Posts

శ్రీ ఆదిశంకరుల జయంతి నేడు, శుభాకాంక్షలు అందరికీ - చీమలపాటి సూర్యనారాయణ

  🙏 "శ్రీమాత్రేనమః" 🙏   జగద్గురువులు, సనాతనధర్మ పరిరక్షకులు, పూజనీయులు శ్రీఆదిశంకరుల జయంతి నేడు,  వైశాఖ శుద్ధ పంచమి. శుభాకాంక్షలు అందరికీ. " యదా యదాహి ధర్మస్య   గ్లానిర్భవతి భారత,   అభ్యుత్థానమధర్మస్య   తదాత్మానం సృజామ్యహం "                             - భ.గీత 4:7 " ఎప్పుడయినా ధర్మానికి హాని జరుగుతూన్నప్పుడు ధర్మరక్షణకోసం వస్తూంటాను నేను " అన్నారు పరమాత్మ. అంటే ఎల్లప్పుడూ ఎవరినో ఒకరిని సంహరించడానికే అనుకోనక్కరలేదు. అలాగే ప్రతీసారీ ఆయనే రారు. సనాతనధర్మం పరిరక్షణ కోసం ఎవరినో ఒకరిని పంపిస్తూ ఉంటారు పరమాత్మ. ఆదిశంకరులు అలా వచ్చినవారే. కారణజన్ములు. వేదాలు కర్మకాండ, వేదాంగాలు ( ఉపనిషత్తులు మొ.గునవి ) జ్ఞానకాండ. ధనవ్యయంతో కూడుకున్న ద్రవ్యయజ్ఞాలకన్నా జ్ఞానయజ్ఞమే మేలు అన్నారు పరమాత్మ ( భ.గీత 4:33 ). ఆదిశంకరులు " రాబోయేది గడ్డుకాలం, జీవులు సంసారసాగరంలో మునిగిపోయి నానాబాధలూ పడుతూంటారు, దైవచింతనకు సమయం ఎక్కడుంటుంది. అటువంటివార...

అక్షయతృతీయ నేడు, శుభాకాంక్షలు అందరికీ - చీమలపాటి సూర్యనారాయణ

 🙏" శ్రీమాత్రేనమః"🙏 అశ్వదాయి చ గోదాయి ధనదాయి మహాధనే ధనం మే జుషతాం దేవి సర్వకామార్థ సిద్ధయే " - శ్రీసూక్తం అమ్మవారు లక్ష్మీదేవిని " అశ్వాలు, గోవులు, ధనం సమృద్ధిగా అనుగ్రహించు తల్లీ " అని ప్రార్ధిస్తాం శ్రీసూక్తంలో. అశ్వం అంటే  వేగంగా ప్రయాణించునది అని తెలియచేస్తూంది వేదం. అందుకని గుర్రం అని కాకుండా వాహనం అని భావించాలి. గోవుకి నానార్ధాలు చాలా ఉన్నాయి. వాటిలో భూమి అని ఒక అర్థం. అందుకని భూసంపద ప్రసాదించమని అర్ధం. వాహనం, భూసంపద, ధనం సమృద్ధిగా ఇవ్వమని ప్రార్ధన. మత్స్య పురాణంలో శివుడు పార్వతికి సర్వకామప్రదమైన అక్షయ తృతీయ వ్రతం గురించి వివరించారు. వైశాఖ శుద్ధ తదియనాడు ఏ వ్రతం, జపం, హోమం, పూజ చేసినా అక్షయ ఫలం ఇస్తుంది అని. అక్షయం అంటే తరుగులేనిది అని. అందుకే ఏ ఆశీర్వచనంలో అయినా " అక్షయం ఉపతిష్టతు " అని ఉంటుంది. నారద పురాణంలో కూడా ఈ వ్రతం గురించి విస్తారంగా తెలియచేసారు. గరుడపురాణంలో శ్రీమహావిష్ణువు గరుడునికి " అక్షయదేవలోకాలున్నట్లే అక్షయనరకాలు కూడా ఉన్నాయి. నరకాలలో అనేక శిక్షలు అనుభవించిన తరువాత కూడా పాపులకు నీచజన్మలే లభిస్తాయి. అందుకే మనుష్య జ...

