Posts

Showing posts from September, 2025

శ్రీదుర్గాదేవి అలంకారంలో అనుగ్రహిస్తున్నారు అమ్మవారు ఈరోజు, శుభాకాంక్షలు అందరికీ - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏 " మోహనాశినీ " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 163 వ నామం. మోహనాశినీ అంటే మోహానికి అడ్డుకట్ట వేయడం.  అందుబాటులో లేని కోరికను తీర్చుకోవాలనుకోవడాన్ని మోహం అంటారు. ఇది అధర్మము, చెడుపనులకు దారి తీస్తుంది. ఉదాహరణకు ఒకతను మంచివాడే. ఓ చక్కని ఉద్యోగం చేసుకుంటూ భార్యాపిల్లలతో సంతోషంగా గడుపుతూ ఉంటాడు. ఓ ఖరీదయిన ప్రాంతంలో ఓ ఇల్లు కొనుక్కోవాలనే కోరిక కలుగుతుంది. అది మోహంగా బలపడుతుంది. డబ్బు కోసం చెడ్డదారులు త్రొక్కడం మొదలుపెడతాడు. చిక్కుల్లో పడతాడు. కోరిక తీరదు కాని చిక్కులు మిగులుతాయి. ఈ విషయిన్నే పరమాత్మ గీతలో ఇలా చెబుతారు: " స్వభావజేన కౌంతేయ    నిబద్ధః స్వేన కర్మణా,    కర్తుం నేచ్ఛసి యన్మోహనాత్    కరిష్య స్వవశో2పితత్ "          - భ.గీత 18:60 " కౌంతేయా, మోహప్రభావమున నీవు చేయుటకు ఇష్టపడని కర్మనుకూడా నీ పురాకృత స్వాభావిక కర్మలచే బంధింపబడి తత్ప్రభావమున నీవు అవశుడవై చేయుదువు " అని. ఓ కోరిక కలగగానే తన స్థాయి ఏమిటి, అది తనకు ఎంతవరకూ అవసరం అని ఆలోచనచేయాలి.‌ కాని అది అంత సులభం కాదు. అమ్మవారి అనుగ్రహం...

మహాసరస్వతీదేవి అలంకారంలో అనుగ్రహిస్తున్నారు అమ్మవారు ఈరోజు, శుభాకాంక్షలు అందరికీ - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏 " వాగధీశ్వరీ " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 640 వ నామం. " వాగధీశ్వరీ " అంటే వాక్కులన్నిటికీ ఈశ్వరి. వాక్కు అంటే అర్ధనారీశ్వరం. వాక్కు ఉంటే దానికి అర్ధం ఉండి తీరుతుంది. వాక్కు అక్షరాల కూర్పు. ఈ అక్షరాలన్నిటికీ అధిదేవతలు ఉన్నారు. వారిని వాగ్దేవతలు అంటారు. ఆ వాగ్దేవతలందరికీ ఈశ్వరి అమ్మవారు. అదీ మన వాజ్మయం ఉత్కృష్టత. " అ నుండి అః " వరకు ఉన్న 16 అక్షరాల విభాగాన్ని "చంద్ర ఖండం" అని తెలియచేసారు.  ఈ చంద్రఖండంలోని అచ్చులైన 16 వర్ణాలకు అధిదేవత " వశిని " అంటే వశపరచుకొనే శక్తి కలది అని అర్ధం. "క" నుండి "భ" వరకు ఉన్న 24 అక్షరాల విభాగాన్ని " సౌర ఖండం " అన్నారు. "మ" నుండి "క్ష" వరకు ఉన్న 10 వర్ణాల విభాగాన్ని " అగ్ని ఖండం" అన్నారు.  ఈ అక్షరాలన్నీ బీజ శబ్దాలు. ఇవి మనశరీరాన్నే కాకుండా ప్రకృతిని కూడా ప్రభావితం చేస్తున్నాయి అని తెలుస్తూంది. అందుకే మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడాలి అంటారు. సౌర ఖండంలోని " క "నుండి "ఙ...

శ్రీమహాలక్ష్మీదేవి అలంకారంలో అనుగ్రహిస్తున్నారు అమ్మవారు ఈరోజు శుభాకాంక్షలు అందరికీ - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏 " భగమాలినీ " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 277 వ నామం. " భగమాలినీ " అంటే షడ్గుణైశ్వర్యములను ధరించినది అని భాష్యం చెప్పారు. "మాహాత్మ్యస్య సమగ్రస్య  ధెైర్యస్య యశసశ్శ్రియః జ్ఞాన  వైరాగ్యయోశ్చైవ షణ్ణాం - భగ, .....  ఇత్యుక్త భగో౽స్యాస్తీ తి భగవాన్ " అని శాస్త్రోక్తం. 1.మాహాత్మ్యం 2.ధైర్యం 3.యశస్సు  4.సంపద 5. జ్ఞానం 6. వైరాగ్యం ఈ ఆరింటిని షడైశ్వర్యాలు అంటారు. వీటికే "భగ" అని పేరు.  ఈ ఆరు ఐశ్వర్యాలను సంపూర్ణంగా కలిగి ఉండడం వల్లనే " భగవంతుడు " అని కొలుస్తాం. ఈ ఐశ్వర్యాలలో సంపద నాలుగవది.  సంపద అంటే సమృద్ధి, సాధించబడినది అనే రెండు అర్థాలు. తృప్తి పరిచేది - అవసరాలను తీర్చేది సంపద. సంపద రెండు రకాలుగా సృష్టించబడుతుంది. 1.ఇతరుల అవసరాలను నెరవేర్చగలిగే శక్తి పెరుగుతున్న కొద్దీ సంపద సృష్టి జరుగుతూ ఉంటుంది. కొందరు వ్యాపారస్తుల గురించి " వారి సంపద నిముషానికి ఇంత పెరుగుతూంది " అని చెబుతూంటారు. ఆ సంపద ఊరికే రాదు. వారు శ్రమపడుతూ ఇతరుల అవసరాలు తీరుస్తూన్నంతవరకే పెరుగుతూ ఉంటుంది. 2.క్రియాశక్తి వల్...

