Posts

Showing posts from January, 2025

భక్త రామదాసు జయంతి నేడు - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీరస్తు శుభమస్తు"🙏 " భండనభీముఁ  డార్తజనబాంధవుఁ    డుజ్జ్వలబాణతూణ  కోదండకలా ప్రచండ      ‌ భుజతాండవకీర్తికి రామమూర్తికిన్      రెండవసాటిదైవమిఁక లేఁడనుచున్‌ గడగట్టి భేరికా   డాండ డడాండడాండ నినదంబు లజాండము     నిండ మత్తవే దండము నెక్కిచాటెదను    దాశరథీ! కరుణాపయోనిధీ " ఈ పద్యం భక్తరామదాసు గా ప్రసిధ్ధి చెందిన కంచర్ల గోపన్న వ్రాసిన " దాశరధీ శతకం " లోనిది. " యుద్ధం చెయ్యడం లో ప్రసిద్ధి గాంచిన వాడు, భక్తజన బాంధవుడు, కోదండంతో ఉజ్వల బాణాలు వేయగల భుజ బలసంపదగల రాముడిని మించిన వేరే దేవుడు లేడని ఢం ఢం ఢం ఢం ఆని ఢంకా భజాయించి భూమండలమంతా వినబడేలా మదించిన ఏనుగు మీదకెక్కి చాటుతాను " అని అర్ధం. ఖరదూషణాదులతో సహా 14000 మంది రాక్షసులను 3 ఘడియలలో అంటే 72 ని.ల లో చంపేసాడు రాముడు. వీరందరూ మరణించాక ఒక్కడు మాత్రం పారిపోయి రావణుడిని కలిసి " నువ్వు జనస్థానంలో ఉంచిన వారందరూ చంపబడ్డారు " అని చెబుతాడు. అతను అనుకంపనుడు. రావణుడు ఆశ్చర్యపోయి " ఎలా చనిపోయారు, ఎంతమంది వచ్చారు చంపడానికి " అని అడుగుతాడు. అనుకంపనుడు " ఒకే ఒక్కడు, అం...

కనిపించేదంతా మాయ, నాశనమయేదే - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏 " మూలప్రకృతిః " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 397 వ నామం. " మూలప్రకృతిః " అంటే పరమాత్మ స్వరూపురాలు. ఇద్దరూ ఒకరే. అర్ధనారీశ్వరం. ఆదిశంకరులు " బ్రహ్మ సత్యం, జగన్మిధ్య " అన్నారు. ఈ జగత్తు/ప్రకృతి అంతా మిథ్య/మాయ అన్నారు. మరి మళ్ళీ ఈ మూలప్రకృతి ఏమిటి?. మానవులలోనే గాక స్థావర జంగమాలన్నింటి లోనూ ఆత్మ ( అమ్మవారి చైతన్యం ) ఉన్నదని ఉపనిషత్తులు చెబుతున్నాయి. ప్రకృతి అంటే మనకు కనిపించేది అంతా. ఇది మాయ అంటే నశించేది అని తెలుస్తూనే ఉంది. పుట్టుక ఉంటేనే నాశనం ఉంటుంది. అంటే ఈ ప్రకృతి పుట్టుకకు కారణం వేరే ఏదో ఉంది. దానినే మూలప్రకృతి అన్నారు. మూలప్రకృతి నుంచే మనం చూసే ప్రకృతి అంతా పుడుతూంది అని తెలుసుకోవాలి. " యతో వా ఇమాని భూతాని    జాయంతే యేన జాతాని  జీవంతి,    యత్ప్రయంతి అభిసంవిశంతి,    తద్విజిజ్ఞాసస్వ తద్బ్రహ్మేతి "               - తైత్తిరీయోపనిషత్తు  " దేని నుంచి ఈ భూతకోటి పుడుతున్నదో, దేనివలన పుట్టిన భూతకోటి జీవిస్తున్నదో అంత్యమున దేనిలో లీనమవుతున్నదో దానిని తెలుసుకొనుటకు ప్రయత్...

మహాకుంభ్ కి వెళ్ళలేకపోయామని బాధపడనక్కరలేదు - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీరస్తు శుభమస్తు"🙏 మహాకుంభ్ కి వెళ్ళలేకపోయామే అని బాధపడనక్కరలేదు.  భాగవతంలో ఓ అద్భుత ఘట్టం ఉంది. భగవానుడు ( తనవారు పరాయివారు అనే భేదం లేనివారు ) అయినప్పటికీ కృష్ణుడు గోపికలను అనుగ్రహించాలని నిశ్చయించుకున్నారు. ఓ శరత్కాలపురాత్రి చంద్రుడు చక్కటి వెన్నెల కురిపిస్తూన్నప్పుడు శ్రీకృష్ణుడు ఓ కల్పవృక్షం వద్ద నిలుచుని వేణుగానం చేస్తున్నారు.  గోపికలు ఎక్కడ పనులు అక్కడే విడిచిపెట్టేసి వేణుగానం వినిపిస్తూన్న వైపుకు పరిగెత్తారు. కొందరిని వారి భర్తలు, బంధువులు ఆపేసారు. అలా ఆపేయబడినవారు అయ్యో అని బాధపడలేదు. ఉన్నచోటే మఠం వేసుకుని కూర్చుండిపోయారు. కూర్చున్నచోటే కృష్ణుడి ధ్యానంలో మునిగిపోయారు. ఇక్కడ గమనించవలసినది పరమాత్మ గోపికలకు ముక్తిని " ఇద్దామని " నిర్ణయించారు. అలా అమ్మవారు నిర్ణయించుకోవాలి మనకు ఏమిద్దామన్నది. మనం కోరుకోవడం కాదు. మేము 1993లో ఉత్తరభారతంలోని దేవాలయాలను చూడడానికి వెళ్ళాం. ఆగ్రాలో మకాం వేసి మథుర వెళ్ళి కృష్ణుని దర్శనం చేసుకున్నాం. కాశీ వెళ్ళడానికి ఆగ్రాలో రాత్రి రైలు ఎక్కాం. ఉదయం 5 గం.లకు ఏదో స్టేషన్ లో ఆగింది. కాఫీ దొరుకుతుందేమో అనుకుని క్రిందకు దిగి ఒకాయన్న...

ప్రశ్నోపనిషత్తు మరుజన్మ ఎలా ఉంటుందో తెలియచేసింది - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏 " ఆత్మవిద్యా " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 583 వ నామం. " ఆత్మవిద్యా " అంటే ఆత్మజ్ఞాన స్వరూపురాలు, కనుకనే ఆత్మవిద్య అయినది. ఆత్మ గురించిన జ్ఞానాన్ని పొందితే అమ్మవారిని తెలుసుకోవడం సులభమవుతుంది. అది అంత సులభం కాదు. ఈ ఆత్మజ్ఞానం గురించి కేనోపనిషత్తు, కఠోపనిషత్తు, ప్రశ్నోపనిషత్తులలో విస్తారంగా వివరించబడింది.  కఠోపనిషత్తులో ఆత్మతత్త్వాన్ని గూర్చి యమధర్మరాజు నచికేతుడికి అద్భుతమయిన విషయాలు తెలియచేశారు:  శాశ్వతమైనది ఆత్మేనని, అది అణువుకన్నా చిన్నదని, అతి పెద్దదానికన్నా పెద్దదని, సూర్యచంద్రాదులు కూడా దాన్ని ప్రకాశింపజేయజాలరని, అది స్వయం ప్రకాశమైనదని, జీవి శరీరంలో ఉన్నప్పుడు అంగుష్టమాత్రంగా హృదయకుహరంలో జ్యోతి వలె ఉంటూ శరీరాన్ని చైతన్య పరుస్తుందని యముడు ఆత్మస్వరూపాన్ని వివరించారు.   నైతిక విలువలను పాటిస్తూ, శ్రేయోమార్గంలో పయనిస్తూ ఉంటే ఇంద్రియ నిగ్రహం సాధ్యమవుతుంది.  అప్పుడు ఇంద్రియాలను బాహ్యవిషయాల నుండి మరలించి అంతర్ముఖం చేసి సాధన చేస్తే ఆత్మావలోకనం సాధ్యమవుతుంది.   అయితే ఇది అంత సులభమైనది కాదు.  కత్తిమీద స...