నేను వేరు, నాలోని ఆత్మ వేరు అని తెలుసుకున్నవారు జ్ఞాని - చీమలపాటి సూర్యనారాయణ

  శ్రీమాత్రేనమః వివిక్తస్థా 835 " వివిక్తస్థా " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 835 వ నామం . " వివిక్తస్థా " అంటే ' అత్మ అనాత్మ ' అనే వివేకం కలవారియందు ఉండునది. అంటే శాశ్వతమయిన ఆత్మ గురించి క్షుణ్ణంగా తెలిసిన వారి యందు ఉంటారు అమ్మవారు. కఠోపనిషత్తు ఈ ఆత్మ, ఆత్మవిద్య గురించి విస్తారంగా ప్రస్తుతించింది. మనం అందరం శాశ్వతమయిన ఆత్మను, అశాశ్వతమయిన శరీరాన్ని కలిపేస్తాం. అశాశ్వతమయిన ఆస్తులు, బంధాలూ అన్నీ " నావి " అనుకుంటూ నేను ( ఆత్మ ) కు ఆపాదిస్తాం. మరి ఆత్మ గురించి ఎలా తెలుసుకోవాలి? " నైషా తర్కేణ మతిరాపనేయా (1.2.9)" -  ఆత్మవిద్య తర్కంతో పొందరానిది.  ఆత్మవిద్య తర్కానికి అతీతం గనుక గురువు అనుగ్రహంతోనే లభిస్తుంది.‌ ఆత్మవిద్య బ్రహ్మ సాక్షాత్కారం పొందిన గురువు మాత్రమే ఉపదేశించగలడు అని తెలియచేస్తూంది ఈ ఉపనిషత్తు. ఇంద్రియాలను అంతర్ముఖం చేయగలిగితేనే అంతరాత్మను చూడగలం అని చెబుతూంది ఈ ఉపనిషత్తు: " పరాంఛి ఖాని వ్యయత్రుణత్స్వయంభూః   తస్మాత్పరాజ్ పశ్యతి నాంతరాత్మన్   కశ్చిద్దీరః ప్రత్యగాత్మానమైక్ష   దావృత్తచక్షురమృతత్వమిచ్...

యజ్ఞవరాహస్వామి జయంతి నేడు, స్మరించుకుని తరిద్దాం - చీమల పాటి సూర్యనారాయణ

  🙏"శ్రీరస్తు శుభమస్తు"🙏 నేడు యజ్ఞ వరాహస్వామి జయంతి. బ్రహ్మగారి మనస్సునుంచి సృష్టికోసం సనకసనందనాదులు, నారదమహర్షి వంటివారు పుట్టుకొచ్చారు కాని వారు నివృత్తి మార్గంని అనుసరించడంతో మళ్ళీ సృష్టి కోసమని ప్రజాపతులు, మహర్షులు ఉద్భవించారు. వారి వలన సత్యతపోలోకాలు వంటి ఊర్ధ్వలోకాలు దేవతలు మొ.గు వారితో నిండి ఉన్నాయి. ఇక భూలోకంలో కూడా సృష్టి మొదలు పెట్టడానికి శ్రీకారం చుట్టారు బ్రహ్మ. ఆయన  ధ్యానంలో ఉండగా ఆయన నుంచి శతరూప స్వయంభు మనువులు ఉద్భవించారు. వీరు ప్రధమ మిధునం ( జంట ). వీరిని సృష్టి మొదలు పెట్టండి అంటే " ఎక్కడ " అని అడిగారు. భూమిమీద అన్నారు బ్రహ్మ. భూమి ఎక్కడుంది అని అడిగారు వారు. భూమి లేదు అక్కడ. హిరణ్యాక్షుడు భూమిని తీసుకుని నీటిలోపలికి వెళ్ళి పోయాడు. ఇక్కడ పూజ్యులు సామవేదంవారు ఓ అద్భుత విషయం తెలియచేసారు. హిరణ్యాక్షుడు ఒక శాస్త్రజ్ఞుడు. భూమిని ఎత్తుకు పోయాడు అంటే భూమిని తన నిర్ణీతకక్ష్యనుంచి తప్పించాడు అని తెలుసుకోవాలి అన్నారు. అది అసురలక్షణం, ప్రకృతి విరుద్ధం, సృష్టిని అడ్డుకోవడానికి చేసిన పని. భూమి రక్షణకోసం బ్రహ్మ ధ్యానంలో కూర్చున్నారు. ఆయన నాశికలోనుంచి బ్రొటక...

శ్రీలలితాదేవీ నవరాత్రులు నేటినుంచి, శుభాకాంక్షలు అందరికీ - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏 " చిదగ్నికుండసంభూతా, దేవకార్యసముద్యతా " - అమ్మవారి అద్భుతనామాలు. ఇవి శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 4,5 వ నామాలు. " దేవకార్యార్ధమై అమ్మవారు అగ్నికుండంలోంచి పుట్టారు " అని. ఎప్పుడు, ఎలా అన్నది తెలుసుకుందాం. భండాసురుడు, అతని తమ్ముళ్ళు విశుక్రుడు విషంగుడు అనేవారు దేవతలను, ప్రజలను తమ మాయాబలంతో పీడించుకు తినేవారు. దేవతలు దెబ్బలు తిని తిని నిస్సత్తువతో బాధపడేవారు. వెళ్ళి అందరూ త్రిమూర్తులకు మొరపెట్టుకున్నారు కాపాడమని. భండాసురుడి శక్తులు తెలుసు కనుక అమ్మవారే దిక్కు అని త్రిమూర్తులు తలచి శివుడి ఆధ్వర్యంలో మహాయాగం చేసారు. శివుడు తన మూడవకన్ను ఫాలనేత్రంనుంచి అగ్నిని సృష్టించి హోమగుండంలో వేసారు.  యాగం అయాక ఆ అగ్నికుండంలోంచి అమ్మవారు ఉద్భవించారు. అందుకే అమ్మవారిని " చిదగ్నికుండసంభూతా " అని కొలుస్తున్నారు. ఆవిడే శ్రీలలితామహాత్రిపురసుందరీదేవి.  అలా వస్తూన్న అమ్మవారు ఎలా ఉన్నారో లలితోపాఖ్యానం ఇలా తెలియచేస్తూంది: పరాశక్తిశ్చ చంద్రాభా  చంద్రవచ్ఛీతలాకృతిః అక్షుస్రక్పుస్తకధరా  తైర్దేవై: అవలోకితా అమ్మవారు చంద్రుని వంటి కాంతుల్ని వెదజల్లుతూ, చల్లగా ఉం...