శ్రీలలితాదేవి అలంకారంలో అనుగ్రహిస్తున్నారు అమ్మవారు ఈరోజు శుభాకాంక్షలు అందరికీ - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏 " పంచమీ, పంచభూతేశీ, పంచసంఖ్యోపచారిణీ " - ఇవి శ్రీలలితాసహస్రరహస్యనామాల్లో 948,949,950 వ నామాలు. " పంచమీ " అంటే సదాశివుని స్త్రీస్వరూపురాలు. బ్రహ్మ విష్ణు రుద్ర మహేశ్వరి సదాశివ - పంచతత్వాలు. పంచమీతత్వం అయిన సదాశివునికి ఈశ్వరి పంచమి. వారాహీదేవిని కూడా పంచమి అని కొలుస్తారు. బ్రాహ్మీ వైష్ణవీ మాహేశ్వరీ కౌమారీ వారాహీ లలో వారాహీ పంచమం. ఈవిడ అహారప్రదాత. ఈవిడ ఆయుధాలు హలం ( నాగలి ), ముసలం( రోకలి). అంటే నాగలితో పండించడం, రోకలితో పండిన ధాన్యాలను దంచి ఆహారంగా ఇవ్వడం. ఎంతటి కరుణామయి, ఎంతటి అద్భుత ప్రక్రియ.  " పంచభూతేశీ " అంటే పంచభూతాలకి నాయకురాలు. భూమి అగ్ని నీరు వాయువు ఆకాశం ఇవి పంచభూతాలు.  రమణమహర్షిని ఓ భక్తుడు అడిగారు " ఎప్పుడూ ఇక్కడే కూర్చోకుండా మానససరోవరం, కేదారనాధ్, నైమిశారణ్యం లాంటివి తిరిగి రావచ్చు కదా. కొత్త కొత్త విషయాలు చూడవచ్చు " అని. ఆయన అన్నారు " నాకూ తిరిగిరావాలనే ఉంది, ఎక్కడైనా మన పంచభూతాలు కాక ఆరవది కనిపిస్తే చెప్పు, వెంటనే వెళ్ళి చూసివస్తాను " అని. అందుకే అమ్మవారు పంచభూతేశి అని కొలువబడుతూంది. " పంచ...

శ్రీలక్ష్మీదేవి అలంకారంలో అనుగ్రహిస్తున్నారు అమ్మవారు ఈరోజు, శుభాకాంక్షలు - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏 " తాం మ ఆవహ జాతవేదో    లక్ష్మీమనపగామినీం "           - శ్రీసూక్తం. ఇక్కడ " లక్ష్మీమనపగామినీం " అన్నారు. " అనపగామినీం " అంటే తిరిగి వెనక్కు వెళ్ళనటువంటిది. అటువంటి సంపదను ఇయ్యమని అమ్మవారిని కోరుకోవాలి. ఎవరినైనా ఆశీర్వదించినప్పుడు " ఆయురారోగ్య ఐశ్వర్యాది భోగభాగ్యములతో జీవించుము " అని అంటారు. ఆయువు, ఆరోగ్యం, ఐశ్వర్యములంటే తెలిసినవే. భోగాలంటే సౌకర్యాలూ, పనిమనుషులు మొ.గునవి. మరి భాగ్యం ఏమిటి. ముందర నాలుగూ అంటే " ఆయువు ఆరోగ్యం ఐశ్వర్యం భోగాలు " ఉన్నా సుఖం ఉండదు చాలామందికి.  " అశాంతస్య కుతః సుఖం ( భ.గీత 2:66 )" - " ఎప్పుడూ అశాంతిగా ఉండేవానికి సుఖం ఎక్కడిది " అన్నారు పరమాత్మ గీతలో. " భాగ్యం " అంటే ఈ శాంతే. ఇది ఉన్న మనిషే సుఖంగా ఉండగలడు, ఏది లేకపోయినా. ఈ శాంతిని కలుగచేసేది అమ్మవారు లక్ష్మీదేవి. ఆవిడ సంపదని ఇస్తుంది అంటారు. నిజమయిన సంపద ఈ శాంతే. శ్రీలక్ష్మీసహస్రనామాలలో " సదదృష్టప్రదాయినీ/దురదృష్టవిఘాతినీ " అని ఉంటుంది. మంచి అదృష్టాన్ని ప్రసాదిస్తుంది, దురదృష్టాన్ని పోగొడుతుంది...

అమ్మవారు ఈరోజు శ్రీకాత్యాయనీదేవి అలంకారంలో అనుగ్రహిస్తున్నారు. శుభాకాంక్షలు - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏 " భక్తిమత్కల్పలతికా " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్య నామాలలో 353 వ నామం . " భక్తిమత్కల్పలతికా " అంటే భక్తిగలవారికి కల్పలత వంటిది. కల్పలత అంటే కల్పవృక్షం. ఇవ్వలేనిది లేదు.  శ్రీలలితాసహస్రనామాలకు భాష్యం " సౌభాగ్యభాస్కరం " వ్రాసిన శ్రీభాస్కరరాయలవారు అమ్మవారి ప్రియభక్తుడు. అద్భుతమయిన విద్వత్తు. ఆయన శ్రీలలితాసహస్రనామాలకే కాక త్రిపుర, భావనోపనిషత్తులకు కూడా భాష్యం వ్రాసారు. గణేశసహస్రంకి భాష్యం వ్రాసారు. అద్భుతమైన గణేశసహస్రం శివుడు ప్రసాదించినది. భాస్కరరాయలవారు నివసించే రాజ్యపు రాజు ఓసారి ఈయన దగ్గరకు వచ్చి " సంతానం లేదు " అని బాధపడ్డారు. ఈయన " దానిదేముంది, ఓ చక్కటి యాగం ఉంది, చేద్దాం. కొన్ని రోజులు ఇక్కడే ఉండు " అన్నారు. ఆ యాగానికి ఉదయం సాయంత్రం నదీస్నానం ముఖ్యం. అక్కడకు దగ్గరలో నది ఏదీ లేదు. భాస్కరులు " సరే సంకల్పం చేద్దాం, ఓ నదిని యాగం అయేదాకా మన గ్రామం మీదుగా ప్రవహించమని " అని సంకల్పం చేసారు. కొంచెం దూరంలో ప్రవహిస్తూన్న నది మహదానందపడిపోయింది. భాస్కరులు తనలో కొంతకాలం స్నానం చేస్తారని. వె...

శ్రీగాయత్రీదేవి అలంకారంలో అనుగ్రహిస్తున్నారు అమ్మవారు ఈరోజు. శుభాకాంక్షలు అందరికీ - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏 " గాయత్రీ " - అమ్మవారి అద్భుతనామం. ఇవి శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 420 వ నామం.  గాయంత్రీంచైవ వేదాంశ్చ  తులయో సమతో లయన్  వేదా ఏకత్ర సాంగాస్తు  గాయత్రీ చైకచస్థితా       - యాజ్ఞవల్క్య మహర్షి  " నాలుగు వేదములను, ఆరు వేదాంగములను త్రాసులో ఒక పళ్ళెము నందును, గాయత్రీ మంత్రమును రెండవ పళ్ళెమునందును ఉంచి తూచినచో గాయత్రి వైపే త్రాసు మొగ్గు చూపును " అని తెలియచేసారు మహర్షి. " న గాయత్ర్యాః పరంమంత్రం     నమాతుః పరదైవతమ్‌ " - అంటే తల్లిని మించిన దైవము లేదు. గాయత్రిని మించిన మంత్రము లేదు అని భావము.  గాయత్రీ మంత్రము మొదటగా ఋగ్వేదములో చెప్పబడింది. " గయాన్‌ త్రాయతే ఇతి గాయత్రి " అని ఆదిశంకరులవారు భాష్యం చెప్పారు . గయలు అనగా ప్రాణములు అని అర్థము. త్రాయతే అనగా రక్షించడం. కనుక ప్రాణములను రక్షించే మంత్రం గాయత్రీ మంత్రం. వాల్మీకిమహర్షి 24 వేల శ్లోకాలతో రామాయణంని వ్రాసారు. ప్రతి వేయి శ్లోకాలకు మొదటి అక్షరం గాయత్రీ మంత్రంలోని ఒక అక్షరాన్ని పెట్టి వ్రాసారు. " గాతారం త్రాయతే ఇతి గాయత్రి " అంటే గానం     చేసేవారిని రక్ష...