" గంగలో స్నానం చేస్తే పాపాలు పోతాయా - ఓ జాతీయపార్టీ అధ్యక్షుడు " - చీమలపాటి సూర్యనారాయణ

 " గంగలో స్నానం చేస్తే పాపాలు పోతాయా "- ఓ జాతీయపార్టీ అధ్యక్షుడు ( రెండు రోజుల క్రితం )                   శ్రీరస్తు శుభమస్తు  " తస్మాత్ శాస్త్రం ప్రమాణం    తే కార్యాకార్య వ్యవస్థితౌ,   జ్ఞాత్వా శాస్త్రవిద్యానోక్తం    కర్మ కర్తుమిహార్హసి "                  ‌‌ - భ.గీత 16:24 పరమాత్మ అన్నారు అర్జునుడితో " శాస్త్రాలు ఎలా చెబుతున్నాయో అలా చెయ్యి. ఏది చెయ్యమందో అది చెయ్యి, ఏది వద్దందో అది మానేయి " అని. శ్రీరాముడు " ఋషులు ఇలా చెప్పారు, శాస్త్రం ఇలా చెప్పింది కనుక ఇలా చేద్దాం " అనేవారు. రెండురోజుల క్రితం వంద సంవత్సరాల పైబడి వయస్సున్న ఓ జాతీయపార్టీ అధ్యక్షుడు " గంగలో మునిగితే పాపాలు పోతాయా " అని అడిగారు. సందేహమా లేక వ్యంగ్యమా అనేది ప్రక్కన పెట్టి విషయంలోకి వెడదాం. ఇది ఎలాంటి సందేహం అంటే ప్రతీ ఊరులోనూ ఓ ఐస్క్రీం బండివాడు తిరుగుతూంటాడు. ఐస్ క్రీం ఐస్ క్రీం అంటూ అరుస్తూ. రోజుకు ఓ వెయ్యి సార్లు పైనే వాడు అలా అరుస్తూ ఉంటాడు. క్రీం అనేది కాళీమాత బీజాక్షరం. మరి ఈ బండివాడికి కాళీమా...

శరీరాన్ని అశ్రద్ధ చేయమని చెప్పలేదు శాస్త్రాలు - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏 " మహావిద్యా " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 584 వ నామం. " మహావిద్యా " అంటే సమస్త అనర్ధనివారకమైన గొప్పజ్ఞానస్వరూపురాలు అని అర్ధం చెప్పారు. అన్ని విద్యలలోను ( జ్ఞానములలోను ) ఆత్మజ్ఞానమే ఉత్కృష్టమైనది కావున అది మహావిద్య అయినది. ఈ జ్ఞానము పొందినవాడు అన్ని అనర్ధములు నశించిపోయి ఆనందరూపుడగును అని భాస్కరరాయలు భాష్యం చెప్పారు. కేనోపనిషత్తు ఈ ఆత్మజ్ఞానం గురించి విస్తారంగా ప్రస్తుతించింది: " ఆప్యాయంతు మమాంగాని " నా జ్ఞానేంద్రియాలను, కర్మేంద్రియాలను ఆరోగ్యంగా ఉంచమని పరమాత్మను ప్రార్ధించడంతో ఈ ఉపనిషత్తు ప్రారంభం అవుతుంది. మానవులలోనే గాక స్థావర జంగమాలన్నింటి లోనూ ఆత్మ ( అమ్మవారి చైతన్యం ) ఉన్నదని వేదాంతం చెప్తూంది.  అలాంటప్పుడు మోక్షం మానవునికి ఒక్కనికే ఎలా సాధ్యం? అనే ప్రశ్నకు ఈ ఉపనిషత్తు ఇలా తెలియచేసింది: " మానవునిలో మాత్రమే మనో బుద్ధ్యహంకారాలు ఉన్నాయి.  వాటి ద్వారానే మోక్షం సాధ్యం " అంది.  అవి ప్రకాశించాలంటే ఆరోగ్యమైన, దృఢమైన శరీరం అవసరం. అందుకని ఇంద్రియములను ఆరోగ్యంగా ఉంచమని ప్రార్ధన చేయాలి.  వేదాంతం ( ...

శ్రీపురందరదాస ఆరాధనోత్సవం నేడు, ఆయనకు నివాళులు అర్పించుకుందాం - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీరస్తు శుభమస్తు"🙏 " పార్ధ నైవేహ నాముత్ర    వినాశస్తస్య విద్యతే,   నహి కళ్యాణకృత్ కశ్చిత్    దుర్గతిం తాత గచ్ఛతి "              - భ.గీత 6:40  పరమాత్మ అంటారు " మంచి చేసేవారికి ఎప్పుడూ విచారం/దుఃఖం ఉండదు " అని.  ఒకవేళ ఈజన్మలో ఆ ఫలితం కనబడకపోయినా మరుజన్మలలోనైనా వారు ఫలితాన్ని/మంచిని పొంది తీరుతారని కూడా సెలవిచ్చారు. పురందరదాసు, వేమన, వాల్మీకి, పుండరీకుడు ఆ కోవలోకి వస్తారని అనుకోవచ్చు.  పురందరదాసగారి గురించిన కొన్ని అద్భుత విషయాలు నెమరువేసుకుందాం. పురందరదాసు ఒక వజ్రాలవ్యాపారి కొడుకు. లోభి. పిల్లికి కూడా బిచ్చం వేసేవాడుకాడు. 20 ఏట తల్లితండ్రులు పోవడంతో వ్యాపారం చూసుకోవడం మొదలు పెట్టాడు. విపరీతంగా సంపాదించాడు. ఆరోజుల్లోనే ఆయన్ని " నవకోటిపతి " అని పిలిచేవారు. అంతటి జమీందారు. ఓరోజు ఓ పేదబ్రాహ్మడు వచ్చి " నాకొడుకు ఉపనయనం, ఏమయినా సహాయం చెయ్యండి " అని బ్రతిమిలాడినా వ్యంగ్యంగా దూషించి పొమ్మని బయటకు వెళ్ళిపోతాడు. బ్రాహ్మడు వ్యాపారి భార్యను బ్రతిమిలాడుతాడు. ఆవిడ జాలిపడి తన ముక్కుపుడకను ఇస్తుంది. ఇతను ఆ ముక్కుపుడకను...

అమ్మవారు జ్ఞానులచే పూజింపబడుతారు - జ్ఞాని ఎవరు?- చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏 " బుధార్చితా " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 825 వ నామం.  " బుధార్చితా " అంటే జ్ఞానులచే పూజింపబడునది అని భాష్యం చెప్పారు. జ్ఞాని అంటే ఎవరు?. కఠోపనిషత్తు ఇలా తెలియచేస్తూంది: " ఆత్మానం రథినం విద్ధి,    శరీరం రథమేవ తు బుద్ధిం    తు సారథిం విద్ధి మనః    ప్రగ్రహమేవ చఇన్ద్రియాణి    హయానాహుర్విష   యాంస్తేషు గోచరాన్      ఆత్మేన్ద్రియమనో యుక్తమ్       భోక్తేత్యాహుర్మనీశిణః "                 -1:3:3,4 " ఆత్మ రథికుడని తెలుసుకో.  శరీరం రథం, బుద్ధి సారథి, మనస్సు పగ్గాలు, ఇంద్రియాలు గుర్రాలు, ఆ గుర్రాలు విషయాల వైపుకు పరుగులు తీస్తాయి.  ఇటువంటి శరీరేంద్రియ మనస్సులతో కూడిన జీవుడు భోక్త అని పెద్దలు అంటారు " అని. గుర్రానికి తిన్నగా వెళ్ళడం కోసం కళ్ళకు ప్రక్కన గంతలు కడతారు. అప్పుడు అది ప్రక్కలకు చూడలేదు. శరీరస్థుడైన ఆత్మ మనోబుద్దుల ( గంతల) ద్వారా ఇంద్రియాలను నియంత్రించి, అవి విషయాల వైపుకు వెళ్ళకుండా చూచుకుంటేనే గమ్యం చేరతామని...

