Posts

Showing posts from April, 2024

పెరటి చెట్టు వైద్యానికి పనికిరాదు అని సామెత - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీరస్తు శుభమస్తు"🙏 వేదాలలోనూ ఉపనిషత్తులలోనే కాక పురాణాలలోనూ అద్భుత విజ్ఞానం ఉంది. కానీ అందరూ వీటిని చదివి అర్ధం చేసుకోవడం అంత సులభం కాదు. అందుకని వ్యాకరణం అవసరమయింది. సంస్కృతభాషకు వ్యాకరణం " అష్టాధ్యాయి " వ్రాసినది పాణిని. 4000 ల సూత్రాలు వ్రాసారు ఈయన. సూత్రం అయినా అర్ధం చేసుకోవడం కొంచెం కష్టం. అందుకని వీటికి " భాష్యం " వ్రాస్తారు ఒకరు, అందరికి సులువుగ అర్ధమవడానికి. భాష్యం అంటే వ్యాఖ్యానం. ఇంకా సులభంగా ఉండడానికి " వర్తీకం " వ్రాస్తారు. దీనిని " విపులవ్యాఖ్యానం " అంటారు. పాణిని సూత్రాలకు కాత్యాయనుడు ( 600-300 బిసి) వర్తీకం వ్రాసారు. ఆ వ్యాఖ్యానాన్నే ఇంతవరకూ అనుసరిస్తున్నారు. ఒక సమస్యకు ఒకటికన్నా ఎక్కువ పరిష్కారాలు ఉంటాయి. ఇదివరకు ఏదో ఒకటి అనుసరించేవారు. కాని పాణిని అలా 2 లేక ఎక్కువ పరిష్కారాలు ఉన్నప్పుడు చివరది తీసుకోవాలని ఒక చోట ( Panini's Metarule ) వ్రాసినట్లుగా తెలుస్తూంది. దీనివలన ఇంకా మెరుగైన ఫలితాలు వస్తాయి. సంస్కృత వాజ్మయం ఓ మహాసముద్రం. ఖగోళాన్ని కాచి వడపోసేసారు.  హనుమాన్ చాలీసాలో 18వ శ్లోకంలో " యుగ సహస్ర యోజన పరభ...

బిందువే మూలం దేనికయినా - చీమలపాటి సూర్యనారాయణ

 🙏" శ్రీరస్తు శుభమస్తు "🙏 " బైందవాసనా " - అమ్మవారి అద్భుతనామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 905వ నామం. " బైందవాసానా " అంటే బిందువులో ఆసీనురాలయి ఉంటుంది అని. కనుబొమలమధ్యభాగానికి కొద్దిగా పైన బిందురూపంలో ఉంటుంది అమ్మవారు. శ్రీచక్రంలో నవావరణాల మధ్యన బిందురూపంలో ఉంటుంది అమ్మవారు. ఇది అత్యద్భుతనామం. ఏదైనా బిందువు నుంచే మొదలవుతుంది. ప్రధమస్పందన బిందువే, అక్కడనుంచే అన్నీ వచ్చాయి. బిందువునుంచే కదా ఏరూపమయినా వచ్చేది. ఏబొమ్మ వెయ్యాలన్నా అన్నీ బిందుసమూహమే కదా.  ఒక బొమ్మ వేద్దామనుకుంటే ముందర ఒక బిందువు పెడతారు, దానినుంచే చిత్రమంతా వస్తుంది. జీవుల శరీరం కూడా బిందువునుంచే మొదలవుతుంది. బిందువుల సంఖ్య పెరిగి పెరిగి శరీరంగా తయారవుతుంది. చిన్నపిల్లవాడికి ఉన్న చర్మమే పెరిగే కొలదీ సాగుతూ వస్తుంది. కొత్తగా ఎక్కడనుంచీ రాదు. అదే చర్మం ఎంతో అద్భుతంగా పెరుగుతుంది, లోపమేమీ లేకుండా. ఎంత అద్భుత సృష్టి. ఏపదార్ధం తీసుకున్నా అది అతిసూక్ష్మపదార్ధాల సమూహమే కదా. ఆ సూక్ష్మపదార్ధమే అమ్మవారు/చైతన్యం " యచ్ఛాపి సర్వభూతానాం    బీజం తదహమర్జున "                ...

సరిగ్గా కనిపించడం లేదంటే దోషం కన్నుది - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీరస్తు శుభమస్తు"🙏 " దీపో నేత్రాతురస్యేవ    ప్రతికూలాతి మే దృఢం " రాముడు సీతమ్మతో అగ్నిప్రవేశానికి ముందర ఇలా అంటారు " కంటి రోగికి దీపంలాగ నువ్వు ప్రతికూలురాలవు " అని. కంటి రోగికి దీపం సరిగ్గా కనబడదు.‌ తప్పు ఎవరిది దీపందా?. కాదు కదా. అలాగే సీతమ్మ దీపం వంటిది, తప్పు ఆవిడిది కాదు. ఒకవేళ ఎవరయినా సీతమ్మ గురించి తప్పుగా మాట్లాడితే అలా మాట్లాడేవారిది తప్పు. రాజు ఎదుటివాడికి ఎప్పుడూ అలా మాట్లాడే అవకాశం ఇవ్వకూడదు. అందుకే ఈ పరీక్ష అంటారు.  ఎంతటి అద్భుత ఉపమానం. ఇప్పుడు జరుగుతూన్న విషయం చూద్దాం.‌ కొందరు కుహనా మేధావులు " సనాతనధర్మం విషతుల్యం. సమాజాన్ని పాడుచేస్తూంది. దాన్ని గొయ్యి తీసి భూమిలో ప్రాతిపెట్టాలి " అంటూ అవాకులు చవాకులు మాట్లాడుతూ ఉంటారు.  దీపం వంటి సనాతనధర్మంని కొందరు మానసిక రోగులు తప్పు పడితే దోషం ఎవరిది. సనాతనధర్మంని సరిగా అర్థం చేసుకోక/చేసుకోలేక, దాన్ని పాటించడం వలన కలిగే అత్యుత్తమ ఫలితాలు తెలుసుకోలేక కొందరు దానిని తప్పు పడితే నష్టం ఎవరికి. అటుకులరుచి ఎద్దుకు, పన్నీటి సువాసన పందికి తెలియదు అని సామెత. దోషం ఎవరిది. ఇటువంటి వారు ఎప్పుడూ ఉంటా...

మన ఆర్షవిజ్ఞానం అనంతం, అద్భుతం - చీమలపాటి సూర్యనారాయణ

 🙏" శ్రీరస్తు శుభమస్తు "🙏 " సహస్ర సూర్యతయా భాంతి " - వేదం  అంతరిక్షంలో వేలసూర్యులు ప్రకాశిస్తున్నారు " నో2దేతి నో2స్తమేతి "  - వేదం  సూర్యుడు అస్తమించడు, ఉదయించడు. " య ఆధ్రాయ చకమానాయ.. ........మర్దితారం న విందతే "             - వేదం ( భిక్షుసూక్తం ) " అన్నదాతగా ఉండి ఆహారం అవసరమైన బలహీనులకు సహాయార్ధం వచ్చే దీనులకూ పెట్టకుండాఎవరైతే తింటారో వారు కనీసం అనునయించేవారు కూడా లేక కష్టపడుతారు ". వేల సంవత్సరాల క్రితమే ఇటువంటి అద్భుత విజ్ఞానం, భూతదయ గురించిన విషయాలపై అవగాహన చూస్తేనే సనాతనధర్మం గొప్పదనం ఏమిటో తెలిసిపోతూంది. నిన్నటి వరకూ భూమి బల్లపరుపుగా ఉంది అని చెప్పిన మతాలు సనాతనధర్మం కన్నా గొప్పవి ఎలా అనుకోవాలి? ఆర్యభట్టు ప్రతిపాదించిన సూర్యసిద్ధాంతం భూమి తనచుట్టూ తిరగడం వంటి విషయాలను నిజమేనని చెప్పిన కోపర్నికస్ వంటివారు ఆవిషయాలను బహిరంగంగా చెప్పడానికీ కూడా సాహసించలేదు, మూఢనమ్మకాలకు బానిసలయిన మతాధికారులకు భయపడి. అటువంటివారు నేడు సనాతనధర్మం మూఢత్వం అంటున్నారు. అద్భుతమైన అంతరిక్ష విజ్ఞానం ని ప్రపంచానికి మొదట ఇచ్చినది సనాతనధర్మం. చదువుకోనివాడు...

