Posts

Showing posts from June, 2023

శ్రీలలితానామం 946

 🙏"శ్రీమాత్రేనమః"🙏 " పంచయజ్ఞప్రియా " - అమ్మవారి అద్భుతనామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాల్లో 946 వ నామం. ఈ నామానికి అర్ధం " పంచయజ్ఞములను ఇష్టపడునది " అని. సాధారణంగా  పంచయజ్ఞములు అంటే " బ్రహ్మ, పితృ, దైవ, భూత, మనుష్య " యజ్ఞాలు. వేదం చెబుతూన్నది అగ్నిహోత్రం, దర్శపూర్ణమాసలు, చాతుర్మాస్యలు, పశు, సోమములు అనే పంచయజ్ఞాలు. యజ్ఞం వేరు, యాగం వేరు. " యజ్ఞానాం జపయజ్ఞోస్మి " అన్నారు పరమాత్మ గీతలో. ఏ పని చేసినా యజ్ఞంలా శ్రద్ధగా చెయ్యాలంటారు.  యాగాన్ని ఒక యజ్ఞం అనుకోవచ్చు,  శ్రద్ధగా చేస్తారు కనుక.  కాని యజ్ఞాలన్నిటినీ యాగం అనుకోకూడదు. అవి నది, సముద్రం లా వేరువేరు, రెండింటిలోనూ నీరే ఉన్నా.  యాగం అంటే ముఖ్యంగా ప్రకృతిలోని లోపాలను సరిదిద్దడానికి చేసేది. సకామయాగాలు అంటే పుత్రకామేష్టి, అశ్వమేధం లాంటి యాగాలు కూడా చేస్తూంటారు. ప్రకృతిలో లోపాలేమిటి అనుకోవచ్చు, మానవకృతాలు. భూమి నీరు గాలి కలుషితమవుతాయి. వర్షాలు పడవు, పంటలు పండవు. వీటిని సరిదిద్దడానికి యాగాలు చేస్తారు/చేసేవారు. దానికి అగ్నిహోత్రం ముఖ్యం. హోమగుండం కూడా వాస్తుప్రకారం ఏర్పాటవుతుంది. అగ్నిలో కూడా ఆ...

భ.గీత 15:1

 🙏"శ్రీరస్తు శుభమస్తు"🙏 " ఊర్ధ్వమూలమధః  శాఖమశ్వత్థం               ప్రాహురవ్యయం, ఛందాంసి యస్య     పర్ణాని యస్తం వేద స వేదవిత్ "                       - భ.గీత 15:1 అంటే " మూలం ( వ్రేళ్ళు ) పైకి కొమ్మలు క్రిందకు ఉన్న అశ్వత్థ ( రావి ) చెట్టు రహస్యాన్ని ఎవరు తెలుసుకుంటారో, దాని ఆకులను వేదమంత్రాలుగా ఎవరు తెలుసుకుంటారో వారు వేదజ్ఞానాన్ని పొందినవారవుతారు " అని. ఇందులో అద్భుతమయిన తత్వం ఉంది. " శ్వ " అంటే రేపు. " త్థ ( స్థ ) " అంటే ఉండేది. దీనికి " అ " చేర్చి అశ్వత్థ అంటే రేపు ఉండనిది. రేపు ఉండనిది అని ఏమిటి?. అంటే రేపు ఈరోజులా ఉండనిది అని. మనుషుల్లో అయినా చెట్లలో అయినా క్షణం క్షణం మార్పు జరుగుతూ ఉంటుంది. కాని రావిచెట్టు 2500 ఏళ్ళు బ్రతుకుతుంది కనుక ఓ మనిషి తన జీవితకాలంలో దానిలో పెద్దగా మార్పుని చూడడు. " నేను " అనే దానిలో కూడా పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకూ మార్పు ఉండదు. సంసారం అనే వృక్షం కూడా అలాంటిదే. ప్రతీ క్షణమూ మార్పు జరుగుతూన్నా ఏరోజూ మార్పు తెలియదు, ఒకేలా ఉన్నట్లు...