అమ్మవారు జననమరణములు లేని శాశ్వతురాలు - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏 " నిర్నాశా " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 180 వ నామం . " నిర్నాశా " అంటే నాశనము లేనిది. అమ్మవారు శాశ్వతురాలు. పుట్టడం లేక తయారుచేయబడటం ఉంటే మరణం/నాశనం ఉంటుంది. అమ్మవారు అజ అంటే పుట్టుక లేనిది. జీవుడికి జన్మనిచ్చేది తండ్రి, తండ్రికి తాత, తాతకు ముత్తాత. అలా వెనక్కు వెడితే మన గోత్ర ఋషి తెలుస్తారు. ఆ ఋషికి కూడా ఒకరు జన్మనిచ్చి ఉండాలిగా. అలా మళ్ళీ వెనక్కు వెడితే చివరకు తెలిసేది అమ్మవారు. అమ్మవారు స్వయంభూ. పుట్టుక లేదు. పుట్టుక ఉంటే మళ్ళీ తల్లిదండ్రులు ఉంటారు కదా. అంటే మళ్ళీ వెనక్కు తెలుసుకుంటూ వెళ్ళాలి. పుట్టుక నాశనము లేని శాశ్వతురాలు అమ్మవారు. పరమాత్మ గీతలో ఇలా తెలియచేసారు: " నాహం ప్రకాశః సర్వస్య           యోగమాయాసమావృతః,   మూఢో2యం నాభిజానాతి        లోకో మామజమవ్యయం "                   - భ.గీత 7:25 " నా యోగమాయయందు నేను అందరికిని గోచరింపను కనుక అజ్ఞానులు నన్ను జన్మరహితునిగా, శాశ్వతునిగా, పరమేశ్వరునిగా తెలిసికొనలేరు ". అంటే " నన్ను జనన మరణములకు ల...

రాక్షసి పూతనను దహనం చేస్తూంటే సువాసనలు కలిగాయిట - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏 " పావనాకృతిః " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 619 వ నామం . " పావనాకృతిః " అంటే పవిత్రీకరింపచేయు ఆకారము గలది. యాజ్ఞవల్క్య స్మృతి తపస్సు, వేదాధ్యయనం స్థూలశరీరాన్ని శుద్ధి చేస్తుంది, జ్ఞానం బుద్ధిని శుద్ధి చేస్తుంది. జీవుని ఈశ్వరుడుగా తెలుసుకుంటే అన్నిటికంటే ఉత్తమమగు శుద్ధి కలుగుతుంది అని తెలియచేస్తూంది. పూతన రాక్షసి. బాలకృష్ణుడిని చంపడానికి వచ్చి ఆయనచేతిలో మరణించింది. భారీకాయం. ఎందరినో మనుషులను, జంతువులను తిని ఉంటుంది. శరీరమంతా విషం పేరుకుపోయి ఉంటుంది. ఎలా వదుల్చుకోవాలి. నందుడు ఆ శరీరాన్ని చిన్న చిన్న ముక్కలుగా నరికించి ఊరుకు దూరంగా దహనానికి ఏర్పాటు చేసాడు.  ఆశ్చర్యకరంగా దహనమవుతూన్న పూతన శరీరంనుంచి మంచిగంధం, సుగంధద్రవ్యాలు కాలుస్తూన్నట్లు చక్కటి సువాసన వస్తూంది.  భాగవతం వింటూన్న పరీక్షిత్తు ఆశ్చర్యపోయి " అదెలా సాధ్యం మహర్షీ, పూతన మహా పాపాత్మురాలు, రాక్షసి, శరీరం దహనం అవుతూంటే పుణ్యాత్ములకు లాగ చక్కటి సువాసనలు ఎలా వచ్చాయి " అని అడుగుతాడు శుకమహర్షిని.  " పూతన కృష్ణుడిని ఒడిలో కూర్చోపెట్టుకుంది. కృష్ణుడు...

సత్యభాషణం అమ్మవారికి ఇష్టం - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏 " సత్యరూపా " - అమ్మవారి అద్భుతనామం. ఇవి శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 818 వ నామం.  " సత్యరూపా " - అంటే " సత్యమే రూపముగా గలది " అని అర్ధం. సత్యస్వరూపిణి. సత్యంలో కొలువై ఉంటారు అమ్మవారు. శంకరాచార్యులు " బ్రహ్మ సత్యం, జగన్మిధ్య " అన్నారు. బ్రహ్మజ్ఞానాన్ని పొందడం అనగా బ్రహ్మ ఎరుక కలిగి ఉండడమే సత్యం. ధర్మం నాలుగు పాదాలమీద నడుస్తుంది. దానిలో మొదటిది సత్యం. సత్యం ఎప్పుడూ ఒకేలా ఉంటుంది, ఎప్పటికీ మార్పు ఉండదు. ధర్మం అలాకాదు - దేశ కాల వర్ణ ఆశ్రమాల్లో మారుతూ ఉంటుంది. ఒకదేశంలో ధర్మమైనది ఇంకో దేశంలో ధర్మం అవాలనిలేదు, ఒకసమయంలో ధర్మమైనది ఇంకోసమయంలో ధర్మం కాకపోవచ్చు. కాని సత్యం మాత్రం ఏకాలంలో అయినా ఎక్కడయినా ఒకేలా ఉంటుంది.  వశిష్టులు రామాయణంలో అంటారు " సత్యం వదత, న అనృతం " - సత్యమే మాట్లాడాలి అని. అదీ మన సనాతనధర్మం గొప్పదనం.  అందుకే రామకృష్ణపరమహంస " ఈ కలికాలంలో యజ్ఞాలు, పూజలు, తపాలు, జపాలు మొగునవి చెయ్యడం కష్టమే కనుక సత్యం మాట్లాడడమే ముఖ్యమైన వ్రతం " అన్నారు. ఈ కలికాలంలో సత్యం మాట్లాడినా కష్టాలు కలుగుతూన్నా అబద్ధం ...

భక్తుల సమక్షం అమ్మవారికి పరమానందం - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏 " పరమోదా " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 940 వ నామం.  " పరమోదా " అంటే ఉత్కృష్టమైన సంతోషం గలది. పర అంటే అధికమయిన, మోదా అంటే సంతోషం.  భక్తులంటే అమితమయిన ప్రీతి, ప్రేమ అమ్మవారికి. ఎక్కడ పూజలు జరుగుతూన్నా, కీర్తనలు పాడడం, భజనలు చేయడం జరుగుతూన్నా అమ్మవారు అక్కడ ఉండి ఆనందిస్తూ ఉంటారు. తనను నమ్ముకున్న వారిని సదా సంతోషంగా ఉండేలా చూస్తూంటారు కూడా అమ్మవారు. ఆనందరూపిణి. తనను చూడడానికి వచ్చిన కుచేలుడిని గాఢంగా ఆలింగనం చేసుకుంటారు కృష్ణుడు. అప్పటివరకూ రుక్మిణీదేవితో కలిసి తను కూర్చున్న హంసతూలికా తల్పంపై కూర్చోపెట్టుకుని గురుకులంలో మనం గడిపిన రోజులు ఎంత బాగుండేవో కదా, ఎలా మర్చిపోగలం ఆ రోజులను అంటారు కృష్ణుడు కుచేలుడితో. ఓ సంఘటన గుర్తు చేసి జ్ఞాపకం ఉందా అని అడుగుతారు.  ఓ రోజు గురువుగారి పూజకు పత్రి పూలు సమిధలు తేవడానికి అరణ్యానికి వెడతారు కృష్ణుడు కుచేలుడు. భయంకరమయిన వర్షం కురుస్తుంది. వర్షం వెలిసే సమయానికి చీకటి పడుతుంది. దారి తప్పుతారు, ఎలా తిరిగి వెళ్ళాలో తెలియదు. ఆ సమయంలో గురువుగారు ఓ దీపంని పట్టుకుని వీరిని పేర్లతో పిలుస్త...