" ఏ అహారాన్ని తీసుకుంటూన్నా నీకు నివేదన చేసాకే తీసుకునే భాగ్యాన్ని ప్రసాదించు తల్లీ " అని వేడుకోవాలి.- చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏 " ధనధాన్యవివర్ధినీ " అమ్మవారి ఒక అద్భుతనామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాల్లో 886 వ నామం.  ధనాన్ని, ధాన్యాన్ని అధికంగా ఇస్తారు అమ్మవారు అని అర్ధం. ధనం అంటే ధన్యతని ఇచ్చేది అని అర్ధం. కష్టపడి సంపాదించిన దాంట్లో కొంతభాగం సత్కార్యాలకి అంటే దానధర్మాలకి ఉపయోగించుకుని ధన్యులవచ్చు అని అర్ధం. ధాన్యాన్ని అంటే అహారాన్ని అధికంగా ఇచ్చేదీ అమ్మవారే.  అన్నీ అమ్మవారే ఇస్తారు. ఎప్పుడు. ధర్మబద్ధంగా జీవించినప్పుడు. తుఫాన్ లేక భూకంపం వచ్చింది. బ్రతకాలంటే అన్నపుముద్దో, గుక్కెడు పాలో కావాలి. కోట్లరూపాయలు, బంగారం ఉన్నా ఉపయోగముండదు. అందుకని డబ్బుని ధన్యత పొందడానికే ఉపయోగించాలి. నారాయణ తీర్థులు తన తత్వ ప్రచారణ నిమిత్తం కాశీ వెళ్లారు. కాశీలో వారు గదిలో కూర్చుని తరంగాలు పాడుతుంటే అందెల/గజ్జెల ధ్వని వినబడేది. ఆయనని సరైన యతి కాదని అనుమానించి వారికి బిక్ష కూడా ఇవ్వరు ఎవ్వరూ. అయినా వారు కీర్తనలు తన్మయత్వంతో పాడుతూంటే వారి శిష్యులు తలుపు రంధ్రంలో నుండి చూడగా ఒక ముసలి ముత్తైదువ వారికి ఆహారం పెడుతూండడం చూసి ఆశ్చర్యపోతారు. ఆమె సాక్షాత్తూ అన్నపూర్ణాదేవి. కొందరు పైకప్పు ఎక్కి చూస్తే...

ఈరోజు అమ్మవారు శ్రీ బాలాత్రిపురసుందరీదేవి అలంకారంలో అనుగ్రహిస్తున్నారు - చీమలపాటి సూర్యనారాయణ

 శ్రీమాత్రేనమః965,966బాలా 1 " బాలా, లీలావినోదినీ " - శ్రీలలితాసహస్రరహస్యనామాల్లో 965,966 నామాలు.  బాలా అంటే కుమారీస్వరూపురాలు. చిన్నపిల్ల. సహస్రనామాల్లో ఈనామం ఒక్కసారే వస్తుంది. అసలు అమ్మవారిని బాల అనడం ఏమిటి?. ఎందుకంటే ఆవిడ " లీలావినోదిని - లీలలు/ఆటలు చేసి ( చిన్నపిల్లలా ) ఆనందిస్తుంది " కనుక. మనసు పెట్టాలేకాని రోజూ సృష్టిలో ఎన్ని వింతలు కనిపిస్తాయో. ఆశ్చర్యం వేస్తుంది. అసలు అలా ఎలా జరుగుతుంది అని. శంకరాచార్యులు స్థాపించిన 4 పీఠాల్లో మొదటిది " శ్రీశృంగేరీ శారదా పీఠం ". భాద్రపద అమావాస్యనాడే అభిషేకం చేసి అమ్మవారిని అలంకరిస్తారు. ఆ అలంకారంలో శారదాదేవి చిన్నపాపను ఒడిలో కూర్చోపెట్టుకుని ఉంటుంది. అంటే నాబిడ్డలందరి యోగక్షేమాలు నేను చూస్తాను అని అర్ధం. మరుసటి రోజునుంచి నవరాత్రులు మొదలవుతాయి. ఈరోజు అమ్మవారు " బాల " గా దర్శనమిచ్చి మనల్ని అనుగ్రహిస్తూంది. ఆ అవ్యాజకరుణామూర్తిని భక్తితో సేవించుకుని ఆవిడ అనుగ్రహానికి పాత్రులవుదాం. అమ్మవారిని " బాల " గా సేవించుకున్నప్పుడల్లా శ్రీ తాడేపల్లి రాఘవ నారాయణ శాస్త్రి గారిని తలుచుకుని నమస్కరించుకోవాలి. తాడేప...

శ్రీశారదాదేవీ నవరాత్రులు రేపటినుంచి, శుభాకాంక్షలు అందరికీ - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏 " చిదగ్నికుండసంభూతా, దేవకార్యసముద్యతా " - అమ్మవారి అద్భుతనామాలు. ఇవి శ్రీలలితాసహస్రరహస్య నామాలలో 4,5 వ నామాలు. " దేవకార్యార్ధమై అమ్మవారు అగ్నికుండంలోంచి పుట్టారు " అని. ఎప్పుడు, ఎలా అన్నది తెలుసుకుందాం. భండాసురుడు, అతని తమ్ముళ్ళు విశుక్రుడు విషంగుడు అనేవారు దేవతలను, ప్రజలను తమ మాయాబలంతో పీడించుకు తినేవారు. దేవతలు దెబ్బలు తిని తిని నిస్సత్తువతో బాధపడేవారు. వెళ్ళి అందరూ త్రిమూర్తులకు మొరపెట్టుకున్నారు కాపాడమని. భండాసురుడి శక్తులు తెలుసు కనుక అమ్మవారే దిక్కు అని త్రిమూర్తులు తలచి శివుడి ఆధ్వర్యంలో మహాయాగం చేసారు. శివుడు తన మూడవకన్ను ఫాలనేత్రంనుంచి అగ్నిని సృష్టించి హోమగుండంలో వేసారు.  యాగం అయాక ఆ అగ్నికుండంలోంచి అమ్మవారు ఉద్భవించారు. అందుకే అమ్మవారిని " చిదగ్నికుండసంభూతా " అని కొలుస్తున్నారు. ఆవిడే శ్రీలలితామహాత్రిపురసుందరీదేవి. బ్రహ్మ ఆజ్ఞతో విశ్వకర్మ అమ్మవారికోసం ఒక మహానగరాన్ని సృష్టించారు. దానిపేరు శ్రీమన్నగరం.  అమ్మవారు ముందర మంత్రిణీదేవిగా శ్యామలాదేవిని, దండనాధాదేవిగా వారాహీదేవిని ఏర్పాటుచేసారు. అమ్మవారి చిరునవ్వులోంచి 64 క...

