సౌభాగ్యాన్ని అంటే అనుభవించే అదృష్టాన్ని ప్రసాదిస్తారు అమ్మవారు - చీమలపాటి సూర్యనారాయణ
🙏"శ్రీమాత్రేనమః"🙏 " భక్తసౌభాగ్యదాయినీ " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 117 వ నామం. " భక్తసౌభాగ్యదాయినీ " అంటే భక్తులకు సౌభాగ్యమును ఇచ్చునది అని. ఆయుష్షు, ఆరోగ్యం, సంపదలు, భోగాలు ఉన్నా భాగ్యం చాలా ముఖ్యం. మిగతావన్నీ ఉన్నా ఈ భాగ్యం ( అనుభవించే అదృష్టం ) లేకపోతే సుఖం ఉండదు. ఈ భాగ్యాన్ని అమ్మవారే అనుగ్రహించాలి. దేవతల కోరిక మేరకు లోక కళ్యాణం, కుమారస్వామి జననం, కోసం మన్మథుడు శివుని మనసులో పార్వతి పట్ల మోహాన్ని కలిగేలా చేయడం కోసం బాణం వేసాడు. శివుడు కోపగించుకుని తన మూడో కంటిని తెరిచి మన్మథుడిని భస్మం చేశాడు. మరి రతీదేవి చేసిన పాపమేమిటి. అమ్మవారి పాదాలపై పడింది భర్తను బ్రతికించమని. అమ్మవారు రతీదేవికి సౌభాగ్యాన్ని ప్రసాదించారు మన్మధుడిని బ్రతికించి. ఆదిశంకరులు శ్రీలలితా పంచరత్న స్తోత్రం చేసారు. ఫలశృతిలో ఇలా తెలియచేసారు: " యః శ్లోక పంచకం మిదం లలితాంబికాయాః సౌభాగ్యదం సులలితం పఠతి ప్రభాతే తస్మై దదాతి లలితా ఝటితి ప్రసన్నా విద్యం శ్రియం విమల సౌఖ్యమనంత కీర్తిం " ...