Posts

Showing posts from January, 2024

ధీరులు, నిరపేక్షులు, స్వాత్మారాములకు అమ్మవారి జపం తప్ప వేరే ధ్యాస ఏమీ ఉండదు, అటువంటి వారిది బ్రహ్మానందస్థితి - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏 " స్వాత్మారామా " - అమ్మవారి ఒక అద్భుతనామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 878 వ నామం.  " స్వాత్మారామా " అంటే తన ఆత్మయందే తను క్రీడించడం. క్రీడ అంటే ఆనందం. ఇంద్రియాలను పరమాత్మవైపు పయనింప చేయడం, ఆత్మను గుర్తించడం చేస్తే జీవితమునకు సార్ధకత. అశాశ్వతమైన ప్రకృతి విషయాలవైపు సాగుతే జీవితం వ్యర్ధం.  వేదం " విశ్వేదేవాః సమనసః సకేతా ఏకం క్రతుం అభిబియంతు సాధు " అని తెలియచేస్తూంది - ఒకటే పని - అది పరమాత్మను తెలుసుకోవడం. విశ్వేదేవాః అంటే ఇంద్రియాలు. యోగులు, మహాత్ములు అంటారు " పరమాత్మ మనలోనే ఎందుకు ఉన్నాడంటే దగ్గరగా ఉంటే ఎప్పటికయినా తెలుసుకునే ప్రయత్నం చేస్తామని. అదే దూరంగా ఉంటే బద్ధకిస్తామేమో " అని. ఎంతటి కరుణామయుడు. అన్నమయ్య " మొదలుండ కొనలకు మోచి నీళ్ళు పోయనేల, ఎదలో నీవుండ ఇతరములేల " అంటారు. కఠోపనిషత్తు " జీవుడి హృదయంలో తన బొటనవ్రేలు ప్రమాణంలో ఉంటారు పరమాత్మ " అని తెలియచేస్తూంది. ఎవరి వ్రేలు ప్రమాణం వారిదే. ఎంత అద్భుతం. హృదయంలో పద్మం మొగ్గలా ఉంటారు పరమాత్మ. సాధనచేసేకొలదీ మొగ్గ విచ్చుకుని పద్మంలా అవుతుంది. కంచి...

జపాపుష్పనిభాకృతిః - త్యాగయ్య ఆరాధనోత్సవము నేడు - చీమలపాటి సూర్యనారాయణ

 🙏 శ్రీమాత్రేనమః 🙏  " జపాపుష్పనిభాకృతిః " - అమ్మవారి ఒక అద్భుతనామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 766 వ నామం. అంటే " మంకెనపువ్వుతో సమానమగు ఆకారము కలిగినది " అని. " నిభా " అంటే కాంతి. అమ్మవారి చైతన్యం ప్రతీజీవిలోనూ హృదయంలో " పుష్ప " రూపంలో ఉంటుంది. ఇది ముడుచుకుని " మొగ్గ " రూపంలో ఉండి అమ్మవారికి సాధనతో దగ్గరయ్యేకొలదీ పుష్పంగా విచ్చుకుని కాంతిని సంతరించుకుంటుంది. జీవుడు ఉత్తముడవుతాడు. అమ్మవారు స్పష్టంగా చెప్పింది. యజ్ఞాలు, పూజలు, స్తోత్రపఠనం ఏమీ శక్తికిమించి చేయనక్కరలేదు. ఏదో ఒక నామజపం చేసుకున్నా చాలు అని. ఆ జపంతోనే మొగ్గ రూపంలో ఉన్న అమ్మవారి చైతన్యం పుష్పరూపం సంతరించుకుంటుంది. యజ్ఞాలు పూజలకు ఎన్నో వస్తువులు కావలసి ఉంటాయి. అవి శ్రమతో కూడుకున్నవి. జపానికి ఏముంది, కాళ్ళు కడుగుకుని ఓ చక్కటి ప్రదేశంలో కూర్చుని నామస్మరణ చేసుకుంటే చాలు. మంత్రం దేవతా స్వరూపం. గీతలో పరమాత్మ కూడా " యజ్ఞానాం జపయజ్ఞో2స్మి ( భ.గీత 10:25 ) " - " జపరూపాన్ని " అన్నారు. త్యాగరాజస్వామి 96 కోట్ల శ్రీరామనామజపం చేసారు. కోటి జపానికే ఆయనకు శ్రీరామదర్శనం ...

" రాముడు లేని అయోధ్య శ్మశానం "- వశిష్టులు - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీరస్తు శుభమస్తు"🙏  " న హి తద్భవితా రాష్ట్రం    యత్ర రామో న భూపతిః,    తద్వనం భవితా రాష్ట్రం    యత్ర రామో నివత్స్యతి " " రాముడు లేని అయోధ్య అడవి, రాముడు ఉన్న అడవే అయోధ్య " అంటారు వశిష్టులు కైకేయితో. వశిష్టమహర్షి కైకేయితో " సీత నారచీర కట్టదు, రాజ్యాన్ని పాలిస్తుంది. ఒకవేళ అడవికి వెళ్ళినా పట్టుచీర ధరించి, ఆభరణాలు పెట్టుకునే వెడుతుంది " అన్నాక ఊరుకోలేదు.  రాముడు ఎక్కడ ఉంటే అదే అయోధ్య అని చెబుతూ " కైకేయీ - భరతుడు ఇక్కడలేడు కనుక నీ కోరిక తీర్చుకున్నావు. కాని భరతుడు రాజ్యాన్ని పాలిస్తాడనుకున్నావా. ప్రజలే కాదు పశుపక్ష్యాదులు కూడా రాముడి వెంట వెళ్ళిపోతాయి. కదలలేని చెట్లు, వాటి కొమ్మలు రాముడు వెళ్ళినవేపు సాగి మమ్మల్ని కదలలేని వాటినిగా ఎందుకు పుట్టించావు భగవంతుడా అని విలపిస్తూ ప్రాణాలు కోల్పోతాయి. అప్పుడు శ్మశానమయిన అయోధ్యలో నువ్వు, నీ కోడుకే ఉంటారు " అంటారు. బ్రహ్మర్షి నోటివెంట వచ్చిన మాటలు అలాగే నిజమయాయి. భరతుడు రాజ్యం వద్దన్నాడు. అడవికి వెళ్ళి రాముడి కాళ్ళపైపడి అయోధ్యకు తిరిగి రమ్మని వేడుకున్నాడు. రాముడు వనవాసానికి వెళ్ళడానికి, అయోధ్య అ...

ఒక చెంపమీద కొడితే ఇంకో చెంప చూపించమని ఎప్పుడూ చెప్పలేదు రాముడు - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీరస్తు శుభమస్తు"🙏 " సత్యమేవేశ్వరో లోకే   సత్యం పద్మాశ్రితా సదా,   సత్యమూలాని సర్వాణి    సత్యాన్నాస్తి పరం పదా " " సత్యమే లోకాన్ని నడుపుతూన్న పరమేశ్వరుడు. సత్యాన్ని ఆశ్రయించే ఐశ్వర్యం ఉంటుంది. సర్వ ధర్మములు సత్యమూలములు " అని శ్రీరాముడు జాబాలిమహర్షి తో అంటారు. శ్రీరాముడిని ఎలాగయినా అయోధ్యకు తిరిగి తీసుకునివెళ్ళాలని భరతుడితో సహా అందరూ ప్రయత్నిస్తారు. వారిలో దశరధుడి సలహాదారుడు జాబాలి మహర్షి కూడా ఉన్నారు. ఆయన అంటారు " రామా ఎవరు తండ్రి, ఎవరు తల్లి. ఎవరి కర్మలు వారివే. తండ్రి బీజం తల్లి గర్భంలో పడి ప్రాణం పోసుకుంటుంది. పుట్టుకకు అది ఒక కారణం అంతే. తండ్రికిచ్చిన మాట అంటూ నువ్వు కూర్చోనక్కరలేదు. రాజ్యాన్ని పాలిస్తూ నీ ధర్మం నిర్వర్తించు " అని.  " నేను సత్యానికి కట్టుబడ్డాను. మా తండ్రి సత్యాన్ని కాపాడడమే నా సత్యం. మాతండ్రి సత్యాన్ని నేను కాపాడకపోతే ఆయనకు అసత్యదోషం కలిగి ఆయనకు ఉన్నతలోకాలు ప్రాప్తించవు. నేనే అలా చేస్తే ప్రజలుకూడా అలాగే చేస్తారు, నేను అధోగతిపాలవుతాను. అధర్మాన్ని ధర్మంలా కనిపించేలా శాస్త్రవిరుద్ధంగా మాట్లాడారు మీరు. మీ మాటలు జుగుప...

