Posts

Showing posts from July, 2024

పుణ్యానికి పుణ్యఫలం పాపానికి పాపఫలం ఇస్తారు అమ్మవారు - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏 " అనఘా " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 987 వ నామం. " అనఘా " అంటే అఘములు అంటే పాపము దుఃఖము వ్యసనము లేనిది. విష్ణుసహస్రంలో అనఘః అని ఒక నామం. దానికి ఆదిశంకరులు పాపరహితుడు అని భాష్యం చెప్పారు. వ్యసనం దుఃఖాన్ని కలిగిస్తుంది, పాపం మిగులుతుంది చివరకు.  వ్యాసర్షి మహాభాగవతంలో పాపపు భవంతులకు పునాది లోభం అన్నారు. లోభం ఉన్నప్పుడు పాపం కలుగుతుంది. అమ్మవారికి లోభం ఎందుకుంటుంది. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకి. ఆవిడ పొందవలసినది ఏముంది. సృష్టిలో అందరూ ఆవిడ బిడ్డలే. అందరికీ సమాన అవకాశాలే ఇస్తుంది. జీవుడి కర్మఫలాలను బట్టి అతనికి అమ్మవారి అనుగ్రహం దొరుకుతుంది.  " పద్మపత్రమివాంభసా " - తామరాకు మీద నీటిబొట్టులా ఉంటుంది అమ్మవారు.‌ ఎవరికీ ఎక్కువా చేయదు, తక్కువా చేయదు. గీతలో పరమాత్మ అంటారు: " తేషామేవానుకంపార్ధం........ ............జ్ఞానదీప్తేన భాస్వతే "               -  భ.గీత 10:11 " నన్ను నమ్ముకున్నవారిని అజ్ఞానమనే చీకటిని పోగొట్టి అనుగ్రహిస్తాను " అన్నారు. జీవితం ధర్మబద్ధంగా ఉంటే చెడుపనులే ఉండవు, పాపం కలగడమే జ...

తామరాకు మీద నీటిబొట్టులా ఉంటారు అమ్మవారు - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏 " పుణ్యాపుణ్యఫలప్రదా " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 288 వ నామం. " పుణ్యాపుణ్యఫలప్రదా‌ " అంటే పుణ్యమునకు పుణ్యఫలం, అపుణ్యము ( పాపము )నకు పాపఫలం ఇస్తుంది అని. అదేమిటండీ పాపం చేయకుండా ఆపవచ్చు కదా అనిపిస్తుంది, తప్పు లేదు. కాని అమ్మవారికి ఆ అవసరమేముంటుంది. ఆవిడ అన్ని ఏర్పాట్లూ చేస్తారు, బాగుపడమంటారు. అటు గుడి ఉంటుంది, ఇటు సారాయి దుకాణం ఉంటుంది. ఎటు వెడితే నయం అని మనం ఆలోచించు కోవాలి కదా.  తరగతిగదిలో ఉన్న విద్యార్థులు అందరూ ధూమపానం చేయరు. 4,5 గురు మాత్రమే దానికి అలవాటు పడతారు. ఎవరూ స్వతహాగా పాపపు పనులు చేయాలని అనుకోరు. వారి వారి గతజన్మల వాసనలు బట్టి చెడుకర్మలు కూడా చేస్తూ ఉంటారు. మనకు తెలియకుండానే లేక మన ప్రమేయం లేకుండానే కూడా కొన్ని పాపాలు చేస్తూంటాం. తెలిసిచేసినా తెలియకచేసినా పాపఫలం కలుగుతుంది.  పసివాడు పాకుతూ వెళ్ళి నిప్పులో చేయి పెడితే కాలుతుంది. అయ్యో పసివాడు, ఏమీ తెలియనివాడు అని కాల్చకుండా ఉండదు నిప్పు. అంత నిక్కచ్చిగా ఉంటుంది ప్రకృతి.  పరమాత్మ గీతలో ఇలా తెలియచేసారు: " శుభాశుభఫలైరేవం          ...

" నాకు తెలియదు " అని అన్నాడంటే అతను జ్ఞాని - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏 " త్రిదశేశ్వరీ " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 629 వ నామం. " త్రిదశేశ్వరీ " అంటే జీవుడి మూడు దశలకి/ అవస్థలకి ఈశ్వరి. మూడు అవస్థలు అంటే జాగృతి, స్వప్న, సుషుప్తి దశలు. విష్ణుసహస్రనామాలలో " త్రిదశాధ్యక్షః " అని ఒక నామం. దానికి " జాగృతి, స్వప్న, సుషుప్తి అనే మూడు అవస్థలకు సాక్షీభూతుడు " అని భాష్యం చెప్పారు ఆదిశంకరులు. మనిషికి సాధారణమైన 3 అవస్థలు ఉంటాయి - అవి 1. చైతన్య/జాగృతి 2. స్వప్న 3. సుషుప్తి. వివరంలోకి వెడితే మనిషి పగలంతా ఏదో ఒక పనిచేస్తూ చైతన్యంతో ఉంటాడు. రాత్రి నిద్రలో రెండు అవస్థలు - 1. కలలతో కూడిన నిద్ర లేక స్వప్నం 2. కలలు లేని గాఢ నిద్ర లేక సుషుప్తి. పొద్దున్న లేస్తాడు, మళ్ళీ చైతన్యం. ఈ కలలు లేని నిద్ర " సుషుప్తి " ఒక భాగ్యం. అందరికీ అన్నివేళలా దొరకదు. సుఖావస్థ. " నిన్న రాత్రి ఏం గాలి, ఏం వర్షం " అనగానే " అవునా, నేను నిద్రపోయాను. ఏమీ తెలియనే లేదు " అనడం సాధారణంగా వింటూంటాం. " మిన్ను విరిగి మీదపడినా లేవడు " అంటూంటారు. అమ్మవారి అనుగ్రహం. " స్వాప...

