Posts

Showing posts from September, 2024

అమ్మవారిని తలచుకుంటే చాలు అనుగ్రహిస్తారు - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏 " భావనాగమ్యా " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 113 వ నామం.  " భావనాగమ్యా " అంటే " భావనా + గమ్యా " భావనతో పొందగలిగినది అని అర్ధం చెబుతూ ఇంకో అర్ధం కూడా తెలియచేసారు. భావనా + అగమ్యా అంటే కేవలం భావనతో పొందలేనిది అమ్మవారు అని. అమ్మవారి అనుగ్రహం పొందడం అంత సులభం కాదని. సోమదేవుడు అనే పండితుడు ఉండేవారు పాండ్యదేశంలో. అమ్మవారి పరమభక్తుడు. ఎప్పుడూ ఆవిడ ధ్యాసే. ఆయన పూర్వీకులు ఏ అవసరం వచ్చిందో కాని కొందరి దగ్గర అప్పుతీసుకున్నారు. అది వడ్డీలమీద వడ్డీలతో కలిసి ఎక్కువమొత్తం అయింది. ఈయనకు అది భారమయిపోయింది. ఓ రోజు ఇంక ఎలాగైనా వసూలు చేసుకోవలసిందే అని వచ్చి అరుగుమీద కూర్చున్నారు అప్పులు ఇచ్చినవారు. ఆయన భార్య " ఆయన పూజలో ఉన్నారు, కూర్చోండి " అని చెప్పి భర్తతో " వారు వచ్చి కూర్చున్నారు " అని చెప్పగానే ఆయన మనస్సు వ్యాకులం చెందింది. అప్పుడు ఆయన అమ్మవారి సహస్రనామపూజలో " అపర్ణ " నామం దగ్గర ఉన్నారు. ఒక్క క్షణం మనస్సులో " అమ్మా అపర్ణ అంటే ఋణములు తీర్చునది అనికదా, నన్ను ఇలా వదిలేసేవిటమ్మా " అన...

సంసారం సాగరం దుఃఖం - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏 " భవరోగఘ్నీ " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 842 వ నామం . " భవరోగఘ్నీ " అంటే సంసారమనెడి రోగమును పోగొట్టునది. భవ అంటే సంసారం. ఇక్కడ భవరోగం అన్నారు. అంటే సంసారం పూర్తిగా ప్రక్కన పెట్టనక్కరలేదు అనుకోవాలి. ఏ రోగానికి అయినా మందు ఉంటుంది, నయమవడానికి. సంసారంని రోగంలా భావించి జాగ్రత్త పడమని. మూక శంకరులు స్తుతిశతకంలో ఇలా ప్రార్థిస్తారు: " నతానామ్మదానాం........... . స్మరమధనజీవాతుకలికాం " " సంసారపు సంకెలలో కట్టుబడుటచేత వ్యాకులత చెంది బుద్ధి మందగించినవారు నమస్కరించినంత మాత్రమునే వారి అజ్ఞానమను చీకటిని తొలగిస్తున్నావు కదమ్మా " అని  ఇక్కడ అర్ధం చేసుకోవలసినది సంసారం ఆనందదాయకంగా, ఆకర్షణీయంగా ఉండేలా చూస్తారు అమ్మవారు. సంసారబాధలతో సతమతమయే వారికి మాత్రం చికిత్స చేస్తారు. అగ్నిద్యోతనుడికి లేఖ ఇచ్చి కృష్ణపరమాత్మకి ఇవ్వమని పంపించింది రుక్మిణీదేవి. లేఖలో విదర్భకు వచ్చి తనను తీసుకుని వెళ్లి వివాహం చేసుకోమని కోరింది. అదెలా కుదురుతుంది, పిలవనిపేరంటం, బావుండదేమో అనలేదు పరమాత్మ. విదర్భ వచ్చారు, రధం మీద రుక్మిణీదేవిని తీసు...

అమ్మవారి నేర్పరితనం సృష్టిలో ప్రతీ విషయంలోనూ కనబడుతుంది - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏 " విదగ్ధా " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 904 వ నామం .  " విదగ్ధా " అంటే మంచి నేర్పు గలది. అమ్మవారు చాతుర్యశీల - చాతుర్యం కలిగినది. అంత నేర్పరి కాకపోతే సృష్టి అంతా ఇంత అద్భుతంగా ఎలా ఉంటుంది.  ఓ మొక్కజొన్న పొత్తిని చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. ఎవరో జాగ్రత్తగా గీతలు గీసి అతికించినట్లుగా ముత్యాలలాంటి తెల్లని గింజలు. అవి ఆరోగ్యంగా పాడయిపోకుండానూ మనకు మంచిరుచికరంగానూ ఉండేలా పల్చటి 9/10 పొరలతో కప్పి ఉండడం.  ఆహారం లేనిదే జీవితం లేదు. ఆహారం రుచికరంగానూ సంతృప్తిగానూ ఉండటంకోసం రకరకాల కూరగాయలు, ఆకు కూరలు, పండ్లు. ఎంత అద్భుతం. పక్షులు కట్టిన గూళ్ళు చూస్తే అబ్బురంగా ఉంటుంది. పక్షులలో ఎంతటి నేర్పు పెట్టారో అనిపిస్తుంది. సాలెగూడు చూసినా, గొంగళీపురుగు సీతాకోకచిలుకగా మారడం గమనించినా, రకరకాల పూవులను, పక్షులను, సూక్ష్మజీవులను చూసినా ఎంత ఆశ్చర్యం వేస్తుందో. సముద్రాలలోని రకరకాల చేపలు, వింత జంతువులను చూస్తే అసలు వాటిని ఎందుకు సృష్టించినట్లు, వాటి జీవితలక్ష్యం ఏమిటి అని ఆలోచనచేస్తే ఆశ్చర్యం కలుగుతుంది. కొన్ని జీవులు మనకు మేలు చేసేవి, కొన...

అన్నంని నిందించకూడదు, గౌరవించాలి - చీమలపాటి సూర్యనారాయణ

 🙏 " శ్రీరస్తు శుభమస్తు " 🙏 " అన్నం న నింద్యాత్   అన్నం నపరిచక్షీత "          - తైత్తిరీయ ఉపనిషత్తు అన్నం ని నిందించకూడదు అని తెలియచేస్తున్నాయి శాస్త్రాలు. జీవుడికి శక్తిని తేజస్సుని ఇస్తూన్నది బ్రహ్మం కదా. మరి మనం తినే తిండే కదా మనకు శక్తిని తేజస్సుని ఇస్తూన్నది. అందుకే ఉపనిషత్తులు " అన్నం పరబ్రహ్మ స్వరూపం " అని తెలియచేస్తున్నాయి.  అందుకే మన సనాతనధర్మం ఏ తినుబండారాన్నైనా పరమాత్మకి నివేదించి తినమన్నారు. అప్పుడు అది ప్రసాదం అవుతుంది, ప్రత్యేక రుచి వస్తుంది. ప్రసాదంలో మనం లోపాలు వెదకం. అలాగే చిన్నప్పటినుంచే పిల్లలకు అన్నం మీద భక్తిని గౌరవాన్ని అలవాటుచెయ్యాలి. దేనినైనా ఇష్టంగా తింటే వంటికి పడుతుంది లేకపోతే నిరుపయోగమవుతుంది. మా రెండో అన్నయ్యతో సాధారణంగా భోజనం చేసేవారం కాదు పిల్లలం. ఇంట్లో రకరకాల సైజుల పేకబెత్తాలు ఉండేవి. వాటిని ఎక్కువగానే వాడేవారు మా అన్నయ్య. అతని నియమం ప్రకారం కాళ్ళు కడుగుకుని విస్తరిముందు కూర్చుంటే కాళ్ళు ఆరేలోపు భోజనం అయిపోవాలి. భోజనం చేస్తూ గట్టిగా మాట్లాడినా, నవ్వినా, కామెంట్స్ చేసినా పేకబెత్తం తొడమీద నాట్యం చేసేది, వాత ( పట్టు...

