Posts

Showing posts from May, 2019

ప్లానింగ్

పేకాట ఆడే ఆయన డబ్బుని దానధర్మాలు చెయ్యడానికి కాదు కదా పేకాట లో కూర్చునేది - తన కి ఎడమప్రక్క ఎవడొస్తాడో తెలియదు, ఆట ఆడతాడో డ్రాప్ వేస్తాడో తెలియదు - ఈయన ఆట అయిపోయేలా చేసే 3 విడి ముక్కలు  ప్రక్కాయన దగ్గిరున్నాయి అనుకుందాం -  ఈయన హేండ్ రైజ్ అయితే ప్రక్కాయన  2 జోకర్లు ఉన్నాయి కనుక 2 రౌండ్స్ చూద్దామని ఆడచ్చు, ఈయన హేండ్ డౌన్ అయితే ఎందుకొచ్చిన గొడవని డ్రాప్  చేయవచ్చు. ఆట ఆడేవాళ్ళందరికీ వాళ్ళ వాళ్ళ చక్కటి ప్లాన్ లు ఉంటాయి - మరి అందరూ ఎలా నెగ్గుతారు, చక్కటి ప్లాన్ ఉన్నా హేండ్ రైజ్ తోడవ్వాలి.  మొహమ్మద్ గజనీ , ఘోరీ , బ్రిటిషర్స్ అందరూ చక్కటి ప్లాన్లు వేసుకునే వచ్చారు - వాళ్ళ భక్తులకి అవి చక్కటి ప్లాన్లు గా అనిపిస్తాయి కాని   మనకి అవి కుట్రలు , దాడి గా అనిపిస్తాయి - అంతెందుకు పుల్మా దాడి చూస్తే ఉగ్రవాదులు ఎంతో చక్కటి ప్లాన్ తో దాడి చేసి సక్సెస్ అయేరని వాళ్ళని మెచ్చుకుంటామా మనం , కాని  వాళ్ళ భక్తులు గొప్పగా నలుగురికీ చెప్పుకుంటారని అనుకోవచ్చు. చక్కటి  ప్లాన్ తో వెడుతున్నామనుకుని కమ్యూనిష్టులు జ్యోతిబసుకు పి ఎం పదవి ని వద్దన్నారు , తరువాత తెలుసుకున్నారు ...

మరక మంచిదే

నేను ఓ బ్రాంచ్ లో మేనేజర్ గా చేరిన 2,3 నెలలకి గోదావరికి ఉధృతం గా వరదలొచ్చాయి - ప్రక్క గ్రామాలలోకి కూడా బ్యాక్ వాటర్ వచ్చేసింది. లంక గ్రామాలన్నీ మునిగిపోయాయి - 2 రోజుల తరువాత కొంచెం తగ్గుముఖం పట్టేక ఇద్దరు స్టాఫ్ తో కలిసి ఓ పడవ మీద లంక గ్రామాలలోకి వెళ్ళాను - తమలపాకు తోటలు , కూరగాయల తోటలు మునిగిపోయాయి, ఇళ్ళలోకి నీళ్ళు , అరుగుల మీద బిక్కు బిక్కు మంటూ ప్రజలు - అయ్యో పాపం అనిపించింది గోదావరి జిల్లాలో  అదీ కోనసీమ లో పుట్టి పెరిగిన నాకే. తిరిగి రాగానే ఓ పెద్దాయన ఇంటికి వెళ్ళాం, ఓ 75 ఏళ్ళు  ఉంటాయి ఆయనకి , అందరికీ తలలో నాలుకలా ఉంటారంటారు. " ఏమండీ వరద  పరిస్థితి దారుణం గా ఉంది - తలో చెయ్యి వేస్తే నయమేమో మా ఆర్ ఎం గారి తో కూడా మాట్లాడుతాను , మీ అభిప్రాయం ఏమిటి " అని అడిగాను. ఆయన నా వేపు " అదోలా " చూసి - మరీ సెంటిమెంట్ ఫీల్ అయిపోయి కన్నీళ్ళు పెట్టేసుకోకండి , 4  ఏళ్ళకొకసారైనా ఇలా వరదలొచ్చి  మొత్తం కొట్టుకుపోకపోతే వీళ్ళని పట్టుకోగలమాండీ  , భూమ్మీద  నుంచోరు వీళ్ళు  , అందుకని ఎమోషనలవక ఇంటికి పోయి వేడన్నం తిని హాయిగా పడుకోండి " అన్నారు ఆ పెద్దాయన - జీవితాన్ని కా...

