Posts

Showing posts from February, 2026

భార్యాభర్తల సంబంధం ఎటువంటిదో తెలియచేసింది సనాతనధర్మం - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏 " రమణలంపటా " - అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 320 వ నామం.  " రమణలంపటా " అంటే తన భర్త యందు ఆసక్తి/అనురాగం గలిగినది అని అర్ధం. అనుమామేముంది. ఆకులు అలములు కూడా తినకుండా, మండుటెండలో నిప్పుల మధ్య నిలబడి తపస్సు చేసి శివుడిని వివాహం చేసుకుని అపర్ణగా పూజింపబడుతున్నారు అమ్మవారు. ఆవిడకు భర్త అంటే అంత అనురాగం కనుకే భర్త హాలాహలాన్ని మ్రింగినపుడు " జ్వాలాతోరణం " క్రింద నుంచి భర్తతో కలిసి 3 మార్లు ప్రదక్షణం చేస్తాను అని అగ్నిదేవుడికి మ్రొక్కుకున్నారు. కార్తీకపౌర్ణమి నాడు జ్వాలాతోరణం జరుపుతారు. అమ్మవారు స్వామితో కలిసి పల్లకీలో జ్వాలాతోరణం క్రిందనుంచి వెడుతూంటే వెనుక భక్తులు హరహరమహాదేవ అంటూ పరిగెడతారు. రామాయణంలో సీతమ్మ ఒక ధర్మసూక్ష్మం తెలియచేసింది జాతికి. తల్లిదండ్రులు, తోబుట్టువులు, సంతానం ఎవరికయినా ఎవరి భాగ్యం వారిదే, ఎవరి కష్టాలు వారివే. కాని ఒక్క భార్యాభర్తలదే ఒకరి భాగ్యం ఇంకొకరిది. సుఖాలలోనే కాదు, కష్టాలలో కూడా ఒకరికి ఒకరు తోడు అని.  " తపస్సులోగాని బలంలోగాని సంపదలోగాని విక్రమంలోగాని తేజస్సులోగాని కీర్తిలోగాని ...

అమ్మవారు అద్భుత సౌందర్యవతి, శివుడినే మెప్పించిన సౌందర్యం - చీమలపాటి సూర్యనారాయణ

  🙏"శ్రీమాత్రేనమః"🙏 " చారురూపా " - అమ్మవారి అద్భుతనామం. ఇవి శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 241 వ నామం. " చారురూపా " - అందమైన రూపం గలిగినది.  " చారు  " అంటే అందమైన, సుందరమైన అని అర్ధం. అమ్మవారు ఎంత అందంగా సుందరంగా ఉంటారో " మూకకవి " తన " మూకపంచశతి " లో వర్ణన చేసారు. అమ్మవారు " తాంబూలపూరితముఖీ " - అంటే నోటిలో తాంబూలం నములుతూ ఉంటారుట. కొద్దిగా తాంబూల పిడచని ఇచ్చింది ఓ మూగభక్తుడికి. అది నోట్లో వేసుకోగానే ఆ మూగవాని నోటివెంట 500 శ్లోకాలు ఆశువుగా వచ్చేసాయి అమ్మవారిని ( కామాక్షీదేవిని ) వర్ణన చేస్తూ. వంద వంద శ్లోకాలు అమ్మ చిరునవ్వు, చూపులు, పాదారవిందాల గురించీ వర్ణన చేసేసారు మూకకవి. ఇది " మూకపంచశతి " గా ప్రసిద్ధిచెందింది. మొదటిది " ఆర్యాశతకం " లో ఇలా వర్ణన చేసారు: " పంచశరశాస్త్రబోధన   పరమాచార్యేణ దృష్టిపాతేన,   కాంచీసీమ్ని కుమారీ కాచన   మోహయతి కామజేతారం "             - ఆర్యాశతకం:5. " కాముడిని జయించిన ఆయనను తనను మోహించేలా చేసుకున్న కాంచీపురం అమ్మాయి " అని అర్ధం. మన్మధుడే శివుణ్ణి ...