సౌందర్యలహరి

 🙏 "శ్రీమాత్రేనమః"🙏 ఈరోజు శంకరాచార్యులు  అద్భుతమయిన " సౌందర్యలహరి " ని ప్రసాదించిన రోజు. అంతటి అందమైన " సౌందర్యలహరి " అన్న పేరెలా కుదిరిందో ఈ శతకానికి.  దీని పారాయణం వలన కలిగే ప్రయోజనాలు అనేకం అని పండితులు తెలియచేసారు. జ్ఞానం కలిగితేనే మోక్షం కలుగుతుంది. అటువంటి జ్ఞానాన్ని కలిగిస్తుంది ఈ పారాయణ. మనిషి 3 తాపాలతో ( ఆధ్యాత్మికం, ఆధిభౌతికం, ఆధిదైవికం ) బాధపడుతూ ఉంటాడు, ఆ తాపాలను పోగొడుతుంది. దీన్ని వేదాంతం అనుకుంటారు కాని ఇది శాస్త్రీయం. అనేక రోగాలను ముఖ్యంగా మానసికరోగాలను పోగొడుతుంది.  సౌందర్యలహరి అంటే అమ్మవారి వర్ణనే కదా అనుకుంటారు, కాని ప్రతీ శ్లోకంలోనూ అంతర్వాహినిగా అద్భుత మంత్రం ఉంటుంది. ప్రతీజీవిలోనూ చైతన్యం ( పరమాత్మ ) ఉంది కాని తెలుసుకోలేకపోతున్నారు. ఎందుకని అంటే అంతఃకరణశుద్ధి లేక. దానిని కలిగిస్తుంది ఈ పారాయణ.  ఉపనిషత్తుల సారమే ఇది. పఠించేవారి కష్టాలని మానసికవ్యధలనీ పోగొట్టడమే కాదు సమాజంలో సమైక్యత ప్రాముఖ్యం కూడా తెలియచేస్తూంది అని తెలియచేసారు. ఈ శతకంలో " సౌందర్యలహరి " అనే పదం చాలాసార్లు వస్తుంది. లహరి అంటే అల, సౌందర్యలహరి అంటే " సొగస...

లలితనామం76

 🙏 " శ్రీమాత్రేనమః " 🙏 " విశుక్రప్రాణహరణ    వారాహీవీర్యనందితా " - ఇది     శ్రీలలితాసహస్రరహస్యనామాల్లో     76 వ నామం. దీని అర్ధం " విశుక్రుడి ప్రాణం హరించిన శ్రీవారాహీదేవి పరాక్రమానికి సంతసించినది ( అమ్మవారు )" అని. భండాసురుడి తమ్ముడైన విశుక్రుడిని సంహరించించింది వారాహీదేవి. వారాహీ అనే పేరే ఎంత అద్భుతంగా ఉంది. పలుకుతూంటేనే వళ్ళు పులకరిస్తుంది. ఆవిణ్ణి రక్షణమంత్రిణిగా నియమించింది అమ్మవారు మనల్ని జాగ్రత్తగా చూసుకోమని. ఆవిడ ఒకచేతిలో నాగలి ఇంకోచేతిలో రోకలి ఉంటాయి. అంటే పంటలు పండించడం, ఆ పంటను దంచి ఆహారంగా చెయ్యడం కూడా ఆవిడే చూసుకుంటుంది. శక్తిని ఆరోగ్యాన్ని ఇచ్చేది ఆవిడే. రక్షణమంత్రిగా శత్రుపీడ లేకుండా చేసేదీ ఆవిడే. ఆవిడ రధం మీద ధన్వంతరి, అశ్వనీదేవతలు కూర్చుని ఉంటారు. ఇంక మన ఆరోగ్యానికి లోటెక్కడ. ఆవిడ మహిషం మీద కూర్చుని ఉంటుంది. పులిమీద కూడా కూర్చుని దర్శనం ఇస్తుంది.  ఆవిడ ఇంకో వాహనం హంస. హంస అంటే ఊపిరి. సాధారణంగా అందరూ " జపగాయత్రి " చేస్తారు. అంటే ఏదో ఒక నామజపాన్ని చేసుకుంటూ ఉంటారు. కొందరు ఏనామాన్ని కాకుండా " అజపా గాయత్రి " ని చేస్తారు. అ...

