వేదో2ఖిలమూలం - మన వేదాలే అన్నిటికీ మూలం - చీమలపాటి సూర్యనారాయణ
🙏" శ్రీరస్తు శుభమస్తు "🙏 జాతకాలు నమ్ముతారేమిటో భారతీయులు అంటారు కొందరు మనవారు కూడా. ఇంకో 100 సం.ల తరువాత కూడా సూర్యగ్రహణం చంద్రగ్రహణం ఏరోజున ఎన్నిగంటలకు వస్తుందో కచ్చితంగా చెప్పే మన పండితులు చెప్పే జాతకాలు నమ్మకుండా ఎలా ఉండగలం. వేల సంవత్సరాల క్రితమే భూమికి సూర్యుడికి మధ్యనున్న దూరాన్ని కచ్చితంగా ( హనుమాన్ చాలీసా ) చెప్పిన భారతీయ విజ్ఞానం అద్భుతం అని నమ్మకుండా ఎలా ఉండడం. తంజావూర్ బృహదీశ్వరాలయం ఎత్తు 200 అడుగులు. దీని పునాది ఎంతో ఊహించగలమా?. 4 అడుగులు. ఇప్పుడు 50 అడుగుల ఎత్తైన బిల్డింగు కడితే పునాది 8/10 అడుగులు వేస్తున్నారు. గుడిపైన 3/5/7 కలశాలు ఉంటాయి. అవి నిలబెట్టిన భాగాన్ని విమానం అంటారు. ఈగుడియొక్క ఆ విమానం శిల బరువు ఊహించగలమా?. 82 టన్నులు. అసలు అంత బరువు రాయిని అక్కడకు ఎలా తీసుకుని వెళ్ళారన్నది ఇప్పటికీ వింతే. కుతుబ్మీనార్ అసలు పేరు విష్ణుస్తంభం. అసలు దానిలో ఏ మెటల్స్ వాడారో, ఇంతకాలం తుప్పుపట్టకుండా ఎలా ఉందో ఇప్పటికీ వింతే. తక్షశిల విశ్వవిద్యాలయంలో 10వేల మంది విద్యార్ధులు ప్రపంచనలుమూలల నుండి వచ్చి 60 రకాల విద్యలను అభ్యసించేవారు. ఇప్పుడు ఉన్నతచదువులకై విదేశాలకు వెడుతున్...