మరణించే వరకూ ఇష్టమయినది కడుపునిండా తినడం అదృష్టం - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏 " అన్నదా " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 669 వ నామం. " అన్నదా " అంటే జీవులకు అన్నమును ఇచ్చునది అని అర్ధం. అన్నం అంటే తినుబండారం. వేలకోట్లు ఉన్నా తెల్లవారితే కావలసినది తిండే. ఆశ్చర్యకరం ఏమిటంటే పేదవాడయినా కోటీశ్వరుడయినా తినగలిగేది కడుపు పట్టినంతే. కొద్దిగా ఎక్కువ తిన్నా అనారోగ్యంతో బాధపడాలి. మనుషులకు, జంతువులకు, పక్షులకే కాదు క్రిమికీటకాలకు కూడా ఆహారం అవసరమే. కొన్ని క్రిమికీటకాలు ఏమి తిని బ్రతుకుతున్నాయో కూడా తెలియదు. అంత అద్భుతంగా ఆహారాన్ని సమకూరుస్తున్నారు అమ్మవారు. ఆహారం వృధా చేస్తున్నారు, పాలు అభిషేకాలు చేసి, పుట్టలలో పోసి వృధా చేస్తున్నారు అని కొందరు విమర్శలు చేయడం చూస్తూంటాం. మన ఋషులు ఇవన్నీ ఆలోచించకుండా ఏర్పాటు చేసినవి కావు. ఎన్నో క్రిమికీటకాలు, సూక్ష్మజీవులు ఇలా పడేసిన ఆహారాన్ని తిని జీవిస్తున్నాయి. పరమాత్మ గీతలో ఈ ఆహారం గురించి అద్భుత విషయాలు వివరించారు: " ఆహారస్త్వపి సర్వస్య    త్రివిధో భవతి ప్రియః,   యజ్ఞస్తపస్తథా దానం    తేషాం భేదమిమం శృణు "             - భ.గీత 17:7 " ప్రజల...

మన కర్మఫలాలను మనమే అనుభవించాలి - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏 " కార్యకారణనిర్ముక్తా " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 862 వ నామం. " కార్యకారణనిర్ముక్తా " అంటే కార్యములచేతను, కారణములచేతను విడువబడినది. ఏదయినా కార్యం చేయాలంటే దానికి ఓ కారణం ఉండాలి. కారణంలేని కార్యం ఉండదు. ఓ ఊరు వెడుతున్నామంటే దానికి ఓ కారణం ఉంటుంది. ఓ ఉద్యానవనంకి వెళ్ళినా వ్యాయామం అనో మానసిక ప్రశాంతత అనో కారణం ఉంటుంది. ప్రతీరోజూ కంచిపరమాచార్య గారు చంద్రమౌళీశ్వరుడికి అభిషేకం, పూజ చేస్తారు. దానికి కూడా " లోకకళ్యాణం " కోసం అనే కారణం ఉంటుంది. కారణం లేని కార్యం ఉండదు. అమ్మవారికి కావలసిందీ లేదు, పొందవలసినదీ లేదు. అంటే కారణమేమీ ఉండదు. కారణం లేనప్పుడు కార్యమూ ఉండదు.  పరమాత్మ గీతలో ఇలా అంటారు: " మయాఽధ్యక్షేణ ప్రకృతిః    సూయతే సచరాచరమ్,   హేతునానేన కౌన్తేయ    జగద్విపరివర్తతే " " ఓ అర్జునా! జగత్తుకు అంతా నేను అధ్యక్షుడను. ఈ చరాచర ప్రకృతి, అందులోని సృష్టి నా ఆధ్వర్యములోనే జరుగుతున్నాయి. ఈ జగత్తు అంతా ఒక నియతి ప్రకారం ప్రవర్తిస్తూ ఉంది. నేను మాత్రం సాక్షిగానే ఉంటాను ఏమీ చేయను " అని. అంటే కారణమూ ...

భక్తితో తలచుకుంటే చాలు అనుగ్రహిస్తారు అమ్మవారు - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏 " ధ్యానగమ్యా " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 641 వ నామం .  " ధ్యానగమ్యా " అంటే మాటిమాటికీ ధ్యానముచేతనే పొందదగినది అని అర్ధం. ధ్యానం అంటే మనస్సును అదుపులో ఉంచుకోవడం. అది అంత సులభం కాదు. మనస్సు సంకల్పవికల్పాలు రెండూ చేస్తూ మాయ చేస్తుంది.  పరమాత్మ గీతలో ఇలా అంటారు: " అథ చిత్తం సమాధాతుం        న శక్నోషి మయి స్థిరం,   అభ్యాసయోగేన తతో           మామిచ్ఛాప్తుం ధనంజయ "                  - భ.గీత 12:9 మనస్సును సుస్థిరముగా నాయందే నిల్పుటకు సమర్ధుడవు కానిచో అర్జునా, అభ్యాసయోగముద్వారా నన్ను పొందుటకు ప్రయత్నింపుము. అభ్యాసం అంటే భగవంతుని నామగుణముల శ్రవణం, కీర్తనం , మననం, అట్లే శ్వాసద్వారా జపము, భగవత్ప్రాప్తికి సంబంధించిన శాస్త్రముల పఠనం మొదలగు క్రియలను భగవత్ప్రాప్తికై  మాటిమాటీకి చేయుటనే అభ్యాసము అంటారు. త్యాగయ్య 96 కోట్ల రామజపం చేసారంటే ఆశ్చర్యం వేస్తుంది. కాని మొదలుపెట్టి చేయగా చేయగా అదే వ్యాపకం అయిపోతుంది. వేరే ధ్యాసే ఉండదు. అలా చేయడానికి ...

అపాత్రదానం కుదరదంది శాస్త్రం - చీమలపాటి సూర్యనారాయణ

 🙏" శ్రీరస్తు శుభమస్తు "🙏 దానం - దయ అంటే ఏమిటి? అన్నంలేనివారికి అన్నం, నీరులేనివారికి నీరు, వస్త్రం లేనివారికి వస్త్రం ఇవ్వడాన్ని దయ అంటారు. దానం అంటే సంకల్పం చేసుకుని గ్రహదోషానికో మరొకపాపపరిహారానికో చేసేది. తెలియకుండా అందరూ కొన్ని పాపాలు చేస్తూంటారు. వాటి పరిహారంకోసమే వీటిని చెయ్యమన్నారు. అంతేకాని 4 హత్యలు చేసి 200 మందికి అన్నం/వస్త్రం దానం చేస్తానంటే కుదరదు. పాపఫలం పుణ్యఫలం వేరువేరుగా అనుభవించవలసి వస్తుంది. అంతేకాని బేలన్స్ షీట్ లో లాగ " నెట్ " ఫలం ఉండదు. దానం చేసేవారూ తీసుకునేవారూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. దానం తీసుకునే ఆయన యోగ్యుడయి ఉండాలి. దానం తీసుకుంటే దోషాలు వస్తాయి. దాని విరుగుడుగా జపమో తపస్సో లేక వేరొక పరిహారమో చేసుకోవాలి. ఒకాయనకి కిడ్నీకాని కన్నుకాని కావాలి. ఎలా వస్తుంది. ఇంకొకతను పోగొట్టుకుంటే వస్తుంది. ఇతని పాపం పోవాలంటే ఇంకొకతను ఆ పాపాన్ని మొయ్యాలి. అందుకని జాగ్రత్తగా ఉండాలి. " హిరణ్యం భూమిమశ్వం    గామన్నం వాసస్తిలాన్     ఘృతం ప్రతిగృహ్ణన్ అవిద్వాంసు    భక్తీవంతి దారువత్ " అన్నాయి శాస్త్రాలు. " అపాత్రదానం " కుదరదంది శాస్త్రం. క...