కృష్ణపరమాత్మ శుభలక్షణములు ఏమి? - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీరస్తు శుభమస్తు"🙏  " సత్యం శౌచం దయా శాంతిః త్యాగస్సంతోషాద్యవం    శమోదమస్తపస్సౌమ్యం ఇతిక్షోపరతిశ్శృతం జ్ఞానం    విరక్తిరైశ్వర్యం శౌర్యం తేజో బలం స్మృతిః     స్వాతంత్ర్యం కౌశలం కాంతిః ధైర్యం        మార్దవమేవచ ప్రాగల్భ్యం ప్రశ్రయశ్శీలం     సహః ఓజో బలం భగః  గాంభీర్యం స్థైర్యమార్తిక్యం     కీర్తిర్మానోనహంకృతిః ఏతేచ అన్యే " ఇవి కృష్ణపరమాత్మ శుభలక్షణములు.  పరీక్షత్ మహారాజు జనరంజకంగా ధర్మపాలన చేస్తున్నారు. కలి ప్రభావం వలన అధర్మం పెరుగుతూంది. అన్యాయాన్ని, అధర్మాన్ని నిర్మూలించడం రాజు పని. అందుకని ఆయన సంచారం చేస్తూ అధర్మాన్ని నిగ్రహిస్తున్నారు.  ఓ ప్రదేశంలో ఓ గోవు ఏడుస్తూంటే ఓ వృషభం కుంటుతూ వచ్చి ఓదారుస్తూంది. ఎంత అద్భుత సన్నివేశం.  ఆ గోవు భూమి. ఆ వృషభం ధర్మం.  ధర్మం అడుగుతూంది " కలి ప్రవేశిస్తూందనా, దుష్టులు పాలకులవుతున్నారనా, రాబోయే చెడుదినాలను తలచుకునా, ప్రకృతి అంతా నిస్సారమవుతుందనా లేక నిన్నటివరకూ తిరుగాడిన కృష్ణపరమాత్మ తన పాదాన్ని నీపైనుంచి తీసేసినందుకా, దేనికని బాధ...

గోవిందా గోవిందా అనుకుంటే చాలా కలికాలంలో - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏 " గోవిందరూపిణీ " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 267వ నామం. ఈనామానికి " విష్ణుస్వరూపురాలు " అని భాష్యం చెప్పారు భాస్కరరాయలు. ఇద్దరికీ తేడా ఏముంది. ఆయన నారాయణ, అమ్మవారు నారాయణి.  గోవుకు ఉన్న నానార్ధాలలో భూమి ఒకటి. వరాహావతారంతో భూదేవిని వరాహమూర్తి రక్షించడం వలన స్వామికి గోవింద అనే నామం వచ్చిందని కూడా చెబుతారు పండితులు. విష్ణుసహస్రనామాలలో " గోవిందో గోవిదాంపతిః " అని పారాయణ చేస్తాం. శంకరులు ఈ నామానికి " గోవిందః అంటే గోవులను రక్షించువాడు " అని భాష్యం వ్రాసారు. కృష్ణుడు గోవర్ధనగిరిని ఎత్తి గోపాలకులను, గోవులను రక్షించినప్పుడు ఇంద్రుడు, కామధేనువు " గోవిందా " అని కీర్తించారు కృష్ణుడిని. శంకరులు ఓసారి కాశీలో ఉన్నప్పుడు ఓ వృద్ధుడు " వ్యాకరణ సూత్రాలు " వల్లెవేయడం చూసి ఆశ్చర్యపోయి " ఓ మందమతీ మరణానికి చేరువయిన నీకు మరణసమయంలో ఈ వ్యాకరణసూత్రాలు ముక్తిని ఇవ్వవు. గోవిందనామ స్మరణచేసుకుని తరించు " అని చెబుతూ అద్భుతమయిన జీవితార్ధాన్ని తెలియచేసే " భజగోవిందం ( మోహముద్గరం )" ని అ...

మన ఋషుల విద్వత్తు అనంతం - చీమలపాటి సూర్యనారాయణ

 🙏" శ్రీరస్తు శుభమస్తు "🙏 " ఋషివ్యవస్థ " అంటే పరమాత్మ ఇచ్చిన సందేశాన్ని/విజ్ఞానాన్ని లోకానికి అందించే ఏర్పాటు. మన ఋషులు ఏదిచేసినా ఏదిచెప్పినా లోకకళ్యాణాన్ని దృష్టిలో ఉంచుకునే.  అమెరికాలోని కొలరాడో విశ్వవిద్యాలయంలో జాన్ ఎం మాల్విలె ( John M Malville ) అనే కాస్మాలజీ ( కాస్మిక్ ఎనర్జీ ) ప్రొఫెసర్ ఉండేవారు. చాలా పరిశోధనలు చేసారు. ఒక స్నేహితుడు శ్రీనాధుడు వ్రాసిన " కాశీఖండం " గ్రంధాన్ని ఓసారి చదవమన్నారు ఈయన్ని. ఆ గ్రంధంలోని కాశీ చుట్టూ ఉన్న ద్వాదశాదిత్యుల గుడులగురించిన సమాచారాన్ని చదివి ఆశ్చర్యపోయారు ఈయన. అది నిజమా, అంతటి విజ్ఞానం సాధ్యమా, కల్పితమైనా అంత అద్భుతమా అని ఆలోచనచేసి ఉండలేక కాశీకి బయలుదేరారు. తన పరికరాలన్నింటినీ అంటే జిపిఎస్, కంపాస్,రాడార్లు తీసుకుని బనారస్ హిందూ విశ్వవిద్యాలయంలోని భారతీయ సాంస్కృతిక శాఖ ప్రొఫెసర్ అయిన " రాణా పిబి సింగ్ " ని కలిసారు. అమెరికా ఆయన చెప్పిన విషయాలు, వచ్చినపని విని సింగుగారు కూడా ఆశ్చర్యపోయి ఆయన ఉన్నంతవరకూ ఆయనతోనే ఉండి ఆయనకు అన్ని విధాలా తోడ్పాటును అందించారు. కాశీఖండంలో ఉన్న విషయాలు - కాశీకి చుట్టూ నిర్ణీతప్రదేశ...

