Posts

Showing posts from June, 2025

అమ్మవారు కనుబొమల మధ్య కూర్చుని ఉంటారు - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏 " ఆజ్ఞాచక్రాంతరాళస్థా " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్య నామాలలో 103 వ నామం. " ఆజ్ఞాచక్రాంతరాళస్థా " అంటే ఆజ్ఞాచక్రంలోపల స్థితురాలయి ఉంటారు అని. కనుబొమల మధ్య గల భాగాన్ని భృకుటి అంటాం. అక్కడ ఆజ్ఞాచక్రం ఉంటుంది.  అక్కడ మన మనస్సు ఉంటుంది. ఆ ఆజ్ఞాచక్రపద్మం మధ్యలో పరమేశ్వరి, ప్రసన్నంగా ఆశీనురాలయి ఉంటుంది.  ఇది గురుస్థానం. జ్ఞానం కలుగుతుంది. ఇక్కడ సాధన చేస్తే " ఆ అంటే కొంచెం, జ్ఞా అంటే జ్ఞానం కలుగుతుంది " అని భాష్యం చెప్పారు. శ్రీవారాహీదేవి ద్వాదశనామాలలో ఒక నామం ఆజ్ఞాచక్రేశ్వరి. ఆజ్ఞాచక్రానికి ఈశ్వరి, అక్కడ 2 దళాలతో కూడిన పద్మంలో కూర్చుని ఉంటారు. ఈ రెండు దళాల రంగులు వేరు వేరుగా ఉంటాయి. ఇవి ఇడా, పింగళా నాడులకు సంకేతం.  ఆ రెండింటి మధ్య నుంచి సుషుమ్నానాడి, పైకి సహస్రారం వైపుకు ప్రయాణిస్తుంది.  ఈ రెండు రేకలూ శివ, శక్తి స్థానాలకు కూడా సంకేతం. ఈ ఆజ్ఞాచక్రం వద్ద జపం చేస్తే, ఆజ్ఞాపించ గల గురువు/అమ్మవారు దర్శనం అవుతారు. ఇక్కడే జ్ఞానం సిద్ధిస్తుంది.  ఇక్కడికి చేరేటప్పటికి జీవుడు మనోనిగ్రహం పొంది, కోరికలు నశించి, భౌతిక విషయాల పట్...

హృదయం దగ్గర ఉన్న విష్ణుముడి విడడానికి 12 ఏళ్ళు పడుతుంది - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏 " విష్ణుగ్రంధివిభేదినీ " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్య నామాలలో 102 వ నామం. " విష్ణుగ్రంధివిభేదినీ " అంటే విష్ణుముడిని తొలగించేవారు అని భాష్యం చెప్పారు. ఈ ముడిలో విష్ణువు ఉండడంవల్ల విష్ణుముడి అని పేరు. ఇది మణిపూరచక్రానికి పైన అనాహతచక్రానికి క్రింద ఒక ముడి, అనాహతచక్రానికి పైన ఒక ముడి ఉంటాయి. ఈ రెండు ముడులను కలిపి విష్ణుగ్రంధి అంటారు. ఈ గ్రంధిలో ఉన్న రెండుచక్రాలు అగ్ని సూర్య చక్రాలు. తేజోమయం. అగ్ని తత్త్వం.  చక్కని గురువు తోడ్పాటుతో కఠిన సాధన చేస్తే మణిపూరచక్రం నుంచి ప్రయాణం మొదలుపెట్టిన తరువాత విష్ణుముడిని తొలగించుకోవడానికి ఆరు సంవత్సరములు పడుతుందని సాధకులు అనుభవంతో తెలియచేసారు. అనాహతచక్రం హృదయస్థానంలో వాయుతత్త్వంతో కూడుకుని ఉంటుంది. అధిష్టానదేవత రాకిన్యాంబ. 12 దళాల హేమవర్ణ కమలంలో ఆశీనురాలయి ఉంటారు.  అనాహత అంటే  గాయపడని, కొట్టబడని, లేదా ఓడిపోని అని అర్థం.  ఇది ప్రేమ, కరుణ, సానుభూతి, సమతుల్యత, ప్రశాంతతలకు కేంద్రంగా ఉంటుంది.  విష్ణుముడి విడనంతకాలం ద్వేషం, శత్రుత్వం, దురాశలు పట్టి పీడిస్తూ ఉంటాయి. హృదయమంతా విష్ణువు నిండి ఉంట...

మణిపూరచక్రం జలతత్త్వం, చల్లబరుస్తుంది - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏 " మణిపూరాంతరుదితా " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్య నామాలలో 101 వ నామం. " మణిపూరాంతరుదితా " అంటే మణిపూరచక్రం మధ్యలో ప్రకటితమయినది అని భాష్యం చెప్పారు. మణిపూర+అంతః+ ఉదితా - ఉదితా అంటే ఉండునది అని. నీలవర్ణం గల పదిదళముల పద్మంలో కూర్చుని ఉంటారు అమ్మవారు లాకిన్యంబస్వరూపిణి. జలతత్త్వం. స్వాంతన కలిగిస్తారు సాధకులకు. ఇది మణులతో నిండి ఉంటుంది కనుక మణిపూరం. సూర్యచంద్రాగ్నులు ఈ చక్రంలోనే ప్రకాశిస్తారని ఆ కాంతులే మణులని అరుణోపనిషత్ తెలియచేస్తూంది. అమ్మవారు మణులు ధరించి మెరిసిపోతూ ఉంటారు.  ఒక్కసారి కళ్ళుమూసుకుని మణులతో నిండియున్న నీలవర్ణపు పది రేకుల పద్మంలో మణులు ధరించి మెరిసిపోతూ కూర్చున్న అమ్మవారిని ఊహించుకుంటే ఆ భావనే అద్భుతం. ఈ చక్రం నాభి దగ్గరలో ఉంటుంది. ఈ చక్రం మూసుకుని ఉంటే కీర్తి కోసం తహతహ, తనమాటే నెగ్గాలనే కోరిక వలన అసూయ, అసహనం, క్రూరత్వం, స్వలాభం, ఆత్మన్యూనతలతో బాధపడుతూ ఉంటారు జీవులు. ఈ చక్రం చైతన్యం అవుతే ఆత్మవిశ్వాసం పెరిగి కార్యసిద్ధి కలుగుతుంది. ఇక్కడే జీవుడికి " తను ఎవరు " అనే చింతన మొదలయి ఆధ్యాత్మికంగా ఎదుగుత...