జ్ఞాని ఎవరు - సత్యం ఏమిటి? - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏 " జ్ఞానగమ్యా " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 980 వ నామం. " జ్ఞానగమ్యా " అంటే జ్ఞానముచే పొందదగినది, జ్ఞానంచే ఆనందము కలిగించునది. విష్ణుసహస్రంలో " జ్ఞానగమ్యః " అని ఒక నామం. దానికి " జ్ఞానము చేతనే తెలియబడువాడు " అని భాష్యం చెప్పారు ఆదిశంకరులు. జ్ఞాని ఎవరు? శంకరులు " బ్రహ్మ సత్యం, జగన్మిధ్య " అన్నారు. అమ్మవారి స్పృహ తప్ప వేరే ఆలోచనలు ఉండవు జ్ఞానులకు.  ధృవుడు కుబేరుడి మీదకు కూడా యుద్ధానికి తయారయిపోతే తాత స్వాయంభువు మనువు వచ్చి " నువ్వు విష్ణువు దర్శనం పొందిన భాగవతోత్తముడవు. నీకు ఇటువంటి యుద్ధాలు అవసరమా " అనగానే ధృవుడు తామసగుణంలోంచి బయటపడ్డాడు. కుబేరుడు సంతోషించి వరం కోరుకోమంటారు ధృవుడిని. అప్పుడు ధృవుడు కోరుకున్నది " ఎల్లవేళలా విష్ణువు స్పృహలో ఉండేలా అనుగ్రహించమని కోరుకున్నాడు ". అలాంటి స్పృహలో ఉంటే అనవసరపు యుద్ధాలు, ఇతరవ్యాపకాలవైపు బుద్ధి పోదు అని ధృవుడి ఆలోచనగా తెలుసుకోవాలి. శుకుడు వెడుతూంటే ప్రక్కన నదిలో స్నానం చేస్తూన్న స్త్రీలు తడిగుడ్డలతోటే ఒడ్డుకు వచ్చి నమస్కారం...

అనురాగం/ప్రేమ కూడా ఎక్కువ మంచిది కాదు - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏 " రాగమధనీ " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 157 వ నామం . " రాగమధనీ " అంటే భక్తులకు వైరాగ్యము కలిగించుటచే అనురాగమును పోగొట్టునది‌ అని అర్ధం.  మన కష్టాలన్నిటికీ కారణం మితిమీరిన సంసారబంధాలే. ఒకటి రెండు తరాలకు కాకుండా పది తరాల వరకూ సరిపడేలా సంపాదించాలని కోరుకుంటూ నానా దుర్మార్గపు పనులూ చేస్తూంటారు కొందరు. కోరి కష్టాలు తెచ్చుకుంటూంటారు.  వైరాగ్యాన్ని కలిగించడం ద్వారా మితిమీరిన అనురాగాన్ని అంటే బంధాన్ని తగ్గిస్తారు అమ్మవారు తనను నమ్ముకున్న వారికి.  కుంతీదేవిని " ఇంతవరకూ ఎన్నో కష్టాలు పడ్డావు అత్తా. ఇటుపై సుఖపడడానికి ఏమి కావాలో కోరుకో " అంటారు పరమాత్మ. అప్పుడు కుంతి " నా పుత్రులమీద, వంశం మీద మమకారాన్ని/అనురాగాన్ని తగ్గించు కృష్ణా " అని కోరుకుంటుంది. ఉత్తమ ఇల్లాలు. దేవహూతి భర్త కర్దమునితో ఇంతకాలం ఈ దేహంతో భోగాలన్నీ అనుభవించాను కాని జ్ఞాని అయిన భర్త లభించినా సత్యం ఏమిటో తెలుసుకునే ప్రయత్నమే మొదలు పెట్టలేదు అని చెబుతూ ఇలా అంటారు:  " నేహయద్కర్మ ధర్మాయ    న విరాగాయ కల్పతే    నా తీర్థపద సేవాయై    జీవన్న...

ఆచారాలు పెట్టినది మన మంచికోసమే - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏 " సదాచారప్రవర్తికా " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 356 వ నామం. " సదాచారప్రవర్తికా " అంటే సదాచారమును ప్రవర్తింపచేయునది అని అర్ధం. ఆచారము అంటే ఆచరించేది. ఆ ఆచరించేవి మనకు మన కుటుంబానికి సమాజానికి మంచి చేసేవిగా ఉండాలి. అందుకే అమ్మవారు సదాచారాలను అంటే మంచి ఆచారాలను అనుసరింపచేస్తుంది. జీవుల మనుగడకోసం, సుఖజీవనం కోసం, మనశ్శాంతి కోసం కొన్ని ఆచారాలను పెట్టారు అమ్మవారు. ఋషులు వాటిని మనకు తెలియచేసారు. అవి పాటిస్తే జీవితం బాగుంటుందని, పాటించకపోతే బాధలు పడవలసి వస్తుందని తెలియచేసారు.  సనాతనధర్మం పెద్దలను గౌరవించమంది. రెండుచేతులూ జోడించి నమస్కారం పెట్టమంది. భోజనం చేసేముందు కాళ్ళు చేతులు కడుగుకోమంది. బయట తిరిగి వచ్చినా, వేరే ఊరినుంచి వచ్చినా కాళ్ళు కడుగుకుని ఇంట్లోకి వెళ్ళమంది. శుభ్రమైన బట్టలు కట్టుకుని భోజనం చేయమంది. ఇటువంటి ఆచారాలెన్నిటినో మన బాగుకోసం తెలియచేసారు. ఇవేమీ కష్టమైనవో, ఆచరింపలేనివో కాదు. ఇవి ఆచరించడంవల్ల వ్యాధులకు దూరంగా ఉండవచ్చు. కాని ఆశ్చర్యమేమిటంటే ఏదయినా భయంకరమయిన వ్యాధి ప్రబలినపుడు మాత్రమే ఇవన్నీ పాటిస్తారు అం...

84 లక్షల జీవరాశులలో అమ్మవారి అంశ - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏 " చిత్కలా " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 728 వ నామం. " చిత్కలా " అంటే అఖండ చైతన్యములో అంశ మాత్రమే గలది. ఎక్కడ?. సృష్టిలోని జీవులలో. అంతఃకరణ చైతన్య స్వరూపురాలు. కళ అంటే శోభ/ప్రకాశం. చైతన్యం ఉంటేనే శరీరానికి శోభ. ఆ చైతన్యమే అమ్మవారు. అమ్మవారి అంశ చిత్కళ. కళిక అంటే శిఖ/మొగ్గ. దీపశిఖ చిన్నదిగానే ఉంటుంది కాని ఇల్లంతా వెలుగు నింపుతుంది. అలాగే అమ్మవారి చిన్న అంశయే శరీరానికంతటకీ ప్రకాశాన్ని ఇస్తుంది. ఇదే విషయాన్ని పరమాత్మ అర్జునుడికి తెలియచేసారు గీతలో: " అథవా బహునైతేన    కిం జ్ఞాతేన తవార్జున ।   విష్టభ్యాహమిదం కృత్స్నమ్    ఏకాంశేన స్థితో జగత్ "            - భ.గీత - 10:42  " ఈ విస్తారమైన జ్ఞానం ఏం అవసరం, ఓ అర్జునా? ఇది మాత్రం తెలుసుకో చాలు, కేవలం నా యొక్క ఒక్క చిన్న అంశచేతనే, సమస్త జగత్తు యందు వ్యాపించి మరియు దాన్ని పోషిస్తూ/నిర్వహిస్తూ ఉన్నాను ". చిన్న అంశ కలిగిన ఆచార్యులు, ఎగిరే పక్షులు, రకరకాల పువ్వులలోని చైతన్యం చూస్తేనే ఎంతో ఆశ్చర్యం కలుగుతుంది మనకు.  ఏదయినా చిన్న పురుగును చూస్...

