రమణమహర్షి 1
🙏 " శ్రీరస్తు శుభమస్తు " 🙏 రమణమహర్షి సందేశాలన్నీ అద్భుతమే. ఇతరవిషయాల గురించి ఆలోచనచేసే ముందు " నేనెవరు " అని తెలుసుకునే ప్రయత్నం చెయ్యమన్నారు మహర్షి. కాని " నేనెవరు " అని తెలుసుకోవడానికి చేసే ప్రయత్నం అంత సులభంకాదు. 100 కోట్లమందిలో అందుకే ఓ 100మందినికూడా " నేనెవరు " అని తెలుసుకున్నటువంటివారిని చూడం - మహర్షి, పరమహంస, కంచిపరమాచార్య వంటివారిని అప్పుడప్పుడు చూస్తూంటాం. చిన్నపిల్లవాడి నోట్లో తేనె రాస్తే చప్పరిస్తాడు. చేదుది పెడితే ఉమ్మేస్తాడు. పిల్లవాడికి ఎలా రుచులు తెలుస్తున్నాయని అడిగితే గతజన్మ " వాసనలు " పోవు, అలాగే ఉంటాయన్నారు. భ.గీతలో ఆఖరి అధ్యాయం " మోక్షసన్యాసయోగం " - అదేమిటండీ, సన్యాసం అంటేనే మోక్షంకోసం అన్నీ వదిలేయడంకదా, మళ్ళీ ఇదేమిటి అన్నారు పెద్దలు. సన్యాసి అయినా గత " వాసనలు " పోవు కొందరికి . ఒకాయన పీఠాన్ని పెడతాడు, అమ్మవారికి పూజలు చేస్తాడు, చేయిస్తాడు. " అతన్ని మాత్రం ముఖ్యమంత్రిని అవనివ్వను " అంటాడు. మహామాయ. అందుకే నరసింహశతక కర్త అంటారు " బ్రతికినన్నాళ్ళు నీభజన చేతును, మరణకాలమునందు ( నిను ) ...