Posts

Showing posts from June, 2024

మనస్సు అదుపులో ఉంచుకోవడం కష్టమే కాని అసాధ్యం కాదు - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏 " మనస్వినీ " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 930 వ నామం. " మనస్వినీ " అంటే స్వతంత్రమయిన మనస్సు గలది. ఇది ఒక అద్భుతమైన నామం. మనస్సు అంతఃకరణాలలో మొదటిది. ఇది సంకల్పవికల్పాలు అంటే మంచి ఆలోచనలు, చెడు ఆలోచనలు రెండూ చేస్తుంది. చెడు ఆలోచనలు నిగ్రహించుకుంటే మంచిదే కాని అంత సులభం కాదు. ఎందుకంటే మన మనస్సు స్వతంత్రంగా ఉండదు ఎప్పుడూ. ఇతరుల, సమాజం యొక్క ప్రభావం ఉంటుంది దానిమీద.  ప్రతీ మనిషి ప్రతీరోజూ ఏ సమస్యలూ లేకుండా ఆనందంగా సాగాలనే కోరుకుంటాడు. మంచి ఆలోచనలే చేస్తూంటాడు కూడా. కాని అనుకోని సంఘటనలు జరుగుతూంటాయి. మనస్సు వికలమయి చెడు ఆలోచనలు మొదలవుతాయి.  ఇదే విషయాన్ని పరమాత్మ గీతలో ఇలా తెలియచేసారు: " ఇంద్రియాణి మనో    బుద్ధిరస్యాధిష్ఠానముచ్యతే,   ఏతైర్విమోహయత్యేష    జ్ఞానమావృత్య దేహినమ్ "               - భ.గీత 3:40 " ఇంద్రియములు, మనస్సు, బుద్ధి కామము నివసించు స్థానములు. వాటి ద్వారా కామము జీవుని జ్ఞానాన్ని కప్పేసి మోహింపచేస్తుంది " అన్నారు. దీని అర్థం జీవుల ( మన ) మనస్సు స్వతంత్రం కాదు అం...

సమాజం మోహంలోకి లాగేస్తూంటూంది, జాగ్రత్తగా ఉండాలి - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏 " మోహనాశినీ " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 163 వ నామం. " మోహనాశినీ " అంటే మోహానికి అడ్డుకట్ట.  అందుబాటులో లేని కోరికను తీర్చుకోవాలనుకోవడాన్ని మోహం అంటారు. ఇది అధర్మము, చెడుపనులకు దారి తీస్తుంది. ఉదాహరణకు ఒకతను మంచివాడే. ఓ చక్కని ఉద్యోగం చేసుకుంటూ భార్యాపిల్లలతో సంతోషంగా గడుపుతూ ఉంటాడు. ఓ ఖరీదయిన ప్రాంతంలో ఓ ఇల్లు కొనుక్కోవాలనే కోరిక కలుగుతుంది. అది మోహంగా బలపడుతుంది. డబ్బు కోసం చెడ్డదారులు త్రొక్కడం మొదలుపెడతాడు. చిక్కుల్లో పడతాడు. కోరిక తీరదు కాని చిక్కులు మిగులుతాయి. ఈ విషయిన్నే పరమాత్మ గీతలో ఇలా చెబుతారు: " స్వభావజేన కౌంతేయ    నిబద్ధః స్వేన కర్మణా,    కర్తుం నేచ్ఛసి యన్మోహనాత్    కరిష్య స్వవశో2పితత్ "                - భ.గీత 18:60 " కౌంతేయా, మోహప్రభావమున నీవు చేయుటకు ఇష్టపడని కర్మనుకూడా నీ పురాకృత స్వాభావిక కర్మలచే బంధింపబడి తత్ప్రభావమున నీవు అవశుడవై చేయుదువు " అని. ఓ కోరిక కలగగానే తన స్థాయి ఏమిటి, అది తనకు ఎంతవరకూ అవసరం అని ఆలోచనచేయాలి.‌ కాని అది అంత సులభం కాదు...

సంతృప్తి ముఖ్యం, అది లేదు ఇది లేదు అని ఎల్లప్పుడూ బాధపడకూడదు - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏 " సదాతుష్టా " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 921వ నామం . " సదాతుష్టా " అంటే ఎల్లప్పుడూ సంతోషము గలది. ధనం ఉన్నవారు ధనాన్ని ఇవ్వగలరు. విద్య ఉన్నవారు విద్యని ఇవ్వగలరు. అన్నీ ఇవ్వగలిగినవారు అమ్మవారే కనుక, ఏ జీవి అయినా ఎల్లప్పుడూ ఆఖరికి మరణంలో కూడా సుఖాన్ని సంతోషాన్నే కోరుకుంటాడు కనుక, అమ్మవారి దగ్గర సంతోషం ఎక్కువగా ఉండడం జీవుల అదృష్టం. శ్రీసూక్తంలో అమ్మవారిని " మనసః కామమాకూతిం " - " మనసులో కలిగే కోరికలన్నీ సంతోషాన్నిచ్చేవిగా అనుగ్రహించు, అంటే మంచి కోరికలే కలిగేలా చెయ్యి తల్లీ‌ " అని ప్రార్ధన చేస్తాం. అమ్మవారు అందరూ సంతోషంంగా ఉండాలనే అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. వారి వారి కర్మఫలాలను బట్టి ఎక్కువ తక్కువ సంతోషం పొందుతూ ఉంటారు. కోరిక తప్పు కాదు. కోరుకున్నది పూర్తిగా లభించనప్పుడు నా ప్రాప్తం ఇంతే అని సంతృప్తి చెందుతూ ఉండాలి. చాగంటివారు ఓ సారి ప్రవచనం చేస్తూ " అమ్మవారి దయవల్ల నాకు తెలిసిన విషయాలు చెబుతూ వేల ప్రవచనాలు చేసాను. ఆ అదృష్టానికి సంతోషించాలి. అంతేకాని అయ్యో ఒక్క కచేరీయేనా చేయలేకపోయానే అని ...

