Posts

Showing posts from April, 2025

అమ్మవారు బహు సుకుమారం - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏 " కోమలాకారా " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 437 వ నామం. " కోమలాకారా " అంటే సుకుమారమగు ఆకారము గలది అని భాష్యం చెప్పారు. అమ్మవారు సుకుమారి. అమ్మవారి ముఖము, కాళ్ళు, కనులు అన్నీ పద్మంలా మృదువుగా, సుకుమారంగా ఉంటాయి. శ్రీసూక్తంలో అమ్మవారిని " సరసిజనిలయే సరోజహస్తే ధవలతమాంశుక గంధమాల్య శోభే " అని ప్రార్థిస్తాం. " తామరపువ్వుపై కూర్చొని, చేతిలో తామరపువ్వును పట్టుకొని, శుభ్రమైన వస్త్రాలు ధరించి, గంధపు మాల ధరించిన ఓ దేవీ నీకు నమస్కారం " అని. తామరపువ్వు ఎంత మృదువుగా, సుకుమారంగా ఉంటుందో మనకు తెలుసు. అటువంటి పువ్వుమీద కూర్చుని ఉండే అమ్మవారు ఇంకెంత సుకుమారంగా ఉంటారో ఊహించుకోవచ్చు. ఆదిశంకరులు సౌందర్యలహరి గానం చేస్తూ అమ్మవారిని ఇలా ప్రార్థిస్తారు: " కిరీటం వైరించం పరిహర    పురః కైటభ భిదః,   కఠోరే కోటీరే స్ఖలసి జహి    జమ్బారి మకుటం,   ప్రణమ్రే ష్వేతేషు ప్రసభ    ముపయాతస్య భవనం,   భవ స్యాభ్యుత్థానే తవ    పరిజనోక్తిర్వి జయతే " - 29 " అమ్మా ! నీ ముందు భాగమున ఉన్న బ్రహ్మ యొక్క కిరీటమును తప్పుకొని, కైటభు...

శ్రీపరశురామజయంతి, అక్షయతృతీయ - శుభాకాంక్షలు - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీరస్తు శుభమస్తు"🙏 నేడు శ్రీపరశురామజయంతి. విష్ణువు ఆరవ అవతారం.  ఈయన ప్రస్తావన రామాయణంలోనూ భారతంలోనూ కూడా వస్తుంది. పరశు అంటే గొడ్డలి, అది శివుడు ప్రసాదించినది. ఈయన తండ్రి జమదగ్ని కోపం నుంచి తల్లిని కాపాడిన విధం అద్భుతం. తమ తల్లి శిరస్సు ఖండించమని తన కుమారులను ఆదేశిస్తాడు జమదగ్ని.  అదేమిటి, అంత తపస్సంపన్నుడు సకలశాస్త్రపారంగతుడు అంత " అవివేకం " గా భార్యని చంపేయమనడం ఏమిటి అని అనుకోవనక్కరలేదు. " దైవీహ్యేషా గుణమయీ  ‌  మమమాయా దురత్యయా "  అన్నారు పరమాత్మ (భ.గీత 7:14) వశిష్టుడయినా విశ్వామిత్రుడయినా ఆఖరికి సీతమ్మయినా పరిస్థితుల ప్రభావంవలన వివేకం కోల్పోవడానికి అవకాశం ఉంది.  జమదగ్ని కొడుకులెవరూ తల్లిని చంపడానికి ముందుకురారు. అప్పుడు పరశురాముడిని తల్లిని, సోదరులను సంహరించమంటాడు. వెంటనే సంహరిస్తాడు. సంతోషించిన జమదగ్ని వరం కోరుకోమంటే తల్లిని సోదరులను బ్రతికించమంటాడు.  ఆయన భీష్ముడికి, ద్రోణుడికి, కర్ణుడికి గురువులు.  21 సార్లు దండెత్తి రాజులను చంపేసిన తరువాత పాపహరణంకోసం తను జయించిన భూమండలాన్నంతా కశ్యపుడికి దానం చేసేస్తాడు. తన తపస్సుకు చోటులేకపోవడంతో ...

మనస్సు శుద్ధంగా ఉంటే అంతా మంచే జరుగుతుంది - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏 " విరజా " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 779 వ నామం. " విరజా " అంటే విగతములయిన పాపములు గలది. అంటే పాపములు లేనిది అని. మలినము లేనిది, శుద్ధమయినది అని కూడా అనుకోవచ్చు.  పాపములు ఎందుకు కలుగుతాయి. కాని పనులు చేసినప్పుడు. అమ్మవారికి అటువంటి అవసరం ఏముంది. అధర్మపరులను అనుగ్రహించరు, ధర్మపరులను శిక్షించరు. వారి వారి కర్మలను బట్టి తగిన ఫలితాలు ఉంటాయి. బ్రహ్మాండపురాణం " విరజక్షేత్రమందు బ్రహ్మదేవుడు విరజ అను దేవిని ప్రతిష్టించెను. ఆ అమ్మవారిని దర్శనము చేసిన మనుష్యుడు తన వంశములోని ఏడుతరాల వారిని పవిత్రము చేయుచున్నాడు " అని తెలియచేసింది. ఈ ఊరు ఒడిస్సాలో ఉంది.  అమ్మవారు ఆబ్రహ్మకీటజనని. అన్ని జీవులకూ తల్లి. పిల్లలలో కావలసినవారు, అక్కర్లేనివారు అనే భావన ఎందుకుంటుంది  తల్లికి. మంచిపనులు చేస్తే అవ్యాజకరుణామూర్తి, సంతోషిస్తుంది. చెడుపనులు చేస్తే కాళి, దండిస్తుంది. అయినా ఎవరు చేసిన కర్మలకు ఫలితం వారే అనుభవించాలి. వీరి కర్మలవలన అమ్మవారికి కలిసొచ్చేదీ లేదు, పోయేదీ లేదు. అమ్మవారు పద్మంలా ఉంటారు. పద్మానికి బురద అంటదు, ఎప్పుడూ బు...

అమ్మవారికి సాక్షి అవసరం ఏముంటుంది - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏 " సాక్షివర్జితా " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 385 వ నామం. " సాక్షివర్జితా " అంటే తనకు వేరొక సాక్షిలేనిది అని భాష్యం చెప్పారు. సాక్షి అవసరం అసలు ఎందుకు వస్తుంది. తను తప్పు చేయలేదు అని నిరూపించు కోవడానికి లేక ఇంకొకరు తప్పు చేసారు అని నిరూపించడానికి. అమ్మవారికి తప్పు చేయవలసిన అవసరం ఏముంటుంది. ఇంకొకరినుంచి ఏదయినా ఆశించి అది దక్కకపోతే తప్పు చేస్తారు. సృష్టి అంతా అమ్మవారిదే అయినప్పుడు వారు ఆశించేదేముంటుంది. అమ్మవారు పొందిందీ లేదు, పొందవలసినదీ లేదు, పొందలేనిదీ లేదు. అమ్మవారు తప్పూ చేయరు, ఎవరైనా అమ్మవారి పట్ల తప్పుచేసినా అమ్మవారికి సాక్షి అవసరం లేదు. తప్పు చేసినవాడే ఒప్పుకొనేటట్లుగా చేసి శిక్షిస్తారు. అంతటి సమర్ధురాలు. సాక్షుల గురించి గరుడపురాణం విస్తారంగా ప్రస్తుతించింది. జీవుల ( మన ) కర్మలన్నిటినీ అమ్మవారు నియమించిన సాక్షులు గమనిస్తూ ఉంటారు. " ఆదిత్య చంద్రౌ అనిలో      అనలశ్చ యౌ భూమి ఆపః      హృదయం యమశ్చ      అహశ్చ రాత్రిశ్చ ఉభేచ      సంధ్యే ధర్మశ్చ జానాధి     నరశ్చ వృత...