అమ్మవారు మోక్షసుఖాన్ని ప్రసాదిస్తారు - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"👍 " నిర్వాణసుఖదాయినీ " ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 390 వ నామం .  " నిర్వాణసుఖదాయినీ " అంటే మోక్షసుఖమును ఇచ్చునది అని అర్థం. వాణం అంటే శరీరం. నిర్వాణం అంటే శరీర స్పృహ లేకపోవడం. అది ఒక అద్భుత స్థితి. అంత సులభం కాదు. ఎంతో కఠిన సాధన చేస్తే అమ్మవారు అటువంటి స్థితిని కలుగచేస్తారు. అటువంటి వారు జీవన్ముక్తులు, పరమహంసలుగా పూజింపబడుతారు. విష్ణుసహస్రనామాలలో " నిర్వాణం " ఒకనామం. ఆ నామానికి " విలక్షణమయిన పరమానంద స్వరూపుడు " అని భాష్యం చెప్పారు ఆదిశంకరులు. ఆయన " నిర్వాణ షటకం " చేసారు. శరీరం నేను కాదు, నేను శివుడిని అని భావించమన్నారు.  శుకమహర్షి పరీక్షిత్తుకు భాగవతం చెబుతూ ప్రహ్లాద చరిత్ర చెబుతారు. ప్రహ్లాదుడు తన తండ్రి హిరణ్యకశిపుడుతో " హరి గురించిన విషయాలు చెప్పని గురువు గురువే కాదు, హరి బోధలు తెలియచేయని తల్లిదండ్రులు తల్లిదండ్రులే కాదు " అనేసరికి కోపం వచ్చి హిరణ్యకశిపుడు భటులతో ఇతన్ని నానా బాధలూ పెట్టి అయినా హరి అనకుండా చేయమంటాడు.  ఆశ్చర్యం ఏమిటంటే మంటల్లో పడేసినా, ఏనుగులతో త్రొక్కించినా, నీటిలో ముంచినా ప్ర...

అమ్మవారు అనవసర విషయాలపై మమకారాన్ని తగ్గిస్తారు - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏 " నిర్మమా " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 164 వ నామం . " నిర్మమా " అంటే మమకారము లేనిది. మమకారం అంటే నాది/నావారు అని. అటువంటి భావన అమ్మవారికి ఎందుకుంటుంది, అందరూ తనవారే అయినప్పుడు. తరగతిలో 40 మంది విద్యార్థులు ఉంటారు. అందరికీ ఉపాధ్యాయులు చెప్పేది ఒకటే పాఠం. వారికి ఇష్టమయిన వారు, ఇష్టంలేని వారు అని ఏమీ ఉండదు. కాని బాగా చదివేవారిని అభిమానిస్తారు. అంతేకాని మమకారం ఉండదు. బాగా చదివే విద్యార్ధికి సందేహాలేమయినా ఉంటే ప్రత్యేక శ్రద్ద తీసుకుని సందేహాలు తీరుస్తారు. ఉపాధ్యాయులే ఇలా ఉంటే మరి అమ్మవారు ఎలా ఉంటారు. " పద్మపత్రమివాంభసా " తామరాకు మీద నీటి బొట్టులా ఉంటారు. తనని నమ్ముకున్న వారికి అవసరమయిన సహాయం చేస్తారు. పరమాత్మ గీతలో ఇలా తెలియచేసారు: " సమో2హం  సర్వభూతేషు     న మే ద్వేష్యో2స్తి న ప్రియః,   యే భజంతి తు మాం భక్త్యా     మయి తే తేషు చాప్యహం "         B     - భ.గీత 9:29 నేను సకలభూతముల (ప్రాణుల) యందును సమభావముతోవ్యాపించి యుందును. నాకు అప్రియుడు గాని, ప్రియుడు గాని ఎవ్వడును లే...

అమ్మవారు మంచి వాక్కుని ప్రసాదిస్తారు - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏 " వాగ్వాదినీ " అమ్మవారి అద్భుతనామం. ఇది శ్రీలలితాసహస్రనామాలలో 350వ నామం. " వాగ్వాదినీ " అంటే వాక్కును ఇచ్చే దేవత. అంటే నాలుకమీద ఉండి వాక్కుని పలికిస్తుంది. శ్రీశ్యామలాదేవీనవరాత్రులలో ఓరోజు అమ్మవారిని " వాగ్వాదినీ " అలంకారంలో పూజించి ఆశీస్సులు పొందుతారు భక్తులు. మహాకవి కాళిదాసు నాలుకమీద అమ్మవారు నాలుగు బీజాక్షరాలు వ్రాయగానే శ్రీశ్యామలాదేవీదండంకంతో స్తుతించారు. ఆ దండకంలోని పదాలు వాటి అర్ధాలు రాగం వేటికవే అత్యద్భుతం. మామూలు వారు పలకలేరు వాటిని.  కొందరు ప్రవచనకర్తలను చూస్తూంటాం. వారి ప్రవచనం నదీప్రవాహంలా సాగిపోతూంటుంది. అప్పుడే అయిపోయిందా అని ఆశ్చర్యపోతూంటాం.  శంకరులు కాలినడకన దేశమంతా మూడు సార్లు తిరిగి ఎందరెందరితోనో వాదనలు చేసి వారిని మెప్పించి ఓడించి ధర్మపరిరక్షణ చేసారు. అటువంటి వాక్పటిమని అమ్మవారు ప్రసాదిస్తుంది. విష్ణుసహస్రానికి భాష్యం వ్రాయమని సాక్షాత్తూ అమ్మవారే శంకరాచార్యులను అడిగారని పండితులు తెలియచేస్తున్నారు. ముత్తుస్వామి దీక్షితార్, శ్యామశాస్త్రి, త్యాగయ్య మొ.గు వాగ్గేయకారులు అద్భుత కీర్తనలతో అమ్మవారిని ప్రార్ధనచేసి తర...

అమ్మవారు రకరకాల రూపాలలో అనుగ్రహిస్తారు - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏 " సువేషాఢ్యా " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 969 వ నామం .  " సువేషాఢ్యా " అంటే చక్కని మంగళకరమయిన వేషముతో ఒప్పుచున్నది అని. శంకరులు అమ్మవారి సౌందర్యాన్ని వర్ణిస్తూ నూరు శ్లోకాలతో సౌందర్యలహరి చేసారు. మూక శంకరులు 500 శ్లోకాలతో మూకపంచశతి చేసారు. అమ్మవారి అందాన్ని వర్ణించడం సామాన్యులకు సాధ్యమా. అమ్మవారు అంత అద్భుత సౌందర్యవతి కనుక ఏ వేషంలో అయినా అద్భుతంగానే ఉంటారు. భక్తితో శరణాగతి అన్న మహామహులకు బాలగా, శ్యామలాదేవిగా, కామాక్షీదేవిగా, కమలాంబగా అనుగ్రహిస్తారు.  మూకశంకరులు ఆర్యాశతకంలో ఓ అద్భుత వర్ణన చేస్తారు: " మదజలతమాలపత్రా వసనితపత్రా      కరాదృతఖానిత్రా,   విహరతి పులిందయోషా గుంజాభూషా      ఫణీంద్రకృతవేషా " - ఆర్యాశతకం:85 అమ్మవారు ఆకులను వస్త్రాలుగా చుట్టుకుందిట. పూసలు వేసుకుందిట. గడ్డపార చేతిలో పట్టుకుందిట. దొప్పలలోని మదజలాన్ని త్రాగుతూందిట. కిరాతస్త్రీ యొక్క విచిత్రవేషంతో వెలిగిపోతూందిట.  ఆశ్చర్యంగా ఉందికదా. అర్జునుడు పాశుపతాస్త్రం కోసం ఘోర తపస్సు చేసాడు. శివుడు కిరాతుడి వేషంలో వచ్చారు. మరి అమ్మవా...

