వేదో2ఖిల ధర్మమూలం
🙏"శ్రీరస్తు శుభమస్తు"🙏 " తస్మాత్ శాస్త్రం ప్రమాణం తే కార్యాకార్య వ్యవస్థితౌ, జ్ఞాత్వా శాస్త్రవిద్యానోక్తం కర్మ కర్తుమిహార్హసి " - భ.గీత 16:24 పరమాత్మ అన్నారు అర్జునుడితో " శాస్త్రాలు ఎలా చెబుతున్నాయో అలా చెయ్యి. ఏది చెయ్యమందో అది చెయ్యి, ఏది వద్దందో అది మానేయి " అని. ఎంత అద్భుతం. పరమాత్మ తను చెప్పింది చెయ్యమనలేదు. శాస్త్రాలు ఏది చెబుతున్నాయో అది చెయ్యి అన్నారు. " వేదో2ఖిల ధర్మమూలం " - అన్ని ధర్మములకూ మూలం వేదమే. వేదం నుంచే ఉపనిషత్తులు, పురాణాలు, ఇతిహాసాలు, శాస్త్రాలు వచ్చాయి. ఏది చెప్పినా ధర్మం గురించే. శ్రీరాముడు కూడా ఏది చెప్పినా " శాస్త్రాలు ఇలా చెబుతున్నాయి, ఋషులు ఇలా తెలియచేస్తున్నారు " అనేవారు ఎప్పుడూ. సనాతనధర్మానికి పునాదులు అద్భుతమయిన, శక్తివంతమయిన మన " గ్రంధరాశి, ఋషులు, తీర్థాలు, క్షేత్రాలు ". ఋషులు తాము దర్శించి, ఆచరించిన తరువాత దానిలోని మంచిని మాత్రమే లోకకళ్యాణం కోసం మనకు అందించారు. వివేకానందులు చికాగో సర్వమతసమ్మేళనంలో " సోదరసోదరీమణులారా, ప్రపంచమతాలకు తల్లి అయిన సనాతనధర్మం, నా భారతద...