Posts

Showing posts from December, 2023

సనాతనధర్మం భవిష్యత్తు - సంస్కృతి సంస్కృతం 5 - చీమలపాటి సూర్యనారాయణ

 🙏" శ్రీమాత్రేనమః "🙏 " సంస్కృతి - సంస్కృతం 5 " మా గ్రామవాసి, బంధువు అయిన " పండితరాజ " జగన్నాధపండితులు తన 25వ ఏటే కాశీవిశ్వవిద్యాలయానికి ముఖ్యాధిపతి అయేరు. ఆయన 16వ ఏటకే వేదశాస్త్రాల్లో దిట్ట, ఎందరో పండితులను శాస్త్రవిజ్ఞానంతో ఓడించి ఆ పదవి చేపట్టడం జరిగింది.  ఆకాలంలో బాదుషా వారి ఆస్థానంలో ఉండే మౌల్వీలు హిందువులగురించి కొంచెం కించపరిచే విధంగా మాట్లాడేవారు. ముఖ్యంగా 2 విషయాలు బాధించేవి. ఒకటి సంస్కృతం కూడా అరబ్బీనుంచే పుట్టిందని, రెండవది హిందూ పురాణాలే చెబుతున్నాయి " పరశురాముడు 21సార్లు దండయాత్ర చేసి రాజుల్నందరినీ చంపేసాడు " అని, కనుక దేశంలో అప్పుడున్న రాజులందరూ " నకిలీలే " అనీనూ. రాజస్తానీయ " జయపుర " పాలకుడైన మొదటి శ్రీసవాయీ జయసింహ మహారాజు ఈయన్ని కలిసి విషయం చెప్పి " చాలా బాధగా ఉంది, నేను ధనసహాయం చేస్తాను, తమరు ఆజ్మీర్ వెళ్ళి వారి భాషలు అరబ్బీ, పార్శీ, ఉర్దూలను నేర్చుకుని వారిభాషలోనే వారికి సరైన సమాధానం చెప్పి మా ఈ బాధను తొలగించాలి " అని అడగడంతో ఈయన ఆ భాషలలో పాండిత్యం సంపాదించి వచ్చి, మహారాజు పలుకుబడితో ఓ రోజు బాదుషా ...

జ్యోతిషం నమ్మవచ్చా - సంస్కృతి - సంస్కృతం 6 - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏 " సంస్కృతి - సంస్కృతం 6 " క్రితం పోష్టు( సంస్కృతి - సంస్కృతం 4 )లో " కీరో " అని ఐరిష్ జ్యోతిష్కుడి పేరు వ్రాయడం జరిగింది. ఆయన అసలు పేరు " విలియం జాన్ వార్నర్ ( 1866-1936) ". కొందరికి " పూర్వజన్మ " వాసనల వలన అనుకోవచ్చు చిన్నప్పటినుంచీ పాటలుపాడడం, కవితలు వ్రాయడం, కధలువ్రాయడం, ఆటలుఆడడం లాంటి ప్రత్యేకతలపై ఎక్కువ ఆసక్తి ఉండి చిన్నవయస్సులోనే దానిలో నిష్ణాతులవుతారు.  అలాగే ఈ కీరో కి భారతీయ సాముద్రికం మీద ఆసక్తి కలిగి, నేర్చుకోవాలని అనుకుని ఎవరో " భారతదేశం వెళ్ళు, అక్కడ ఎందరో పండితులు ఉన్నారు " అని సలహా ఇవ్వడంతో ఓడ ఎక్కి బొంబాయి చేరుకున్నాడు. అక్కడివారు చెప్పడంతో " కొంకణ్ " తీరానికి వచ్చి ఒక పండితుణ్ణి కలిసాడు. ఇతని ఆసక్తి, శ్రద్ధ చూసి ఆయన శిష్యుడిగా చేర్చుకుని 2 సం.లు విద్యనేర్పారు.  ఆ సమయంలోనే ఇతని జాతకం చూసి ఫలానా సమయంలో ఇతనికి వివాహం అవుతుందంటూ ఇంకొన్ని విషయాలు కూడా చెప్పారు ఆ పండితుడు. కీరోకి ఆశ్చర్యం వేసింది. ఇతను అప్పటికే వివాహం చేసుకోకూడదని, బ్రహ్మచారిగానే ఉండిపోయి పెద్ద జ్యోతిష్కుడు అవాలని నిర్ణ...

భారత్ ప్రపంచానికి ఇచ్చినది " సున్న " - చీమలపాటి సూర్యనారాయణ

 🙏 " శ్రీమాత్రేనమః " 🙏  " సంస్కృతి-సంస్కృతం 4 " ( 29/12/2023 న పోష్ట్ చేసిన " సంస్కృతి - సంస్కృతభాష 3" విషయాలకు ఇది కొనసాగింపు ). జర్మనీ యూనివర్శిటీలో " మహామహోపాధ్యాయ " అని బిరుదు పొందిన " డా. ఆల్డ్ డోర్ఫ్ " అనే పండితుడు " జర్మన్యాం సంస్కృతాధ్యయనం " అనే అంశాన్ని గూర్చి అన్నమాటలు ఇలా ఉన్నాయి: " జర్మన్యాం కశ్చిదేకః  పండితః   .....   ..........  దీర్ఘాయుష్యం లిప్సతే.."  అంటే " జర్మనీలోని ఒకనగరంలోని పండితుడు కాళిదాసు అభిజ్ఞానశాకుంతలాన్ని శిరస్సుపై పెట్టుకుని పరవశంతో నాట్యం చేస్తూంటాడు. ఇంకోనగరంలో ఇంకో పండితుడు ఉపనిషత్తుల పారాయణంతో బ్రహ్మానందాన్ని పొందుతూంటాడు. ఇంకొకాయన ఇంకోనగరంలో మనుస్మృతి పఠనంతో మనశ్శాంతిని పొందుతూంటాడు. ఇంకొకకాయన పతంజలిమహర్షి యోగశాస్త్రాన్ని అభ్యసించి దీర్ఘాయుర్దాయాన్ని పొందగోరుతాడు " అంటూ విపులంగా వ్రాసారు. ఇక జర్మన్ దేశీయుడే అయిన " మేక్స్ ముల్లర్ " పండితుడు తన "ఋగ్వేదభాష్య పరిశోధన వ్యాసాంతం " లో తన పేరును, దేశాన్ని, తనుచదివిన యూనివర్శిటీ పేరును సంస్కృతంలోకి " తర్జ...