కఠిన సాధన చేయాలి, అజ్ఞానం తొలగించడానికి - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏 " బ్రహ్మగ్రంధివిభేదినీ " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్య నామాలలో 100 వ నామం. " బ్రహ్మగ్రంధివిభేదినీ " అంటే బ్రహ్మముడిని తొలగించేవారు అని భాష్యం చెప్పారు. గ్రంధి అంటే ముడి.  మూలాధారచక్రంలో అమ్మవారు నిద్రాణ స్థితిలో ఉంటారు. ఇది జీవుడి జ్ఞానాన్ని మాయ కప్పేయడం వలన. సాధనతో ఈ చైతన్యాన్ని మేలు కొలిపి సుషుమ్నానాడి ద్వారా పైకి ప్రయాణం చేయించగలుగుతే మాయ, విషయలాలసలు త్రగ్గడం మొదలవుతుంది.‌ సుషుమ్నానాడికి మూలాధారచక్రం నుంచి ఆజ్ఞాచక్రం దాకా ఆరు చక్రాలు ఉంటాయి. రెండేసి చక్రాలకు ఒక ముడి ఉంటుంది.‌ అవి బ్రహ్మ, విష్ణు, రుద్ర గ్రంధులు. ఇవి సాధనలో వచ్చే పరీక్షలు/అడ్డంకులు.‌  మూలాధారానికి పైన స్వాధిష్ఠానానికి క్రింద ఒక ముడి, స్వాధిష్ఠానానికి పైన ఒక ముడి ఉంటాయి. ఈ రెండు ముడులను కలిపి బ్రహ్మముడి అంటారు. అందులో బ్రహ్మ కూర్చుని ఉంటారు. కఠిన సాధనతో బ్రహ్మ ముడి విప్పుకో గలిగితే విష్ణుముడివైపు ప్రయాణం కొనసాగుతుంది. అసలు చైతన్యాన్ని లేపడమేమిటి, పైకి ప్రయాణం ఏమిటి అని సందేహం కలగడంలో ఆశ్చర్యం ఏమీ లేదు. పరమాత్మ గీతలో ఇలా తెలియచేసారు: " ధూమేనావ్రియతే...

అమ్మవారు మూలాధారంలో నిద్రాణమై ఉంటారు - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏 " మూలాధారైకనిలయా " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్య నామాలలో 99 వ నామం. " మూలాధారైకనిలయా " అంటే మూలాధారము ఒకే ఒక నిలయముగా ఉన్నది. మూలాధారం అంటే మన వెన్నెముక చివరలో 4 రేకుల పద్మం ఉంటుంది. అది అరుణవర్ణం, పృథ్వీతత్త్వం దాని మధ్యలో కులకుండము అనే బిందువు ఉంటుంది. ఆ బిందువులో అమ్మవారు " సిద్ధవిద్యాదేవి " నిద్రాణస్థితిలో ఉంటారు. అమ్మవారిని కుండలినీదేవి అని కూడా పిలుస్తారు. పామువలె మూడున్నర చుట్లు చుట్టుకుని ముఖమును కప్పుకుని పడుకుని ఉంటారు. అమ్మవారు అలా నిద్రావస్థలో ఉండడానికి కారణం మనమే. అశాశ్వతమైన భౌతిక విషయాల వెంట పడి, మనలో శాశ్వతమైన అద్భుత శక్తి/చైతన్యం ఉందని మర్చిపోతున్నాం, తరించలేకున్నాం. మనకి లేని బాధ అమ్మవారికి ఎందుకు ఉంటుంది.  శరీరంలోని 72 వేల నాడుల శక్తి ఇక్కడ కేంద్రీకృతమై ఉంటుంది. వెన్నెముక ద్వారా సాగే ఈ నాడులలో ముఖ్యమైన సుషుమ్నా నాడి ఈ మూలాధారంని శిరస్సుపై ఉండే సహస్రారంని కలిపి ఉంచుతుంది. ఈ కుండలినీశక్తి మాయతో కప్పబడి ఉండడంవల్ల నిద్రాణస్థితిలో ఉంటుంది. సుషుమ్నానాడి ఇక్కడినుండే మొదలు అవుతుంది కనుక ఈ స్థానాన్ని ...

అమ్మవారు శ్రీవారాహీదేవి నవరాత్రులు నేటినుంచి, శుభాకాంక్షలు - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏 " విశుక్రప్రాణహరణ వారాహీవీర్యనందితా " - ఇది లలితాసహస్రరహస్యనామాల్లో 76 వ నామం. దీని అర్ధం " విశుక్రుడి ప్రాణం హరించిన శ్రీవారాహీదేవి పరాక్రమానికి సంతసించినది " అని. భండాసురుడి తమ్ముడైన విశుక్రుడిని సంహరించినది వారాహీదేవి. వారాహీ అనే పేరే ఎంత అద్భుతంగా ఉంది. పలుకుతూంటేనే వళ్ళు పులకరిస్తుంది. ఆవిణ్ణి రక్షణమంత్రిగా నియమించింది అమ్మవారు మనల్ని జాగ్రత్తగా చూసుకోమని. ఆవిడ ఒకచేతిలో నాగలి, ఇంకోచేతిలో రోకలి ఉంటాయి. అంటే పంటలు పండించడం, ఆ పంటను దంచి ఆహారంగా చెయ్యడం కూడా ఆవిడే చూసుకుంటుంది. శక్తిని ఆరోగ్యాన్ని ఇచ్చేది ఆవిడే. రక్షణమంత్రిగా శత్రుపీడ లేకుండా చేసేదీ ఆవిడే. ఆవిడ రధం మీద ధన్వంతరి, అశ్వనీదేవతలు కూర్చుని ఉంటారు. ఇంక మన ఆరోగ్యానికి లోటెక్కడ. ఆవిడ మహిషం మీద కూర్చుని, పులిమీద కూర్చుని కూడా దర్శనం ఇస్తూ ఉంటారు.  ఆవిడ ఇంకో వాహనం హంస. హంస అంటే ఊపిరి. సాధారణంగా అందరూ " జపగాయత్రి " చేస్తారు. అంటే ఏదో ఒక నామజపాన్ని చేసుకుంటూ ఉంటారు. కొందరు ఏనామాన్ని కాకుండా " అజపా గాయత్రి " ని చేస్తారు. అంటే ఊపిరి మీదే ధ్యాసపెడతారు. ఊపిరిలో అమ...

శ్రీవారాహిదేవి నవరాత్రులు రేపటినుంచి, శుభాకాంక్షలు - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏 రేపటినుంచి అనగా ఆషాఢ శుద్ధ పాడ్యమి మొదలు నవమి వరకు శ్రీవారాహిదేవీ నవరాత్రులుగా జరుపుకుని పూజించుకుంటారు భక్తులు.  అమ్మవారు లలితాదేవి శ్రీశ్యామలాదేవిని మంత్రిణిగా, శ్రీవారాహీదేవిని రక్షణమంత్రిణిగా నియమించారు మన రక్షణ, బాగోగులు చూడడానికి.  అమ్మవారు పార్వతి, శ్యామలాదేవి సరస్వతి అయితే వారాహీదేవి లక్ష్మీదేవి.  శ్రీవారాహిదేవి అష్టోత్తర శతనామావళి లో కొన్ని నామాలు అత్యద్భుతంగానూ, ఆశ్చర్యంగానూ ఉంటాయి: శత్రూణాం వాక్ స్తంభనకారిణీ శత్రూణాం గతి స్తంభనకారిణీ శత్రూణాం మతి స్తంభనకారిణీ శత్రూణాం అక్షి స్తంభనకారిణీ అమ్మవారిని శరణాగతి కోరితే శత్రువుల మాట, గమనం, బుద్ధి, కళ్ళను స్తంభింపచేసేస్తుంది. అంత రక్షణ ఇస్తుంది. మూక శంకరులు ఆర్యాశతకంలో కామాక్షీ అమ్మవారిని ఇలా స్తుతిస్తారు: " తాడితరిపుపరిపీడన భయ    హరణ నిపుణహలముసలా,   క్రోడపతిభీషణముఖీ క్రీడసి    జగతి త్వమేవ కామాక్షి " " శత్రుసైన్యమును దండించునది, శత్రుభయమును పోగొట్టుటలో సమర్ధములయిన హల ముసలములు గల వరాహముఖము గలిగిన నీవే జగమున క్రీడించుచున్నావు తల్లీ కామాక్షీదేవీ " అని. శ్రీవారాహీదేవిని స్మ...