అమ్మవారి చేతిలో దండం మనకు రక్ష - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏 " వజ్రిణీ " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 944 వ నామం . " వజ్రిణీ " అంటే వజ్రాయుధము గలది. వజ్రిణీ అంటే ఇంద్రాణి. ఇంద్రుడి భార్య. వేదం పూజించమన్న దేవతలు అగ్ని, వరుణుడు, వాయువు వంటి ప్రకృతిదేవతలతో బాటు ఇంద్రుడు, రుద్రుడు అని తెలియచేస్తూంది. మహామంత్రపుష్పంలో " త్వం యజ్ఞస్త్వం వషట్కారస్త్వం ఇంద్రస్త్వగుం రుద్రస్త్వం విష్ణస్త్వం బ్రహ్మస్త్వం ప్రజాపతిః " అని కీర్తిస్తాం. ఇంద్రుడు అనగా మనం పురాణాలలోనూ సినీమాలలోనూ చూసే ఆయనకాదు, అది ఒక పదవి మాత్రమే, మారుతూ ఉంటారు. కాని వేదాలలో ఉన్న ఇంద్రుడు జీవుల ఇంద్రియాలకు అధిపతి, నియంత్రించేవారు. వేదం ఇంద్రుడు అంటే పరమేశ్వరుడు అని తెలియచేసింది. భగవత్ శాసనాన్ని వజ్రం అంది వేదం. దండం పట్టుకోవడం పెద్దల లక్షణం. ఋషులకు కూడా దండం ఉంటుంది.  " మహత్ భయం వజ్రముద్యతం " - మహా భయంకరమైనది వజ్రాయుధం. శ్రీ సూక్తంలో అమ్మవారిని ఇలా స్తుతిస్తాం: " ఆర్ద్రాం యః కరిణీం యష్టిం     సువర్ణాం హేమమాలినీం " ఇందులో యష్టిం అంటే దండం. దండంని పట్టుకుని ఉంటారు అమ్మవారు. మనం తరచుగా ఏకదండి, ...

అమ్మవారు పాపాలను నాశనం చేస్తారా? - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏 " పాపనాశినీ " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 167 వ నామం .  " పాపనాశినీ " అంటే భక్తుల పాపాలు పోగొట్టునది. అదెలా సాధ్యం. అమ్మవారు " పద్మపత్రమివాంభసా " అంటే తామరాకు మీద నీటిబొట్టులా ఉంటారు కదా. మన కర్మలకు మనమే బాధ్యులం కదా. పాపాలను ఎలా పోగొడతారు. ఎంత పాపాత్ముడయినా తప్పు తెలుసుకుని పరివర్తన చెంది అమ్మవారిని శరణాగతి కోరి కఠిన సాధన చేస్తే పాపాలను నశింపచేస్తుంది. ముద్గలుడు అని ఓ మహర్షి ఉండేవారు. ఆ సమయంలోనే ఓ దొంగ ఉండేవాడు. ఆ దొంగ క్రూరుడు, పరుల డబ్బుమీదే బ్రతికేవాడు. ప్రజాధనం, ప్రభుత్వ సంపద, ప్రకృతివనరులు అన్నీ దోచేసేవాడు. ఎంత నీచుడంటే ఎవరయినా బయటకు వెడుతూంటే ఇంట్లో ఏదయినా తిని వెడతారు, వీడు తినకుండానే వెడతాడు. ఎందుకంటే ఎవరో ఒక బాటసారి ఎదురుపడకపోడు కనుక వాడిని కొట్టి అవసరమయితే చంపేసి వాడి దగ్గరున్నది తీసుకుని తినడం అలవాటయిపోయింది వీడికి. ఓ రోజు అలాగే బయలుదేరాడు. ఆశ్చర్యంగా మధ్యాహ్నం దాకా ఎవరూ ఎదురుపడలేదు. బాగా ఆకలిగా ఉండడంతో ఏదయినా చిన్న జంతువు దొరుకుతుందేమో చంపి తిందామని అడవిలోకి వెళ్ళాడు. ఆశ్చర్యకరంగా ఏదీ దొర...

సనాతనధర్మాన్ని కించపరిచేవారికి పోయేకాలం దగ్గరకు వచ్చినట్లే - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీరస్తు శుభమస్తు"🙏 " మూలం హి విష్ణుర్దేవానాం    యత్ర ధర్మః సనాతనః,   తస్య చ బ్రహ్మగోవిప్రాస్తపో    యజ్ఞాః సదక్షిణాః "          - భాగవతం 10:04:39 " తస్మాత్సర్వాత్మనా రాజన్    బ్రాహ్మణాన్ బ్రహ్మవాదినః .    తపస్వినో యజ్ఞశీలాన్    గాశ్చ హన్మో హవిర్దుఘాః "            - భాగవతం 10:04:40 మహాభాగవతంలోని అద్భుత శ్లోకాలు ఇవి. కనీసం వేల సంవత్సరాల క్రితం వ్రాసినవి అయినా నేటికీ ఇందులో తెలియచేసినదే జరుగుతూంది. తనను చంపే కృష్ణుడు ఎక్కడ పెరుగుతున్నాడో తెలియదు కంసుడికి. అందుకని రాక్షసులని అన్ని దిక్కులకూ పంపుతూ కంసుడు " వేదము, ఆవు, బ్రాహ్మణుడు, తపస్సు, యజ్ఞము ఎక్కడ ఉంటారో అక్కడ సనాతనధర్మం వెల్లివిరిస్తూ ఉంటుంది. అక్కడ విష్ణువు ఉంటాడు. ఇవన్నీ విష్ణువు శరీరభాగాలే, విష్ణువే సనాతనధర్మం. విష్ణువుని దెబ్బ కొట్టాలంటే సనాతనధర్మంని నశింపచేయాలి. అంటే వేదాలని, ఆవులను బ్రాహ్మణులను, తపస్సును, యజ్ఞాలని లేకుండా చేయాలి. వెళ్ళి ప్రతీచోటా వీటిని నశింపచేయండి " అని ఆదేశిస్తాడు.  ఈనాడు కూడా సనాతనధర్మం...