సూర్యచంద్రులు అమ్మవారి చెవి కమ్మలు - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏 " తాటంకయుగళీభూత తపనోడుప మండలా " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 22 వ నామం. " తాటంకయుగళీభూత తపనోడుప మండలా " అంటే చెవికమ్మలుగా జంటగా అయిన సూర్య చంద్ర మండలములు కలిగినది. తపనోడుప - తపన ( సూర్యుడు ) + ఉడుప ( నక్షత్రాలకు రాజు చంద్రుడు ). సూర్యుడు చంద్రుడు చెవికమ్మలుగా కలిగి ఉన్నారుట అమ్మవారు. సూర్యుడు తూర్పు దిక్కున ఉంటే చంద్రుడు ఎక్కడ ఉంటారు. పశ్చిమ దిక్కున. చంద్రుడు తూర్పు దిక్కున ఉంటే సూర్యుడు పశ్చిమ దిక్కున ఉంటారు. అంటే అమ్మవారి ముఖం రెండు దిక్కుల మధ్య దూరమంత. ఇక అమ్మవారి మొత్తం రూపం ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. విరాడ్రూపిణి.  ఇంకో అద్భుతమయిన విషయం ఉంది దీనిలో.  గరుడపురాణం " ఆదిత్య చంద్రౌ అనిలో అనలశ్చ యౌ భూమి ఆపః హృదయం యమశ్చ అహశ్చ రాత్రిశ్చ ఉభేచ సంధ్యే ధర్మశ్చ జానాధి నరశ్చ వృత్తిం " అని తెలియచేస్తూంది. వీరందరూ సాక్షులు, జీవుల కర్మలను గమనిస్తూ ఉంటారు. వీరిలో సూర్యచంద్రులు ముఖ్యులు. వీరు ఇద్దరూ అమ్మవారి చెవుల దగ్గరే కమ్మలుగా ఉండడం వల్ల ప్రతీ జీవి చేసే కర్మల విషయాలను ఎప్పటికప్పుడు అమ్మవారి చెవులలో చెబుతున్నారుట....

అమ్మవారి తేజస్సు మన అజ్ఞానాంధకారాన్ని తొలగిస్తుంది - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏 " పరంధామా " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 807 వ నామం. " పరంధామా " అంటే ఉత్కృష్టమైన తేజోరూపురాలు అని భాష్యం చెప్పారు. ధామం అంటే వెలుగు. సూర్యుడు వెలుగునిస్తాడు అంటే సూర్యుడు వెలుగు వేరని కాదు. సూర్యుడే వెలుగు. అలాగే అమ్మవారే తేజస్సు.  కఠోపనిషత్తు " ఆత్మను సూర్యచంద్రాదులు కూడా ప్రకాశింపజేయజాలరని, అది స్వయం ప్రకాశమైనదని, జీవి శరీరంలో ఉన్నప్పుడు అంగుష్టమాత్రంగా హృదయకుహరంలో జ్యోతి వలె ఉంటూ శరీరం మొత్తాన్ని చైతన్య పరుస్తుంది " అని తెలియచేస్తూంది. ఆత్మ అమ్మవారి చైతన్యం. నైతికవిలులతో జీవించేవారికి, భక్తులకు శరీరం చుట్టూ కాంతివలయం కొంచెం ఎక్కువగానే ఉంటుందని తెలుస్తూంది. మరి సామాన్యజీవుడి శరీరమే కాంతివంతంగా ఉంటే మరి అమ్మవారు ఎంత తేజస్సుతో వెలిగిపోతూంటారు.  రాసలీల ప్రారంభానికి ముందు ఓ అద్భుత విషయం జరిగింది: కృష్ణుడికి రాసలీల ప్రారంభసమయంలో మన్మధుడు కనిపించాడు అక్కడ. " నువ్వు ఇక్కడ ఉన్నావేమిటి " అని కృష్ణుడు అడిగితే మన్మధుడు " బ్రహ్మాది దేవతలను, ఇంద్రుడిని కూడా జయించేసాను. మిమ్మల్ని కూడా జయించేస్తే నా...

పద్మం సృష్టికర్త బ్రహ్మ కన్నా ముందు పుట్టింది, అందుకే పవిత్రమైనది - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏 " నళినీ " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 460 వ నామం . " నళినీ " అంటే కమలరూపములయిన కరచరణాదులు గలది అని భాష్యం చెప్పారు.  మన సనాతన వాజ్మయంలో పద్మానికి ఓ విశిష్ట స్థానం ఉంది. సృష్టి చేసేది బ్రహ్మ కదా. ఆయనకు పద్మసంభవుడు అని పేరు.‌ అంటే పద్మంలో పుట్టారు అని. అంటే పద్మం సృష్టికి పూర్వమే ఉన్నట్లు తెలుస్తూంది. అందుకే పద్మానికి అంత పవిత్రత. బురదలో పుట్టి నీటిలోనే పెరుగుతుంది. బురద, నీరు దానికి అంటవు. సూర్యకిరణాలకు విక‌సిస్తుంది‌. సూర్యుడు పద్మప్రియుడు. దేవీదేవతలు పద్మంమీద కూర్చున్నట్లు, చేతిలో పద్మాన్ని ధరించినట్లు కీర్తిస్తాం, చూస్తూంటాం. శ్రీసూక్తంలో అమ్మవారిని ఇలా ప్రార్థిస్తాం: " పద్మాననే పద్మ ఊరూ    పద్మాక్షీ పద్మసంభవే     త్వం మాం భజస్వ పద్మాక్షీ     యేన సౌఖ్యం లభామ్యహం " పద్మము నుండి పుట్టినదానా, పద్మం వంటి ముఖము, కనులు కలిగిన దానా మమ్మల్ని అనుగ్రహించు అని ప్రార్ధిస్తాం. " పద్మప్రియే పద్మిని పద్మహస్తే    పద్మాలయే పద్మదళాయతాక్షీ,   విశ్వప్రియే విష్ణుమనోనుకూలే     త్వత్...

కొద్దిగా దోషంగా అనిపించినా పరధర్మం కన్నా స్వధర్మమే మేలు - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీరస్తు శుభమస్తు"🙏 " శ్రేయాన్ స్వధర్మో విగుణః    పరధర్మాత్ స్వనుష్ఠితాత్,   స్వధర్మే నిధనం శ్రేయః    పరధర్మో భయావహః "               - భ.గీత 3:35 " పరధర్మమును చక్కగా నిర్వహించుటకన్నను గుణరహితమైనను స్వధర్మమును ఆచరించుట ఉత్తమము. పరధర్మపాలనము హానికరమైనది. దానిని పాటించుటకన్నను స్వధర్మపాలనమునందు నాశనమును పొందుటయైనను ఉత్తమమైనది " అన్నారు పరమాత్మ. హిందూమతం అంటూ మాట్లాడుతూ ఉంటారు అందరూ. హిందూధర్మం అనే చెప్పారు మన పెద్దలు. మతం అంటే అభిప్రాయము అని అర్ధం. ఇది మా అభిప్రాయం, దాని మంచిచెడ్డలు గురించి ఆలోచించు, మంచిది అనుకుంటే పాటించు, లేదూ వదిలేయ్ అన్నారు. సనాతనధర్మం, ఆర్షధర్మం, భారతీయధర్మం, వైదికధర్మం - ఇవన్నీ హిందూధర్మములు.  శ్రీరాముడు " ఋషులు ఇలా చెబుతున్నారు, వేదం ఇలా చెబుతూంది, శాస్త్రాలు ఇలా చెబుతున్నాయి " అనేవారు ఎల్లప్పుడూ. కృష్ణపరమాత్మ కూడా " ఇది పండితులు/శాస్త్రములు చెబుతూన్న విషయం " అని చెబుతూ " ఇది నా అభిప్రాయం " అని తెలియచేసారే కాని " ఇలాగే చెయ్యి " అనలేదు.  కొన్ని దేశాలలో/ప్రాంతాలలో " స " అక్షరంని ...