అమ్మవారు అడ్డంకులను తొలగిస్తారు - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏 " విశృంఖలా " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 834 వ నామం . " విశృంఖలా " అంటే ప్రతి బంధకములు లేనిది.  అమ్మవారికి కర్మలూ ఉండవు, కర్మఫలాలూ ఉండవు. ప్రతిబంధకాలు ఎలా ఉంటాయి.  మనకే ప్రతిబంధకాలు ఉండేది. సమాజం మనల్ని మనంగా బ్రతకనివ్వదు. పుణ్యకార్యం చేయాలన్నా ఎన్నో ప్రతిబంధకాలు. పాపఫలమే కాదు పుణ్యఫలము కూడా నశించాలి. అప్పుడే మళ్ళీ జన్మ లేకుండా ముక్తి లభిస్తుంది. కొద్దిగా పుణ్యఫలం మిగిలినా దానిని అనుభవించడానికి మళ్ళీ జన్మ తీసుకోవలసి వస్తుంది.  మనకు ఇష్టంలేని, చేయకూడదనుకున్న పనులు కూడా మనప్రమేయం లేకుండా చేసేస్తూంటాం.  పరమాత్మ గీతలో ఇలా అంటారు: " స్వభావజేన కౌంతేయ    నిబద్ధః స్వేన కర్మణా,    కర్తుం నేచ్ఛసి యన్మోహాత్    కరిష్యస్యవశో2పి తత్ "            - భ.గీ 18:60. " నీవు చేయుటకు ఇష్టపడని పనులు కూడా పురాకృత స్వాభావిక కర్మలచే బంధింపబడి చేయుదువు " అన్నారు పరమాత్మ. ఆయనకేమండీ మొదట్లో కష్టపడ్డా సమస్తభోగాలూ అనుభవించాడు అని తరచు వింటూంటాం. అంటే పాపఫలం పుణ్యఫలం రెండూ అనుభవించాడు అనుకోవ...

రథసప్తమి, భానుసప్తమి, మాఘపాదివారం ఈరోజు. అలభ్యయోగం - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏 " భానుమండలమధ్యస్థా " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్య నామాలలో 275 వ నామం . " భానుమండలమధ్యస్థా " అంటే సూర్యబింబం మధ్యనందు ఉన్నది అని. సూర్యుడు ప్రత్యక్షనారాయణుడు. ఆరోగ్య ప్రదాత. " ఆరోగ్యం భాస్కరాదిచ్ఛేత్ " అన్నారు. ఆయనను మార్తాండుడు అంటారు. అంటే చనిపోయిన అండానికి కూడా చైతన్యాన్ని కలిగిస్తాడు. ఆయన ఉదయిస్తేనే ప్రకృతిలోను, జీవులలోనూ చైతన్యం కలుగుతుంది. ఈ శక్తులన్నిటికీ మూలం సూర్యుడిలో ఉన్న అమ్మవారి చైతన్యం. ప్రశ్నోపనిషత్తు సృష్టి ఆరంభంలో భగవంతుడు రెండింటిని సృష్టించారాని తెలియచేసింది - ఆకాశం ( జడం ), సూర్యుడు ( ప్రాణశక్తి ).  రాముడు రావణుడితో యుద్ధం చేస్తూన్నప్పుడు అలసిపోయాడు. దేవతలతోపాటు యుద్ధం చూస్తూన్న అగస్త్యుడు గమనించారు ఆ విషయం. వెంటనే రాముడిని సమీపించి ఆదిత్యహృదయం పారాయణ చేయి. శక్తి, విజయం కలుగుతాయి అన్నారు. రాముడు ఆచమనం, సంకల్పం చేసి ఆదిత్యహృదయం పారాయణ చేసారు. రాముడికి దేవతల మధ్యన సూర్య దర్శనం అయింది. " నిశిచరపతి సంక్షయం విదిత్వా   సురగణ మధ్యగణో వచస్త్వరేతి "  ఇక్కడ " వచస్ త్వర ఇతి " అన్నా...

అమ్మవారికి నామము, రూపము ఉండవు - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏 " నామరూపవివర్జితా " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్య నామాలలో 300 వ నామం . " నామరూపవివర్జితా " అంటే నామరూపములు లేనిది అని. నామరూపాలు అశాశ్వతమయిన ఉపాధులకు ఉంటాయి. శాశ్వతమయిన వాటికి ఉండవు. ఆత్మకు నామరూపాలు ఉండవు, దేహానికి ఉంటాయి. నేను అనే ఆత్మను దేహానికి ఆపాదించుకుంటున్నాం. నేను పుట్టాను, చూసాను, తిన్నాను, తిరిగాను, ఇష్టపడ్డాను, బాధపడ్డాను అంటూ.  (జడ) భరతుడు మళ్ళీ జన్మలో జింకగా పుట్టి మరుజన్మలో బ్రహ్మజ్ఞానంతో ప్రపంచాన్ని విస్మరించి భగవత్స్మరణతో గడుపుతున్నాడు. రఘూగణుడు అనే చక్రవర్తి బ్రహ్మజ్ఞానం గురించి తెలుసుకోవడానికని కపిల మహర్షి ఆశ్రమానికి వెడుతూ అనుకోకుండా జడభరతుడిని కలుస్తాడు. జడభరతుడు బ్రహ్మజ్ఞాని అని గ్రహించి ఓ చక్కటి ప్రశ్న వేస్తాడు రఘూగణుడు.  సాధారణంగా పండితులు చెప్పేది మట్టి శాశ్వతం, కుండ అశాశ్వతం. మట్టిలోంచి వచ్చి మట్టిలో కలిసిపోతుంది కనుక. కాని కుండకు ఓ పరమార్ధం/ప్రయోజనం ఉందికదా. నీరు తెచ్చుకుంటాం, వంట చేసుకుంటాం. అశాశ్వతం అనుకుని విస్మరించడం ఎలా అని. జడభరతుడు అంటాడు " బ్రహ్మధర్మం వేరు. వ్యావహారికధర్మం వేరు. ర...