శక్తికి మించిన పూజలు, పారాయణలు చేయనక్కరలేదు - చీమల పాటి సూర్యనారాయణ

 🙏"శ్రీరస్తు శుభమస్తు"🙏 " యావానర్థ ఉదపానే    సర్వతః సంప్లుతోదకే,   తావాన్సర్వేషు వేదేషు    బ్రాహ్మణస్య విజానతః "                     - భ.గీత 2:46  " ఒక చిన్న నీటి బావితో తీరే అన్ని ప్రయోజనాలు సహజంగానే ఒక పెద్ద నీటి కొలనుతో తీరుతాయి. అదే ప్రకారంగా, పరమ సత్యాన్ని ఎరిగి భగవత్ ప్రాప్తి నొందిన వ్యక్తి అన్ని వేదముల లక్ష్యాన్ని నెరవేర్చినట్టే " అన్నారు పరమాత్మ. ఎంత అద్భుత ఉపమానం. భగవంతుని పాదాలను ఆశ్రయిస్తే సమస్త జ్ఞానమూ అదే వస్తుంది అన్నారు పరమాత్మ. వేదములను నీటిబావితోనూ పరమాత్మ ఎరుకను నీటికొలనుతోనూ పోల్చారు పరమాత్మ. ఇంటి సమీపంలో చక్కటి మంచినీటి చెరువు ఉంటే మళ్ళీ ఇంట్లో బావి దేనికి?.  త్యాగయ్య అన్నమయ్య మొ.గువారి కీర్తనల సాహిత్యం చదువుతే ఆశ్చర్యం వేస్తుంది. కీర్తన సాధారణంగా కనిపిస్తుంది కాని అంతర్భావం చూస్తే ఇతిహాసాలలోని ఘట్టాలు, ఉపనిషత్తుల సారాంశం, అమ్మవారి ధ్యాననామాలు గోచరిస్తూంటాయి. వారు ఏ గురువుల వద్ద ఏ వేదాలు, ఉపనిషత్తులు చదివారో తెలియదు. త్యాగయ్య రామనామం 96 కోట్లు చేసారని తెలుస్తూంది. మరి ఆయన...

రాముడు రాక్షసులకు కూడా ఆనందం కలిగించడానికి అడవికి వెళ్ళారు - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీరస్తు శుభమస్తు"🙏 " అందాల రాముడు  ‌  ఎందువలన దేముడు " " రామప్రవ్రాజనం హ్యేతత్    సుఖోదర్కం భవిష్యతి,   దేవానాం, దానవానాం చ    ఋషీణాం భావితాత్మనాం "  భరద్వాజమహర్షి భరతుడుతో అంటారు " రాముడు బయలుదేరినది సుఖాలు ఇవ్వడంకోసం. దేవతలకు రాక్షసులకు ఋషులకు ధర్మాన్ని అనుసరించేవారికి సుఖం కలిగించడానికి బయలుదేరాడు " అని. రాముడుని ఎలాగయినా ఒప్పించి అయోధ్యకు తీసుకురావాలని భరతుడు అందరినీ వెంటపెట్టుకుని బయలుదేరుతాడు. రాముడు వెళ్ళిన మార్గంలోనే ప్రయాణిస్తూ భరద్వాజమహర్షి ఆశ్రమానికి చేరుకుంటాడు. ఆయన ఆతిధ్యం ఇస్తానంటే ఆగి మహర్షికి తనవారిని పరిచయం చేస్తాడు భరతుడు. కైకేయిని పరిచయం చేస్తూ " సకలగుణసంపన్నుడయిన రాముడి వనవాసానికి, అయోధ్య అనాధ అవడానికి ఈవిడే కారణం " అంటాడు. అప్పుడు మహర్షి " కైకేయిని తప్పుపట్టకు, ఆమె నిర్దోషి " అని చెప్పి రాముడు వనవాసానికి కారణం ఇది అని పై శ్లోకంలో చెబుతారు.  ఇదే విషయాన్ని శ్రీరాముడు లక్ష్మణుడుతో అంటారు " కైకేయమ్మను ఎప్పుడూ తప్పు పట్టకు, ఆవిడ చేసిన పని వెనుక విధిప్రేరణ ఉంది " అని. విశ్వామిత్రుడు యజ్ఞరక్షణకోస...

ఇంద్రియనిగ్రహం ఇచ్చే హనుమజ్జయంతి నేడు - చీమలపాటి సూర్యనారాయణ

 🙏" శ్రీరస్తు శుభమస్తు "🙏  " అంజనా నందనం    వీరం జానకి శోకనాశనం,    కపీశమక్షహంతారం    వందే లంకా భయంకరం ". " యత్రయత్ర రఘునాధకీర్తనం    తత్రతత్ర కృతమస్తకాంజలిం,    భాష్పవారి పరిపూర్ణలోచనం    మారుతిం నమత  రాక్షసాంతకం "  మొదటి శ్లోకం లో సీత శోకాన్ని పోగొట్టిన అరివీరభయంకరుడు. రెండవ శ్లోకంలో తలవంచుకుని చేతులు కట్టుకుని కళ్ళనిండుగా నీళ్ళతో నుంచుని ఉన్న హనుమ. ఎక్కడ రామకీర్తన జరుగుతూన్నా హనుమ అక్కడ అలా నుంచుని ఉంటాడు. ఎంత తేడా. భక్తికి పరాకాష్ఠ. అందుకే " భక్తానాం అగ్రగణ్యం " అని కీర్తింపబడ్డాడు. లంకకు నిప్పుపెట్టేసాక హనుమ సముద్రపు ఒడ్డుకు చేరుకుంటాడు. అయ్యో ఎంతపని చేసాను, కోపం ఎంత చెడ్డది, మనిషి విచక్షణజ్ఞానాన్ని నశింపచేస్తుంది కదా, రావణుడిమీద కోపంతో అలా అంటించేయడమేమిటి, ఇప్పుడు సీతమ్మ పరిస్థితి ఏమిటి. ఆమె కూడా అగ్నికి ఆహుతి అవుతే రామలక్ష్మణులు సుగ్రీవుడు వానరవీరుల పరిస్థితి ఏమిటి, అందరూ ప్రాణాలు విడుస్తారు కదా " అని బాధపడతాడు. తనకి మరణమే శరణ్యం అనుకుంటాడు ఒక్కక్షణం. వెంటనే అనుకుంటాడు " నన్నే అగ్నిదేవుడు బాధపెట్టలే...

రాముడు లేని అయోధ్య అడవి, ఉన్న అడవి అయోధ్య - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీరస్తు శుభమస్తు"🙏 " అందాల రాముడు  ‌  ఎందువలన దేముడు " " న హి తద్భవితా రాష్ట్రం    యత్ర రామో న భూపతిః,    తద్వనం భవితా రాష్ట్రం    యత్ర రామో నివత్స్యతి " " రాముడు లేని అయోధ్య అడవి, రాముడు ఉన్న అడవే అయోధ్య " అంటారు వశిష్టులు కైకేయితో. వశిష్టమహర్షి కైకేయితో " సీత నారచీర కట్టదు, రాజ్యాన్ని పాలిస్తుంది. ఒకవేళ అడవికి వెళ్ళినా పట్టుచీర ధరించి, ఆభరణాలు పెట్టుకునే వెడుతుంది " అన్నాక ఊరుకోలేదు.  రాముడు ఎక్కడ ఉంటే అదే అయోధ్య అని చెబుతూ " కైకేయీ - భరతుడు ఇక్కడలేడు కనుక నీ కోరిక తీర్చుకున్నావు. కాని భరతుడు రాజ్యాన్ని పాలిస్తాడనుకున్నావా. ప్రజలే కాదు పశుపక్ష్యాదులు కూడా రాముడి వెంట వెళ్ళిపోతాయి. కదలలేని చెట్లు, వాటి కొమ్మలు రాముడు వెళ్ళినవేపు సాగి మమ్మల్ని కదలలేని వాటినిగా ఎందుకు పుట్టించావు భగవంతుడా అని విలపిస్తూ ప్రాణాలు కోల్పోతాయి. అప్పుడు శ్మశానమయిన అయోధ్యలో నువ్వు, నీ కోడుకే ఉంటారు " అంటారు. బ్రహ్మర్షి నోటివెంట వచ్చిన మాటలు అలాగే నిజమయాయి. భరతుడు రాజ్యం వద్దన్నాడు. అడవికి వెళ్ళి రాముడి కాళ్ళపైపడి అయోధ్యకు తిరిగి రమ్మని వేడుకున్...