ఎదుటివారి భావాలను అర్ధంచేసుకుంటూ ఉండాలి - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏 " భావజ్ఞా " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 841 వ నామం. " భావజ్ఞా " అంటే భావములను తెలిసినది లేక ఎరుగునది. శంకరులు శివానందలహరి చేస్తూ " నరత్వం దేవత్వం నగవన మృగత్వం మశకతా......" (10) - ఏ జన్మ అయితేనేమి, మనస్సును మాత్రం నీపాదాలపైనే ఉండేలా చూడు తండ్రీ అంటారు.  అమ్మవారి పాదాలను ఆశ్రయిస్తే మన మనస్సులోని భావాలకు అనుగుణంగా అన్నీ అనుగ్రహిస్తారు. ప్రత్యేకంగా ఏమీ కోరుకోనక్కరలేదు. కుచేలుడి భార్య " ముఖ్యంగా పిల్లలకు జీవితం గడవడమే కష్టంగా ఉంది. వెళ్ళి మీ స్నేహితులు కృష్ణుడిని ఒకసారి కలవవచ్చుగదా " అంటుంది. వెళ్ళి ధనమో మణులో అడిగి తీసుకునిరండి అనలేదు ఆమె. కాని ఆమె మనస్సులోని భావాన్ని గ్రహించాడు కుచేలుడు. సరే అని బయలుదేరి వెళ్ళాడు. కాని అతని మనస్సులో ధనం కోరుదామనే ఆలోచనే లేదు. చాలాకాలమయింది కృష్ణుడి దర్శనం చేసుకుని తరిద్దాం అని వెళ్ళాడు. భార్య మనస్సులోని భావాన్ని కుచేలుడే తెలుసుకోగలిగినప్పుడు కుచేలుడి మనస్సులోని భావాన్ని పరమాత్మ తెలుసుకోలేడా. అందుకే కుచేలుడు వెళ్ళేటప్పటికే కృష్ణుడు తయారుగా ఉన్నారు. పరుగున వచ్చి ...

అమ్మవారి చిరునవ్వు కొందరికి అసూయ, బాధ, కోరిక కలిగిస్తుందిట - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏 " దరస్మేరముఖాంబుజా " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 924 వ నామం. " దరస్మేరముఖాంబుజా " అంటే చిరునవ్వు గల ముఖము గలది. అమ్మవారు ఎప్పుడూ చక్కటి చిరునవ్వుతో ఉంటారు. అమ్మవారికి విచారపడే విషయమేముంటుంది. భక్తులను యోగులను చూసి మురిసిపోతూ ఉంటారు. చెడుదారులు పట్టి బాధలలో ఉన్నవారిని చూసినా అమ్మవారికి బాధ ఉండదు. ఎందుకంటే ఎలాగయినా వారిని సన్మార్గంలో పెట్టగలననే ధీమా అమ్మవారిది. అందుకని ఎల్లప్పుడూ చిరునవ్వుతోనే ఉంటారు. దేవతలందరూ ఏవేవో కోరికలతో వస్తారుట అమ్మవారి దగ్గరకు. అమ్మవారి చిరునవ్వు చూడగానే ఎందుకొచ్చామో మర్చిపోతారుట. అమ్మవారు " చెప్పండి నాయనా, ఏమి కావాలి " అంటే ఏమీ లేదమ్మా, మీ పాద దర్శనం కోసం వచ్చామని చెప్పి నమస్కరించి వెళ్ళిపోతారుట. మూక శంకరులు కామాక్షీదేవి అమ్మవారి చిరునవ్వు మీద నూరు శ్లోకాలు వ్రాసారు. అది మందస్మిత శతకంగా ప్రసిద్ధి చెందింది.  అందులో ఓ శ్లోకంలో అతిశయోక్తి అలంకారం వాడారు: " మందారే తవ మంథరస్మితరుచాం      మాత్సర్యమాలోక్యతే కామాక్షి    స్మరశాసనే చ నియతం   రాగోదయో లక్ష్యతే,   చాంద్రీషు ద్యుతిమంజరీ...

అమ్మవారికి కాదు, మనకే త్రిగుణాలు ఉండేది - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏 " గుణాతీతా " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 961 వ నామం . " గుణాతీతా " అంటే త్రిగుణాలకు అతీతురాలు అని. అమ్మవారు మాయాప్రకృతి. అమ్మవారి మాయ కారణంగానే త్రిగుణాలు కలుగుతున్నాయి కదా. మరి ఆవిడకు కూడా ఈ గుణాలు ఉండాలి కదా.  ఈ సందేహానికి రామకృష్ణ పరమహంస చక్కటి వివరణ ఇచ్చారు. నాగుపాము విషానికి మనిషి మరణిస్తాడు. కాని ఆ విషం నాగుపామును ఏమీ చేయదు కదా. అమ్మవారి మాయ అటువంటిదే. గీతలో పరమాత్మ ఇలా తెలియచేసారు: " మానపమానయోస్తుల్య    స్తుల్యోమిత్రారిపక్షయోఃl*   సర్వారమ్భపరిత్యాగీ    గుణాతీతస్సఉచ్యతే "            - భ.గీత 14:25 " సుఖదుఃఖాలలో ఒక్క రీతిగానే ఉండేవారు; ఆత్మ భావన యందే స్థితమై ఉండేవారు; మట్టిముద్ద, రాయి, మరియు బంగారము వీటన్నిటినీ ఒకే విలువతో చూసేవారు; అనుకూల లేదా ప్రతికూల పరిస్థితిలో ఒక్కరీతిగానే ఉండేవారు; తెలివైన వారు; నిందాస్తుతులను రెంటినీ సమముగా స్వీకరించేవారు; గౌరవమును, అవమానమును ఒక్క రీతిగానే తీసుకునేవారు; శత్రువుని, మిత్రుడిని ఒకలాగే చూసేవారు; అన్ని యత్నములను విడిచిపెట్టినవారు - వీరు త...

అమ్మవారు 84 లక్షల జీవరాశుల బాగోగులను చూసుకోవాలి - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః "🙏 " సర్వతోముఖీ " - అమ్మవారి అద్భుతనామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 532 వ నామం.  " సర్వతోముఖీ ," అంటే సంపూర్ణస్వరూపం. అన్నివేపులకు ముఖములు కలిగినది అని అర్ధం.  శ్రీసూక్తంలో అమ్మవారిని " లోకైక దీపాంకురాం " అని స్తుతిస్తాం. లోకాలన్నిటినీ రక్షిస్తూన్న ఒకే దీపమై ఉన్న చల్లని తల్లి. దీపం ఏ వైపు చూస్తూందని అడిగితే ఏమి చెబుతాం. అదీ అమ్మవారి స్వరూపం. విష్ణుసహస్రంలో ఓ అద్భుత శ్లోకం ఉంది: " విశ్వమూర్తిః మహామూర్తిః  ‌  దీప్తమూర్తిరమూర్తివాన్,   అనేకమూర్తిరవ్యక్తః   శతమూర్తిః శతాననః " దీనిలో భగవంతుని రూపాన్ని పూర్తిగా తెలియచేయడం జరిగింది. ఈ రూపాన్ని దర్శించాలంటే భగవద్గీతలోని అర్జునుడు పరమాత్మని ఉద్దేశించి చేసిన ప్రార్ధన తెలుసుకోవాలి: " నమః పురస్తాదధ పృష్ఠతస్తే,   నమో2స్తు తే సర్వత ఏవ సర్వ,  అనంతవీర్యామిత విక్రమస్త్వం,   సర్వం  సమాప్నోషి తతో2సి సర్వః "                    - భ.గీ. 11- 40. " పరమాత్మా నీకు ఎదురుకుండా, వెనకనుండి, అన్నివైపులనుండీ నమస్కరిస్తున్నాను. నీవు అమిత ...