అమ్మవారు మంచివారిని ఇష్టపడుతారు - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏 " శిష్ట పూజితా " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్య నామాలలో 412 వ నామం. " శిష్ట పూజితా " అంటే శిష్టులచే పూజింపబడునది అని భాష్యం చెప్పారు. శిష్టులంటే మంచివారిలో మంచివారు/ఉత్తములు అని భావించాలి. " చీమకు కూడా అపకారం చేయడండి ఆయన " అనడం వింటూంటాం. ఇతరులకు సహాయం చేయకపోయినా హాని చేయకపోతే మంచివారే. మరి సహాయం కూడా చేస్తే, మంచివారిలో ఉత్తములు.  విష్ణుసహస్రనామాలలో " యోగవిదాం నేతా " అని ఒక నామం ఉంది. యోగవేత్తలకు నాయకుడు విష్ణువు. నాయకుడు అంటే నడిపించేవాడు అని. జీవులను అందరినీ ఆయనే కదా నడిపించేది. మరి యోగవేత్తలకు మాత్రమే నాయకుడు అంటే ఎలా.  యోగం అంటే కలయిక. ఏమిటీ కలయిక?. జీవాత్మను పరమాత్మతో కలపడానికి, అనుసంధానం చేయడానికి సాధన చేయడం. దీనినే యోగాభ్యాసం అంటారు. నది వెళ్ళి సముద్రంలో కలిస్తే ఏమవుతుంది. నది ఉండదు, సముద్రమే మిగులుతుంది. అలాగే జీవాత్మ పరమాత్మతో కలిస్తే పరమాత్మ అయిపోతాడు.  ఇది చాలా కష్టమయిన సాధన. యోగాభ్యాసం చేయడానికి మనస్సుతో పాటు ఇంద్రియములు అన్నింటినీ నిగ్రహించుకోవాలి. సాధనలో ఉత్తీర్ణులయిన వారిని యోగవేత్తలు అ...

దండలో దారం వలే అంతర్లీనంగా అమ్మవారు జీవులందరిలోనూ ఉంటారు - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏 " చేతనారూపా " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్య నామాలలో 417 వ నామం. " చేతనారూపా " అంటే చైతన్య స్వరూపురాలు. సమస్త జీవులయందు అమ్మవారి చైతన్యం ఉంటుంది. దేవీభాగవతంలోని మొదటి శ్లోకంలో " ఏ శక్తి మాకు ధర్మబుద్దిని ప్రేరణచేయుచున్నదో అట్టి సర్వచైతన్యస్వరూపురాలు, జ్ఞానస్వరూపురాలు అగు అమ్మవారిని ధ్యానము చేయుచున్నాము " అని ప్రార్ధన చేస్తాము. " ఈశావాస్య మిదగ్ం సర్వం   యత్కించ జగత్యాం జగత్ " ఈ సూక్తి ఈశావాశ్యోపనిషత్తులో మొదటి మంత్రంలో మొదటి పాదం.  ఈ దృశ్యమాన విశ్వం అంతా ఈశ్వరుడి చేత కప్పబడి ఉంది - అంటే భగవంతుడు విశ్వవ్యాపకుడని, విశ్వమంతా ఈశ్వరచైతన్యంతో నిండి ఉందని అర్థం.  విష్ణుసహస్రంలో " విశ్వం, విష్ణుః " అని ప్రార్ధిస్తాం స్వామిని. పరమాత్మ గీతలో ఈ విషయాన్ని ఇలా అద్భుతంగా తెలియచేసారు: " మత్తః పరతరం నాన్యత్      కించిదస్తి ధనంజయ,   మయి సర్వమిదం ప్రోతం    సూత్రే మణిగణా ఇవ " ‌ ‌              - భ.గీత 7:7 " ఓ ధనంజయా, నాకంటెను పరమకారణమైనది ఏదియును లేదు. ఈ జగత్తునందలి వస్తువులన్నియును సూత్ర...

మన శరీరాలన్నీ ఈశ్వర అంశలే - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏 " క్షేత్రేశీ " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్య నామాలలో 342 వ నామం. " క్షేత్రేశీ " అంటే శరీరములకు ప్రభువైన శంకరుని భార్య అని భాష్యం చెప్పారు. మన శరీరాలన్నీ ఈశ్వర అంశలే. అర్ధనారీశ్వరుడు కనుక మన శరీరాలకు యజమానులు శంకరులు, అమ్మవారు.  వేదంలో " అగ్నేర్యధా స్ఫులింగాః ..... " అని ఒక మంత్రం ఉంది. అగ్నినుండి స్ఫులింగములు అంటే అగ్గిరవ్వలు బయలుదేరి పైకి ఎగిరి వచ్చినట్లు ఈశ్వరుడి నుండి జీవులు బయటకు వస్తున్నాయని ఉపమానం. యాజ్ఞవల్క్యస్మృతిలో కాల్చిన ఇనుపగుండునుంచి స్ఫులింగములు వచ్చినట్లు జీవులు వస్తున్నారు అని తెలియచేసారు. అగ్నిలోంచి పైకెగిరే రవ్వలలో కూడా ఉండేది అగ్నియే కదా. అంటే పరమాత్మలోంచి వచ్చిన జీవులలో ఉండేది పరమాత్మయే. " అహం బ్రహ్మాస్మి " అంటే ఇదే. క్షేత్రం/శరీరం గురించిన విషయాన్ని మహాభారతంలో ఇలా తెలియచేసారు వ్యాసర్షి:  " క్షేత్రాణి హి శరీరాణి    బీజం చాపి శుభాశుభం,    తాని వేత్తి స యోగాత్మా   తతః క్షేత్రజ్ఞ ఉచ్యతే "              - 35:01:06 " శరీరములను క్షేత్రములందురు. ప్రాణుల శుభాశుభకర్మ...

అంతర్జాతీయ యోగాదినోత్సవం నేడు, శుభాకాంక్షలు - చీమలపాటి సూర్యనారాయణ

 🙏" శ్రీరస్తు శుభమస్తు"🙏 " అంతర్జాతీయ యోగాదినోత్సవం " నేడు.  యోగం అంటే కలయిక. యోగాభ్యాసం అంటే జీవాత్మను పరమాత్మతో అనుసంధానం చేయడానికి ఉపయోగపడే సాధన. ఏ సాధన చేయాలన్నా ఆఖరికి పదినిముషాలు జపం చేయాలన్నా శరీరం సహకరించాలి. శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి ఉపయోగపడేవి యోగాసనాలు. శరీరం ఆరోగ్యంగా ఉంటే మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. మనస్సుతో పాటు అన్ని జ్ఞానేంద్రియాల నిగ్రహంతోనే యోగాభ్యాసం చేయగలుగుతారు. అందుకని యోగాభ్యాసానికి యోగాసనాలు కొంతవరకు ఉపయోగపడతాయి. యోగా అనగానే మనకు పతంజలి మహర్షి, ఆయన ప్రతిపాదించిన యోగాసూత్రాలు గుర్తుకు వస్తాయి. " యోగః చిత్తవృత్తి నిరోధః - యోగము మనస్సును నియంత్రిస్తుంది " అన్నది ఆయన ముఖ్య యోగసూత్రం. పతంజలి మహర్షి గురించిన కొన్ని అద్భుతవిషయాలు నెమరువేసుకుందాం. ఈయన కాశ్మీరంలోని గొనార్డా అనే ప్రదేశంలో పుట్టారు. ఈయన్ని గొనార్డియా అనీను గోనికాపుత్ర అని పిలిచేవారు. ఓరోజు ఈయన స్నానం చేసి సూర్యుడికి అర్ఘ్యప్రదానం చేద్దామని దోసిలిలోకి నీరు తీసుకుంటే దోసిలిలో చిన్నపాముపిల్ల కనిపించింది. " ఎవరునువ్వు " అని అడిగితే తను ఆదిశేషువునని చెప్పారు. దేనికి ...