దత్తాత్రేయులు

 🙏 " శ్రీరస్తు శుభమస్తు " 🙏 గురుదత్తాత్రేయ జయంతి నేడు. అత్రిమహర్షి అనసూయల పుత్రుడు ఈయన. అనసూయ మహాపతివ్రత. సీతారామలక్ష్మణులు దండకారణ్యం ప్రవేశించేముందు ఈవిడ ఆశీస్సులు తీసుకుంటారు. ఆయన పుట్టుకే ఓ అద్భుతం. త్రిమూర్తులు వారి భార్యలు కూర్చుని మాట్లాడుకుంటూంటే నారదుడు వస్తారు. మాటల్లో మహాపతివ్రత ఎవరూ అనే విషయం వస్తే నారదులు " అనసూయమ్మే " అనడంతో ముగ్గురమ్మలు బాధపడి, అలిగి, త్రిమూర్తులని " అది తప్పు " అని నిరూపించి రమ్మంటారు. త్రిమూర్తులు అనసూయను పరీక్షించడానికి వస్తారు. ఆమె సంతోషంతో భోజనంచెయ్యమని అడిగితే వారు దిగంబరంగా వడ్డిస్తే తింటామంటారు. దానికేముంది అని త్రిమూర్తులను చిన్నపిల్లలుగా చేసేసి తినిపిస్తుంది. త్రిమూర్తులు ముగ్ధులయి వరం కోరుకోమంటే వారిని తనకు కుమారులుగా జన్మించమంటుంది. బ్రహ్మ అంశతో చంద్రుడు, శివుని అంశతో దూర్వాసుడు జన్మించారు. విష్ణువు మిగతా ఇద్దరి అంశలు కలుపుకుని దత్తాత్రేయుడిగా జన్మించారు.  ఆయన భార్య అనఘాదేవి. అఘం అంటే పాపం. అనఘ అంటే పాపం అంటనిది/లేనిది. పరమపవిత్రురాలు. శ్రీలలితాసహస్రంలో ఒక అద్భుతనామం (987 వ నామం). త్రిమూర్తుల అంశవల్ల సద్గురువు ...

ఉపనయనం

 శ్రీరస్తు శుభమస్తు " మనిషన్నాక కాస్తంత కళాపోషణ ఉండాలయ్యా, ఉత్తినే తినితొంగుంటే మనిషికి గొడ్డుకి తేడా ఏటుంటది " - ముత్యాలముగ్గు సినీమాలో రావుగోపాలరావు. మాగ్రామానికి 15కిమీల దూరంలో ఓ గ్రామం ఉంది. అక్కడ నడిమింటి సర్వమంగళశాస్త్రి గారని ఓ పండితుడు ఉండేవారు. మా బంధువే ఆయన. వారి అబ్బాయికి ఉపనయనం చేస్తూ ఆహ్వానపత్రికలో " మా అబ్బాయి ఉపనయనానికి మీరందరూ విచ్చేసి వటువుని ఆశీర్వదించి భోజనం చేసి వెళ్ళవలెను. భోజనాల తరువాత నా ఉపనయన కార్యక్రమాన్ని కూడా వీక్షించి వెళ్ళవలసినదిగా కోరుకుంటున్నాను " అని వ్రాసారు. అందరికీ ఆశ్చర్యం వేసింది. అబ్బాయికి ఒడుగు ఓకె, ఈయనకు మళ్ళీ ఈవయస్సులో ఒడుగు ఏమిటీ అని. సరే ఈ విషయం చూడాలనే మొత్తం బంధువులందరూ వచ్చేసారు. భోజనాలయాయి. శాస్త్రిగారు కుర్చీలో కూర్చున్నారు, బంధువులు అతిధులు ఎదర చాపలమీద ఆశీనులయారు శాస్త్రిగారి భార్య ఓ చిన్న అందమైన పెట్టె తెచ్చి శాస్త్రిగారికి ఇచ్చారు. ఆయన ఆ పెట్టె మెల్లిగా తెరచి అందులోనుంచి ఓ కళ్ళజోడు తీసారు. అందరికీ చూపెట్టి " నాకు చత్వారం వచ్చింది ఈమధ్యనే, ఈ కళ్ళజోడు పెట్టుకోమన్నారు. ఈరోజు ముహూర్తం బాగుందని పెట్టుకుంటున్నాను. మీ...