సందేహ నివృత్తి ఎప్పటికప్పుడు చేసుకుంటూ ఉండాలి - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏 " సంశయఘ్నీ " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 173 వ నామం. " సంశయఘ్నీ " అంటే సందేహములను పోగొట్టునది అని అర్ధం. సంశయం అంటే అజ్ఞానం. ఇది ధర్మమా, అధర్మమా, మంచా, చెడా అనేటువంటి అనేక సందేహాలు కలుగుతూంటాయి మనకు. కొన్ని సమస్యలు కలిగినప్పుడు అసలు బయట పడగలమా అనే సందేహం కలుగుతూంటుంది.‌ కాని మనకే ఆశ్చర్యం కలిగేలా బయట పడిపోతూంటాం.  సమాజానికి మంచికోసం త్యాగాలు చేసిన మంచివారికి కూడా ఎన్నో కష్టాలు, అవమానాలు ఎదురవుతాయి‌. కాని కష్టము సుఖమూ కూడా శాశ్వతం కాదు, తాత్కాలికమే అనే భావనే జ్ఞానం. అటువంటి జ్ఞానాన్ని అమ్మవారు కలుగచేస్తుంది. " నాకు ఏమీ తెలియదు అన్నవాడు జ్ఞాని " అంది కేనోపనిషత్తు.‌ సాధారణంగా చదువుకుంటూన్న వారికే సందేహాలు వస్తాయి. నివృత్తి కోసం ప్రయత్నిస్తారు. చదువుకోని వారికి సందేహాలు ఉండవు, నివృత్తి అక్కరలేదు.  ఇదే విషయాన్ని పరమాత్మ గీతలో ఇలా తెలియచేసారు: " తద్విద్ధి ప్రణిపాతేన    పరిప్రశ్నేన సేవయా,    ఉపదేక్ష్యంతి తే జ్ఞానం    జ్ఞానినస్తత్త్వదర్శినః "                - భ.గీత ...

స్తోత్రాలు కీర్తనలు దేవతా స్వరూపం - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏 " స్తోత్రప్రియా " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 927 వ నామం . " స్తోత్రప్రియా " అంటే స్తుతులు ఇష్టముగా గలది.  స్తోత్రం అంటే కీర్తించడం. అమ్మవారిని కీర్తించడం అంటే ఆవిడ గుణగణాలను ఎలుగెత్తి చాటడం. ప్రతీ స్తోత్రం శబ్దరూపంలో ఉన్న దేవీస్వరూపం. చదువుతూ ఉంటే అమ్మవారి రూపం కనులముందు కనబడుతూ ఉంటుంది. స్తోత్రానికి గేయలక్షణంతో బాటు మంత్రలక్షణం కూడా ఉంటుంది. రాగం ఛందస్సు లయ ఉంటాయి.  లలితాసహస్రం విష్ణుసహస్రం శ్రీసూక్తం మొ.గునవి వింటూంటే మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. శ్యామలాదండకం, మహిషాసురమర్దినిస్తోత్రం, శివతాండవస్తోత్రం లాంటివి వింటూంటే ఆ లయకు మెదడులో ప్రకంపనలు కలుగుతాయి. అర్ధం తెలియకపోయినా స్త్రోత్రం వింటూంటే ఆనందం కలుగుతుంది. ఆదిశంకరులు శ్రీలలితా పంచరత్న స్తోత్రం చేస్తూ అమ్మవారిని ఇలా స్తుతిస్తారు: " ప్రాతః స్మరామి లలితా వదనారవిందం,    బింబాధరం పృధుల మౌక్తిక శోభినాసమ్,   ఆకర్ణ దీర్ఘ నయనం మణికుండలాఢ్యం,      మందస్మితం మృగమదోజ్జ్వల ఫాలదేశమ్ " అమ్మవారి ముఖం పద్మంలా ఉందని, ముక్కుకి ముత్యపు ముక్కెర, చెవులకు మణులు పొది...

సాధన చేయగా చేయగా కొన్ని జన్మల తరువాత అయినా ముక్తి లభిస్తుంది - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏 " ముక్తిరూపిణీ " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 737వ నామం .  " ముక్తిరూపిణీ " అంటే మోక్షమే స్వరూపముగా గలది.  మోక్షం అంటే ఏమిటి?. జీవుడు ( మనం )లో ఉన్న చైతన్యం అంటే ఆత్మ పరమాత్మ యొక్క అంశ. ఆత్మ కర్మఫలాన్ని పూర్తిచేసుకుని పరమాత్మలో కలిసిపోవడమే మోక్షం. సాధకుడు కోరుకునేది జీవన్ముక్తి, అంటే మోక్షం. స్వర్గం కాదు. పుణ్యఫలం అనుభవించడానికి మరణానంతరం స్వర్గంకి వెళ్ళినా ఆ పుణ్యఫలం అవగానే మళ్ళీ జన్మను తీసుకుంటాడు జీవుడు పాప ప్రక్షాళనకోసం. ఇక్కడ ఏసుఖానికైనా దుఃఖస్పర్శ ఉంటుంది. కాని స్వర్గం లో దుఃఖస్పర్శ ఉండదు. పాపం కూడా నశించాలంటే దుఃఖస్పర్శ తప్పదు. అందుకని మళ్ళీ జన్మతీసుకోవలసి వస్తుంది జీవుడికి. పాపపుణ్యాలు పూర్తిగా నశిస్తేనే జీవన్ముక్తి. ఇక మళ్ళీ జన్మ ఉండదు.  కాని ఆంత సులభం కాదు. కనబడే ప్రపంచం అంతా మహామాయ. సమాజం మనల్ని మనలా బ్రతకనివ్వదు. తెలియకుండానే లేక మనకు ఇష్టంలేని పనులను కూడా చేయవలసి వస్తూంటుంది. ఇదే విషయాన్ని పరమాత్మ చెబుతారు: " స్వభావజేన కౌంతేయ    నిబద్ధః స్వేన కర్మణా,    కర్తుం నేచ్ఛసి యన్మోహనాత్  ...