అమ్మవారే శివుని కన్నా గొప్పవారు అన్నారు శంకరులు - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏 " శివపరా " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్య నామాలలో 410 వ నామం. " శివపరా " అంటే శివుని కంటే శ్రేష్టురాలు అని భాష్యం చెప్పారు. అలా ఎలా అనిపించవచ్చు. కాని ఇప్పుడు కూడా ఎందరో స్త్రీలు ఉత్తమ స్థానాలలో ఉండి ఎంతో సమర్ధవంతంగా పనిచేయడం చూస్తూంటాం. ప్రతీ పురుషుడి విజయం వెనుక ఓ స్త్రీ ఉంటుంది అనే నానుడి వింటూంటాం కూడా. కొన్ని సమస్యలను తండ్రి కంటే తల్లే చక్కగా పరిష్కారించడం చూస్తూంటాం. కొన్ని రాష్ట్రాలనూ, దేశాలనూ స్త్రీలు చక్కగా పాలించడం చూసాం కూడా. భండాసురుడు, అతని తమ్ముళ్ళు విశుక్రుడు విషంగుడు అనేవారు దేవతలను, ప్రజలను తమ మాయాబలంతో పీడించుకు తినేవారు. దేవతలు దెబ్బలు తిని తిని నిస్సత్తువతో బాధపడేవారు. వెళ్ళి అందరూ త్రిమూర్తులకు మొరపెట్టుకున్నారు కాపాడమని. భండాసురుడి శక్తులు తెలుసు కనుక అమ్మవారే దిక్కు అని త్రిమూర్తులు తలచి శివుడి ఆధ్వర్యంలో మహాయాగం చేసారు. శివుడు తన మూడవకన్ను ఫాలనేత్రంనుంచి అగ్నిని సృష్టించి హోమగుండంలో వేసారు.  యాగం అయాక ఆ అగ్నికుండంలోంచి అమ్మవారు ఉద్భవించారు. అందుకే అమ్మవారిని " చిదగ్నికుండసంభూతా " అని కొల...

అమ్మవారు తనను ఇష్టపడేవారిని ఎక్కువగా ఇష్టపడుతారు - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏 " శిష్టేష్టా " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 411 వ నామం. " శిష్టేష్టా " అంటే శిష్టులను అంటే మంచివారిని ఇష్టపడుతారు అమ్మవారు అని భాష్యం చెప్పారు. ప్రతీ అమ్మకు తన పిల్లలు అందరూ సమానమే అయినా బాగా శ్రద్ధగా చదువుకునేవారు, తను చెప్పిన పని శ్రద్ధగా చేసేవారు, ఎవరితోనూ గొడవలు పెట్టుకోని పిల్లలని కొంచెం ఎక్కువ ఇష్టపడుతుంది అమ్మ. అలాగే తరగతిలో పిల్లలందరూ అమాయకులు, మంచివారే అయినా వారిలో సమయానికి బడికి వస్తూ బాగా చదివేవారు, ఇతర పిల్లలతో స్నేహంగా మసిలేవారు అంటే ఉపాధ్యాయులు కొంచెం ఎక్కువ ఇష్టపడతారు. మంచివారు చాలా మందే ఉంటారు కదా. మరి అమ్మవారు ఎటువంటి మంచివారిని ఇష్టపడుతారు. పరమాత్మ ఈ విషయాన్ని గీతలో చాలా అద్భుతంగా తెలియచేసారు: " తేషాం జ్ఞానీ నిత్యయుక్త    ఏకభక్తిర్విశిష్యతే, ప్రియో హి     జ్ఞానినోఽత్యర్థమహం    స చ మమ ప్రియః "             ‌- భ.గీత 7:17 " భక్తులలో కెల్లా, జ్ఞానంతో నన్ను పూజించే వారు, మరియు నా పట్ల దృఢ సంకల్పముతో మరియు అనన్య భక్తితో ఉన్నవారిని, అందరి కంటే, శ్రేష్ఠమైన వారిగా ప...

అమ్మవారు అంటే శివునికి అమిత ప్రేమ - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏 " శివప్రియా " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్య నామాలలో 409 వ నామం. " శివప్రియా " అంటే శివునికి ఇష్టురాలు అని భాష్యం చెప్పారు. అమ్మవారిని శివుడు ఎందుకు ఇష్టపడరు. ఆయన్ని వివాహం చేసుకోవడానికి ఎంత కఠిన సాధన చేసారు అమ్మవారు. ఆయన తపస్సు చేసుకుంటూంటే సపర్యలు చేసారు. ఆయన కన్నెత్తి కూడా చూడకపోతే మండుటెండలో మంటల మధ్య నుంచుని, గడ్డకట్టే చలిలో చల్లటినీటిలో కంఠం దాకా మునిగి మరీ తపస్సు చేసారు. నిరాహారంగా అంటే ఆఖరికి ఆకులు కూడా తినకుండా తపస్సు చేసి " అపర్ణ " అని కీర్తించబడ్డారు.  క్షీరసాగరమథనం సమయంలో పుట్టుకొచ్చిన గరళాన్ని లోకకళ్యాణం కోసం తాను త్రాగక తప్పదు అని శివుడంటే సరే కానివ్వండి అన్నారు అమ్మవారు. అందరికీ శుభాలను అనుగ్రహించే అమ్మవారికి ఆవిడ మాంగళ్యం మీద అంత నమ్మకం మరి. ఏనుగుచర్మం కట్టుకుని, శరీరమంతా బూడిద పూసుకుని, మెడలో పాములు వేసుకుని, పుర్రె చేతిలో పట్టుకుని శ్మశానాలలో తిరుగుతూన్నా శివుడే నా అర్ధశరీరం అన్నారు అమ్మవారు. అలాంటి అమ్మవారిని ఇష్టపడకుండా ఎలా ఉంటారు, ఉండగలరు శివుడు. కంచిపరమాచార్యులకు 103 డిగ్రీల జ్వరం ఓరోజు. మ...