అమ్మవారు అనవసరపు బంధాలను తొలగిస్తారు - చీమలపాటి సూర్యనారాయణ

 🙏""శ్రీమాత్రేనమః"🙏 " జ్ఞానవిగ్రహా " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 644 వ నామం. " జ్ఞానవిగ్రహా " అంటే జ్ఞానమే శరీరముగా గలది అమ్మవారు అని. జ్ఞానం కలగడం అంటే అజ్ఞానాంధకారం తొలగడం. అమ్మవారి దర్శనంతో లేక ధ్యానంతో అజ్ఞానం తొలగి జీవితం ఆనందదాయకం అవుతుంది. దీపశిఖతో చీకటి తొలగునట్లు అమ్మవారి దర్శనంతో/ధ్యానంతో అజ్ఞానం తొలగుతుంది. " జ్ఞానానంద మయందేవం    నిర్మల స్ఫటికాకృతిం,   ఆధారం సర్వవిద్యానాం    హయగ్రీవముపాస్మహే " " అనంతమైన, ఆనందమయమైన జ్ఞానానికి అధిపతి, స్వచ్ఛమైన స్ఫటికం వంటి ఆకృతి కలిగి, సకల విద్యలకు అధిదేవత అయిన హయగ్రీవునికి నమస్కరిస్తున్నాను‌ " అని పై శ్లోకానికి అర్థం. హయగ్రీవ అవతారంలో శ్రీమహావిష్ణువు వేదాలను ఉద్ధరించారు. అందువల్ల, వేదాలతోపాటు సమస్తమైన వాఙ్మయానికి, జ్ఞానానికి హయగ్రీవుడు అధిపతి అయారు. జ్ఞానమే స్వామి. ధర్మరాజుని యక్షుడు " మానవజీవితంలో అత్యంత ఆశ్చర్యకరమయిన విషయం ఏమిటి " అని అడుగుతాడు. ధర్మరాజు అంటాడు " తన కళ్ళముందే తన వారందరూ ఒక్కొక్కరే మరణిస్తూన్నా తను మాత్రం శాశ్వతం అనుకుంటాడు, సంప...

సత్యమే లోకాన్ని ధర్మమార్గంలో నడిపిస్తుంది - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏 " సత్యజ్ఞానానందరూపా " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 791 వ నామం.  " సత్యజ్ఞానానందరూపా " అంటే సత్యము, జ్ఞానము, ఆనందములు రూపముగా గలది అని భాష్యం చెప్పారు. ధర్మము యొక్క నాలుగు పాదాలలో మొదటిది సత్యం.  జాబాలి దశరధుని సలహాదారు. శ్రీరాముని అరణ్యవాసం మానిపించి ఎలాగయినా అయోధ్యకు తీసుకుని వెళ్ళాలని భావించి " శ్రీరామా, తండ్రి ఎవరు, కొడుకు ఎవరు, తండ్రికి మాట ఇవ్వడం ఏమిటి " అన్నప్పుడు శ్రీరాముడు ఇలా తెలియచేసారు: " సత్యమేవేశ్వరో లోకే   సత్యం పద్మాశ్రితా సదా,   సత్యమూలాని సర్వాణి    సత్యాన్నాస్తి పరం పదా " " సత్యమే లోకాన్ని నడుపుతూన్న పరమేశ్వరుడు. సత్యాన్ని ఆశ్రయించే ఐశ్వర్యం ఉంటుంది. సర్వ ధర్మములు సత్యమూలములు " అని శ్రీరాముడు జాబాలిమహర్షి తో అంటారు. అంతటి సత్యనిష్టాపరుడు శ్రీరాముడు. రామకృష్ణపరమహంస " ఈ కలికాలంలో యజ్ఞాలు, పూజలు, తపాలు, జపాలు మొగునవి శ్రమతోనూ ఖర్చుతోనూ కూడుకున్నవి అవడంవలన చెయ్యడం కష్టమే కనుక వీలయినంతవరకూ సత్యం మాట్లాడడమే ముఖ్యమైన వ్రతం " అన్నారు. అమ్మవారి రూపాన్ని కాని నామాన...

అమ్మవారు వివిధ రూపాలలో అనుగ్రహిస్తారు - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏 " బహురూపా " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 824 వ నామం . " బహురూపా " అంటే అనేక రూపములు గలది అని భాష్యం చెప్పారు. దేవీపురాణం ఈ విషయాన్ని " పరమాత్మస్వభావముచే రూపము లేనిదయినను క్రియాస్వభావముచే అనేక రూపములు ధరించును " అని వివరించింది. అంటే చేయవలసిన పనిని బట్టి తగిన రూపాన్ని ధరిస్తారు అని. వేదం అనేక వేల రుద్రులు ఉన్నారని తెలియచేసింది. మరి ఒక్కో రుద్రునికి ఒక అమ్మవారిగా అనేక రూపములతో భాసిస్తున్నట్లు తెలుస్తూంది. దేవీపురాణమే ఇంకో విషయం తెలియచేసింది. చరములు స్థిరములు దేవతలు మనుష్యులు పశుపక్ష్యాదులు అన్నీ అమ్మవారి రూపములే కదా. అందుకని బహురూపా అని పూజిస్తున్నాం అని.  సూతసంహిత చక్కటి వివరణ ఇచ్చింది. అక్షరములన్నిటికీ అధిదేవతలు ఉన్నారు. ఒక్కో అక్షరానికి ఓ దేవతా స్వరూపంగా అమ్మవారు అనేక రూపములతో భాసిస్తున్నారు అని. అక్షరం అంటే నాశనము లేనిది అని. అక్షరాలకు ( చదువుకు ) అంతటి పవిత్రతను ఇచ్చింది సనాతనధర్మం. ఈ నామంని అర్ధం చేసుకోవడానికి హిరణ్యకశిపుని వధని జ్ఞాపకం చేసుకోవాలి. ప్రహ్లాదుడిని మార్చలేక విసిగిపోయిన హిరణ్యకశిపుడు ...

అమ్మవారిని కుంకుమతోనూ ఎర్రటి పూలతోనూ పూజిస్తాం - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏 " సర్వారుణా " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 49 వ నామం. " సర్వారుణా " అంటే అన్నింటియందు ఎర్రని కాంతి కలది అని భాష్యం చెప్పారు. అమ్మవారు ఎర్రటి రంగులో మెరిసిపోతూ ఉంటారు. దుర్గా సూక్తంలో " తాం అగ్నివర్ణాం " అని ప్రార్ధిస్తాం. ఎర్రటి చీర ధరించిన అమ్మవారు ఎర్రని బొట్టు, తాంబూలం సేవనం, చేతికి గోరింటాకు, కాళ్ళకు ఎర్రటి పారాణితో కళకళలాడుతూ ఉంటారు. అమ్మవారిని కుంకమతోనూ, ఎర్రటి పూలతోనూ పూజిస్తాం. సూర్యభగవానుడిని మేల్కొలుపుతూ: " గుంకుతూ భానుడు    గుమ్మడి పూఛాయ   గుమ్మడీపువ్వు మీద    కుంకంపు పొడిఛాయ శ్రీ సూర్యనారాయణ మేలుకో హరిసూర్యనారాయణ " అని ప్రార్థిస్తాం.  ఒక్కోసారి సాయంత్రం ఆకాశమంతాఎర్రటి రంగుతో నిండిపోయి ఆహ్లాదకరంగా ఉంటుంది. ఆదిశంకరులు సౌందర్యలహరి గానం చేస్తూ అమ్మవారిని ఇలా ప్రార్థిస్తారు: " తనుచ్ఛాయాభిస్తే తరుణ   తరణి శ్రీసరణిభిః దివం  ‌  సర్వాముర్వీమరుణిమ   నిమగ్నాం స్మరతి యః, భవంత్యస్య      త్రస్యద్వనహరిణ శాలీననయనాః     సహోర్వశ్యా వశ్యాః కతి కతి    ...

అమ్మవారు మంగళకార్యాలను ఇష్టపడుతారు - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏  " భద్రప్రియా " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 115 వ నామం.  " భద్రప్రియా " అంటే మంగళములు ఇష్టముగా గలది అని భాష్యం చెప్పారు. అమ్మవారు మంగళప్రదాయిని. మంగళములను ప్రసాదిస్తారు. మంగళములములను పొందేవారిని చూసి మురిసిపోతారు. ఓ ఉపాధ్యాయుడు తరగతిలో ఉన్న 40 మందికీ పాఠం చెబుతారు. కొందరు ఆయన చెప్పినది గ్రహించి సాధన చేసి మంచి ఫలితాలు పొందుతారు. సహజంగానే ఉపాధ్యాయుడు అలా మంచి ఫలితాలు పొందిన వారిని చూసి మురిసిపోతారు, వారిని మెచ్చుకుంటారు. ఓ ఉపాధ్యాయుడే అలా ఆనందపడితే అమ్మవారు ఎంత మురిసిపోతారు సన్మార్గంలో నడిచే తన భక్తులను చూసి.  శుక్ల యజుర్వేదం, ముండకోపనిషత్తులో ప్రార్ధన కోసం ఓ అద్భుతమైన శ్లోకం ఉంది: " ఓం భద్రం కర్ణేభిః శృణుయామ దేవాః   భద్రం పశ్యేమాక్షభి ర్యజత్రాః స్థిరై రంగై     స్తుష్టువాగ్ంసస్తనూభిః వ్యశేమ దేవహితం      యదాయుః స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాః   స్వస్తి నః పూషా విశ్వవేదాః స్వస్తి నస్తార్క్ష్యో      అరిష్టనేమిః స్వస్తి నో బృహస్పతిర్దధాతు " " ఓ దేవతలారా, మా చెవులతో శుభమైనదానిన...