రాముడిని అడవికి పంపించిన కైకేయి దోషి కాదా? - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీరస్తు శుభమస్తు"🙏 " రామప్రవ్రాజనం హ్యేతత్    సుఖోదర్కం భవిష్యతి,   దేవానాం, దానవానాం చ    ఋషీణాం భావితాత్మనాం "  భరద్వాజమహర్షి భరతుడుతో అంటారు " రాముడు బయలుదేరినది సుఖాలు ఇవ్వడంకోసం. దేవతలకు రాక్షసులకు ఋషులకు ధర్మాన్ని అనుసరించేవారికి సుఖం కలిగించడానికి బయలుదేరాడు " అని. రాముడుని ఎలాగయినా ఒప్పించి అయోధ్యకు తీసుకురావాలని భరతుడు అందరినీ వెంటపెట్టుకుని బయలుదేరుతాడు. రాముడు వెళ్ళిన మార్గంలోనే ప్రయాణిస్తూ భరద్వాజమహర్షి ఆశ్రమానికి చేరుకుంటాడు. ఆయన ఆతిధ్యం ఇస్తానంటే ఆగి మహర్షికి తనవారిని పరిచయం చేస్తాడు భరతుడు. కైకేయిని పరిచయం చేస్తూ " సకలగుణసంపన్నుడయిన రాముడి వనవాసానికి, అయోధ్య అనాధ అవడానికి ఈవిడే కారణం " అంటాడు. అప్పుడు మహర్షి " కైకేయిని తప్పుపట్టకు, ఆమె నిర్దోషి " అని చెప్పి రాముడు వనవాసానికి కారణం ఇది అని పై శ్లోకంలో చెబుతారు.  ఇదే విషయాన్ని శ్రీరాముడు లక్ష్మణుడుతో అంటారు " కైకేయమ్మను ఎప్పుడూ తప్పు పట్టకు, ఆవిడ చేసిన పని వెనుక విధిప్రేరణ ఉంది " అని. విశ్వామిత్రుడు యజ్ఞరక్షణకోసం శ్రీరాముడిని పంపించమని అడగడానికి వస్తే దశరధు...

సీతమ్మతల్లి వనవాసానికి నారచీర కట్టుకుని వెళ్ళారా? - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీరస్తు శుభమస్తు"🙏 " అతిప్రవృత్తే దుర్మేధే    కైకేయీ కులపాంసని,   వంచయిత్వా చ రాజానం    న ప్రమాణే2వతిష్టసే " రాముడు వనవాసానికి వెడుతూంటే బ్రహ్మర్షి, స్థితప్రజ్ఞుడు అయిన వశిష్టుని నోటివెంట వచ్చిన మాటలివి - " మితిమించి ప్రవర్తిస్తున్న దుర్బుద్ధిగల కైకేయీ రాజుని వంచించావు, ఉత్తమవంశమున చెడబుట్టావు నువ్వు " అని. బ్రహ్మర్షి వశిష్టులకు అంత కోపం ఎందుకువచ్చిందో చూద్దాం. సభలో రాముడు తండ్రితో " వనవాసానికి బయలుదేరుతున్నాను. సీత, లక్ష్మణుడు నాతో వస్తామని పట్టుబడుతున్నారు, మీరు అనుమతిస్తే వారు కూడా నాతో వస్తారు. అనుమతిస్తే నారబట్టలు కట్టుకుని వెంటనే బయలుదేరుతాము " అని అంటాడు. కైకేయి వెంటనే ముగ్గురికీ నారబట్టలు తెచ్చి రాముడుకి ఇస్తుంది. రామలక్ష్మణులు వెంటనే కట్టుకుంటారు. సీతకు అంత బరువున్న చీరను ఎలాకట్టుకోవాలో తెలియక కొంగు భుజమ్మీద వేసుకుని చూస్తూ ఉంటుంది. రాముడు సీత దగ్గరకు వెళ్ళి " ఇలా కట్టుకోవాలి " అని చెబుతూ ఉంటాడు. ఆ దృశ్యం చూసి సభలోని వారందరూ తట్టుకోలేక భోరున ఏడుస్తారు. అప్పుడు వశిష్టులవారు కూడా నిగ్రహించుకోలేక కైకేయిని దూషిస్తారు పైవిధంగ...

జీవహింసతప్పు అని రామాయణంకాలంలోనే చెప్పారు - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీరస్తు శుభమస్తు"🙏 రామాయణం చదివేకొలదీ అద్భుతాలు తెలుస్తూంటాయి. విరాధుడిని చంపిన తరువాత సీతారామలక్ష్మణులు శరభంగమహర్షి ఆశ్రమంకి చేరుకుంటారు. ఆయన అర్ఘ్యపాదులు ఇచ్చి " మీ విషయాలన్నీ తెలుస్తున్నాయి, నా తపోఫలమంతా నీకు ధారపోస్తున్నాను, నేను వచ్చిన పని అయిపోయింది, ఇకనేను అగ్నిప్రవేశం చేస్తాను. మీరు ఇక్కడకి దగ్గరలో ఉన్న సుతీక్షణమహర్షి ఆశ్రమానికి వెళ్ళి ఆయన ఆశీస్సులు తీసుకోండి " అని చెబుతారు మహర్షి రాముడితో.  ఆయనకు పాదాభివందనం చేసి ఆయన అగ్నిప్రవేశం చేసాక తిన్నగా సుతీక్షణమహర్షి ఆశ్రమానికి వెడతారు. మహర్షి వీరిని చూసి ఎంతో ఆనందపడతారు. " మీ కార్యక్రమాలన్నీ నిరాటంకంగా సాగుతున్నాయా " అని అడిగిన రాముడితో " కొన్ని మృగాలు అప్పుడప్పుడు వచ్చి కొంచెం అసౌకర్యాన్ని కలిగిస్తాయి కాని అవేమీ అంత క్రూరమయినవి కావు సుమా " అంటారు మహర్షి. అప్పుడు రాముడు అంటాడు " మీ అభిమతం అర్ధమయింది, మీకు మృగాలను వేటాడడం, చంపడం ఇష్టంలేనట్లుగా తెలుస్తూంది " అని. ఎంతటి అద్భుతమయిన విషయం. మన ఋషివ్యవస్థకు సాటి అయినది ప్రపంచంలో ఎక్కడా ఉండదు, రాబోదు. ఇప్పుడు అంతా జంతుసంరక్షణ, జీవహింసవద...

బాలరామ ప్రతిష్ట - మన జన్మలు ధన్యం - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీరస్తు శుభమస్తు"🙏 నేడు శ్రీరామజన్మభూమి అయోధ్యలో " బాలరామ" ప్రతిష్ట. ఇక్కడ ఒక ముఖ్య విషయం గమనించాలి. మన జీవితకాలంలో ఈ బాలరామ ప్రతిష్టాపన జరుగుతూంది కనుక మన జీవితాలు ధన్యమయాయి. ఎందరో ధన మాన ప్రాణత్యాగం చేస్తే ఇది సాధ్యమయింది. మనం ఫలాన్ని అనుభవిస్తున్నాం. ఎవరో ఫలవృక్షం విత్తనం వేస్తే పండు మనం తింటూన్నట్లు గా లేదూ?. సనాతనధర్మం పునర్జన్మని ప్రతిపాదించింది. మనలో కొందరయినా ఆ కష్టపడినవారిలో గతజన్మలలో ఉండి ఉండడానికి అవకాశం మెండు. లేకపోతే ఇటువంటి భాగ్యం కలుగదు.  ఏతత్ సర్వం శ్రీశ్రీరామచంద్రార్పణమస్తు - సూర్య. శుభం భూయాత్

శ్రీరాముడు భారతదేశంలో నిజంగా తిరిగాడా? - చీమలపాటి సూర్యనారాయణ

 🙏" శ్రీరస్తు శుభమస్తు "🙏 " అందాల రాముడు    ఎందువలన దేముడు ". వేల సంవత్సరాలుగా హిందువుల జీవితాలలో భాగమయిపోయిన శ్రీరాముడు నిజంగా ఈ నేలమీద నడయాడా అని మన హిందువులలో కొంతమందికి కూడా ఇంకా అనుమానమే. వాల్మీకిమహర్షి చేసిన అద్భుతమైన విషయమేమిటంటే శ్రీరాముడు నడయాడిన ప్రదేశాలలో ఉండే జంతువులు, వృక్షాలు, పక్షుల గురించి ఎంతో వివరంగా వర్ణనలు చేసారు రామాయణంలో. రామాయణం గురించి జరిగిన పరిశోధనలలో ఈవిషయాలు ఎంతో ఉపయోగపడ్డాయి పరిశోధకులకు. చెన్నై కి చెందిన అమృతలింగం, సుధాకర్ అనే వృక్షశాస్త్రజ్ఞులు 3 సం.లు కష్టపడి ఎన్నో విషయాలు తెలుసుకున్నారు. వాల్మీకి రాముడు నడయాడిన ప్రదేశాల్లో ఉన్నట్లుగా వ్రాసిన వృక్షాలు, మొక్కలు, జంతువుల గురించి విస్తృత పరిశోధనలు చేసారు వీరు. ఆ ఆ ప్రదేశాలకు వీరు స్వయంగా వెళ్ళి చూసి ఆవిషయాలను నిర్ధారించుకున్నారు. వీరు శ్రీలంకకు కూడా వెళ్ళి అశోకవృక్షాలను చూసి వచ్చారు. వాల్మీకిమహర్షి వ్రాసిన విషయాలు, ఈ శాస్త్రజ్ఞులు కనుగొన్న విషయాలు సరిగ్గా సరిపోయాయి. అద్భుతమయిన విషయమేమిటంటే వాల్మీకి దండకారణ్యంలో పులులు, సింహాలగురించి వ్రాసారు రామాయణంలో. కాని అక్కడ సింహాలు ఉన్నట్లు చరిత్ర...