దూత/రాయబారికి ఉత్తమ లక్షణాలు ఉండాలి - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏 " శివదూతీ " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్య నామాలలో 405 వ నామం. " శివదూతీ " అంటే శివుని దూతగా కలిగినవారు అమ్మవారు అని భాష్యం చెప్పారు. ఆశ్చర్యకరంగా అనిపిస్తుంది కాని ఇది ఒక అద్భుతమయిన విషయం. దూత సామాన్యమయిన వారు కాదు. సకల సద్గుణాలు, సమస్త జ్ఞానం ఉండాలి. ఎవరు దూతగా పంపిస్తున్నారో వారి మనస్సును, మనస్సులోని మర్మాన్ని పూర్తిగా అర్ధం చేసుకుని ఉండాలి దూత. వెళ్ళిన పనిని సజావుగా పూర్తి చేసుకుని రావాలి. పని సానుకూలంగా అవడానికి అవసరమయితే సామ దానాలతో పాటు భేద దండోపాయాలు కూడా ఉపయోగించాలి. శ్రీరాముడు మొదటిసారి హనుమను కలిసినప్పుడు హనుమ మాటతీరుకు ఆశ్చర్యపోయి లక్ష్మణునితో ఇలా అంటారు:  " ఏవం గుణ గణైర్ యుక్తా    యస్య స్యుః కార్య సాధకాః,   తస్య సిద్ధ్యంతి సర్వేఽర్థా    దూత వాక్య ప్రచోదితాః "       - రామాయణం - 4:3:35 " ఎవరికైతే ఇలాంటి సకల సద్గుణాలు కలిగిన కార్యసాధకులు దూతలుగా ఉంటారో వారి పనులన్నీ నిర్విఘ్నంగా నెరవేరుతాయి " అని.  అంటే అప్పుడే శ్రీరాముడు హనుమను సీతాన్వేషణకు దూతగా పంపాలని నిర్ణయించుకున్నారు అని అర్థ...

శాంతమూ లేక సౌఖ్యము లేదు - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏 " శివంకరీ " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్య నామాలలో 408 వ నామం. " శివంకరీ " అంటే భక్తులకు మంగళకరమైన బ్రహ్మత్వమును కలిగించునది అని భాష్యం చెప్పారు. బ్రహ్మత్వము అంటే ముక్తి, జన్మరాహిత్యం. తనలో లీనం చేసేసుకుంటారు. శివం అంటే మంగళకరము. భక్తులకు అన్ని శుభాలను కలిగిస్తుంది తల్లి. మంచి ఆలోచనలు చేస్తూ, మంచి పనులు చేస్తూ ఉంటే చాలు తల్లి శిశువును చూసుకున్నట్లుగా అన్ని సౌకర్యాలను కలిగిస్తూ జీవితాన్ని ఆనందమయం చేస్తుంది. వామన పురాణం/యోగవాశిష్టంలో శివుని తెలుసుకోవడం ఎలా అన్నది తెలియచేయబడింది. " చిన్మాత్రం అమలం శాంతం " - నిర్మలమయిన జ్ఞానమయమయిన శాంతమే శివుడు అని. నిర్మలము, శాంతము అయిన మనస్సుతో సదా భగవధ్యానంతో జీవితాన్ని గడిపే జీవుడిని శివునిగా చేస్తారు అమ్మవారు. సందేహం అక్కరలేదు. విష్ణుసహస్రనామాలలో " అక్షరః " అని ఒక నామం. నాశనము లేని వాడు అని భాష్యం. మనం నాశనమయిపోయే ఈ శరీరం, ధనం, ఇతర వస్తువుల మీదే దృష్టి పెడతాం, నాశనం అయిపోతున్నాం. అదే నాశనము లేని పరమాత్మ మీద దృష్టి పెడితే మోక్షమే. తిరిగి జననమరణచక్రం ఉండదు. పరమాత్మ గీత...

అమ్మవారు శివుడు ఒకరే - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏 " శివమూర్తిః " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్య నామాలలో 407 వ నామం. " శివమూర్తిః " అంటే శివుడే స్వరూపంముగా గలది అని భాష్యం చెప్పారు. శివుడు, అమ్మవారు ఒకరే. అర్ధనారీశ్వరుడు. బ్రహ్మగారిని సృష్టి చేయమంటే ఆయనకు ఎలాగో తెలియలేదు. నిరంతరం జీవులు పుడుతూ ఉండడం ఎలా అని. రుద్రుడిని ధ్యానం చేసారు. అప్పుడు రుద్రుడు అర్ధనారీశ్వరుడిగా దర్శనం ఇచ్చారు. స్త్రీపురుషులను సృష్టించాలని తెలుసుకున్నారు బ్రహ్మ.‌ రఘువంశకావ్యం రచిస్తూ మహాకవి కాళిదాసు ఇలా స్తుతించారు: " వాగర్థావివ సంపృక్తౌ        వాగర్థ ప్రతిపత్తయే,   జగతః పితరౌ వందే      పార్వతీపరమేశ్వరౌ " 1-1 పార్వతీపరమేశ్వరులు " వాక్ + అర్ధం " లా ఉన్నారుట. నోటి వెంట మాట వస్తే అర్ధం లేకుండా ఉండదు. అవి వేరు వేరు కాదు, రెండూ ఒకటే అని. భృంగి మహర్షి శివుని పరమభక్తుడు. శివుడిని తప్ప ఎవరినీ పూజించేవాడు కాదు. ఓసారి కైలాసం వెళ్ళి శివుడికి ప్రదక్షిణలు చేయడం మొదలుపెట్టాడు. శివుడి ప్రక్కనే అమ్మవారు ఉన్నా శివుడికి మాత్రమే ప్రదక్షిణలు చేస్తూ శివపార్వతుల మధ్యనుంచి వెడుతున్నాడు.‌ అమ్మవారు శివు...

మన శరీరం ఒక క్షేత్రం, అంటే పొలం - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏 " క్షేత్రస్వరూపా " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్య నామాలలో 341 వ నామం. " క్షేత్రస్వరూపా " అంటే క్షేత్ర స్వరూపురాలు.  క్షేత్రం అంటే ఏమిటి?.  పరమాత్మ గీతలో ఇలా తెలియచేసారు: " ఇదం శరీరం కౌన్తేయ    క్షేత్రమిత్యభిధీయతే ।   ఏతద్యో వేత్తి తం ప్రాహుః    క్షేత్రజ్ఞ ఇతి తద్విదః "               - భ.గీత 13:2 " ఈ దేహము క్షేత్రము అని, మరియు ఈ దేహమును గూర్చి తెలిసిన వానికి క్షేత్రజ్ఞుడు అని - ఈ రెండింటి గురించి బాగా తెలిసిన ఋషులచే చెప్పబడినది " అని. మన శరీరం క్షేత్రం అన్నారు. క్షేత్రం అంటే పొలం. అంటే మన శరీరం ఒక పొలం. పొలంలో పంటలు కదా పండుతాయి. మరి శరీరానికి విత్తనం ఏది. మనం చేసే కర్మే విత్తనం. మంచి కర్మ అయితే మంచి పంట, చెడు అయితే చెడు పంట.  అమ్మవారు క్షేత్ర/శరీర స్వరూపురాలు ఎలా. శరీరమంతా వ్యాపించిన అమ్మవారి చైతన్యం వలననే మన ఇంద్రియాలు అన్నీ పనిచేస్తున్నాయి. మరణించిన తరువాత కూడా అదే శరీరం అక్కడే ఉంటూంది కదా. ఈ శరీరానికి అధిపతి అమ్మవారు. అమ్మవారు ( చైతన్యం ) ఉంటే జీవం, తొలగుతే మరణం. అ...