వైరాగ్యం అలవర్చుకోవాలి - అది ఒక వరం - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏 " విరాగిణీ " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 937 వ నామం .  " విరాగిణీ " అంటే వైరాగ్యము గలది. జీవితం సుఖమయంగా సాగాలన్నా, మనస్సు ప్రశాంతంగా ఉండాలన్నా, అమ్మవారిమీద మనస్సు నిలవాలన్నా వైరాగ్యం ముఖ్యం. బంధాలు/మోహం తగ్గించుకునే కొలదీ మనస్సు నిర్మలంగా ఉండి మంచి ఆలోచనలు కలుగుతాయి. విద్య ఉన్నవారు విద్యనిస్తారు. ధనం ఉన్నవారు ధనాన్ని ఇస్తారు. మనకు కావలసిన వైరాగ్యం అమ్మవారి దగ్గర కావలసినంత ఉంది. నమ్ముకున్న వారికి అవసరమయినంత ఇస్తారు. అర్జునుడు పరమాత్మని అడుగుతారు " ఈ మనస్సు కోతి కదా, దీనిని అదుపులో పెట్టడం అంత సులభమా, సాధ్యమా " అని. అర్జునుడే అలా అంటే ఇక సామాన్యుల పరిస్థితి ఏమిటి?. పరమాత్మ ఇలా అంటారు: " అసంశయం మహాబాహో    మనో దుర్నిగ్రహం చలం   అభ్యాసేన తు కౌంతేయ    వైరాగ్యేణ చ గృహ్యతే "                 - భ.గీత 6:35 మనస్సు నిగ్రహించుకోవడం కష్టమే కాని వైరాగ్యంతో కూడిన సాధనతో కష్టం మాత్రం కాదు అన్నారు పరమాత్మ. " వైరాగ్యేణ చ " అన్నారు. అంటే సాధన ఒకటే సరిపోదు. వైరాగ్యం కూడా అవసరం అన్నార...

ప్రపంచ శాంతిని కోరేది సనాతనధర్మమే - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏 " శమాత్మికా " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 963 వ నామం .  " శమాత్మికా " అంటే సకల ప్రపంచోపశమనమే స్వరూపముగా గలది అని. ఉపశమనం అంటే శాంతి. ఎంత అద్భుతనామం. ప్రపంచశాంతికి ప్రతిరూపం. అదీ మన సనాతనధర్మం ఉత్కృష్టత. ఆదిశంకరాచార్య విరచిత " ప్రశ్నోత్తర రత్నమాలిక " లో ఇలా తెలియచేసారు: " కిం సంపాద్యం మనుజైః?   విద్యా విత్తం బలం యశః      పుణ్యం కః సర్వగుణ     వినాశీ? లోభః శతృశ్చ కః? కామః " మనుష్యుడు దేనిని సంపాదించవలెను?. విద్య ధనము కీర్తి బలము పుణ్యము అనే వాటిని. సమస్తగుణములను నశింప చేయునది ఏది? లోభము. శతృవు ఎవరు? కోరిక. ఈవిషయములను తెలుసుకుని పాటించిన వ్యక్తి శాంతిగా ఉంటాడు. కుటుంబంలో అందరూ పాటిస్తే ఆ కుటుంబం శాంతిగా ఉంటుంది. కుటుంబాలు అన్నీ శాంతిగా ఉంటే ఊరు, దేశం, ప్రపంచం శాంతిగా ఉంటాయి. ఎటువంటి విజ్ఞానాన్ని ఇచ్చింది ప్రపంచానికి మన సనాతనధర్మం. సమస్య ఏమిటి, పరిష్కారం ఏమిటి అని తేలిగ్గా అర్ధమయేలా తెలియచేసారు. " న ఋతే శ్రాంతస్య సఖ్యాయదేవాః " - ఎవడైతే కష్టపడడో వానికి దేవుడుకూడా సహాయపడడు - ఋగ్వేదం. ...

బుద్ధిని శుభ్రపరుస్తూ ఉండాలి అప్పుడప్పుడు - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏 " మేధా " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 538 వ నామం. మేధా అంటే ధారణాశక్తి గల బుద్ధి స్వరూపురాలు. ధారణాశక్తి అంటే జ్ఞాపకశక్తి. కొందరు శతావధానం, సహస్రావధానం చేస్తూంటారు. కొందరు ఆసువుగా కవిత్వం చెబుతూంటారు. ఇటువంటివన్నీ అమ్మవారి అనుగ్రహం. అంతఃకరణాలు నాలుగు - మనస్సు, బుద్ధి, అహంకారం, చిత్తము. మనస్సు సంకల్పవికల్పాలు అంటే మంచీ చెడూ రెండూ చేయిస్తుంది. బుద్ధి ఏది మంచో ఏది చెడో తెలియచేస్తుంది. ఈ విచక్షణాశక్తిని అమ్మవారు ప్రసాదిస్తుంది. వేదంలో మేధాసూక్తం ఉంది. సూక్తం అంటే సు+ఉక్తం - మంచిగా చెప్పబడినది అని. అమ్మవారిని ఇలా ప్రార్ధన చేస్తాం:  ఓం మేధాదేవీ జుషమాణా   న ఆగాద్విశ్వాచీ భద్రా     సుమనస్యమానా త్వయా    జుష్టా నుదమానా దురుక్తాన్  బృహద్వదేమ విదధే సువీరాః " అమ్మా మేధాదేవీ, నీ రాకకు పూర్వం నిరర్ధక ప్రసంగాలతో సంతోషపడే మేము నీ కృపాకటాక్షం చేత సద్బుద్ధి పొంది వీరులైన ప్రజలతోను, శిష్యులతోనూ ఉన్నత సత్యాలను మాట్లాడే సామర్ధ్యాన్ని సంతరించుకున్నాము " అని. అమ్మవారు బుద్ధిని ప్రేరేపించి అటువంటి సత్కాలక్షేపాలు ...

