం అంటే బంగారు వెండి ఆభరణాలు ధరించిన అమ్మవారు అని. సూర్యదేవుని స్తుతిస్తూ " కేయూరవాన్ మకరకుండలవాన్ కిరీటీ హారీ వపుద్ధృత శంఖ చక్రః " అని కీర్తిస్తాం. కేయూరం, మకర కుండలాలు, కిరీటం, హారాలను ధరించిన స్వామి అని.  దేవతలు రకరకాల ఆభరణాలు ధరించి దర్శనమిస్తారు. ఆభరణాలు ధరించి మెరిసిపోతూన్న అమ్మవారిని చూస్తే మన మనస్సు పులకరిస్తుంది. రుక్మిణిని తీసుకుని వెళ్ళడానికి కృష్ణుడు విదర్భకు వస్తారు. రుక్మిణి గౌరీ పూజ అనంతరం గుడి బయటకు వస్...

కరోనా వంటి వ్యాధులు ప్రబలినప్పుడు మాత్రం మన ఆచారాలే దిక్కవుతాయి - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏 " సదాచారప్రవర్తికా " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 356 వ నామం. " సదాచారప్రవర్తికా " అంటే సదాచారాలను ప్రవర్తింపచేస్తారు, ఆచరింపబడేలా చూస్తారు అమ్మవారు. ఆచరణలో పెట్టబడేవన్నీ ఆచారాలే. అవి సదాచారాలు కావచ్చు, దురాచారాలు కావచ్చు. సదాచారాలను ప్రోత్సహిస్తారు, దురాచారాలను అడ్డుకుంటారు అమ్మవారు. కొన్ని సదాచారాలు కూడా కొందరికి దురాచారాలుగా కనబడి దూషిస్తూ ఉంటారు. ఆ ఆచారాలను సరిగ్గా అర్ధం చేసుకోకపోవడమే దానికి కారణం. సనాతనధర్మం ఎన్నో సదాచారాలను తెలియచేసింది. అవన్నీ శరీరారోగ్యానికి, సమాజ శ్రేయస్సుకు పనికొచ్చేవే. అవేమీ మతానికి సంబంధించినవి కావు. కాని మతరంగు పులిమి వాటిని పాటించకుండా చేస్తున్నారు కొందరు. ప్రస్తుతపు సమాజ/ప్రపంచ అశాంతికి సదాచారాలను పాటించకపోవడం, దురాచారాలను పాటించడమే ముఖ్యకారణం. కరోనా వంటి వ్యాధులు ప్రబలినప్పుడు మాత్రం మన ఆచారాలే దిక్కవుతాయి. తను పాటించే ఆచారం వలన తనకు, సమాజానికి మంచి జరిగితే ఆ ఆచారం సదాచారం. ఎవరికయినా అసౌకర్యాన్ని, చెడును కలిగిస్తే అది దురాచారం.  పరమాత్మ గీతలో ఇలా తెలియచేసారు: " యద్యదాచరతి శ్...

అమ్మవారి అనుగ్రహం లభించడం అంత సులభం కాదు - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏 " దుర్లభా " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 188 వ నామం . " దుర్లభా " అంటే పొందశక్యము కానిది అని అర్ధం చెప్పారు కాని సులభంగా పొందగలిగేవారు కాదు అమ్మవారు అని తెలుసుకోవాలి. సాధన కొంచెం ఎక్కువగా చేయవలసి ఉంటుంది. మూకశంకరులు వారి ఆర్యాశతకములో కామాక్షీదేవిని ఇలా ప్రార్థిస్తారు: " చింతితఫలపరిపోషణ   చింతామణిరేవ కాంచినిలయా మే,   చిరతరసుచరితసులభా     చిత్తం శిశిరయతు చిత్సుధాధారా "                     - ఆర్యాశతకం:3 అమ్మవారు కోరిన కోరికలు అన్నీ తీర్చే చింతామణిట‌. ఎప్పుడు అంటే " చిరతరసుచరిత " అన్నారు. అంటే చిరకాలము చక్కగా భక్తిగా సేవచేసుకుంటే అమ్మవారు సులభంగానే అనుగ్రహిస్తారు అని. ఆదిశంకరులు సౌందర్యలహరిలో అమ్మవారిని ఇలా ప్రార్థిస్తారు: " త్రయాణాం దేవానాం  త్రిగుణ..............    .........‌...ముకిళితకరో త్తంస మకుటాః " శంకరులు " నీ త్రిగుణాల చేత పుట్టిన త్రిమూర్తుల పూజ అంటే నీ పాదపూజే కదమ్మా. నువ్వు పాదాలు పెట్టుకునే రత్నపీఠం దగ్గరే కదా త్రిమూర్తులు చేతులు జోడించి శి...