ప్రభావధర్మాన్ని అనుసరించడం అలవాటు చేసుకోవాలి - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏 " స్వభావమధురా " - అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్య నామాలలో 915 వ నామం. మధురం అంటే తేనె. అమ్మవారి స్వభావం తేనెలా తియ్యగా ఉంటుంది. అమ్మవారికి లేనిదిలేదు, పొందవలసినది లేదు, ఇవ్వలేనిదిలేదు. ఆవిడ స్వభావం మధురంగా ఉండక వేరేలా ఎలా ఉంటుంది. పూజ్యులు గరికిపాటివారు తరచూ అంటూంటారు " అసలు అమ్మవారికి జీవులమీద కోపం ఎందుకు ఉంటుందండి " అని. ధర్మపాలన మూడు రకాలుగా ఉంటుంది అని తెలియచేస్తున్నాయి శాస్త్రాలు. మొదటిది స్వభావధర్మం. కొందరికి ఎవరూ చెప్పనక్కరలేదు. స్వతహాగానే ధర్మపాలన చేస్తూంటారు. రాముడు, ధర్మరాజు లాంటివారు ఆ కోవలోకి వస్తారు. రాముడిని ఒక రాక్షసుడు " రామో విగ్రహవాన్ ధర్మః " అని కొనియాడాడు. అంతటి ధర్మమూర్తి. " ధర్మ ఏవ మనః కృష్ణే స్వభావ " - " ధర్మంగా ఉండడం నా స్వభావం మరి, ఏమి చేయమంటావు " అంటారు ధర్మరాజు ద్రౌపదితో. ఇక రెండవరకం " ప్రభావధర్మం " - చెప్పగా చెప్పగా సాధన చేస్తూ ఉంటే అలవడుతుంది. ఇదే ఈకాలంలో ఎక్కువగా పొందగలిగినది/పొందవలసినది. సనాతనధర్మ పరిరక్షణకోసం, సమాజానికి ఉపయోగపడే పనులు చెయ్యగా చెయ్యగా ...

భూదేవిని జాగ్రత్తగా చూసుకుంటే అన్నీ సమకూరుస్తారు - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏 " ధరా " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్య నామాలలో 955 వ నామం .  " ధరా " అంటే పృథివీ స్వరూపురాలు. అంటే భూమి. భూమికి అత్యంత గౌరవాన్నిచ్చింది సనాతనధర్మం. ఏది కావాలన్నా భూమి నుంచే రావాలి. ఆహారము, నీరు, ఔషధాలు, లోహాలు, ఇంధనాలు ఏవి చూసినా భూమినుంచే వస్తాయి. మనుగడకు అవసరమైనవి అన్నీ భూమే ఇస్తూంది. అటువంటి భూమిని ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి. సనాతనధర్మం భూమిని దేవతగా కొలవమంది. అథర్వవేదంలో " భూమి సూక్తం" ఉంది. అందులో ఇలా కీర్తిస్తారు: " సత్యం బృహత్రితముగ్రం    దీక్షా తపో బ్రహ్మ యజ్ఞః    పృథివీం ధారయంతి,   ‌ సా నో భూతస్య భవ్యస్య    పత్న్యురుం లోకం    పృథివీ నః కృణోతు " ఉత్కృష్టమైన సత్యం, చెక్కుచెదరని నిజాయితీ, పవిత్రత, తపస్సు, సచ్ఛీలజీవితం ద్వారా సంక్రమించే శక్తి, యజ్ఞం - ఇవే ఈ భూమిని భరిస్తున్నాయి అని. అంటే భూమి కలకాలం చక్కగా అలా నిలిచి ఉండాలంటే ఎన్ని సుగుణాలు ఉండాలి మనుషులకు. ఇప్పుడు పరిస్థితి ఏమిటి అన్నది అందరికీ తెలిసినదే. ఎమ్ ఎస్ సుబ్బులక్ష్మి గారిని ఐక్యరాజ్యసమితివారు ఆహ్వానించారు సన్మానం చేయడానికి. ఆవి...

ఆకాశాన్నించే అన్నీ వస్తాయి, దానిని ( ఓజోన్ ) కాపాడుకోవాలి - చీమలపాటి సూర్యనారాయణ

 🙏" శ్రీమాత్రేనమః "🙏 " ఓజోవతి " - అమ్మవారి అద్భుతనామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 767వ నామం. ఓజస్సు ని కలిగి ఉన్నది, ప్రసాదించేది అని అర్ధం. దీనిని భగవత్ శక్తిగా చెబుతారు. శరీరం సప్తధాతువులతో అనగా " రసం, రక్తం, మాంసం, మజ్జ, ఎముక, మేధస్సు, శుక్రము " లతో కూడినది అంటారు. సప్తధాతువుల ప్రస్థావన శ్రీశంకరుల " నిర్వాణషట్కం " లో కూడా ఉంది. ఇంకో 2 సూక్ష్మధాతువులు ఉన్నాయి. అవి " ప్రాణము, జీవము ". ఈ ప్రాణము జీవము కలిసి " ఓజస్సు " అని పిలవబడుతూంది. ఏ జీవికైనా ప్రాణం తో బాటు జీవం కూడా ఉండాలి. అందుకే ఎవరైనా డల్ గా ఉంటే మనిషిలో జీవం లేదు ( ప్రాణం ఉన్నా ) అంటూంటారు.  " కాశం " అంటే వెలుగు, ఆకాశం అంటే సంపూర్ణమైన వెలుగు. అంతేకాని అందరూ ఇప్పుడు అనుకుంటూన్నట్లు " శూన్యం " కాదు. " ఖం " అంటే ఆకాశం. మనం " సు " కలుపుకుంటే సుఖం, " దుః " కలుపుకుంటే దుఃఖం. ఆకాశానికి ( అమ్మవారికి ) ఏమీ సంబంధం లేదు. ఏది కలుపుకోవాలో తెలియని దోషం జీవులలోనే ఉంది. " ఆకాశాత్ వాయుః అన్నాత్ పురుషః " అని తెలియచేసాయి ...

ఇంద్రియములు అన్నీ అమ్మవారి ధ్యానంలో ఉండాలి - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏 " బ్రహ్మాత్మైక్యస్వరూపిణీ " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్య నామాలలో 672 వ నామం . " బ్రహ్మాత్మైక్యస్వరూపిణీ " అంటే చైతన్యము ( తన ) తో జీవునికి ఐక్యము కలిగించుటయే తన నిజస్వరూపముగా గలది. ప్రతీ జీవి అమ్మవారి చైతన్యమే.‌ మళ్ళీ ఈ చైతన్యం అమ్మవారిలో ఐక్యమవడమే ముక్తి. పాపపుణ్యాలు రెండూ నశించిన తరువాతే ముక్తి కలుగుతుంది. దీనికోసం ఎన్నో జన్మలు సాధన చేయాలి. దానికి అమ్మవారి సహకారం ఎలాగూ ఉంటుంది. అమ్మవారు ముక్తిప్రదాత. సాధన ఎలా ఉండాలంటే అమ్మవారు ఇచ్చిన ఈ సర్వేంద్రియాలు అమ్మవారి ఆరాధనకోసమే అనే భావనతో ఉండాలి. సర్వేంద్రియాలతో ఎవరు కృష్ణ భక్తిరసాన్ని పానం చేస్తారో ఆ జీవుడిని గోపి అన్నారు. ఈ గోపీ తత్వానికి అధిష్టాన దేవత రాధాదేవి. ఆనందస్వరూపిణి. మంత్రాలకు అధిదేవతలు ఉంటారు. వేదమంత్రాలు విష్ణువు గురించి తపస్సు చేస్తే ఏమి కావాలి అన్నారు విష్ణువు. " ఎప్పటినుంచో మిమ్మల్ని స్తుతిస్తూనే ఉన్నాం, ఎప్పుడు మేము మీలో ఐక్యమయేది, ఎప్పుడు అనుగ్రహిస్తారు మమ్మల్ని " అంటే కృష్ణావతారంలో గోపికలుగా పుట్టండి అన్నారు. గోపికలకు ఇంకోపేరు ఉపనిషత్కాంతలు. అలా...