3వ భాగం - " సంస్కృతి-సంస్కృతం " - 3 - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏  " సంస్కృతి-సంస్కృతం " - 3 ( 28/12/2023 ఉదయం నేను పోష్ట్ చేసిన " సంస్కృతి - సంస్కృతభాష " విషయానికి ఇది కొనసాగింపు ). రూస్ ( రష్యా ) దేశస్తుడైన " లూయీరేణు " అనే పండితుడు మన సంస్కృతభాష మీద చేసిన పరిశోధనలు అద్భుతం. అవి తరువాత తెలుసుకుందాం, ముందు ఆయన మన దేశం నుంచి తిరిగివెళ్ళిపోతూ అన్న క్రింది మాటలు చదవండి : " నేను ఒకే ఒక దుఃఖంతో భారతం నుంచి నా స్వదేశానికి వెడుతున్నాను. మేము పుట్టుకచేత యూరోపియన్లమైనా ఏ అమృత ( సంస్కృత ) భాషను ఆధారంగా చేసుకుని భాషావిషయక పరిశోధనలు చేస్తున్నామో, అమృతలక్షణలక్షితమైన ఆ భాషనే భారతీయులు కొందరు " మృతభాష " అంటున్నారు. భారతీయుల మరో దౌర్భాగ్యానికి నిదర్శన మేమిటంటే ఈ దేశంలో విద్యాశాఖాధికారులకు కూడా సంస్కృతం రాదు " అని.( అప్పుడు ఆయన ఊహకి కూడా అంది ఉండదు, భవిష్యత్తులో ఇక్కడ అక్షరం ముక్కరాని వారు " విద్యాశాఖమంత్రులు, విశ్వవిద్యాలయ అధిపతులు " అవుతారని ).  ఇప్పుడు విషయానికి వద్దాం. ఆయన అనే ముఖ్య విషయం ఏమిటంటే " అందరూ ఆంగ్లభాషకు లాటిన్ పదాలు మూలమంటున్నారు " కాని లాటిన్ పదాల మూ...

2వ భాగము - " సంస్కృతి-సంస్కృతం " - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏 " సంస్కృతి-సంస్కృతం " - 2 మన సనాతనధర్మం మన సంస్కృతి మన సంస్కృతభాష గొప్పదనం గురించి ఓ సారి నెమరు వేసుకుందాం. ఏ దేశ సంస్కృతి అయినా ఆ ప్రజలమనస్సులకు ఉత్తమ సంస్కారాలు అనగా " పరోపకారం, మానవసేవ " వంటి ఉదారభావాలు కలిగించి వారి జీవితధ్యేయాలను ఉత్తమలక్ష్యాలు కలవానివిగా తీర్చిదిద్ది తోటిదేశాలకు నైతిక వైజ్ఞానిక ధార్మిక బిక్ష పెట్టగలిగి ఉండాలి. ఇటువంటి సంస్కృతికి పుట్టినిల్లు మన అమృతభాష " సంస్కృతం ". సంస్కృతభాషా లక్ష్యం ఎంతటి ఉన్నత భావాలు కలదో ఈ క్రింది శ్లోకాలద్వారా గ్రహించవచ్చు. 5000 ( కనీసం ) ఏళ్ళక్రితం భగవద్గీతలో పరమాత్మ చెప్పినది: " విద్యావినయ సంపన్నే,    బ్రాహ్మణే గవి హస్తిని,    శునిచైవ శ్వపాకేచ,    పండితాః సమదర్శినః "            - భ.గీత 5:18 " విద్య వినయాలు ఉన్నవారు బ్రాహ్మణుణ్ణి ఆవుని ఏనుగుని కుక్కను కుక్కనుతినే దానిని కూడా ఒకే సమదృష్టితో చూస్తారు " అని అర్ధం. అన్ని జీవులని ( మనుషులే కాదు ) సమభావంతో చూసేవాడే నిజమైన ఉత్తముడు అని తెలియచేసారు. " సర్వే అత్ర సుఖినః సంతు,    సర్వే సంతు నిరామయాః, ...

" సంస్కృతి - సంస్కృతం "- 1 - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీరస్తు శుభమస్తు"🙏 " సంస్కృతి - సంస్కృతం "- 1 " ఉతదేవా అవహితం    దేవా ఉన్నయధా పునః "                          - ఋగ్వేదం. " అవహితం " అంటే అడుగున ఉన్నవారు అని - " అలాంటి వారిని పైకి తీసుకురా పరమాత్మా " అని దేవుడిని ప్రార్ధించడం. " ఉతగాస చ కృషం    దేవా జీవయధా పునః "                 - ఋగ్వేదం. " అగాస " అంటే మళ్ళీ మళ్ళీ అని. " మళ్ళీ మళ్ళీ అపరాధాలు చేసేవారిని కూడా క్షమించు దేవా " అని దేవుడిని ప్రార్ధించడం.  ఎంత అద్భుతం మన వేదవాగ్మయం. " దీనజనోద్ధరణ " అనే ప్రక్రియను వేల ఏళ్ళ క్రితమే ప్రారంభించింది మన సనాతనధర్మం  రావణుడు మరణించాక సీతమ్మను రాముడివద్దకు తీసుకువెళ్ళడానికి వస్తారు హనుమ. అంతవరకూ సీతమ్మను సూటిపోటిమాటలతో హింసించిన రాక్షస స్త్రీలు బిక్కుబిక్కుమంటూ చెట్ల వెనక దాక్కుని చూస్తూ ఉంటారు. హనుమ కోపాన్ని ఆపుకోలేక " ఊ అనమ్మా, ఒక్క గుద్దుతో చంపేస్తాను వీరినందరినీ " అని అంటే సీతమ్మ అంటారు " అకశ్చిన్ అపరాధతే " - అపరాధం చేయనివారు ఎవరు నాయనా. పరిస...

గురుదత్తాత్రేయ జయంతి నేడు, శుభాకాంక్షలు అందరికీ - చీమలపాటి సూర్యనారాయణ

 🙏" శ్రీరస్తు శుభమస్తు "🙏 గురుదత్తాత్రేయ జయంతి నేడు. అత్రిమహర్షి అనసూయల పుత్రుడు ఈయన. అనసూయ మహాపతివ్రత. సీతారామలక్ష్మణులు దండకారణ్యం ప్రవేశించేముందు ఈవిడ ఆశీస్సులు తీసుకుంటారు. ఆయన పుట్టుకే ఓ అద్భుతం. త్రిమూర్తులు, వారి భార్యలు కూర్చుని మాట్లాడుకుంటూంటే నారదుడు వస్తారు. మాటల్లో " మహాపతివ్రత " ఎవరూ అనే విషయం వస్తే నారదులు " అనసూయమ్మే " అనడంతో ముగ్గురమ్మలు బాధపడి, అలిగి, త్రిమూర్తులని " అది తప్పు " అని నిరూపించి రమ్మంటారు. త్రిమూర్తులు అనసూయను పరీక్షించడానికి వస్తారు. ఆమె సంతోషంతో భోజనంచెయ్యమని అడిగితే వారు తను దిగంబరంగా వడ్డిస్తే తింటామంటారు. దానికేముంది అని త్రిమూర్తులను చిన్నపిల్లలుగా చేసేసి తినిపిస్తుంది. త్రిమూర్తులు ఆమె సమయస్ఫూర్తికి ముగ్ధులయి వరం కోరుకోమంటే వారిని తనకు కుమారులుగా జన్మించమంటుంది. బ్రహ్మ అంశతో చంద్రుడు, శివుని అంశతో దూర్వాసుడు జన్మించారు. విష్ణువు మిగతా ఇద్దరి అంశలు కలుపుకుని దత్తాత్రేయుడిగా జన్మించారు.  ఆయన భార్య అనఘాదేవి. అఘం అంటే పాపం. అనఘ అంటే పాపం అంటనిది/లేనిది. పరమపవిత్రురాలు. శ్రీలలితాసహస్రంలో ఒక అద్భుతనామం (987 వ నా...