సంశయం కలిగినప్పుడు మంచి గురువును పట్టుకోవాలి - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏 " నిస్సంశయా " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 172 వ నామం . " నిస్సంశయా " అంటే సంశయములు లేనిది. సంశయాలు ఎవరికి ఉంటాయి. తను చేసిన, చేస్తూన్న పని సరైనదేనా అనే అనుమానం ఉన్నవారికే. లేకపోతే తను చేయబోయే పని గురించి తెలియనప్పుడు. మరి అమ్మవారికి అటువంటి పరిస్థితి రావడానికి అవకాశమే లేదు కదా. సంశయాత్ములయిన వారికి ఈ లోకమున గాని పరలోకమున గాని సుఖము లేదు అన్నారు పరమాత్మ: " అజ్ఞశ్చాశ్రద్ధధానశ్చ   సంశయాత్మా వినశ్యతి ।   నాయం లోకోఽస్తి న పరో   న సుఖం సంశయాత్మనః "               - భ.గీత 4:40 " జ్ఞానము, విశ్వాసము రెండూ లేని వారు మరియు అనుమానం పడే స్వభావం కలవారు, పతనమైపోతారు. విశ్వాసములేక, సందేహించే వారికి ఈ లోకంలో ఇంకా పరలోకంలో కూడా సుఖం ఉండదు " అని. పరమాత్మ గీతలో ఇలా అంటారు అర్జునుడికి ఓ సంశయం కలిగినప్పుడు: " తద్విద్ధి ప్రణిపాతేన    పరిప్రశ్నేన సేవయా,    ఉపదేక్ష్యంతి తే జ్ఞానం    జ్ఞానినస్తత్త్వదర్శినః "           ...

గురుపూర్ణిమ/వ్యాసపూర్ణిమ నేడు - శుభాకాంక్షలు - చీమలపాటి సూర్యనారాయణ

 🙏" శ్రీరస్తు శుభమస్తు "🙏 శ్రీశ్రీశ్రీవేదవ్యాసుల జయంతి నేడు. ఈరోజుని గురుపూర్ణిమ/వ్యాసపూర్ణిమ గా జరుపుకుంటారు. " గురుర్భ్రహ్మ గురుర్విష్ణుః    గురుర్దేవో మహేశ్వరః,    గురుస్సాక్షాత్ పరబ్రహ్మ    తస్మైశ్రీ గురవేనమః "  గురువును ఎలా గౌరవించుకోవాలో తెలియచేసింది మన సనాతనధర్మం. సనాతనధర్మానికి మూలపూరుషుడు వ్యాసర్షి. వేదాలన్నీ కలిసిపోయి ఉన్నప్పుడు వ్యాసులు వాటిని విభజించి ఓ క్రమపద్ధతిలో అందించారు మనకు. అవి అర్ధం చేసుకోవడానికి కష్టపడతారేమోనని 18 పురాణాలను అందించారు. పంచమవేదంగా కొనియాడబడుతున్న మహాభారతాన్ని 100700 శ్లోకాలతో అందించారు.  ఇప్పటికి ఎప్పటికీ నిత్యనూతనమైన భగవద్గీతని అందించారు. పరమపవిత్రమయిన విష్ణుసహస్రం, శివసహస్రం, ఎన్నో నీతికధలు మనకు అందించారు. అయినా ఆయన మనస్సు సంతృప్తిచెందక వ్యాకులపడుతూన్నప్పుడు నారదమహర్షి సలహాతో మహాభాగవతాన్ని రచించి మనకు అందించారు. మహాభారతంలో ఆయన ఇలా అన్నారు : " యదిహాస్తి తదన్యత్ర    యన్నేహాస్తి నతత్ క్వచిత్ ". దీని అర్ధం " భారతంలో ఉన్నదే ఎక్కడా ఉంటుంది, భారతంలో లేనిది ఎక్కడా ఉండదు " అని. అంతటి అద్భుతమైన గ్రంధం ...

ఇంటికి దీపం ఇల్లాలు అంది సనాతనధర్మం - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏 " సువాసినీ " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 970 వ నామం . " సువాసినీ " అంటే చక్కని ఉనికి కలిగినది అని. ఇక్కడ ఉనికి అంటే భర్తతో ఉండడం అని. ఎల్లప్పుడూ భర్త గలది.  భూలోకంలో సువాసిని " జీవత్పతిక " అంటే భర్త బ్రతికి ఉన్న స్త్రీ. మరి అమ్మవారు?. " సర్వకాలజీవత్పతిక " అంటే శాశ్వతంగా ఉండే ఆయన్ని ( పరమేశ్వరుడిని ) భర్తగా కలిగినది.  సువాసిని భర్తకు విద్యుత్కర్మలు చేయడానికి అర్హతనిస్తుంది. భార్యలేనివారు అన్ని కార్యక్రమాలు చేయకూడదు. కూతురుకు పెళ్ళిచేస్తే కన్యాదానం కూడా చేయడానికి వీలు లేదు. అందుకే పూర్వం భార్య అకాలమరణం చెందితే వెంటనే మళ్ళీ వివాహం చేసుకునేవారు. ఇంటికి దీపం ఇల్లాలు అన్నారు. స్త్రీ అనలేదు. అంటే సువాసిని ఇంటికి వెలుగుని, గౌరవాన్ని ఇస్తుంది. కుంతి పాండురాజుతోకానీ, సీతమ్మ రాముడితో కాని, ద్రౌపది పాండవులతో కాని అరణ్యానికి వెళ్ళనక్కరలేదు. కాని భర్త ధర్మాన్ని అనుసరిస్తూ జీవించాలంటే భార్య తోడ్పాటు అవసరం. అందుకే భర్త సంపాదించిన పుణ్యంలో సగభాగం భార్యకు లభిస్తుంది అన్నాయి శాస్త్రాలు. " అరణ్యవాసం పూలపాన...

మనల్ని శివుడిగా చేయగలదు అమ్మవారు - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏 " శంభుమోహినీ " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 954 వ నామం. " శంభుమోహినీ " అంటే శంభుని మోహ పెట్ఝునది అని అర్ధం. మోహంలో పడేయడం ఏమిటి అని ఆశ్చర్యం వేస్తుంది. కాని సృష్టి కొనసాగాలంటే అది ముఖ్యం. అమ్మవారు ధర్మార్ధకామమోక్షాలు నాలుగూ అనుగ్రహిస్తుంది. మూడవది కామం. అది కూడా అంటే ధర్మంతో కూడిన కామం జీవితం ఆనందమయం అవడానికి అత్యవసరం. మూకశంకరులు " ఆర్యాశతకం " లో అమ్మవారు కామాక్షీదేవిని ఇలా వర్ణన చేసారు: " పంచశరశాస్త్రబోధన    పరమాచార్యేణ దృష్టిపాతేన,   కాంచీసీమ్ని కుమారీ కాచన    మోహయతి కామజేతారం "               - ఆర్యాశతకం:5. " కాముడిని జయించిన ఆయన ( శివుడి ) ని తనను మోహించేలా చేసుకున్న కాంచీపురం అమ్మాయి " అని అర్ధం. మన్మధుడే శివుణ్ణి ఏమీ చెయ్యలేక భస్మమయిపోయాడు. శివుడు కామానికి, మోహానికి అతీతుడు. మరి అటువంటి ఆయన్ని ఈవిడ ( తన సౌందర్యంతో, బాహ్య సౌందర్యం అనుకోకూడదు ) మోహింపచేసుకుందని భావం. ఎంత అద్భుత భావన. దీనిలో ఓ ధర్మసూక్ష్మం ఉంది. జ్ఞాని అయిన శివుడిని జీవుడుగా ( కామార్ధిగా ) చేస్తుంది, జీవుడికి ...