సీతమ్మతల్లికి సాటి ఎవరు? - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీరస్తు శుభమస్తు"🙏  " నను బ్రోవమని చెప్పవే    సీతమ్మ తల్లి...." వివేకానందులు అంటారు " ప్రపంచవాజ్మయం అంతా నాశనమయిపోయినా ఒక్క రామాయణం ఉన్నా లేక ఒక్క సీతమ్మను జ్ఞప్తిలో ఉంచుకున్నా భారతజాతి ( సనాతనధర్మం ) మరి కొన్నివేల సంవత్సరాలవరకూ నిలిచి ఉంటుంది " అని. ఎందుకని అంటే " శ్రీరాముడు లాంటి అందగాడు, ధీరోదాత్తుడు, ధర్మపరుడు ఇంకొకరు కనబడవచ్చు శ్రద్ధగా వెదికితే కాని సీతమ్మలాంటి స్త్రీ మాత్రం దొరకదు కాక దొరకదు " అని ఆయన నొక్కి వక్కాణించారు. అమ్మ కౌసల్యను అనునయించి ఒప్పించిన తరువాత రాముడు సీతమ్మ దగ్గరకు వెడతాడు ఆవిడను కూడా అనునయించి అరణ్యవాసానికి బయలుదేరడానికి. " మా తండ్రి నన్ను వనవాసానికి వెళ్ళమన్నారు " అని మాత్రం అనగానే సీతమ్మ " నేను కూడా మీతో పాటే " అంది. మిమ్మల్ని అనుసరిస్తాను అనలేదు. మీముందుండి మీమార్గంలో ఉండే ముళ్ళు రాళ్ళు తొలగిస్తూ మీమార్గం సుగమం చేస్తాను అంది తల్లి.  ఇక్కడ సీతమ్మ ఒక ధర్మసూక్ష్మం తెలియచేసింది జాతికి. తల్లిదండ్రులు, తోబుట్టువులు, సంతానం ఎవరికయినా ఎవరి భాగ్యం వారిదే, ఎవరి కష్టాలు వారివే. కాని ఒక్క భార్యాభర్తలదే ...

కైకేయి భయపడింది రాముడు అడవికి వెళ్ళనంటాడేమోనని - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీరస్తు శుభమస్తు"🙏  " యావన్మాతరమాపృచ్ఛే   సీతాం చానునయామ్యహం    తతో2ద్వైవ గమిష్యామి    దండకానాం మహద్వనం " " మా అమ్మను, సీతను అనునయించి నేను వెంటనే దండకారణ్యానికి వెళ్ళిపోతాను " అంటారు రాముడు కైకేయితో. కైకేయికి అనుమానం కలుగుతుంది దశరధుని పరిస్థితిని చూసి ఎక్కడ మనసు మార్చుకుని అడవికి వెళ్ళడం మానేస్తాడో రాముడు అని. అందుకని " నువ్వు ఇక్కడ ఉన్నంతవరకు మీనాన్న స్నానం, భోజనం చేయడు, నువ్వు వెంటనే బయలుదేరి అడవికి వెళ్ళు " అని అంటుంది. రాముడు " అమ్మా, నీకు అనుమానమే అక్కరలేదు. నాకు అర్ధకామాలకన్నా ధర్మమే ముఖ్యమని నీకు తెలుసు కదా. అంత తొందరగా నా మనస్సు మారిపోదమ్మా " అని అంటూ పైవిషయం చెబుతారు. నాన్నగారు పిలుస్తున్నారు అని కబురు వచ్చినప్పుడు ఎంత ప్రశాంతంవదనంతోనూ చిరునవ్వుతోనూ కైకేయి అంతఃపురంలోకి వెళ్ళాడో " అరణ్యవాసానికి బయలుదేరు " అని ఆదేశించబడిన తరువాత కూడా అదే ప్రశాంతంవదనంతోనూ చిరునవ్వుతోనూ బయటకు వస్తాడు రాముడు. స్థితప్రజ్ఞుడు. లక్ష్మణుడు కోపంతో ఊగిపోతూంటే " నా అరణ్యవాసానికి కారణం కైకేయమ్మ అని మాత్రం ఎప్పుడూ అనుకోకు. ఆమె నన్ను ఇ...

" బాలరాముడి " విగ్రహమునే ఎందుకు ప్రతిష్టించాలి అయోధ్యలో - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీరస్తు శుభమస్తు"🙏 కొన్ని రోజులుగా ప్రముఖంగా వినిపిస్తూన్న విషయం అయోధ్యలో ఈనెల 22న " బాలరామ " విగ్రహ ప్రతిష్ట.  కొంచెం ఆశ్చర్యంగా అనిపిస్తుంది కొందరికి " బాలరాముడు " ఎందుకండీ, రాముడి విగ్రహం పెట్టవచ్చుకదా అని. అలా ఆశ్చర్యపోవడంలో ఏమాత్రం తప్పులేదు.  మొదటగా చూడవలసినది రామజన్మభూమి. రాముడు అక్కడ పుట్టాడు. ఎక్కడ?. అయోధ్యలో కాదు, అయోధ్యలోని ఓ ప్రత్యేక స్థలంలో. ఆ స్థలంలో ఉన్న వేరే కట్టడాన్ని తీసేయాలని, అక్కడ రాముడి గుడి కట్టాలి అని 500 సం.రాలుగా ఉన్న వివాదం. అత్యున్నత న్యాయస్థానం కూడా " అక్కడే ఎందుకు కట్టాలి " అని అడగడం దానికి కావలసిన ఋజువులు సమర్పించడం జరిగింది. ఆ స్థలమే రామజన్మ ( పుట్టిన ) స్థలం అని న్యాయస్థానం నిర్ధారించింది. ఇప్పుడు ఏ విగ్రహం పెట్టాలి అన్నది చూద్దాం. రాముడి గుడి అనగానే మనకు రాముడు, ఎడమప్రక్క సీతమ్మ, కుడిప్రక్క లక్ష్మణుడు, క్రింద ఎదురుగా హనుమ దర్శనమిస్తారు. ఇంకా వీలయితే ఇటూ అటూ భరతశతృఘ్నులు, శివుడు, బ్రహ్మ, నారదులు, వశిష్టులు ఇలా ఎందరో ఉండవచ్చు. ఇన్ని విగ్రహలు పెడితే ప్రత్యేకత ఏముంటుంది. పైగా అది రాముడు జన్మించిన చోటు. అక్కడ ర...

ఉతకనక్కరలేని బట్టలు రామాయణకాలంలోనే - చీమలపాటి సూర్యనారాయణ

 🙏" శ్రీరస్తు శుభమస్తు"🙏 ఋషివ్యవస్థ అంటే " ఈశ్వరుడి సంకల్పాన్ని భూమిమీద ప్రవర్తింపచేసే వ్యవస్థ " అని చెబుతూంది సనాతనధర్మం. ఏ ఋషి కృషి పరిశీలించినా ఇది సత్యమని తెలుస్తుంది. మహర్షి వాల్మీకి విరచిత రామాయణం ఎంతటి అద్భుతగ్రంధం. చదివేకొద్దీ వింతవింత విషయాలు తెలుస్తూనే ఉంటాయి. సీతారామలక్ష్మణులు చిత్రకూటానికి వెడుతూ అత్రిమహర్షి ఆశ్రమానికి వెడతారు. అనసూయ ఎంతో ఆనందించి " నీమాటలు, చేసినపని ( రాజభోగాలు వద్దనుకుని వనవాసానికి రావడం ) నాకు మిక్కిలి సంతోషం కలిగించాయి, నీకు ఏదయినా ఇవ్వాలని ఉంది, ఏమి కావాలో కోరుకో " అంటుంది. సీతమ్మ " మీ అశీస్సులు చాలు " అంటే అలాకాదు అని పువ్వులు, చీర ఇస్తూ అంటుంది " ఎప్పటికీ ఈ పువ్వులు వాడవు, ఈ చీర మాయదు " అని. " మాయదు " అంటే అస్తమానూ ఉతుక్కుని ఆరబెట్టునోనక్కరలేదు అని. ఎంత అద్భుత విషయం. అన్నాళ్ళు అశోకవనంలో ఒకే చీరతో " సీతమ్మ ఎలా గడిపింది " అనే ప్రశ్నకు సమాధానం ఈ విషయం. రావణుడు సీతమ్మని ఎత్తుకుపోవడానికి సహాయం చెయ్యమని అడగడానికి మారీచుడి ఆశ్రమానికి వస్తాడు. రాముడి దెబ్బకు తత్వం బోధపడి తపస్సు చేసుకుంటూ...

