Posts

Showing posts from October, 2024

శివకేశవులకు ఇష్టమయిన కార్తీకమాసం రేపటినుంచి - చీమలపాటి సూర్యనారాయణ

 🙏" శ్రీరస్తు శుభమస్తు "🙏 పురాణాలు, ఉపనిషత్తులు మనకు ఋషులు ఇచ్చిన అద్భుత సంపద. చిన్నచిన్న కధలతో మనకు, మానవాళికి, ప్రపంచానికి ఏది మంచో ఏది చెడో చక్కగా తెలియచేయబడ్డాయి. కార్తీకపురాణం లో ఎన్నో అద్భుత విషయాలు ఉన్నాయి. ఒక సందర్భంలో సరస్వతీదేవి గాయత్రీదేవిని ఉద్దేశించి ఇలా అంటారు: " అపూజ్యా యత్రపూజ్యంతే    పూజ్యానాంచ వ్యతిక్రమః,   త్రీణిత్రత్ర భవిష్యంతి      దుర్భిక్ష్యం మరణం భయం" " ఎక్కడైతే పూజార్హతలేనివారు పూజింపబడుతూ ఉంటారో, పూజనీయులు పూజింపబడడంలేదో అక్కడ కరువు, మరణం, భయం అనే మూడు విపత్తులు కలుగుతాయి " అని.  ఇప్పుడు పూజార్హతలేనివారికి కూడా పాలాభిషేకాలు జరుగుతున్నాయి. అందువల్లే ఈ విపత్తులన్నీ అని అనుకోవచ్చు. ఈ పురాణంలోనే కృష్ణపరమాత్మ సత్యభామతో ఇలా అంటారు: " దేశగ్రామకులానిస్యుః    భోగభాంజికేతాదిషు,   కలౌతు కేవలం కర్తా    ఫలభుక్పుణ్యపాపయోః ". అంటే " కృతయుగంలో పాపపుణ్యాలు ఎవరు చేసినా గ్రామానికి చెందేవి. ద్వాపరంలో వారి వంశానికి చెందేవి. కలియుగంలో మాత్రం ఎవరి కర్మఫలాలు వారికే చెందుతాయి " అని. స్వామి ఎన్నో అద్భుతమైన ఇతర విషయాలు కూ...

మనిషి మొహంలో జీవం ఉంటుంది, అది అమ్మవారి అనుగ్రహం - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏 " ద్యుతిధరా " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 768 వ నామం . " ద్యుతిధరా " అంటే కాంతిని ధరించినది అని అర్ధం. విష్ణుసహస్రనామాలలో ద్యుతిధరః అని ఒక నామం. దానికి కాంతివంతమయిన శరీరము కలవాడు అని భాష్యం చెప్పారు ఆదిశంకరులు. ప్రతీ జీవిలోనూ జీవించి ఉన్నంత కాలం కాంతి ఉంటుంది. మరణించిన తరువాత ఉండదు. ఈ కాంతి అమ్మవారి చైతన్యం. మరీ నిరుత్సాహంగా దిగులుతో ఉన్నవారిని చూస్తే " జీవం " లేదు అనిపిస్తుంది. ఈ కాంతి జీవికి ఉత్సాహాన్నిస్తుంది. భక్తులకు కాంతి ( అమ్మవారి చైతన్యం ) కొంచెం ఎక్కువగా ఉంటుంది. కంచి, శృంగేరి పీఠాధిపతుల ముఖాలు ప్రకాశవంతంగా ప్రశాంతంగా ఉంటాయి. కేవలం వారి దర్శనంతోనే మన మనస్సులు నిర్మలమవుతాయి. రావణుడు యుద్ధానికి వస్తాడు ఇంద్రజిత్తు కూడా మరణించాక. రాముడు అదే మొదటిసారి రావణుడిని చూడడం. రాముడు ఆశ్చర్యపోతాడు రావణుడి తేజస్సు చూసి.  " అహో దీప్తో మహాతేజా    రావణో రాక్షసేశ్వరః " ఇవి రావణుడిని చూడగానే రాముడి నోటివెంట వచ్చిన మాటలు. ఈ రాక్షసేశ్వరుడు ఎంత తేజస్సుతో వెలిగిపోతున్నాడు, సీతాపహరణం చేసి ఉండకపోతే ఇతను దే...