ఏది పొందాలో అది పొందుతే ధన్యుడు అంటారు - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏 " ధన్యా " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 957 వ నామం. " ధన్యా " అంటే కృతార్ధురాలు. ఏది పొందాలో అది పొందుతే ధన్యత అంటారు. విష్ణుసహస్రంలో " ధన్యః " అని ఒక నామం. కృతార్ధుడయినట్టివాడు అని భాష్యం చెప్పారు ఆదిశంకరులు. ఆదిశంకరులు " ప్రశ్నోత్తర రత్నమాలిక " లో ఇలా అంటారు: " కో ధన్యః? సన్యాసీ,    కః మాన్యః? పండితః,    కః సేవ్యః? యః దాతాః,    కః దాతా? యః అర్ధి మాతనుతే "  ధన్యుడు ఎవరు? అంటే సన్యాసి అన్నారు శంకరులు. సన్యాసికి ఏకోరికలు ఉండవు, ఏది జరిగినా అమ్మవారి సంకల్పం అనుకుంటారు. ఎవరి మీదా ప్రేమ ఉండదు, కోపమూ ఉండదు. ఏ ప్రదేశమూ తనదనుకోడు. దేశమంతా తిరుగుతూ ఉంటాడు. ఎవరయినా పెడితే తింటాడు లేకపోతే పస్తులుంటాడు. సంసారంలో ఉంటూనే సన్యాసిలా ప్రవర్తిస్తూ ఉంటారు కొందరు మహాత్ములు. ఆయనకేమండీ ధన్యుడు, ఆయన జీవితం ధన్యం అనడం అప్పుడప్పుడు వింటూంటాం.  మల్లాది రామకృష్ణ శాస్త్రిగారి సంగతులు ఎవరు ఎప్పుడు చదివినా ఆశ్చర్యపోవడం ఖాయం. ఆయన వేదాభ్యాసం చేసారు. బ్రహ్మ సూత్రాలు, మహాభాష్యం చదివారు. 50 కి పైగా భాషలను నేర్చుకున్న...

తొలిఏకాదశి - దక్షిణాయనం, పండుగలు ప్రారంభం - చీమలపాటి సూర్యనారాయణ

 🙏" శ్రీరస్తు శుభమస్తు "🙏 " అహంకారం బలం దర్పం    కామం క్రోధంచ సంశ్రితాః,    మమాత్మపరదేహేషు    ప్రద్విషంతో2భ్యసూయకాః "               - భ.గీత 16:18 " అహంకారం, అహంభావం, లోభం కోపం తో నిండినవారు దెయ్యంపట్టిన వారిలా తనలోనూ పరుల్లోనూ ఉన్న పరమాత్మని కూడా దూషిస్తారు " అని  వ్యాసమహర్షి మానవుల సమస్త బాధలకి మూలం " లోభం " అని మహాభారతంలో తెలియపరిచారు. ఈ లోభమే/మోహమే జీవుణ్ణి మాయలో పడేసి నానా కష్టాలూ పడేలా చేస్తుంది. పాపపు భవంతులకు పునాది " లోభం ". మరి దీనిప్రభావానికి లోనుకాకుండా ఉండాలంటే ఏమి చెయ్యాలో కూడా ఆయనే తెలియచేసారు: " దమేన సదృశం ధర్మం    నాన్యం లోకేషు శుశృమః " అంటే " పుణ్యానికి మూలం " దమం ". పుణ్యభవంతులకి పునాది " దమం ". దమం అంటే " ఇంద్రియనిగ్రహం ". స్పందించే ముందు ఒక్క క్షణం ఆలోచనచేస్తే ఏ కష్టాలు దరిచేరవు. ఈ " దమం/ఇంద్రియనిగ్రహం " అంటే " 18 దోషాలు " లేకపోవడమే అని తెలియచేసారు వ్యాసర్షి. ఆ దోషాలు ఏమిటో చూద్దాం: 01. అనృతం : అబద్ధం ఆడడం. 02. పైసునం : పరదూషణ          అంటే చాడీలు చెప...

మనువు అంటే ఆలోచనచేసేవాడు - మనువు నుంచి మనిషి - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏 " మనువిద్యా " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 238వ నామం . " మనువిద్యా " అంటే మనువు ఉపదేశించిన విద్యా స్వరూపురాలు.  మనువు ఎవరు?. బ్రహ్మగారు సృష్టిని ప్రారంభించడానికి ఏర్పాటు చేసిన మహర్షి. ఒక్కో మనువు సుమారు 31 కోట్ల సం.లు పాలన చేస్తారు. బ్రహ్మగారి ఒకరోజులో 28 మంది ( పగలు 14, రాత్రి 14 ) మనువులు పాలన చేస్తారు. 31 కోట్ల సం.లు పాలించే ఆయన ఎంత చక్కటి పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి. 5 ఏళ్ళు పాలన చేసేవారే పథకాలకి పుట్టబోయే మునిమనమల పేర్లు కూడా పెట్టేసుకుంటున్నారు.  విష్ణు సహస్రనామాలలో " మనుః " అని ఒక నామం ఉంది. దానికి ఆదిశంకరులు " ఆలోచన చేయగలిగినవాడు " అని భాష్యం చెప్పారు. ఎంత చక్కటి విషయం. 84 లక్షల జీవరాశులలో మనిషి ఒక్కడే బుద్ధిజీవి. అంటే ఆలోచన చేయగలిగినవాడు. ఈ మను శబ్దం నుంచే " మనిషి " అనే పదం వచ్చినట్లు తెలుస్తూంది. మనువు ఆలోచనలలోనూ, ఆయన ఇచ్చే విద్యలోనూ అమ్మవారు స్థితులయి ఉంటారు. మనుస్మృతి ఎంత అద్భుతం. ఎన్ని అద్భుత విషయాలు చెప్పారు. పెద్దలను గౌరవిస్తే ఆయుష్షు, సంపద పెరుగుతుంది అన్నారు. ఎక్కడ స్...