సినీమాకి మంచి పాట వ్రాయాలన్నా అమ్మవారి అనుగ్రహం కావాలి - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏 " కావ్యకలా " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 798 వ నామం. " కావ్యకలా " అంటే కావ్యకళాస్వరూపురాలు, కావ్యరచనా ప్రతిభా స్వరూపురాలు. " వాక్యం రసాత్మకం కావ్యం " అన్నారు. కావ్యాలలో వాక్యాలు రసాత్మకంగా ఉంటాయి. అటువంటి రసాత్మకతను అమ్మవారు అనుగ్రహిస్తారు. " పలికెడిది భాగవతం,  అట పలికించెడివాడు రామభధ్రుండు,  అట..... " అంటారు పోతనామాత్యుడు. మరి స్వామి అనుగ్రహం లేకపోతే పోతనగారి భాగవతం అంత అద్భుతంగా ఎలా ఉంటుంది. మహాకవి కాళిదాసు, పోతనామాత్యుడు కూడా " నీ అనుగ్రహం లేకపోతే ఎలా వ్రాయగలమమ్మా " అని కీర్తించేవారుట అమ్మవారిని. కొందరు సినీ కవులు కూడా అద్భుత సాహిత్యంతో పాటలు వ్రాస్తూంటారు. అది వారి పూర్వజన్మ సుకృతం. కొందరికే అది సాధ్యం. విశ్వనాధవారు వేదవాక్యాలు చెప్పేవారే మహాకవి. అక్కడక్కడ వేదవాక్యాలు చెప్పేవారు " అక్కడక్కడ మహాకవి " అని తెలియచేసారు. అమ్మవారు వేదమాత. అందుకే వేదం అంత కళాత్మకంగా, రసాత్మకంగా ఉంటుంది. వాల్మీకి మహర్షి రామాయణంలో రావణుడు సీతమ్మను తీసుకుని పోతూన్న సన్నివేశాన్ని బుధుడు పట్టుకున...

ధర్మపాలనతో బాటు అధర్మాన్ని ఖండిస్తూ ఉండాలి - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏 " నిరామయా " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 876 వ నామం. " నిరామయా " అంటే వ్యాధులు లేనిది. ఆమయం అంటే రోగం. అమ్మవారు ధర్మస్వరూపిణి. ధర్మం ఆవిడ సహజ స్వభావం. రోగాలు ఎందుకుంటాయి అమ్మవారికి. ఆయుర్వేదం ఏమి చెబుతూందంటే అన్ని వ్యాధులకు మూలం అధర్మం అని. మిగతా వైద్యములు కారణం కనుక్కుని మందులు ఇస్తాయి. కాని ఆయుర్వేదం/సనాతనధర్మం కారణం వెనుక కారణం చూస్తుంది. వివరం చూద్దాం. చాలామటుకు రోగాలు నీరు, గాలి, ఆహారం వలన కలుగుతాయి. మనకు తెలిసిన విషయమే. చెట్లు నాటండి బాబూ, గాలి పాడయిపోతూంది అని ఊదరగొడుతూంటారు. ఆ పరిస్థితి అసలు ఎందుకు వచ్చింది అని ఎవరూ ఆలోచించరు. నదుల ప్రక్షాళన అని ఓ కార్యక్రమం పెడతారు. అధిక ఖర్చు. అసలు నదినీరు ఎలా పాడవుతూంది అనే ఆలోచన చేయరు. తినే తిండంతా కల్తీయే. వీటన్నిటికీ మూలం అధర్మం. అధర్మమార్గంలో డబ్బు సంపాదన కోసం ప్రకృతిని పాడుచేయడం - అంటే విషపూరితమైన వ్యర్ధాలను నదిలోకి వదిలేయడం, చెట్లు కొట్టేయడం, ఎక్కువ పంటకోసం రసాయనిక ఎరువులు మందులు వాడడం. దాన్ని నిర్మూలించాలి. ఆ పని చేస్తే ప్రకృతి రక్షించబడుతుంది. అది మనల్ని రక్షి...

" యోగాదినోత్సవం " శుభాకాంక్షలు - చీమలపాటి సూర్యనారాయణ

 🙏" శ్రీరస్తు శుభమస్తు "🙏  " యోగీ యుంజీత సతత   మాత్మానం రహసి స్థితః,   ఏకాకీ యతచిత్తాత్మా    నిరాశీరపరిగ్రహః "                - భ.గీత 6:10 అర్జునుడు పరమాత్మను అడుగుతాడు ఈ మనస్సును అదుపులో ఉంచుకోవడం ఎలా, సాధ్యమేనా అని. అప్పుడు పరమాత్మ పైవిధంగా చెబుతారు. " రహసి " అన్నారు అంటే ఏకాంతం. అలాగే " ఏకాకి " అన్నారు. అంటే ఒంటరిగా కూర్చోమని. నిశ్శబ్దంగా ప్రశాంతంగా ఉంటుంది. ఆయన " అవ్యాజకరుణామూర్తి ", జీవుడు ముక్తిపొందడానికి ఎంత చక్కటి మార్గాన్ని ఎంత విపులంగా తెలియచేసారు. ఏకాంతంగా ఓ చక్కటి ప్రదేశంలో కూర్చోమన్నారు. అంత ఎత్తుకాని పల్లముకాని ఆసనమ్మీద కూర్చోవాలన్నారు. దానిమీద చక్కటి మెత్తటిచర్మం వస్త్రం వేసుకోమన్నారు ( 6:11,12 ). ఆసనం అలా ఉంటే ఎక్కువసేపు సౌకర్యంగా కూర్చోగలుగుతారని. మితాహారం తీసుకోవాలన్నారు. అది ఎలాగో కూడా చెప్పారు. ఉదరాన్ని 4 భాగాలు చేసి 2 భాగాలు ఘనపదార్ధం ( అన్నం మొ.గునవి ) తో నింపి ఒకభాగం ద్రవంతో నింపమన్నారు. ఒకభాగం ఖాళీగా ఉంచితే మితాహారం తీసుకున్నట్లుగా భావించాలి. ఖాళీకడుపుతో అసలు చెయ్యకూడదన్నారు. ఎంత అద్భుతంగా వి...