అమ్మవారికి భక్తులంటే ఎంత ప్రేమో, భక్తికి వశమయిపోతారు - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏 " భక్తివశ్యా " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 120 వ నామం.  " భక్తివశ్యా " అంటే భక్తికి అధీనురాలు.  తిన్నడు చదువుకోలేదు. ఏది చేయవచ్చో ఏది చేయకూడదో తెలియదు. నోటితో నీరు తీసుకువచ్చి లింగంమీద పోసాడు. మాంసం నైవేద్యం పెట్టాడు. కాని శివుడి కన్నులోంచి నీరు కారుతూందని తన కన్ను తీసి పెట్టేసాడు. సమర్పణ. తన్ను తాను సమర్పించేసుకోవడం. అటువంటి భక్తులకు వశమయిపోతారు దేవతలు. భాగవతంలో ఓ అద్భుత ఘట్టం ఉంది: " అథావరూఢః సపదీశయో రథాత్    ప్రధానపుంసోశ్చరణం స్వలబ్ధయే,    ధియా ధృతం  యోగిభిరప్యహం    ధ్రువం వ నమస్య ఆభ్యాం చ    సఖీన్ వనౌకసః " " రథం దిగగానే పరుగున వెళ్ళి కృష్ణుని పాదాలపై పడిపోతాను. ఆయన దయామయుడు. ఆయన చేయి నా తలపై పెట్టి క్షమిస్తాడు " అనుకుంటాడు అక్రూరుడు. అక్రూరుడు కృష్ణభక్తుడు. యదువంశీయుడు, శాంతస్వభావి, దయార్ద్రహృదయుడు. కంసుని స్నేహితుడు. కంసుడు అక్రూరుడిని పిలిచి " బృందావనం వెళ్ళు. కృష్ణబలరాములని యాగానికి ఆహ్వానించు. ఊరికే రమ్మంటే రారు కనుక చతుర్ధశి నాడు ధనుర్యాగం చేస్తాను నేను అని ఆహ్వానించు. వారి...

అమ్మవారు అనుకోవాలి, అనుగ్రహిద్దామని - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏 " అదృశ్యా " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 649 వ నామం . " అదృశ్యా " అంటే ఇంద్రియములకు కనబడనిది. అమ్మవారు కోటిసూర్య సమప్రభ. మధ్యాహ్నం సూర్యుడిని ఎలాగూ చూడలేము. ఉదయం సాయంకాలం సూర్యుడినే నేరుగా చూడలేము కదా. అమ్మవారిని ఎలా చూడగలం మన కంటితో. దర్శనం ఇద్దామని అమ్మవారు అనుకోవాలి. మనం కోరుకోవడం కాదు. అనన్యభక్తులకు అమ్మవారు దర్శనమిస్తారు. సందేహం అక్కరలేదు.  భాగవతంలో ఓ అద్భుత ఘట్టం ఉంది: " గిరా గద్గదయాస్తౌషీత్సత్త్వ   మాలంబ్య సాత్వతః .    ప్రణమ్య మూర్ధ్నావహితః    కృతాంజలిపుటః శనైః "               - భాగవతం 10:39:57 " గొంతు గద్గదమయి, కళ్ళంపట నీరు కారుతూండగా చేతులు పైకి ఎత్తి తలవంచి స్వామికి నమస్కరించారు " అని. ఎవరు, ఎందుకు, ఎప్పుడో చూద్దాం. కృష్ణబలరాములని చంపించడానికి కంసుని ప్రయత్నంలో భాగంగా అక్రూరుడు వారిని బృందావనం నుంచి మధురకు తీసుకుని వెడుతూ ఉంటారు. సూర్యాస్తమయం అవుతూండడంతో యమునానది ఒడ్డున రథం ఆపి దిగుతారు అక్రూరుడు సంధ్యావందనంకి. నదిలో దిగుతూంటే నీటిలో కృష్ణబలరాములు కనిపిస్తారు. వార...

అమ్మవారు కంటిచూపుతో అనుగ్రహిస్తారు - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏 " కటాక్షకింకరీభూతకమలాకోటిసేవితా " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 590 వ నామం.  " కటాక్షకింకరీభూతకమలాకోటిసేవితా " అంటే క్రీగంటిచూపులకు సేవకురాండ్రుగా అయిన కోట్లగలదీ లక్ష్మీదేవులచే సేవింపబడుతున్నది అని భాష్యం చెప్పారు. ఇక్కడ లక్ష్మీదేవులు అంటే దేవతాస్త్రీలు, భక్తులు అని తెలుసుకోవాలి. ఎవరిమీద అమ్మవారి చూపు కొంచమయిననూ పడుతుందో వారిని బ్రహ్మగారు ఉన్నంతవరకూ అంటే ప్రళయకాలం వరకూ లక్ష్మీదేవి అనుగ్రహిస్తారు అని తాత్పర్యం. కంచి కామాక్షీదేవి కంటి చూపుతో అనుగ్రహిస్తారు. అమ్మవారు అనుగ్రహించలేనిది ఏమీలేదు.  ఆదిశంకరులు సౌందర్యలహరి గానం చేస్తూ అమ్మవారిని ఇలా ప్రార్థిస్తారు: " దృశా ద్రాఘీయస్యా    దరదళిత నీలోత్పలరుచా,    దనీయాంసం దీనం స్నపయ ‌‌  కృపయా మామపి శివే,    అనేనా అయం ధన్యో    భవతి న చ తేహానిరియతే,    వనేవా హర్మ్యేవా సమకర   నిపాతో హిమకరః "  " అమ్మా నేనెక్కడో దూరంగా చివరలో ఉంటాను ( యోగులు అంటే సనకసనందాదులు , నారదుడు వంటివారు ఆవిడకు దగ్గరగా ముందు వరుసలో ఉంటారని, అయోగ్యులు ఎక్కడో వ...

అమ్మవారికి భక్తులమీద అపారమయిన కరుణ/దయ - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏 " దయామూర్తిః " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 581 వ నామం. " దయామూర్తిః " అంటే దయయే స్వరూపముగా గలది. తల్లికి బిడ్డలమీద దయ, ప్రేమ తప్ప వేరే భావనలు ఎందుకుంటాయి. " కుపుత్రో జాయేత క్వచిదపి కుమాతా న భవతి " అన్నారు శంకరులు దేవీ అపరాధ క్షమాస్తోత్రం చేస్తూ. సృష్టిలో చెడ్డతల్లి ఉండనే ఉండదు అని. రాసలీలకు ముందు " కృష్ణా, మిమ్మల్ని ఓ విషయం అడగవచ్చా " అని అడుగుతారు గోపికలు. కృష్ణుడు " అడగండి " అనగానే వారు అంటారు: ఈ ప్రేమలు ఆశ్చర్యకరంగా ఉంటాయి: 1. ఎదుటి వారు ప్రేమిస్తేనే ప్రేమిస్తారు కొందరు. 2. ఎదుటి వారు ప్రేమించకపోయినా      ప్రేమిస్తారు కొందరు. 3. ఎదుటి వారు ప్రేమించినా,      ప్రేమించకపోయినా          ప్రేమించరు కొందరు. ఈ ముగ్గురిలో మీరు ఎవరు అని అడుగుతారు కృష్ణుడిని. ఎంత చక్కటి ప్రశ్న. కృష్ణుడు అద్భుతమయిన వివరణ ఇస్తారు గోపికల ప్రశ్నకు: 1. మొదటివారిది పశువు/జంతు ప్రేమ. తమకు ఉపయోగపడతారు, ప్రయోజనమవుతారు అనే వారినే ప్రేమిస్తారు. ఆవులు, కుక్కలు లాంటి జీవుల్ని పెంచుకునేది, వాటికి పేర్లు పెట్టుకుని ముద్ద...

సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు అందరికీ - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏 " కామకోటికా " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 589 వ నామం. " కామకోటికా " అంటే ఏకదేశముగా గలది. దేశము అంటే శరీరము. కామ అంటే పరమశివుడు. పరమశివుని శరీరమే శరీరముగా గలది. అర్ధనారీశ్వర రూపం. కంచిపీఠాన్ని " కంచి కామకోటి పీఠం " అని పిలుస్తారు. అమ్మవారు కామాక్షీదేవి కోరికలను కంటిచూపుతో తీరుస్తారు. కామాక్షీదేవి అనుగ్రహించలేనిది లేదు. మూకశంకరులు మూకపంచశతిలోని ఆర్యాశతకంలో కామాక్షీదేవిని ఇలా కీర్తిస్తారు: " కామపరిపంథికామిని కామేశ్వరి     కామపీఠమధ్యగతే,   కామదుఘా భవ కమలే    కామకలే కామకోటి కామాక్షి"                         - శ్లోకం 49 " కామపీఠము మధ్యనున్నదానా, లక్ష్మీస్వరూపము గలదానా కోట్లాది కామములు నీయందున్నవి. భక్తుల కోరిన కోర్కెలు అనుగ్రహించుదానవు. నీవు నా కోర్కెలు తీర్చు తల్లీ " అని. ఈ శ్లోకంలో అమ్మవారిని " కామకోటి " అన్నారు మూకశంకరులు. కోట్లకొలదీ కోరికలు ఉంటాయిట అమ్మవారి దగ్గర, భక్తులకు ఇవ్వడానికి. ఏది కోరినా లేదనరు. అమ్మవారి పాదాలను ఆశ్రయించి అందరినీ చల్లగా చూడమన...

మకరసంక్రాంతి శుభాకాంక్షలు - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీరస్తు శుభమస్తు"🙏 " విశ్వప్రియే విష్ణుమనో2నుకూలే    తత్పాదపద్మం మయిసన్నిధత్స్వ"                           - శ్రీసూక్తం. " నీ పాదపద్మమును నాపై ఉంచి కటాక్షించు తల్లీ " అని ప్రార్ధిస్తాం అమ్మవారిని.  మూకకవి/మూకశంకరులు కంచికామాక్షీ అమ్మవారి దర్శనకటాక్షంతో ఆసువుగా 500 శ్లోకాలతో అమ్మవారిని ప్రార్ధన చేసారు. అది " మూకపంచశతి " గా ప్రసిద్ధిచెందింది. దానిలో అమ్మవారి పాదపద్మాలను 100 శ్లోకాలతో స్తుతించారు.  ఇలా పాదాలను ఆశ్రయించడం/స్తుతించడం ఏమిటీ అని చాలామందికి ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది.  భగవద్గీత గురించి ప్రవచనం చేస్తూ ఒక పండితులు దీని గురించి ఒక అద్భుతమయిన విషయం తెలియచేసారు. " వలలో పడ్డాడు పాపం " అంటూంటారు ఎవరయినా మాయకు/మోసానికి లోనయితే. అమ్మవారు జీవులందరూ ఉత్తీర్ణులవాలని అన్ని అవకాశాలనూ కలిగిస్తుంది కాని ఆవిడపెట్టే పరీక్షలు కొంచెం కఠినంగానే ఉంటాయి.  ఎల్కెజీలో చేరడానికే ఎన్నో పరీక్షలు పెడుతూంటే ముక్తి/మోక్షం పొందడానికి అమ్మవారు పెట్టే ఎన్ని పరీక్షలు ఎదుర్కోవాలి జీవుడు. ఒక చేపలు పట్టేవాడు...

భోగి పండుగ శుభాకాంక్షలు - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీరస్తు శుభమస్తు"🙏 భోగి " భోగ " అనే సంస్కృత పదం నుంచి వచ్చింది. భోగం అంటే సుఖం/ఆనందం. అష్టైశ్వర్యాలు లాగే అష్టభోగముల గురించి కూడా చెబుతూంటారు. గోదాదేవి ఈరోజునే శ్రీరంగనాథునిలో ఐక్యమయి భోగాన్ని పొందిందని పురాణకధనం. వామనపురాణంలో బలిని పాతాళానికి పంపించిన తరువాత వామనుడు బలికి వరమిస్తారు. సంక్రాంతికి ముందు రోజు భూలోకానికి వచ్చి అందరినీ ఆశీర్వదించమని. మనం వేసే భోగిమంటలు బలిని ఆహ్వానించడానికే. ప్రతీ పండుగకు ఓ అద్భుతమయిన పురాణకధనం. ఎంత అద్భుతం మన సంస్కృతి. భోగి, సంక్రాంతి పండుగులగురించి పూజ్యులు గరికిపాటి వారు కొన్ని అద్భుత విషయాలు తెలియచేసారు.  భోగి అంటే సంస్కృతంలో " తయారు/ప్రిపరేషన్ " అని కూడా అర్ధంట. ఏ పండుగకైనా ముందరరోజే కొన్ని ఏర్పాట్లు చేసుకోవాలి. ఉగాది అనుకోండి - వేపపువ్వు, మామిడికాయ, చెరకుముక్కలు లాంటివి ముందరరోజే ఏర్పాటు చేసుకుంటాం. దీపావళి అయితే చెప్పనక్కరలేదు. టపాసులు, అమ్మవారిపూజకి ఎక్కువగా పువ్వులు స్వీట్స్ మొ.గు నవి ఏర్పాటుచేసుకోవాలి. దసరాలయితే అమ్మవారి పూజలకి దండలు వత్తులు పూలు తప్పనిసరి. అంటే ఏ పండుగకైనా ముందరరోజుని " భోగి " అనే ప...

అమ్మవారి మూడవ కన్ను ఎరుపు - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏 " త్రిలోచనా " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 477 వ నామం . " త్రిలోచనా " అంటే 3 నేత్రములు గలది అమ్మవారు అని.  అమ్మవారి రెండు కళ్ళు సూర్యచంద్రులు. జీవులను సదా రక్షిస్తూ ఉంటారు ఈ కళ్ళతో. మూడవ కన్ను అగ్ని. దుష్టులను శిక్షిస్తూ ఉంటారు ఈ కన్నుతో. ఈ మూడవ కన్ను కొద్దిగా ఎరుపురంగులో ఉంటుంది.  ఈ మూడవ కన్ను ఎరుపురంగు గురించి ఆదిశంకరులు సౌందర్యలహరిలో అద్భుత వివరణ ఇచ్చారు: " కవీనాం సందర్భస్తబక ....   ...అసూయాసంసర్గాదళిక    నయనం కించిదరుణం "        - సౌందర్యలహరి : 50 శ్రీశంకరాచార్యులవారు సౌందర్యలహరి గానం చేస్తూ " అసూయాసంసర్గాత్ అళికనయనం కించిత్ అరుణం - నీ నుదుటిమీద ఉన్న మూడవకన్ను అసూయతో కొంచెం ఎర్రబడింది తల్లీ " అన్నారు పై శ్లోకంలో. మాగ్రామంలో ప్రతీ సంవత్సరం శ్రీశారదాదేవీనవరాత్రులు చేస్తారు. మొదలుపెట్టి సుమారు 66 ఏళ్ళు పైన అయింది. పగలంతా ఉపవాసం. రోజూ చండీహోమం జరుగుతుంది. రాత్రి సహస్రనామపూజ, మహానివేదనం, తాంబూలం, మహామంత్రపుష్పం, చామరసేవ అయాక వేదపారాయణ జరుగుతుంది.  అమ్మవారు సృష్టి బాగోగులన్నీ చూసి కొంచెం అల...

అక్షరం అమ్మవారి రూపం - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏 " వర్ణరూపిణీ " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 850 వ నామం.  " వర్ణరూపిణీ " అంటే అక్షరస్వరూపిణి. " ఓం ఇత్యేకాక్షరం బ్రహ్మ " - ఒకటే అక్షరం, అది ఓం, అదే బ్రహ్మ/సత్యం. అమ్మవారి నుంచి ఓం వచ్చింది, ఓం నుంచి అన్ని అక్షరాలు వచ్చాయి. అక్షరాలనుంచే సృష్టి అంతా జరిగింది. ప్రళయకాలంలో మళ్ళీ సృష్టి అంతా అక్షరాలలోనూ, అక్షరాలు ఓంలోనూ, ఓం అమ్మవారిలోనూ లీనమవుతాయి.  అక్షరం పదమే ఒక అద్భుతం. క్షరం అంటే నాశనమయేది. అక్షరం అంటే నాశనం లేనిది. ఎంత చక్కటి పేరు పెట్టారు. అక్షరం ని అమ్మవారుగా భావించి కొలిచే అద్భుత సంప్రదాయాన్ని మనకు ఇచ్చింది మన సనాతనధర్మం. అక్షరాభ్యాసం దగ్గరనుంచి పిల్లలకు చదువులతల్లి సరస్వతీదేవిని ఎలా గౌరవించాలో నేర్పించడం, పుస్తకాలను ఎంత జాగ్రత్తగా గౌరవప్రదంగా ఉంచుకోవాలో నేర్పడం కూడా జరుగుతూంది.  పిల్లలకు అక్షరాభ్యాసం చేసినప్పుడు బియ్యంమీద ఓం నమశ్శివాయ అని వ్రాయిస్తారు. బియ్యంమీదనే ఎందుకని. బియ్యం చంద్రుడి రూపం. " చంద్రమా మనసో జాతః - చంద్రుడినుండి మనస్సు పుట్టింది " అని తెలియచేస్తూంది పురు‌షసూక్తం. అంటే తెల...