చూపుడు వ్రేలు బ్రొటకన వ్రేలితో కలిస్తే జ్ఞానం - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏 " జ్ఞానముద్రా " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 979 వ నామం .  " జ్ఞానముద్రా " అంటే జ్ఞానముద్రా స్వరూపురాలు. జ్ఞానముచే ఆనందము కలిగించునది. జ్ఞాన - చైతన్యమును, ముత్ - ఆనందమును, ద్రా - ఆవరించునది అని అర్ధం. ఈ ముద్రనే చిన్ముద్ర, బ్రహ్మ ముద్ర, దక్షిణామూర్తి ముద్ర, అంగుష్టతర్జనీ యోగముద్ర అని కూడా అంటారు. దీని వివరణ అద్భుతం. చిటికినవ్రేలు, ఉంగరం వ్రేలు, మధ్యవ్రేలు త్రిగుణాలు. చూపుడువ్రేలు జీవుడు. బ్రొటకనవ్రేలు బ్రహ్మ. జీవుడు త్రిగుణాలతోటే కలిసి ఉంటాడు సాధారణంగా. కాని బ్రహ్మతో కలిస్తే ఆనందమే. అంటే చూపుడువ్రేలు బ్రొటకనవ్రేలుతో కలిస్తే చిన్ముద్ర/జ్ఞానముద్ర. " ఆనందం " ఏమిటి?. మనం ఆ ఊరు అంటే ఇష్టం, ఫలానా ఆయనంటే ఇష్టం, అది ఇష్టం, ఇది ఇష్టం అని అంటూంటాం. అంటే ఆ ఇష్టం అనేది మనకు ఆనందం ఇస్తూందని కదా. ఆ ఆనందం బ్రహ్మ స్వరూపం. ఆనందోబ్రహ్మ అంటూంటారు.  సరస్వతీ రహస్యోపనిషత్తులో ఇలా తెలియచేసారు: " అస్తి భాతి ప్రియం రూపం    నామ చేత్యంశపంచకమ్,.    ఆద్యత్రయం బ్రహ్మరూపం    జగద్రూపం తతో ద్వయమ్ " అస్తి అంటే ఉనికి, భాతి అంటే...

శ్రీవారాహీదేవిని స్మరిస్తే తెలియని శత్రువులను కూడా నిర్వీర్యం చేసేస్తారు - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏  ఈరోజు శ్రీవారాహీదేవీ నవరాత్రులలో 9వ రోజు.  అమ్మవారు లలితాదేవి శ్రీశ్యామలాదేవిని మంత్రిణిగా, శ్రీవారాహీదేవిని రక్షణమంత్రిణిగా నియమించారు మన రక్షణ, బాగోగులు చూడడానికి.  అమ్మవారు పార్వతి, శ్యామలాదేవి సరస్వతి అయితే వారాహీదేవి లక్ష్మీదేవి.  శ్రీవారాహిదేవి అష్టోత్తర శతనామావళి లో కొన్ని నామాలు అత్యద్భుతంగానూ, ఆశ్చర్యంగానూ ఉంటాయి: శత్రూణాం వాక్ స్తంభనకారిణీ శత్రూణాం గతి స్తంభనకారిణీ శత్రూణాం మతి స్తంభనకారిణీ శత్రూణాం అక్షి స్తంభనకారిణీ అమ్మవారిని శరణాగతి కోరితే శత్రువుల మాట, గమనం, బుద్ధి, కళ్ళను స్తంభింపచేసేస్తుంది. అంత రక్షణ ఇస్తుంది. మూక శంకరులు ఆర్యాశతకంలో కామాక్షీ అమ్మవారిని ఇలా స్తుతిస్తారు: " తాడితరిపుపరిపీడన భయ    హరణ నిపుణహలముసలా,   క్రోడపతిభీషణముఖీ క్రీడసి    జగతి త్వమేవ కామాక్షి " " శత్రుసైన్యమును దండించునది, శత్రుభయమును పోగొట్టుటలో సమర్ధములయిన హల ముసలములు గల వరాహముఖము గలిగిన నీవే జగమున క్రీడించుచున్నావు తల్లీ కామాక్షీదేవీ " అని. శ్రీవారాహీదేవిని స్మరిస్తే తెలిసిన శత్రువులనే కాదు తెలియని శత్రువులను కూడా నిర్వీర్యం...

మన అమ్మ ఎప్పుడూ సుందరే - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏 " ఆశోభనా " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 972 వ నామం. " ఆశోభనా " అంటే అంతటా సౌందర్యము కలది. అమ్మవారి సౌందర్యం ఎంత అద్భుతం అంటే మన్మధుడిని కాల్చిపడేసిన శివుడిని మోహంలో పడేసేటంత అన్నారు మూకశంకరులు. దుర్గాసూక్తంలో అమ్మవారిని " తాం అగ్నివర్ణాం " అని కీర్తిస్తాం. శ్రీలలితాపంచరత్న స్తోత్రంలో శంకరాచార్యులు " ఆకర్ణదీర్ఘనయినీం " అని ప్రార్థిస్తారు. కళ్ళు చెవులదాకా సాగి ఉన్నాయి అని. శంకరాచార్య విరచిత సౌందర్యలహరిలో " సౌందర్యలహరి " అనే పదం చాలాసార్లు వస్తుంది. లహరి అంటే అల, సౌందర్యలహరి అంటే " సొగసువెల్లువ " అని తెలుసుకోవాలి.  అమ్మవారి సౌందర్యం అంత అద్భుతంగా ఉంటుంది. ఎంతగా అంటే ఓ శ్లోకం చూద్దాం: " శరజ్జ్యోత్స్నా శుద్ధాం    శశియుతజటాజూట   మకుటాం, వరత్రాసత్రాణ    స్ఫటికఘటికా పుస్తకకరాం,   సకృన్నత్వా న త్వాం      కధమివ సతాం సన్నిదధతే,      మధుక్షీర ద్రాక్ష మధురిమ     ధురీణాః ఫణితయః ". శరత్కాలంలోని వెన్నెలలా శుద్ధమై చంద్రుడితో కూడిన జటామండలంతో నిండిన శిరముకలిగి వర అభయ ముద్రలు స...

నిద్ర ఒక వరం, అమ్మవారి అనుగ్రహం కావాలి - చీమలపాటి సూర్యనారాయణ

 🙏 " శ్రీమాత్రేనమః " 🙏 " సుప్తా " - అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 260 వ నామం. " సుప్తా " అంటే కారణశరీరాభిమాని జీవాభిన్నస్వరూపురాలు అని తెలిపారు. జీవుడికి తన కారణశరీరంమీద ఎంతో అభిమానం. దానికోసం చాలా చేస్తూంటాడు. అటువంటి జీవికి భిన్నస్వరూపురాలు అమ్మవారు. సుప్తమనగా ఆనందావస్థ అన్నారు పండితులు. శివసూత్రంలో సుప్తావస్థకు మూడు లక్షణాలు తెలియచేసారు. అవి అవివేకం, మాయ, సౌషుప్తము. ఈ అవస్థ ఒక అదృష్టం. మనిషికి సాధారణమైన 3 అవస్థలు ఉంటాయి - అవి 1. చైతన్య/జాగృతి 2. స్వప్న 3. సుషుప్తి. విష్ణుసహస్రనామాలలో " త్రిదశాధ్యక్షః " అని ఒక నామం. దానికి " జాగృతి, స్వప్న, సుషుప్తి అనే మూడు అవస్థలకు సాక్షీభూతుడు " అని భాష్యం చెప్పారు ఆదిశంకరులు. వివరంలోకి వెడితే మనిషి పగలంతా ఏదో ఒక పనిచేస్తూ చైతన్యంతో ఉంటాడు. రాత్రి నిద్రలో రెండు అవస్థలు - 1. కలలతో కూడిన నిద్ర లేక స్వప్నం 2. కలలు లేని గాఢ నిద్ర లేక సుషుప్తి. పొద్దున్న లేస్తాడు, మళ్ళీ చైతన్యం. ఈ కలలు లేని నిద్ర " సుషుప్తి " ఒక భాగ్యం. అందరికీ అన్నివేళలా దొరకదు. సుఖావస్థ. " నిన్న...