అమ్మవారు సగుణ, నిర్గుణ స్వరూపం. అర్ధనారీశ్వరం - చీమలపాటి సూర్యనారాయణ

 🙏 " శ్రీమాత్రేనమః "🙏 " సనకాది సమారాధ్యా " - అమ్మవారి అద్భుతనామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 726 వ  నామం. " సనకాది సమారాధ్యా " ఇంకొక అద్భుతనామం. సనకాదులచే సంపూర్ణంగా ఆరాధించబడినది అని అర్ధం. అమ్మవారి నామాల్లో స్మరింపబడుతున్నారంటేనే తెలుస్తూంది వీరి గొప్పదనం. వారు నలుగురు పిల్లలు - సనక, సనందన సనాతన, సనత్కుమారులు. ఇప్పుడు మనం " బాలమేధావులు " అంటూంటాం. ఈపదానికి ఆద్యులు వీరు. 4వ ఏటే అన్నివేదాలు చదువుకున్నవారు. బ్రహ్మ మానసపుత్రులు.  సృష్టికోసం వీరిని పుట్టిస్తే వీరు ఆధ్యాత్మికంగా ఉండి బ్రహ్మ మాటను వినలేదు. అప్పుడు బ్రహ్మ మనువులను పుట్టించారు సృష్టికోసం. ఈ సనకసనందనాదులు జ్ఞానసముపార్జనకై కైలాసానికి వెళ్ళారు ఓ రోజు. అక్కడ శివపార్వతులు నాట్యం చేస్తున్నారు, ప్రమధగణాలు ఆనందంతో తిలకిస్తూ ఊగి పోతున్నారు. ఇలా భార్యతో కూడి నాట్యాలు చేసే ఆయన జ్ఞానాన్ని ఏమి ఇస్తాడు అని తలచి వీరు తిరిగి వెళ్ళిపోతారు. వీరు అసంతృప్తితో తిరిగి వెడుతూంటే దారిలో పెద్ద మర్రిచెట్టు క్రింద ఓ పిల్లాడు కూర్చుని ఉంటే ఆయన ముందర పెద్దవయస్సు వారైన ఎందరో ఋషులు కూర్చుని ఉంటారు. ఆశ్చర్యంత...

అమ్మవారు సూక్ష్మాతిసూక్ష్మమయినవారు - ఎంత సూక్ష్మము అన్నది తెలుసుకోవడం కష్టమే - చీమలపాటి సూర్యనారాయణ

 🙏" శ్రీమాత్రేనమః"🙏 " పరమాణుః " - అమ్మవారి అద్భుతనామాలు. శ్రీ లలితాసహస్రరహస్యనామాల్లో 808 వ నామం. " పరమాణుః " అన్నది ఒక అత్యద్భుతనామం. అణువు అంటే సూక్ష్మమైనది. పరమాణువు అంటే అణువు కంటే పరమైనది అంటే అంతకన్నా చిన్నది అని అర్ధం. అంటే అర్ధం సూక్ష్మాతిసూక్ష్మమైనది అని. ఇంద్రియాలకు గోచరించేదానిని స్థూలం అంటారు, కనబడని దానిని సూక్ష్మం అంటారు. మరి అమ్మవారు ఎంత సూక్ష్మమైనది?. ఆవిడ ఎంత సూక్ష్మమైనదో తెలుసుకోవడం సాధ్యమయే పనికాదు. మనం ఎంత చిన్నది అనుకుంటే అంతకన్నా చిన్నది అమ్మవారు. మొదట అణువే చిన్నదనుకున్నారు. యాజ్ఞవల్క్య మహర్షి ప్రతిపాదించిన సూత్రం " న ఇతి " అంటే ఇదికాదేమో అని తలచి ఇంకా సూక్ష్మమైనది అమ్మవారు అనుకుని ప్రయత్నం చేస్తే ఇంకా చిన్నవి కనిపెట్టబడ్డాయి. అదికూడా " న ఇతి " అనుకుని ప్రయత్నాలు మొదలెట్టారు. 2012 లో " హిగ్స్ బోసన్ " ని కనుక్కుని దానికి " గాడ్ పార్టికల్ " అని పేరుపెట్టారు. ఆరోజు విలేకరులు అడిగారు " అలా పేరు పెట్టారు, దేవుడు లేడని నిరూపిద్దామనా " అని. వారు అన్నారు " లేడనికాదు, ఉన్నాడనికాదు, సైన్...