భక్తులు తిట్టినా కొట్టినా ఆనందమే అమ్మవారికి - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏 " భక్తిమత్కల్పలతికా " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 353 వ నామం. " భక్తిమత్కల్పలతికా " అంటే భక్తిగలవారికి కల్పలత వంటిది. కల్పలత అంటే కల్పవృక్షం. ఇవ్వలేనిది లేదు.  తనను నమ్ముకున్న భక్తులంటే ఎంత ప్రేమ, అభిమానమో తల్లికి. వారి హృదయాలలో కొలవైయుండి వారు ఆనందానుభూతులలో తేలియాడడానికి అన్నివిధాలా తోడ్పాటునందిస్తూనే ఉంటుంది అమ్మవారు. పూజ్యులు గరికిపాటివారు ప్రవచనంచేస్తూ ఓ అద్భుతమయిన విషయం చెప్పారు ( వ్యాసభారతంలో ఉన్న విషయం ఇది ). ఆయనకు, విన్నవారికి కూడా కళ్ళు చెమ్మగిల్లాయి. పరమాత్మ రధం నడుపుతున్నారు కురుక్షేత్రంలో. అర్జునుడు రధంలో నుంచుని యుద్ధం చేస్తున్నాడు. ఒకరిని కొట్టడమో, నిరాయుధుడిని చేయడమో అయిన తరువాత రధాన్ని తిన్నగా పోనివ్వాలా, ఎడమకు తిప్పాలా, కుడికి పోనివ్వాలా ఎలా తెలుస్తుంది సారధికి. పరమాత్మ సారధి, కూర్చుని ఉన్నారు, ఎక్కువదూరం కనబడదు. అర్జునుడు నుంచుని ఉన్నాడు, దూరంగా చూడగలడు, ఎటువెడితే ఉపయోగమో తెలుసుకోగలడు. ఒక చేతిలో ధనుస్సు, రెండో చేతిలో బాణం. రణరంగంలో రణగొణధ్వనులు. ఇతను ఏమిచెప్పినా సారధికి వినబడనేవినబడదు. ఎటువేప...

అమ్మవారు తనను ఆశ్రయించిన భక్తులకు కీర్తిని ప్రసాదిస్తారు - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏 " యశస్వినీ " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 474 వ నామం . " యశస్వినీ " అంటే గొప్ప కీర్తిగలది అని భాష్యం చెప్పారు. కీర్తి ఎవరికి దక్కుతుంది. సమాజానికి ఉపయోగపడే అద్భుతమయిన పనులు చేసినవారికి. అమ్మవారికన్నా సమాజానికి ఉపయోగపడే అద్భుతమయిన పనులు చేసేవారు ఎవరు ఉంటారు.  జీవులందరికీ చక్కటి ఆహారం, రకరకాల పూలు పళ్ళు, మనస్సుకు ఆహ్లాదాన్ని కలిగించే సెలయేళ్ళు, కొండలు, తరించడానికి సాధనలకు అనుకూలమయిన ప్రశాంతమయిన ప్రదేశాలతో బాటు సుఖజీవనానికి కావలసిన ఏర్పాట్లు అన్నీ చేసారు అమ్మవారు. మనం ఆ ఏర్పాట్లను పాడుచేసుకోకుండా అమ్మవారికి సదా కృతజ్ఞులుగా ఉండాలి. ఆదిశంకరులు దేవీ అపరాధ క్షమాస్తోత్రం చేస్తూ ఇలా ప్రార్థిస్తారు: " చితాభస్మాలేపో గరళమశనం    దిక్పటధరో జటాధారీ కంఠే    భుజగపతిహారీ పశుపతిః   కపాలీ భూతేశో భజతి    జగదీశైక పదవీం భవానీ త్వత్పాణిగ్రహణ   పరిపాటీ ఫలమిదమ్ " " ఓ తల్లీ, చితాభస్మం వంటికి పూసుకునేవాడు, విషాన్ని ఆహారంగా సేవించేవాడు, దిక్కులను దుస్తులుగా ధరించేవాడు, జడలు కట్టిన జుట్టు గలవాడు, కంఠంలో పాములను ధరించేవాడు,...