ధనత్రయోదశి - అడిగినదానికన్నా ఎక్కువ ఇచ్చి మాయ చేస్తారు అమ్మవారు, జాగ్రత్తగా ఉండాలి - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీరస్తు శుభమస్తు"🙏 " తాం మ ఆవహ జాతవేదో    లక్ష్మీమనపగామినీం "                  - శ్రీసూక్తం. ఇక్కడ " లక్ష్మీమనపగామినీం " అన్నారు. " అనపగామినీం " అంటే తిరిగి వెనక్కు వెళ్ళనటువంటిది. అటువంటి సంపదను ఇయ్యమని అమ్మవారిని కోరుకోవాలి. ఎవరినైనా ఆశీర్వదించినప్పుడు " ఆయురారోగ్య ఐశ్వర్యాది భోగభాగ్యములతో జీవించుము " అని అంటారు. ఆయువు, ఆరోగ్యం, ఐశ్వర్యములంటే తెలిసినవే. భోగాలంటే సౌకర్యాలూ, పనిమనుషులు మొ.గునవి. మరి భాగ్యం ఏమిటి. ముందర నాలుగూ అంటే " ఆయువు ఆరోగ్యం ఐశ్వర్యం భోగాలు " ఉన్నా సుఖం ఉండదు చాలామందికి.  " అశాంతస్య కుతః సుఖం ( భ.గీత 2:66 )" - " ఎప్పుడూ అశాంతిగా ఉండేవానికి సుఖం ఎక్కడిది " అన్నారు పరమాత్మ గీతలో. " భాగ్యం " అంటే ఈ శాంతే. ఇది ఉన్న మనిషే సుఖంగా ఉండగలడు, ఏది లేకపోయినా. ఈ శాంతిని కలుగచేసేది అమ్మవారు లక్ష్మీదేవి. ఆవిడ సంపదని ఇస్తుంది అంటారు. నిజమయిన సంపద ఈ శాంతే. శ్రీలక్ష్మీసహస్రనామాలలో " సదదృష్టప్రదాయినీ/దురదృష్టవిఘాతినీ " అని ఉంటుంది. మంచి అదృష్టాన్ని ప్రసాదిస్తుంది, దురదృష్టాన్ని...

అమ్మవారు పుట్టుక లేనిది, స్వయంభూ - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏 " పూర్వజా " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 975 వ నామం. " పూర్వజా " అంటే ముందు పుట్టినది అని భాష్యం చెప్పారు కాని పుట్టుకకు కారకులు ఉంటారు కదా. అమ్మవారికి పుట్టుక, లయలు లేవు. స్వయంభువు. " పూర్వం దేవేభ్యో అమృతస్య నాభా ఇ " అని తెలియచేస్తూంది తైత్తిరీయోపనిషత్తు. దేవతలకు ముందర ఉన్నది, అమృతమునకు ఆధారమై/కేంద్రమై ఉన్నది అని అర్థం. దేవతలు వచ్చాకే సృష్టి మొదలయ్యింది అంటే అమ్మవారు దేవతలకు ముందే ఉన్నారని తెలుసుకోవాలి. గజేంద్రుడు శక్తి సన్నగిల్లడంతో విష్ణువుని శరణు వేడుతూ ఇలా తలుస్తారు: " ఎవ్వనిచే జనించు జగ   మెవ్వని లోపల నుండు      లీనమై; యెవ్వని యందు     డిందుఁ; బరమేశ్వరుఁ      డెవ్వఁడు; మూలకారణం   బెవ్వఁ; డనాదిమధ్యలయుఁ     డెవ్వఁడు; సర్వముఁ     దానయైన వాఁడెవ్వఁడు;     వాని నాత్మభవు నీశ్వరు నే      శరణంబు వేడెదన్ " ఈ లోకమంతా ఎవరివల్ల పుడుతుందో; ఎవరిలో కలిసి ఉంటుందో; ఎవరి లోపల లయం అయిపోతుందో; ఎవరు పరమాత్ముడో; ఎవరు సృష్టికి ప్రధానకారణమై ఉన...