శ్రీరాముడి న్యాయవాది పరాశరన్ - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీరస్తు శుభమస్తు"🙏 " అంతా రామమయం   జగమంతా రామమయం " రామజన్మభూమి వివాదాన్ని సుప్రీం కోర్టులో వాదించినాయన శ్రీ కేశవ పరాశరన్. ఈయన ప్రస్తుత వయస్సు 96 సం.లు. వాదనలు జరుగుతూండగా జడ్జిగారు ఈయన చెప్పులు కూడా వదిలేసి నుంచుని మాట్లాడుతూండడం చూసి " మీరు పెద్దవారు, కూర్చుని మాట్లాడవచ్చు, మీరు చెప్పెవన్నీ మేము వింటాం " అంటే ఈయన అన్నారు " ఎందరో క్లయంట్స్ కి నేను నుంచునే మాట్లాడాను. ఇప్పుడు నా క్లయంట్ భగవద్స్వరూపుడయిన మా రామయ్యతండ్రి. నేను ఆయన తరపున కూర్చుని ఎలా మాట్లాడుతాను " అనడంతో జడ్జిగారు ఆశ్చర్యపోవడం జరిగింది. మొట్టమొదటగా రాముడిని బయటకు తీసుకుని వెళ్ళిన విశ్వామిత్రుడు రాముడికి అనుగ్రహించినది " బల అతిబల " మంత్రాలు. ఈ మంత్రపారాయణ అలసట అనేది లేకుండా చేస్తుంది. నిద్ర ఆహారాలు లేకపోయినా, ఎంత శ్రమపడినా ఉత్సాహం తగ్గదు. తరువాత విశ్వామిత్రులవారు ఇచ్చిన అస్త్రశస్త్రాలన్నీ రాముడు లక్ష్మణుడికి ఇస్తూంటాడు. రామనామం జపించిన భక్తులకు రామచంద్రుడు ఈ " బల అతిబల " మంత్రశక్తిని ప్రసాదిస్తాడు. అందుకే రామభక్తులకి అలసట ఉండదు. 90 వయస్సులో కోర్టులో గంటల తర...

తాత్కాలిక వసతులు, భోజనాలు రామాయణకాలంలోనే - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీరస్తు శుభమస్తు"🙏 రామాయణం ఎంతటి అద్భుత కావ్యం. రాముడు అరణ్యవాసానికి వెళ్ళాక భరతుడు ఆయన్ని ఎలాగైనా ఒప్పించి వెనక్కు తీసుకురావడానికి మందీమార్బలంతో వెడతాడు. దారిలో భరధ్వాజమహర్షి ఆశ్రమానికి వెడతాడు సైన్యాన్ని దూరంగా ఉంచి.  మహర్షి " మీకు అతిధిసత్కారాలు ఏర్పాటుచేస్తాను ఉండు " అంటారు. భరతుడు " మీకు శ్రమవద్దు, పళ్ళూ అవీ తిని కాలక్షేపం చేస్తాము " అని అంటాడు. అప్పుడు మహర్షి అంటారు " నువ్వు రాజువి, అలా చేయవచ్చు కాని నీక్రింద పనిచేస్తున్నవారిని సౌకర్యవంతంగా చూసుకోవాలి. వారికి అవసరమయిన/ఇష్టమయిన తిండి, వసతి  చూడ్డం నీ బాధ్యత. ఇప్పుడు మీరు నా అతిధులు కనుక ఆ బాధ్యత నాది " అంటారు. అదీ మన ఋషుల ఔన్నత్యం, మన అద్భుత సంస్కృతి. వారి ఏర్పాట్లకోసం హోమం ముందు కూర్చుని దేవతలను ఆవాహన చేస్తారు పనులకోసం. విశ్వకర్మని ఇంద్రాది దిక్పాలకులను సోముడిని, కుబేరుడిని నదులను ఆహ్వానిస్తారు. అందరూ వచ్చి భవనాలను రుచికరమైన వంటలు ఏర్పాటుచేస్తారు.  ఇక్కడ వింత విషయమేమిటంటే " సోముడు " రకరకాల రుచికరమైన " మాంసపు వంటకాలు " ఏర్పాటు చేస్తాడు అతిధులకోసం.  మహర్షులు తాము తి...

" అంతా రామమయం - జగమంతా రామమయం " - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీరస్తు శుభమస్తు"🙏 జనవరి 22న రామప్రతిష్ట "'రాముడు పుట్టిన ప్రదేశం " లో సుమారు 500 సం.ల తరువాత జరుగుతూంది అని అందరికీ తెలిసినదే. ఇది సాధ్యమవడానికి ఎందరో మహానుభావుల తపన, నిరంతరకృషి, రాముడిపట్ల అచంచల భక్తి ఉన్నాయి. వీరిలో ఒక రామభక్తుడి గురించి చదివి తరిద్దాం. ఒకరోజు సుప్రీంకోర్టులో రామజన్మభూమిమీద వాదనలకు ఇరుపక్షాల న్యాయవాదులు, సాక్షులు తయారుగా ఉన్నారు. అప్పుడు న్యాయవాది శ్రీపరాశరన్ గారిని జడ్జిగారు " మీరు వేదాలలోంచి, ఉపనిషత్తులలోంచి విషయాలు బాగానే చెబుతున్నారు. అయోధ్యలోని ఆ ప్రదేశమే రాముడు పుట్టిన స్థలమని వేదంలో ఉన్నదా " అని అడిగారు. అప్పుడు సాక్షులలోంచి ఒక అంధుడు లేచి " అయ్యా ఋగ్వేదంలోని ' జైమినీయ సంహిత ' లోని ఈ శ్లోకాలు సరయూనది ఒడ్డున ఉన్న ఒక ప్రత్యేక ప్రదేశం నుంచి ఒక ప్రత్యేక దిక్కుగా ఫలానా దూరం ప్రయాణం చేస్తే రాముడు జన్మించిన ప్రదేశం చేరుకోగలము అని ఉంది " అని తెలియచేస్తూ ఆ శ్లోకాలు చదవడం జరిగింది. వెంటనే జడ్జిగారు ఆ విషయం పరిశీలించమనడం, అది నిజమే అని అధికారులు తెలియచేయడంతో జడ్జిగారు " ఈరోజు మేము ఒక అద్భుతం ( మిరకుల్ ) చూస...

రామాయణం చదవటం వల్ల ప్రయోజనం ఏమిటి? - చీమలపాటి సూర్యనారాయణ

 🙏" శ్రీరస్తు శుభమస్తు"🙏 రామాయణం చదవడంవల్ల ప్రయోజనమేమిటండీ అంటూంటారు కొందరు కుహనా మేధావులు.  " కాఫీ త్రాగుతేకదా ఎలా ఉందో తెలుస్తుంది " అంటుంది ఓ కధానాయిక ఓ సినీమాలో. అలాగ రామాయణం పూర్తిగా చదువుతే కదా దానిలో ఉన్న అద్భుతవిషయాలు తెలుస్తాయి.  అలాకాకుండా ఏవో కొన్ని విషయాలను ప్రస్తావిస్తూ వ్రాసిన " రామాయణ విషవృక్షం " లాంటి పుస్తకాలు చదువుతే జాతి ఎదుగు బొదుగూ లేకుండా ఇలాగే ఉంటుంది. జీవితమన్నాక దుఃఖాలేకాదు, సుఖాలూ ఉంటాయి. ఇది మర్త్యలోకం. సుఖానికి దుఃఖస్పర్శ, దుఃఖానికి సుఖస్పర్శ ఉంటాయి ఇక్కడ. స్వర్గంలో దుఃఖస్పర్శ ఉండదు. అదే రెండు లోకాలకీ తేడా.  హనుమ సీతమ్మతో అంటారు " ఇలాంటిచోట ఇటువంటి మనుషులమధ్య ఎలా ఉండగలుగుతున్నావమ్మా " అని. సీతమ్మవారు హనుమతో అంటుంది " నూరేళ్ళబ్రతుకులో పోయేక్షణాన్నయినా ఆనందం కలిగించే వార్త వింటావు. అందుకే బ్రతుకును కొనసాగించాలి. నువ్వుంటేనే కదా ఆ క్షణాన్ని ఆస్వాదించగలవు " అని.  విభీషణుడి కూతురు త్రిజటతో సీతమ్మ అంటారు " సుఖాలు సెలయేరుల్లాగ, కొండల్లాగ చిన్నవిగా అనిపిస్తే కష్టాలు సముద్రాలలాగ, ఆకాశంలాగ పెద్దవిగా కనిపిస్తాయి ...