అమ్మవారి కనురెప్పపాటులో సృష్టి లయం రెండూ జరిగిపోతున్నాయి - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏 "ఉన్మేషనిమిషోత్పన్నవిపన్నభువనావళిః " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 281 వ నామం. "ఉన్మేషనిమిషోత్పన్నవిపన్నభువనావళిః " అంటే అమ్మవారు కన్ను తెరవగానే సృష్టి, కన్ను మూయగానే లయం జరుగుతూంది అని భాష్యం చెప్పారు. రెప్పపాటులో సృష్టి, లయ రెండూ అయిపోతున్నాయి. రెప్పపాటు అన్నది ఒక వృత్తం, ఒక కార్యక్రమం. దీన్ని ఆవర్తనం అంటారు. మనకు తెలిసిన అతి చిన్న ఆవర్తనం రెప్పపాటు. ఇలాంటివే పగలు రాత్రి, శుక్ల పక్షం కృష్ణ పక్షం, ఉత్తరాయణం దక్షిణాయణం, ఉదయ కల్పం క్షయ కల్పం.  ఈ ఆవర్తనం శృతి అంటే వేద లక్షణము. లయ. సృష్టిలో లయను ఋషులు దర్శించారు. ఈ లయ లక్షణం తల్లిదండ్రుల వంటిది. జ్యోతిషం చంద్రుడు సూర్యులను తల్లిదండ్రులుగా భావిస్తుంది. సూర్యచంద్రులు అమ్మవారి కన్నులు. సూర్యచంద్రులు 15 రోజులకు ఒకసారి దగ్గరకు వస్తారు, మళ్ళీ 15 రోజులకు దూరంగా వెడుతూంటారు. దగ్గరకు వస్తే అమావాస్య, దూరంగా వెడితే పౌర్ణమి. భూమి సూర్యుని చుట్టూ తిరగడానికి 365 రోజులు పడుతుంది. ఈ మానవ సంవత్సర కాలంలో సూర్యుడు చంద్రుడు 12 సార్లు దగ్గరకు వచ్చి మళ్ళీ 12 సార్లు దూరంకు వెడతారు. ఇది ఒక...

గురు దత్తాత్రేయ జయంతి నేడు, శుభాకాంక్షలు - చీమలపాటి సూర్యనారాయణ

 🙏" శ్రీరస్తు శుభమస్తు "🙏 గురుదత్తాత్రేయ జయంతి నేడు. అత్రిమహర్షి అనసూయల పుత్రుడు ఈయన. అనసూయ మహాపతివ్రత. సీతారామలక్ష్మణులు దండకారణ్యం ప్రవేశించేముందు ఈవిడ ఆశీస్సులు తీసుకుంటారు. ఆయన పుట్టుకే ఓ అద్భుతం. త్రిమూర్తులు వారి భార్యలు కూర్చుని మాట్లాడుకుంటూంటే నారదుడు వస్తారు. మాటల్లో " మహాపతివ్రత " ఎవరూ అనే విషయం వస్తే నారదులు " అనసూయమ్మే " అనడంతో ముగ్గురమ్మలు బాధపడి, అలిగి, త్రిమూర్తులని " అది తప్పు " అని నిరూపించి రమ్మంటారు. త్రిమూర్తులు అనసూయను పరీక్షించడానికి వస్తారు. ఆమె సంతోషంతో భోజనంచెయ్యమని అడిగితే వారు దిగంబరంగా వడ్డిస్తే తింటామంటారు. దానికేముంది అని త్రిమూర్తులను చిన్నపిల్లలుగా చేసేసి తినిపిస్తుంది. త్రిమూర్తులు ముగ్ధులయి వరం కోరుకోమంటే వారిని తనకు కుమారులుగా జన్మించమంటుంది. బ్రహ్మ అంశతో చంద్రుడు, శివుని అంశతో దూర్వాసుడు జన్మించారు. విష్ణువు మిగతా ఇద్దరి అంశలు కలుపుకుని దత్తాత్రేయుడిగా జన్మించారు.  ఆయన భార్య అనఘాదేవి. అఘం అంటే పాపం. అనఘ అంటే పాపం అంటనిది/లేనిది. పరమపవిత్రురాలు. శ్రీలలితాసహస్రంలో ఒక అద్భుతనామం (987 వ నామం). త్రిమూర్తుల అంశవల్...