మరుపు మనిషికి అమ్మవారి వరం - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏 " తిరోధానకరీ " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 270 వ నామం . " తిరోధానకరీ " అంటే కనిపించకుండునట్లు చేయునది అని అర్ధం.  ఇదొక అద్భుత నామం. మరుపు ఒక అదృష్టం మనిషికి. దానిని అమ్మవారు అనుగ్రహిస్తారు. ఈ నామానికి ఓ అద్భుతమయిన ఉదాహరణ తెలియచేసారు విజ్ఞులు. దేవుడి దగ్గర దీపం పెడతాం. కొంత సేపు అయిన తరువాత దీపం, వత్తీ రెండూ ఉండవు. అన్నీ నశించిపోతాయి. మన సమస్యలన్నింటినీ అమ్మవారి ముందు పెట్టేస్తే దీపం, వత్తిలాగ కనుమరుగవుతాయి.  కష్టాలయినా సుఖాలయినా శాశ్వతం కావు. కాని మనిషి సంతోషం కలిగించిన విషయాలను తొందరగా మర్చిపోతాడు, కష్టాలను కలిగించిన విషయాలను మాత్రం తలుచుకుని తలుచుకుని బాధపడుతూ ఉంటాడు.  సీతమ్మ త్రిజటతో అంటారు " సంతోషాలు చిన్న చిన్న సెలయేరులు, కొండలు లాగ చిన్నవిగా అనిపిస్తాయి. కష్టాలయితే మహాసముద్రాలలాగ, పెద్ద పెద్ద పర్వతాలలాగ పెద్దవిగా కనిపిస్తాయి " అని.  అమ్మవారు మనుషుల జీవితాలలో అప్పుడప్పుడు సంఘర్షణలు, వింత సంఘటనలు కలుగచేస్తూ ఉంటారు. వాటివల్ల ఈ మానవ సంబంధాలు శాశ్వతం కావు, అనవసరంగా బంధాలు పెంచుకుంటున్నామేమో అనే ఆలోచన...

అర్ధకామాలు ధర్మయుతంగా ఉండాలి - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏 " త్రివర్గనిలయా " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 873 వ నామం .  " త్రివర్గనిలయా " అంటే ధర్మార్ధకామములకు స్థానమైనది/నిలయమైనది. పురుషార్ధాలలోని మోక్షాన్ని ఇక్కడ చేర్చలేదు, అది కఠిన సాధనతో కూడుకున్నది. ధర్మార్ధకామాలు మూడూ అమ్మవారు ఇచ్చేవే. ఆ మూడింటిలోనూ అమ్మవారు స్థితులయి ఉంటారు అనే భావనే అద్భుతం. అన్నం కావాలన్నది కోరిక/కామం. అన్నం దొరికింది, అది అర్ధం. ఆ అన్నాన్ని కొంచెం ఇంకొకరికి పెట్టడం జరిగింది. అది ధర్మం. విషయం ఒకటే అన్నం. అందులోనే మూడూ ఉన్నాయి. అర్ధకామాలను ఒకే పురుషార్ధంగా చూడాలి. కామం వలననే అర్ధం దొరుకుతుంది. పుట్టుక వలననో పెంపకం వలననో కొందరికి ధర్మబుద్ధి అలవడుతుంది. కాని అర్ధం/ధనం ఉండదు. కొందరికి ధనం ఉంటుంది. ధర్మబుద్ధి ఉండదు. అమ్మవారు ఈ రెండింటినీ అనుగ్రహిస్తారు. కామం/కోరిక తప్పు కాదు. బ్రహ్మధర్మం వేరు, వ్యావహారిక ధర్మం వేరు. మనిషికి తనకంటూ కొన్ని కోరికలు, గమ్యాలు ఉంటాయి. ఆ కోరిక లోకకళ్యాణం కోసం కాకపోయినా ఇతరులకు హాని జరిగేది అయి ఉండకూడదు. అలాగే ఒకరు సమాజానికి హాని జరిగే పని చేస్తున్నాడు అని తెలిస్తే అతనిని అ...