పైకి శ్రీరామజపం చేస్తూ లోపల కత్తులు నూరడం న్యాయమా? - చీమలపాటి సూర్యనారాయణ

 🙏" శ్రీరస్తు శుభమస్తు "🙏 " శ్రేయాన్ స్వధర్మో విగుణః    పరధర్మాత్ స్వనుష్ఠితాత్,   స్వధర్మే నిధనం శ్రేయః    పరధర్మో భయావహః "                - భ.గీత 3:35 " పరధర్మమును చక్కగా నిర్వహించుటకన్నను గుణరహితమైనను స్వధర్మమును ఆచరించుట ఉత్తమము. పరధర్మపాలనము హానికరమైనది. దానిని పాటించుటకన్నను స్వధర్మపాలనమునందు నాశనమును పొందుటయైనను ఉత్తమమైనది " అన్నారు పరమాత్మ. కొద్దిగా లోపాలున్నా స్వధర్మమే మేలు, పరధర్మం భయంకరమైనది అన్నారు పరమాత్మ గీతలో. దేశమే కాకుండా ప్రపంచమంతా జనవరి 22 దగ్గర పడుతూంటే శ్రీరామ జపంతో ఉప్పొంగిపోతూంటే ఒక నాయకుడు " వారు బయటకు రామజపం, లోపల కత్తులు నూరడం చేస్తారు " అని ప్రకటన చేసారు. ధర్మానికి హాని జరిగే అవకాశముందని అనిపిస్తే కత్తులు నూరి తయారుగా పెట్టుకోవాలి, తప్పుకాదు. ఓ ఉదాహరణ చూద్దాం. ఓ పెద్దాయన ఉదయాన్నే సంధ్యావందనం, విష్ణు/లలిత సహస్రనామపారాయణం, శ్రద్ధగా పూజ చేసుకుంటారు రోజూ. సాయంత్రం అవగానే ఆల్ ఔట్ స్విచ్ వేస్తారు. పైగా దోమల బ్యాట్ పట్టుకుని కూర్చుంటారు. దోమ కనబడగానే బ్యాట్ తో ఠప్ అనిపిస్తారు. వంటింట్లో బొద్దింక...

మనస్సులో కూడా చెడు ఆలోచన రాకూడదా? - చీమలపాటి సూర్యనారాయణ

 🙏" శ్రీరస్తు శుభమస్తు"🙏 " అందాలరాముడు    ఎందువలన దేముడు "  ఋషులు ఏపనిచేసినా, తపస్సు చేసినా లోకకల్యాణం కోసమే. తెలిసి వారు ఏతప్పూ చేయరు. కాని వారికి తెలియకుండానే కొన్ని దోషాలు వారికి తగులుకుంటూంటాయి. వారు "తపస్సు " చేసేది ఇలాంటి దోషపరిహారాల కోసం కూడా. " మహర్షులు ఒక్క చిన్న అసత్యమాడితే వారి తేజస్సు హరించుకుపోతుంది. అందుకే ఋషులు తెలిసో తెలియకో ఎప్పుడయినా అసత్యమాడి ఉండవచ్చు అని తలచి ఆ అసత్యదోషనివారణ కోసం సరస్వతీవ్రతం, ' సారస్వతేష్టి ' యజ్ఞం చేస్తారు ". ఈవిషయం రాముడు తనతల్లి కౌసల్యకు అరణ్యవాసానికి వెళ్ళేముందర చెబుతాడు, తనతండ్రికి తనవల్ల అసత్యదోషం రాకూడదని. ఓ ఋషి ఒక అత్యవసరపని మీద వేరే ప్రదేశానికి వెడుతున్నారు. ఎండబాగా ఎక్కువగా ఉంది. కమండలంలోని నీరుత్రాగి ఏదయినా పండు ఒకటి తింటేనయమని చుట్టూ చూస్తే ఓ పెద్ద చెట్టు ఒకటి పలుకొమ్మలతో ఆకుపచ్చటి ఆకులతో కనిపించింది కొద్దిదూరంలో. దాని దగ్గరకు వెళ్ళారు, ఓ పండో కాయో కోసుకుని తిందామని. ఆశ్చర్యంగా దానికి ఓ పువ్వుకాని కాయకాని లేదు. మనభాషలో అది మగచెట్టు. సరేలే అనుకుని ఎదరకి వెళ్ళిపోయారు. 3,4 రోజుల తరువాత వెళ...

" భోగి " అంటే ఏమిటి? - చీమలపాటి సూర్యనారాయణ

 🙏" శ్రీరస్తు శుభమస్తు "🙏 భోగి, సంక్రాంతి పండుగులగురించి పూజ్యులు గరికిపాటివారు ఓ ప్రవచనంలో కొన్ని అద్భుత విషయాలు తెలియచేసారు.  సంస్కృతంలో భోగి అంటే " తయారు ( ప్రిపరేషన్ ) " అని అర్ధంట. ఏ పండుగకైనా ముందరరోజే కొన్ని ఏర్పాట్లు చేసుకోవాలి. ఉగాది అనుకోండి - వేపపువ్వు, మామిడికాయ, చెరకుముక్కలు లాంటివి ముందరరోజే ఏర్పాటు చేసుకుంటాం. దీపావళి అయితే చెప్పనక్కరలేదు. టపాసులు, అమ్మవారిపూజకి ఎక్కువగా పువ్వులు స్వీట్స్ మొ.గు నవి ముందరే ఏర్పాటుచేసుకోవాలి. దసరాలయితే అమ్మవారి పూజలకి దండలు వత్తులు పూలు తప్పనిసరి. అంటే ఏ పండుగకైనా ముందరరోజుని " భోగి " అనే పిలుచుకోవచ్చు. శారదానవరాత్రులు అంటే ఏర్పాట్లకు ఒకరోజు సరిపోదు. 7/10 రోజులు పడుతుంది. 9 రోజులు 9 అలంకారాలు. అమ్మవారికి రకరకాల సువాసనలు, రంగులు, ప్రసాదాలు, పువ్వులు ఇష్టం. రకరకాల గాజులు, రవికెలగుడ్డలు, పూలు, వేరువేరు సువాసనల అగరబత్తీలు ఎన్ని ఏర్పాట్లు. ఇల్లంతా శుభ్రం చేసుకోవడం. అందుకని ఇటువంటి పండుగలకు భోగిరోజులు ఎక్కువగా ఉంటాయి.  ఏమున్నా ఏమిలేకపోయినా అమ్మవారికి ముఖ్యంగా కావల్సినది శ్రద్ధ, భక్తి. శరణాగతి అని ఒక్క నమస్కారం పెట...

రాముడు తండ్రితో యుద్ధం చేయనంటే తండ్రి మాటను లెక్కచేయనట్లా? - చీమలపాటి సూర్యనారాయణ

 🙏" శ్రీరస్తు శుభమస్తు"🙏 " అందాల రాముడు   ఎందువలన దేముడు " రామాయణం ఇతిహాసం అంటే " ఇతి + హా + సం " - ఇది ఇలాగే జరిగింది అని అర్ధం. రామాయణంలోని వారందరూ వ్యక్తులు. అంతేకాని పాత్రలు కావు. సీతమ్మవారిని రావణుడు ఎత్తుకుపోవడం రామరావణ యుద్ధం మాత్రమే తెలుసు చాలామందికి. కాని ఎన్నో అద్భుతమైన విషయాలు పొందుపరచబడి ఉన్నాయి ఆ మహాకావ్యంలో.  రాముడు తండ్రిమాట జవదాటడు అని చదువుకున్నాం మనం. కాని అది కొంతవరకే నిజం. రాముడు తండ్రి మాటలోని ధర్మాన్నే పాటించాడు అన్నది నిజం. రాముడు అరణ్యవాసానికి వెళ్ళిపోతూంటే తండ్రి దశరధుడు అంటాడు " నీకు కావలిసిన సైన్యాన్ని తీసుకుని నాతో యుద్ధంచేసి గెలిచి రాజ్యం తీసుకో. రాజ్యం వీరభోజ్యం. నన్ను ఓడించడం అధర్మం కాదు " అని. మరి శ్రీరాముడు అలా చేసాడా తండ్రి చెప్పాడని. అది ధర్మం కాదు అనుకోవడం వలననే అరణ్యానికి వెళ్ళిపోయాడు. ఆయన అరణ్యానికి వెడుతూంటే తల్లి కౌసల్య ఆశీర్వదిస్తుంది:  " యం పాలయసి ధర్మం    త్వధృత్వాచనియేనచ,    సవై రాఘవశార్దూల    ధర్మస్త్వామభిరక్షతు " అని. అంటే " రాముడు ఏధర్మాన్ని అనుసరిస్తాడో ఆ ధర్మమే అతన్ని రక్షిస్తుంది ...