దేవీదేవతలకు ఎవరికి పూజ చేసినా అమ్మవారికి పూజ చేసినట్లే - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏 " సమానాధికవర్జితా " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 198 వ నామం  " సమానాధికవర్జితా " అంటే సమానము, అధికము చేతను విడువబడినది. తనతో సముడుగాని అధికుడుగాని లేనిది అని అర్థం. సృష్టినంతటిని ఇంత అద్భుతంగా దోషరహితంగా నడుపుతూన్న అమ్మవారికి సాటి ఎవరుంటారు. ఇక అధికులు ఉండడానికి అవకాశమెక్కడిది. పోతనగారు భాగవతంలో " అమ్మలఁ గన్నయమ్మ, ముగురమ్మలమూలపుటమ్మ, చాలఁ బెద్దమ్మ, సురారులమ్మ ......" అని కీర్తించారు. అమ్మవారే అన్నిటికీ మూలం. ఆదిశంకరులు సౌందర్యలహరి గానం చేస్తూ ఇలా ప్రార్థిస్తారు: " త్రయాణాం దేవానాం      త్రిగుణ జనితానాం తవ శివే   భవేత్పూజా పూజా తవ    చరణాయోర్యా విరచితా,   తథాహి త్వత్పాదోద్వహన   మణిపీఠస్య నికటే   స్థితా హ్యేతే శశ్వన్ముకుళిత   కరోత్తంసమకుటాః " - 25 " ఓ! శుభప్రదమైన పరాశక్తి, నీ పవిత్ర పాదాలను పూజించినప్పుడు, ఆ ఆరాధన నీ ముగ్గురు గుణాల స్వరూపులైన బ్రహ్మ, విష్ణు, శివులను పూజించినట్లు అవుతుంది, వారు ఎల్లప్పుడూ నీ రత్నంతో అలంకరించబడిన పాదపీఠానికి దగ్గరగా ఉండి, తమ చేతులను కిరీటములపై పెట్టుకుని...

అమ్మవారు లావణ్యముల గని - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏 " మహాలావణ్యశేవధిః " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 48 వ నామం. " మహాలావణ్యశేవధిః " అంటే గొప్ప సౌందర్యమునకు గని అయినట్టిది అని భాష్యం చెప్పారు. సౌందర్యం అంటే బాహ్య సౌందర్యమే కాదు. మాట, చేతలు, చూపులు అన్నీ ఆహ్లాదంగా ఉండాలి. ఇటువంటి లావణ్యాలన్నిటినీ తన భక్తులకు అమ్మవారు అనుగ్రహిస్తారు. మూకపంచశతి లోని స్తుతిశతకంలో కామాక్షీదేవిని మూకశంకరులు ఇలా స్తుతిస్తారు: " సరసవచసాం వీచీ నీచీ   భవన్మధుమాధురీ   భరితభువనా కీర్తిర్మూర్తి   ర్మనోభవజిత్వరీ,   జనని మనసో యోగ్యం    భోగ్యం నృణాం తవ      జాయతే కథమివ వినా  కాంచీ    భూషే కటాక్షతరంగితమ్ " - 21 " తరంగించు తేనె తీపిగల సరసవాక్కు, లోకముల నిండిన కీర్తి, మన్మధునోడించు రూపు, మనసునకు తగిన భోగ్యము, మనుషులకు అమ్మవారి కటాక్షము సోకనిదే ఎట్లు కలుగును? " అని. అంటే అమ్మవారి పాదాలను ఆశ్రయించినవారికే ఇటువంటి అమృతవాక్కు, చక్కని రూపు, కీర్తి, భోగములు లభిస్తాయని మూకశంకరుల అభిప్రాయం. ఇవేమీ లేనివారు క్రితం జన్మలో అమ్మవారి పాదాలను ఆశ్రయించలేదని అర్ధం.  కృష్ణపరమాత్...

అమ్మవారు మంగళ‌స్వరూపురాలు - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏 " భద్రమూర్తిః " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 116 వ నామం. " భద్రమూర్తిః " అంటే మంగళప్రదమగు స్వరూపము గలది. అమ్మవారి వదనం శుభకరం, చూపులు శుభకరం, వాక్కు శుభకరం. అభయమిచ్చే చేతులు శుభకరం. ముక్తినిచ్చే పాదాలు శుభకరం.  శ్రీసూక్తంలో అమ్మవారిని ఇలా ప్రార్థిస్తాం: " సర్వమంగళమాంగల్యే    శివే సర్వార్థ సాధికే .   శరణ్యే త్రయంబకే దేవి    నారాయణి నమోస్తు తే " " అన్ని శుభాలలోకెల్లా శుభప్రదమైన, స్వయంగా శుభప్రదమైన, అన్ని శుభగుణాలతో సంపూర్ణమైన, మరియు భక్తుల అన్ని లక్ష్యాలను (పురుషార్థాలు - ధర్మం, అర్థం, కామ మరియు మోక్షం) నెరవేర్చే తల్లి లక్ష్మీదేవికి నమస్కారం. మూడు కన్నులు కలిగిన, ఆశ్రయదాత అయిన ఓ నారాయణీ నీకు నమస్కారం " అని. ధర్మరాజు భీష్ముని అడుగుతాడు " తాతా, విష్ణుసహస్రనామాలు ఇంత అద్భుతంగా ఎలా చెప్పావు " అని. భీష్ముడు " పవిత్రాణాం పవిత్రం యో మంగళానాం చ మంగళం - పవిత్రులలో కెల్లా పవిత్రుడు, మంగళాలలో కెల్లా మంగళస్వరూపుడు విష్ణువు. ఆయన నామాలు అద్భుతంగా ఉండకుండా ఎలా ఉంటాయి " అని అంటారు. ఆదిశంకరు...

అమ్మవారు గొప్పవారు, రూపంలో పెద్దవారు - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏 " బృహతీ " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 673 వ నామం. " బృహతీ " అంటే అన్నింటికన్నా గొప్పది అని భాష్యం చెప్పారు. జ్ఞానంలోనూ, కరుణలోనూ, శక్తులలోనూ అమ్మవారు గొప్పవారు అని తెలుస్తూనే ఉంది. బ్రహ్మా, ఇంద్రాది దేవతలు కూడా అమ్మవారిని సేవించుకుని తరిస్తున్నారు. రూపంలో కూడా అమ్మవారు పెద్దవారే. కఠోపనిషత్తు " ( అమ్మవారి కన్నా ) చిన్నదీ లేదు, పెద్దదీ లేదు " అని తెలియచేస్తూంది. కర్ణాటకలో మద్దూరు అనే గ్రామం ఉంది. అక్కడ ఉగ్రనృసింహస్వామి విగ్రహం ఉంది. స్థలపురాణం ఏమి తెలియచేస్తూందంటే అర్జునుడు పరమాత్మని " నీ నృసింహ అవతార రూపాన్ని చూడాలని ఉంది " అని అడుగుతాడు. స్వామి అంటారు " వద్దు. నీ శక్తి సరిపోదు. తట్టుకోలేవు. నువ్వు కోరేవు కనుక ఈ లోహ విగ్రహాన్ని ప్రసాదిస్తున్నాను " అని చెప్పి విగ్రహాన్ని ఇస్తారు. ఆ విగ్రహమే ఆ గ్రామంలో ఉన్నది. ఉగ్రనృసింహస్వామి రూపం అలాంటిది, అర్జునుడినే తట్టుకోలేవు అన్నారు పరమాత్మ. కోయంబత్తూర్ సమీపంలో " ప్రత్యంగిరాదేవి " ఆలయం ఉంది. దానికి స్థలపురాణం ఉంది.  నృసింహస్వామి హిరణ్...

