ప్రయత్నం అంటూ మొదలుపెడితే మిగతాది అమ్మవారే చూసుకుంటారు - చీమలపాటి సూర్యనారాయణ
🙏"శ్రీమాత్రేనమః"🙏 " ఛందస్సారా " - అమ్మవారి అద్భుతనామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 844 వ నామం. " సారం " అంటే తాత్పర్యం, ఉద్దేశ్యం, బలం అని అర్ధం. ఛందోబద్ధం కనుక వేదం పేరు ఛందస్సు. ఛందస్సు/వేదం యొక్క సారమే అమ్మవారు, గాయత్రి. అందుకే " గాయత్రీం ఛందసాం మాతా " అని ప్రార్ధిస్తాం. శృతులు స్మృతులు పురాణాలు ఆగమశాస్త్రాలు అన్నీ అమ్మవారి స్వరూపాలే. రసాయనకం, భౌతికం, గణితం అన్నింటినీ " శాస్త్రం " అంటాం. అన్నీ అమ్మవారే, అందుకే ఓ క్రమపద్ధతిలో ఉంటాయి ఛందస్సులా. ఇలాంటి శాస్త్రాలన్నీ వేదంలో ఉన్నా వేదపారాయణ గమ్యం మాత్రం అమ్మవారే. " మననాత్ త్రాయతే ఇతి మంత్రః " - ఏ మంత్రం జపం చేసినా రక్షణ దొరుకుతుంది. కాని అది అంత సులభంకాదు. ఓ వెయ్యి గాయత్రి చేద్దామని కూర్చుంటే పదిసార్లు చేసేటప్పటికే మనస్సు ఎక్కడికో వెళ్ళిపోతుంది. పరవాలేదు మళ్ళీ మనస్సును లాక్కొచ్చి కూర్చోపెట్టడమే. మనస్సు ఎక్కడెక్కడికో పోతూన్నా మంత్రం లోపల తిరుగుతూ ఉంటుంది కనుక ఫలితం తప్పకుండా ఉంటుంది. పరమాత్మ " అభ్యాసేనతు కౌంతేయ వైరాగ్యేణచ గృహ్యతే ( భ.గీత 6:35 ) " - " వైర...