అమ్మవారు అనుగ్రహించలేనిది అంటూ ఏమీ ఉండదు - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏 " అనుగ్రహదా " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 273 వ నామం. " అనుగ్రహదా " అంటే అనుగ్రహిస్తుంది అని. ఏమి అనుగ్రహిస్తారు?. ఏమయినా ఇవ్వగలరు. అమ్మవారు ఇవ్వలేనిది ఏముంటుంది. అలా అమ్మవారి అంతులేని అనుగ్రహం పొందాలంటే మనం ఏమి చేయాలి అన్నది ఆలోచించుకోవాలి. శంకరులు శివానందలహరి చేస్తూ ఇలా ప్రార్థిస్తారు: " కంచిత్కాలముమామహేశ    భవతః పాదారవిందార్చనైః,   కంచిద్ధ్యానసమాధిభిశ్చ     నతిభిః కంచిత్కథాకర్ణనైః,   కంచిత్కంచిదవేక్షణైశ్చ     నుతిభిః, కంచిద్దశామీదృశీం   యః ప్రాప్నోతి ముదా     త్వదర్పిత మనా జీవన్    స ముక్తః ఖలు " - 81 " ఓ గౌరీవల్లభా - కొద్దిసేపు నీ పాదకమలాలను ఆరాధించి, కొద్దిసేపు నీ ధ్యానంలో గడిపి, కొద్దిసేపు నీకు నమస్కరిస్తూ, కొంతసేపు నీ కధాశ్రవణం చేస్తూ, కొద్ది సమయం నీ దర్శనం చేస్తూ, కొంతసేపు నిన్ను స్తుతిస్తూ, కొన్ని క్షణాలు మనస్సు నీపై ఉంచే అవస్థను అలవరచుకున్నవారు జీవన్ముక్తులు అవుతున్నారు " అన్నారు శంకరులు.  అలాచేసిన కంచి పరమాచార్యులు, రమణమహర్షి వంటివారు జీవన్ము...

అమ్మవారు పుట్టుక లేనిది, శాశ్వతురాలు - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏 " శాశ్వతీ " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 951 వ నామం. " శాశ్వతీ " అంటే నిత్యమయినది/శాశ్వతమయినది. అంటే నాశనము లేనిది అని. పుట్టుక ఉంటే మరణం ఉంటుంది. అమ్మవారు " అజా ", అంటే పుట్టుక లేనిది. పుట్టుక లేనిది అంటే ఎప్పుడు పుట్టిందో తెలియనిది. ఋషులు అన్ని సత్యాలతో బాటు అమ్మవారి పుట్టుక గురించిన సత్యం కూడా తెలుసుకునే ప్రయత్నం చేసే ఉంటారు. ఆ ప్రక్రియలోనే యుగాలు, మహాయుగాలు, మన్వంతరాలను, కల్పాలను కూడా దాటి వెళ్ళారు/చూసారు. బ్రహ్మల వయస్సు కూడా తెలుసుకున్నారు. అమ్మవారి వయస్సును మాత్రం తెలుసుకోలేక పోయారు.  " వేదాహం సమతీతాని        వర్తమానాని చార్జున,   భవిష్యాణి చ భూతాని      మాం తు వేద న కశ్చన "               - భ.గీత 7:26 పరమాత్మ " ఓ అర్జునా! గతకాలమునకు చెందినట్టివియు,వర్తమాన (ప్రస్తుత) కాలము నందున్నట్టివియు ఐన చరాచరప్రాణులన్నింటిని నేను ఎరుగుదును.  అంతేకాదు రాబోవుకాలమున ప్రభవించు (జన్మించు) ప్రాణులను గూర్చియు నేను ఎరుగుదును. కాని నాయందు భక్తిశ్రద్ధలుగలవారు తప్ప వ...

రంగుల ప్రపంచం అంతా మాయే - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏 " విష్ణుమాయా " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 339 వ నామం. " విష్ణుమాయా " అంటే సర్వవ్యాపకుడగు భగవంతుని మాయ అని అర్ధం. ప్రకృతి/ప్రపంచం అంతా నిండి ఉన్న మాయ. " మాయ " అంటే మభ్యపెట్టడమో, మోసమో కాదు. లేనిది అని అర్థం.  దేవీ అపరాజితా స్తోత్రం ఇలా తెలియచేస్తూంది: యా దేవీ సర్వభూతేషు  విష్ణుమాయేతి శబ్దితా, నమస్తస్యై నమస్తస్యై  నమస్తస్యై నమో నమః " - 6 సర్వభూతాలలోనూ ఉన్న విష్ణుమాయగా పిలువబడుతున్నారు అమ్మవారు అని.  ఆదిశంకరులను ఒక భక్తుడు " అంతా మిథ్య/మాయ " అంటున్నారు మీరు. కుక్క మొరుగుతూంది, కరుస్తూంది. మాయ ఎలాగ అవుతుంది " అని అడిగాడు. శంకరులు అన్నారు " కలలో కూడా కుక్క తరుముతూంది, కరుస్తూంది కదా. ఇదీ అలాంటిదే. భ్రమ " అని. కలలో కుక్క కరవడానికి ముందుకు వచ్చినప్పుడు ఎన్నిసార్లు దానిని తన్నుతున్నాననుకుని ప్రక్కన పడుకున్న భార్యని తన్ని ఉంటారు చాలామంది. ఎందరు గుండెనొప్పి తెచ్చుకుని ఉంటారు. రాత్రి వార్తలు అవీ చూసి హాయిగా నిద్రపోయిన వారు తెల్లవారి లేవరు. గుండె పోటుతో ఎలా మరణిస్తారు. కలే కదా అ...