ఏపని అయినా అవుతుందనే నమ్మకంతో మొదలెట్టాలి - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏 " నిర్వికల్పా " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 176 వ నామం .  " నిర్వికల్పా " అంటే వికల్పములు లేనిది. వికల్పము అంటే భ్రాంతి, కల్పన అన్నారు. సంకల్పం అంటే ఓ పని చేసేముందు ధృఢంగా అవాలని మొదలుపెడతాం. వికల్పం అంటే సందేహంగా ప్రారంభించడం, అనుమానంతో వదిలేయడం లాంటివి. " ఏమో, మొదలు పెట్టాను కాని అవుతుందని నమ్మకంలేదు " అనే మాటలు ఎక్కువగానే వింటూంటాం. వికల్పం. మనకు ఇది సాధారణంగా ఎదురయ్యే పరిస్థితి. అమ్మవారి సృష్టి అంతా లయబద్ధంగా లోపరహితంగా ఉంటుంది. అమ్మవారికి వికల్పాలు ఎందుకుంటాయి. పోతనగారు వ్యాసభాగవతం తెనిగీకరిస్తూ ఇలా వ్రాసారు: " కలడందురు దీనులయెడ   కలడందురు పరమయోగి   గణములపాలం   కలడందురన్ని దిశలను   కలడు కలండనెడువాడు    కలడో లేడో "            - పోతనభాగవతం " భగవంతుడు దీనులలో ఉన్నాడంటారు. ఇంకా మహాయోగుల సమూహాలలో ఉన్నాడంటారు. అన్నిదిక్కులలోనూ ఆయనే ఉన్నాడంటారు. ఉన్నాడు ఉన్నాడు అని రూఢిగా చెబుతున్న భగవంతుడు నిజంగా ఉన్నాడో? లేడో? " అన్నారు పోతన. దీనిలో చివరన " కలడో లేడో " అన్నారు పోతనగారు. ఇ...

బలిచక్రవర్తికి ఆ పేరు ఎలా వచ్చింది - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏 " బలిప్రియా " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 677 వ నామం. " బలిప్రియా " అంటే బలవంతులను ఇష్టపడునది అని. బలవంతులు అంటే కండబలం కలవారు అనికాదు. కామక్రోధాది శతృవులను జయించిన ఉపాసకులను బలవంతులు అంటారు. ఆత్మసమర్పణను ఇష్టపడుతుంది అని అర్ధం. బలి అంటే పూజ, సమర్పణ. సమర్పణ అంటే పూర్తిగా అర్పించుకోవడం. అంతేకాని జంతుబలులు అవీ కావు. ఒంటిమీద బట్టలు కూడా లేకుండా ఈ భూమిమీద పడ్డారు జీవులు. వారివి అంటూ ఏముంటాయి. అన్నీ అమ్మవారి ప్రసాదమే కదా. ఆ భావనతో జీవించాలి ఎల్లప్పుడూ. అదే బలి. బలిచక్రవర్తికి ఆ పేరు ఎలా వచ్చింది. వామనుడు మూడు అడుగుల భూమి మాత్రమే అడిగాడు దానంగా. బలి అప్పటికే భూలోకాన్ని పైలోకాలనూ జయించేసాడు. ఇంద్రుడిని బయటకు పంపించేసాడు. వామనుడు ఓ పాదంతో భూమిని ఇంకో పాదంతో పైలోకాలను ఆక్రమించారు. మూడవ పాదం ఎక్కడ పెట్టమంటావు అని అడిగారు వామనుడు. నా తలపై పెట్టు అన్నాడు బలి. ఇందులో అద్భుత తత్వం ఉంది. మనిషి నేను, నాది అనే భావనతో బాధపడుతూ ఉంటాడు ఎల్లప్పుడూ. నాది అంటే మమ. అంటే మమకారం. నేను అంటే అహం. అంటే అహంకారం. బలి తాను సంపాదించిన లోకాలను/...

ధైర్యంగా ఉండాలి ఎల్లప్పుడూ - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏 " ధృతిః " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 446 వ నామం .  " ధృతిః " అంటే అందరియందున్న ధైర్య స్వరూపిణి. మనిషికి ధైర్యం చాలా ముఖ్యం. అది లేకపోతే ఏపనీ మొదలుపెట్టలేరు, ఏమీ సాధించలేరు. " ఉద్యమః సాహసం ధైర్యం    బుద్ధిః శక్తిః పరాక్రమః    షడేతే యత్ర వర్తంతే    తత్ర దేవ సహాయకృత్ "          - సుభాషిత రత్నాకరం  ధైర్యంతో పనులను చేస్తే దేవతలు కూడా సహాయపడతారని సుభాషితం. హనుమ లంకలో సీతమ్మను చూసి పలకరించిన తరువాత వచ్చినట్లుగానే గుట్టుగా తిరిగి వెళ్ళి పోవచ్చు. అలా వెళ్ళిపోతే రామదూత ఎలా అవుతారు. మనం రోజూ " మనోజవం మారుత తుల్య వేగం.......శ్రీరామదూతం శిరసాన్నమామి " అని ఎలా ప్రార్ధన చేస్తాం.  శతృవు బలం ఎంత, ఎటువంటి వీరులు ఉన్నారు శతృసైన్యంలో అనే విషయాలను కొంచెం తెలుసుకుంటే నయమనుకున్నారు. తను ఒంటరి, యోజనాల సముద్రం దాటి వచ్చాడు, శీఘ్రముగా తిరిగి వెళ్ళి శుభవార్త చెప్పాలి అనే విషయాలను ప్రక్కన పెట్టేసారు. ధైర్యంగా తను అనుకున్న పని చేసేసారు. రావణుడి కొడుకు అక్షయకుమారుడు తో బాటు జంబుమాలి వంటి వీరులను ...