సీతమ్మను " అనింధనాగ్ని " అన్నారు విశ్వనాధవారు - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీరస్తు శుభమస్తు"🙏 " అందాల రాముడు    ఎందువలన దేముడు " రామాయణ మహాభారతాలు అత్యద్భుత ఇతిహాసాలు. వాల్మీకి/వ్యాసర్షి ఎన్నో సందేహాలకు సమాధానాలు అక్కడే ఇచ్చేసారు. అవి పూర్తిగా చదవని మందబుద్ధులకు, కుసంస్కారులకు ఇప్పటికీ సందేహాలు వస్తూనే ఉన్నాయి. రావణవధ అయాక రాముడు సీతాదేవిని తీసుకురమ్మని చెబుతూ " నడిపించి తీసుకుని రండి " అన్నారు. అలా నడిపించి తీసుకురమ్మనడానికి అద్భుతమయిన కారణం ఉంది. అక్కడ రాముడితో బాటు లంకవీరులు, కిష్కింధవీరులే కాకుండా జంబూద్వీపంలోని ఎందరో వానరవీరులున్నారు. సీతమ్మని వెతకడానికని సుగ్రీవుడు జంబూద్వీపంలోని తమ రాజులందరినీ సైన్యాలతో రమ్మని కబురు పంపుతాడు. అందరూ వస్తారు, యుద్ధంలో కూడా పాల్గొన్నారు.  వీరెవ్వరూ సీతమ్మను చూడలేదు అంతవరకూ. వినడమే కాని ఆమెగురించి ఏమీ తెలియదు. ఏడాదిపాటు పరాయిరాజ్యంలో ఉన్న సీతమ్మ గురించి భవిష్యత్తులో కూడా ఎవరూ సందేహాస్పదంగా మాట్లాడకూడదన్నది రాముడి అభిప్రాయం. అందుకే నడిపించి అందరూ చూస్తూండగా తీసుకురమ్మన్నారు, అగ్నిప్రవేశం చేయించారు, అగ్నిదేవుడు భద్రంగా తీసుకొచ్చి సీతమ్మను రాముడికి అప్పగించారు. ఈ ప్రక్రియనంతా అక్కడ ఉన్న అం...

శ్రీరాముడు ఎక్కడుంటే అదే అయోధ్య - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీరస్తు శుభమస్తు"🙏 " అందాల రాముడు  ‌  ఎందువలన దేముడు " " న హి తద్భవితా రాష్ట్రం    యత్ర రామో న భూపతిః,    తద్వనం భవితా రాష్ట్రం    యత్ర రామో నివత్స్యతి " " రాముడు లేని అయోధ్య అడవి, రాముడు ఉన్న అడవే అయోధ్య " అంటారు వశిష్టులు కైకేయితో. వశిష్టమహర్షి కైకేయితో " సీత నారచీర కట్టదు, రాజ్యాన్ని పాలిస్తుంది. ఒకవేళ అడవికి వెళ్ళినా పట్టుచీర ధరించి, ఆభరణాలు పెట్టుకునే వెడుతుంది " అన్నాక ఊరుకోలేదు.  రాముడు ఎక్కడ ఉంటే అదే అయోధ్య అని చెబుతూ " కైకేయీ - భరతుడు ఇక్కడలేడు కనుక నీ కోరిక తీర్చుకున్నావు. కాని భరతుడు రాజ్యాన్ని పాలిస్తాడనుకున్నావా. ప్రజలే కాదు పశుపక్ష్యాదులు కూడా రాముడి వెంట వెళ్ళిపోతాయి. కదలలేని చెట్లు, వాటి కొమ్మలు రాముడు వెళ్ళినవేపు సాగి మమ్మల్ని కదలలేని వాటినిగా ఎందుకు పుట్టించావు భగవంతుడా అని విలపిస్తూ ప్రాణాలు కోల్పోతాయి. అప్పుడు శ్మశానమయిన అయోధ్యలో నువ్వు, నీ కోడుకే ఉంటారు " అంటారు. బ్రహ్మర్షి నోటివెంట వచ్చిన మాటలు అలాగే నిజమయాయి. భరతుడు రాజ్యం వద్దన్నాడు. అడవికి వెళ్ళి రాముడి కాళ్ళపైపడి అయోధ్యకు తిరిగి రమ్మని వేడుకున్...

హనుమజ్జయంతి ఎప్పుడు చేసుకోవాలి?- చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీరస్తు శుభమస్తు"🙏 హనుమజ్జయంతి ఎప్పుడు? పూజ్యులు సామవేదంవారు తెలియచేసినది హనుమ చైత్ర శుద్ధ పౌర్ణమినాడే జన్మించారు అని. అందరికీ తెలిసిన విషయాలు పుట్టగానే హనుమ సూర్యుడిని పండు అనుకుని ఆయన దగ్గరకు వెళ్ళడానికి ఎగరడం, ఇంద్రుడు హనుమని మరో రాహువులాంటివాడు అనుకుని వజ్రాయుధంతో కొట్టడం, హనుమ స్పృహ కోల్పోవడం, వాయుదేవుడి కోపం తగ్గించడానికి బ్రహ్మ మొ.గు వారు హనుమకు వరాలు ఇవ్వడం. ఇదంతా అక్కడ వెంటవెంటనే జరిగిపోయినా కాలం తేడావలన మనకు 40 రోజులుగా తెలుస్తూందని ఆయన తెలియచేసారు. హనుమ తిరిగి తేరుకున్న రోజు వైశాఖ బహుళ దశమి అని. భారతదేశంలో వివిధ ప్రాంతాలలో ఒక్కో తిథినాడు హనుమజ్జయంతి చేసుకోవడం చూస్తూంటాం. " జయం మంగళంచ దదాతి ఇతి జయంతి ". హనుమ జయాన్ని, మంగళాన్ని కలుగచేస్తారు భక్తులకు. హనుమది అద్భుత వ్యక్తిత్వం. కనుక రోజూ జయంతి చేసుకుని ఆయనను గౌరవించుకున్నా తక్కువే. రెండు రోజులూ స్వామి జయంతి చేసుకుని ఆయనను పూజించుకుని ఆయన అనుగ్రహం పొందుదాం. ఏతత్ సర్వం శ్రీహనుమదార్పణమస్తు - సూర్య. శుభం భూయాత్

హనుమజ్జయంతి నేడు, శుభాకాంక్షలు - చీమలపాటి సూర్యనారాయణ

 🙏" శ్రీరస్తు శుభమస్తు"🙏 శ్రీహనుమ జయంతి నేడు.  " మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం " - బుద్ధిమంతుల్లోకెల్లా వరిష్టుడు.  ఈ రోజు స్వామిని స్మరించుకుని తరిద్దాం. స్వామి వేదశాస్త్రాలు ఎవరిదగ్గర నేర్చుకోవాలా అని ఆలోచించి సూర్యదేవుడిని అడుగుతాడు. ఆయన " నాకెలా కుదురుతుంది, నేను నిత్యసంచారిని కదా " అంటారు. మీ సంచారానికి ఆటంకంలేకుండా నేర్చుకుంటానని చెప్పి సూర్యుడి ముందర గాలిలో తేలుతూ వెనక్కి ప్రయాణిస్తూ విద్య నేర్చుకున్నారు.  హనుమ మొదటిసారి శ్రీరామలక్ష్మణులని కలిసినప్పుడు 3 ప్రశ్నలు వేస్తారు : 1. మీరు ఎక్కడనుంచి వస్తున్నారు. 2. ఏపనిమీద వస్తున్నారు. 3. మీరు ధరించిన వస్త్రాలకి మీ ఆయుధాలకి పొంతన కుదరడంలేదేమి?. అంటే వీరి మొత్తం వృత్తాంతం 3 ప్రశ్నలతో తెలిసిపోతూంది. రాముడు ఆశ్చర్యపోయి లక్ష్మణుడితో " ఈయనతో మాట్లాడినప్పుడు కొంచెం ఒళ్ళు దగ్గరపెట్టుకుని మాట్లాడాలి సుమా " అని అన్నారు.  నూరుయోజనాల సముద్రాన్ని లంఘించి లంఖిణిని ఒక్క గుద్దుతో చంపేసిన హనుమ సీతమ్మని కలిసినప్పుడు ఆవిడ అంటుంది " సైన్యంతో నూరుయోజనాల సముద్రాన్ని దాటుకుని వచ్చి ఈ రాక్...