సూర్యుడు కూడా జడమే అమ్మవారి చైతన్యం లేకపోతే - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏 " భానుమండలమధ్యస్థా " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 275 వ నామం . " భానుమండలమధ్యస్థా " అంటే సూర్యబింబం మధ్యనందు ఉన్నది అని. సూర్యుడు ప్రత్యక్షనారాయణుడు. ఆరోగ్య ప్రదాత. " ఆరోగ్యం భాస్కరాదిచ్ఛేత్ " అన్నారు. ఆయనను మార్తాండుడు అంటారు. అంటే చనిపోయిన అండానికి కూడా చైతన్యాన్ని కలిగిస్తాడు. ఆయన ఉదయిస్తేనే ప్రకృతిలోను, జీవులలోనూ చైతన్యం కలుగుతుంది. ఈ శక్తులన్నిటికీ మూలం సూర్యుడిలో ఉన్న అమ్మవారి చైతన్యం. రాముడు రావణుడితో యుద్ధం చేస్తూన్నప్పుడు అలసిపోయాడు. దేవతలతోపాటు యుద్ధం చూస్తూన్న అగస్త్యుడు గమనించారు ఆ విషయం. వెంటనే రాముడిని సమీపించి ఆదిత్యహృదయం పారాయణ చేయి. శక్తి, విజయం కలుగుతాయి అన్నారు. రాముడు ఆచమనం, సంకల్పం చేసి ఆదిత్యహృదయం పారాయణ చేసారు. రాముడికి దేవతల మధ్యన సూర్య దర్శనం అయింది. " నిశిచరపతి సంక్షయం      విదిత్వా సురగణ    మధ్యగణో వచస్త్వరేతి "  ఇక్కడ " వచస్ త్వర ఇతి " అన్నారు. సూర్యుడు " త్వర " అన్నారు. ఆలస్యం ఎందుకు, త్వరపడు, రావణుడిని చంపు అన్నారు సూర్యుడు. అమ్మవారిని " ...

అధికారులు అందరూ శ్రద్ధగానే పనిచేయాలనుకుంటారు - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏 " ప్రియవ్రతా " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 770 వ నామం. " ప్రియవ్రతా " అంటే వ్రతమును ఇష్టపడతారు అని.  వ్రతం అంటే శ్రద్ధగా చేయడం. శ్రద్ధగా చేసే ఏ పని అయినా వ్రతం అని పిలువబడుతుంది. " యాదేవి సర్వభూతేషు    శ్రద్ధా రూపేణ సంస్థితా,   నమస్తస్యై నమస్తస్యై    నమస్తస్యై నమోనమః "  అని ప్రార్థిస్తాం అమ్మవారిని. ఆవిడ జీవుల్లో శ్రద్ధ రూపంలో ఉంటారు.  సమున్నత లక్ష్యసాధనకోసం చేసే ప్రయత్నాలన్నిటికీ శ్రద్ధ అత్యావశ్యకం అన్నారు శంకర భగవత్పాదులు. తరగతిలో ఉండే 40 మంది విద్యార్థులకు ఒక గురువే పాఠం చెప్పినా వారి ఉత్తీర్ణతలో తేడా ఉంటుంది. అది శ్రద్ధలో తేడా. 10 గం.లకు కార్యాలయం అంటే 9.55 కి రోజూ కార్యాలయంలో ఉండడం కూడా వ్రతమే. అతను ఏపని అయినా ఎంత శ్రద్ధగా చేస్తాడో అనడం వింటూంటాం. అతనికి ఆరోగ్యంమీద ఎంత శ్రద్ధో అనడం వింటూంటాం. కొందరు గురువులు ఎంతో శ్రద్ధగా పాఠం చెబుతారు. అరణ్యవాసంలో సీతారామలక్ష్మణులు అత్రి మహర్షి ఆశ్రమంకి వెడతారు. అనసూయమ్మ సీతతో ఇటువంటి సమయంలో నువ్వు రాముడిని అనుసరించడం చాలా ఆనందంగా ఉంది నాకు అని అంటూ " దిష్ట...

అందుగలడిందులేడని సందేహము వలదు - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏 " విశ్వతోముఖీ " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 780 వ నామం. " విశ్వతోముఖీ " అంటే అన్ని దిక్కులందు ముఖములు గలది. అమ్మవారిని శ్రీసూక్తంలో " లోకైక దీపాంకురాం " అని ప్రార్ధిస్తాం. లోక ఏక దీపాంకురం - లోకానికి ఒకే ఒక్క దీపంగా ఉన్నది. దీపం అన్ని వైపులా కాంతినిస్తుంది. ఒకవైపు అనో కొన్నివైపులనో చూడడం ఉండదు. దీపం అంధకారాన్ని అంటే అజ్ఞానాన్ని పోగొడుతుంది. అర్జునుడు పరమాత్మ విశ్వరూపాన్ని చూసి ఆశ్చర్యంతో ఇలా అంటారు: "నమః పురస్తాదథ పృష్ఠతస్తే  నమోయస్తు తే సర్వత్ ఏవ    సర్వ, అనంతవీర్యామిత    విక్రమస్త్వం సర్వం    సమాప్నోషి తతోథ్యసి సర్వః"                 - భ.గీత 11:40 ఓ అనంత శక్తి గల స్వామీ, నీకు ముందు మరియు వెనుక నుండి, నిజానికి అన్ని వైపుల నుండి నా నమస్కారాలు. మీరు అనంతమైన శౌర్యాన్ని కలిగి ఉన్నారు మరియు శక్తి కలిగి ఉన్నారు మరియు అంతటా వ్యాపించి ఉన్నారు, అందువలన, మీరు సర్వం. నారదులు ఉపదేశించిన " ఓం నమో భగవతే వాసుదేవాయ " నామజపాన్ని చేస్తున్నాడు ధృవుడు అత్యంత శ్రద్ధతో...

సమాజ శ్రేయస్సుకు కోపం కూడా అవసరమే - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏 " క్రోధశమనీ " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 169 వ నామం. " క్రోధశమనీ " అంటే కోపాన్ని పోగొట్టునది అని. కోపం అనర్ధహేతువు. అనుబంధాలు, ఆరోగ్యం చెడతాయి కోపం వలన.  శ్రీసూక్తం ఇలా చెబుతూంది: "న క్రోధో న చ మాత్సర్యం   న లోభో నాశుభా మతిః   భవంతి కృతపుణ్యానాం   భక్తానాం శ్రీసూక్తంజపేత్సదా" పుణ్యం చేసిన భక్తులకు కోపంరాదు, అసూయ కలుగదు, లోభం నశిస్తుంది, దుర్బుద్ధి ఉండదు. శ్రీసూక్తం చదువుతే భక్తి కలుగుతుంది.  విష్ణుసహస్రంలో " క్రోధహా " అని ఒక నామం ఉంది. నామార్ధం " కోపాన్ని తొలగించువాడు " అని భాష్యం చెప్పారు ఆదిశంకరులు. ఆశ్చర్యకరంగా " భవనాశినీ, లోభనాశినీ, మోహనాశినీ " అన్నట్లుగా " క్రోధనాశినీ " అనకుండా " క్రోధశమనీ " అని ప్రార్థిస్తారు అమ్మవారిని. శమనీ అంటే తగ్గించడం.  కోపం కూడా అవసరమే. పిల్లలు అల్లరి, తప్పులు చేస్తూంటే అమ్మ కోప్పడుతుంది. లేకపోతే పిల్లలకు గారాబం ఎక్కువయి దారితప్పే ప్రమాదముంది. కోపంలేనివాడు రాజు ఎలా అవుతాడు అంటున్నాయి శాస్త్రాలు. అధర్మం చేసినవారిని శిక్షిం...