ఋషి వ్యవస్థ - సనాతనధర్మం - చీమలపాటి సూర్యనారాయణ

 🙏" శ్రీరస్తు శుభమస్తు "🙏 " ఋషి " అంటే అతీంద్రియమయిన జ్ఞానాన్ని దర్శించినవారు. ఈశ్వర సంకల్పాన్ని లోకాలకు అందించే అద్భుత వ్యవస్థ. శాస్త్రజ్ఞులు కూడా ఋషులే. గెడ్డంపెంచుకుని ముక్కుమూసుకుని ఓమూల కూర్చుని ఉంటారు అని సామాన్యుల భావన. సినీమాలు మనల్ని అలా అనుకునేలా చేసాయి. వారు కారణజన్ములు. వారు ఏది చేసినా లోకకళ్యాణాన్ని దృష్టిలో పెట్టుకునే. అటువంటివారు జీవించేది లోకకళ్యాణంకోసం.  రామాయణంలో 27 రకాల ఋషుల వివరణ ఉంది. 27 ఋషులుకాదు, 27 రకాల ఋషులు. కొందరు నీరునుమాత్రమే, కొందరు గాలినిమాత్రమే, కొందరు గాలిలో తేలుతూ, కొందరు సూర్యరశ్మినే అహారంగా తీసుకుంటూ ఇలా అనేక ఋషులు లోకకల్యాణం కోసం తపస్సు చేస్తున్నారు అని తెలియచేసారు. రామాయణంలో మతంగ మహర్షిని గురువుగా పొందగలిగింది శబరి. మహర్షి కుమారుడే మాతంగ మహర్షి, తపస్సు చేసి శ్యామలాదేవిని కూతురి ( మాతంగి ) గా పొందారు. మతంగ మహర్షి శబరితో " నేను వచ్చినపని అయిపోయింది, వెళ్ళిపోతున్నాను, త్వరలో రామలక్ష్మణులు ఇక్కడకు వస్తారు, వారిని సేవించుకుని తరించు " అని చెబుతారు. వస్తున్నారని తెలిసినా రామలక్ష్మణులకోసం ఆగలేదు మహర్షి. ఆ మహర్షికి అమ్మవారు ...

దేముడు ఉన్నాడా, మంత్రాలకు చింతకాయలు రాలుతాయా - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీరస్తు శుభమస్తు"🙏 దేవుడు ఉన్నాడా, మంత్రాలకు చింతకాయలు రాలుతాయా అంటూ కొందరు మేధావులు తెగ ఆలోచన చేస్తూంటారు. యజ్ఞం అంటే నమ్మకంతో చేసే కర్మ. సత్కర్మలు అసత్కర్మలు అని రెండురకాలు. సత్కర్మలు అంటే మంచిపనులు. కొట్టడం తిట్టడం మంచిపనులు కావు కదా. మరి అమ్మ పిల్లలను కొడుతుంది, తిడుతుంది. అంటే మంచికోసం చేసే పనులన్నీ సత్కర్మలే. అలాగే అసత్కర్మలు అంటే చెడ్డపనులు అని. అంటే అపనమ్మకంతో చేసేపనులు. అంతే కాని దొంగతనం, హత్యలు లాంటివి కావు.  మామేనత్తగారు దృష్టి ( దిష్టి ) మంత్రం వేసేవారు. వీభూతి మంత్రించి ఇచ్చేవారు. ఓ గ్రహణసమయంలో నేను మాగ్రామంలో ఉండడంతో ఆవిడ " రేపు గ్రహణసమయంలో స్నానం చేసి రా, మంత్రోపదేశం చేస్తాను " అన్నారు. వెళ్ళాను. మొదట ఆవిడ అన్నారు " మంత్రం వినగానే ' ఇదేమిటి, ఇదామంత్రం ' అనే ఆలోచన రానీయకు " అని. నమ్మకం ముఖ్యం, ఆరోజు మొదలుకుని గత 40 ఏళ్ళుగా రోజూ కనీసం 11 సార్లు దానిని మననం చేస్తాను. ఇప్పుడో చిన్న విషయం చూద్దాం. ఒంట్లో బావుండక డాక్టర్ దగ్గరకు వెళ్ళాం. మందులు వ్రాసి ఇచ్చారు. నమ్మకంతో కొనుక్కుని వేసుకుంటాం. అంతేకాని ఈ మందులతో ఎవరెవరికి తగ్గిందో పేర...

గీతాజయంతి శుభాకాంక్షలు అందరికీ- చీమలపాటి సూర్యనారాయణ

 🙏" శ్రీరస్తు శుభమస్తు "🙏 ఈరోజు మార్గశిర శుద్ధ ఏకాదశి - గీతాజయంతి. " ఏకం శాస్త్రం దేవకీపుత్రగీతం "  "యతో ధర్మః తతో కృష్ణః, యతో కృష్ణః తతో జయః" - ధర్మంతోటే జయం ముడిపడి ఉంది. " ధర్మక్షేత్రే " అనే చక్కటి పదంతో మొదలయ్యింది గీత. ధర్మాన్ని విడవద్దన్నారు. పరధర్మం ఎంత అందంగా ఆకర్షణీయంగా ఉన్నా స్వధర్మమే మేలన్నారు ( 3:35 ) పరమాత్మ. " క్లైబ్యం మా స్మ గమః ( 2:3 )" - నపుంసకత్వం వదలమన్నారు, హృదయదౌర్బల్యం మంచిది కాదన్నారు, ధైర్యంగా కర్మలని చెయ్యమన్నారు. ప్రకృతిపరంగానే 3 గుణాలు ( 3:5 ) - సత్వ రజో తమో - కలుగుతున్నాయి అని చెబుతూ రజో తమో గుణాలమీద ఎప్పుడూ ఓ కన్నేసి ఉంచమన్నారు. తీసుకునే ఆహారంకూడా ఈ గుణాలను ప్రభావితం చేస్తుంది కనుక మితంగా సాత్వికాహారాన్ని తీసుకోమన్నారు ( 17:7 ). ఈశరీరాన్ని " దుఃఖాలయం ( 8:15 ) " అన్నారు. శివాలయంలో శివుడు, రామాలయంలో రాముడు ఉన్నట్లు ఈ శరీరంలో ఎప్పుడూ దుఃఖం ఉంటుందని అర్ధం. " అశాంతస్య కుతః సుఖం ( 2:66 ) " అన్నారు.  ఇతర విషయాలన్నిటినీ ప్రక్కనపెట్టి నన్ను స్మరించు, అన్నీ నేను చూసుకుంటాను అన్నారు ( 9:22 ). మనసు...