ముక్కోటి/వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు అందరికీ - చీమలపాటి సూర్యనారాయణ.

 🙏"శ్రీమాత్రేనమః"🙏 " ముకుందా " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 838 వ నామం. " ముకుందా " అంటే మోక్షమును ఇచ్చునది అని భాష్యం చెప్పారు. అమ్మవారు కరుణామూర్తి. ఎవరిని అనుగ్రహిద్దామా, ముక్తిని ఎలా ప్రసాదిద్దామా అని ఆలోచన చేస్తూ ఉంటారు. కాని ఆ అనుగ్రహాన్ని పొందడానికి సాధన అధికంగా చేయాలి. భాగవతంలో ఓ అద్భుత ఘట్టం ఉంది. భగవానుడికి తనవారు పరాయివారు అనే భావన ఉండదు. ఆయనకు అందరూ సమానమే. వారి వారి సాధనలను బట్టి అనుగ్రహిస్తారు. కాని కృష్ణుడు గోపికలను అనుగ్రహించాలని నిశ్చయించుకుని ఓ శరత్కాలపురాత్రి కల్పవృక్షం క్రింద నుంచుని వేణుగానం చేస్తారు. గోపికలు ఎక్కడి పనులు అక్కడే విడిచిపెట్టేసి వేణుగానం వినిపిస్తూన్న వైపుకు పరిగెడతారు.  కృష్ణుడు " ఇంత అర్ధరాత్రి పిల్లలను భర్తలను బంధువులను విడిచి ఇలా వచ్చేసారేమిటి. లోకం ఏమనుకుంటుంది " అని పరీక్ష చేయడానికి వారి బంధాలను గుర్తుచేశారు. గోపికలు " లోకంతో బంధాలు పెట్టుకున్నవారికి నువ్వు చెప్పినవన్నీ ధర్మమే. కాని బంధాలను విడిచిపెట్టేసి వచ్చాం. నీ భక్తులను అనుగ్రహించినట్లే మమ్మల్ని కూడా అనుగ్రహించు " ...

నాకు ఏమీ తెలియదు అన్నవారు జ్ఞాని - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏 " అవ్యక్తా " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 398 వ నామం. " అవ్యక్తా " అంటే మొదటి మాయా స్మరణ స్వరూపురాలు. వ్యక్తము కానిది. భౌతిక నేత్రాలకు గోచరించనిది అని అర్ధం.  దీనిని వివరించడానికి సాధారణంగా విత్తనం, చెట్టు ఉదాహరణ చెబుతారు. మర్రి చెట్టు విత్తనం చిన్న గింజ. దానిని భూమిలో ప్రాతి నీరు పోస్తే పెద్ద చెట్టు అవుతుంది. చెట్టు వ్యక్తం, విత్తనం అవ్యక్తం అని. కాని విత్తనం కూడా కనిపిస్తూంది కదా. ఈ విత్తనం నుంచి మర్రిచెట్టు వస్తుంది అని కూడా తెలుస్తూంది కదా. అంటే విత్తనం కూడా వ్యక్తమే. అందుకే అన్నింటికీ అవ్యక్తస్వరూపం అమ్మవారే అని తెలుస్తూంది. కేనోపనిషత్తు " నాకు ఏమీ తెలియదు అన్నవారు జ్ఞాని " అని తెలియచేస్తూంది. అదేమిటీ అనిపిస్తుంది కాని అతనికి అమ్మవారు ఇంద్రియములద్వారా తెలుసుకోలేనివారు అని తెలుసు అని గ్రహించాలి. అందుకే నాకేమీ తెలియదు అన్నాడు. తెలుసు అంటే అబద్ధం. అమ్మవారు ఎలా తెలుస్తారు. అవ్యక్తమునండి జన్మ తీసుకుని వ్యక్తమవడం, మళ్ళీ మరణించిన తరువాత అవ్యక్తంలో కలిసిపోవడం, అదే సృష్టి కార్యక్రమం..  ఇదే విషయాన్ని గీతలో ...

శరీరం క్షేత్రం అని తెలుసుకున్నవాడు క్షేత్రజ్ఞుడు - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏 " క్షేత్రక్షేత్రజ్ఞపాలినీ " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 343 వ నామం .  " క్షేత్రక్షేత్రజ్ఞపాలినీ " అంటే శరీరమును, శివుని పాలించునది అని భాష్యం చెప్పారు. " శరీరముచే కార్యములు చేయించువాడు క్షేత్రజ్ఞుడు " అని తెలియచేస్తూంది మనుస్మృతి.  ఈ భాష్యంలో అద్భుత విషయం ఉంది. క్షేత్రం అంటే శరీరం అని తెలిసినదే. క్షేత్రజ్ఞుడిని శివుడు అని భాష్యం చెప్పారు. ప్రతీ జీవిలోనూ ఉన్నది శివ చైతన్యమే కదా. అహం బ్రహ్మాస్మి అంటే ఇదే. అద్వైత భావన. శరీరం కర్మక్షేత్రం. కర్మలు చేయడమే దాని పని. చేయించేది నేను అనే క్షేత్రజ్ఞుడు. శరీరం యొక్క రూపురేఖలు మారిపోతూ ఉంటాయి. శైశవంలోంచి బాల్యం, యవ్వనం, వృద్ధాప్యం లోకి మారుతారు కాని నేను అనే భావన ఎప్పుడూ ఒకలాగే ఉంటుంది. ఈ శరీరమే నేను అనే భావనలోనే గడిచిపోతుంది జీవితం. నేను వేరు, ఈ శరీరం వేరు అనే భావన సాధనతోనే లభిస్తుంది. పరమాత్మ ఇదే విషయాన్ని గీతలో ఇలా తెలియచేసారు: " ఇదం శరీరం కౌంతేయ    క్షేత్రమిత్యభిధీయతే,   ఏతద్యో వేత్తి తం ప్రాహుః    క్షేత్రజ్ఞ ఇతి తద్విదః "           - భ...

" అమ్మవారు గొప్పదానను అని భావించడంలో ఆశ్చర్యం ఏముంది " - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏 " మానవతీ " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 931 వ నామం .  " మానవతీ " అంటే నేను గొప్పదానను అను అభిమానము గలది అని భాష్యం చెప్పారు భాస్కరరాయలు.  అమ్మవారు గొప్పవారు అని భావించడానికి సందేహమేముంటుంది. 84 లక్షల జీవరాశుల బాగోగులను ఒంటిచేత్తో గమనిస్తూ అనుగ్రహిస్తున్నారు. సృష్టి అంతా చిత్రవిచిత్రాలే. ఊహకందని సంఘటనలు. కోట్ల సంవత్సరాలు అయినా ఇప్పటికీ సృష్టిలో ఇంకా తెలియని విషయాలు ఎన్నో. శ్రీసూక్తంలో అమ్మవారిని ఇలా స్తుతిస్తాం: " ధనమగ్నిర్ధనం వాయుః    ధనం సూర్యో ధనం వసుః,    ధనమిన్ద్రో బృహస్పతిః   వరుణం ధనమశ్ను తే " " అగ్ని, వాయువు, సూర్యుడు, అష్టవసువులు, ఇంద్రుడు, బృహస్పతి, వరుణుడు - అందరూ తమతమ సంపదలను నీ అనుగ్రహంతో అనుభవిస్తున్నారు తల్లీ " అని. ఇక్కడ సంపదలు అంటే శక్తులు అని కూడా భావం. వరాహ పురాణం ఇలా తెలియచేస్తూంది: " రౌద్రీ తపోరతా దేవీ తామసీ    శక్తిరుత్తమా సంహారకారిణీ    నామ్నా కాలరాత్రిం చ తాం విదు " " మృత్యువుకే భయకారిణి, ప్రళయకాలంలో యముని కూడా నశింపచేయునది అయినది కాలరాత్రి అమ్మవారు ...