ఒక చెంపమీద కొడితే ఇంకో చెంప చూపమనలేదు సనాతనధర్మం - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏 " సర్వానుల్లంఘ్యశాసనా " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 995 వ నామం .  " సర్వానుల్లంఘ్యశాసనా " అంటే బ్రహ్మేంద్రాదులకు కూడా తిరస్కరింపశక్యముకాని ఆజ్ఞ కలది అని. ధర్మం పాటిస్తూన్నంతసేపే అమ్మవారు అవ్యాజకరుణామూర్తి. కొద్దిగా ప్రక్కకు జరిగినా ఛండికయే. ఆవిడ ఛండశాసన. ఆవిడ శాసనాలను అతిక్రమిస్తే ఇంతే సంగతులు, దహనానికి అవయవాలు కూడా దొరకవు.  సనాతనధర్మం అంత మెత్తనయినది కాదు, ఓ చెంపమీద కొడితే ఇంకోచెంప చూపెట్టు అనలేదు, అనబోదు. వేదాలలో " అభిచారమంత్రాలు " అని ఉన్నాయి. ధర్మానికి ఎవరయినా విపరీతమైన హాని చేస్తున్నప్పుడు అతని నాశనాన్ని కోరుతూ ఈ నామాలతో హోమం చేస్తారు.  ఇది జీవులకే కాదు, దేవతలకు కూడా తప్పదు. పార్వతీదేవి సరదాగా శివుడి కళ్ళు మూసింది, క్షణమే. అక్కడ క్షణం, కాని ఇక్కడ ఆ సమయం కొన్నివేల సంవత్సరాలు. సూర్యచంద్రులు శివుడి కళ్ళు. వేల సంవత్సరములు సూర్యచంద్రులు లేకపోతే పరిస్థితి ఏమిటి. సృష్టి అంతా ఓ కుదుపుకు లోనయింది. శివుడు ఆగ్రహంతో " పోయి తపస్సుచేసుకుని ప్రక్షాళన చేసుకో " అని కోప్పడ్డారు పార్వతీదేవిని. " యదా ...

అన్నదాన పుణ్యం ఎవరెవరికి లభిస్తుంది? - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీరస్తు శుభమస్తు"🙏 " న దైవాంశో దదాత్యన్నం    న రుద్రః రుద్రమర్చతి,   నా నృషిః కురుతే కావ్యం    న విష్ణుః పృథివీ పతిః " " దైవాంశ లేని వాడు అన్నదానం చేయలేడు. రుద్రాంశ లేని వాడు దైవపూజ చేయలేడు. ఋషికాని వాడు కావ్యమును వ్రాయలేడు. విష్ణువు అంశలేని వాడు రాజుకాలేడు‌ " అని భావం. అన్నదానం చేయడం అంత చిన్న విషయం కాదు. మాయ దానిని చేయనివ్వదు. ఒకసారి అన్నదానం చేయడం వలన ఎవరెవరికి పుణ్యం కలుగుతుందో చూద్దాం. అన్నదానం చేద్దాం అని సంకల్పం చేసినవారు, ధనం సమకూర్చినవారు, సరుకులు తెచ్చినవారు, వండినవారు, వడ్డించినవారు, తిన్నతరువాత శుభ్రం చేసినవారు, సరుకులు తేవడంనుంచి శుభ్రం చేసేవరకూ ఏర్పాట్లు చేసినవారు - వీరందరికీ అన్నదానపుణ్యంలో భాగం వస్తుంది.  ఈ పుణ్యాత్ములందరూ ఒకచోట చేరితేనే అన్నదానం సాధ్యమవుతుంది. దానికి దైవాంశ తోడవాలి. అందుకే దైవాంశ లేనివాడు అన్నదానం చేయలేడు అని తెలియచేస్తూంది సుభాషితం. సృష్టికి అన్నమే మూలం. ఇదే " పురుష శక్తి/స్త్రీ అండం " గా మారుతుంది. అందుకే అన్నం పరబ్రహ్మ స్వరూపం అని తెలియచేస్తున్నాయి ఉపనిషత్తులు.  విష్ణుసహస్రంలో స్వామిని " అన్నం అన్న...

శివుడు స్మశానంలో ఉండడానికి కారణం ఏమిటి? - చీమలపాటి సూర్యనారాయణ

 🙏 " శ్రీరస్తు శుభమస్తు " 🙏 శివుడిని ఋషులు అడిగారు " స్వామీ అందమైన కైలాసంలో పార్వతితో హాయిగా గడపక ఇలా శ్మశానాలలో తిరుగుతూంటావు, ఎందుకని " అని. స్వామి అన్నారు " జీవుడు పాపప్రక్షాళనకోసం, జన్మరాహిత్యం కోసం జన్మ తీసుకుని చాలా కష్టపడతాడు. వీలయినన్ని పుణ్యకార్యాలు చేస్తాడు. పెళ్ళిచేసుకుని కొందరికి జన్మనిచ్చి వారికోసం నానాపాట్లూ పడతాడు. తన సుఖాన్ని , తనముక్తినీ కూడా మరచిపోయి సంతానంకోసం ఆస్తులు సంపాదించిపెడతాడు. చివరికి చనిపోయాక జీవుడితో ఇంటిగుమ్మందాకా భార్య, ఊరిచివరిదాకా కొందరు, శ్మశానికి కొందరూ వస్తారు. దహనం అవగానే ఒక్కొక్కరు తిరిగి వెళ్ళిపోయాక జీవుడు ఒంటరిగా మిగిలిపోయి తను ఎంత మూర్ఖుడో, సమయాన్ని ఎలా వ్యర్ధం చేసుకున్నాడో తలచుకుని కుమిలిపోతాడు. ఆసమయంలో అతన్ని ఓదార్చడానికి ఎవరూ ఉండరు. అందుకని అటువంటివారిని దగ్గరకు తీసుకుని ఓదార్చడానికే నేను శ్మశానాల్లో తిరుగుతూ ఉంటాను " అని ఎంతటి అద్భుత విషయం. అవ్యాజకరుణామూర్తి స్వామి. బయటివారే " ఇంతచేసాను, గౌరవంలేదు " అని బాధపడే అవకాశాన్ని ఇస్తే ఎవరికీ మంచిదికాదు. మరి పితృదేవతలు " అయ్యో ఇంతకష్టపడి పిల్లలని వృద్ధి...

అమ్మవారి " మాయ " లేకపోతే జీవితం దుర్భరం - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏 " మాయా " - అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 716 వ నామం. " మాయ " అంటే " ఊహకందనిది ". అమ్మవారి లీలలను మనమెలా ఊహించగలం. ఏదయినా ఒక విషయం ఎలా జరిగిందో ఊహకి అందకపోతే " మాయ " అని అనుకుంటాం. సృష్టిలో ఎన్నో వింతలు గమనిస్తూంటాం, అలా వింతలు లేకపోతే అందమే లేదు. ఈ " మాయ " జీవుల మంచికోసమే. కొన్ని విషయాలను తట్టుకోలేం. ఉదా: చాలా కావలసినవారు ఒకరు కాలం చేస్తే తట్టుకోలేరు. కాని అది ఒకటి రెండు రోజులే. మాయా ప్రభావంతో బయటపడిపోతారు, అది జరిగిందన్న స్పృహ కూడా ఉండదు. లేకపోతే నిరాశా నిస్పృహలకు లోనవడం, సృష్టి అంతరించడం జరుగుతుంది. ఈ మాయ తొలగుతేనే అమ్మవారు తెలుస్తారు. కాని మహామహులకు కూడా మాయ తొలగడం కష్టమే. భగవద్గీతలో పరమాత్మ అంటారు: "దైవిహ్యేషా గుణమయీ   మమ మాయా దురత్యయా"                 - భ.గీత 7:14 అంటే " త్రిగుణాల ప్రభావం వలన నా మాయ నుంచి తప్పించుకోవడం ఎవరికీ సాధ్యం కాదు " అని. కాని ఆయన్ని/అమ్మవారిని ఆశ్రయించి శరణుకోరినవారు మాయను దాటడానికి అవకాశం ఉంది.  అర్జునుడు అంటాడు " మహామహులకే ఈ మనస...