శ్రీలలితానామం 990 - అమ్మవారి అనుగ్రహం పొందడం అంత సులభమా - చీమలపాటి సూర్యనారాయణ

 🙏" శ్రీమాత్రేనమః "🙏 " అభ్యాసాతిశయజ్ఞాతా " - అమ్మవారి ఒక అద్భుతనామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాల్లో 990వ నామం. " అమ్మవారిని అతిశయించిన అభ్యాసం/సాధన ద్వారా మాత్రమే తెలుసుకోవచ్చు " అని. మూకశంకరులు తన " మూకపంచశతి " లో శ్రీకామాక్షి అమ్మవారిని స్తోత్రం చేస్తూ అంటారు - " చిరతర సుచరిత సులభః " - అంటే అమ్మవారి అనుగ్రహం పొందడం చాలా సులువుట. కాని దానికి బహుకాలం మంచిగా/శ్రద్ధగా సేవించుకోవాలి అని. ఇదే విషయాన్ని పరమాత్మ భ.గీతలో ఇలా చెప్పారు: " అభ్యాసయోగయుక్తేన ,    చేతసా నాన్యగామినా,   పరమం పురుషం దివ్యం,   యాతి పార్ధానుచింతయన్"  ‌                    - భ.గీత 8:8 నా మాయను తప్పించుకోవడం మహామహుల వల్లే కాదు అని చెబుతూ ఈ శ్లోకంలో " అభ్యాసం/సాధనతో నన్ను పొందడం కష్టం కాదు " అని తెలియచేసారు.  మరి " సాధన " అంత సులభమా. " శ్రీరామ శ్రీరామ శ్రీరామ " అని కేవలం 3 సార్లు అనుకుంటే విష్ణుసహస్రనామపారాయణ ఫలం ఎలా వస్తుంది. అంత సులభమా స్వామి అనుగ్రహం పొందడం. అమ్మవారు పార్వతీదేవి ఏమని అడిగారు శివుడిని: " కేనోపాయేన లఘునా    వి...

భగవద్గీత 8:15 - దుఃఖాలయం అశాశ్వతం - చీమలపాటి సూర్యనారాయణ

 🙏" శ్రీరస్తు శుభమస్తు "🙏  " మాముపేత్య పునర్జన్మ    దుఃఖాలయ మశాశ్వతం,   నాప్నువంతి మహాత్మానః    సంసిద్ధిం పరమాం గతాః "                 ‌‌ - భ.గీత 8:15 పరమాత్మ ఈ జీవితాన్ని " దుఃఖాలయం, అశాశ్వతం " అన్నారు. ఎంత అద్భుతమైన పదాలు.  రామాలయం అంటే రాముడు కొలువై ఉన్నది. శివాలయం అంటే శివుడు కొలువై ఉన్నది. మరి దుఃఖాలయం అంటే దుఃఖం కొలువై ఉన్నది అని కదా అర్ధం. ఈ జీవితం దుఃఖం తో కూడుకున్నది పైగా అశాశ్వతం. మరి ఇటువంటి జీవితం కోరుకోవడం దేనికి. పరమాత్మని నమ్ముకుంటే మళ్ళీ మళ్ళీ పుట్టడం గిట్టడం ఉండదని స్వామి చెబుతున్నారు. వివేకానందుడు భయాన్ని వదిలేయమన్నారు. భయమే దుఃఖానికి మూలం. ఆయన ఓ చక్కటి కధచెప్పారు. వంటలన్నీ తయారు చేసి పెట్టి అక్కడివారు ప్రక్కకు వెళ్ళారు ఏదోపనిమీద. ఓ కుక్క వచ్చింది. తినదామని ఎదరికి వెళ్ళడం, ఎవరైనా వచ్చి నడ్డివిరగ్గొడతారేమో అని ఇటూఅటూ చూడడం. ఒకవేళ ఏదో కొద్దిగా తిన్నా భయంతో తిన్న తిండి దానికి సంతోషమేమి కలిగిస్తుంది. మానవజీవితం కూడా అంతే. ఎప్పుడూ ఏదోదానిగురించి భయపడుతూ బ్రతికే జీవితం అవసరమా అన్నారు వివేకానందు...

భగవద్గీత 12:1 - విగ్రహారాధన అవసరమా - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీరస్తు శుభమస్తు"🙏 " ఏవం సతతయుక్తా    యే భక్తాస్త్వాం పర్యుపాసతే,    యే చాప్యక్షర మవ్యక్తం  ‌  తేషాం కే యోగవిత్తమాః "               -  భ.గీత 12:1 విగ్రహారాధన మంచిదా, అవసరమా అని చాలామందికి సందేహం కలుగుతూ ఉంటుంది. ఇది ఇప్పటి సమస్యకాదు. పరమాత్మ గీతను బోధించినప్పుడే అర్జునుడికి ఈ సందేహం వచ్చింది.  " నీ విశ్వరూపాన్ని ( దివ్యమంగళవిగ్రహాన్ని ) పూజించేవారు కొందరు, అవ్యక్తము నాశనరహితము అయిన పరబ్రహ్మరూపాన్ని కొలిచేవారు కొందరు వీరిలో ఎవరు శ్రేష్ఠులు " అని అడిగాడు అర్జునుడు. ఒకరిమీద అభిమానం కలగాలంటే అతని విభూతులు ( శక్తులు ), రూపం తెలియాలి. అప్పుడు పని సులభమవుతుంది. అందుకే పరమాత్మ తన విభూతులు తెలియచేసి తన విశ్వరూపాన్ని చూపించి తరువాతే భక్తి గురించి తెలియచేసారు. నన్ను నమ్ముకో, అన్నీ నేను చూసుకుంటానన్నారు. " విశేషేణ గ్రహతి ఇతి విగ్రహం " - విగ్రహము అంటే విశేషంగా గ్రహించేది అని అర్ధం. కట్టిపడేస్తుంది జీవులని. అందుకని అప్పుడప్పుడు గుడులను దర్శిస్తూ ఉండాలి. విగ్రహారాధన గురించిన ఓ విషయం చూద్దాం.  వివేకానందుడు " సర్...

శ్రీలలితానామం 77 - వల్లభగణపతి ఆవిర్భావం - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏 " కామేశ్వరముఖాలోక కల్పితశ్రీగణేశ్వరా " - అమ్మవారి అద్భుతనామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 77వ నామం.  అమ్మవారు( కామేశ్వరి ) కామేశ్వరుడు ముఖంలోకి చూడగానే స్వామి విఘ్నేశ్వరుడిని అనుగ్రహించారు అని. అమ్మవారు ఓరకంటితో చూసిందిట. ఆవిడ చిరునవ్వు ఎలా ఉందంటే పలువరసలు కూడా కనిపించనంత చిన్ననవ్వు. స్వామి ముగ్ధుడు అవకుండా ఎలా ఉండగలరు. అమ్మవారు భండాసురుడితో యుద్ధం చేస్తున్నారు. అతను విఘ్నాస్త్రాన్ని ప్రయోగించాడు. అన్నీ విఘ్నాలే. తొలగించాలంటే విఘ్నాలకు ప్రభువైన విఘ్నేశ్వరుడు రావాలి. అందుకని భర్త కామేశ్వరుడివైపు అలా చూసిందిట. ఎంత అద్భుతమైన విషయం. పార్వతీదేవి నలుగుపిండితో బొమ్మచేసి ప్రాణం పొయ్యడం, శివుడు ఆ బాలుడి తల ఖండించడం, గజాననుడి తలపెట్టడం తెలుసు మనకు. మరి ఈ విఘ్నేశ్వరుడు ఎవరు, అసలు విఘ్నేశ్వరుడు ఎప్పటివారో చూద్దాం. పరమాత్మ వ్యాసర్షితో " కలియుగం వచ్చేస్తూంది, జీవులు చాలా కష్టాలు పడతారు, సులువుగా మనశ్శాంతిని పొందడానికి వేదాలను ఓ క్రమపద్ధతిలో పెట్టు " అనడంతో వ్యాసర్షి వేదవిభజనకు, 18 పురాణాలు, 18 ఉపపురాణాల రచనకు శ్రీకారం చుట్టారు. కాని ఎక్కడ, ఒక్క వ...

