Posts

Showing posts from June, 2019

Conversation with a friend

మా ఎం ఎస్ సి ఏ యు బేచ్ గ్రూప్ ఉంది - ఓ మిత్రుడు ఆ కాలం లో కమ్యూనిష్ట్( అతనే అన్నాడు లెండి సైన్స్ కాలేజ్ ప్రెసిడెంట్ ఎలక్షన్ టైం లో ) ఇప్పుడు అమ్మవారి భక్తుడు ( మొన్న గెట్ టుగెదర్ లో చెప్పాడు) - మనిషి మంచివాడు. మొన్న అన్నాడు " మిత్రమా నీ పోష్ట్స్ చాలా ఆధ్యాత్మికం గానూ ఆహ్లాదకరంగా ఉంటాయి కాని కొంచెం వ్యంగ్యం గా అనిపిస్తాయి పైగా నీకు మోడీ అంటే నచ్చనట్లుగా  అనిపించింది " అని. నేనన్నాను నాకు ఆయన నచ్చడని ఎక్కడైనా వ్రాసానా అని. మన సంస్కృతి చెప్పింది ఏమిటంటే " మనిషిని ద్వేషించకు, అతని భావాన్ని అవసరమైతే ద్వేషించు - మంచి విషయం చెప్పాడు అభినందించు, చెడ్డగా మాట్లాడాడు ఖండించు - అంతే  అంతటితో ఆ విషయం సరి ". పెద్దాయన మాటిచ్చిన ఆయన చెయ్యగలిగిన  చిన్న చిన్న పనులు కూడా చెయ్యనప్పుడు ఖండించడం లో తప్పేముంది - అది కూడా ఆయన నిష్క్రియాపర్వాన్నే సుమా అనడం జరిగింది. అతనన్నాడు అవినీతి లేకుండా పాలిస్తున్నాడు కదా అన్నాడు. దానిలో కూడా ఆయన ఫెయిల్ అయినట్లే అన్నాను. ద్రౌపది ని అవమానించింది ఎవరు - దుర్యోధనుడు దుశ్శాశనుడు - మరి  కృష్ణుడు - భీష్ముణ్ణి ద్రోణుణ్ణి  కృపాచార్యులని - ఎందుకు చంపించాడు...

Sri gurubhyonnamaha

మొన్న ఓ రోజు గరికిపాటి వారు ప్రవచనం చేస్తూ " ఇప్పుడు ప్రతీ పనికీ ముహూర్తాలు సలహాలు సంప్రదింపులూనూ , ఇదివరకు ఇలా ఉండేది కాదు - అమ్మా  నాన్నా ఏది చెప్పేవారో అది చేసే వాళ్ళం - ఇది మంచిదిరా అనేవారు చేసేవాళ్ళం అది తప్పు అలా చేయకు అనేవారు మానేసే వాళ్ళం " అన్నారు. పూర్వపు రోజుల్లో గురువులు కూడా అలా తమవంతు సలహాలిచ్చేవారు. నేను  కాలేజీ లో చదివే రోజుల్లో ఓ బిల్డింగులో ఎదర రూం లో అద్దెకుండేవాళ్ళం , ప్రక్కన ఒక పోర్షన్ దాని ప్రక్కన ఇంకో పోర్షన్ ఉండేవి. ఆ రెండో పోర్షన్ కి ప్రక్కన నుయ్యి ఉండేది నీళ్ళకి. కొన్నాళ్ళకి ఆ రెండో పోర్షన్ ఖాళీ అవడం దానిలోకి మా సంస్కృతం లెక్చరర్ అద్దెకి రావడం జరిగింది - ఆయన పొద్దున్నే 6 గం కి పొట్టి ఖాకీ లాగు వేసుకుని సైకిల్ మీద ఆర్ ఎస్ ఎస్ కార్యక్రమాలకి వెళ్ళేవారు. నేను అప్పటికే అరుగు మీద ఉండేవాడిని ఎవరో ఒకరు రావడం తో - దీనికి ఓ కారణం ఉంది , మా మేథ్స్ లెక్చరర్ పి వి ఎస్ గారని ఉండేవారు, ఆయన రీసెర్చ్ పనిలో బిజీగా ఉండడం తో ఓ సారి నన్ను పిలిపించుకుని " మొన్న ఆ శర్మ వచ్చేడోయ్ , 30 లెక్కలకి 28 రాలేదంటాడేమిటి 3,4 అయితే నేను చెప్పేవాడిని నిన్ను కలవమని చెప్పాను అవేవో ...