సత్సాంగత్యం కలగడం అంత సులభం కాదు - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏 " వీరగోష్ఠీప్రియా " అమ్మవారి ఒక అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 898 వ నామం. " వీరగోష్ఠీప్రియా " అంటే వీరుల సభ ఇష్టముగా గలది. " వీరులు " అంటే దీక్షలో ఉన్నవారు అని అర్ధం. అంతేకాని బలమైనవారు, ఆయుధాలు ధరించినవారూ అని కాదు. వీరులు కూర్చుని మాట్లాడుకుంటూంటే మురిసిపోతారుట అమ్మవారు. అటువంటివారు ఓ చోట చేరినప్పుడు ఏ విషయాలు మాట్లాడుకుంటారు? " మహాసంగస్తు దుర్లభో    అగమ్యో అమోఘశ్చ   సర్వదా తదేవ సాధ్యతాం  ‌  తదేవ సాధ్యతాం "  అన్నారు నారదమహర్షి. సత్సాంగత్యం లభించడం కష్టంట. కాని దొరికాక అమోఘం అని. ఇంక వారికి నిత్యం ఆనందమే. కొందరు కనకదుర్గమ్మ దీక్ష తీసుకుంటారు. కొందరు అయ్యప్పస్వామి, హనుమ దీక్ష తీసుకుంటారు. అటువంటి వారు కొందరు ఓచోట కలిసి కూర్చున్నప్పుడు ఆ దేవీదేవతల మహిమలగురించి మాట్లాడుకుంటూ ఉంటారు‌. నామజపం, భజనలు చేసుకుంటారు. అక్కడ వాతావరణం పవిత్రంగా ఉంటుంది. పరమాత్మ భగవద్గీతలో ఇలా తెలియచేసారు: " మచ్చిత్త మద్గ తప్రాణ    బోధయంత: పరస్పరం.   కథయన్తశ్చ మాం నిత్యం    తుష్యన్తి చ రమన్తి చ "       ...

వేదమాత శ్రీగాయత్రీదేవి జయంతి నేడు, శుభాకాంక్షలు - చీమలపాటి సూర్యనారాయణ

 🙏" శ్రీమాత్రేనమః"🙏 ఈరోజు వేదమాత శ్రీగాయత్రీదేవి జయంతి. జ్యేష్ట శుద్ధ ఏకాదశి. శుభాకాంక్షలు. " గాయత్రి " - అమ్మవారి అద్భుతనామం. ఇవి శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 420 వ నామం.  " న గాయత్ర్యాః పరంమంత్రం    నమాతుః పరదైవతమ్‌ " - అంటే తల్లిని మించిన దైవము లేదు. గాయత్రిని మించిన మంత్రము లేదు అని భావము.  గాయత్రీ మంత్రము మొదటగా ఋగ్వేదములో చెప్పబడింది. "గయాన్‌ త్రాయతే ఇతి గాయత్రి" అని ఆదిశంకరులవారు భాష్యం చెప్పారు . గయలు అనగా ప్రాణములు అని అర్థము. త్రాయతే అనగా రక్షించడం. కనుక ప్రాణములను రక్షించే మంత్రం గాయత్రీ మంత్రం. వాల్మీకిమహర్షి 24 వేల శ్లోకాలతో రామాయణంని వ్రాసారు. ప్రతి వేయి శ్లోకాల తరువాత శ్లోకంలో మొదటి అక్షరం గాయత్రీ మంత్రంలోని ఒక అక్షరాన్ని పెట్టి వ్రాసారు. " గాతారం త్రాయతే ఇతి గాయత్రి " అంటే గానం చేసేవారిని రక్షిస్తుంది కనుక గాయత్రి అని తెలుసుకోవాలి. " గాయత్రీం ఛందసాం మాతా " అన్నాయి వేదాలు. ఛందో బద్ధం కనుక వేదం పేరు ఛందస్సు. వేదం యొక్క సారమే గాయత్రి అమ్మవారు. అందుకే ఆవిణ్ణి వేదమాతగా కొలుస్తారు. ఆవిణ్ణి " త్రిపదగాయత్రి "...

అమ్మవారు (శక్తి ) తోడు లేకపోతే శివుడు కూడా జడమే - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏 " పంచప్రేతమంచాధిశాయినీ " - అమ్మవారి అద్భుతనామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 947 వ నామం. " పంచప్రేతమంచాధిశాయినీ " అంటే చైతన్యం ( అమ్మవారు - శక్తి ) ప్రవేశిస్తేనే ప్రేతాలు పనిచేస్తాయి అని. లేకపోతే జడమే. పంచప్రేతా = పంచప్రేతాలైన బ్రహ్మ, విష్ణు, రుద్ర, ఈశ్వర , సదాశివులు. అధిశాయినీ = అధిష్టించి ఉన్నది. ప్ర + ఈతా = ప్రేతా అని విడదీస్తే అసలైన శాస్త్రార్ధం వస్తుంది. ప్ర – అంటే చక్కగా, ఈతా – అంటే వెళ్ళిపోయినది. చక్కగా వెళ్ళిపోయినది ఏమిటి జీవం/చైతన్యం/శక్తి. శక్తి లోపల ఉంటే జీవుడు, శక్తి వెళ్ళిపోగానే ప్రేతం. పంచభూతములు ప్రేతములే. పరమేశ్వరుడు నిష్క్రియుడు. పంచభూత రూపుడయిన పరమేశ్వరుడు అమ్మవారి చైతన్యంతో సకలకార్యాలు జరుపుతున్నాడు అని తెలుసుకోవాలి. ఆదిశంకరులు సౌందర్యలహరి గానం చేస్తూ అమ్మవారిని ఇలా స్తుతిస్తారు: " గతాస్తే మంచత్వం    ద్రుహిణహరి రుద్రేశ్వరభృతః   శివస్స్వచ్ఛచ్చాయా    కపటఘటిత ప్రచ్ఛదపటః   త్వదీయానాం భాసాం    ప్రతిఫలన రాగారుణతయా   శరీరీ శృంగారో రస ఇవ    దృశాం దోగ్ధికుతుకమ్ " - 92 " శక్తి తోడు లేకపోతే ఎంతటి ...