కామాక్షి దయ

 🙏 " శ్రీరస్తు శుభమస్తు " 🙏 నేను 1980లలో మద్రాస్ లో ఉన్నప్పుడు మాంబళంలో ఓ ఇంట్లో మకాం ఉండేవారం. గేటు తీయగానే ఎదురుకుండా ఉండే పోర్షన్లో మేము, పై పోర్షన్లో ఓ ఉత్తరదేశీయకుటుంబం, క్రింద వెనుక పోర్షన్లో యజమాని కుటుంబం మకాం. గేటులోంచి లోపలికి రాగానే కుడిపైపుకి తిరిగి 15 అడుగులు వేసి ఎడమవైపుకి తిరిగి వెనక్కువెడితే యజమానుల పోర్షన్. యజమాని పూర్వీకులది మచిలీపట్నం. తెలుగు తమిళ్ యాసతో బాగానే మాట్లాడేవారు. వెనుక పోర్షన్లో ఎందుకంటే దానికి ప్రక్కనే వారి ఖాళీ స్థలంలో హాస్పిటల్ కడుతున్నారు. ఆయన భార్య డాక్టర్, ఈయన ప్రభుత్వ సివిల్ ఇంజనీర్. ఈయనకు దైవభక్తి ఎక్కువే. ఇంటిపైన పెద్దపాకవేసి " ఓంశక్తి " పీఠం పెట్టించారు. పూజలు అవీ అవుతూ ఉండేవి. మా పోర్షన్ ప్రక్కనే వారి ఆవును కట్టి ఉంచేవారు. రోజూ లేవగానే మాకు గోదర్శనం. బావుండేది. హాస్పిటల్ రెడీ అయింది. వారు దాని ప్రారంభోత్సవానికి కంచిపీఠాధిపతి పరమాచార్యులని ఆహ్వానించారు. పెద్దాయన రాలేనని జయేంద్రసరస్వతిని పంపిస్తానన్నారు. అన్ని ఏర్పాట్లు జరిగిపోయాయి. స్వామివారు సాయంత్రం 6 కి వస్తానన్నారు. ఎలాగూ సాయంత్రంకదా అని నా శ్రీమతి ఆవుపేడతో కళ్ళాపి చల్ల...

ప్రత్యంగిరాదేవి

 🙏 " శ్రీరస్తు శుభమస్తు " 🙏 కోయంబత్తూర్ సమీపంలో " ప్రత్యంగిరాదేవి " ఆలయం ఉంది. దానికి స్థలపురాణం ఉంది.  నృసింహస్వామి హిరణ్యకశిపుడిని చంపినతరువాత చాలాకాలం ఆ కోపం/ఉగ్రం లోంచి బయటకు రాలేక అడవులు పట్టితిరుగుతున్నాడు. బ్రహ్మ, ఇంద్రుడు వంటివారంతా ఎన్ని ప్రయత్నాలు చేసినా కుదరకపోవడంతో శివుడిని వేడుకున్నారు ఏదోఒకటి చేసి ఆయన్ని మామూలుగా చెయ్యమని. శివుడు సరే అని శరభుడుగా వచ్చి స్వామికి అడ్డుగా నుంచున్నారు. ఆయన మీదకే స్వామి కోపంగా దూసుకుని వెళ్ళారు. శరభుడి కుడిచేతిలో ప్రత్యంగిరాదేవి కూర్చుని ఉంది. శివుడి మీదకే స్వామి కోపంగా రావడంతో లేచినుంచుంది కోపంతో. ఆవిడ " సహస్రశీర్షవదనా సహస్రాక్షీ సహస్రపాత్....." - వేల శిరస్సులు, ఎర్రటి వేలకళ్ళు, ఆయుధాలతో కూడిన వేల చేతులు. కోపంతో హుంకరించేటప్పటికి నృసింహస్వామి భయపడిపోయి చల్లబడిపోయాడు. ఆవిడ " అయ్యో ఎదురుగా ఉన్నది నా సోదరుడు, ఎలా కోప్పడేదీ " అనుకోలేదు. అనుకుంటే స్వామి ఉగ్రంలోంచి బయటకు రాడు, లోకాలూ తల్లడిల్లిపోతాయి. అందుకని అవసరమయినప్పుడు కోపం తెచ్చుకోవాలి. తప్పులేదు. ఎవరికోపాన్ని చూస్తే దేవతలు కూడా భయపడిపోతారో అతనే శ్రీర...