అవసరంలేని ప్రాపంచిక బంధాలు తగ్గించుకోవాలి - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏 " భవనాశినీ " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 175 వ నామం. " భవనాశినీ " అంటే సంసార(బంధ)మును నశింపచేయునది అని అర్ధం. నశింపచేయడం అంటే ఎవరినో ఒకరిని చంపేయడం కాదు, బంధాన్ని తగ్గిస్తుంది అని. అసలు తగ్గించడం దేనికి?. కపిలమహర్షి తన తల్లికి తత్వం భోదిస్తూ ఇలా తెలియచేసారు: " ఏవం స్వభరణాకల్పం    తత్ కళత్రా యస్తధా   నాత్రియంతే యధా పూర్వం    హీనా సాయివ గోజరం " గోజరం అంటే ముసలి ఎద్దు. " ఎవరి ఆనందంకోసం అయితే జీవితమంతా ఏదోరకంగా ( అధర్మంగా నైనా ) సంపాదిస్తావో ఆ భార్యాపిల్లలు ముసలితనంలో నిన్ను సంపాదించినప్పుడు చూసినట్లుగా చూడరు. వ్యవసాయదారుడు ముసలి ఎద్దును ప్రక్కన పెట్టినట్లుగా నిన్ను మూలన పడేస్తారు భార్యాపిల్లలు " అన్నారు.  భార్యాపిల్లల అవసరాలు తీర్చడం భర్త బాధ్యతే. కాని బంధం పెరిగే కొలదీ వారి ఆనందంకోసం పాపకర్మలు/అధర్మసంపాదన ఎక్కువ అవుతాయి. పాపహేతువు. అమ్మవారితో బంధం పెంచుకుంటే ప్రాపంచికబంధాన్ని తగ్గిస్తుంది. అప్పుడు మనస్సు ప్రశాంతంగా, జీవితం ధర్మబద్ధంగా ఉంటుంది. " జరామరణమోక్షాయ              ...

అహంకారం నాశనహేతువు - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏 " దక్షయజ్ఞవినాశినీ " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 600 వ నామం.  " దక్షయజ్ఞవినాశినీ " అంటే దక్షుడి యజ్ఞమును నాశనము చేసినది అని. అమ్మవారిని దాక్షాయణీ అని ప్రార్థిస్తాం, దక్షుడి పుత్రిక కనుక. మరి తండ్రి యజ్ఞాన్ని నాశనం చేసినవారు అని కీర్తించడం ఏమిటి?. ఇక్కడ అర్ధం చేసుకోవలసినది దక్షుడులాంటి వారు చేసే యజ్ఞాలను నాశనం చేస్తారు అమ్మవారు అని. దక్షుడు లోకకళ్యాణం కోసం యజ్ఞం తలపెట్టారు. బ్రహ్మ, విష్ణువు, ఋషులను అందరినీ ఆహ్వానించారు. శివుని మీద కోపంతో ఆహ్వానించలేదు. శివుడు దక్షుడి పుత్రిక అయిన సతీదేవి భర్త, అల్లుడు. పుత్రికని అల్లుడిని ఆహ్వానించకుండా అవమానపరిచేలా మరీ చేసారు దక్షుడు యజ్ఞాన్ని. ఇంకొకరికి అవమానం కలిగేలా చేసే యజ్ఞాలను ఎలా జరగనిస్తారు అమ్మవారు. " అద్వేష్టా సర్వభూతానాం    మైత్రః కరుణ ఏవ చ,   నిర్మమో నిరహంకారః   సమదుఃఖసుఖః క్షమీ "               - భ.గీత 12:13 " ఏ భక్తులైతే సమస్త ప్రాణుల పట్ల ద్వేషభావన లేకుండా, మైత్రితో/స్నేహపూరితముగా, మరియు కారుణ్యముతో ఉంటారో, వారు నాకు చాలా ప్ర...

సుఖాసనంలో కూర్చుని అమ్మవారిని ధ్యానిస్తే చాలు - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏 " సుఖారాధ్యా " - అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 681వ నామం. " సుఖారాధ్యా " అంటే సుఖముగా ఆరాధింపదగినది అని అర్థం. అమ్మవారిని ఆరాధించడానికి, అనుగ్రహం పొందడానికి ఎక్కువ కష్టపడనక్కరలేదు. అంటే కఠినమయిన నియమాలేమీ ఉండవు. తెల్లవారుజామున చన్నీళ్ళస్నానం, రోజుల తరబడి ఉపవాసం/నిరాహారంగా ఉండడం, కష్టమయిన ఆసనంలో కూర్చోవడం/నిలబడడం లాంటివి చేయనక్కర్లేదని భావం. శరణాగతి అంటే నువ్వు తప్ప వేరే దిక్కు లేదు నాకు అని అమ్మవారికి నమస్కరించుకుని నామజపం చేసుకుంటే చాలు అమ్మవారు అనుగ్రహిస్తారు. కపిలమహర్షి తన తల్లికి తరించడానికని గీత భోదిస్తారు. అది " కపిలగీత " గా ప్రసిద్ధి చెందింది. అష్టాంగయోగంలో " సదా ఆసనజయం " అని ఒక విషయం వివరిస్తారు. శరీరాన్ని బాధపెట్టేవి, ధ్యానాన్ని ఆటంకపరిచేవి అయిన ఆసనాల్లో కూర్చోనక్కరలేదు సాధనకు. ధ్యానానికి శరీరం ఒక ముఖ్యమయిన సాధనం. శరీరం ఆరోగ్యంగా, సౌకర్యంగా ఉండాలి. అప్పుడే సాధన వీలవుతుంది. అదే పరమాత్మ గీత ( అధ్యాయం )లో తెలియచేసారు. " ఏకాంతంగా అంత ఎత్తు పల్లం కాని మెత్తటి ఆసనం మీద కూర్చుని కనుబొమల...

" ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవం ". శుభాకాంక్షలు - చీమలపాటి సూర్యనారాయణ

 🙏" శ్రీరస్తు శుభమస్తు "🙏 " అన్నం న నింద్యాత్   అన్నం నపరిచక్షీత "        - తైత్తిరీయ ఉపనిషత్తు  అన్నంని నిందించకూడదు అని తెలియచేస్తున్నాయి శాస్త్రాలు. జీవుడికి శక్తిని తేజస్సుని ఇస్తూన్నది బ్రహ్మం కదా. మరి మనం తినే తిండే కదా మనకు శక్తిని తేజస్సుని ఇస్తూన్నది. అందుకే ఉపనిషత్తులు " అన్నం పరబ్రహ్మ స్వరూపం " అని తెలియచేస్తున్నాయి.  విష్ణుసహస్రంలో స్వామిని " అన్నం అన్నాద ఏవ చ " అని ప్రార్ధిస్తాం. అంటే అన్నం ఆయనే, అన్నాన్ని ఇచ్చేదీ ఆయనే, ఆ అన్నాన్ని ( ఉదరంలోని జఠర అగ్ని ద్వారా ) గ్రహిస్తూన్నది ఆయనే.  అందుకే మన సనాతనధర్మం ఏ తినుబండారాన్నైనా పరమాత్మకి నివేదించి తినమన్నారు. అప్పుడు అది ప్రసాదం అవుతుంది, ప్రత్యేక రుచి వస్తుంది. ప్రసాదంలో మనం లోపాలు వెదకం. అలాగే చిన్నప్పటినుంచే పిల్లలకు అన్నం మీద భక్తిని గౌరవాన్ని అలవాటుచెయ్యాలి. దేనినైనా ఇష్టంగా తింటే వంటికి పడుతుంది లేకపోతే నిరుపయోగమవుతుంది. మా రెండో అన్నయ్యతో సాధారణంగా భోజనం చేసేవారం కాదు పిల్లలం. ఇంట్లో రకరకాల సైజుల పేకబెత్తాలు ఉండేవి. వాటిని ఎక్కువగానే వాడేవారు మా అన్నయ్య. అతని నియమం ప్రకారం కాళ...

సంసారం సాగరం దుఃఖం అంటూ బాధపడిపోనక్కరలేదు - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏 " భవచక్రప్రవర్తనీ " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 843 వ నామం. " భవచక్రప్రవర్తనీ " అంటే " సంసార చక్రమును ప్రవర్తింపచేయునది ". భవ అంటే సంసారం, ప్రవర్తింపచేయడం అంటే అనుకూలంగా చేయడం. సంసారంలో ఉండేటట్లు చేయడం. అందరూ సంసారం అనగానే చికాకు పడిపోయి వైరాగ్యం చెందుతే ఎలా. జీవుడు శరీరాన్ని తీసుకునేది కర్మఫలాలు ( మంచీ చెడూ ) అనుభవించి ముక్తి పొందడానికి. మరి సంసారమే లేకపోతే శరీరం పొందే అవకాశం ఎక్కడ ఉంది. సంసారచక్రం కొనసాగేదెలా. ఇంతమంది వివాహాలు చేసుకుని సంసారాలు చేస్తున్నారంటే ఏదో మహత్తు ఉన్నట్లేగా. అలా కొత్తదనం, ఆకర్షణ ఉండేలా అమ్మవారు చేస్తూ ఉంటారు. వ్యాసమహర్షి ఓరోజు స్నానానికని నదికి వెడుతున్నారు. ఓ చెట్టు మీద ఉన్న పక్షులను చూసి ఆశ్చర్యపోయారు. మగపక్షి తెచ్చిన ఆహారాన్ని ఆడపక్షి తీసుకుని పిల్లపక్షి నోట్లో పెడుతూంది. ఎంత మధురంగా ఉంది, పక్షులే సంసారాన్ని ఇలా ఆనందిస్తూంటే మనషుల గురించి ఇంక చెప్పేదేముంది అనుకుని తను కూడా ఓ సుపుత్రుడిని పొందాలని గాఢంగా కోరుకున్నారు. శుకజననం జరిగింది.  అలా అమ్మవారు సంసారచక్రాన్ని ఆకర్షణీయం...

బంధాలను మరీ పెంచేసుకోకూడదు - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏 " బంధమోచనీ " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 546 వ నామం. " బంధమోచనీ " అంటే " అజ్ఞాన ( సంసార ) బంధము నుండి విడిపించునది.  బంధము అంటే అజ్ఞాన బంధం. ధర్మబద్ధమయిన బంధం ఉండాలి. లేకపోతే జీవితం నిస్సారం. కాని బంధాలు శాశ్వతం అనుకుంటూ అదే లోకంలో ఉండకూడదు. ఓ ఉదాహరణ చూద్దాం. మీ సంతానం బాగుకోసం, అభివృద్ధికోసం మీరు ఎంతో కష్టపడి ఉంటారు, త్యాగాలు చేసి ఉంటారు. వారి సంతానం కోసం వారు కష్టపడతారు. మనుమల విషయంలో మీరెందుకు ప్రతీదానిలోనూ కలుగజేసుకుని బాధపడడం. అదే అజ్ఞానబంధం.  రాముడిని ఎలాగయినా అరణ్యవాసం మానిపించి అయోధ్యకు తీసుకుని వెళ్ళాలని అందరూ ప్రయత్నం చేసారు. జాబాలి దశరధుని సలహాదారు. ఆయన రాముడితో " అస్తమానూ తండ్రికిచ్చిన మాట అంటావు. తండ్రి ఎవరు, కొడుకు ఎవరు. ఈ బంధాలేమిటి " అంటారు. రాముడు కోపంతో " నా తండ్రికి నీవంటివారు సలహాదారుగా ఉన్నందుకు నేను సిగ్గు పడుతున్నాను " అన్నారు.  ఇంద్రజాలం జరుగుతూంది. దానికి రుసుం ఉంటుంది. ఇంద్రజాలికుడు చేసేవేవీ నిజాలు కావని తెలుసు. కాని రుసుం కట్టి సమయం వృధా చేసుకుని మరీ ఎందుకు చూ...