సుబ్రహ్మణ్యషష్ఠి - మధురస్మృతులు - చీమలపాటి సూర్యనారాయణ

చిన్నప్పుడు ఈరోజు సుబ్రహ్మణ్యషష్టి వస్తూందంటే 15 రోజుల ముందరనుంచీ సందడే. పెద్ద తీర్థం జరిగేది అందుకని. తెల్లవారకట్ట 4 గం.లకే మాగ్రామానికి 1.5 కి.మీల దూరంలో ఉన్న కౌశికకి స్నానానికి నడిచి వెళ్ళేవారం. సైకిల్ స్టాండ్ కి.మీ దూరంలో ఉండేది, పైగా 10 పైసల టికట్. అందుకని నడిచే పోయేవారం. అక్కడ సుబ్రహ్మణ్యుడిగుడి, శివాలయం ఉన్నాయి. స్నానం చేసి వచ్చేసేవారం. దర్శనానికి మధ్యాహ్నం భోజనం అయాక వెళ్ళేవారం. ఎందుకంటే తీర్థం అప్పుడే మొదలయేది. ఆరోజు బ్రహ్మచారికి భోజనం పెట్టుకుంటారు. ఓ అర్ధరూపాయి చేతిలో ( సంభావన ) పెట్టేవారు భోజనం అయాక. అది చాలా ఎక్కువ మొత్తం ఆ రోజుల్లో. అది పుచ్చుకుని తీర్థానికి పోయేవారం. తీర్థంలో రంగులరాట్నం, చక్రం ఆట, పీచుమిఠాయి, జీళ్ళు అన్నీ ఉండేవి. 2 గం.కు వెడితే మళ్ళీ రాత్రి 7 గం.లకే రావడం ( వచ్చి తిట్లు తినడం ). ఎంత హాయిగా ఆనందంగా ఉండేవో ఆ రోజులు. మధురస్మృతులు. స్వామిని అందరికీ ఆనందాన్ని ప్రసాదించమని కోరుకుందాం - సూర్య.  అందరికీ శ్రీసుబ్రహ్మణ్యషష్ఠి శుభాకాంక్షలు. శుభం భూయాత్

భగవద్గీత 8:5 - కుక్కలు, పిల్లులు - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీరస్తు శుభమస్తు"🙏 " అంతకాలే చ మామేవ   స్మరన్ముక్త్వా కలేవరం   యః ప్రయాతి స మద్భావం   యాతి నాస్త్యత్ర సంశయః "                   - భ.గీత 8:5 " అంత్యకాలమున కూడా నన్నే స్మరించుచు దేహత్యాగము చేసెడివాడు తక్షణమే నన్ను పొందుచున్నాడు. ఈవిషయమున ఎట్టి సందేహము లేదు " అన్నారు పరమాత్మ. అది అంత సులభం కాదు. త్రిగుణాల ప్రభావంనుంచి తప్పించుకోవడం కష్టం. పరీక్షలు పెడుతూనే ఉంటారు పరమాత్మ. " బ్రతికినన్నాళ్ళు నీ    భజన చేతును,    మరణసమయమున     మరతునేమో "  అంటారు నరసింహశతక కర్త. ప్రతీరోజూ దైవస్మరణ చేస్తూన్నా, మాయనుంచి తప్పించుకోలేరు. పోయే సమయంలో మనవణ్ణి " ఈరోజు శ్రీరామగాయత్రీజపం చేసావా, ఎంతచేసావు " అని అడగడు, వీధిలో కుక్క అరుస్తూంది చూడండ్రా అంటూ శరీరం విడుస్తాడు, మరుజన్మలో కుక్కగా పుడతాడు. కుటుంబసభ్యుల దైనందిక అవసరాలు, వృద్ధుల అనారోగ్యసమస్యలతోనే కొంచెం కలవరం చెందుతూంటారు సాధారణంగా కుటుంబ యజమానులు. కాని ఆశ్చర్యంగా కొందరు కుక్కల్ని ( ఇప్పుడు పిల్లుల్ని కూడా ) పెంచుకుంటూంటారు. వాటిని బయటకు తీసుకు...

మహాభారతం - Interstellar Movie - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీరస్తు శుభమస్తు"🙏  " యదిహాస్తి తదన్యత్ర    యన్నేహాస్తి నతత్ క్వచిత్ ". మహాభారతంలో ఉన్న అద్భుత శ్లోకం ఇది. దీని అర్ధం " భారతంలో ఉన్నదే ఎక్కడా ఉంటుంది, భారతంలో లేనిది ఎక్కడా ఉండదు " అని. అదీ మన ఋషుల విజ్ఞానం, నమ్మకం. అంతటి అద్భుతమైన గ్రంధం భారతం.  భారతం అంటే జూదం, వస్త్రాపహరణం, యుద్ధం అనే ఎక్కువ మంది భావన. అది ఒక మహాసముద్రం, దానిలో దొరకని విజ్ఞానం లేదు. ఏ కొత్తవిషయం విన్నా చదివినా, చివరికి ఏది కొత్తగా కనిపెట్టినట్లుగా చెబుతున్నా దాని మూలాలు మన ప్రాచీనగ్రంథాలలో కనిపిస్తుంది.  2014 లో " ఇంటర్ స్టెల్లర్ " అనే సినీమా వచ్చింది. క్లుప్తంగా కధ ఏమిటంటే భూమిమీద వనరులు సరిపోక విశ్వంలో కొత్త గ్రహాల వెదుకులాటలో శనిగ్రహం ప్రక్కన వాం హోల్ లాంటి రంధ్రం ఉంటే దానిలోకి వెళ్ళి అతికొద్ది రోజులు మాత్రమే ఉండి బయటకు వచ్చేస్తారు. హీరో బయలుదేరేటప్పుడు అతని కూతురు చిన్నపిల్ల. కాని కొద్దిరోజుల్లోనే తిరిగివచ్చిన హీరో ఆశ్చర్యపోతాడు. ఎందుకంటే అతని కూతురికి 94 సం.ల వయస్సు. హీరో మాత్రం అదే 40 సం.ల వయస్సులో ఉంటాడు. కొద్ది రోజుల్లో అలా ఎలా సాధ్యం అని ఆశ్చర్యం. అసలు కారణం ఏమ...