హనుమద్వ్రతం నేడు, శుభదినం - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీరస్తు శుభమస్తు"🙏 " అంజనా నందనం    వీరం జానకి శోకనాశనం,    కపీశమక్షహంతారం    వందే లంకా భయంకరం " " యత్రయత్ర రఘునాధకీర్తనం    తత్రతత్ర కృతమస్తకాంజలిం,    భాష్పవారి పరిపూర్ణలోచనం    మారుతిం నమత రాక్షసాంతకం "  మొదటి శ్లోకం లో సీత శోకాన్ని పోగొట్టిన అరివీరభయంకరుడు. రెండవ శ్లోకంలో తలవంచుకుని చేతులు కట్టుకుని కళ్ళనిండుగా నీళ్ళతో నుంచుని ఉన్న హనుమ. ఎక్కడ రామకీర్తన జరుగుతూన్నా హనుమ అక్కడ అలా నుంచుని ఉంటాడు. ఎంత తేడా. భక్తికి పరాకాష్ఠ. అందుకే " భక్తానాం అగ్రగణ్యం " అని కీర్తింపబడ్డాడు. లంకకు నిప్పుపెట్టేసాక హనుమ సముద్రపు ఒడ్డుకు చేరుకుంటాడు. అయ్యో ఎంతపని చేసాను, కోపం ఎంత చెడ్డది, మనిషి విచక్షణజ్ఞానాన్ని నశింపచేస్తుంది కదా, రావణుడిమీద కోపంతో అలా అంటించేయడమేమిటి, ఇప్పుడు సీతమ్మ పరిస్థితి ఏమిటి. ఆమె కూడా అగ్నికి ఆహుతి అవుతే రామలక్ష్మణులు సుగ్రీవుడు వానరవీరుల పరిస్థితి ఏమిటి, అందరూ ప్రాణాలు విడుస్తారు కదా " అని బాధపడతాడు. వెంటనే అనుకుంటాడు " నన్నే అగ్నిదేవుడు బాధపెట్టలేదు, ఇంక మహాసాధ్వి సీతమ్మని ఎలా బాధపెడతాడు " అని సర్దిచె...

అమ్మవారి అనుగ్రహం పొందడం అంత సులభం కాదు - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏 " దుర్గమా " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 189 వ నామం .  " దుర్గమా " అంటే తెలియశక్యము కానిది అని అర్ధం. అమ్మవారు మాయాప్రకృతి. మాయ అంటే తెలుసుకోలేనిది లేక ఊహించలేనిది అని అర్ధం. అమ్మవారి సృష్టిలోని వింతలు అర్ధం చేసుకోవడం అంత సులభమా. సృష్టిలోని కొన్ని జంతువులు, వృక్షాల గురించి నేటికీ మానవులకు తెలియదు. ఇంకా పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. కొన్ని చిన్న పనులు కూడా ఎంత ప్రయత్నించినా అవవు. ఆశ్చర్యం వేస్తుంది. అమ్మవారి ప్రణాళిక వేరుగా ఉంటుంది. అది అవడం వల్ల భవిష్యత్తులో బాధపడవలసి రావచ్చు. అందుకే అది అవకపోవడం. చాలా సందర్భాలలో మనం ఆ పని అప్పుడు అవకపోయినా బావుండును, ఈరోజు ఇలా బాధపడవలసి వచ్చేది కాదు అని అనుకోవడం కద్దు. ఆదిశంకరులు సౌందర్యలహరిలో అమ్మవారిని ఇలా ప్రార్థిస్తారు: " గిరా మాహు ర్దేవీం.............   ........ మహామాయా విశ్వం    భ్రమయసి పరబ్రహ్మ మహిషీ "  " ఓ బ్రహ్మస్వరూపిణీ, వేదాంతులు నిన్ను బ్రహ్మ భార్య వాణిగానూ, హరి భార్య లక్ష్మిగానూ, హరుని భార్య ఉమగానూ చెబుతున్నారు. నువ్వు ఆ ముగ్గురినీ అతిక్రమించిన దానవై ...

శ్రీగీతాజయంతి నేడు - శుభాకాంక్షలు - చీమలపాటి సూర్యనారాయణ

 🙏" శ్రీరస్తు శుభమస్తు "🙏 ఈ రోజు మార్గశిరశుక్లఏకాదశి. గీతా జయంతి. పరమాత్మ అద్భుతము, సాటిలేని గీతని లోకానికి/ప్రపంచానికి ప్రసాదించి అనుగ్రహించిన రోజు. " విభూతియోగం " లో తన విభూతులను తెలియచేస్తూ స్వామి " మాసానాం మార్గశీర్షో2హం ( 10:35 ) - మాసాల్లో మార్గశిరమాసాన్ని నేను " అన్నారు. అలాగే " మహర్షీణాం భృగురహం ( 10.25 ) - మహర్షుల్లో భృగువును నేను " అన్నారు. ఈ భృగువు ఎవరు?. ఈయన సప్తఋషుల్లో ఒకరు. బ్రహ్మ మానసపుత్రుడు. ఈయన " భృగుసంహిత " ని రచించారు. జ్యోతిషశాస్త్రానికి ఆద్యుడు. లక్ష్మీదేవిని కూతురుగా పొందారు. ఈయన కుమారుడే చ్యవనమహర్షి. మహాభారతంలోని శాంతిపర్వంలో భృగుమహర్షి-భరద్వాజమహర్షిల సంవాదం ఉంటుంది. దానిలో వృక్షాలగురించి విస్తృతంగా చర్చించి ఎంతో అద్భుత సమాచారాన్ని లోకానికి తెలియచేసారు. వృక్షాలకి ప్రాణం, స్పర్శ, స్పందనలు ఉంటాయని, దర్శనశక్తి, వినేశక్తి కూడా ఉంటాయని మనకు తెలియచేసారు. 5000 ల సంవత్సరాలక్రితం ఋషులు చెప్పిన ఈ విషయాలను మొన్న మన " జగదీష్ చంద్రబోస్ " గారు నిజమేనని నిరూపించి మన ఋషుల జ్ఞానాన్ని, మన సనాతనధర్మం గొప్పదనాన్ని ఇంకోసా...