కుక్కల్ని పిల్లుల్ని పెంచుకుంటారనుకుంటాం, కాని అవే వీరిని వెతుక్కుంటూ వస్తాయి - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏 " సృష్టికర్త్రీ " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 264 వ నామం . " సృష్టికర్త్రీ " అంటే జగన్నిర్మాణము చేయునది. అమ్మవారు చేసే సృష్టి ఎంతో అద్భుతంగానూ లోపరహితంగానూ ఉంటుంది. ఏ పువ్వు చూసినా దేని రూపం దానిదే. రంగు సువాసన ప్రత్యేకమే. ఏ పండు చూసినా రూపం, రంగు, రుచి వేరే. పక్షి గుడ్డు పెట్టడానికి అద్భుతమయిన గూడు కట్టుకుంటుంది. పొదిగి పిల్లను చేసి పెరిగేదాకా ఆహారం తీసుకుని వచ్చి పెడుతుంది. ఎంత అద్భుత ప్రక్రియ. ఇటువంటి అద్భుతాలే కాదు ఎన్నో వింతలూ చూస్తూంటాం.  కుటుంబసభ్యుల దైనందిక అవసరాలు, వృద్ధుల అనారోగ్యసమస్యలతోనే కొంచెం కలవరంచెందుతూంటారు సాధారణంగా కుటుంబ యజమానులు. కాని ఆశ్చర్యంగా కొందరు కుక్కల్ని ( ఇప్పుడు పిల్లుల్ని కూడా ) పెంచుకుంటూంటారు. వాటిని బయటకు తీసుకుని వెళ్ళడం, స్నానం చేయించడం, తిండి తినిపించడం, వైద్యుడి దగ్గరకు తీసుకొని వెళ్ళడం కూడా శ్రద్ధగా చేస్తూంటారు.  కుక్కలని పెంచుకోవడం ఆలనాపాలనా చూడటం ఏమాత్రం తప్పుకాదు. కాని వింత ఏమిటంటే వీరు ఆ కుక్కని తీసుకునిరారు. ఆ కుక్కే వీరి ఇంటికి వస్తుంది. ఎందుకంటే ఈ కుక్క పూర్వజన్మల...

భూమిని గోవును బాధ పెడితే అరిష్టమే - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏 " గోమాతా " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 605 వ నామం .  " గోమాతా " అంటే ఆవులకు తల్లియగు సురభిస్వరూపురాలు అని అర్ధం చెప్పారు. గో శబ్దానికి నానార్ధాలు చాలా ఉన్నాయి ‌ అందులో ఒక అర్థం భూమి అని. శ్రీవారాహీదేవి తన కోరలమీద భూదేవిని కూర్చోబెట్టుకుని సదా రక్షిస్తూ ఉంటుంది. పురాణాలలో భూమి ప్రస్తావన వచ్చినప్పుడల్లా భూదేవి గోవు రూపంలో రావడం కనబడుతూంటుంది. మనుషులకే కాదు దేవతలకు రాక్షసులకు కూడా భూమే ఆధారం. దేవతలకు కావలసినది యజ్ఞ హవిస్సులు. యజ్ఞం జరిగేది భూమిమీదే. సమిధలు మొ.గునవి ఇచ్చేదీ భూమే. మహాభాగవతంలో ఓ అద్భుత ఘట్టం ఉంది.  పృధుచక్రవర్తి భాగవతోత్తముడు, చక్కటి ధర్మపాలన చేస్తున్నారు. అయినా కరువుకాటకాలు వచ్చాయి. కారణం ఏమిటి అని భూమిని నిలదీశాడు పృధువు. భూమి గోవు రూపంలో వచ్చి అంది " నీ తండ్రి అధర్మపాలనే ఈ పరిస్థితికి కారణం. నువ్వు ధర్మపాలన చేస్తున్నావు. నిజమే కాని దాని ఫలితం రావడానికి కొంత సమయం పడుతుంది. కాని నువ్వు ధర్మపరుడివి, అడిగావు కనుక నేను నుంచుంటున్నాను. నీకు కావలసినది పితుక్కో/తీసుకో అంది. గోవునుంచి పాలు పితకాలంటే ద...

పంచభూతాలు అమ్మవారి రూపం - చీమలపాటి సూర్యనారాయణ

 🙏" శ్రీమాత్రేనమః "🙏 " పంచమీ, పంచభూతేశీ, పంచసంఖ్యోపచారిణీ " అమ్మవారి అద్భుత నామాలు. ఇవి శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 948,949,950 వ నామాలు. " పంచమీ " అంటే సదాశివుని స్త్రీస్వరూపురాలు. బ్రహ్మ విష్ణు రుద్ర మహేశ్వరి సదాశివ - పంచతత్వాలు. పంచమీతత్వం అయిన సదాశివునికి ఈశ్వరి పంచమి. వారాహీదేవిని కూడా పంచమి అని కొలుస్తారు. బ్రాహ్మీ వైష్ణవీ మాహేశ్వరీ కౌమారీ వారాహీ లలో వారాహీ పంచమం. ఈవిడ అహారప్రదాత. ఈవిడ ఆయుధాలు హలం ( నాగలి ), ముసలం( రోకలి). అంటే నాగలితో పండించడం, రోకలితో పండిన ధాన్యాలను దంచి ఆహారంగా ఇవ్వడం. ఎంతటి కరుణామయి, ఎంతటి అద్భుత ప్రక్రియ.  " పంచభూతేశీ " అంటే పంచభూతాలకి నాయకురాలు. భూమి అగ్ని నీరు వాయువు ఆకాశం ఇవి పంచభూతాలు.  రమణమహర్షిని ఓ భక్తుడు అడిగారు " ఎప్పుడూ ఇక్కడే కూర్చోకుండా మానససరోవరం, కేదారనాధ్, నైమిశారణ్యం లాంటివి తిరిగి రావచ్చు కదా. కొత్త కొత్త విషయాలు చూడవచ్చు " అని. ఆయన అన్నారు " నాకూ తిరిగిరావాలనే ఉంది, ఎక్కడైనా మన పంచభూతాలు కాక ఆరవది కనిపిస్తే చెప్పు, వెంటనే వెళ్ళి చూసివస్తాను " అని. అందుకే ఆవిడ పంచభూతేశి అని కొలువబ...