అజ్ఞానం ఒక వరం, అమ్మవారి మాయ మన బాగు కోసమే - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏 " సర్వమోహినీ " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 703 వ నామం. " సర్వమోహిని " అంటే సర్వమును మోహంలో పడవేయునది అని అర్ధం. అదేమిటండీ ఆవిడ తల్లికదా, అందరినీ రక్షించాలి కాని మోహం/మాయలో పడవేయడం ఏమిటి అనుకోవచ్చు. కాని ఆవిడ ఏది చేసినా జీవుల మంచికోసమే. ఓ తల్లి చంటిపిల్లాడితో కలిసి ఆరుబయట ఉందనుకుందాం. వర్షం వస్తూంది. ఉరుములు మెరుపులు వస్తున్నాయి. తల్లి ఏమి చేస్తుంది, పిల్లాడి చెవులు, కళ్ళూ మూస్తుంది, తట్టుకోలేడని భావించేకదా. అలాగే కొన్ని జీవులు తట్టుకోలేక, నిగ్రహించుకోలేక మాయలో పడిపోతాయి. అనుకోవడంకన్నా అమ్మవారే దయతో మాయలో పడేస్తుందని అనుకోవాలి. కొన్నిసమయాలలో అజ్ఞానం ఒక వరం. శాస్త్రజ్ఞులు ఏమన్నారంటే " వైరస్ ఎప్పుడూ మన చుట్టూనే ఉంటుందిట. మనలో శక్తి తగ్గినప్పుడు శరీరంలోకి ప్రవేశిస్తుంది " అని. అలాగే అమ్మవారి మాయ కూడా. జీవులందరూ మాయ/మోహంతో కప్పబడే ఉంటారు. అజ్ఞానం పెరిగినప్పుడు ( చుట్టూ ఉన్నవే శాశ్వతం అనే భ్రమలో పడినప్పుడు ) మాయకు లోనవుతారు.  ఓ పెద్దాయనకు 70 దాటాయి. ప్రభుత్వ ఉద్యోగంలో విరమణచేసి పింఛను తీసుకుంటూ రామా కృష్ణా ...

సంసారం అనే రోగంలో ఒకసారి పడితే బయటపడడం కష్టమే - చీమల పాటి సూర్యనారాయణ

🙏"శ్రీమాత్రేనమః"🙏 " సర్వవ్యాధిప్రశమనీ " - అమ్మవారి అద్భుతనామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 551 వ నామం.  అమ్మవారి ప్రతీనామానికి ఓ పరమార్ధం ఉంది. ఒక్కోనామాన్ని జపంచేసుకుంటే ఒక్కో ఫలితం కనిపిస్తుంది. " సర్వవ్యాధిప్రశమనీ " అంటే అన్ని వ్యాధుల్ని పూర్తిగా నయంచేస్తుంది అని అర్ధం. " ప్ర " అంటే పూర్తిగా అని అర్ధం. వ్యాధి అంటే భవరోగం అనగా సంసారరోగం. అంతే కాని జ్వరం, కాలునొప్పి, కన్నునొప్పి లాంటివి కాదు. ఇవన్నీ చిన్నచిన్నరోగాలు, వస్తూంటాయి పోతూంటాయి కాని సంసారరోగం అలాంటిది కాదు. ఓ సారి మొదలవుతే బయటపడడం కష్టం. బయటపడాలంటే అమ్మవారు అనుగ్రహించాలి.  విష్ణుసహస్రంలో " ఉత్తారణః " అని ఒకనామం. సంసారసాగరాన్ని దాటిస్తారని అర్ధం.  " కాలాత్మా  సర్వభూతాత్మా    వేదాత్మా విశ్వతోముఖః,     జన్మమృత్యుజరావ్యాధి     సంసారభయనాశనః "  అని ప్రార్ధన చేస్తాం ఆదిత్యుడిని. ఆయన ప్రత్యక్షనారాయణుడు, ఆరోగ్యప్రదాత. ఈ భయాలన్నీ పోగొడతాడని జనుల విశ్వాసం.  మిగతా వైద్యములు కారణం చూసి మందులు ఇస్తాయి. కాని ఆయుర్వేదం కారణం వెనుక కారణం చూస్తుంది. అన్ని వ్యాధులకు మూలం...