మన నాట్యం శాస్త్రీయం, లాస్యం, ప్రశాంతత - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏 " లాస్యప్రియా " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 738 వ నామం . " లాస్యప్రియా " అంటే నాట్యమును ఇష్టపడునది అని అర్ధం. లాస్యం అంటే నాట్యం. నాట్యం అన్నా నాట్యం చేసేవారన్నా అమ్మవారికి ఇష్టం. ఆదిదంపతులు చేసే నాట్యం ఒక అద్భుతం. వారి నాట్యం చూసి ఆనందించడానికి బ్రహ్మ విష్ణువులతో సహా దేవతలందరూ కైలాసానికి చేరుకుంటారుట.  కృష్ణుడు గోపికలతో చేసే " రాసలీల " భక్తినే కాకుండా తత్వాన్ని, అద్వైతాన్ని బోధిస్తుంది.  ఈ నాట్యవిజ్ఞానాన్ని నందికేశ్వరుడు గ్రహించి బ్రహ్మకు తెలియచేసారు. బ్రహ్మ నుంచి భరతముని తెలుసుకుని గ్రంధస్తం చేసారు. అది భరతనాట్యంగా విశ్వఖ్యాతి పొందింది. ఈ గ్రంథంలో నాట్యానికి సంబంధించిన విజ్ఞానము, మెళకువలు అన్నీ ఉండడంతో దీనిని నాట్యశాస్త్రం/నాట్యాంగం/నాట్యవేదం అని పిలుస్తారు. నాట్యంలో శరీరంలోని అన్ని అంగాలూ, కళ్ళతో సహా, తమ పాత్రను పోషిస్తాయి. చేసేవారికి భగత్సేవాఫలంతో బాటు మానసిక ప్రశాంతత లభిస్తుంది. చక్కటి వ్యాయామం కూడా. చూసేవారికి ఆధ్యాత్మికభావం పెరిగి మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఈ సనకసనందనాదులు జ్ఞానసముపార్జనకై కైల...

మన వాజ్మయం తాత్వికమే కాదు, శాస్త్రీయం కూడా - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీరస్తు శుభమస్తు"🙏 ఈరోజు భాద్రపద శుద్ధ ద్వాదశి, వామనజయంతి. అదితి కోరికపై శ్రీమహావిష్ణువు లోకకల్యాణం కోసం వామనుడుగా అవతరించారు. 8 ఏళ్ళ బాలకుడుగా అయిపోయాడు పుట్టగానే. బ్రాహ్మణుడు దానం తీసుకోవాలంటే ఉపనయనం అయి ఉండాలి. వామనుడు బలి దగ్గరకు వెళ్ళి దానం అడగాలి. అప్పటికప్పుడు ఉపనయనం ఎలా. అప్పుడు ప్రత్యక్షనారాయణుడు సూర్యభగవానుడు ఉపనయనం తను చేస్తానని అన్నారు. ఎందుకని. గాయత్రీ మంత్రానికి అధిపతి సూర్యుడు. ఉపనయనం చేయించడానికి, గాయత్రీమంత్ర ఉపదేశానికి అంతకన్నా గొప్పవారు ఎవరు ఉంటారు. వామనుడు మూడు అడుగుల భూమిని కోరాడు బలిని. ఓ పాదంతో భూమిని ఇంకో పాదంతో పైలోకాలను ఆక్రమించారు. మూడవ పాదం ఎక్కడ పెట్టమంటావు అని అడిగారు వామనుడు. నా తలపై పెట్టు అన్నాడు బలి. ఇందులో అద్భుత తత్వం ఉంది. మనిషి నేను, నాది అనే భావనతో బాధపడుతూ ఉంటాడు ఎల్లప్పుడూ. నాది అంటే మమ. అంటే మమకారం. నేను అంటే అహం. అంటే అహంకారం. బలి తాను సంపాదించిన లోకాలను/సంపదను ఇచ్చేసాడు రెండు అడుగులకు. అంటే మమకారం వదుల్చుకున్నాడు. తరువాత మూడవ అడుగుకోసం తలపై పెట్టమని అడిగి అహంకారంని వదుల్చుకున్నాడు. ఈ రెండూ వదిలించుకుంటే సచ్చిదానందమే కదా. వామన...

మాయ అంతా మన నామరూపాలలోనే ఉంది - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏 " నామరూపవివర్జితా " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 300 వ నామం  " నామరూపవివర్జితా " అంటే నామరూపములు లేనిది అని. నామరూపాలు అశాశ్వతమయిన ఉపాధులకు ఉంటాయి. శాశ్వతమయిన వాటికి ఉండవు. ఆత్మకు నామరూపాలు ఉండవు, దేహానికి ఉంటాయి. నేను అనే ఆత్మను దేహానికి ఆపాదించుకుంటున్నాం. నేను పుట్టాను, చూసాను, తిన్నాను, తిరిగాను, ఇష్టపడ్డాను, బాధపడ్డాను అంటూ.  (జడ) భరతుడు మళ్ళీ జన్మలో జింకగా పుట్టి మరుజన్మలో బ్రహ్మజ్ఞానంతో ప్రపంచాన్ని విస్మరించి భగవత్స్మరణతో గడుపుతున్నాడు. రఘూగణుడు అనే చక్రవర్తి బ్రహ్మజ్ఞానం గురించి తెలుసుకోవడానికని కపిల మహర్షి ఆశ్రమానికి వెడుతూ అనుకోకుండా జడభరతుడిని కలుస్తాడు. జడభరతుడు బ్రహ్మజ్ఞాని అని గ్రహించి ఓ చక్కటి ప్రశ్న వేస్తాడు రఘూగణుడు.  సాధారణంగా పండితులు చెప్పేది మట్టి శాశ్వతం, కుండ అశాశ్వతం. మట్టిలోంచి వచ్చి మట్టిలో కలిసిపోతుంది కనుక. కాని కుండకు ఓ పరమార్ధం/ప్రయోజనం ఉందికదా. నీరు తెచ్చుకుంటాం, వంట చేసుకుంటాం. అశాశ్వతం అనుకుని విస్మరించడం ఎలా అని. జడభరతుడు అంటాడు " బ్రహ్మధర్మం వేరు. వ్యావహారికధర్మం వేరు. రెం...

మమకారం - నాది నావారు అనేది చాలా చెడ్డది, తగ్గించుకోవాలి - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏 " నిర్మమా " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 164 వ నామం . " నిర్మమా " అంటే మమకారము లేనిది. మమకారం అంటే నాది/నావారు అని. అటువంటి భావన అమ్మవారికి ఎందుకుంటుంది, అందరూ తనవారే అయినప్పుడు. తరగతిలో 40 మంది విద్యార్థులు ఉంటారు. అందరికీ ఉపాధ్యాయులు చెప్పేది ఒకటే పాఠం. వారికి ఇష్టమయిన వారు, ఇష్టంలేని వారు అని ఏమీ ఉండదు. కాని బాగా చదివేవారిని అభిమానిస్తారు. అంతేకాని మమకారం ఉండదు. బాగా చదివే విద్యార్ధికి సందేహాలేమయినా ఉంటే ప్రత్యేక శ్రద్ద తీసుకుని సందేహాలు తీరుస్తారు. ఉపాధ్యాయులే ఇలా ఉంటే మరి అమ్మవారు ఎలా ఉంటారు. " పద్మపత్రమివాంభసా " తామరాకు మీద నీటి బొట్టులా ఉంటారు. తనని నమ్ముకున్న వారికి అవసరమయిన సహాయం చేస్తారు. పరమాత్మ గీతలో ఇలా తెలియచేసారు: "సమో2హం  సర్వభూతేషు    న మే ద్వేష్యో2స్తి న ప్రియః,  యే భజంతి తు మాంభక్త్యా    మయి తే తేషు చాప్యహం "               - భ.గీత 9:29 నేను సకలభూతముల (ప్రాణుల) యందును సమభావముతోవ్యాపించి యుందును. నాకు అప్రియుడు గాని, ప్రియుడు గాని ఎవ్వడును లేడు....