వివేకానందుని జయంతి - స్ఫూర్తి దాయకుడు - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీరస్తు శుభమస్తు"🙏 నేడు వివేకానందుని జయంతి. శుభాకాంక్షలు. వివేకానందులు " నేను నా మతం యొక్క గొప్పదనాన్నే చెబుతాను, ఇతర మతాలను తక్కువచేసి మాట్లాడను. ఎందుకంటే అవన్నీ మా మతంలోంచి వచ్చినవే. ఏ విషయం మాట్లాడుకున్నా దాని మూలాలు మా సనాతనధర్మంలో కనబడతాయి " అని తరచుగా అనేవారు. వివేకానందుడు " మేము విగ్రహాన్ని దేవుడుగా చూడం, విగ్రహంలోని దేవుడిని చూస్తాం, పూజిస్తాం " అని చెప్పేవారు. వివేకానందుడు భయాన్ని వదిలేయమన్నారు. భయమే దుఃఖానికి మూలం. ఆయన ఓ చక్కటి కధ కూడా చెప్పారు. వంటలన్నీ తయారు చేసి పెట్టి అక్కడివారు ప్రక్కకు వెళ్ళారు ఏదోపనిమీద. ఓ కుక్క వచ్చింది. తినదామని ఎదరికి వెళ్ళడం, ఎవరైనా వచ్చి నడ్డివిరగ్గొడతారేమో అని ఇటూఅటూ చూడడం. ఒకవేళ ఏదో కొద్దిగా తిన్నా భయంతో తిన్న తిండి దానికి సంతోషమేమి కలిగిస్తుంది. మానవజీవితం కూడా అంతే. ఎప్పుడూ ఏదోదానిగురించి భయపడుతూ బ్రతికే జీవితం అవసరమా అన్నారు వివేకానందుడు. అందుకనే నిర్భయత్వం అలవాటుచేసుకోమన్నారు. వివేకానందులు చికాగో జరిగిన సర్వమతసమ్మేళనంలో " సోదరసోదరీమణులారా, ప్రపంచమతాలకు తల్లి అయిన సనాతనధర్మం, భారతదేశప్రజల తరపున మీకు న...

సీతమ్మతల్లిని పరమసాధ్వి అంటారెందుకు - చీమలపాటి సూర్యనారాయణ

 🙏" శ్రీరస్తు శుభమస్తు"🙏 సీతమ్మవారు పరాయిదేశంలో రాక్షసుల మధ్య బందీగా ఉన్నా ఎక్కడా మాటజారలేదు. ఎంతో ధైర్యంగా ఉండడమే కాకుండా హనుమకు, విభీషణుడి కూతురు త్రిజటకూ అద్భుతమైన జీవితసత్యాలను తెలియచేస్తుంది.  హనుమతో అంటారు " జీవితంలో సుఖాలలాగే కష్టాలుకూడా శాశ్వతం కావు. మరణించేలోగా ఒక్కరోజయినా/క్షణమయినా మంచి/ఆనందం కలిగించేది వస్తుంది. ఆ రోజు/క్షణము ను ఆనందించడానికి తాను బ్రతికి ఉండాలిగా మరి " అని. అంటే కష్టాలకి కృంగిపోయి, ఆత్మహత్యలు అవీ చేసుకోకూడదు అని. యువతకు ఎంతటి అద్భుత సందేశం. త్రిజటతో అంటారు " సుఖాలు సెలయేర్లలాగా, కొండల్లాగా చిన్నవిగా అనిపిస్తాయి. కష్టాలు సముద్రాలలాగ, పర్వతాలలాగా పెద్దవిగా అనిపిస్తాయి " అని. సుఖాన్ని ఓ సారి ఆనందించి వదిలేస్తాం. అదే‌ కష్టమయితే తలుచుకుని తలుచుకుని బాధపడుతూనే ఉంటాం. ఎంతటి అద్భుత జీవితసత్యం. " ననుబ్రోవమని చెప్పవే సీతమ్మతల్లి, ననుబ్రోవమని చెప్పవే ...." అని వేడుకుంటే చాలు, ఆదుకోవడానికి శ్రీరాముడిని పంపిస్తుంది. అవ్యాజకరుణామూర్తి. విశ్వనాధ సత్యనారాయణగారు తనువ్రాసిన రామాయణ కల్పవృక్షంలో అంటారు " నీ చరణ రవ్వదువ్వ శిరసా పరి...

" రామనామం " గొప్పది ఎందుకయింది - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీరస్తు శుభమస్తు"🙏  " అందాల రాముడు    ఎందువలన దేముడు " " యజ్ఞానాం జపయజ్ఞో2స్మి " అన్నారు పరమాత్మ భ.గీతలో ( 10:25 ). ఏదయినా మంత్రాన్ని జపం చేసుకోవచ్చు. కాని ముక్తినిచ్చే తారక మంత్రం ఒకటే. అది రామనామం. రామనామం ఎందుకు అంత పవిత్రమయినది/ఉత్కృష్టమయినది/శక్తివంతమయినది అయింది. రామ లో " ర+అ+మ " - 3 అక్షరాలు ఉన్నాయి. ర అగ్నిబీజం, అ సూర్యబీజం, మ చంద్రబీజం.  మనసా(మ) వాచా(ర) కర్మణా(అ) అంటారు - రామ నామంలో ఈ మూడూ ఉన్నాయి. విష్ణుసహస్రంలో " రామః విరామః " అనే నామాలతో ప్రార్ధిస్తాం స్వామిని. ఆదిశంకరులు రామః కి " నిత్యానంద చైతన్యములో సదా రమించువాడు " అని భాష్యం చెప్పారు. వేదం ఇలా చెబుతూంది: " రకారో అగ్నిబీజంశ్చాత్,    అకారో సూర్యబీజకం,    మకారాశ్చంద్రబీజంచ " అని. కుండలినీయోగాలో కూడా చక్రాలను 3 మండలాలుగా విభజించారు. మూలాధారం నుంచి అనాహతచక్రం వరకూ అగ్నిమండలం అని, అక్కడనుంచి ఆజ్ఞాచక్రం వరకూ సూర్యమండలం అని, ఆపైనదానిని చంద్రమండలం అనీ తెలియచేసారు. రామ అని జపిస్తే ఈ 3 మండలాలూ జాగృతి/చైతన్యం చెందుతాయి. మనస్సు అలలు లేని సముద్రంలా నిశ్చలంగ...

రాముడు సీతను అడవికి పంపడమేమిటి? - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీరస్తు శుభమస్తు"🙏 " రామో విగ్రహవాన్ ధర్మః " - శ్రీరాముడు మూర్తీభవించిన ధర్మము. ఈ మాట అన్నది రాముడి వీరభక్తుడో బంధువో స్నేహితుడో కాదు. విశ్వామిత్రుడి యజ్ఞరక్షణ సమయంలోనే రాముడి చేతిలో చావుదెబ్బ తిన్న మారీచుడనే రాక్షసుడు. అన్నది తన స్నేహితులదగ్గరో బంధువులదగ్గరో కాదు. లంకాధీశుడైన రావణుడితో. దీన్నిబట్టి రాముడు ఎంతటి సంస్కారవంతుడో ధర్మానికి ఎంతగా కట్టుబడతాడో తెలుస్తుంది. అటువంటి మహనీయుణ్ణి " గర్భవతి అయిన భార్యను ఎవరో అనామకుడు కూసిన కూతలను పట్టుకుని అడవికి పంపించేస్తాడా " అని కొందరు అనడం తరచు చూస్తూంటాం/వింటూంటాం.  కైకేయికి దశరధుడు వరం ఇవ్వడంతో తండ్రి ఇచ్చిన మాటకు కట్టుబడి రాముడు అడవికి వెళ్ళవలసి వచ్చింది. తను ఒక్కడే వెడతానంటే సీతాదేవి తనుకూడా వస్తానంది. అప్పుడే వివాహం అవడం, భర్తను విడిచి ఉండడం కొంచెం కష్టమే కనుక ఆమె కోరికలో తప్పు పట్టడానికి ఏమీలేదు. దారిలో ఎందరో రాక్షసులు దాడి చెయ్యడం రాముడు ఖరాదులను ఎందరినో సంహరించడం జరిగింది. ఒక మహారాజు కూతురుగా ఆవిడకు పరిస్థితులన్నీ అర్ధమయ్యే ఉండాలి. శూర్ఫణఖ వచ్చి రాముణ్ణి వివాహమాడతాననడం ఆయన లక్ష్మణుడి దగ్గరకు వెళ్ళమన...