చిన్న పని అయినా సంకల్పం ధృడంగా మంచిదయి ఉండాలి - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏 " దీక్షితా " - అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 695 వ నామం. " దీక్షితా " అంటే దీక్షగలది, జ్ఞానమును గలిగించు దీక్షగలవాని స్వరూపముగలది అని భాష్యం చెప్పారు. దీ అంటే జ్ఞానం. క్ష అంటే పాపక్షయం. ఈ రెండూ ఉన్నవారిని దీక్షితులు అంటారు. వీరికి కొన్ని కట్టుబాట్లు, బాధ్యతలు ఉంటాయి. ముఖ్యంగా నియమాలు ఉంటాయి. దీక్ష అంటే సంకల్పం. ఏదైనా పని లేక కోరిక తీరడం కోసం దీక్ష తీసుకుంటారు. ఉదా: నిరాహారదీక్ష చేస్తారు. కాలక్షేపం కోసం కాదు. దానికి ఓ కారణం ఉంటుంది. వీరు గురువు దగ్గర దీక్ష తీసుకుంటారు. అయ్యప్పస్వామిదీక్షను గురుస్వామి దగ్గర తీసుకుంటారు. నేరుగా మాల వేసుకోకూడదు. వీరికి కొన్ని రక్షణలు కూడా ఉంటాయి. మైల, పురుడు మొ.గు అశుచులు వీరికి అంటవు. దీక్షాకాలం ముగిసే వరకు. కాల నియమం కూడా ఉంటుంది. అయ్యప్ప దీక్ష అయితే నలభై రోజులు, చాతుర్మాస్య దీక్ష అయితే నాలుగు నెలలు దీక్షలో ఉంటారు. ఆ సమయంలో ఆహార నియమాలు, నడవడిక నియమాలు, ప్రత్యేక వస్త్రధారణ కలిగి ఉంటారు. దైవ నామస్మరణ చేసుకుంటూ మితభాషిగా ఉంటారు. దీక్ష సమయంలో పరుషభాష ఉపయోగించకపోవడం, ఇతరులకు హాని కలిగి...

మన మూలాలు వెతుక్కుంటూ వెనక్కు వెడితే అమ్మవారు ఉంటారు - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏 " గుహుజన్మభూః " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 606 వ నామం .  " గుహుజన్మభూః " అంటే గుహునకు అనగా కుమారస్వామికి జన్మనిచ్చినది అని. జీవులు పుట్టుచోటు అని కూడా భాష్యం చెప్పారు. వేదంలో " అగ్నేర్యధా స్ఫులింగాః ..... " అని ఒక మంత్రం ఉంది. అగ్నినుండి స్ఫులింగములు అంటే అగ్గిరవ్వలు బయలుదేరి పైకి ఎగిరి వచ్చినట్లు పరమాత్మ నుండి జీవులు బయటకు వస్తున్నాయని ఉపమానం. యాజ్ఞవల్క్యస్మృతిలో కాల్చిన ఇనుపగుండునుంచి స్ఫులింగములు వచ్చినట్లు అని తెలియచేసారు. అగ్నిలోంచి పైకెగిరే రవ్వలలో కూడా ఉండేది అగ్నియే కదా. అంటే పరమాత్మలోంచి వచ్చిన జీవులలో ఉండేది పరమాత్మయే. అహం బ్రహ్మాస్మి అంటే ఇదే. మీ గోత్రం ఏమిటి అని అడుగుతూంటారు. ఋషి పేరు చెబుతాం. ఆ ఋషి ఆ గోత్రంవారికి మూలపురుషుడు. మరి ఋషుల జన్మకు కారకులు ఎవరు. అలా ఆలోచిస్తూ వెనక్కు వెడితే పరమాత్మ దగ్గరకు చేరతాం. అంటే జీవులందరకూ మూలపురుషుడు పరమాత్మ.  ఇదే విషయాన్ని పరమాత్మ గీతలో ఇలా తెలియచేసారు: " సర్వయోనిషు కౌంతేయ     మూర్తయః సంభవంతి యాః,    తాసాం బ్రహ్మ మహద్యోనిః    అహం బీజప్రదః పితా...