ఉగాది

 🙏 " శ్రీరస్తు శుభమస్తు " 🙏 నేడు ఉగాది. శోభకృత్ నామసంవత్సర ప్రారంభం. శోభకృత్ అంటే శోభను కలిగించేది అని అర్ధం. అసలు చైత్రపాడ్యమినే ఉగాదిగా ఎందుకు జరుపుకోవాలో పూజ్యులు సామవేదంవారు ప్రవచనం చేస్తూ ఇలా తెలియచేసారు. దిలీపచక్రవర్తి తన భార్య సులక్షణాదేవి తో కలిసి రధంపై " సంతానాన్ని పొందడానికి ఏమి చేయాలో " తెలుసుకోవడానికి వశిష్ఠాశ్రమానికి బయలుదేరారుట. కాళిదాసు తన రఘువంశ కావ్యంలో ఈ ఘట్టాన్ని ఇలా వర్ణించారు " మంచుతొలగిన చైత్రపూర్ణిమనాడు చిత్ర నక్షత్రం చంద్రుడు కలిసిఉన్నట్లుగా ఉన్నారు రాణి రాజు " అని. ఇక్కడ మంచుతెరలు తొలగిన అంటే బాధలు పోయే సమయం అని. ఎంత అద్భుతవర్ణన. యజుర్వేదంలో ఇలా ఉంది: " యజ్ఞపతిం వృషయేవ సాహుః, ప్రజానిర్భక్తా అనుతప్త్యమానా, మదభ్యౌస్తోతా2వపతౌ నరాధ "  దీని అర్ధం " అర్హత కలిగి శాస్త్రాలు తెలిసిన సోమయాజులు మధుమాసాలలో యజ్ఞాలు చెయ్యకపోతే కరువుకాటకాలు వస్తాయి " అని. ఎంత అద్భుత విషయం తెలియచేసారు మన ఋషులు. యజ్ఞం చెయ్యడం ప్రకృతిలోని లోపాలను సరిచేయడానికి. కాలక్షేపానికి కాదు. సోమయాజులు " నాకు కుదరదు, ఖాళీలేదు, రాలేను " అని చెప్పకూ...

వేదం వేదమే

 🙏 " శ్రీరస్తు శుభమస్తు " 🙏 శ్రీశంకరాచార్యుల జయంతోత్సవాలలో వేదపండితులు ప్రవచనం చేస్తూ కొన్ని అద్భుతవిషయాలు తెలియచేసారు. ఒకసారి వివిధ మతాలగురించి కొందరు నాస్తికులు ప్రస్తావన తెస్తే ఓ వేదపండితుడు అన్నారు " వేరే మతగ్రంధాల్లో దంతధావన గురించి ఉందా " అని. వారు ఆశ్చర్యపోయి " అదేమిటి " అంటే ఈయన " మా వేదాల్లో ఉదయం ఎన్నింటికి లేవాలి, దంతధావనం వేటితో ఎప్పుడు ఎందుకు ఎలా చేసుకోవాలి, స్నానం ఎన్నింటికి ఎలా ఎందుకుచెయ్యాలో, భోజనం ఎప్పుడు ఎలా ఎందుకు చెయ్యాలో స్ఫష్టంగా ఉంది. మావేదాలు జీవనవిధానం తెలుపుతాయి. ధర్మాచరణ చెయ్యడానికి శారీరక ఆరోగ్యం ముఖ్యం కనుక ఆ విషయాలు కూడా తెలియచేసాయి. వేరేమత గ్రంధాల్లో ఇలాంటివి ఉన్నాయా " అని అడగడంతో వాదన అక్కడితో ముగిసిందిట. ఎంతటి అద్భుత విషయం. యజుర్వేదం/అధర్వణవేదాల్లో అధికసంపద కోసం చేసే యాగం ఉంది. కోరికలు తప్పుకాదు. వివిధరకాలైన కోరికలు తీర్చుకోవడానికి వీలుగా చాలా కార్యక్రమాలు తెలియచేసాయి మన శాస్త్రాలు. ఈ యాగంలో చివరన " సంపదను చేతిలో ఉంచు " అని కోరడం ఉందిట. " ఎవరి చేతిలో ఉంచాలి, ఎందుకు నా చేతిలో ఉంచు అని అనలేదు " ...