అమ్మవారి కన్నులు విశాలం, ఎన్ని జీవులను కనిపెట్టుకుని ఉండాలి - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏 " విశాలాక్షీ " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 936 వ నామం. " విశాలాక్షీ " అంటే విశాలమయిన కన్నులు గలది అని అర్ధం. 84 లక్షల జీవరాశులను గమనించుకుంటూ ఉండాలంటే ఎంత పెద్ద కనులు ఉండాలి. ఆదిశంకరులు శ్రీలలితా పంచరత్న స్తోత్రం చేస్తూ అమ్మవారిని " ఆకర్ణదీర్ఘనయినీ " అని ప్రార్థించారు. చెవులదాకా సాగి ఉన్నాయిట అమ్మవారి కనులు. మూక శంకరులు కామాక్షీ అమ్మవారి కన్నుల ప్రభావాన్ని వర్ణిస్తూ 100 శ్లోకాలతో కీర్తించారు. అది కటాక్షశతకంగా ప్రసిద్ధి చెందింది. ఈ శ్లోకంలో ఇలా ప్రార్థించారు: " కల్లోలితేన కరుణారసవేల్లితేన    కల్మాషితేన కమనీయమృదుస్మితేన    మాముంచితేన తవ కించన     కించితేన కామాక్షి తేన శిశిరీకురు వీక్షితేన " అమ్మా కామాక్షీ నీ శరీరము ఒక కరుణాసముద్రము, కన్ను అందు తరంగమువలె ఉన్నది. అందు దయారసము పొంగుచున్నది. ఆ కన్ను కొంచెము వంగి పూజింపదగినదిగా తోచును. అందు అందమైన మందహాసము చిందులు త్రొక్కును. దానికి కాటుక దిద్దబడియున్నది. అట్టి నీ కంటి చూపుతో సంసారతప్తుడనయిన నన్ను చల్లబరచుము. కామాక్షీ అంటేనే కంటిచూపుతో కోరికలను తీర...

అమ్మవారి పాదాలను ఆశ్రయిస్తే మన కోరికలన్నిటినీ అమ్మవారే తీరుస్తారు - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏 " ప్రియంకరీ " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 731 వ నామం. " ప్రియంకరీ " అంటే భక్తులకు ఇష్టమును చేయునది. భక్తులంటే మహా ప్రేమ. భక్తులకు విపరీతమయిన కోరికలు ఉండవు. మాటలు సాత్వికంగా ఉంటాయి. మంచివారితో కలిసి తిరుగుతూ ఉంటారు. అటువంటి వారిని వెతుక్కుంటూ వెళ్లి మరీ అనుగ్రహిస్తారు అమ్మవారు. విష్ణుసహస్రనామస్తోత్రంలో " ప్రియకృత్ " అని ఒక నామం. దానికి శంకరులు " భక్తులు కోరిన కోరికలు తీర్చువారు " అని భాష్యం చెప్పారు. కంసుడు కృష్ణబలరాములను చంపించేయాలనుకుంటాడు. కంసుడు ఆజ్ఞాపించినట్లుగా అక్రూరుడు బృందావనం వెళ్ళి కృష్ణబలరాములను వెంటబెట్టుకొని మధురకి వస్తారు. మాకు కొంచెం పనులున్నాయని చెప్పి నగరం మొదట్లోనే రథం దిగిపోతారు కృష్ణబలరాములు.  కృష్ణుడు బలరాముడితో కలిసి ఓ ఇంటికి వెళ్ళి తలుపు తడతారు. ఒకతను తలుపుతీసి వీరిని చూసి దిగ్భ్రమ చెందుతాడు. నోట మాటరాలేదు. అలా ఉండిపోయాడు. అతని పేరు సుదాముడు - దామం అంటే దండ. పూలదండలు కట్టి మొదటి దండ కృష్ణుడికని ప్రక్కన పెట్టి మిగతావి అమ్ముకుని జీవిస్తూంటాడు. పరమ కృష్ణభక్తుడు. అంతవరకూ మ...