శ్రీరామునికి సీతమ్మ కరమాల - చీమలపాటి సూర్యనారాయణ

 🙏""శ్రీరస్తు శుభమస్తు"🙏 శ్రీరాముడు ఖరదూషణాదులను సంహరించే సమయంలో ఒక కమనీయమయిన శృంగారఘట్టం జరిగింది. సీతమ్మతల్లి అంతవరకూ రాముడి ఒక పార్శ్వాన్నే చూసింది. శివధనస్సు ఎక్కుపెట్టడం అది విరిగిపోవడం రెప్పపాటుకాలంలో జరిగింది. అదేమీ సీతమ్మకు గుర్తేలేదు. జనకుడు " మా అమ్మాయిని వివాహం చేసుకో రామా " అంటే " అలాగే మామయ్యగారూ " అనలేదు రాముడు, " నా తల్లిదండ్రులు సమ్మతిస్తే చేసుకుంటాను " అన్నాడు. యువరాజపట్టాభిషేకం చేస్తానంటే సరే అన్నాడు. వద్దులే అరణ్యవాసానికి వెళ్ళు అంటే సరే అన్నాడు. " రాజూ లేడు రాణీలేదు, నువ్వు ఊ అను వీళ్ళ సంగతి తేల్చేస్తాను " అన్న లక్ష్మణుడిని " ఏమిటా మాటలు " అని మందలించాడు. తనుకూడా అరణ్యానికి వస్తానంటే " సీతా నువ్వు ఆ కష్టాలు భరించలేవు, వద్దు " అన్నాడు. భరతుడు అడుగగానే అరణ్యంలో తిరగడం కష్టమని తెలిసీ పాదుకలను కూడా ఇచ్చేసాడు.  అటువంటి పరమశాంతమూర్తి, దయార్ద్రహృదయుడు ఇంతమంది క్రూరులయిన రాక్షసులతో యుద్ధం చేస్తూన్నప్పుడు " ఎలా ఉంటాడో " చూడాలని ముచ్చటపడింది సీతమ్మ.  బయటకు వచ్చి చాటుగా నుంచుని చూసింది. 3 ఘడ...

భయయోగి మారీచుడు - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీరస్తు శుభమస్తు"🙏 " రామభూతమిదం సర్వం    అరణ్యం ప్రతిభాతి మే,    రామమేవ హి పశ్యామి    రహితే రాక్షసాధిప " " ఈ అరణ్యంలో ఎక్కడ చూసినా నాకు రాముడే కనిపిస్తున్నాడయ్యా.‌ రాముడు తప్ప వేరేమీ కనబడుటలేదు " - ఈ మాటలు అన్నది మారీచుడు అనే రాక్షసుడు, రావణుడితో. " అంతా రామమయం    జగమంతా రామమయం " అంటే ఇదే. మారీచుడు అంటాడు రావణుడితో " రాముడు కొట్టిన దెబ్బకు నేను మాంసం తినడం మానేసాను. ఇతరులను హింసించడం మానేసాను. ఋషుల వలే ఈ ఆశ్రమం కట్టుకుని " రామజపం " చేసుకుంటున్నాను, ఎందుకంటే నాకు వేరే ఏ జపాలు తెలియవు కనుక. " ర " తో మొదలయ్యే ఏ పదాన్ని విన్నా రెండవ అక్షరం " మ‌ " గానే వినిపిస్తూంది నాకు " అని. ఏ వృక్షం చూసినా దాని వెనుక కోదండం ఎక్కుపెట్టిన రాముడు కనిపిస్తున్నాడు. పడుకున్నా కలలో కూడా రాముడే కనిపిస్తున్నాడు. మారీచుడు భయయోగి. భాగవతంలో " భయంతో కాని కోపంతో కాని ప్రేమతో కాని ఏ విధంగా నన్ను తలుచుకున్నా అనుగ్రహిస్తాను " అన్నారు పరమాత్మ. రావణుడు ప్రభువు, అతనికి ఆగ్రహం కలుగుతుంది అని తెలిసినా ఇంత కఠినమైన నిజాలు మారీచుడు ...

శరణాగతి అంటే చాలు, పరమాత్మ ఆదుకుంటారు - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీరస్తు శుభమస్తు"🙏 " అందాల రాముడు  ‌  ఎందువలన దేముడు " " సకృదేవ ప్రపన్నాయ   తవాస్మీతి చ యాచతే   అభయం సర్వభూతేభ్యో   దదామి ఏతత్ వ్రతం మమ"  " ప్రపన్నాయ " అంటే శరణాగతి. " తవాస్మీతి " అంటే నీవాడను. విభీషణుడు రావణుడిని విడిచిపెట్టి రాముడి చెంతకు రాగానే " రా నాయనా " అనలేదు రాముడు. వానరవీరులందరినీ సంప్రదించారు ఏమి చేద్దాం అని. సుగ్రీవుడితో సహా అందరూ " అతను శతృవు తమ్ముడు, యుద్ధానికి ముందు వచ్చాడు, మోసమేదయినా ఉండవచ్చు. దరిచేరనీయడం మంచిదికాదు. వద్దు " అన్నారు. అప్పుడు హనుమను కూడా అడుగుతారు రాముడు. " ఈ విభీషణుడిని నేను ఇదివరకే రావణసభలో చూసాను. ఇతని మాటలను కూడా విన్నాను. ఇతని ముఖంలో కాని మాటలలో కాని నాకు కపటం ఏమీ కనబడలేదు. ఒకవేళ కపటంతోనే వచ్చి ఉన్నా మనమేమీ చాతకాని వారం కాదు కదా " అంటారు హనుమ. అప్పుడు రాముడు పై శ్లోకం ద్వారా తన అభిప్రాయాన్ని చెబుతారు. శరణాగతి అంటూ నేను నీవాడను అని నన్ను కోరినవారిని అక్కున చేర్చుకోవడం నా ఏకైక వ్రతం " అని చెబుతారు రాముడు. విభీషణుడే కాదు, రావణుడు వచ్చి శరణాగతి అన్నా అక్కున చేర్...

రక్తం పంచుకుని పుట్దిన సోదరులు మాత్రం మళ్ళీ దొరకరు - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీరస్తు శుభమస్తు"🙏 " దేశే దేశే కళత్రాణి    దేశే దేశే చ బాంధవాః,   తంతు దేశం న పశ్యామి    యత్ర భ్రాతా సహోదరః "  రామాయణంలో శ్రీరాముడు ఇంద్రజిత్తు ప్రయోగించిన అస్త్రానికి లక్ష్మణుడు చనిపోయాడనుకుని అంటారు " ఇంకో భార్య దొరుకుతుంది, ఇంకో బంధువు ( స్నేహితుడు కూడా ) దొరుకుతాడు కాని ఇంకో తోబుట్టువు మాత్రం ఎట్టిపరిస్థితుల్లోనూ దొరకడు/దు " అని. ఎంత అద్భుతం రామాయణ మహాకావ్యం. అందుకే అది ఇతిహాసం అయింది.  అనారోగ్యం వలనో వేరే దుర్ఘటనలోనో భార్య చనిపోతే ధర్మకార్యనిర్వహణకోసం ఇంకో వివాహం చేసుకోవలసి రావచ్చు. అంటే ఇంకో భార్య అవసరమయితే దొరుకుతుంది. ఆశ్చర్యంగా అనిపిస్తుంది ఇక్కడ రాముడు/వాల్మీకిమహర్షి " భార్య " ప్రస్తావన ఎందుకు తెచ్చారు, వేరే ఏదయినా చేర్చవచ్చు కదా అని. ఇందులో " ధర్మం " దాగి ఉంది. భార్య అంటే ధర్మపత్ని. ఏ పూజ/క్రతువు చేయాలన్నా భార్య ఉండాలి - ధర్మపత్ని సమేతః అంటారు. ఋగ్వేదం " యా దంపతీ సమనసా కురుతః - దంపతులు ఏకమనస్కులై యజ్ఞాలు చేస్తున్నారు " అంది. అధర్వణవేదం " ఇమం యజ్ఞం సహపత్యా " అని తెలియచేస్తూంది. దురదృష్టవశాత్తు భార్యన...