రేపటినుండి పరమ పవిత్రము, శుభకరము అయిన " శ్రీవారాహీదేవి " నవరాత్రులు - శుభాకాంక్షలు - చీమలపాటి సూర్యనారాయణ

 🙏 " శ్రీమాత్రేనమః " 🙏 రేపటినుండి పరమ పవిత్రము, శుభకరము అయిన " శ్రీవారాహీదేవి " నవరాత్రులు. " విశుక్రప్రాణహరణ వారాహీవీర్యనందితా " - ఇది లలితాసహస్రరహస్యనామాల్లో 76 వ నామం. దీని అర్ధం " విశుక్రుడి ప్రాణం హరించిన శ్రీవారాహీదేవి పరాక్రమానికి సంతసించినది " అని. భండాసురుడి తమ్ముడైన విశుక్రుడిని సంహరించినది వారాహీదేవి. వారాహీ అనే పేరే ఎంత అద్భుతంగా ఉంది. పలుకుతూంటేనే వళ్ళు పులకరిస్తుంది. ఆవిణ్ణి రక్షణమంత్రిగా నియమించింది అమ్మవారు మనల్ని జాగ్రత్తగా చూసుకోమని. ఆవిడ ఒకచేతిలో నాగలి ఇంకోచేతిలో రోకలి ఉంటాయి. అంటే పంటలు పండించడం, ఆ పంటను దంచి ఆహారంగా చెయ్యడం కూడా ఆవిడే చూసుకుంటుంది. శక్తిని ఆరోగ్యాన్ని ఇచ్చేది ఆవిడే. రక్షణమంత్రిగా శత్రుపీడ లేకుండా చేసేదీ ఆవిడే. ఆవిడ రధం మీద ధన్వంతరి, అశ్వనీదేవతలు కూర్చుని ఉంటారు. ఇంక మన ఆరోగ్యానికి లోటెక్కడ. ఆవిడ మహిషం మీద కూర్చుని, పులిమీద కూర్చుని కూడా దర్శనం ఇస్తూ ఉంటారు.  ఆవిడ ఇంకో వాహనం హంస. హంస అంటే ఊపిరి. సాధారణంగా అందరూ " జపగాయత్రి " చేస్తారు. అంటే ఏదో ఒక నామజపాన్ని చేసుకుంటూ ఉంటారు. కొందరు ఏనామాన్ని కాకుండ...

బిడియం కూడా అవసరమే, ఉండాలి - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏 " లజ్జా " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 740 వ నామం.  " లజ్జా " అంటే లజ్జా స్వరూపురాలు, ముడుచుకొనుట, బిడియం అని అర్ధం. అధర్మం చేయడానికి వెనుకాడే గుణాన్ని లజ్జ అంటారు. ఇది ఉత్తమగుణం. అమ్మవారు లజ్జ రూపంలో ఉంటారు జీవులలో.  శ్రీరాముడు స్త్రీలతోటి ఋషులతోనూ సంభాషణలు తక్కువగా చేసేవారుట. వారు పొరపాటు పడి అసౌకర్యానికి లోనవకూడదని. రామో విగ్రహవాన్ ధర్మః. మనిషి కూడా పగలంతా పనిచేసి రాత్రి లజ్జను పొందుతాడు. ఓ అమ్మాయి వీధిలో మామూలుగా నడిచి వెడుతూన్నప్పుడు ఓ తెలిసిన పెద్దాయన ఎదురుపడితే ఆ అమ్మాయి వెంటనే తలవంచుకుని కొంగు సర్దుకుంటూ గబగబా దాటుకుని వెళ్ళిపోతుంది. అదే లజ్జ. అది అత్యవసరం ఉత్తమస్త్రీలకు.  చేసిన మంచిపనికి కొంచెం ఎక్కువగా మెచ్చుకుంటే కొందరు బిడియపడతారు. కొందరు సన్మానం చేస్తాం అని ఆహ్వానిస్తే " అబ్బే నేనేమీ అంత గొప్ప పని చేయలేదండి " అని బిడియపడతారు. చేసిన మంచిపనికి గుర్తింపు కోసం ప్రాకులాడరు కొందరు. అవి ఉత్తముల లక్షణాలు. అందుకే అమ్మవారిని ఇలా ప్రార్ధిస్తాం: " యా దేవీ సర్వభూతేషు    లజ్జా రూపేణ సంస్థితా,    నమ...

వేదఘోష మనశ్శాంతిని ఇస్తుంది - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏 " శృతిసంస్తుతవైభవా " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 929వ నామం. " శృతిసంస్తుతవైభవా " అంటే వేదములచే స్తుతించబడిన వైభవము గలది అని అర్ధం. శృతులు అంటే విన్నవి అని. అవి వేదములు. అపౌరుషేయాలు. ఎవరూ వ్రాసినవి కావు. ఋషులు తమ సమాధి స్థితిలో విన్న అమ్మవారు ప్రసాదించిన జ్ఞానం. ఎందరో ఋషులు విన్నవి. ఏ ఋషి విన్నదాన్ని ఆ ఋషి పేరుమీద కాండ అని పేరు పెట్టినట్లు తెలుస్తూంది. ఉదా: సోమ ఋషి విని గ్రహించినది సోమకాండ. అరుణ ఋషి విని గ్రహించినది అరుణకాండ. వేదం విద్, అంటే జ్ఞానం, అనే ధాతువు నుంచి వచ్చింది. అంతా అమ్మవారి గుణగణాలే. వేదమే అమ్మవారు. వేదమాత అని కీర్తిస్తాం. వేదపారాయణని వేదఘోష అంటారు. అంటే అమ్మవారి గుణగణాలను ఎలుగెత్తి చాటడం. అమ్మవారికి రాత్రి సహస్రనామపూజ, మహానివేదనం, తాంబూలం, మహామంత్రపుష్పం అయాక చామరసేవ జరుగుతూన్నప్పుడు వేదపారాయణ మొదలవుతుంది.  అమ్మవారు సృష్టి బాగోగులన్నీ చూసి కొంచెం అలసి ( అభిమాన సద్భావన ) ఉంటారు ఆసమయానికి. తాంబూలసేవన చేస్తూ చిరునవ్వుతో భక్తులను ప్రేమగా చూస్తూ ఉంటారు. " ఋగ్వేదం అవధారయ " అనగానే ఋగ్వేద పండి...