మన శరీరంలోని 72 వేల నాడుల కేంద్రం భృకుటి, అక్కడ బొట్టు పెట్టుకుంటే మంచిది - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏 " ఫాలస్థా " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 593 వ నామం . " ఫాలస్థా " అంటే ఫాలమందు/ నొసటియందు ఉన్నది అని అర్ధం. అమ్మవారు అక్కడ బిందురూపంలో ఉంటారు జీవులలో. భృకుటి దగ్గర మన శరీరంలోని 72 వేల నాడుల కూడలి ఉంటుంది. అదే ఆజ్ఞాచక్ర స్థానం. గీతలో శ్రీకృష్ణుడు యోగాభ్యాసం గురించి తెలియచేస్తూ దృష్టిని భృకుటిమీద కేంద్రీకరించమన్నారు (భ.గీత 6:13). సాష్టాంగ నమస్కారములో ఒక అంగం నుదురు/ఫాలభాగం. నుదుటిని నేలకు తగిలిస్తాం.  అందుకే అక్కడ బొట్టు పెట్టుకోమంది సనాతనధర్మం. నొసటిభాగం చాలా కళగా, చైతన్యవంతంగా ఉంటుంది. కళ తక్కువగా ఉన్న వారిని " ఏమయింది, అలా ఉన్నావు " అని అడుగుతూ ఉంటాం. తేలికగా తెలిసిపోతూంటుంది ఎదుటివారి మానసికస్థితి. నుదిటి మీద బొట్టు లేకపోతే ఏదో అశుచి కలిగినట్లు భావించి వారితో పరాచికాలు చేసేవారు కాదు పూర్వం. అంతటి అద్భుత సంస్కృతి మనది. ఆదిశంకరులు సౌందర్యలహరి చేస్తూ అమ్మవారిని ఇలా ప్రార్థిస్తారు: " లలాటం లావణ్యద్యుతి   విమల మాభాతి తవ    యద్ద్వితీయం తన్మన్యే      మకుట ఘటితం చంద్రశకలమ్,   విపర్యాసన్యాసా దుభయ హమపి...

శ్రీసుబ్రహ్మణ్య షష్టి శుభాకాంక్షలు - చీమలపాటి సూర్యనారాయణ

 🙏" శ్రీరస్తు శుభమస్తు "🙏  ఈరోజు పరమపవిత్రమయిన శ్రీసుబ్రహ్మణ్యషష్ఠి. స్వామి ఆరోగ్యప్రదాత, జ్ఞానప్రదాత, సంతానప్రదాత. తండ్రికే ప్రణవం గురించి బోధనచేసిన గురుగుహ. ఆశ్చర్యకరం ఏమిటంటే అష్టోత్తర శతనామావళి పూజ చేస్తూ స్వామిని " పార్వతీ ప్రియనందనాయనమః, గంగా సుతాయనమః " అని పూజిస్తాం. ఇద్దరికీ కుమారుడు. సుబ్రహ్మణ్యునికి నామకరణం చేయించడానికి ఏ మహర్షిని పిలుద్దామా అని ఆలోచన చేస్తూన్నప్పుడు విశ్వామిత్రమహర్షిని పిలిపించమని సుబ్రహ్మణ్యస్వామే చెప్పారుట. విశ్వామిత్రుడు ఆశ్చర్యపోయి " ఎందరో పెద్దలు ఉండగా నాకీ అవకాశం ఇచ్చారా స్వామి " అని అడిగారుట. స్వామి ఋషిని పెద్దవారిని చేయడానికి ఆ అవకాశం ఇచ్చి ఉంటారు. కాని విశ్వామిత్రుడు ఏ పేరు పెట్టారు స్వామికి అని పురాణాలలో ఎక్కడా లేదు అని తెలియచేసారు పూజ్యులు సామవేదంవారు. వ్యాసర్షి తన శిష్యుడు సూతుడికి చెప్పిన అద్భుత పురాణం " స్కాందపురాణం ". దీనికి పేరు స్కందునిది అయినా ఆయన గురించి తక్కువగానే ఉంటుంది. ఇది 18 పురాణాలలో అతి పెద్దది. దీనిలో 7 ఖండాలు ఉంటాయి. బ్రహ్మ విష్ణు మహేశ్వరుల ఖండాలద్వారా ముగ్గురూ సమానులని తెలియచేస్తూంది ఈపు...