శివాలయాలు ఎందుకు కిటకిటలాడుతూ ఉంటాయి - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీరస్తు శుభమస్తు"🙏 పూజ్యులు గరికిపాటివారు ప్రవచనం చేస్తూ ఓ విషయం చమత్కారంగా ( నిజం కూడా ) చెప్పారు. ఆయనను ఓ అభిమాని " ఇన్ని దేవాయాలున్నా శివాలయాలు ఎందుకండీ ఎప్పుడూ కిటకిటలాడుతూ ఉంటాయి " అని అడిగాడు. ఈయన " ఓ సారి కళ్ళుమూసుకుని మీ ఇంట్లో ఉన్న లేక ఎక్కడయినా చూసిన శివకుటుంబం ఫొటో గుర్తుచేసుకో. శివుడు చిరునవ్వుతో కూర్చుని ఉంటారు. పార్వతి ఆయనకు దగ్గరగా తగులుతూ ఇంచుమించుగా ఆవిడ శిరస్సు శివుడి భుజం మీద వాల్చినట్లుగా కూర్చుని ఉంటుంది. అటూఇటూ వినాయకుడు కుమారస్వామి దగ్గరగా కూర్చుని ఉంటారు. ఇద్దరిలో ఎవరో ఒకరు అమ్మవారి ఒడిలో కూర్చుని కూడా ఉంటూంటారు.  వారిని అలా చూస్తే మనకు మన పెదమేనమామగారి లేక పెదనాన్నగారి కుటుంబ ఫోటో చూస్తూన్నట్లు అనిపిస్తుంది.  శివాలయానికి వెడితే మన పెదమేనమామ లేక పెదనాన్న ఇంటికి వెళ్ళినట్లు ఉంటుంది, మనశ్శాంతిగా ఉంటుంది. అందుకే శివాలయానికి ఎక్కువగా వెడుతూ ఉంటారు జనాలు " అన్నారు.  చాలా చక్కటి వివరణ అనిపించింది.  నాకు అనిపించింది. శివుడు భక్తసులభుడు. ఎవరయినా రాగానే అతడు ఎంత అవినీతి చేసాడు, ఎందరిని బాధపెట్టాడు లాంటి విషయాలు పట్టించుకోడు. ఆ విషయాలు...

శివానందలహరి - అజ్ఞానాంధకారం - చీమలపాటి సూర్యనారాయణ

 🙏" శ్రీరస్తు శుభమస్తు "🙏 ఆదిశంకరులు శివానందలహరి చేస్తూ ఇలా ప్రార్ధన చేసారు: " ఏకో వారిజబాంధవః      క్షితినభో వ్యాప్తం      తమోమండలం,   భిత్వా లోచనగోచరోఽపి      భవతి త్వం     కోటిసూర్యప్రభః।    వేద్యం కిం న భవస్యహో      ఘనతరం     కీదృగ్భవేన్మత్తమస్తత్సర్వం      వ్యపనీయ మే పశుపతే    సాక్షాత్ ప్రసన్నో భవ॥  ఓ పశుపతీ ! ఒక్క సూర్యుడు భూమ్యాకాశములు నిండిన  చీకట్లు తొలగించి నేత్రములకు అగుపిస్తున్నాడు. మరి నీవో, కోటిసూర్యప్రకాశవంతుడవు, తెలుసుకొనదగినవాడవు. అయిననూ‌ నాకు నీవు కనుపించుటలేదు. నా (అజ్ఞాన) అంధకారము ఎంతదో కదా! కనుక ఆ (అజ్ఞాన) అంధకారము అంతయునూ‌ తొలగించి, ప్రత్యక్షమై అనుగ్రహింపుము. ఎంత చమత్కారంగా ప్రార్ధన చేసారు. ఒక సూర్యుడు వస్తేనే అంధకారమంతా పోయి సూర్యుడు కనిపిస్తారు కదా మరి పరమేశ్వరుడు కోటిసూర్యసముడైనా నా అజ్ఞానాంధకారం తొలగలేదు, పరమేశ్వరుడు కనిపించుటలేదు అంటే నా అజ్ఞానం అంత పెద్దదా అని అడుగుతున్నారు శంకరులు. ఆయనే ఆవిధంగా అనుకుంటే ఇక సామాన్య...

భగవద్గీత - 18:60 - అహంభావం - చీమలపాటి సూర్యనారాయణ

 🙏" శ్రీరస్తు శుభమస్తు "🙏  " స్వభావజేన కౌంతేయ    నిబద్ధః స్వేన కర్మణా,    కర్తుం నేచ్ఛసి యన్మోహాత్    కరిష్యస్యవశో2పి తత్ "                    - భ.గీ 18:60. " నీవు చేయుటకు ఇష్టపడని పనులు కూడా పురాకృత స్వాభావిక కర్మలచే బంధింపబడి  చేయుదువు " అన్నారు పరమాత్మ. మనల్ని మనలా ఉండనివ్వదు సమాజం. పరిస్థితుల ప్రభావానికి లోనై జీవుడు తను చేయాలని అనుకోని, చేయకూడని పనులు కూడా చేస్తూంటాడు. ఆవేశంలో చేసే ఎన్నో ఘోరాలు తరచుగా చూస్తూంటాం. " అరుణి " అని ఒక మహర్షి ఉండేవారు. వేదపండితుడు. గురుకులం నడిపేవారు. అక్కడ కహోడ అనే శిష్యుడు ఉండేవాడు. వేదాలను ఔపోసన పట్టేసాడు. మహర్షి తనకూతురు సుజాతని కహోడాకి ఇచ్చి వివాహం చేసారు, తన తరువాత గురుకులం చూసుకుంటాడు అని కూడా అనుకుని. సుజాత గర్భం దాల్చింది. ఓ రోజు కహోడగారు వేదం వల్లెవేయిస్తున్నారు శిష్యులతో. సుజాత ఆ ప్రక్కనే కూర్చుని ఏదో పనిచేసుకుంటూంది. సుజాత కడుపులోని శిశువు " నాన్నగారు ఈరోజు మీ పారాయణ దోషభూయిష్టంగా ఉంది, 8 తప్పులు దొర్లాయి " అనడంతో ఆయనకు కోపం వచ్చి " నువ్వు నన్నే తప...

భగవద్గీత - 16:21 - నరకద్వారాలు - చీమలపాటి సూర్యనారాయణ

 🙏" శ్రీరస్తు శుభమస్తు "🙏 " త్రివిధం నరకస్యేదం ద్వారం      నాశనమాత్మనః, కామక్రోధః      తధా లోభః తస్మాత్    యేతత్ త్రయం త్యజేత్ "               - భ.గీత 16:21  " కామక్రోధలోభాలు నరకద్వారాలు - కనుక వాటిని వదిలేయాలి " అని తెలియచేసారు పరమాత్మ గీతలో. అసలు నరకం అంటే ఏమిటి. ఎప్పుడయినా ఎవరయినా ప్రయాణంచేస్తూ తుఫాన్ లో చిక్కుకున్నా " అమ్మో నరకం చూసాం/కనబడింది " అంటారు. అంటే అధికకష్టాలు అనుకోవాలి. ఎవరైనా కష్టాలు అనుభవిస్తూంటే ఏ పాపం చేసారో అంటూంటారు. అంటే పాపం, కష్టాలు తోడుదొంగలు.  వ్యాసమహర్షి మహాభారతంలో అసలు పాపాలకి ( కష్టాలకి ) మూలం ఏమిటి అన్నది అద్భుతంగా తెలియచేసారు: " పాపశ్చతు యదధిస్టానం    తత్ శృణుష్వ నరాధిపా,    ఏకో లోభో మహాగ్రాహో    లోభాత్ పాపం ప్రవర్తతే ". అంటే పాపాలన్నిటికీ మూలం " లోభం " అని. లోభం అంటే కావాలనుకోవడం. అది అక్కడితో ఆగదు - తనకే కావాలనుకోవడం, ఇంకెవరికీ ఉండకూడదు, ద్రక్కకూడదు అనుకోవడం, అసూయ, కోపం, హింస అన్నీ ఒకటి తరువాత ఒకటి కలుస్తూంటాయి. అంటే పాపభవంతులకి ...

