" చింతామణి గణపతి - 3 "- చీమలపాటి సూర్యనారాయణ
🙏"శ్రీరస్తు శుభమస్తు"🙏 " చింతామణి గణపతి - 3 " గణుడు చింతామణిని బలవంతంగా తీసుకుపోగానే కపిలమహర్షి అమ్మవారిని ధ్యానించి జపం చేయగానే అమ్మవారు ప్రత్యక్షమై " దేనికి నాయనా పిలిచావు " అని అడిగితే మహర్షి అద్భుతమయిన విషయాలు ( మనకు కూడా ) చెప్పారు. " అమ్మా గణుడు మణిని తీసుకుపోయాడు. నాకు ఆ మణిమీద కోరికాలేదు, దాని అవసరమూ లేదు, అతను తీసుకుపోయాడని బాధాలేదు. కాని అటువంటి అద్భుతమైన మణి అటువంటివారి వద్ద ఉండకూడదు. అన్నీ మణివల్ల తేరగా వస్తున్నాయంటే రాజు, ప్రజలు సోమరులవుతారు. ఖాళీగా కూర్చుని సమయం ఎలా గడపాలో తెలియక వ్యసనపరులు అవుతారు. రాజ్యం ( దేశం ) ప్రజలు భ్రష్టుపట్టిపోతారు " అని చెప్పి ఎలాగయినా ఆ మణి తిరిగివచ్చేలా చెయ్యమ్మా అన్నారు. ప్రస్తుత పరిస్థితులు చూస్తే ఇది ఎంత సత్యమో తెలుస్తుంది. అమ్మవారు ఓ మంత్రం చెప్పి " దీనిని జపం చేసి హోమం చెయ్యి. మణిని తీసుకొచ్చే ఆయన వస్తాడు " అని చెప్పారు. మహర్షి అలా చేయగానే హోమగుండంలోంచి సిద్ధీ బుద్ధీ సమేత మహాగణపతి వచ్చి " విషయం నేను చూసుకుంటానులే " అన్నారు. అవినీతి, అరాచకాలు చేసేవారు కొంచెం ఎక్కువ జాగ్రత్తగా ...