కోరికలు ఎక్కువయితే కోపం పెరిగి ఆరోగ్యం చెడుతుంది - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏 " నిష్క్రోధా " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 168 వ నామం. " నిష్క్రోధా " అంటే క్రోధము లేనిది అని అర్థం. కోరిక కలిగి తీరకపోతే క్రోధం/కోపం కలగడం సహజం. అమ్మవారికి కోరిక ఏమి ఉంటుంది. అమ్మవారు పొందిందీ లేదు, పొందవలసినదీ ఏమీ లేదు. అందుకే ఆవిడకు క్రోధం ఉండదు. ఎదుటివారు మనకు నచ్చనట్లు ప్రవర్తిస్తే మనకు కోపం వస్తుంది. అమ్మవారికి అటువంటి భావన ఉండదు. మన కర్మఫలాలు మనమే అనుభవించాలి. మన ధర్మాధర్మాలకు అమ్మవారు సంతోషించరు, బాధపడరు. కోపానికి తావెక్కడ. పరమాత్మ గీతలో ఇలా తెలియచేసారు: " ధ్యాయతో విషయాన్ పుంసః       ‌  సంగస్తేషూపజాయతే,   సంగాత్ సంజాయతే కామః       కామాత్ క్రోధో2భిజాయతే "                 - భ.గీత 2:62 " విషయచింతన చేయు పురుషునకు ఆ విషయముల యందు ఆసక్తి ఏర్పడును.  ఆసక్తివలన ఆ విషయములను పొందుటకై కోరికలు కలుగును.  ఆ కోరికలు తీరనప్పుడు క్రోధము ఏర్పడును " అని.  ఏదో ఒకటి కావాలనిపిస్తుంది. తనకే స్వంతం అవాలనుకుంటాడు. ఇంకొకరికి ద్రక్కకూడదు అనుకుంటాడు....

ధర్మార్థకామాలే కాదు మోక్షం కూడా ఇస్తారు అమ్మవారు - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏 " ముక్తిదా " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 736 వ నామం.  " ముక్తిదా " అంటే ముక్తి నిచ్చేది అని. ముక్తి అంటే మోక్షం, జన్మరాహిత్యం. మళ్ళీ ఈ జననమరణ చక్రంలోకి రాకుండా ఉండడం. జ్ఞానం మోక్షాన్ని ఇస్తుందా అని సందేహం చాలామందికి. సౌరసంహిత " జ్ఞానం విద్వాంసుల విద్వత్తు పెంచుతుంది కాని మోక్షాన్ని కలిగించదు " అని తెలియచేస్తూంది. జ్ఞానం కర్మ/కార్యంతో సంపాదించుకునేది. మోక్షం ఆత్మానుభూతి.  కూర్మపురాణం ముక్తి పొందడానికి పార్వతీదేవిని ఆశ్రయించాలి అని తెలియచేస్తూంది. బ్రహ్మాండపురాణం శాస్త్రీయముగాకాని, అశాస్త్రీయముగాకాని అమ్మవారిని పూజించినవారు తిరిగి సంసారమును పొందరు అని తెలియచేస్తూంది. ముక్తి/మోక్షం గురించి విన్నా చదివినా మన మనస్సు భాగవతంలోకి ప్రవేశించాలి. శుకమహర్షి పరీక్షిత్తుమహారాజుకు ముక్తి కలగడానికి భాగవతసప్తాహం చేసారు. పరీక్షిత్తు అడుగుతాడు శుకమహర్షిని " బృందావనంలో ఎవరెవరికి ముక్తిని ప్రసాదించారు కృష్ణుడు " అని. గోపాలురకు, గోపికలకు, గోపబాలకులకు, గోవులకు, మట్టికి, చెట్లకు, ధూళికే కాదు బృందావనంలోని గడ్డిపరకలక...

అమ్మవారి చైతన్యం ఎంత చిన్న జీవిలోనైనా ఉంటుంది - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏 " సూక్ష్మరూపిణీ " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 467 వ నామం . " సూక్ష్మరూపిణీ " అంటే తెలియశక్యముకాని రూపముకలది. ఆశ్చర్యంగా ఉంటుంది. అమ్మవారు " సహస్రశీర్షవదనా సహస్రాక్షా సహస్రపాత్ " - విరాడ్రూపిణి. మరి సూక్ష్మరూపిణి ఏమిటి. చిన్న విత్తనం ప్రాతితే మర్రి మహావృక్షం అవుతూంది. అమ్మవారి అంశ/చైతన్యం చిన్న చిన్న కంటికి కనిపించని క్రిమికీటకాలలో కూడా ఉంటుంది. అంటే ఆ చైతన్యం ఎంత సూక్ష్మం అయిఉంటుంది. సృష్టి కార్యక్రమానికి, అవసరమయినప్పుడు అమ్మవారు సూక్ష్మరూపాన్ని ధరిస్తారు. ఈ సూక్ష్మరూపం గురించి విన్నప్పుడు మనకు హనుమ జ్ఞాపకానికి వస్తొరు. సీతమ్మ జాడ తెలుసుకోవడానికి లంకకు చేరుకుంటారు హనుమ. చీకటిపడే వరకూ ఆగి సూక్ష్మరూపంలో మెల్లిగా నగరప్రవేశానికి బయలుదేరుతారు. అప్పుడు హనుమ చిన్న " పిల్లిపిల్ల " లా ఉన్నారు అన్నారు వాల్మీకి.  " ఏయ్ ఆగు " అన్నారు ఎవరో. తల పైకెత్తి చూస్తే రాక్షసి లంఖిణి కనిపించింది. ఎక్కడికి పోతున్నావు అంటే హనుమ " అందరూ లంకానగరం అందంగా ఉంటుందని చెప్పుకుంటున్నారు. చూసి ఆనందించడానికి వెడ...