సమాజం భ్రష్టుపట్టిపోతే అమ్మవారు చూస్తూ ఊరుకోదు - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏 " మహాప్రళయసాక్షిణీ " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 571వ నామం. కల్పాంతంలో సృష్టి అంతా తనలో లయమయి పోతూ ఉంటే అమ్మవారు సాక్షిగా నిర్వికారంగా చూస్తూ ఉంటారు( ట ). అసలు లయం దేనికి?. ప్రస్తుతం కలియుగం ప్రారంభం. ఇప్పుడే ఎందరో అధర్మపరులను, స్వార్ధపరులను చూస్తున్నాం. సమాజాన్ని ఎంత భ్రష్టు పట్టిస్తున్నారో చూస్తున్నాం. 20/25 ఏళ్ళ వయసున్న పచ్చటి చెట్లను అరగంట " నాయకుడి సభ " కోసం నిర్దాక్షిణ్యంగా కొట్టిపడేస్తున్నారు. అతిధి గృహాలకోసం రక్షణనిచ్చే కొండలను త్రవ్వి పడేస్తున్నారు. మరి కలియుగాంతంలో పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు.  అప్పుడప్పుడు వార్తలు చదువుతూంటాం. ప్రమాద స్థితిలో ఉన్న భవనాలను వంతెనలను ప్రభుత్వం కూల్చేయడం.  అమ్మవారు ఇంక ఏమాత్రం బాగు చేయడానికి అవకాశం లేని తన సృష్టినంతా తనలో లయం చేసేసుకోవడంలో ఆశ్చర్యం ఏముంటుంది. క్రొత్త భవనం కట్ఠాలంటే పూర్తిగా పాడయిపోయిన ప్రాత భవనం కూల్చక తప్పదు. క్రొత్త సృష్టి చేయాలంటే పూర్తిగా భ్రష్టు పట్టిన ప్రాత సృష్టిని లయం చేయక తప్పదు. ఆదిశంకరులు శివానందలహరి చేస్తూ ఇలా ప్రార్థిస్తారు: " క...

అమ్మవారు అంత సులభంగా దొరకరు - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏 " దురాధర్షా " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 772వ నామం. " దురాధర్షా " అంటే కష్టమయిన తపముచే స్వాధీనము చేసుకొనుట గలది - అమ్మవారిని స్వాధీనం చేసుకొనుట అంత సులభము కాదు - అని అర్థం. అమ్మవారిని ఎలా చూడగలమో బ్రహ్మాండపురాణం తెలియచేసింది: " ధ్యానైక దృశ్యా జ్ఞానాంగీ    విద్యాక్షా హృదయా స్పదా    ఆత్మైక్యాత్ వ్యక్తమాయాతి    చిరానుష్టాన గౌరవాత్ "  అమ్మవారు జీవుడి హృదయంలోనే ఉంది. అనుష్టానం అంటే ఎడతెగని సాధనతో అమ్మవారిని చేరగలం అని తెలియచేస్తూంది పురాణం. ఎంత కఠిన సాధన చేయాలో తెలుస్తూంది. మూకశంకరులు కామాక్షీ అమ్మవారిని ఇలా స్తుతిస్తారు: " చింతితఫలపరిపోషణ   చింతామణిరేవ      కాంచినిలయా మే    చిరతరసుచరితసులభా   చిత్తం శిశిరయతు     చిత్సుధాధారా "          - మూకపంచశతి -3 ఇందులో " చిరతరసుచరితసులభా " అన్నారు. అంటే ఎంతోకాలము చేసిన సత్కర్మాచరణములచే సులభముగా లభించునది అని అర్ధము. ఎంతో కాలము అంటే ఎన్నో జన్మలు కూడా పట్టవచ్చు. సాధన చేయగా చేయగా చివరి జన్మలో " ప...

మంచి చెబుతే ఎవరికి నచ్చుతుంది - కలికాలం - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీరస్తు శుభమస్తు"🙏 " ఏవం పరంపరాప్రాప్తం       ఇమం రాజర్షయో విదుః,   స కాలేనేహ మహతా              యోగో నష్టః పరంతప "                   - భ.గీత 4:2 ఓ పరంతపా! (అర్జునా!) ఈ విధముగ పరంపరాప్రాప్తమైన ఈ యోగమును రాజర్షులు ఎఱింగిరి. కాని అనంతరము ఈ యోగము ( భగవద్గీత ) కాలక్రమమున భూలోకమునందు లుప్తప్రాయమయ్యెను. ఎంత అద్భుత విషయం. లుప్తప్రాయమయింది అన్నారు పరమాత్మ. అంటే మరుగున పడిపోయింది అని. కలి ప్రభావం వలన మంచి చెబితే నచ్చదు. కష్టపడి పనిచేయి. పరుల సొమ్మును ఆశించకు. పరస్త్రీ వ్యామోహం వద్దు. ఇంద్రియాలను అదుపులో ఉంచుకో. తల్లిదండ్రులను గురువులను గౌరవించు. లోభం మోహం వద్దు. నలుగురికీ మంచి చేస్తూ ఉండు. అన్ని జీవులను ఒకే విధంగా గౌరవించు. సంపాదించిన దానిలో కొంత దానధర్మాలకు ఉపయోగించు. అతిగా తిన్నా అతిగా నిద్రపోయినా లేక అసలు తినకపోయినా నిద్రపోకపోయినా మనస్సు నిలకడగా ఉండక తప్పుడు ఆలోచనలు, పనులు చేయిస్తుంది. అందుకని మితాహారం మితనిద్ర పాటించు.  మానసిక ప్రశాంతతకు, ఆనందకరమైన జీవితానికి ఇటువంటి ...