సేవలు చేయించుకోకుండా మరణిస్తే చాలు - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏 " శర్మదా " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 953 వ నామం .  " శర్మదా " సుఖమును ఇచ్చునది. అసలు సుఖం అంటే ఏమిటి? జీవితం హాయిగా ఆనందంగా ఏ బాధలూ లేకుండా గడిచిపోవాలని కోరుకుంటారు ఎవరయినా. సుఖాలు లేకపోయినా పరవాలేదు, బాధలు ఉండకూడదు అనుకుంటారు. ఆఖరికి మరణంలో కూడా ఏ బాధలూ ఉండకూడదు అని కోరుకుంటాం. " అనాయాసేన మరణం    వినాదైన్యేన జీవనం   దేహాంతే తవ సాయుజ్యం     దేహిమే పరమేశ్వరా " ఎవరిమీదా ఆధారపడకుండా జీవించడం, అనాయాసంగా మరణించడం, మరణం తరువాత భగవసన్నిధికి చేరడం చాలా కష్టం. అదే అసలయిన సుఖం. దానిని అమ్మవారు తనను నమ్ముకున్నవారికి ప్రసాదిస్తారు. మూక శంకరులు స్తుతిశతకంలో ఇలా ప్రార్థిస్తారు కామాక్షీదేవిని: " ధనేన న రమామహే..... .........చరణపల్లవోపాసనాం "                 - శ్లోకం 85 " అమ్మా మాకు ధనమున సంతోషం కలుగదు. దుర్మార్గులను సేవించు చాపల్యం పొందము. సంసారభయం లేదు. ఎందుకంటే నీ పాదాలను స్ధిరంగా పూజిస్తున్నాం కదా " అని. అందరం అమ్మవారి పాదాలను ఆశ్రయించి అటువంటి సుఖమును ప్రసాదించమని వేడుకుంద...

అమ్మవారు ఇవ్వలేనిది లేదు, నమ్మి సేవిస్తే ఇవ్వకుండానూ ఉండరు - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏  " శాశ్వతైశ్వర్యా " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 952 వ నామం . " శాశ్వతైశ్వర్యా " అంటే నిత్యమగు ఐశ్వర్యము గలది. ఐశ్వర్యము అంటే ధనము అని కాదు. మంచి జ్ఞానం, వాక్కు, ఆరోగ్యం, మంచితనం, పరోపకారం వంటివి అన్నీనూ. ఇవన్నీ అమ్మవారి దగ్గర పుష్కలంగా ఉన్నాయి. తనను నమ్ముకున్న వారికి వారి వారి కర్మఫలాలను బట్టి అవసరమయినంత ఐశ్వర్యం ఇస్తారు. మూక శంకరులు స్తుతిశతకంలో కామాక్షీదేవిని ఇలా స్తుతిస్తారు: శ్రియం విద్యాం దద్యాజ్జనని నమతాం కీర్తిమమితాం సుపుత్రాన్ ప్రాదత్తే తవ ఝటితి కామాక్షి కరుణా, త్రిలోక్యామాధిక్యం త్రిపురపరిపంథిప్రణయిని ప్రణామస్త్వత్పాదే శమితదురితే కిం న కురుతే " - 52 " అమ్మవారి పాదాలను ఆశ్రయిస్తే సంపదను, విద్యను, అమితమైన కీర్తిని, సుపుత్రులను, త్రైలోకాధిక్యమును ఇస్తారు దయతో. ఆవిడ పాదాలను పట్టుకోవడానికి ఎందుకు ఆలోచన, ఆలస్యం? " అని. తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రిగారికి ఓ సిద్ధపురుషుడు " బాల " మంత్రాన్ని ఉపదేశించారు. మరి శాస్త్రిగారు ఎన్నికోట్ల " బాల " జపం చేసారోకాని ఓరోజు జపం ముగించి కళ్ళ...

అమ్మవారు తలచుకుంటే చాలు మురిసిపోతారు - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏 " నామపారాయణప్రీతా " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 732 వ నామం. " నామపారాయణప్రీతా " అంటే నామపారాయణముచే సంతోషించునది. అమ్మవారి నామాలు జపం చేసుకుంటే చాలు సంతోషించి అనుగ్రహిస్తారు. " యజ్ఞానాం జప యజ్ఞో2స్మి ( భ.గీత 10:25 )" - యజ్ఞాలలో జపయజ్ఞాన్ని నేను అన్నారు పరమాత్మ. జపానికి అంత శక్తి. త్యాగయ్య 96 కోట్ల రామజపం చేసారు, రామదాసు 13 కోట్ల శ్రీరామ జయరామ జయజయ రామ జపం చేసారు. ధృవుడు నమో భగవతే వాసుదేవాయ, ప్రహ్లాదుడు నమో నారాయణాయ జపాలు చేసారు. చిరస్మరణీయులు అయారు. దీనిలో ఓ ధర్మసూక్ష్మం ఉంది. " యస్య దేవే పరాభక్తిః   యధా దేవే తధా గురౌ "              - కఠోపనిషద్ " ఏ దేవి అనుగ్రహం కోసం జపం చేస్తున్నామో ఆ దేవిమీద అఖండభక్తి ఉండాలి. అంతే భక్తి గురువుమీద ఉండాలి " అని కఠోపనిషద్ తెలియచేస్తూంది. కబీర్ దాసు కాశీలో ఉండేవారు. ఆయనకు శ్రీరాముడు అంటే అపరిమితమైన భక్తి, నమ్మకం. రామజపం పారాయణ చేయాలని, చేసి తరించాలని కోరిక.  కాశీలోనే ఉన్న రామానంద అనే రామభక్తుడిని రామనామం ఉపదేశం చేయమని కోరారు. ఆయన అన్యమతస్తులకి చేయలేనన...

గణపతిని ప్రార్ధిస్తే 7 కోట్ల గణపతులు అనుగ్రహిస్తారు - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏 భండాసురుని తమ్ముడు విశుక్రుడు అమ్మవారి సేనల మధ్యలోకి జయవిఘ్నశిలాయంత్రాన్ని విసిరి అమ్మవారు, సైన్యం పని అయిపోయింది అని భావించాడు. కాని అమ్మవారి సేనలు మళ్ళీ విజృంభించడంతో విశుక్రుడు ఆశ్చర్యపోయాడు. జయవిఘ్నశిలాయంత్రానికి ఏమయింది, ఎందుకు పనిచేయడం లేదూ అని. విషయసేకరణ చేస్తే ఆ యంత్రాన్ని ఓ తొండం ఉన్నాయన పిండిచేసేసాడని తెలిసింది. తొండం ఆయన ఏమిటి అని ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే అతని వైపు కూడా ఓ తొండం ఉన్న రాక్షసనాయకుడు ఉన్నాడు మరి. అతని పేరు గజాసురుడు. అతన్ని పిలిచి " నీ సేనలతో వెళ్ళి యంత్రాన్ని పాడుచేసిన తొండపాయన్ని చంపేసి రా " అని ఆదేశించాడు. వాడు రాక్షససేనలతో బయలుదేరి వెళ్ళాడు. ఎదురుగా చూస్తే వల్లభగణపతి ఒకరే ఉన్నారు. గజాసురుడు ఆశ్చర్యపోతే గణపతి చిరునవ్వు నవ్వారు. చూస్తూ ఉండగానే వల్లభగణపతి రోమాల్లోంచి 7 కోట్ల గణపతులు బయటకు వచ్చారు. వారు సింహవాహనాలమీద, ఎలుకల, ఏనుగులవాహనాలమీద కూర్చుని తయారుగా ఉన్నారు యుద్ధానికి. రాక్షససేనలన్నింటినీ మట్టుపెట్టేసి వల్లభగణపతిలో లీనమయిపోయారు ఆ 7 కోట్ల గణపతులు. ఎదురుగా వంటరిగా ఉన్న గజాసురుడిని పట్టుకుని మాంసపుముద్దగా చేసేసి అమ్మవ...