రామాయణం ఎందుకు అంత అద్భుత గ్రంధం అయింది - చీమలపాటి సూర్యనారాయణ

 🙏 " శ్రీరస్తు శుభమస్తు"🙏 " అందాల రాముడు   ఎందువలన దేముడు " చిన్నప్పటినుంచే ఉత్కృష్టమయిన రామాయణ, మహాభారతాలను పాఠశాలల్లో చదివిస్తే ధార్మికజీవనం అలవాటవుతుంది పిల్లలకి. అది జరగకుండా చేసారు అందరూ కలిసి. ఒకావిడేమో " రామాయణ విషవృక్షం " అని వ్రాసుకొచ్చింది. కొందరేమో రాముడికి ఇక్కడ పనేమిటి, వచ్చి మరీ ఇక్కడి జనాలని చంపడమేమిటి అని వాదన. 24వేల శ్లోకాల రామాయణంలో, 100700 శ్లోకాల భారతంలో ఉన్న అద్భుత విజ్ఞానాన్ని, సంస్కృతిని మాత్రం ఎవరికీ తెలియకుండా అన్ని కుప్రయత్నాలు చేసారు/చేస్తున్నారు. భరతుడు వచ్చి వెళ్ళాక ఆ జ్ఞాపకాలనుంచి జనాలతాకిడినుంచి తప్పించుకోవడానికని అక్కడనుంచి అత్రిముని ఆశ్రమానికి అక్కడనుంచి శరభంగముని, సుతీక్షణముని ఆశ్రమాలకి వెడతారు సీతారామలక్ష్మణులు. మునులందరూ తమ తపశ్శక్తి ధారపోస్తాం, రాక్షసులు బాధపెడుతున్నారు, రక్షించమని కోరతారు. " మాశక్తులు మేము సంపాదించుకునేలా ఆశీర్వదించండి చాలు. రాక్షసుల విషయం మేము చూసుకుంటాం " అంటాడు రాముడు. అక్కడనుంచి వీరు బయలుదేరి వెడుతూంటే సీతమ్మతల్లి అంటుంది రాముడితో - " ఎంత జాగ్రత్తగా ఉన్నా అధర్మం ఏదో ఒక సందుచూసుకుని...

శ్రీరామ నవమి, శ్రీరాముని పుట్టిన రోజు నేడు, శుభాకాంక్షలు అందరికీ - చీమలపాటి సూర్యనారాయణ

 🙏" శ్రీరస్తు శుభమస్తు"🙏 " అందాలరాముడు,    ఎందువలన దేముడు "  రాముడు ఎందుకు దేవుడయాడు. రాక్షసుడి చేతకూడా " రామో విగ్రహవాన్ ధర్మః " అని ఎందుకు కీర్తింపబడ్డాడు. చాలామంది అంటూంటారు " రాముడు తండ్రిమాట జవదాటడు " అని. కాని అది సరికాదు, ఆయన ధర్మానికే కట్టుబడ్డాడు. అరణ్యవాసానికి బయలుదేరుతూ తల్లి కౌసల్య దగ్గరకు వెళ్ళి ఆమె పాదాలకు నమస్కరించి అనుమతి కోరుతాడు. ఆవిడ అంటుంది - తండ్రిమాటకు కట్టుబడి అడవికి వెడుతున్నావు బావుంది కాని తల్లిమాటకు కూడా నువ్వు అదే విలువనివ్వాలి కదా. నేను కోరుతున్నాను " అడవికి వెళ్ళకు, రాజ్యాన్ని స్వీకరించు " అని. రాముడు అంటాడు " అమ్మా నేను తండ్రి మాటకోసం అడవికి వెళ్ళటం లేదు. తండ్రి ఒకరికి మాట ఇచ్చారు, నేను అడవికి వెళ్ళకపోతే ఆయనకు అసత్యదోషం అంటుకుంది. అసత్యదోషం చాలా భయంకరమైనది. మహర్షులుకూడా ఒక్క చిన్న అసత్యమాడితే వారి తేజస్సు హరించుకుపోతుంది. అందుకే ఋషులు తెలిసో తెలియకో ఎప్పుడయినా అసత్యమాడి ఉండవచ్చు అని తలచి ఆ అసత్యదోషనివారణ కోసం సరస్వతీవ్రతం, ' సారస్వతేష్టి ' యజ్ఞం చేస్తారు. మరి నాతండ్రికి అసత్యదోషం కలగకుండా చూ...

అప్రియమయినా మంచిచేసే సలహాలనే ఇస్తూ ఉండాలి - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీరస్తు శుభమస్తు"🙏 " అందాల రాముడు  ‌  ఎందువలన దేముడు " " సులభాః పురుషారాజన్   సతతం ప్రియవాదినః   అప్రియస్య ప్రత్యస్య    వక్తా శ్రోతాచ దుర్లభాః " " రాజా - తీపిమాటలు చెప్పేవారే సులభంగా దొరుకుతారు కాని అప్రియమయినా మంచిమాట చెప్పేవారు దొరకడం కష్టమే " - ఈ మాటలు అన్నది మారీచుడు రావణుడితో. " తపస్సులోగాని బలంలోగాని సంపదలోగాని విక్రమంలోగాని తేజస్సులోగాని కీర్తిలోగాని నాతో సరితూగుతాడా రాముడు " అంటాడు రావణుడు సీతతో అశోకవనంలో హనుమ చెట్టుపై నుంచి చూస్తూన్నప్పుడు. మరి అటువంటి తపశ్శాలి " కపటసన్యాసి " వేషంలో ఎందుకు వెళ్ళి సీతమ్మను అపహరించడం. రాముడు 14000 మంది ఖరదూషణాది రాక్షసులను 3 ఘడియలలో ( 72 ని.లలో ) సంహరించడం చూసిన అకంపనుడు అనే రావణదూత లంకనుచేరి రావణుడికి విషయం తెలియచేస్తాడు. " వెంటనే వెళ్ళి రాముడిని చంపేస్తాను " అని రావణుడు అంటే అకంపనుడు అంటాడు " అది అంత సులభం కాదు. అతను ధర్మమూర్తి ( అంటే మనం ధర్మపరులం కాదు, పాపులం కదా అని ), విశ్వంలోని గ్రహామండలాలను కల్లోలపరచగలడు, సముద్రాలను ఇంకింపచేయగలడు. అంతెందుకు రాముడు సర్వసృష్ట...

సమస్య మన శక్తికి మించినది అయినప్పుడు దేవుడిని శరణాగతి అనడమే - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీరస్తు శుభమస్తు"🙏 " అందాల రాముడు  ‌  ఎందువలన దేముడు " " సకృదేవ ప్రపన్నాయ   తవాస్మీతి చ యాచతే   అభయం సర్వభూతేభ్యో   దదామి ఏతత్ వ్రతం మమ " " ప్రపన్నాయ " అంటే శరణాగతి. " తవాస్మీతి " అంటే నీవాడను. విభీషణుడు రావణుడిని విడిచిపెట్టి రాముడి చెంతకు రాగానే " రా నాయనా " అనలేదు రాముడు. వానరవీరులందరినీ సంప్రదించారు ఏమి చేద్దాం అని. సుగ్రీవుడితో సహా అందరూ " అతను శతృవు తమ్ముడు, యుద్ధానికి ముందు వచ్చాడు, మోసమేదయినా ఉండవచ్చు. దరిచేరనీయడం మంచిదికాదు. వద్దు " అన్నారు. అప్పుడు హనుమను కూడా అడుగుతారు రాముడు. " ఈ విభీషణుడిని నేను ఇదివరకే రావణసభలో చూసాను. ఇతని మాటలను కూడా విన్నాను. ఇతని ముఖంలో కాని మాటలలో కాని నాకు కపటం ఏమీ కనబడలేదు. ఒకవేళ కపటంతోనే వచ్చి ఉన్నా మనమేమీ చాతకాని వారం కాదు కదా " అంటారు హనుమ. అప్పుడు రాముడు పై శ్లోకం ద్వారా తన అభిప్రాయాన్ని చెబుతారు. శరణాగతి అంటూ నేను నీవాడను అని నన్ను కోరినవారిని అక్కున చేర్చుకోవడం నా ఏకైక వ్రతం " అని చెబుతారు రాముడు. విభీషణుడే కాదు, రావణుడు వచ్చి శరణాగతి అన్నా అక్కున చేర్...