" చదువుకున్న వాడికన్నా మడేలన్న మేలు

" చదువుకున్న వాడికన్నా మడేలన్న మేలు " అని సామెత ( సామెత అని గ్రహించవలెను) - నేను ఎస్ ఎస్ ఎల్ సి లో ఉండగా మా హెడ్ మాస్టర్ మా చేత " స్వచ్ఛ భారత్ " చేయించారు - స్కూల్ చుట్టూ ముళ్ళ మొక్కలుండేవి - అప్పుడు ఎవరికీ చెప్పులూ అవీ ఉండేవి కాదు ముళ్ళు గుచ్చుకుంటూ ఉండేవి. పూర్తిగా శుభ్రం చేసాక సాయంత్రం మమ్మల్ని ఉద్దేశించి మాట్లాడుతూ చదువే  ముఖ్యం కాదు అంటూ ఓ కధ చెప్పారు - ఓ మానసిక వికలాంగుల ఆసుపత్రి ఉంది - ఓ ఆగస్ట్ 15 న రోగులకి మంత్రిగారి చేత స్వీట్స్ పళ్ళు ఇప్పిద్దామనుకున్నారు డాక్టర్లూ ,  సిబ్బంది. మంత్రి గారు వచ్చి రోగులనుద్దేశించి   మాట్లాడడం మొదలెట్టారు - ఆయన ముందరున్న చిన్న బల్లమీద ఉన్న పేపర్లు ఎగిరిపోకుండా చిన్న కంకర రాయి ముక్క పెట్టారు - ఎదర కూర్చున్న ఓ రోగి ( అన్యధా భావించవలదు వాడుక మాటే ) ఆ రాయిని మింగేసాడు , గుండెలు ఝల్లు మన్నాయి మంత్రి గారికి డాక్టర్లకి. బయటకు లాగడానికి ట్రై చేసారు కుదరలేదు , ఆపరేషన్ చెయ్యాలి వెంటనే లేకపోతే  చచ్చిపోతాడు అని హడావిడి పడుతున్నారు. ఈ రోగి ప్రక్కనే ఇంకో రోగి కూర్చుని ఉన్నాడు. వాడికి వీళ్ళ హడావిడి చూసి చిర్రెత్తుకొచ్చింది. " ఈ వెధవ ( ...

" వృక్ష ఏవ హతో హంతి "

" ధర్మ ఏవ హతో హంతి, ధర్మో రక్షతి రక్షితః " - మనుస్మృతి - ధర్మం నాశనం చేస్తే నాశనం చేస్తుంది, రక్షిస్తే రక్షిస్తుంది. ఇలాగే " వృక్షో రక్షతి రక్షితః " అంటారు - మరి పచ్చగా కళకళ లాడుతూన్న మొక్కని కొట్టేస్తే ఏమవుతుంది. మన వాళ్ళు చెబుతూంటారు " పచ్చని చెట్టుని " కొట్టకూడదని. మేము మద్రాస్ లో ఉండగా ఓ 3 పోర్షన్ల ఇంట్లో అశోక్ నగర్ లో ఉండేవాళ్ళం- ముందర పోర్షన్ లో మేము, వెనకాల పోర్షన్ లో ఓనర్స్ , పైన ఇంకో పెద్ద ఫేమిలీ. ఇంటి ఓనర్స్ ది మన బందరు. ఆయన మద్రాస్ కార్పొరేషన్ లో ఇంజనీర్( 45 ఏళ్ళు ఉంటాయి ),  ఆవిడ డాక్టర్- వాళ్ళ పోర్షన్ వెనకాల వాళ్ళ నర్శింగ్ హోం ఉంది. వాళ్ళ రాకపోకలు హాస్పిటల్లోంచే,  మా వైపు ఎప్పుడో కాని వచ్చేవారు కాదు. పూజ కోసం వత్తులు, వస్త్రం , యజ్ఞోపవీతాల కోసం మంచి పత్తి దొరికేది కాదు మాకు , అందుకని మా గ్రామం వెళ్ళినప్పుడల్లా అక్కడ నుంచి తెచ్చుకునేవాళ్ళం- ఏడాదికి 2,3 సార్లు ఎలాగూ వెడుతూండడంతో.  అక్కడ పెరటిల్లోనే  మంచి పత్తి నిచ్చే మొక్కలు ఉండేవి. మరి ఎప్పుడైనా తుడిచేటప్పుడు పడిందేమో మరి ఇంటి ముందరున్న కొబ్బరి చెట్టు మొదట్లో ఓ ప్రత్తి మొక్క వచ్చింది - దానికి ర...

గతజన్మవాసనలు

" జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి " అన్నాడు రాముడు యుద్ధం తరువాత - అంటే తల్లి , జన్మభూమి స్వర్గానికన్నా ఎక్కువని - జర్మనీలు కలిసిపోతేనే ఆనందం గా ఉందే , మన రాష్ట్రం విడిపోతేనే బాధగా అనిపిస్తూందే మరి వాళ్ళ పుట్టిన ఊరుని దేశాన్ని కూడా వదిలేసి బంగ్లాదేశ్ వాళ్ళూ మయన్మార్ ( బర్మా ) వాళ్ళూ భారత్ కి ఎందుకు వచ్చేస్తున్నారో . అంటే ఇక్కడి బియ్యపు గింజలమీద వాళ్ళ పేర్లు వ్రాసి ఉన్నాయనుకోవాలా . ఎవరికి సంతానం గా వెళ్ళాలో కూడా ముందరే నిర్ణయించుకుంటాయి ఆత్మలు అంటారు పెద్దలు - జరిగే సంఘటనలు చూస్తూంటే నిజమేననిపిస్తుంది . మేము అమెరికా వెళ్ళినప్పుడు మొదటి 3 వారాలు   మంచుతో సరిపోయింది -  తరువాత ఓ రోజు మా అబ్బాయి రమ్మంటే ఓ మాల్ కి షాపింగ్ కి వెళ్ళాం . కార్ పార్కింగ్ లో పెట్టి దిగాం , ప్రక్క కారులోంచి ఒక నడివయసు యువతి , ఒక 9,10 ఏళ్ళ అమ్మాయి దిగేరు . ఆవిడ స్లీవ్ లెస్ స్కర్ట్ వేసుకుంది , ఈ అమ్మాయి ఫుల్ ఫేంట్ ఫుల్ హేండ్స్ షర్ట్ వేసుకుంది - ఇది ఎందుకు గమనించవలసి   వచ్చిందంటే మేము కార్ దిగి అటుచూస్...