సంతోషంగా గడపాలంటే సంతృప్తి ముఖ్యం - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏 " సదాతుష్టా " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 921 వ నామం. " సదాతుష్టా " అంటే ఎల్లప్పుడూ సంతోషము గలది. అమ్మవారు సంతోషంగా ఉంటేనే మనల్ని సంతోషపెట్టగలరు. " పద్మపత్రమివాంభసా " - అమ్మవారు తామరాకు మీద నీటిబొట్టులా ఉంటారు. మన కర్మలు చూసి అమ్మవారు సంతోషపడరు, బాధపడరు. కాని అమ్మ కదా. పిల్లలు మంచిపనులు చేసి వృద్ధిలోకి వస్తే సంతోషిస్తారు.  మనం నిత్యపూజ చేసేటప్పుడు " పరమేశ్వర ప్రీత్యర్థం, పరమేశ్వరముద్దిస్య " అని సంకల్పం చేస్తాం. మన పూజ మన కోసమే కాకుండా పరమేశ్వరుడి సంతోషం కోసం కూడా.  సంతోషంగా ఉన్నప్పుడు మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. మంచి మంచి ఆలోచనలు కలుగుతాయి. మంచి, చెడు కూడా శాశ్వతం కావు. అందుకని మంచి జరిగినప్పుడు పొంగిపోవడం, చెడు కలిగినప్పుడు బాధపడిపోవడం చేయనక్కర్లేదు. మన కోరిక నెరవేర్చుకోవడానికి గట్టి ప్రయత్నమే చేయాలి. ఎంత కష్టపడినా పని అవనప్పుడు " మన ప్రాప్తం " అంతే అనుకుని ఆ విషయం వదిలేసి ముందుకు సాగిపోవాలి. అంతేకాని దాని గురించే బాధపడుతూ కూర్చోకూడదు. సంతోషం సగం బలం అని నానుడి. " అశాంతస్య కుత...

" శాంతము లేక సౌఖ్యము లేదు " అన్నారు త్యాగయ్య - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏 " శాంతిః " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 447 వ నామం . " శాంతిః " అంటే కామక్రోధములు లేకుండుట అని భాష్యం చెప్పారు. " యా దేవీ సర్వభూతేషు శాంతి రూపేణ సంస్థితా " - అమ్మవారు జీవులందరిలోనూ శాంతి రూపంలో ఉంటారు. ఏ మనిషి అయినా ప్రశాంతంగా జీవించాలనే కోరుకుంటాడు. ఉదయాన్నే ఈరోజు ఏ గొడవలు లేకుండా హాయిగా గడిచేలా చేయమని అమ్మవారిని ప్రార్థిస్తాడు కూడా. కాని సమాజం అలా జరగనీయదు, పరీక్షలు పెడుతుంది. మనకు తెలీకుండానే కొన్ని తప్పులు జరిగిపోతూ ఉంటాయి. అధర్వణవేదంలో శాంతి సూక్తం ఉంది. అందులో ఓ అద్భుత శ్లోకం ఉంది: " ఇయం యా పరమేష్ఠినీ    వాగ్దేవీ బ్రహ్మసంశితా,    యయైవ ససృజే ఘోరం    తయైవ శాంతిరస్తు నః " " బ్రహ్మ నుండి మహిమను పొంది, ఎవరి వలన ఘోర పరిమాణాలు ఏర్పడుతున్నాయో ఆ దేవీ, సర్వోత్కృష్ట దైవమూ అయిన సరస్వతీదేవి మనకు శాంతిని ప్రసాదించుగాక " అని. ఇది చదివితే ఆశ్చర్యం వేస్తుంది. సరస్వతీదేవివల్ల ఘోరపరిమాణాలు కలగడం ఏమిటి అని. సరస్వతీదేవి వాక్కుకు అధిపతి. అనవసరమయిన తప్పుడు మాటలు మాట్లాడడం వల్ల ఘోర పరిమాణాలు సంభవించడ...

అమ్మవారు సంతోష ప్రదాత - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏 " తుష్టిః " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 443 వ నామం .  " తుష్టిః " అంటే సంతోషస్వరూపురాలు. " యా దేవీ సర్వభూతేషు    తుష్టి రూపేణ సంస్థితా " అమ్మవారు జీవులలో సంతోషరూపంలో ఉంటారు.  రుద్రచమకం పారాయణ చేస్తూ " సూషా చ మే, సుదినం చ మే " అని ప్రార్థిస్తాం. ఈరోజు మంచి రోజుగా చేయమని ప్రార్ధన. ఎవరయినా ప్రతీ రోజూ సంతోషంగా గడిచిపోవాలనే కోరుకుంటారు. ఎవరితోనో కావాలని గొడవపెట్టుకోవాలని కోరుకోరు. సమాజం మాయ చేస్తుంది. మనల్ని మనంగా ఉండనివ్వదు. అవసరంలేని విషయాలలో కలుగచేసుకుని ఇరుక్కుంటాం. " అతి సర్వత్ర వర్జయేత్ " అన్నారు. మంచితనం కూడా అతి పనికిరాదు. మంచితనం కారణంగా కూడా కొందరు కష్టాలపాలవుతూంటారు. లేదు, కాదు అనలేకపోవడం కొందరికి బలహీనత. శక్తికి మించిన సహాయాలు చేస్తూ కూడా కొందరు కష్టాలపాలవుతూంటారు. ధర్మరాజు భీష్ముని " మనిషి పాటించవలసిన అత్యుత్తమ ధర్మం ఏమిటి తాతా " అని అడుగుతాడు. భీష్ముడు అంటారు " ఎదుటివారు ఏ పని చేస్తే నీకు అసౌకర్యం, బాధ కలుగుతాయో ఆ పని నీవు చేయకుండా ఉండడమే అత్యుత్తమ ధర్మం ...

పూజలో భేషజం కాదు, భక్తి ముఖ్యం - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏 " అనిత్యతృప్తా " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 815 వ నామం. " అనిత్యతృప్తా " అంటే నిత్యములు కాని ఉపచారాలతో సంతోషించునది. అటువంటి ఉపచారాలతో " కూడా " సంతోషించునది అని భావించాలి. సాధారణంగా మనం చేసే పూజలో చేసే ఉపచారాలన్నీ అనిత్యాలే. సమర్పించే పూలు పళ్ళు నైవేద్యాలు పానీయాలు అన్నీ అనిత్యమే. ఏదీ రెండు మూడు రోజులకన్నా నిలవ ఉండవు. కాని ఏదో ఒకటి సమర్పించాలి అనే భక్తుల భావనకు అమ్మవారు తృప్తి చెందుతారు. భక్తకన్నప్ప ఓ చేత్తో పూలు ఇంకో చేత్తో నైవేద్యం పట్టుకున్నాడు. మరి అభిషేకానికి నీరు ఎలా పట్టుకెళ్ళడం. నోటితో పట్టుకుని వెళ్ళి శివలింగం మీద ఊసాడు. అది తప్పని కన్నప్పకు తెలియదు. ఆ పూజకే మురిసిపోయి మోక్షాన్ని ప్రసాదించాడు శివుడు కన్నప్పకు. పరమాత్మ గీతలో ఇదే తెలియచేసారు: " పత్రం పుష్పం ఫలం తోయం    యో మే భక్త్యా ప్రయచ్ఛతి,   తదహం భక్త్యుపహృతమ్    అశ్నామి ప్రయతాత్మనః "               - భ.గీత 9:26  " నాకు ఎవరైనా భక్తితో ఒక ఆకుగాని, ఒక పువ్వు గాని, ఒక పండు గాని, లేదా నీరైనా గాని సమర్పిస్తే, ఆ స్వచ్...