మాట మృదువుగా మధురంగా ఉండాలి - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏 " కలాలాపా " - అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 328వ నామం.  " కలాలాపా " అంటే " మధురమయిన భాషణములు చేయునది " అని. అంటే అమ్మవారి మాటలు అతిమధురంగా ఉంటాయని. శ్రీలలితా అష్టోత్తరశతనామావళి పూజలో అమ్మవారిని " శ్రీకలభాషిణ్యైనమః అని పూజిస్తాం. శంకరాచార్య విరచితమైన సౌందర్యలహరి లో ఓ అద్భుతమైన శ్లోకం : " విపంచ్యా గాయంతీ వివిధ మపదానం పశుపతేః,    త్వయారబ్దే వక్తుం చలిత శిరసా సాధువచనే |    తదీయై ర్మాధుర్యై రవలపిత తంత్రీ కలరవాం ,    నిజాంవీణాం వాణీ  నిచుళయతి చోళేన నిభృతం ||"  మణిద్వీపం లో సింహాసనం మీద అమ్మవారు కూర్చుని ఉన్నారు - దేవతలందరూ కొలువుదీరి ఉన్నారు. చదువుల తల్లి సరస్వతి ఆ పరమేశ్వరుణ్ణి పొగుడుతూ అద్భుతంగా వీణావాదన చేస్తూంది - అమ్మవారు బుద్ధిపూర్వకంగానో అప్రయత్నంగానో " ఆహా ఓహో " అంటూందిట. ఆవిడ మాటలు ఎంత మధురాతి మధురం గా ఉన్నాయంటే శ్రీవాణి తన వీణానాదాన్ని ఆపేసి వీణ మీద తన చీర కొంగు కప్పేసిందిట.( దేవతలు ఎవరూ తన వీణావాదనం వినటం లేదని , అమ్మవారి మధురమైన పలుకులనే వింటున్నారని భావం ). అంటే దేవతలందరూ...

సగుణ నిర్గుణ రూపం అమ్మవారిది - చీమలపాటి సూర్యనారాయణ

 🙏" శ్రీమాత్రేనమః "🙏 " దక్షిణామూర్తిరూపిణీ, సనకాది సమారాధ్యా " - అమ్మవారి అద్భుతనామాలు. శ్రీలలితాసహస్రరహస్యనామాల్లో 725, 726 నామాలు. దక్షిణామూర్తి ని ఆదిగురువుగా పూజిస్తాం. మరి మళ్ళీ అమ్మవారి నామం " దక్షిణామూర్తిరూపిణీ " ఏమిటీ అని ఆశ్చర్యం కలుగుతుంది. దక్షిణ + అమూర్తి అంటే సగుణం+నిర్గుణం. రెండూ కలిసిన స్వరూపం. జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు భక్తితో సేవిస్తే. స్వామి, అమ్మవారు వేరుకాదు, అర్ధనారీశ్వర రూపం. దక్షిణామూర్తి రూపిణిగా జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. దక్షిణామూర్తి రూపం శివశక్తి స్వరూపం, కుడిచెవికి మకరకుండలం ( మగవారు ధరించేది ), ఎడమచెవికి తాటంకం ( ఆడువారు ధరించేది ) ఉంటాయి జాగ్రత్తగా గమనిస్తే.  " సనకాది సమారాధ్యా " ఇంకొక అద్భుతనామం. సనకాదులచే సంపూర్ణంగా ఆరాధించబడినది అని అర్ధం. అమ్మవారి నామాల్లో స్మరింపబడుతున్నారంటేనే తెలుస్తూంది వీరి గొప్పదనం. వారు నలుగురు పిల్లలు - సనక, సనాతన, సనందన, సనత్కుమారులు. ఇప్పుడు మనం " బాలమేధావులు " అంటూంటాం. ఈపదానికి ఆద్యులు వీరు. 4వ ఏటే అన్నివేదాలు చదువుకున్నవారు. బ్రహ్మ సృష్టికోసం వీరిని పుట్టిస్తే వీరు ఆధ్యా...

భౌతిక సుఖాలను అతిగా ఇష్టపడకూడదు - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏 " బహిర్ముఖసుదుర్లభా " - అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 871వ నామం. " బహిర్ముఖసుదుర్లభా " అంటే విషయములందు ఆసక్తి కలవారికి అమ్మవారు దుర్లభురాలు. విషయములు అంటే బాహ్య/ప్రాపంచిక విషయాలు. నామంలో దుర్లభా అంటే చాలు కదా. సుదుర్లభా అనడం దేనికి?. అంటే అట్టి విషయాసక్తి ఉన్నవారికి ఎట్టిపరిస్థితుల్లోనూ అమ్మవారి అనుగ్రహం లభించదు అని. అలా విషయాల పట్ల ఆసక్తులవడం జీవుల తప్పు కాదు. అవి అంత ఆకర్షణీయంగా, మాయచేస్తూ ఉంటాయి.  ఇదే విషయాన్ని పరమాత్మ గీతలో చెబుతారు: " భోగైశ్వర్యప్రసక్తానాం    తయాపహృతచేతసామ్ ।   వ్యవసాయాత్మికా బుద్ధిః    సమాధౌ న విధీయతే "                 - భ.గీత 2:44 " ప్రాపంచిక భోగాలు, సుఖాలు, లౌకిక సంపదల పట్ల ఆకర్షితులయినవారి మనస్సులో భగవంతుని పట్ల భక్తిభావం కలుగనే కలుగదు " అంటారు పరమాత్మ. గరుడపురాణంలో ఓ అద్భుత శ్లోకం ఉంది: " చక్రధరో2పి సురత్వం    సురత్వలాభే      సకలసురపతిత్వం    భవతిరుం     సురపతిరూర్ధ్వగతిత్వం    తథాపి ...

ప్రాపంచిక విషయాలపై ఆసక్తి తగ్గించుకోవాలి, అంతర్ముఖులవాలి, ముక్తి కోసం - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏 " అంతర్ముఖసమారాధ్యా " - అమ్మవారి అద్భుతనామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 870వ నామం. " అంతర్ముఖసమారాధ్యా "అంటే అంతర్ముఖులచే ఆరాధింపదగినది అని. సమారాధన అంటే శాస్త్రయుక్తంగా ఆరాధించడం. శాస్త్రయుక్తంగా శ్రద్ధగా " రాజశ్యామలయాగం " చేస్తే చక్రవర్తిని చేస్తుంది అమ్మవారు అని చెబుతూంది వేదం. కాని నేడు అశాశ్వతమయిన చిన్న చిన్న పదవులకోసం ఆర్భాటంగా ఈ యాగం చేసేస్తున్నారు అందరూ. ఈ విషయమే గీతలో పరమాత్మ తెలియచేసారు:  " యామిమాం పుష్పితాం    వాచం ప్రవదన్త్యవిపశ్చితః,   వేదవాదరతాః పార్థ    నాన్యదస్తీతి వాదినః "              -  భ.గీత 2:42 " పరిమితమైన అవగాహన కలవారు, స్వర్గలోక ప్రాప్తి కోసం, డాంభికమైన కర్మకాండలను ప్రతిపాదించే వేదాల్లో చెప్పబడిన సమ్మోహపరచే మాటలకు ఆకర్షితులవుతారు " అన్నారు పరమాత్మ. కఠోపనిషత్తు ఏమి చెబుతూందంటే " అమ్మవారు బ్రొటకనవేలు ప్రమాణంలో అందరి హృదయాలలోనూ ఉంటారు " అని. ఎందుకు మనలోనే ఉండడం అంటే ఎప్పటికయినా సత్యం తెలుసుకుని లోపలికి ప్రయాణం ప్రారంభించి అంతర్ముఖులు అవుతారు అని. ఎక్కడో దూరంగా ఉంటే బద...