కిరాణాకొట్టువాడు తపస్వి - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీరస్తు శుభమస్తు"🙏  " నాహం వేదైః నతపసా    నదానేన నచేజ్యయా,   శక్యా ఏవంవిధో ద్రష్టుం    దృష్టవాన్ అసి మాంయధా "                 - భ.గీత 11.53 గీతలో పరమాత్మ అంటారు " వేదాలు చదవడం తపస్సుచెయ్యడం దానంచెయ్యడం పూజలుచెయ్యడం లాంటివాటితో నన్ను చూడడం/పొందడం సాధ్యమైన పనికాదు " అని. తనయందు అచంచలమైన భక్తితో మాత్రమే అది సాధ్యమని తెలియచేసారు. జాబాలి అని ఒక మహర్షి ఉండేవారు. ఆయన అద్భుతమయిన తపస్సు చేసేవారు. ఓ సారి ధ్యానంలో అలా ఉండిపోవడం, ఆయన తలపై పిట్టలు గూడుకట్టుకుని జీవించడం జరిగింది. ఆయన ధ్యానంలోంచి బయటకువచ్చి తలను చూసుకుని ఓహ్ " గొప్ప తపస్వి " ని అయిపోయాను అనుకున్నాడు. అప్పుడు పిట్టలు కిలా కిలా నవ్వి " కాశీలోని తులాధారుడి తపస్సు ముందు నీ తపస్సు ఎంత " అనడంతో జాబాలి ఆశ్చర్యపోయాడు. కాశీలోని తులాధారుడి ఆశ్రమమంతా పుట్టలు పిట్టలతో నిండిపోయి ఉంటుందేమో, ఓ సారి వెళ్ళి చూడాలి అనుకుని కాశీ వెళ్ళాడు. తులాధారుడు ఎవరు అని ఒక్కొక్కరిని అడుగుతూ వెడితే చివరకు ఓ కిరాణాకొట్టుకు చేరాడు జాబాలి. కొట్లో కూర్చుని ఉన్నాయనను " తులాధారుడు " ఎవరని అ...

మనస్సు - కోతిచేష్టలు - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీరస్తు శుభమస్తు"🙏 ఒకరోజు కంచి పరమాచార్యులవద్దకు ఓ భక్తుడు వచ్చాడు. దైవభక్తి మెండుగా ఉన్నవాడు, పరమాచార్యులంటే భక్తి గౌరవం ఉన్నవాడు. భక్తుడు అన్నాడు " స్వామీ ఎప్పుడు కళ్ళుమూసుకుని అమ్మవారిని తలచుకున్నా ఓ ప్రముఖ ' నటి ' మొహం గుర్తుకొస్తూంది, ఏమి చెయ్యడం " అని. స్వామి అన్నారు " మొహం ఎందుకు గుర్తుచేసుకోవడం, నువ్వు పట్టుకోవలసినవి, కోరుకోవలసినవి అమ్మవారి పాదాలు, అందుకని పాదాలు గుర్తుచేసుకో " అని. అమ్మవారి పాదాలు అగ్నివర్ణంలో ఉంటాయి. పసుపువ్రాసి, పారాణి అలంకరించి ఉంటాయి. ఆ ఊహే అద్భుతం. శంకరులు శివానందలహరి చేస్తూ ఇలా అంటారు : " సదా మోహాటవ్యాం చరతి    యువతీనాం కుచగిరౌ,    నటత్యాశాశాఖా స్వటతి    ఝడితి స్వైర మఖికః,   కపాలిన్ భిక్షో మే        హృదయకపి    మత్యంత చపలం ,    ధృఢం భక్త్వా బద్ధ్వా శివ    భవదధీనం కురు విభో " . " ఓ ఈశ్వరా - నా హృదయం ( మనస్సు ) మోహం అనే అడవిలో తిరుగుతూంది. నా మాట వినడం లేదు. అతి చపలమైన నా మనస్సనే కోతిని దయచేసి నా భక్తి ( అనే తాడు ) తో కట్టి నీ అధీనంలో ఉంచుకో స్వామీ " అని. ఇక సామా...

కర్మకాండ x జ్ఞానకాండ - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీరస్తు శుభమస్తు"🙏 " యదా యదాహి ధర్మస్య    గ్లానిర్భవతి భారత,   అభ్యుత్థానమధర్మస్య    తదాత్మానం సృజామ్యహం "                     - భ.గీత 7:13 ఎప్పుడయినా ధర్మానికి హాని జరుగుతూన్నప్పుడు ధర్మరక్షణకోసం వస్తూంటాను నేను అన్నారు పరమాత్మ. అంటే ఎల్లప్పుడూ ఎవరినో ఒకరిని సంహరించడానికే అనుకోనక్కరలేదు.  ఆదిశంకరులు, కంచిపరమాచార్యులు,  శృంగేరీపీఠాధిపతి, రమణమహర్షి, వివేకానందులు లాంటివారి కృషి పరమాత్మ ఏర్పాటే.  వేదాలు కర్మకాండ, వేదాంగాలు ( ఉపనిషత్తులు మొ.గునవి ) జ్ఞానకాండ. ధనవ్యయంతో కూడుకున్న ద్రవ్యయజ్ఞాలకన్నా జ్ఞానయజ్ఞమే మేలు అన్నారు పరమాత్మ ( భ.గీత 4:33 ).  ఆదిశంకరులు " రాబోయేది గడ్డుకాలం, జీవులు సంసారసాగరంలో మునిగిపోయి నానాబాధలూ పడుతూంటారు, దైవచింతనకు సమయం ఎక్కడుంటుంది. అటువంటివారు యాగాలు అవీ చేసే అవకాశమెక్కడిది. మరి సనాతనధర్మం ఎలా రక్షింపబడుతుంది. ఇన్నిరకాలుగా చింతనచేసి కర్మకాండకన్నా జ్ఞానకాండయే గొప్పది ( సులువు అంటే అర్ధంవేరేగా తీసుకోవచ్చు ) అనే సంకల్పాన్ని ప్రజల్లోకి తీసుకెడితే రోజూ ఏదో ఒ...

మహాసముద్రం - చిల్లపెంకులు - చీమలపాటి సూర్యనారాయణ

 🙏" శ్రీరస్తు శుభమస్తు "🙏 వైదికవిజ్ఞానం, మహాభారతం, రామాయణం మొ.గునవి మహాసముద్రాలు. శ్రద్ధగా లోపలికి వెళ్ళేకొలదీ ముత్యాలు అపురూపమైన శంఖాలు లాంటి విలువైనవి దొరుకుతాయి. ఒడ్డున కూర్చుని చూస్తూంటే ఏమి ఒరుగుతుంది, గుల్లలు ఏరుకోవడం జరుగుతుంది తప్ప. మన సంస్కృతి/విజ్ఞానం గురించి ఇప్పుడు చాలామంది మాట్లాడేది ఒడ్డునకూర్చుని సంపాదించిన " మిడిమిడిజ్ఞానం " తోనే.  జీవితాంతం కష్టపడితే ఒక వేదంలో మహా అయితే పదవవంతు అర్ధంచేసుకోగలరు. సామవేదం వంటివారే " నాకు తెలిసినంతవరకూ " అని చెబుతూంటారు. భరద్వాజ మహర్షి వేదపారంగతుడు. ఓ సారి ఆయన వేదపఠనం చేస్తూంటే ఇంద్రుడు వచ్చి ఎంతవరకూ వచ్చింది మీ పఠనం అంటే మహర్షి ఈ జన్మ సరిపోదు అనడంతో ఇంద్రుడు మహర్షికి ఇంకో 300 సం.ల వయస్సు ఇచ్చాడు. అలా 3 సార్లు అంటే 900 సం.ల వయస్సు ప్రసాదించి మళ్ళీవచ్చి అయిందా అంటే మహర్షి పర్వతాన్ని చూపెట్టి వేదం ఆ పర్వతం అయితే నేను నేర్చుకున్నది ఇది అని " గుప్పెడు ఇసుక " తీసి చూపించారు మహర్షి. " అనంతావై వేదాః " అన్నారు అందుకే.  పదాల అర్ధం గ్రహించడమే కష్టం. ఒక్కో పదానికి ఎన్నో అర్ధాలు. వేదంలో " తస్య ప...