మన కర్మలతో అమ్మవారికేమీ సంబంధం ఉండదు - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏 " నైష్కర్మ్యా " - అమ్మవారి అద్భుతనామం . ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 900 వ నామం .  నైష్కర్మ్యా అంటే వేదోక్త కర్మలు కలిగియుండినను కర్మ సంబంధము లేకుండుట. సృష్టి స్థితి లయలు, జీవులకు వారివారి కర్మలకు అనుగుణంగా ఫలాలు ఇవ్వడం లాంటి విద్యుక్తకర్మలు చేస్తూన్నా ఆ కర్మల సంబంధాలేమీ అమ్మవారికి ఉండవు. " పద్మపత్రమివాంభసా " అంటే తామరాకు మీద నీటిబొట్టులా ఉంటుంది అమ్మవారు. ఇదే విషయాన్ని పరమాత్మ భ.గీతలో చెబుతారు అర్జునుడికి: " న మే పార్ధాస్తి కర్తవ్యం   త్రిషు లోకేషు కించన,   నానవాప్తమవాప్తవ్యం   వర్త ఏవ చ కర్మణి "             - భ.గీత 3:22 " నేను కోరునదికాని పొందవలసినదికాని ఏదియును లేకున్నను విహితకర్మలయందు నేను నియుక్తుడనై యున్నాను " అన్నారు పరమాత్మ. " నేను కర్మలు చేయకుండా ఉన్నట్లయితే జీవులు కూడా కర్మలు చేయడం మానేస్తారు. అది లోకవినాశనానికి దారితీస్తుంది " అని కూడా తెలియచేసారు. ఓ చిన్న ఉదాహరణ చూద్దాం. ఒకతనికి లాటరీలో లక్ష వచ్చింది. సంతోషిస్తాడు. జూదంలో లక్ష పోతుంది. బాధపడతాడు. బ్యాంకులో కేషియర్ ఉంటాడు. ఒకాయన వచ్చి లక్ష కడత...

అమ్మవారు ధర్మం పాటిస్తూన్నంతసేపే చల్లని తల్లి - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏 " సర్వానుల్లంఘ్యశాసనా " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 995 వ నామం .  " సర్వానుల్లంఘ్యశాసనా " అంటే బ్రహ్మేంద్రాదులకు కూడా తిరస్కరింపశక్యముకాని ఆజ్ఞ కలది అని. ధర్మం పాటిస్తూన్నంతసేపే అమ్మవారు అవ్యాజకరుణామూర్తి. కొద్దిగా ప్రక్కకు జరిగినా చండికయే. ఆవిడ చండశాసన. ఆవిడ శాసనాలను అతిక్రమిస్తే ఇంతే సంగతులు, దహనానికి అవయవాలు కూడా దొరకవు.  సనాతనధర్మం అంత మెత్తనయినది కాదు, ఓ చెంపమీద కొడితే ఇంకోచెంప చూపెట్టు అనలేదు, అనబోదు. వేదాలలో " అభిచారమంత్రాలు " అని ఉన్నాయి. ధర్మానికి ఎవరయినా విపరీతమైన హాని చేస్తున్నప్పుడు అతని నాశనాన్ని కోరుతూ ఈ నామాలతో హోమం చేస్తారు.  ఇది జీవులకే కాదు, దేవతలకు కూడా తప్పదు. పార్వతీదేవి సరదాగా శివుడి కళ్ళు మూసింది, క్షణమే. అక్కడ క్షణం, కాని ఇక్కడ ఆ సమయం కొన్నివేల సంవత్సరాలు. సూర్యచంద్రులు శివుడి కళ్ళు. వేల సంవత్సరములు సూర్యచంద్రులు లేకపోతే పరిస్థితి ఏమిటి. సృష్టి అంతా ఓ కుదుపుకు లోనయింది. శివుడు ఆగ్రహంతో " పోయి తపస్సుచేసుకుని ప్రక్షాళన చేసుకో " అని కోప్పడ్డారు పార్వతీదేవిని. " యదా ...

అన్నదానం వల్ల ఎవరెవరికి పుణ్యం వస్తుంది - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీరస్తు శుభమస్తు"🙏 " న దైవాంశో దదాత్యన్నం    న రుద్రః రుద్రమర్చతి,   నా నృషిః కురుతే కావ్యం    న విష్ణుః పృథివీ పతిః " " దైవాంశ లేని వాడు అన్నదానం చేయలేడు. రుద్రాంశ లేని వాడు దైవపూజ చేయలేడు. ఋషికాని వాడు కావ్యమును వ్రాయలేడు. విష్ణువు అంశలేని వాడు రాజుకాలేడు‌ " అని భావం. అన్నదానం చేయడం అంత చిన్న విషయం కాదు. మాయ దానిని చేయనివ్వదు. ఒకసారి అన్నదానం చేయడం వలన ఎవరెవరికి పుణ్యం కలుగుతుందో చూద్దాం. అన్నదానం చేద్దాం అని సంకల్పం చేసినవారు, ఏర్పాట్లు చేసినవారు, ధనం సమకూర్చినవారు, సరుకులు తెచ్చినవారు, వండినవారు, వడ్డించినవారు, తిన్నతరువాత శుభ్రం చేసినవారు, సరుకులు తేవడంనుంచి శుభ్రం చేసేవరకూ ఏర్పాట్లు చేసినవారు - వీరందరికీ అన్నదానపుణ్యంలో భాగం వస్తుంది.  ఈ పుణ్యాత్ములందరూ ఒకచోట చేరితేనే అన్నదానం సాధ్యమవుతుంది. దానికి దైవాంశ తోడవాలి. అందుకే దైవాంశ లేనివాడు అన్నదానం చేయలేడు అని తెలియచేస్తూంది సుభాషితం. సృష్టికి అన్నమే మూలం. ఇదే " పురుష శక్తి/స్త్రీ అండం " గా మారుతుంది. అందుకే అన్నం పరబ్రహ్మ స్వరూపం అని తెలియచేస్తున్నాయి ఉపనిషత్తులు.  విష్ణుసహస్రంలో స్వామ...

మహాలయపక్షాలలో పితృదేవతలను పూజించుకుందాం - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏 " స్వధా " - ఇది అమ్మవారి అద్భుతనామం. శ్రీలలితాసహస్రరహస్యనామాలలో ఇది 536 వ నామం. " స్వ శక్త్యా విశ్వం ధారయతి ఇతి స్వధా "‌. తమ శక్తితో ఈ విశ్వాన్ని ధరిస్తున్నారు పితృదేవతలు. పితృదేవతలకు మనం సమర్పించే కవ్యాలను ఈ స్వధాదేవి ద్వారా అగ్నిదేవుడు గ్రహించి వారికి అందచేస్తారు. అందుకే కవ్యాలను అగ్నిలో వేసినప్పుడు, తర్పణాలు , పిండప్రదానము చేసినప్పుడు " స్వధానమః " అంటాము. గరుడపురాణం పితృదేవతల గురించి, పితృదేవతా వ్యవస్థ గురించి విస్తారంగా ప్రస్తుతించింది. పితృదేవతా స్తోత్రంని కూడా ప్రసాదించింది. ముక్తిని పొందాలంటే శరీరం కావాలి జీవుడికి. జీవుడికి ఉపాధి అంటే శరీరాన్ని ఏర్పాటు చేసేది పితృదేవతలు. సూక్ష్మశరీరం అక్కడకు చేరుకోగానే మళ్ళీ ఎక్కడకు ఎప్పుడు పంపించాలో నిర్ణయించేది పితృదేవతలు. పితృదేవతలు అంటే మన పితృదేవతలే కాదు పితృదేవతా వ్యవస్థలో ఉన్నవారందరూ కూడా అని గ్రహించాలి. మన పితృదేవతలను పూజిస్తే పితృదేవతా వ్యవస్థ సంతోషించి ఆశీర్వదిస్తుంది. శ్రాద్ధం అంటే శ్రద్ధతో చేసేది. శ్రద్ధ అంటే ఏమిటి?. శాస్త్ర విషయములయందు విశ్వాసము. సూక్ష్మశరీరులయిన దేవతలను భ...