మనం మనలా ఉండేలా సాధనచేస్తూ ఉండాలి - చీమలపాటి సూర్యనారాయణ

🙏"శ్రీమాత్రేనమః"🙏 " స్వస్థా " - అమ్మవారి అద్భుతనామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 914 వ నామం. " స్వస్తి " అంటే క్షేమం/శుభం అన్నారు కాని అసలు అర్ధం చూద్దాం. " స్వస్థా" అన్నది అమ్మవారి ఒక నామం. స్వ+స్థ = తను + ఉండడం. అంటే తను తనుగా ఉండడం. ఎవరైనా సరిగ్గాలేరనిపిస్తే " ఏం అలా ఉన్నావు " అంటాం. అతను ఒంట్లో బావుండలేదనో, మనస్సు బావుండలేదనో అంటారు.  అంటే శరీరం కాని మనస్సు కాని సరిగ్గా లేకపోతే తను తనుగా ఉండడు/ఉండలేడు. అటువంటి స్థితిలోనే చెడు ఆలోచనలు కలగడం చెడుపనులు చేయడం జరుగుతుంది. జీవుడు పతనమవుతాడు. అమ్మవారు ఈ రెండూ సరిగ్గా ఉండేలా అనుగ్రహిస్తారు. అంటే క్షేమాన్ని యోగాన్ని కలిగిస్తారు. " స్వస్థా " అంటే మంగళకరమైన ఉత్తర గతులను కలిగించునది అని ఒక భాష్యం చెప్పారు భాస్కరరాయలవారు. అమ్మవారు తనను నమ్ముకున్నవారిని " ఉన్నస్థితినుంచి ఉన్నతస్థితికి తీసుకుని వెడుతారు. అది జీవుడు తను తనుగా ఉన్నప్పుడే సాధ్యం. ఆత్మన్యూనత ( నిరాశ ) తో దిగజారిపోయినప్పుడు కుదరదు. ఆ స్వస్థతను అమ్మవారు కలిగిస్తారు. " అనిర్వేదశ్శ్రేయోమూలం   అనిర్వేదః పరంసుఖం   అ...

అజ్ఞానం వదిలించుకునే ప్రయత్నం చేస్తూండాలి - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏 " తమో2పహా " - అమ్మవారి ఒక అత్యద్భుతనామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 361వ నామం.  " తమః + అపహా " అంటే అజ్ఞానంని పోగొట్టునది. ఇంతకీ అజ్ఞానం అంటే ఏమిటి?.  తను ఎవరో అది తాను కాదనుకోవడం, తను ఏది కాదో అది తను అనుకోవడమే అజ్ఞానం. ఈ శరీరమే శాశ్వతం అనుకోవడం, దాని కోసమే జీవితాంతం పాటుపడడం. తనకోసమే కాకుండా తరువాత తరాలకు కూడా అశాశ్వతమైన సంపదలు కూడబెట్టడం. వాటికోసం చేయకూడని పనులన్నీ చేయడం. చేయవలసిన పనులు చేయకపోవడం, చేయకూడని పనులు చేయడం. సమస్యలలో కూరుకుపోవడం. జీవితాన్ని దుఃఖదాయకం చేసుకోవడం. " తస్మాదజ్ఞానసంభూతం    హృత్స్థం జ్ఞానసినాత్మన: |   ఛిత్త్వాయినం సందేహం    యోగమాతిష్ఠోత్తిష్ఠ భారత "                   ‌‌- భ.గీత 4:42 " కాబట్టి, జ్ఞాన ఖడ్గంతో హృదయంలో తలెత్తిన సందేహాలను ఛేదించు . ఓ భారతా కర్మయోగంలో స్థిరపడి, యుద్ధము చేయుటకు లే " అన్నారు పరమాత్మ అర్జునుడితో. ఏది చేయాలో అది చెయ్యి. సందేహించకు అన్నారు. ఆశ్చర్యం ఏమిటంటే అప్పుడప్పుడు కొన్ని సత్యాలు అనుకోకుండా బయటకు వచ్చేస్తూంటాయి. కొందరు నాయక...

తాపత్రయాలు తగ్గించుకోవాలి - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏 "తాపత్రయాగ్నిసంతప్తసమాహ్లాదనచంద్రిక" - అమ్మవారి ఒక అత్యద్భుతనామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 357 వ నామం. ఈ నామార్ధం " తాపత్రయముగల సంసారాగ్నిచే సంతప్తులగువారికి వెన్నెలవలె హాయినిచ్చునది " అని అర్ధం. సంసారం అనేది ఒక వల. ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది. ఎంత మహామహులయినా మాయకు లోనవుతూంటారు. వ్యాసర్షి కూడా ఓ ఫుత్రుడిని పొందుతే మంచిదనుకున్నారు. శుక జననం జరిగింది. అంత ఆకర్షణీయంగా ఉంటుంది సంసారసాగరం. సంసారాగ్ని - సంసారం ఒక అగ్ని - జాగ్రత్తగా లేకపోతే కాలుస్తుంది అనే ఎరుకలో ఉండాలి ఎప్పుడూ. అది అంత సులభం కాదు. " ఎందుకొచ్చిన తాపత్రయం, వదిలేయ్ " అనడం తరచూ వింటూంటాం.  ప్రతీ జీవుడు 3 రకాల తాపాలతో బాధపడుతూ ఉంటాడు. వీటిని " తాపత్రయాలు " అంటారు. అవి: 1. ఆధ్యాత్మికతాపం - ఇది స్వయంకృతం. శరీరానికి సంబంధించినవి. సమస్యలకూ, రోగాలూ అవీను. మనకు మనంగా కొని తెచ్చుకునేవి కూడా ఉంటాయి. 2. ఆధిభౌతికతాపం - ఇది ఇతర జీవుల ( మనుషులు, జంతువులు ) వల్ల కలిగే బాధలు. కొట్లాటలు అవీ కూడాను. కొంతవరకూ స్వయంకృతం. 3. ఆధిదైవికతాపం - ఇది జీవులచేతుల్లో లేనిది. సునామీలు,...

చైత్ర శుద్ధ పాడ్యమే సంవత్సరాది ఎలా అయింది? - చీమలపాటి సూర్యనారాయణ

 🙏" శ్రీరస్తు శుభమస్తు "🙏 నేడు ఉగాది. శ్రీ క్రోధి నామసంవత్సరం ప్రారంభం. క్రోధి అంటే క్రోధమును కలవాడు. అంటే కోపమును కలిగించేది అని కూడా అర్ధం చెప్పుకోవచ్చు. కొంచెం జాగరూకతతో ఉండాలి ఈ సంవత్సరం. అసలు చైత్రపాడ్యమినే ఉగాదిగా ఎందుకు జరుపుకోవాలో పూజ్యులు సామవేదంవారు ప్రవచనం చేస్తూ ఇలా తెలియచేసారు. దిలీపచక్రవర్తి తన భార్య సులక్షణాదేవి తో కలిసి రధంపై " సంతానాన్ని పొందడానికి ఏమి చేయాలో " తెలుసుకోవడానికి వశిష్టాశ్రమానికి బయలుదేరారుట. కాళిదాసు తన రఘువంశ కావ్యంలో ఈ ఘట్టాన్ని ఇలా వర్ణించారు " మంచుతొలగిన చైత్రపూర్ణిమనాడు చిత్ర నక్షత్రం చంద్రుడు కలిసిఉన్నట్లుగా ఉన్నారు రాణి రాజు " అని. ఇక్కడ మంచుతెరలు తొలగిన అంటే బాధలు ( సంతానలేమి ) పోయే సమయం అని. ఎంత అద్భుతవర్ణన. యజుర్వేదంలో ఇలా ఉంది: " యజ్ఞపతిం వృషయేవ సాహుః,    ప్రజానిర్భక్తా అనుతప్త్యమానా,    మదభ్యౌస్తోతా2వపతౌ నరాధ "  దీని అర్ధం " అర్హత కలిగి శాస్త్రాలు తెలిసిన సోమయాజులు మధుమాసాలలో యజ్ఞాలు చెయ్యకపోతే కరువుకాటకాలు వస్తాయి " అని. ఎంత అద్భుత విషయం తెలియచేసారు మన ఋషులు. యజ్ఞం చెయ్యడం ప్రకృతిలోని లోపాల...