త్రిగుణాలు కూడా ఉండాలి మనిషిలో, ఉంటేనే జీవితం ఉగాది పచ్చడిలా కమ్మగా ఉంటుంది - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏 " త్రిగుణాత్మికా " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 763 వ నామం.  " త్రిగుణాత్మికా " అంటే త్రిగుణముల సామ్య స్వరూపురాలు. త్రిగుణాలు అంటే సత్వరజోతమోగుణాలు. మూడింటిలోనూ అమ్మవారు స్థితులయి ఉంటారు. అమ్మవారిని మహాగౌరీ మహాలక్ష్మీ మహాసరస్వతీ అని పూజిస్తాం. సత్వగుణం గౌరీదేవి, రజోగుణం లక్ష్మీదేవి, తమోగుణం సరస్వతీదేవి.  ప్రతీ జీవిలోనూ మూడుగుణాలూ ఉంటాయి. ఉండాలి. ఉంటేనే జీవితం ఉగాది పచ్చడిలా రమ్యంగా ఉంటుంది. కోరికలు తప్పుకాదు. సత్వగుణంతో కోరిక ధర్మబద్ధంగా ఉంటుంది. రజోగుణంతో కోరిక స్ధాయికి మించి ఉంటుంది. తమోగుణంతో కోరిక మోసం, దొంగతనం, హింసతో పొందేలా ఉంటుంది. ఈ మూడు గుణాలూ ఎల్లప్పుడూ ఒకదానితో ఒకటి పోటీ పడుతూ మిగతా రెండూ తన అధీనంలో ఉండాలని ప్రయత్నం చేస్తూనే ఉంటాయి.  ఏదయినా కోరిక కలిగినప్పుడు ఇది తనకు తగునా, అవసరమా అని కొద్దిసేపు ఆలోచన చేస్తూండాలి. అలా ఆలోచన చేస్తూ ఉంటే సత్వగుణం ఓ మెట్టుపైన ఉంటుంది ఎప్పుడూ. జీవితం ఆనందదాయకంగా సాగిపోతుంది. ధృవుడు కఠోర సాధనతో అనితరసాధ్యమయిన విష్ణు దర్శనం పొంది పరమ భాగవతోత్తముడు అయాడు. ఓసారి అతని తమ్ముడ...

జన్మకో శివరాత్రి అన్నారు. ఈరోజు పరమ పవిత్రమయిన శివరాత్రి. శుభాకాంక్షలు అందరికీ - చీమలపాటి సూర్యనారాయణ

  🙏"శ్రీరస్తు శుభమస్తు"🙏 " యదాసమస్తన్న దివా నరాత్రి ర్నసన్న   చాసచ్ఛివ ఏవ కేవలం " - వేదం. సృష్టికి పూర్వం సత్తు కాని అసత్తు కాని లేదనియు, కేవలం శివుడు ఒక్కడే కలడని తెలియచేసింది వేదం. " శివ ఏవ కేవలం " - శ్వేతాశ్వతరోపనిషత్తు - శివుడు ఒక్కడే పరదైవము, అతనొక్కడే కలడని తెలియచేసింది ఈ ఉపనిషత్తు. శౌనకాది మహర్షులకు సూతుడు శ్రీశివ మహాపురాణం వైశిష్ట్యాన్ని చెబుతూ శ్రవణకీర్తనమననములతో ముక్తి పొందవచ్చు అని తెలియచేసారు. మహర్షులు కలియుగంలో మనుషులు అల్పాయుష్కులు కదా, కొద్దికాలం లోనే మోక్షం కలిగే సాధన ఏదయినా తెలియచేయమన్నప్పుడు " లింగార్చన " అతి ఉత్తమము, సులభమైన మార్గం అని తెలియచేసారు. శివలింగానికి జీవితమంతయూ అర్చన చేసేవారికి శివానుగ్రహం, ముక్తి లభిస్తాయని తెలియచేసారు. ఇతర దేవతాగణాలన్నిటినీ మూర్తి రూపంలో మాత్రమే పూజిస్తాం. ఒక్క శివుడినే మూర్తియందును, లింగమందును పూజిస్తాం. ఆ రకంగా శివుడు సకళుడు, నిష్కళుడుగా పూజింపబడుతున్నారు. ఈ శివ " లింగం " ఎప్పుడు ఆవిర్భవించిందో శ్రీశివమహాపురాణంలో తెలియజేయబడింది. మొదట అద్భుతమయిన ఈ లింగోద్భవం గురించి నందికేశ్వరుడ...