అమ్మవారు అనవసరమయిన కోపాన్ని పోగొడుతారు - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏 " క్రోధశమనీ " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 169 వ నామం. " క్రోధశమనీ " అంటే కోపాన్ని పోగొట్టునది అని. కోపం అనర్ధహేతువు. అనుబంధాలు, ఆరోగ్యం చెడతాయి కోపం వలన.  శ్రీసూక్తం ఇలా చెబుతూంది: " న క్రోధో న చ మాత్సర్యం    న లోభో నాశుభా మతిః    భవంతి కృతపుణ్యానాం    భక్తానాం శ్రీసూక్తం జపేత్సదా " పుణ్యం చేసిన భక్తులకు కోపంరాదు, అసూయ కలుగదు, లోభం నశిస్తుంది, దుర్బుద్ధి ఉండదు. శ్రీసూక్తం చదువుతే భక్తి కలుగుతుంది.  విష్ణుసహస్రంలో " క్రోధహా " అని ఒక నామం ఉంది. నామార్ధం " కోపాన్ని తొలగించువాడు " అని భాష్యం చెప్పారు ఆదిశంకరులు. ఆశ్చర్యకరంగా " భవనాశినీ, లోభనాశినీ, మోహనాశినీ " అన్నట్లుగా " క్రోధనాశినీ " అనకుండా " క్రోధశమనీ " అని ప్రార్థిస్తారు అమ్మవారిని. శమనీ అంటే తగ్గించడం.  కోపం కూడా అవసరమే. పిల్లలు అల్లరి, తప్పులు చేస్తూంటే అమ్మ కోప్పడుతుంది. లేకపోతే పిల్లలకు గారాబం ఎక్కువయి దారితప్పే ప్రమాదముంది. కోపంలేనివాడు రాజు ఎలా అవుతాడు అంటున్నాయి శాస్త్రాలు. అధర్మం చేసినవారిని శ...

అమ్మవారికి ధర్మాధర్మములు రెండూ ఉండవు - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏 " ధర్మాధర్మవివర్జితా " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్య నామాలలో 255 వ నామం .  " ధర్మాధర్మవివర్జితా " అంటే ధర్మాధర్మములు రెండునూ లేనిది అని. ధర్మం దేశకాలవర్ణాశ్రమాలను బట్టి మారుతూ ఉంటుంది. దేశం అంటే ప్రదేశం. ఒకచోట ధర్మమయినది ఇంకో చోట అధర్మం అవచ్చు. ఇప్పుడు ధర్మమయినది తరువాత అధర్మం అవచ్చు. ఒక్కోసారి ధర్మాధర్మ నిర్ణయం కష్టం కావచ్చు. పాము కప్పను పట్టుకుంది. కప్పను కాపాడడం ధర్మం. కాని పాము నోటినుంచి ఆహారాన్ని లాగేయడం ధర్మమా?. దేవహూతి భర్త కర్దమునితో " ఇంతకాలం ఈ దేహంతో భోగాలన్నీ అనుభవించాను కాని జ్ఞాని అయిన భర్త లభించినా సత్యం ఏమిటో తెలుసుకునే ప్రయత్నమే మొదలు పెట్టలేదు " అని చెబుతూ ఇలా అంటారు:  " నేహయద్కర్మ ధర్మాయ    న విరాగాయ కల్పతే    నా తీర్థపద సేవాయై    జీవన్నపి మృతోహితః " " ధర్మకార్యాలు చేయనివాడు జీవించి ఉన్నా మరణించినవాని క్రింద లెక్క. ధర్మకార్యాలు చేస్తూ ఉన్నా ఫలాన్ని ఆశించకుండా చేయకపోతే జీవన్మృతుడి క్రింద లెక్క. ఫలితాన్ని ఆశించకుండా ధర్మకార్యాలు చేస్తూన్నా అది భక్తిగా మారకపోతే మరణించినవాని క్రింద...

అమ్మవారి ముఖం ప్రసన్నంగా ఉంటుంది - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏 " సుముఖీ " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 459 వ నామం . " సుముఖీ " అంటే ప్రకాశించుచున్న ముఖము గలది అని అర్ధం. అమ్మవారు కోటిసూర్య సమప్రభ. అంత కాంతిగా ఉంటారు. ఒక సూర్యుడినే నేరుగా చూడలేము. మరి అమ్మవారిని ఎలా చూసి ఉంటారు. కఠోర సాధన చేస్తే అమ్మవారు దర్శనం ఇచ్చి అనుగ్రహిస్తారు. మనం కూడా కళ్ళు మూసుకుని అమ్మవారి ముఖలక్షణాలను ఊహచేస్తే చూడగలం. చూసి ఆనందించగలం. గురువు లక్షణాలు ఎలా ఉండాలో/ఉంటాయో శాస్త్రాలు స్ఫష్టంగా తెలియచేసాయి: " సుందరస్సుముఖస్స్వచ్ఛః  ‌  సులభో బహుతంత్రవిత్,  అసంశయత్ సంశయచ్చిన్   నిరపేక్షో గురుర్మతః "  ఇక్కడ " సుముఖః " అన్నారు. అంటే గురువు ప్రసన్నమయిన ముఖంతో ఉంటారుట. ఎంత ప్రసన్నత అంటే శిష్యుడు హాస్యాస్పదమైన చిన్న సందేహాన్ని కూడా భయంలేకుండా చొరవగా అడిగేటంత. మరి అమ్మవారు గురురూపిణి. గురుపరంపరలో ఆది. మరి అమ్మవారి ముఖం ఎంత ప్రసన్నంగా ఉంటుందో ఊహించడం కష్టం కాదు కదా. దుర్గాసూక్తంలో అమ్మవారిని " తాం అగ్నివర్ణాం " అని ప్రార్థిస్తాం. ఎరుపు పసుపు కలిసిన చక్కటి రంగు అమ్మవారిది. శంకరులు లలి...

ఉపాధ్యాయుల దినోత్సవం నేడు, వారికి కృతజ్ఞతలు తెలుపుకుందాం - చీమలపాటి సూర్యనారాయణ

 🙏" శ్రీమాత్రేనమః"🙏 " ఉపాధ్యాయః " అంటే " ఉప+అధ్యాయః " దగ్గరగా ఉండి విద్య చెప్పేవారు " అని. ఈ " ఉప " ను ఉపవాసంలో ఉన్న ఉప అంటే దగ్గరగా అని తెలుసుకోవాలి.  ఉపాధ్యాయుడు దగ్గరగా ఉండి శిష్యుడికి జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు. స్కూల్స్, కాలేజీలు, యూనివర్శిటీల లోని అధ్యాపకులు ఈ కోవలోకి వస్తారు. అందుకే పూర్వం చక్రవర్తులైనా పిల్లలని గురుకులాలకి పంపించేసేవారు. వారు ప్రయోజకులై తిరిగివచ్చేవారు. దగ్గరగా ఉండి అభ్యసించే విద్యకి  క్రమశిక్షణ వల్ల శక్తి ఎక్కువగా ఉంటుంది. గురువు అంటే చీకటిలోంచి వెలుగులోకి దారిచూపిస్తాడు. ఈ చీకటులు రకరకాలు గా ఉంటాయి. అంటే ఒక్కో చీకటికి ఒక్కో గురువు అవసరం కూడా కలుగవచ్చు.  దత్తాత్రేయస్వామి తనకు 24 గురువులని స్వయంగా ఆయనే తెలియచేసారు. వారిలో ఒక కాకి, వేశ్య కూడా ఉన్నారు అని తెలుస్తూంది. భగవద్గీతలో పరమాత్మ " ప్రతీ జీవిలోనూ నా విభూతులు ( ప్రకాశాలు/శక్తులు ) ఉన్నాయి " అని తెలియచేసారు. అంటే ప్రతీ జీవి ఒక శక్తివంతుడే, అతని నుంచి నేర్చుకోవలసిన విషయాలు కూడా ఉంటాయి. మనుషులే కాదు జంతువులు, పక్షులు, కీటకాలు అన్నీ గురుస్వరూపులే. ఓ పిచుక గ...