శ్రీలలితాదేవీ నవరాత్రులు - రేపటినుంచి - చీమలపాటి సూర్యనారాయణ

 🙏 " శ్రీమాత్రేనమః " 🙏 శ్రీలలితాదేవీ నవరాత్రులు - రేపటినుంచి అనగా చైత్రశుద్ధ పాడ్యమి నుండి నవమి వరకూ - భక్తులు లలితమ్మవారిని పూజించుకుని ఆవిడ ఆశీస్సులు అందుకుంటారు. శ్రీలలితమ్మవారు భండాసురునితో యుద్ధానికి వెడుతూ జీవుల్ని ( మనల్ని ) జాగ్రత్తగా చూసుకోవడానికి బాధ్యతలను ఇద్దరికి అప్పగించారు. ఒకరు శ్రీవారాహీదేవి - రక్షణమంత్రిణి, కష్టసుఖాలు గమనించడానికి. రెండవవారు శ్రీశ్యామలాదేవి, ప్రధానమంత్రిణి, అందరి అవసరాలు గమనిస్తూ అనుగ్రహిస్తూ ఉండడానికి. చైత్రశుద్ధ పాడ్యమి నుంచి నవమి వరకూ శ్రీలలితాదేవీనవరాత్రులుగా జరుపుకుంటారు భక్తులు. అషాఢశుద్ధ పాడ్యమి నుంచి నవమి వరకూ శ్రీవారాహీదేవీనవరాత్రులుగా జరుపుకుంటారు. మాఘశుద్ధ పాడ్యమి నుంచి నవమి వరకూ శ్రీశ్యామలాదేవీనవరాత్రులుగా జరుపుకుంటారు. అమ్మవారు లలితాదేవి భండాసురునితో యుద్ధం చేస్తూన్నప్పుడు ఆ రాక్షసుడు " మహారోగాస్త్రం " ప్రయోగించాడు అందర్నీ రోగగ్రస్తులుగా చేయాలని. అమ్మవారు " నామత్ర్యయాస్త్రం " అంటే " అచ్యుత అనంత గోవింద " అస్త్రాన్ని ప్రయోగించారు. అందుకే ఎవరికైనా ఒంట్లోనలతగా ఉంటే ఈ మంత్రాన్ని ఇప్పటికీ జపించమని చెబుతా...

మండోదరి మహాపతివ్రత - చీమలపాటి సూర్యనారాయణ

 🙏" శ్రీరస్తు శుభమస్తు "🙏 అహల్యా..... - 5వ భాగం  " అహల్యా ద్రౌపదీ సీతా    తారా మండోదరీ తధా    పంచకన్యాం స్మరేత్ నిత్యం    మహాపాతక నాశనం " ( సీత కు బదులుగా కుంతి ని స్మరిస్తారు కొందరు ) వీరు ఐదుగురు మహాప్రతివ్రతలు. నిత్యం తలుచుకుంటే చాలు మాహాపాపాలు నాశనమవుతాయి. హనుమ సీతాన్వేషణకోసం లంకలో అడుగుపెట్టాడు. చీకటిపడి చంద్రోదయం అవగానే వెతకడం మొదలుపెట్టాడు. ఎవరికీ కనబడకూడదని చిన్నరూపంలో వెడుతున్నాడు. ఒక్కొక్క భవనం లోనూ చూస్తున్నాడు. పుష్పకవిమానంకూడా ఎక్కి చూస్తున్నాడు. ఆఖరికి ఒక గదిలో మంచమ్మీద చక్కటిచీర కట్టుకుని, విలువైన నగలను అలంకరించుకుని నిద్రిస్తూన్న యువతి (మండోదరి) ని చూసాడు. అమ్మయ్య సీతకనబడిందని సంబరపడిపోయాడు. తనతోకను ముద్దుపెట్టుకున్నాడు, స్తంభం పైకి ఎక్కి క్రిందకు దూకాడు. గంతులు వేసాడు. కోతిచేష్టలన్నీ చేసాడు. అన్నీ ఒక్కక్షణమే. తెలివిలోకివచ్చి " ఇలా ఎలా అనుకున్నాను, సీతమ్మ మహాపతివ్రత, రాముడిని తలచుకుంటూ విచారంగా ఉంటుంది కాని ఇలా అంతఃప్పురంలో మంచంమీద నగలు ధరించి ప్రశాంతంగా నిదురిస్తుందని నేను ఎలా అనుకున్నాను " అని బాధపడ్డాడు. తప్పు ఆయనదికాదు. మండోద...

మహాపతివ్రత తార ఎవరు - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీరస్తు శుభమస్తు"🙏 అహల్యా..... - 4వ భాగం  " అహల్యా ద్రౌపదీ సీతా    తారా మండోదరీ తధా    పంచకన్యాం స్మరేత్ నిత్యం    మహాపాతక నాశనం " ( సీత కు బదులుగా కుంతి ని స్మరిస్తారు కొందరు ) ఈ ఐదుగురిని రోజూ తలుచుకుంటే మహాపాతకాలు నశిస్తాయని స్మృతివాక్యం. వీరిలో అహల్య, ద్రౌపది, సీత, మండోదరి బాగా అందరికీ తెలుసున్నవారే. మరి ఈ తార ఎవరు. అంతటి మహాపతివ్రత ఏమిటో చూద్దాం. క్షీరసాగరమధన సమయంలో ఎందరో స్త్రీలు పుట్టుకొస్తారు. వారు సురులను( దేవతలను ) వివాహం చేసుకోమని అడుగుతారు. వారు ఒప్పుకోరు. అందుకని ఆ స్త్రీలను అప్సరసలు అన్నారు. వారిలో తార ఒకరు. అంటే ఆవిడ కూడా మిగతా పైనలుగురిలా అయోనిజయే. ఈమె వాలిని వివాహమాడింది. వాలి దుందుభి కొడుకు మాయావిని చంపడానికి వెళ్ళి ఎన్నాళ్ళకూ తిరిగి రాకపోతే సుగ్రీవుడు రాజ్యాధికారాన్ని తీసుకుని తారను భార్యగా చేసుకుంటాడు. అది ఆకాలపు ధర్మమే. వాలి తిరిగివచ్చి సుగ్రీవుడిని రాజ్యబహిష్కరణ చేసి తారను మళ్ళీ భార్యగా చేసుకుంటాడు. ఇదేమిటీ అని అనిపించవచ్చు కాని అందులో తప్పు పట్టడానికి ఏమీలేదు. అది ఆ కాలధర్మం. తార వాలి దగ్గర ఉన్నా, సుగ్రీవుడు దగ్గర ఉన్...