బకవ్రతుడు/బిడాలవ్రతుడు - చీమలపాటి సూర్యనారాయణ

 🙏" శ్రీరస్తు శుభమస్తు "🙏 దానం - దయ అంటే ఏమిటి? అన్నంలేనివారికి అన్నం, నీరులేనివారికి నీరు, వస్త్రం లేనివారికి వస్త్రం ఇవ్వడాన్ని దయ అంటారు. దానం అంటే సంకల్పం చేసుకుని గ్రహదోషానికో మరొకపాపపరిహారానికో చేసేది. తెలియకుండా అందరూ కొన్ని పాపాలు చేస్తూంటారు. వాటి పరిహారంకోసమే వీటిని చెయ్యమన్నారు. అంతేకాని 4 హత్యలు చేసి 200 మందికి అన్నం/వస్త్రం దానం చేస్తానంటే కుదరదు. పాపఫలం పుణ్యఫలం వేరువేరుగా అనుభవించవలసి వస్తుంది. అంతేకాని బేలన్స్ షీట్ లో లాగ " నెట్ " ఫలం ఉండదు. దానం చేసేవారూ తీసుకునేవారూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. దానం తీసుకునే ఆయన యోగ్యుడయి ఉండాలి. దానం తీసుకుంటే దోషాలు వస్తాయి. దాని విరుగుడుగా జపమో తపస్సో లేక వేరొక పరిహారమో చేసుకోవాలి. ఒకాయనకి కిడ్నీకాని కన్నుకాని కావాలి. ఎలా వస్తుంది. ఇంకొకతను పోగొట్టుకుంటే వస్తుంది. ఇతని పాపం పోవాలంటే ఇంకొకతను ఆ పాపాన్ని మొయ్యాలి. అందుకని జాగ్రత్తగా ఉండాలి. " హిరణ్యం భూమిమశ్వం    గామన్నం వాసస్తిలాన్      ఘృతం ప్రతిగృహ్ణన్    అవిద్వాంసు    భక్తీవంతి దారువత్ " అన్నాయి శాస్త్రాలు. " అపాత్రదానం " కుదరదంద...

రైలు ప్రయాణం - ధర్మం - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏 " సంస్కృతి - సంస్కృతి 9 " " ధారణాత్ ధర్మమిత్యాహుః " - ధారణ వలననే ధర్మం నిలుస్తుంది. ఏదయితే పట్టి ఉంచుతుందో దానినే ధర్మం అన్నారు. రైలు ప్రయాణం ఎంతో సుఖంగా ఉంటుంది. ఎప్పటిదాకా, రైలు పట్టాలు మీద వెడుతూన్నంతవరకూ. పట్టాలే రైలును నడిపిస్తున్నాయి. కొద్దిగా ఇటూ అటూ అయినా ప్రమాదమే. పట్టి ఉంచే పట్టాలే ధర్మం. ధర్మం నుంచి ఏమాత్రం ప్రక్కకు తొలగినా జీవితం దుఃఖమయమే అని సనాతనధర్మం చెబుతూంది. ధర్మం అంటే ఏమిటి, ఎలా ఆచరించాలి మరి?. శివాలయంకి వెడతారు దేవుడికి దండం పెట్టుకోవడానికి. శాస్త్రం ఏమి చెబుతూందంటే ముందు నందికి దండం పెట్టుకోమని. వృషభం/నంది అంటే ధర్మం అని అర్ధం. నంది ధర్మస్వరూపుడు. అందుకే ముందు ధర్మాన్ని గౌరవించు, నమస్కరించు, అనుమతిని తీసుకుని దైవదర్శనం చేసుకో అని తెలియచేస్తున్నాయి శాస్త్రాలు. శివాలయంకి వెళ్ళినప్పుడు నంది కొమ్ములపై వ్రేళ్ళు ఉంచి మధ్యలోంచి చూడమంటారు. అంటే దేవుడినయినా " ధర్మం " లోంచి చూడమని.  ధర్మం ఆచరించేదెలా. ఉపనిషత్తులు తెలియచేస్తూన్నది ధర్మం/వృషభం యొక్క నాలుగు పాదములు/కాళ్ళు వరుసగా " సత్యం, అహింస, అస్తేయం, శౌచం ...

Self Assessment " సంస్కృతి - సంస్కృతం 8 - చీమలపాటి సూర్యనారాయణ

 🙏" శ్రీరస్తు శుభమస్తు "🙏 " సంస్కృతి - సంస్కృతం 8 " శివాంశసంభూతుడు, మహాపండితుడు అయిన అప్పయ్యదీక్షితర్ గురించి కొన్ని అద్భుతమయిన విషయాలు నెమరువేసుకుందాం. " శివరహస్య " అనే గ్రంధంలో శివుడే స్వయంగా తన అంశతో దీక్షితర్ అనే ఆయనగా జన్మిస్తాడు అని తెలియచేసారు.  ఆయన 1554 లో తమిళ్ నాడులోని విరించిపురంలో జన్మించారు. " విరించి " అంటే విష్ణువు. అంటే శివాంశుడు విష్ణుపురంలో జన్మించారన్నది అద్భుతవిషయం. శివవిష్ణువులు ఒక్కరే అన్నది ఈయన బోధన. ఆయన చిన్నతనంలోనే 14విద్యలు నేర్చుకున్నారు. ఆయన వేదాంతం, శివాద్వైతం, మీమాంస, వ్యాకరణం, అలంకారాలపై 104 గ్రంధాలు వ్రాసారు. ఆయన అద్వైతాన్ని అనుసరించారు.  అప్పుడు చోళరాజుల సంస్థానంలో రత్నఖేత శ్రీనివాస అని పండితుడు ఉండేవారు. ఆయన అప్పయ్యగారి విద్వత్తుగురించి విని ఆయన్ని ఓడించి తనకాళ్ళు పట్టించుకోవాలని తలచి కంచి కామాక్షిని అనుగ్రహించమని ప్రార్ధిస్తారు. అమ్మవారు " అది అంత సులువుకాదు కాని నీ కూతురిని ఆయనకిచ్చి వివాహం చెయ్యి, నువ్వు మామగారు అవుతావు, ఆయన నీకాళ్ళు ఎలాగూ పట్టుకుంటాడు " అన్నారు. అదేరాత్రి శివుడు అప్పయ్యగారి కలలో క...

జర్మనీ దేశగురువు మనశాస్త్రిగారే - సంస్కృతి సంస్కృతం - 7 - చీమలపాటి సూర్యనారాయణ

 🙏" శ్రీరస్తు శుభమస్తు "🙏  " సంస్కృతి - సంస్కృతం 7 " 1970 లలో జర్మనీలో ఒకాయన మన రాయబారిగా ఉండేవారు.‌ " ఫ్రాంక్ ఫర్ట్ " విశ్వవిద్యాలయం వారు ఈయన్ని ముఖ్య అతిథిగా ఓ కార్యక్రమానికి పిలిచారు. ఈయనకు అక్కడ సిబ్బంది అన్ని విభాగాలూ చూపించి చివరకు విశ్వవిద్యాలయం లోని " సెంట్రల్ హాల్ " కి తీసుకునివెళ్ళారు. విదేశీప్రముఖులు అక్కడే కూర్చుంటారు. ఈయన లోపలికి వెళ్ళగానే ఎదురుకుండా గోడకి ఓ పెద్ద ఆయిల్ పెయింటింగ్ చూసారు. పంచె లాల్చీ కట్టుకుని నుదుట విభూతి కుంకుం పెట్టుకుని పిలకతో ఉన్న ఒకాయనది ఆ చిత్రం. ఈయన ఆశ్చర్యపోయి " ఎవరు ఈయన " అంటే అధికారులు " ఈయన తెలియదా, మీ భారతీయుడే, మా దేశగురువు " అన్నారు. వెంటనే రాయబారి ఈ విషయాలన్నీ తెలియచేస్తూ ఓ నోట్ ని మన ప్రధానమంత్రికి పంపించారు. ఆవిడ ఆశ్చర్యపోయి వివరాలు సేకరించమని గూఢచారులకి ఇచ్చారు. ఆ జర్మనీ దేశగురువే మన శ్రీదండిభట్ల విశ్వనాధశాస్త్రి గారు. 15వ ఏటకే యజు అధర్వణ వేదాలు, వ్యాకరణం, తర్కశాస్త్రాలలో దిట్ట. ఆయనది రాజమండ్రి అంటారు కాని మా అమ్మగారూ వాళ్ళు నా చిన్నప్పుడు మాట్లాడుకునేది తణుకు దగ్గర ఒక గ్రామం....