శ్రీవామన జయంతి నేడు - శుభాకాంక్షలు అందరికీ - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీరస్తు శుభమస్తు"🙏 " వామనజయంతి " ఈరోజు. భాద్రపద శుద్ధ ద్వాదశి నాడు అదితి కోరికపై శ్రీమహావిష్ణువు లోకకళ్యాణం కోసం వామనుడుగా అవతరించారు. 8 ఏళ్ళ బాలకుడుగా అయిపోయాడు పుట్టగానే. బ్రాహ్మణుడు దానం తీసుకోవాలంటే ఉపనయనం అయి ఉండాలి. వామనుడు బలి దగ్గరకు వెళ్ళి దానం అడగాలి. అప్పటికప్పుడు ఉపనయనం ఎలా. అప్పుడు ప్రత్యక్షనారాయణుడు సూర్యభగవానుడు ఉపనయనం తను చేస్తానని అన్నారు. ఎందుకని. గాయత్రీ మంత్రానికి అధిపతి సూర్యుడు. ఉపనయనం చేయించడానికి, గాయత్రీమంత్ర ఉపదేశానికి అంతకన్నా గొప్పవారు ఎవరు ఉంటారు. వామనుడు మూడు అడుగుల భూమిని కోరాడు బలిని. ఓ పాదంతో భూమిని ఇంకో పాదంతో పైలోకాలను ఆక్రమించారు. మూడవ పాదం ఎక్కడ పెట్టమంటావు అని అడిగారు వామనుడు. నా తలపై పెట్టు అన్నాడు బలి. ఇందులో అద్భుత తత్వం ఉంది. మనిషి నేను, నాది అనే భావనతో బాధపడుతూ ఉంటాడు ఎల్లప్పుడూ. నాది అంటే మమ. అంటే మమకారం. నేను అంటే అహం. అంటే అహంకారం. బలి తాను సంపాదించిన లోకాలను/సంపదను ఇచ్చేసాడు రెండు అడుగులకు. అంటే మమకారం వదుల్చుకున్నాడు. తరువాత మూడవ అడుగుకోసం తలపై పెట్టమని అడిగి అహంకారంని వదుల్చుకున్నాడు. ఈ రెండూ వదిలించుకుంటే సచ్చ...

అమ్మవారు మన హృదయంలోనే ఉంటారు - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏 " హృదయస్థా " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 595 వ నామం. " హృదయస్థా " అంటే హృదయంలో నివసిస్తుంది అని. ఎవరి హృదయంలో అని ఆలోచించనక్కరలేదు. భక్తుల హృదయంలో అని తెలుసుకోవాలి. అమ్మవారు అన్నారు: " నాహం తీర్థే, న కైలాసే,    వైకుంఠేవా న కర్హచిత్ " అని. అంటే తీర్థాలలోనూ, కైలాసంలోనూ ఆఖరికి వైకుంఠంలోనూ ఉండను నేను " అని. " వసామికింతు " - మరి ఎక్కడుంటావమ్మా అని ఋషులు అడిగితే ఆవిడ అన్నారు " మత్ జ్ఞాని హృదయాంభోజమధ్యమే " అంటే జ్ఞానుల హృదయాలలో ఉంటాను అని. జ్ఞానులు అంటే ఎవరు?.  శంకరాచార్యులు  " బ్రహ్మ సత్యం, జగన్మిధ్య,  జీవో బ్రహ్మ ఏవ నపరః " అన్నారు.  ఈ ప్రపంచమంతా మిధ్యే, బ్రహ్మ మాత్రమే సత్యం. జీవుడు బ్రహ్మ ఒకరే అని తెలుసుకున్నవారు జ్ఞానులు. పూజ్యగురువులు సామవేదంవారు ఓసారి ప్రవచనం చేస్తూ ఓ అద్భుత విషయం తెలియచేసారు. మన ఇంట్లో వివాహం జరిగింది. ఓ పెద్దాయన ఓ బహుమతి ఇచ్చారు. ఆ పెట్టె రంగురంగుల ముచ్చికాగితాలతో చుట్టి ఉంది. మెరిసిపోతూ ఉంది. ఎంత బాగుందో అనుకున్నాం. 4 రోజులదాకా దాన్ని అలాగే ఉంచి వచ్...

అమ్మవారు అజ్ఞానంని పోగొడుతారు - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏 " తమో2పహా " - అమ్మవారి ఒక అత్యద్భుతనామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 361వ నామం.  " తమః + అపహా " అంటే అజ్ఞానంని పోగొట్టునది. ఇంతకీ అజ్ఞానం అంటే ఏమిటి?.  తను ఎవరో అది తాను కాదనుకోవడం, తను ఏది కాదో అది తను అనుకోవడమే అజ్ఞానం. ఈ శరీరమే శాశ్వతం అనుకోవడం, దాని కోసమే జీవితాంతం పాటుపడడం. తనకోసమే కాకుండా తరువాత తరాలకు కూడా అశాశ్వతమైన సంపదలు కూడబెట్టడం. వాటికోసం చేయకూడని పనులన్నీ చేయడం. చేయవలసిన పనులు చేయకపోవడం, చేయకూడని పనులు చేయడం. సమస్యలలో కూరుకుపోవడం. జీవితాన్ని దుఃఖదాయకం చేసుకోవడం. " తస్మాదజ్ఞానసంభూతం    హృత్స్థం జ్ఞానసినాత్మన:,   ఛిత్త్వాయినం సందేహం    యోగమాతిష్ఠోత్తిష్ఠ భారత "                   ‌‌‌- భ.గీత 4:42 " కాబట్టి, జ్ఞాన ఖడ్గంతో హృదయంలో తలెత్తిన సందేహాలను ఛేదించు . ఓ భారతా కర్మయోగంలో స్థిరపడి, యుద్ధము చేయుటకు లే " అన్నారు పరమాత్మ అర్జునుడితో. ఏది చేయాలో అది చెయ్యి. సందేహించకు అన్నారు. ఆశ్చర్యం ఏమిటంటే అప్పుడప్పుడు కొన్ని సత్యాలు అనుకోకుండా బయటకు వచ్చేస్తూంటాయి. కొందరు నాయక...