సీతమ్మతల్లి మహాపతివ్రత - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీరస్తు శుభమస్తు"🙏 అహల్యా..... - 3వ భాగం  " అహల్యా ద్రౌపదీ సీతా    తారా మండోదరీ తధా    పంచకన్యాం స్మరేత్ నిత్యం    మహాపాతక నాశనం " ( సీత కు బదులుగా కుంతి ని స్మరిస్తారు కొందరు ) ఈ పంచకన్యలు పతివ్రతలు. రోజుకు ఒకసారి తలచుకున్నా మహాపాపాలు కూడా నశిస్తాయి. అమ్మ కౌసల్యను అనునయించి ఒప్పించిన తరువాత రాముడు సీతమ్మ దగ్గరకు వెడతాడు ఆవిడను కూడా అనునయించి అరణ్యవాసానికి బయలుదేరడానికి. " మా తండ్రి నన్ను వనవాసానికి వెళ్ళమన్నారు " అని మాత్రం అనగానే సీతమ్మ " నేను కూడా మీతో బాటే " అంది. మిమ్మల్ని అనుసరిస్తాను అనలేదు. మీముందుండి మీమార్గంలో ఉండే ముళ్ళు రాళ్ళు తొలగిస్తూ మీమార్గం సుగమం చేస్తాను అంది తల్లి.  ఇక్కడ సీతమ్మ ఒక ధర్మసూక్ష్మం తెలియచేసింది జాతికి. తల్లిదండ్రులు, తోబుట్టువులు, సంతానం ఎవరికయినా ఎవరి భాగ్యం వారిదే, ఎవరి కష్టాలు వారివే. కాని ఒక్క భార్యాభర్తలదే ఒకరి భాగ్యం ఇంకొకరిది. సుఖాలలోనే కాదు, కష్టాలలో కూడా ఒకరికి ఒకరు తోడు.  వివేకానందులు అంటారు " ప్రపంచవాజ్మయం అంతా నాశనమయిపోయినా ఒక్క రామాయణం ఉన్నా లేక ఒక్క సీతమ్మను జ్ఞప్తిలో ఉంచుకున్నా భారతజా...

ద్రౌపది మహాపతివ్రత - చీమలపాటి సూర్యనారాయణ

 🙏 " శ్రీరస్తు శుభమస్తు "🙏 అహల్యా.... - 2వ భాగం  " అహల్యా ద్రౌపదీ సీతా    తారా మండోదరీ తధా    పంచకన్యాం స్మరేత్ నిత్యం    మహాపాతక నాశనం " ( సీత కు బదులుగా కుంతి ని స్మరిస్తారు కొందరు ) ఈ పంచకన్యలు పతివ్రతలు. రోజుకు ఒకసారి తలచుకున్నా మహాపాపాలు కూడా నశిస్తాయి. ద్రౌపది యజ్ఞవేదికనుండి పుట్టింది. అయోనిజ. పాండురాజు కోడలు. స్వయంవరంలో అర్జునుడు భార్యగా పొందినా అత్త కుంతి కోరినట్ట్లుగా మిగతా నలుగురికి కూడా భార్యగా మసలుకుంది. నీతిశాస్త్రాలు చదివిన పిల్లలకు తల్లి. దృపదరాజు పుత్రి. కురుక్షేత్ర యుద్ధాన్ని పాండవుల పక్షాన సర్వసైన్యాధ్యక్షుడిగా ఒంటిచేత్తో నడిపించి విజయం సాధించిన ధృష్టద్యుమ్నుడి సోదరి. ఆమె ఇంకోపేరు కృష్ణ. కృష్ణపరమాత్మ అభిమానాన్ని చూరగొన్న స్త్రీ. అటువంటి ద్రౌపది ఎప్పుడూ పాండవుల వెంటే నడిచింది. 12 సం.లు అరణ్యవాసం చేసి నానా కష్టాలూ పడింది. ఏడాదిపాటు పరాయి రాజ్యంలో రాణికి సైరంధ్రిగా ఉండి నానా అవమానాలూ భరించింది. ఎప్పుడూ తనమనసులోని బాధను బయటకు చెప్పని ద్రౌపది రాయబారానికి వెళ్ళేముందు " నీ అభిప్రాయం కూడా చెప్పు " అన్న కృష్ణపరమాత్మతో మాత్రం ఇలా అంది: "...

అహల్య మహా పతివ్రత - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీరస్తు శుభమస్తు"🙏 " అహల్యా ద్రౌపదీ సీతా    తారా మండోదరీ తధా    పంచకన్యాం స్మరేత్ నిత్యం    మహాపాతక నాశనం " ( సీత కు బదులుగా కుంతి ని స్మరిస్తారు కొందరు ) ఈ ఐదుగురిని రోజూ తలుచుకుంటే మహాపాతకాలు నశిస్తాయని స్మృతివాక్యం. వీరిలో అహల్య, సీత, మండోదరి, తార రామాయణకాలంవారు. ద్రౌపది మహాభారతకాలంవారు.  ఆశ్చర్యకరంగా ఈ అయిదుగురు స్త్రీల జీవితాలు ఒడిదుడుకులతో కూడినవే. ఎవరి జీవితమూ కూడా అనసూయ, అరుంధతి మొ.గు వారి జీవితాలలాగా సాఫీగా సాగలేదు. అందరూ ఒడిదుడుకులను తట్టుకుని దృఢంగా నిలిచి, పూజలందుకుంటున్నారు. ఈ రోజు అహల్య గురించి చదువుదాం. అద్భుత సౌందర్యవతిని సృష్టించాలని బ్రహ్మగారు అనుకుని అహల్యని సృష్టించారు. ఇంద్రుడుతో సహా ఎందరో ఈమెను వివాహం చేసుకోవాలనుకున్నారు. అందుకని బ్రహ్మగారు భూప్రదక్షిణం చేసి మొదట వచ్చినవారికి అహల్యనిచ్చి వివాహం చేస్తాననడంతో అందరూ బయలుదేరారు. అదే సమయానికి గౌతమమహర్షి రావడం, పరీక్ష గురించి వినడం, గోవు దూడ చుట్టూ ప్రదక్షిణం చేయడం జరిగింది. గోప్రదక్షణ భూప్రదక్షణతో సమానం కనుక అహల్యను గౌతమమహర్షికి ఇచ్చి వివాహం చేయడం జరిగింది. అమ్మవారు పాప ప్ర...

చట్టం కన్నా ధర్మమే గొప్పది - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీరస్తు శుభమస్తు"🙏 " చట్టం - ధర్మం " " క్లైబ్యం మా స్మ గమః పార్ధ "                     - భ.గీత 2:3 పరమాత్మ అర్జునుడికి ఏమీ చెప్పడం మొదలెట్టకుండానే " ముందు నపుంసకత్వం వదిలేయ్ " అన్నారు. ఆయనే " ధర్మ సంస్థాపనార్ధాయ సంభవామి యుగే యుగే " అన్నారు. ఇక్కడ " యుగే యుగే " అంటే మళ్ళీ మళ్ళీ అని. యుగానికి ఒకసారి అని కాదు. ధర్మానికి హాని జరిగినప్పుడల్లా ఆయన వచ్చేయరు, ఎవరినో ఒకరిని పంపిస్తూ ఉంటారు. ధర్మం గురించి ప్రవచనంచేస్తూ పూజ్యులు సామవేదంవారు ఓ అద్భుతమయిన విషయం చెప్పారు. ఆయన ఒకటే చెప్పారు కాని 3 విషయాలు చూద్దాం. ఒకాయన బస్ ఎక్కారు. ఆడువారిసీట్లు, వికలాంగులసీట్లు అని వ్రాసి వాటిలో కూర్చోడం నేరం, 500 రూ ఫైన్ అని వ్రాసి ఉంది. ఈయన వాటిని వదిలేసి కొద్దిగా వెనక కూర్చున్నారు. బస్ నిండిపోయింది. అప్పుడు ఒక 80 ఏళ్ల ముసలాయన లేక 7/8 నెలల గర్భిణీస్త్రీ వచ్చి ఆయన ప్రక్కన నుంచున్నారు. చట్టప్రకారం ఆయన లేవనక్కరలేదు. కాని ధర్మం ఏమి చెబుతూందంటే అటువంటి పరిస్థితుల్లో ఆయన లేచి వారికి సీటు ఇవ్వాలని, అలా చేస్తే అతనికి అతని కుటుంబానికి మేలు అని. కార్ లో విజ...