అమ్మవారి నవ్వు బహు సుందరం - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏 " చారుహాసా " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 242 వ నామం. " చారుహాస " సుందరమైన నువ్వు. చారు అంటే అందమైన/సుందరమైన అని అర్దం. చక్కని నవ్వు అమ్మవారిది. దేవతలు కొన్ని కోరికలు కోరుకుందామని అమ్మవారి దర్శనానికి వెడతారుట. అమ్మవారి చిరునవ్వుతో కూడిన ముఖం చూడగానే అన్నీ మర్చిపోతారుట. అక్కడికీ అమ్మవారు అడుగుతారుట చిరునవ్వుతో " ఇలా వచ్చారు, ఏమి కావాలి " అని. ఏమీ లేదమ్మా, మీ పాదాలకు నమస్కరించి వెడదామని అంటారుట. ఎంత అందంగా, అద్భుతంగా లేకపోతే మూకశంకరులు అమ్మ ( కామాక్షీదేవి ) వారి కేవలం చిరునవ్వు మీద 100 శ్లోకాలు ( మందస్మితశతకం ) ఆసువుగా చెప్పగలుగుతారు. అమ్మవారు భండాసురినిమీదకు యుద్ధానికి బయలుదేరగానే భండాసురుడు అనుకున్నాడు " ఆవిడ ఒక స్త్రీ, మంత్రి, సేనాని కూడా స్త్రీలుట, ఆవిడ చేతుల్లో ఉన్నవి చెరుకుగడ విల్లు, పూలబాణాలు. చిటికలో ఓడించి తరిమివేయవచ్చు " అని. ఎప్పుడయితే వారాహీదేవి తన సేనలతో ఊతకోచమొదలెట్టి లక్షలమంది రాక్షసులను మట్టుబెట్టడం మొదలుబెట్టిందో భండాసురుడు ఆశ్చర్యపోయి కలవరం చెందాడు. వాడికి తమ్ముడు ఉన్నాడు, విశ...

శ్రీ వినాయకచవితి శుభాకాంక్షలు - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏 " కామేశ్వరముఖాలోక కల్పితగణేశ్వరా " - అమ్మవారి అద్భుతనామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 77 వ నామం.  అమ్మవారు( కామేశ్వరి ) కామేశ్వరుడు ముఖంలోకి చూడగానే స్వామి విఘ్నేశ్వరుడిని అనుగ్రహించారు అని. అమ్మవారు ఓరకంటితో చూసిందిట. ఆవిడ చిరునవ్వు ఎలా ఉందంటే పలువరసలు కూడా కనిపించనంత చిన్ననవ్వు. స్వామి ముగ్ధుడు అవకుండా ఎలా ఉండగలరు. అమ్మవారు భండాసురుడితో యుద్ధం చేస్తున్నారు. అతను విఘ్నాస్త్రాన్ని ప్రయోగించాడు. అన్నీ విఘ్నాలే. తొలగించాలంటే విఘ్నాలకు ప్రభువైన విఘ్నేశ్వరుడు రావాలి. అందుకని భర్త కామేశ్వరుడివైపు అలా చూసిందిట. ఎంత అద్భుతమైన విషయం. పార్వతీదేవి నలుగుపిండితో బొమ్మచేసి ప్రాణం పొయ్యడం, శివుడు ఆ బాలుడి తల ఖండించడం, గజాననుడి తలపెట్టడం తెలుసు మనకు. మరి ఈ విఘ్నేశ్వరుడు ఎవరు, అసలు విఘ్నేశ్వరుడు ఎప్పటివారో చూద్దాం. పరమాత్మ వ్యాసర్షితో " కలియుగం వచ్చేస్తూంది, జీవులు చాలా కష్టాలు పడతారు, సులువుగా మనశ్శాంతిని పొందడానికి వేదాలను ఓ క్రమపద్ధతిలో పెట్టు " అనడంతో వ్యాసర్షి వేదవిభజనకు, 18 పురాణాలు, 18 ఉపపురాణాల రచనకు శ్రీకారం చుట్టారు. కాని ఎక్కడ, ఒక్క వాక్...

అమ్మవారి ప్రసాదంతో తినడం మొదలుపెడితే నిండు నూరేళ్ళు సంతోషంగా తినగలం - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏 " పాయసాన్నప్రియా " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 480 వ నామం. " పాయసాన్నప్రియా " అంటే పరమాన్నము ఇష్టముగా గలది. బెల్లంతో చేసిన పరమాన్నం అమ్మవారికి ఎంత ఇష్టమో. అమృతంలా ఉంటుంది. అన్నప్రాశన చేస్తారు చంటి పిల్లలకు 5/6 వ నెలలో. మొదటిసారి ఘనపదార్ధం మొదలు పెట్టడం. బెల్లం బియ్యం ఆవుపాలతో పరమాన్నం చేస్తారు. గౌరీదేవికి పూజచేసి ఈ పరమాన్నాన్ని నైవేద్యం పెడతారు. తరువాత బంగారపు ఉంగరంతో ఆ పరమాన్నాన్ని చంటిపిల్లవాడికి నాకిస్తారు తల్లిదండ్రులు. అమ్మవారికి అతి ప్రీతికరమైన ఆ పరమాన్నంతో మొదలయిన తినడం అనే కార్యక్రమం నూరేళ్ళు నిర్విఘ్నంగా కొనసాగుతుంది. కడుపునిండా ఇష్టమయినది తినడం ఒక వరం. అది అమ్మవారే అనుగ్రహించాలి. మాఘమాసంలో రథసప్తమినాడు, ఆదివారాలు సూర్యుడికి పూజచేసి ఈ పరమాన్నాన్నే/పొంగలిని నైవేద్యం పెడతారు. అమ్మవారి అద్భుత నామం " భానుమండలమధ్యస్థా " - సూర్యుడిలోని చైతన్యం అమ్మవారే కదా. పితృదేవతలకు ఆబ్దీకాలు పెట్టినప్పుడు భోజనాలలో ఈ పరమాన్నం ఒక ముఖ్యమయిన వంటకం. ఈ పరమాన్నంతో నందికేశ్వరుడి నోము కూడా చేసుకుంటారు ముత్తయిదువులు. అంత...