ద్రోణగిరి కధ

" ఇతితే జ్ఞానమాఖ్యాతం గుహ్యతే గుహ్యతరం మయా విమృశ్యైతదశేషేణ   యధేచ్ఛసి తధా కురు   "  " నేను చెప్పవలసింది చెప్పేసాను . నేను చెప్పానని కాకుండా నీ బుద్ధితో విమర్శించుకుని నీకు తోచిన విధం గా ఆచరించమని " నిర్మొహమాటం గా చెప్పాడు శ్రీకృష్ణుడు గీతలో   ఉత్తరాఖండ్ లో ద్రోణగిరి అనే ఊరు ఉంది - ఆ ఊరిలో ఏ ఇంట్లోనైనా హనుమంతుడి ఫొటో పెట్టుకుంటే శిక్ష వేస్తారు , ఆయన్ని ఎవరూ ప్రార్ధించకూడదు , ఆయన పేరు కలిసేలా పేరు     పెట్టుకోకూడదు , హనుమంతుడంటే కోపం - బయటవాళ్ళకి ఆశ్చర్యం గా నూ వింతగానూ ఉండచ్చు - దానిని బయటివాళ్ళు " హేట్రెడ్ " అనో " ప్రిజుడీస్ "  అనో అనుకోవచ్చు - కాని ఆ ఊరి వాళ్ళ భావాలు వాళ్ళవి - వారి దృష్టిలో   హనుమంతుడు దొంగ , వాళ్ళ ఊరిలో ఉండే సంజీవనీ పర్వతాన్ని వేరేచోటికి తీసుకుపోయాడని . వారి భావాన్ని వారి భావం గా నే చూడాలి కాని మనమీద రుద్దుతున్నారని భావించకూడదు - శుభం భూయాత్  

విషవృక్షం

ఐ ఐ ఎం అడ్మిషన్ కి లేక ఏదైనా పెద్ద కంపెనీ లో ఉద్యోగానికి వెళ్ళిన వాళ్ళకి గ్రూప్ డిస్కషన్స్ , ఓ విషయం ఇచ్చి 10 ని లు మాట్లాడమనడం   జరుగుతుంది - ఇది ఎలా ఉంటుందంటే 10 ని లలో 5 ని ఫర్   గాను 5 ని ఎగైనస్ట్ గాను   మాట్లాడాలంటారు - అంటే ప్రతీ విషయం లోనూ + , - ఉంటాయనడం లో   అనుమానమక్కరలేదు . " రాముడి " మీద కూడా మాట్లాడమనచ్చు . దీని కోసం రంగనాయకమ్మ గారి " రామాయణ విషవృక్షం " చదవక్కరలేదు - శ్రద్ధ పెట్టాలే కాని మనకే బోల్డన్ని పోయింట్స్ దొరుకుతాయి . ఈవిడ నవల " కూలిన గోడలు " 1968/69 లో అనుకుంటా చదివాను - ఎంత అద్భుత శైలి - కన్నీళ్ళు వస్తాయి కొన్ని చోట్ల - తరువాత స్వీట్   హోం సీరీస్ . ఇలాంటి ఆవిడ " విషవృక్షం " ఎలా వ్రాయగలిగింది అని ఆశ్చర్యం వెయ్యకమానదు . ఓ కారణం చెప్పుకోవచ్చు . మన గ్రూప్ లో ఉన్న మిత్రులనే తీసుకుందాం - ఎవరికీ ఏ నాయకుడి మీద ప్రత్యేకమైన అభిమానం కాని ద్వేషం కాని ఉండడానికి ఆస్కారం లేదు ఎందుకంటే ఎవరికీ ఆ నాయకుల వల్ల డైరక్ట్ గా కాని ఇండైరక్ట్ కాని ...

దేముడు పని ఏమి

ఓ రాజు గారికి ఓ సందేహం వచ్చింది - " దేవుడు ఎక్కడ ఉంటాడు, ఏ ప్రక్కకు చూస్తూంటాడు, ఎప్పుడూ ఏమి  చేస్తూంటాడు " - అని. సరే చాటింపు  వేయించాడు - ఎవరైనా చెప్పి అతన్ని ఒప్పిస్తే మంచి బహుమానం ఒప్పించలేకపోతే శిక్ష అని. శిక్ష ఉండడం తో ఎవరూ ముందరికి రావటం లేదు. ఓ బ్రాహ్మణుడి కి కొన్ని గోల్స్ ఉన్నాయి " మనకి "  లాగానే. వచ్చాడు రాజ దర్బార్ కి - నేను చెబుతానంటే చెప్పమన్నాడు రాజు. ఈయన అన్నాడు " మీరు అడిగిన వారు, నేను చెప్పే వాణ్ణి , నేను మీకు గురువుని కదా , మీరు కూర్చోవడం నేను నిల్చోవడం బాగుండదు కదా " అని. వెంటనే రాజు ఈయన్ని సిం హాసనం మీద కూర్చోమని తను  ఆయన ముందర నుంచున్నాడు " -  సరే  ఈయన " ఎక్కడున్నాడు " కి పాలలో నెయ్యి ఉన్నట్లుగా నీలోనూ ఉన్నాడు సాధించి శోధించాలి అని , ఓ దీపం ని వెలిగించి అది అన్ని దిక్కులా చూసినట్లు దేవుడు అన్ని వేపులా చూస్తాడు అని చెప్పాడు. ఇప్పుడు ముఖ్యమైనది  " దేవుడు ఏమి చేస్తూంటాడు " అని - ఈయన అన్నాడు " మీరు మహారాజులు నేను అతి సామాన్యుణ్ణి - నన్ను మీ సిం హాసనం లో కూర్చోపెట్టి నా ముందర మిమ్మల్ని నుంచోపెట్టాడు - దేవుడు ఆ...