అమ్మవారి నుదుటిమీద ఉన్న మూడవ కన్ను అసూయతో కొంచెం ఎర్రబడింది అన్నారు ఆదిశంకరులు సౌందర్యలహరిలో - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏 " శృతిసంస్తుతవైభవా " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 929వ నామం . " శృతిసంస్తుతవైభవా " అంటే వేదములచే స్తుతించబడిన వైభవము గలది అని అర్ధం. శృతులు అంటే విన్నవి అని. అవి వేదములు. అపౌరుషేయాలు. ఎవరూ వ్రాసినవి కావు. ఋషులు తమ సమాధి స్థితిలో విన్న అమ్మవారు ప్రసాదించిన జ్ఞానం. ఎందరో ఋషులు విన్నవి. ఏ ఋషి విన్నదాన్ని ఆ ఋషి పేరుమీద కాండ అని పేరు పెట్టినట్లు తెలుస్తూంది. ఉదా: సోమ ఋషి విని గ్రహించినది సోమకాండ. అరుణ ఋషి విని గ్రహించినది అరుణకాండ. వేదం విద్, అంటే జ్ఞానం, అనే ధాతువు నుంచి వచ్చింది. అంతా అమ్మవారి గుణగణాలే. వేదమే అమ్మవారు. వేదమాత అని కీర్తిస్తాం. వేదపారాయణని వేదఘోష అంటారు. అంటే అమ్మవారి గుణగణాలను ఎలుగెత్తి చాటడం. అమ్మవారికి రాత్రి సహస్రనామపూజ, మహానివేదనం, తాంబూలం, మహామంత్రపుష్పం అయాక చామరసేవ జరుగుతూన్నప్పుడు వేదపారాయణ మొదలవుతుంది.  అమ్మవారు సృష్టి బాగోగులన్నీ చూసి కొంచెం అలసి ( అభిమాన సద్భావన ) ఉంటారు ఆసమయానికి. తాంబూలసేవన చేస్తూ చిరునవ్వుతో భక్తులను ప్రేమగా చూస్తూ ఉంటారు. " ఋగ్వేదం అవధారయ " అనగానే ఋగ్వేద పండ...

స్త్రీలను గౌరవించమంది సనాతనధర్మం - చీమలపాటి సూర్యనారాయణ

 🙏" శ్రీమాత్రేనమః"🙏 " సువాసిన్యర్చనప్రీతా " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 971 వ నామం . " సువాసిన్యర్చనప్రీతా " అంటే సువాసినుల యొక్క అర్చనలచే సంతోషించునది అని భాష్యం చెప్పారు. అలాగే సువాసినులను పూజిస్తే కూడా ఆనందిస్తారు అమ్మవారు. అమ్మవారి పూజ చేయడానికి ఓ ఆలంబన కావాలి. సూర్యుడు, అగ్ని, ప్రతిమ ( కలశం, శ్రీచక్రం ), యంత్రం,  సువాసిని, శ్రోత్రియుడయిన విప్రుడు - వీరిని పూజిస్తే అమ్మవారు సంతోషిస్తారు. " స్త్రీ అంటే అర్పణ/ఆశ్రయ/అహంకారరాహిత్య భావం. శుద్దమయిన ప్రేమ " అన్నారు కృష్ణుడు భాగవతంలో. " యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః " అని తెలియచేస్తూంది మనుస్మృతి. స్త్రీలు గౌరవింపబడే చోట దేవతలు ఆనందిస్తూ తిరుగుతూ ఉంటారుట‌. అందుకే సనాతనధర్మం స్త్రీలను గౌరవించమంది. ఇక వారిని పూజిస్తే అమ్మవారు ఆనందించకుండా ఎలా ఉంటారు. అమ్మవారి నవరాత్రులలో సువాసినీ పూజ ఒక ముఖ్యఘట్టం. అమ్మవారికి భక్తులు చీరలు కానుకగా ఇస్తారు. వాటిని జాగ్రత్త చేసి చివరి రోజున సువాసినులకు పూజచేసి ఈ చీరలు కానుకగా ఇస్తారు. అమ్మవారు మురిసిపోతారు. లక్ష్మీదేవ...