సాధన చేయగా చేయగా అమ్మవారు అనుగ్రహిస్తారు - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏 " దుర్లభా " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 188 వ నామం . " దుర్లభా " అంటే పొందశక్యము కానిది అని అర్ధం చెప్పారు కాని సులభంగా పొందగలిగేవారు కాదు అమ్మవారు అని తెలుసుకోవాలి. సాధన కొంచెం ఎక్కువగా చేయవలసి ఉంటుంది. మూకశంకరులు వారి ఆర్యాశతకములో కామాక్షీదేవిని ఇలా ప్రార్థిస్తారు: " చింతితఫలపరిపోషణ    చింతామణిరేవ  కాంచినిలయా మే,      చిరతరసుచరితసులభా       చిత్తం శిశిరయతు చిత్సుధాధారా "                       - ఆర్యాశతకం:3 అమ్మవారు కోరిన కోరికలు అన్నీ తీర్చే చింతామణిట‌. ఎప్పుడు అంటే " చిరతరసుచరిత " అన్నారు. అంటే చిరకాలము చక్కగా భక్తిగా సేవచేసుకుంటే అమ్మవారు సులభంగానే అనుగ్రహిస్తారు అని. ఆదిశంకరులు సౌందర్యలహరిలో అమ్మవారిని ఇలా ప్రార్థిస్తారు: " త్రయాణాం దేవానాం త్రిగుణ................   ....‌...ముకిళితకరోత్తంస మకుటాః " శంకరులు " నీ త్రిగుణాల చేత పుట్టిన త్రిమూర్తుల పూజ అంటే నీ పాదపూజే కదమ్మా. నువ్వు పాదాలు పెట్టుకునే రత్నపీఠం దగ్గరే కదా త్రిమూర...

ఆనందించే గుణాన్ని అలవాటు చేసుకోవాలి - చీమలపాటి సూర్యనారాయణ

 🙏" శ్రీమాత్రేనమః"🙏 " రసజ్ఞా " - అమ్మవారి అద్భుతనామం.  శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 799 వ నామం. " రసజ్ఞా " అంటే రసములగురించి తెలిసినది అని అర్ధమయినా ఆవిడ " రసస్వరూపిణి ". వేదాలు పరమాత్మని " బ్రహ్మానందరస స్వరూపం " అని తెలియచేస్తున్నాయి. రసలక్షణం లోపల ఉంటేనే మనిషికి ఉత్సాహం, ప్రేమ, ఆనందం, ఉల్లాసం ఉంటాయి. రసభావన లేకపోతే ఏదీ ఆనందించలేడు, అందుకే జీవితం వ్యర్ధం అంటారు. నవరసాలు + భక్తి తో కూడిన 10 రసాల సమాహారమే జీవితం. అందుకే తరచుగా ఈ భావన లేని మనిషిని " రసహీనుడు " అంటారు.  మహాకవి కాళిదాసు కూడా విద్వత్సభకి వెళ్ళేటప్పుడు " ప్రేక్షకుల్లో కొందరైనా రసజ్ఞులు ఉండేలా చూడు తల్లీ " అని ప్రార్ధించేవారుట. చాగంటివారైనా, గరికిపాటివారైనా ప్రవచనం చేసినప్పుడు కొందరైనా ఆనందించేవారు, ఆనందం వ్యక్తపరచేవారూ ఉండాలి కదా. ఆ భావన అందరిలోనూ ఉండాలి. అప్పుడే సర్వం ఆనందమయం. ఆ రసభావన ఇచ్చేది అమ్మవారే. మధురమైన ( రస ) సంభాషణ ఎంతటివారినైనా కట్టిపడేస్తుంది. మా గ్రామవాసి, బంధువు అయిన " పండితరాజ " జగన్నాధపండితులు తన 25వ ఏటే కాశీవిశ్వవిద్యాలయానికి ము...

పనికిరాని పుస్తకాలు చదువకూడదు - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏 " కావ్యాలాప వినోదినీ " - అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్య నామాలలో 613 వ నామం.  " కావ్యాలాప వినోదినీ " అంటే " కావ్యపఠనంతో మిక్కిలి సంతోషించునది " అని అర్థం. " వాక్యం రసాత్మకం కావ్యం " - వాక్యాలు రసాత్మకంగా ఉంటే కావ్యం అంటారు. కావ్యాలను చదువుతూంటే విని ఆనందిస్తుంది అమ్మవారు. వేదాలలో " కావ్యాలాపాంత వర్జయేత్ " అని ఉంటుంది- అంటే కావ్య పఠనం వద్దు అని. అదేమిటీ అనుకోవచ్చు కాని దాని అర్ధం " అసత్ కావ్యాలు " అంటే పనికిరాని పుస్తకాలు చదవకండి అని. కావ్యాలు 2 రకాలు సత్ కావ్యాలు అంటే " ధర్మం, భక్తి, జ్ఞానం " లని వృద్ధిచేసేవి. అసత్కావ్యాలు అంటే సత్కావ్యాలు కానివి.  మానవులు 3 రకాలుగా కాలక్షేపం చేస్తారు అని ఈ సందర్భంగా పూజ్యులు సామవేదం వారు తెలియచేసారు. మొదటివారు సత్కావ్యాలు చదువుతూ ఉంటారు . వారి మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. ఎల్లప్పుడూ మంచి ఆలోచనలే వస్తూంటాయి. అమ్మవారి అనుగ్రహం పొందుతారు. సుఖ దుఃఖాలను ఒకే విధంగా చూస్తూ జీవిస్తారు.  ఇక రెండో రకం మనుషులు. వీరు పాత బాధలను కష్టాలను తలచుకుని తలచుకు...

ధర్మ ఏవ హతో హంతి - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీరస్తు శుభమస్తు"🙏 " మూలం హి విష్ణుర్దేవానాం    యత్ర ధర్మః సనాతనః,   తస్య చ బ్రహ్మగోవిప్రాస్తపో    యజ్ఞాః సదక్షిణాః "         - భాగవతం 10:04:39 " తస్మాత్సర్వాత్మనా రాజన్    బ్రాహ్మణాన్ బ్రహ్మవాదినః .    తపస్వినో యజ్ఞశీలాన్    గాశ్చ హన్మో హవిర్దుఘాః "          - భాగవతం 10:04:40 మహాభాగవతంలోని అద్భుత శ్లోకాలు ఇవి. కనీసం వేల సంవత్సరాల క్రితం వ్రాసినవి అయినా నేటికీ ఇందులో తెలియచేసినదే జరుగుతూంది. తనను చంపే కృష్ణుడు ఎక్కడ పెరుగుతున్నాడో తెలియదు కంసుడికి. అందుకని రాక్షసులని అన్ని దిక్కులకూ పంపుతూ కంసుడు " వేదము, ఆవు, బ్రాహ్మణుడు, తపస్సు, యజ్ఞము ఎక్కడ ఉంటారో అక్కడ సనాతనధర్మం వెల్లివిరిస్తూ ఉంటుంది. అక్కడ విష్ణువు ఉంటాడు. ఇవన్నీ విష్ణువు శరీరభాగాలే, విష్ణువే సనాతనధర్మం. విష్ణువుని దెబ్బ కొట్టాలంటే సనాతనధర్మంని నశింపచేయాలి. అంటే వేదాలని, ఆవులను బ్రాహ్మణులను, తపస్సును, యజ్ఞాలని లేకుండా చేయాలి. వెళ్ళి ప్రతీచోటా వీటిని నశింపచేయండి " అని ఆదేశిస్తాడు.  ఈనాడు కూడా సనాతనధర్మంని గొయ్య...