భగవద్గీత 3:20 - ఆసక్తిరహితకర్మ - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీరస్తు శుభమస్తు"🙏 " కర్మణైవ హి సంసిద్ధం    ఆస్థితా జనకాదయః    లోకసంగ్రహ మేవాపి    సంపస్యన్ కర్తృమర్హసి "             -  భ.గీత 3:20 " జనకుడు మొదలగు జ్ఞానులు కూడా ఆసక్తిరహితముగా కర్మలను ఆచరించుటవలననే పరమసిద్ధిని పొందిరి. కావున నీవును లోకహితార్ధమై కర్మలను ఆచరించుటయే సముచితము " - అన్నారు పరమాత్మ. ఇక్కడ రెండు ముఖ్యముగా గమనించవలసిన విషయాలు ఉన్నాయి. " లోకహితార్ధమై " అన్నారు పరమాత్మ, ఏ కర్మ అయినా సమాజశ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని చెయ్యాలి అని. తరువాత " సముచితము " అన్నారు, అంటే మంచిది అన్నారు. ఇలా చెయ్యి అనలేదు, ఇలా చేస్తే మంచిది ( తరువాత నీ ఇష్టం ) అన్నారు పరమాత్మ. ఎంత అద్భుతం మన సనాతనధర్మం. వ్యాసర్షి ఒకరోజు పక్షులజంట ముచ్చట్లు చూసి ఆశ్చర్యపోతారు. మగపక్షితెచ్చిన ఆహారాన్ని తల్లిపక్షి పిల్లల నోటికి అందిస్తూంది. పక్షుల సంసారమే ఇంత ముచ్చటగా ఉంటే మనుషుల సంసారం ఎంత అద్భుతం అని భావించి తనకుకూడా ఒక పుత్రుడు కలుగుతే బావుంటుంది అని భావిస్తారు. " శుక " జననం జరిగింది. వ్యాసర్షి శుకుడిని వివాహం చేసుకుని సంతానాన్ని పొందమంటార...

మాయనివస్త్రాలు - రామాయణం - చీమలపాటి సూర్యనారాయణ

 🙏" శ్రీరస్తు శుభమస్తు "🙏 ఋషివ్యవస్థ అంటే " ఈశ్వరుడి సంకల్పాన్ని భూమిమీద ప్రవర్తింపచేసే వ్యవస్థ " అని చెబుతూంది సనాతనధర్మం. ఏ ఋషి కృషి పరిశీలించినా ఇది సత్యమని తెలుస్తుంది. మహర్షి వాల్మీకి విరచిత రామాయణం ఎంతటి అద్భుతగ్రంధం. చదివేకొద్దీ వింతవింత విషయాలు తెలుస్తూనే ఉంటాయి. సీతారామలక్ష్మణులు చిత్రకూటానికి వెడుతూ అత్రిమహర్షి ఆశ్రమానికి వెడతారు. అనసూయ ఎంతో ఆనందించి " నీమాటలు, చేసినపని ( రాజభోగాలు వద్దనుకుని వనవాసానికి రావడం ) నాకు మిక్కిలి సంతోషం కలిగించాయి, నీకు ఏదయినా ఇవ్వాలని ఉంది, ఏమి కావాలో కోరుకో " అంటుంది. సీతమ్మ " మీ అశీస్సులు చాలు " అంటే అలాకాదు అని పువ్వులు, చీర ఇస్తూ అంటుంది " ఎప్పటికీ ఈ పువ్వులు వాడవు, ఈ చీర మాయదు " అని. " మాయదు " అంటే అస్తమానూ ఉతుక్కుని ఆరబెట్టునోనక్కరలేదు అని. ఎంత అద్భుత విషయం. అన్నాళ్ళు అశోకవనంలో ఒకే చీరతో " సీతమ్మ ఎలా గడిపింది " అనే ప్రశ్నకు సమాధానం ఈ విషయం. రావణుడు సీతమ్మని ఎత్తుకుపోవడానికి సహాయం చెయ్యమని అడగడానికి మారీచుడి ఆశ్రమానికి వస్తాడు. రాముడి దెబ్బకు తత్వం బోధపడి తపస్సు చేసుకుంట...

" గరిక మహిమ " - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీరస్తు శుభమస్తు"🙏 " గరిక మహిమ " గణపతిని గరికతో పూజిస్తారు. ఆయనకు అది ఎంతో ఇష్టం అంటారు. గరిక అంటే గరికకొసలు - చివరిభాగం - దూర్వాంకురాలు అంటారు. ఆశ్చర్యంగా ఉంటుంది. మహాకాయుడు, కోటిసూర్యసమప్రభువుని గరికతో పూజించడం ఏమిటీ అని. గణపతినవరాత్రులలో లక్షగరికపూజ చేస్తూంటారు, మా గ్రామంలో కూడా. మనలాంటి సామాన్యులకే కాదు మహామహులకు కూడా ఆశ్చర్యంగానే ఉంటుంది " ఈ గరికతో స్వామికి పూజ ఏమిటీ " అని. శాండిల్యమహర్షి ప్రతిదినమూ గణపతిని గరికతో పూజించేవారు.  ఆయన భార్యపేరు ఆశ్రయ. ఆవిడికీ ఆశ్చర్యమే, రోజూ గరికతో పూజ ఏమిటీ అని. మహర్షిని అడుగుతే ఆయన వేదాలలోని విషయాలు చెప్పారు కాని ఆవిడకు సందేహం తీరలేదు. అప్పుడు మహర్షి గణపతి శిరస్సుమీద నుంచి ఓ గరికను తీసి " మనకూ ధనం అవసరం కనుక దీనిని తీసుకుని వెళ్ళి దేవేంద్రుడికి ఇచ్చి సరిపడా ధనం ని ఇవ్వమని తీసుకురా " అన్నారు. ఆవిడ" దీనికేమి వస్తుంది " అని మనసులో అనుకున్నా మహర్షి చెప్పారు కనుక ఇంద్రుడి దగ్గరకు వెళ్ళింది.  ఇంద్రుడు ఈవిడను చూడగానే గబగబా సింహాసనం దిగి " కాకిచేత కబురు పెడితే నేనే వద్దును కదమ్మా, మీరు ఇలా వచ్చా...