తెల్లని ముత్యాలు ఎరుపుగానూ నీలంగానూ కనిపించాయిట - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీరస్తు శుభమస్తు"🙏 " జానక్యాః కమలామలాంజలి   పుటే యాః పద్మరాగాయితాన్యస్తా      రాఘవమస్తకే తు విలసత్కుంద      ప్రసూనాయితాః స్రస్తాః      శ్యామలకాయకాంతికలితాః    యా ఇంద్రనీలాయితాః    ముక్తా స్తా శ్శుభదా భవంతు    భవతాం శ్రీరామవైవాహికాః" ఈ శ్లోకం ఇంచుమించు ప్రతీ పెళ్ళి శుభలేఖలోనూ కనిపిస్తూంటుంది. కొన్ని వేలసార్లు చూడడం, చదవడం చేసి ఉంటాం అందరం. ఈ శ్లోకం శ్రీ శంకరాచార్య విరచిత " రామకర్ణామృతం " లోనిది. " రాముడు సీతమ్మ తలపై, సీతమ్మ రాముడి తలపై పోసిన తలంబ్రాలు సర్వజగత్తుకు మంగళములు కలిగించుగాక " అని తాత్పర్యము. తలంబ్రాలకు బియ్యమే ఎందుకు వాడాలి. " ప్రాలు " అంటే బియ్యం. తలంబ్రాలు పేరులోనే బియ్యం ఉన్నాయి.  దోసిలి హృదయం, బియ్యం చంద్రుడు/మనస్సు. దోసిళ్ళలో బియ్యం తీసుకుని మంత్రించి వధూవరులు ఒకరి శిరస్సుపై ఒకరు పోసుకుంటే వారి హృదయాలు మనస్సులు ఒకటి అవుతాయి అని భావం. అదీ సనాతనధర్మం విశిష్టత. ప్రతీ సంప్రదాయానికి ఓ శాస్త్రీయ కారణం తెలియచేస్తుంది. ఇక్కడ ఓ అద్భుత ఘట్టం ఉంది. ముత్యాలు వాడారు తలంబ్రాలకు. తెల్లటి ముత...

శ్రీరామనవమి శుభాకాంక్షలు అందరికీ - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీరస్తు శుభమస్తు"🙏 " అందాల రాముడు   ఎందువలన దేముడు " " యజ్ఞానాం జపయజ్ఞో2స్మి " అన్నారు పరమాత్మ భ.గీతలో ( 10:25 ). ధర్మబద్ధమయిన కోరికలు తీరడంకోసం ఏదయినా మంత్రాన్ని జపం చేసుకోవచ్చు. కాని ముక్తినిచ్చే తారక మంత్రం ఒకటే. అది " రామ " నామం. రామనామం ఎందుకు అంత పవిత్రమయినది/ఉత్కృష్టమయినది/శక్తివంతమయినది అయింది?. రామ లో " ర+అ+మ " - 3 అక్షరాలు ఉన్నాయి. ర అగ్నిబీజం, అ సూర్యబీజం, మ చంద్రబీజం.  మనసా(మ) వాచా(ర) కర్మణా(అ) అంటారు - రామ నామంలో ఈ మూడూ ఉన్నాయి. విష్ణుసహస్రంలో " రామః విరామః " అనే నామాలతో ప్రార్ధిస్తాం స్వామిని. ఆదిశంకరులు రామః కి " నిత్యానంద చైతన్యములో సదా రమించువాడు " అని భాష్యం చెప్పారు. వేదం ఇలా చెబుతూంది: " రకారో అగ్నిబీజంశ్చాత్,    అకారో సూర్యబీజకం,    మకారశ్చంద్రబీజంచ " అని. కుండలినీయోగాలో కూడా చక్రాలను 3 మండలాలుగా విభజించారు. మూలాధారం నుంచి అనాహతచక్రం వరకూ అగ్నిమండలం అని, అక్కడనుంచి ఆజ్ఞాచక్రం వరకూ సూర్యమండలం అని, ఆపైనదానిని చంద్రమండలం అనీ తెలియచేసారు. రామ అని జపిస్తే ఈ 3 మండలాలూ జాగృతి/చైతన్యం చె...

మనం చదివే చదువులన్నీ అవిద్యలే, అసలు చదువులే కావు - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏 " పరాపరా " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 790 వ నామం. " పరాపరా " అంటే పరా, అపరా అనే భేద భావం లేనివారు అని. పరాపరా స్వరూపురాలు. పర, అపర కి చాలా అర్ధాలు చెప్పారు. పర అంటే పరులు కనుక అపర అంటే కావలసినవారు. అమ్మవారికి కావలసినవారు, అక్కర్లేనివారు అనే భేదం ఎందుకు ఉంటుంది. అందరూ అమ్మవారికి కావలిసినవారే. వారి వారి కర్మలను బట్టి ఫలాలు ఉంటాయి. పరా అంటే పరబ్రహ్మము, అపరా అంటే పరా కానిది, ప్రపంచ/ప్రకృతి పరమయినది.  చక్కటి ఉదాహరణ - ఆకాశంలోని సూర్యుడు పరబ్రహ్మ. కుండలోని నీటిలో కనబడే సూర్యుడు అపరబ్రహ్మ. ఈ విషయమై బృహదారణ్యకోపనిషత్తులో ఓ చక్కటి వృత్తాంతం ఉంది: నారదులు సనత్కుమారుడితో " స్వామీ వేదవేదాంగాలు శాస్త్రాలు చదివాను, సంగీతం వంటి ఎన్నో కళలు సాధన చేసాను. కాని మనశ్శాంతి లేదు. ఆత్మజ్ఞానం కలుగలేదు. నాకు ఆత్మజ్ఞానం తెలియచేయండి " అని అడుగుతారు.‌ ఆయన అన్నారు " ఈ వేదాలు, శాస్త్రాలు, కళలు అన్నీ అపరావిద్యలు. ఇవన్నీ కర్మలను తెలియచేస్తాయి. అవి భౌతికసుఖాలను ఇస్తాయి కాని శాశ్వతమయిన ఆత్మజ్ఞానం కలిగించవు. దానికి పరావిద్యను ఆశ్రయ...

నీతి శాస్త్రం ఉంటుంది కాని అవినీతిశాస్త్రం ఉండదు - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏 " శాస్త్రమయీ " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 705వ నామం.  " శాస్త్రమయీ " అంటే శాస్త్రమే ( వేదమే ) ప్రధానముగా గలది. శాస్త్రం అంతా శాస్త్రీయం. దేశ రాజ్యాంగం లాంటిది. అమ్మవారి అనుగ్రహమయినా దండన అయినా శాస్త్రప్రకారమే. శాస్త్రం ఏది చెబుతే అది చేయడాన్ని శ్రద్ధ అంటారు. అలా చేయని వారిని మూఢులు అంటారు. శాస్త్రోక్తం అనేమాట తరచూ వింటూంటాం. దాని అర్థం శాస్త్రాలు చెప్పినట్లు నడుచుకోవడం. శాస్త్రాలు ఎప్పుడూ మంచిని, సమాజానికి ఉపయోగపడే విషయాలనే చెబుతాయి. నీతిశాస్త్రం ఉంటుంది కాని అవినీతిశాస్త్రం ఉండదు. శాస్త్రాలు నిక్కచ్చిగా ఉంటాయి. అవి మేలు కలిగిస్తాయి. తాత్కాలికంగా సుఖాన్ని ఇవ్వకపోవచ్చు కాని అంతిమంగా శాశ్వత ఆనందాన్ని కలుగచేస్తాయి.  పరమాత్మ గీతలో ఇలా తెలియచేసారు అర్జునుడికి: " తస్మాత్ శాస్త్రం ప్రమాణం    తే కార్యాకార్య వ్యవస్థితౌ,   జ్ఞాత్వా శాస్త్రవిద్యానోక్తం    కర్మ కర్తుమిహార్హసి "              - భ.గీత 16:24 పరమాత్మ అన్నారు అర్జునుడితో " శాస్త్రాలు ఎలా చెబుతున్నాయో అలా చెయ్యి. ఏది చ...