స్నేహమేరా 2

రంజాన్ శుభాకాంక్షలు మిత్రులందరికీ -------------------- మేము ( ఖాదర్, నేను)  ఎస్ ఎస్ ఎల్ సి లోకి వచ్చేక ఆటలు , సినీమాలు , కబుర్లూ తగ్గాయి- అంతకు ముందు వాళ్ళ  ఉరుసు ఉత్సవాలకి  వెళ్ళేవాళ్ళం , ఇప్పుడు అదీ లేదు - చేతి కట్టు విప్పేదాకా సేవ అంతా ఖాదర్ దే. డైలీ రాత్రిళ్ళు లెక్కలు,  సైన్స్ చెప్పేవాడిని. తెల్లవారకట్ట మిగతా సబ్జెక్ట్స్ చదివేవాడు - మంత్లీ టెస్ట్స్, క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ పరీక్షలలో కూడా మంచి మార్కులు వచ్చేయి వాడికి. సంక్రాంతి సెలవులవగానే మా సైన్స్ మేస్టారు పిలిచారు - నాటకం సెలెక్షన్ అయింది - 4,5 రోజుల్లో రిహార్సల్స్ మొదలెడదామని. 2 నెలలు చదువుండదు- నాకు సరే  ఖాదర్ ఎలా - రాత్రుళ్ళు మాట్లాడడమే కుదరదే - ఇదిగో ఈ కారణం వల్లే (బి డి ఓ గారి అమ్మాయి  చెప్పిందని మాత్రమే కాదు ) " ఇంక నాటకం లో పాల్గొనను " అని చెప్పాను మేస్టారితో . కుదరదన్నారు. " నువ్వు కూడా ఉండడం వల్లే పెద్ద నాటకం వేస్తున్నాం " అన్నారు. డిసైడ్ అయిపోయి మరునాడు వెళ్ళి " ఇంక వెయ్యను సార్ " అంటే లాగి లెంపకాయ కొట్టారు. మళ్ళీ అడిగినా మనసు మార్చుకో లేదు. దువ్వూరి కి 260 మార్కులు  వచ్చి పాస్ అయి...

స్నేహమేరా 1

నా బాల్య మిత్రుడు ఖాదర్ బాబా తో మొదటి పరిచయం జ్ఞాపకం లేదుకాని 6 వ తరగతి తరువాత సన్నిహితం ఎక్కువయ్యింది . తను కూడా ఖొ ఖొ , బాల్ బాడ్మింటన్ ఆడేవాడు . సెక్రటరీ ( ఓ పోష్ట్ లో వ్రాసాను ) గారి అబ్బాయి - దువ్వూరి అనే పిలిచేవాళ్ళం -  ఖాదర్ , నేను కలిసి తిరిగేవాళ్ళం . సాయంత్రం దువ్వూరి వెళ్ళిపోయేవాడు కాని ఖాదర్ వెళ్ళి భోంచేసి వచ్చేసేవాడు చదువుకోవడానికి   - అప్పటికే పప్పు శర్మ , బుచ్చి శర్మ అనేవాళ్ళు ఇద్దరు ఊళ్ళో వారాలు చేసుకుంటూ ( మా నాన్నగారు అలా ఏర్పాటు చేసేవారు - కష్టం విలువ తెలియాలనేమో మరి ) మా ఇంట్లో ఉండి   చదువుకునేవారు . ముగ్గురూ అరుగు మీద చాప , దిండు తో కాలక్షేపం చేసేవారు - ఆదివారం రాత్రి ఫలహారం మినపరొట్టి - ఖాదర్ కూడా మా ఇంట్లోనే రొట్టి తినేవాడు , తెగ ఆనందపడేవాడు - పరీక్ష రోజుల్లో ఖాదర్ ని తెల్లారకట్ట 4 గం కి లేపి కాఫీ ఇచ్చేవారు మా అమ్మగారు - మా ఊరికి దక్షిణం లో చెరువు ఉంది , దానిని చాకలి చెరువు అని పిలుస్తారు . దాని ఒడ్డున ఈత చెట్లు ఉండేవి , పళ్ళు రాలడానికి రాళ్ళత...