Posts

Showing posts from December, 2025

నేరం జనాలది కాదు. గరిటెలది అన్నారు పూజ్యులు గరికిపాటి వారు - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీరస్తు శుభమస్తు"🙏 " రామప్రభావాత్ ఆశ్చర్యం " - ఇది రాముడి దయే అని అనుకుంటారు హనుమ. లంకలో తోకకు నిప్పు పెట్టినప్పుడు " ఇంతలా అగ్నిమంటలు పెరిగిపోతూన్నా అసలు వేడే లేదేమిటి " అని ఆశ్చర్యపోతారు హనుమ. సకలవేదపారంగతుడిని కదా నా గొప్పే అనుకోలేదు, రాముడి దయ అనుకున్నారు. మనకు జరుగుతూన్న మంచికి కలుగుతూన్న సుఖాలకి ప్రతీరోజూ భగవంతుడికి కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ ఉండాలి. " ప్రవచనాలు బాగానే వింటున్నారు, దేవాలయాలకు బాగానే వెడుతున్నారు. అభిషేకాలూ అష్టోత్తరాలూ బాగానే చేయించుకుంటున్నారు. దానధర్మాలూ బాగానే చేస్తున్నారు. కాని మనుషుల్లో రావలసినంత మార్పు రాలేదనీ మంచితనం తగ్గిపోయిందనీ బాధపడుతూంటారు కొందరు. నేరం మనుషులది కాదు " గరిటెలది " అన్నారు పూజ్యులు గరికిపాటి వారు. గరిటె వంటగదిలో ఉంటుంది. బిర్యానీ చేసినప్పుడు బాగా కలుపుతుంది, సాంబారుని కలుపుతుంది, బాదంఘీర్ ని, పాయసాన్ని కలుపుతుంది, కారంపెట్టి వండిన కూరలని కలుపుతుంది, ఆవకాయని బాగా కలుపుతుంది - విశేషమేమిటంటే అన్నింటిలోనూ అది పాలుపంచుకున్నా ఈ అద్భుత రుచులేవీ గరిటెకు అంటవు. ఇప్పుడు ఈ భక్తి విషయంలోనూ జరుగు...

పాపపు భవంతులకు పునాది అయిన లోభాన్ని పోగొడుతారు అమ్మవారు - చీమలపాటి సూర్యనారాయణ

 🙏" శ్రీమాత్రేనమః"🙏 " లోభనాశినీ " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 171 వ నామం. " లోభనాశినీ " అంటే లోభమును పోగొట్టునది. ఎవరిది?. భక్తులది, తనను నమ్ముకున్నవారిది. " త్రివిధం నరకస్యేదం   ద్వారం నాశనమాత్మనః,   కామక్రోధః తధా లోభః   తస్మాత్ యేతత్ త్రయం త్యజేత్ "                                - భ.గీత 16:21 " కామక్రోధలోభాలు నరకద్వారాలు - కనుక వాటిని వదిలేయాలి " అని తెలియచేసారు పరమాత్మ గీతలో. ఈ దుర్గుణాలు అన్నీ నరకానికి తీసుకుని పోయేవే. జాగ్రత్తగా ఉండాలి. వ్యాసర్షి మహాభారతంలో అసలు మనుషుల పాపాలకి ( కష్టాలకి ) మూలం " లోభము " అన్నారు: " పాపశ్చతు యదధిష్టానం   తత్ శృణుష్వ నరాధిపా,   ఏకో లోభో మహాగ్రాహో   లోభాత్ పాపం ప్రవర్తతే ". లోభం అంటే కావాలనుకోవడం. అది అక్కడితో ఆగదు - తనకే కావాలనుకోవడం, ఇంకెవరికీ ఉండకూడదు, ద్రక్కకూడదు అనుకోవడం, అసూయ, కోపం, హింస అన్నీ ఒకటి తరువాత ఒకటి కలుస్తూంటాయి....

శ్రీకాలభైరవాష్టమి నేడు, శుభాకాంక్షలు అందరికీ - చీమలపాటి సూర్యనారాయణ

 🙏" శ్రీమాత్రేనమః"🙏 " మహాభైరవపూజితా " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్య నామాలలో 231 వ నామం. " మహాభైరవపూజితా " అంటే మహాభైరవుడిచేపూజింపబడినది అని భాష్యం చెప్పారు. " భరణ రమణ వమన " కర్త భైరవుడు. సృష్టి స్థితి లయలను చేయు శివునకు భైరవుడని పేరు. మూడు కార్యములు ఒకడేచేయు మహత్వమువలన మహాభైరవుడు అని కొలువబడుతున్నారు అని భాష్యం చెప్పారు. పద్మపురాణంలో కూడా శంకరుడు అక్షమాలను ధరించి న్యాసముచేత అమ్మవారిని పూజించారు అని తెలియచేసారు. మహాభైరవుడి గురించి తెలుసుకుందాం. " అసితాంగో రురుశ్చండః   క్రోధశ్చోన్మత్త భైరవః    కపాలీ భీషణశ్చైవ   సంహార శ్చాష్ట భైరవాః    ఓం అష్టభైరవేభ్యో నమః " ఈ శ్లోకం ద్వారా భైరవులు ఎనిమిది మంది అని తెలుస్తూంది. వీరు అసితాంగ, రురు, చండ, క్రోధ, ఉన్మత్త, కపాలి ( కాల ), భీషణ, సంహార భైరవులు. అష్టభైరవుల పూజ అనేక అడ్డంకులను తొలగించడంలో, రక్షణ కల్పించడంలో, ఆధ్యాత్మిక పురోగతి పెంపొందించడంలో శక్తివంతమైన ఆధ్యాత్మిక సాధనగా గుర్తించబడింది. ఆరోగ్యానికి కూడా భైరవారాధన ఉపయోగపడుతుంది. ఈ అష్టభైరవులు అష్టదిక్కులకు అధిపతులు: 1. ...