శ్రీరాముడు అయినా శ్రీకృష్ణుడు అయినా శాస్త్రం చెప్పినట్లుగానే నడుచుకునేవారు - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీరస్తు శుభమస్తు"🙏 " తస్మాత్ శాస్త్రం ప్రమాణం    తే కార్యాకార్య వ్యవస్థితౌ,   జ్ఞాత్వా శాస్త్రవిద్యానోక్తం    కర్మ కర్తుమిహార్హసి "                  - భ.గీత 16:24 పరమాత్మ అన్నారు అర్జునుడితో " శాస్త్రాలు ఎలా చెబుతున్నాయో అలా చెయ్యి. ఏది చెయ్యమందో అది చెయ్యి, ఏది వద్దందో అది మానేయి " అని. ఎంత అద్భుతం. పరమాత్మ తను చెప్పింది చెయ్యమనలేదు. శాస్త్రాలు ఏది చెబుతున్నాయో అది చెయ్యి అన్నారు. " వేదో2ఖిల ధర్మమూలం " - అన్ని ధర్మములకూ మూలం వేదమే. వేదం నుంచే ఉపనిషత్తులు, పురాణాలు, ఇతిహాసాలు, శాస్త్రాలు వచ్చాయి. ఏది చెప్పినా ధర్మం గురించే. శ్రీరాముడు కూడా ఏది చెప్పినా " శాస్త్రాలు ఇలా చెబుతున్నాయి, ఋషులు ఇలా తెలియచేస్తున్నారు " అనేవారు ఎప్పుడూ.  సనాతనధర్మానికి పునాదులు అద్భుతమయిన, శక్తివంతమయిన మన " గ్రంధరాశి, ఋషులు, తీర్థాలు, క్షేత్రాలు ". ఋషులు తాము దర్శించి, ఆచరించిన తరువాత దానిలోని మంచిని మాత్రమే లోకకళ్యాణం కోసం మనకు అందించారు. వివేకానందులు చికాగో సర్వమతసమ్మేళనంలో " సోదరసోదరీమణులారా, ప్రపంచమతాలకు తల్లి అయిన సనాతనధ...

లలితానామం - నైష్కర్మ్యా - 900 - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏 " నైష్కర్మ్యా " - అమ్మవారి అద్భుతనామం . ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 900 వ నామం. " నైష్కర్మ్యా " అంటే వేదోక్త కర్మలు కలిగియుండినను కర్మ సంబంధము లేకుండుట. సృష్టి స్థితి లయలు, జీవులకు వారివారి కర్మలకు అనుగుణంగా ఫలాలు ఇవ్వడం లాంటి విద్యుక్తకర్మలు చేస్తూన్నా ఆ కర్మల సంబంధాలేమీ అమ్మవారికి ఉండవు. " పద్మపత్రమివాంభసా " అంటే తామరాకు మీద నీటిబొట్టులా ఉంటుంది అమ్మవారు. ఇదే విషయాన్ని పరమాత్మ భ.గీతలో చెబుతారు అర్జునుడికి: " న మే పార్ధాస్తి కర్తవ్యం   త్రిషు లోకేషు కించన,   నానవాప్తమవాప్తవ్యం   వర్త ఏవ చ కర్మణి "                - భ.గీత 3:22 " నేను కోరునదికాని పొందవలసినదికాని ఏదియును లేకున్నను విహితకర్మలయందు నేను నియుక్తుడనై యున్నాను " అన్నారు పరమాత్మ. " నేను కర్మలు చేయకుండా ఉన్నట్లయితే జీవులు కూడా కర్మలు చేయడం మానేస్తారు. అది లోకవినాశనానికి దారితీస్తుంది " అని కూడా తెలియచేసారు. ఓ చిన్న ఉదాహరణ చూద్దాం. ఒకతనికి లాటరీలో లక్ష వచ్చింది. సంతోషిస్తాడు. జూదంలో లక్ష పోతుంది. బాధపడతాడు. బ్యాంకులో కేషియర్ ఉంటాడు. ఒకాయన...

భగవద్గీత - 11:25 - ధర్మహానికి శిక్ష - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీరస్తు శుభమస్తు"🙏 " దంష్ట్రాకరాళాని చ                  తేముఖాని,   దృష్టైవ కాలానల సన్నిభాని,   దిశో న జానే న లభే చ శర్మ,   ప్రసీద దేవేశ జగన్నివాస "                  - భగీ 11:25  పరమాత్మ అనుగ్రహాన్ని సంపూర్ణంగా పొందినవాడు, పాశుపతాస్త్రాన్ని పొందినవాడు అయిన అర్జునుడే. పరమాత్మ విశ్వరూపాన్ని చూసి భయపడిపోయి " నీ నోర్లు, కోరలు చూస్తూంటే భయంగా ఉంది, దయచేసి వెంటనే ఉపసంహరించు నీ విశ్వరూపాన్ని " అని వేడుకున్నాడు. మంచివారిని రక్షించడానికే కాదు, చెడ్డవారిని శిక్షించడానికి కూడా మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటానన్నారు పరమాత్మ. సనాతనధర్మం అంత మెత్తనయినది కాదు, ఓ చెంపమీద కొడితే ఇంకోచెంప చూపెట్టు అనలేదు, అనబోదు. వేదాలలో " అభిచారమంత్రాలు " అని ఉన్నాయి. ధర్మానికి ఎవరయినా విపరీతమైన హాని చేస్తూన్నప్పుడు అతని నాశనాన్ని కోరుతూ ఈ నామాలతో హోమం చేస్తారు.  ధర్మం పాటిస్తూన్నంతసేపే అమ్మవారు అవ్యాజకరుణామూర్తి. కొద్దిగా ప్రక్కకు జరిగినా ఛండికయే. ఆవిడ ఛండశాసన. ఆవిడ శాసనాలను అతిక్రమిస్తే ఇంతే సంగ...

భగవద్గీత 2:3 - చీమలపాటి సూర్యనారాయణ

 🙏" శ్రీరస్తు శుభమస్తు "🙏  " క్లైబ్యం మా స్మ గమః పార్ధ     నైతత్త్వయ్యుపపద్యతే,   క్షుద్రం హృదయదౌర్బల్యం    త్యక్త్వోత్తిష్ట పరంతప "                   - భ.గీత 2:3  అర్జునుడు యుద్ధం చేసి రక్తపుకూడు తినలేనని నేలపై కూలబడిపోతే పరమాత్మ అంటారు " క్షుద్రమైన హృదయదౌర్బల్యాన్ని వీడి లే " అని. ఇక్కడ ఆశ్చర్యకరంగా స్వామి " క్లైబ్యం " అనే పదాన్ని వాడేరు. క్లైబ్యం అంటే " నపుంసకత్వం ".  ఋగ్వేదంలో ఇలా ఉంది: " నరుతే శ్రాంతస్య  సఖ్యాయదేవాః"  అంటే " ఎవడైతే కష్టపడడో వానికి దేవుడు కూడా సహాయపడడు " అని. " సమద్య ఆవిధతే  వర్ధమానః....."  అంది వేదం. అంటే " జీవితం ఒక సమరం. ఏదీ ఊరికే రాదు. కష్టపడాలి. విఘ్నాలను ప్రతికూలతలను ఎదుర్కోవాలి " అని. పరమాత్మ కూడా గీతని అర్జునుడికి యుద్ధప్రాంగణంలోనే చెప్పారు. ఆదిశంకరులు తన ఆరోగ్యాన్ని కూడా లెక్కచేయకుండా 3 సార్లు దేశమంతా కాలినడకన తిరిగి ఎందరినో వాదనలతో ఓడించి మెప్పించి సనాతనధర్మ పరిరక్షణ చేసారు. వివేకానందుడు " ప్రపంచమతాలన్నిటికీ తల్లి అయిన సనాతనధర్మం తరపున,...