కృతజ్ఞత తెలియచేసుకుంటూ ఉండాలి ప్రకృతికి, అమ్మవారికి - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏 " కృతజ్ఞా " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 374 వ నామం . " కృతజ్ఞా " అంటే పుణ్యాపుణ్యములు రెండునూ తెలిసినది. కృతం అంటే చేయడం జ్ఞ అంటే తెలిసినది.  " కృతజ్ఞః " అని విష్ణుసహస్రంలో ఒక నామం. దానికి " ప్రాణులు చేసే కర్మలను చేయువాడు " అని భాష్యం చెప్పారు ఆదిశంకరులు.  మనం చేసే కర్మలన్నిటినీ అమ్మవారు గమనిస్తూ ఉంటారు. మంచిపనికి మంచిఫలితం, చెడుపనికి చెడుఫలితం మన ఖాతాలో కచ్చితంగా జమ చేస్తూ ఉంటారు. అమ్మ చూడండి. పిల్లవాడు తప్పు చేస్తే దండిస్తుంది. మంచి మార్కులు వచ్చాయని చెబుతే మెచ్చుకుని బహుమతి ఇస్తుంది. వాల్మీకి మహర్షి నారదులవారిని " ఈ 16 అద్భుత గుణములతో భూమిమీద నడయాడిన మానవుడు ఎవరయినా ఉన్నారా " అని అడిగితే నారదులు శ్రీరాముడి పేరు చెబుతారు. ఈ 16 అద్భుత గుణాలలో ఒకటి కృతజ్ఞత.  " చిత్తస్య శుద్ధయే కర్మ " అన్నారు ఆదిశంకరులు. అంటే మనం చేసే కర్మలు చిత్తశుద్ధి కలిగేలా ఉండాలి అని. అలాగే " కృతఘ్నస్య నివృత్తయే " అని కూడా చెబుతారు. అంటే కృతఘ్నత పోయేలా కర్మలు చేయాలని. దీని అర్ధం అందరూ కృతజ్ఞ...

రమణమహర్షి జయంతి నేడు, శుభాకాంక్షలు - చీమలపాటి సూర్యనారాయణ

 🙏" శ్రీరస్తు శుభమస్తు"🙏 ఈరోజు పూజ్యులు రమణమహర్షి జయంతి. జ్ఞానప్రదాత. ప్రజల అజ్ఞానాన్ని పోగొట్టడానికి అవతరించిన మహానుభావుడు. శరీరం మీద ధ్యాసలేదు, లౌకికవిషయాలపై ఆసక్తిలేదు. " బ్రహ్మసత్యం, జగన్మిధ్య " అని సంపూర్ణంగా నమ్మిన జీవన్ముక్తులు. ఒకరిపై ద్వేషం/కోపం లేదు. అసలు ఎవరిపైనా ఇష్టం/అభిమానమే లేదు. దేశంలోనే కాదు విదేశాలలోనూ ఎందరో శిష్యులు. ఈయన సందేశాలతో తరించినవారు ఎందరో. రమణమహర్షి " అరుణాచల పరమాత్మన్ అరుణోభవ, చిత్తకంజ సువికాశాయ " అని ప్రార్ధన చేసేవారు. " మా మనస్సు మొగ్గలా ముడుచుకుపోయింది. నీ కరుణ అనే అరుణకిరణాలను ప్రసరించి అది విచ్చుకునేలా చెయ్యి తండ్రీ ( సూర్యకిరణాలు సోకితే పద్మం వికసిస్తుంది ) " అని ప్రార్ధిస్తారు. కారణజన్ములు. చిత్తకుంజ అంటే హృదయపద్మం. " నహి భవతి యన్న భావ్యం,   భవతిహిభావ్యం వినాపి     యత్నేన, కరతలగతిమపి     నశ్యతి, యస్యహి భవితవ్యతా నాస్తి " జరగరానిది ఎంతప్రయత్నించినా జరగదు, జరిగేది నీ ప్రయత్నం లేకపోయినా జరిగి తీరుతుంది. పూజ్యులు రమణమహర్షి ఇదే తరచుగా చెబుతూండేవారు. " కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన - కర్మమీదే న...

మన బుద్ధి ఏది ఆలోచిస్తుందో అదే మన భవిష్యత్తు - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏 " సర్వవేదాంతసంవేద్యా " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 645 వ నామం. " సర్వవేదాంతసంవేద్యా " అంటే ఉపనిషత్తులన్నిటిచేతా చక్కగా తెలియదగినది.  ఉపనిషత్తులను వేదాంతం, వేదాంగాలు అని తెలియచేసారు . ఉపనిషత్తులు జ్ఞానకాండ. ఉప అంటే దగ్గరగా, బ్రహ్మ తత్వానికి/జ్ఞానానికి దగ్గరగా తీసుకుని వెడతాయి ఉపనిషత్తులు. కాని అది అంత సులభం కాదు. గతజన్మ వాసనలు వెనక్కిలాగేస్తూంటాయి. ఈ వాసనలనీ, చెడు ఆలోచనలనూ నశింపచేస్తాయి ఉపనిషత్తులు. ఉపనిహంతి. బుద్ధి ఏమి ఆలోచిస్తుందో అదే మన భవిష్యత్తు. విషయాలోచన చేస్తే విషయాలలో పడతాం, భగవత్స్మరణ చేస్తే భగవంతుడవుతాం. ఈ స్మరణం ఎంతవరకూ అన్నది ప్రశ్న. దానిలో " స్ " పోయేవరకూ అన్నారు పూజ్యులు సామవేదంవారు. స్మరణం ( స్+మరణం )లో స్ పోతే మిగిలేది మరణం.‌ అంటే మరణం వరకూ భగవంతుని స్మరిస్తే భగవంతునిలో లీనమవడం తథ్యం. శుకుడు భాగవతసప్తాహం చేసారు, పరీక్షిత్తు విష్ణువు సన్నిధికి చేరారు. ఏడు రోజులు భాగవతం విని ముక్తి పొందాడు పరీక్షిత్తు అనిపిస్తుంది కాని ఆయన మరణం పొందేవరకూ భాగవతం విన్నారు అని తెలుసుకోవాలి. శుకమహర్షి చెప్పి...

శ్రీపంచమి/వసంతపంచమి నేడు. శుభాకాంక్షలు - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏 " పంచకృత్యపరాయణా " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 274 వ నామం . " పంచకృత్యపరాయణా " అంటే పంచకృత్యములు అనగా సృష్టి స్థితి లయ తిరోధానము అనుగ్రహముల యందు ఆసక్తి గలిగినది. సృష్టి స్థితి లయ అనుగ్రహం అనే నాలుగూ తెలిసినవే. తిరోధానం ఒక అద్భుత ప్రక్రియ. తిరోధానం అంటే మరుపు. ఇది లేకపోతే జీవితం నిస్సారం. చేదు అనుభవాలనే అస్తమానూ తలచుకుంటూ కృంగిపోతారు.  ఇది మర్త్యలోకం. మోక్షభూమి. పాపపుణ్యాల ఫలాలు అనుభవించి మోక్షం పొందడానికి జీవుడు ఇక్కడ జన్మ తీసుకుని తీరాలి. ప్రతీ మనిషి జీవితంలోనూ చేదు సంఘటనలు జరుగుతూనే ఉంటాయి. తప్పదు. వాటిని ప్రక్కన పెట్టి ఎదరకు సాగుతూ ఉండాలి.  సీతమ్మ హనుమతో అంటారు " మానవుల జీవితాలు వింతగా ఉంటాయి. వారికి సుఖసంతోషాలు సెలయేరులు కొండలులా చిన్నవిగా అనిపిస్తాయి, దుఃఖం కష్టాలు మాత్రం సముద్రం, ఆకాశంలా పెద్దగా అనిపిస్తాయి " అని.  పరమాత్మ గీతలో ఇలా తెలియచేసారు: " సర్వస్య చాహం హృది సన్నివిష్టోమత్తః    స్మృతిర్ జ్ఞానమపోహనం చ,    వేదైశ్చ సర్వైరహమేవ వేద్యో    వేదాంతకృద్వేదవి దేవ చాహమ్ "     ...