పులిహోర ఇష్టం అమ్మవారికి - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏 " హరిద్రాన్నైకరసికా " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 526 వ నామం. " హరిద్రాన్నైకరసికా " అంటే పసుపు అన్నము ( పులిహోర ) నందు ప్రీతి గలది. ఈ పులిహోర ఓ అద్భుత వంటకం. ఏ పండుగ అయినా ఇది ముఖ్యంగా ఉంటుంది. వినాయకచవితి, దేవీ నవరాత్రులలో రోజూ సంతర్పణలలో తీపివంటకం అంటే బూర్లు, పాయసం, మిఠాయి, జిలేబి మొ.గు నవి మారుతూ ఉంటయి కాని పులిహోర మాత్రం తప్పకుండా ఉంటుంది. పులిహోరలో చాలా రకాలు ఉన్నాయి. చింతపండు, నిమ్మకాయ/నిమ్ముప్పు, మామిడి, దబ్బకాయ, కొబ్బరి వేసి కూడా పులిహోర చేస్తారు. పులిహోర ఉప్పుపిండి అని బియ్యపునూకతో చేస్తారు. టమోటాతో కూడా చేసుకుంటారు. అటుకుల పులిహోర ఓ ప్రత్యేక వంటకం. క్షీరాబ్ధీద్వాదశి నాడు తీపి అటుకులతో బాటు అటుకుల పులిహోర చేసి తులసీధాత్రీ సమేత కార్తీకదయాదామోదరుడికి నైవేద్యం పెట్టి ప్రసాదంగా తింటారు. తిరుమల మొ.గు వైష్ణ్వాలయాలలో పులిహోర ఓ ప్రత్యేకమయిన పవిత్రమయిన ప్రసాదం. ఆశ్చర్యం ఏమిటంటే ఎప్పుడయినా అన్నం మిగిలిపోతే పోపువేసి నిమ్మకాయ పిండి పులిహార చేసుకుని ఫలహారం క్రింద తీసుకుంటారు. రోజూ ఇదేనా అని ఎప్పుడూ అనిపించదు. పొరు...

అమ్మవారి సౌందర్యం ఊహకందదు - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏 " అచిన్త్యరూపా " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 554 వ నామం. " అచిన్త్యరూపా " అంటే ఊహింపశక్యముకాని రూపముకలది.‌ అమ్మవారిని వర్ణించాలంటే సరైన ఉపమానాలు దొరకాలి కదా.  ఊహించడం ఏమిటి ?. అమ్మవారిని నేరుగా చూడగలరా ఎవరయినా. కోటిసూర్య సమప్రభా అమ్మవారు. ఓ సూర్యుడినే నేరుగా చూడలేకపోతున్నాం కదా. కోటిసూర్యుల సమమయిన అమ్మవారిని ఎలా చూడగలం. శంకరాచార్యులు సౌందర్యలహరి గానంచేస్తూ అమ్మవారి సౌందర్యాన్ని గురించి ఇలా అన్నారు: " త్వదీయం సౌందర్యం తుహినగిరికన్యే      తులయితుం కవీంద్రాః కల్పంతే కథమపి    విరించిప్రభృతయః, యదాలోకౌత్సుక్యాత్   అమరలలనా యాంతి  మనసా   తపోభిర్దుష్ప్రాపామపి గిరిశసాయుజ్యపదవీమ్ "  " అమ్మా, బ్రహ్మాదులైన కవీంద్రులు కూడా నీ చక్కదనమునకు సాటి ఇది అని చెప్పలేక కష్టపడుతున్నారు. నిన్ను చూడవలెననే ఉత్సుకతతో మనస్సుచేత తపస్సులకు కూడా పొందనలవికాని శివసాయుజ్యమును పొందుతున్నారు " అని అర్ధం.  ఓ అమ్మాయి అందాన్ని వర్ణించాలంటే ముఖం చంద్రబింబంలా ఉందని, కనులు కలువపువ్వుల్లా ఉన్నాయంటారు కవులు. అమ్మవారి సౌందర్యాన్...

శరీరంమీద మోహాన్ని పోగొడుతారు అమ్మవారు - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏 " నిర్వాణసుఖదాయినీ " ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 390 వ నామం .  " నిర్వాణసుఖదాయినీ " అంటే మోక్షసుఖమును ఇచ్చునది అని అర్థం. వాణం అంటే శరీరం. నిర్వాణం అంటే శరీర స్పృహ లేకపోవడం. అది ఒక అద్భుత స్థితి. అంత సులభం కాదు. ఎంతో కఠిన సాధన చేస్తే అమ్మవారు అటువంటి స్థితిని కలుగచేస్తారు. అటువంటి వారు జీవన్ముక్తులు, పరమహంసలుగా పూజింపబడుతారు. విష్ణుసహస్రనామాలలో " నిర్వాణం " ఒకనామం. ఆ నామానికి " విలక్షణమయిన పరమానంద స్వరూపుడు " అని భాష్యం చెప్పారు ఆదిశంకరులు. ఆయన " నిర్వాణ షటకం " చేసారు. శరీరం నేను కాదు, నేను శివుడిని అని భావించమన్నారు.  శుకమహర్షి పరీక్షిత్తుకు భాగవతం చెబుతూ ప్రహ్లాద చరిత్ర చెబుతారు. ప్రహ్లాదుడు తన తండ్రి హిరణ్యకశిపుడుతో " హరి గురించిన విషయాలు చెప్పని గురువు గురువే కాదు, హరి బోధలు తెలియచేయని తల్లిదండ్రులు తల్లిదండ్రులే కాదు " అనేసరికి కోపం వచ్చి హిరణ్యకశిపుడు భటులతో ఇతన్ని నానా బాధలూ పెట్టి అయినా హరి అనకుండా చేయమంటాడు.  ఆశ్చర్యం ఏమిటంటే మంటల్లో పడేసినా, ఏనుగులతో త్రొక్కించినా, నీటిలో ముంచినా ప్ర...

కృష్ణ పరమాత్మ కూడా ఇలా చేస్తే నయం అన్నారు - చీమలపాటి సూర్యనారాయణ

 🙏" శ్రీరస్తు శుభమస్తు "🙏 " ఇతితేజ్ఞానమాఖ్యాతం    గుహ్యతే గుహ్యతరం మయా ,    విమృశ్యైతదశేషేణ    యధేచ్ఛసి తధాకురు "            - భ.గీత 18:63. పరమాత్మ " నేనునీకు చెప్పవలసిన రహస్యజ్ఞానమంతా చెప్పాను. ఏదో నేను చెప్పానని కాకుండా దీన్ని సమగ్రంగా నీ బుద్ధితో విమర్శచేసుకుని నీకు తోచిన/నచ్చిన విధంగా ఆచరించు " అన్నారు అర్జునుడితో. " మతం " అంటే అర్ధం అభిప్రాయం. ఎవరి అభిప్రాయాలు వారివి. ఆశ్చర్యకరంగా ఒకరికే ఇప్పుడున్న అభిప్రాయం మరుక్షణంలో మారిపోవనూ వచ్చు.  పరమాత్మ గీతలో ( 6:32 ) " అన్నిజీవులను సమభావంతో చూస్తూ సుఖదుఃఖాలను ఒకేవిధంగా స్వీకరించేవాడే పరమశ్రేష్ఠుడైన యోగి అని నా అభిప్రాయం " అన్నారు. ఎంత అద్భుతం. స్వామియే " ఇదే సత్యం అనలేదు, నా అభిప్రాయం మాత్రమే " అన్నారు. గీతలో పలుచోట్ల " విద్వాంసులు, సాంఖ్యులు ఇలా అభిప్రాయపడ్డారు " అని నొక్కి చెప్పారు. నపుంసకత్వం, హృదయదౌర్బల్యం వదిలేయి అన్నారు, రాజుగా యుద్ధం చెయ్యడం నీ ధర్మం అన్నారు, అలా చెయ్యకపోతే నిన్ను అపహాస్యం చేస్తారు అందరూ అన్నారు, నువ్వు చెయ్యకూడదు అని నిర్ణయించుకున్నా త్రిగుణాల...