అమ్మవారికి ఇష్టమయినవారు, అయిష్టమయినవారు అని తేడా ఉండదు - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏 " నిష్పరిగ్రహా " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 183 వ నామం .  " నిష్పరిగ్రహా " అంటే పరిజనులు లేనిది అని భాష్యం చెప్పారు. అంటే బంధువులు కావలసినవారు లేరని. అమ్మవారికి ఇష్టులూ ఉండరు, అయిష్టులూ ఉండరు. కావలసినవారు, అక్కర్లేనివారు అనే తేడా ఉండదు అమ్మవారికి. అందరూ అమ్మవారి సృష్టియే, బిడ్డలే. త్రిగుణాల ప్రభావం వలన బంధాలు ఏర్పడతాయి. అమ్మవారు త్రిగుణాలకు అతీతులు, తురీయస్థితి. భాగవతంలో వ్యాసర్షి ఓ అద్భుత విషయం వ్రాసారు. రాసలీలకు ముందు " భగవానుడు అయినప్పటికీ ( అంటే తనవారు పరాయివారు అనే తేడాలేనప్పటికీ ) గోపికలను అనుగ్రహించడానికి నిశ్చయించారు " అని.  శ్రీసూక్తంలో " ఆపః సృజంతు స్నిగ్ధాని చిక్లీత వస మే గృహే " అని ప్రార్ధిస్తాం. నీరు, మంచి ఆహారం ఉత్పాదన చేస్తూ చిక్లీతుడు మా ఇంట్లో నివసించుగాక అని. చిక్లీతుడు లక్ష్మీదేవి కుమారుడు. బిడ్డ ఎక్కడుంటే తల్లి అక్కడ ఉంటుంది కనుక చిక్లీతుడు మన ఇంట్లో ఉంటే లక్ష్మీదేవి కూడా మన ఇంట్లోనే ఉండిపోతుందనే ఆశ తో అలా ప్రార్ధిస్తాం. కాని అమ్మవారికి బంధాలేమిటి?. మన అమాయకత్వం కాకపోతే....

మిగతా మతాలు మన సనాతనధర్మం కాలిగోటికి సరిపోవు అనుకోవచ్చా - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏 " నఖదీధితిసంఛన్న నమజ్జనతమోగుణా " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్య నామాలలో 44 వ నామం . " నఖదీధితిసంఛిన్న నమజ్జనతమోగుణా " అంటే కాలిగోళ్ళ కాంతులచే నమస్కరించువారి అజ్ఞానమును పోగొట్టునది అని భాష్యం చెప్పారు. అమ్మవారి కాలిగోర్లు చంద్రరేఖలలా ప్రకాశిస్తూ ఉంటాయిట. బ్రహ్మాది దేవతలు అమ్మవారి పాదాలకు నమస్కరించడం వలన వారి అజ్ఞానం తొలగుతుందని అర్ధం. దేవతల కిరీటాలలోని మణుల కాంతులు అమ్మవారి కాలిగోర్లలో ప్రతిఫలిస్తున్నాయి అని ఇంకో భాష్యం చెప్పారు. ఓసారి చంద్రుడికి సందేహం కలిగిందిట. అప్పుడు రామచంద్రుడు అన్నారు, ఇప్పుడు కృష్ణచంద్రుడు అంటున్నారు, నేను రామకృష్ణులకన్నా అందంగా ఉంటానా అని. గోకులం వెళ్ళి కృష్ణుడిని చూసి ఆయన అందానికి ముగ్ధుడయి సూర్యుడి ముందు దివిటీలా ఉన్నాను, నా అందం ఏపాటి అనుకుని బాధతో పది ముక్కలయాడుట. ఆ పది ముక్కలూ కృష్ణుడి పాదాల గోరులయి తరించాయిట.  శివమహిమా స్తోత్రంలో పుష్పదంతాచార్యులు ఇలా వ్రాసారు: " అసితగిరి సమం స్యాత్కజ్జలం     సింధుపాత్రే సురతరువరశాఖా    లేఖనీ పత్రముర్వీ,   లిఖతి యది గృహీత్వా   శారదా సర్వకాలం త...