తనను నమ్ముకున్న భక్తులను అమ్మవారు వదిలేయరు - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏 " సమస్తభక్తసుఖదా " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 502 వ నామం  " సమస్తభక్తసుఖదా " అంటే భక్తులందరికీ సుఖములను ఇచ్చునది అని అర్ధం. తనను నమ్ముకున్న భక్తులకు సుఖాన్ని, కీర్తిని, ముక్తిని ప్రసాదించకుండా ఎలా ఉంటారు అమ్మవారు. ఆదిశంకరులు దేవీ అపరాధ క్షమాస్తోత్రం చేస్తూ అమ్మవారిని ఇలా ప్రార్థిస్తారు: " న మోక్షస్యాకాంక్షా న చ      విభవ వాంఛా2పి చ న మే     న విజ్ఞానా2పేక్షా శశిముఖి     సుఖేచ్చా2పి న పునః,   అతస్త్వాం సంయాచే జనని     జననం యాతు మమవై     మృడానీ రుద్రాణీ   శివ శివ భవానీతి జపతః " " నాకు మోక్షం వద్దు. వైభవంమీద కోరిక లేదు. విజ్ఞానం మీద ఆపేక్ష లేదు. తల్లీ నాకు సుఖపడదామన్న కోరిక కూడా లేదు. నేనేమి కోరుకుంటున్నానో తెలుసా?. నా జన్మ అంతా నీ జపంతో జరిగిపోతే చాలు " అని వేడుకున్నారు శంకరులు. అటువంటి నిష్కామభక్తులు అవడం వలననే శంకరులు సనాతనధర్మ పరిరక్షకులుగా, కారణజన్ములుగా నేటికీ పూజింపబడుతున్నారు. కుంతి పాండవుల పరిస్థితి చూసి బాధపడుతూంటే పరమాత్మ " అత్తా, కాలప్రభా...

సంపదలన్నీ ఉన్నా కొందరికి సుఖం ఉండదు - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏 " సుభగా " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 761 వ నామం .  " సుభగా " అంటే సౌభాగ్యము గలది అని అర్ధం. అమ్మవారి సౌభాగ్యం ఎంత గొప్పదంటే దేవదానవులు పాలసముద్రాన్ని మథించినప్పుడు హాలాహలం పుట్టుకొచ్చింది. అందరూ పారిపోయారు. ఆలస్యం చేస్తే లోకాలు దహించుకు పోతాయి. అప్పుడు శివుడు ఆ హాలాహలాన్ని గ్రహించి అమ్మవారి వేపు చూస్తారు. అమ్మవారు సరే అని తల ఊపుతారు. అమ్మవారికి అంత నమ్మకం ఆవిడ సౌభాగ్యం మీద.  అమ్మవారిని నమ్ముకున్న భక్తులకు సౌభాగ్యానికి లోటుండదు. ఆదిశంకరులు సౌందర్యలహరిలో ఇలా ప్రార్థిస్తారు అమ్మవారిని: " హరిస్త్వామారాధ్య ప్రణతజన   సౌభాగ్యజననీం పురానారీ భూత్వా    పురరిపుమపి క్షోభమనయత్,   స్మరోఽపి త్వాం నత్వా రతినయన    లేహ్యేన వపుషా మునీనామప్యంతః    ప్రభవతి హి మోహాయ మహతామ్ " ఓ జగన్మాతా, ప్రణమిల్లే భక్తజనులకు సౌభాగ్యాన్ని ప్రసాదించే నిన్ను పూర్వం శ్రీహరి ఆరాధించి సుందరాంగియై త్రిపురాలను తెగటార్చిన శివుడి మనస్సులో సైతం కామవికారాన్ని కలిగించి క్షోభపెట్టగలిగాడు. అలాగే మన్మధుడు నిన్ను కొలిచి తన సతి రతీదేవి కన్నుల...

అమ్మవారు భక్తుల హృదయాలలో ఉంటారు - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏 " భక్తమానసహంసికా " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 372 వ నామం. " భక్తమానసహంసికా " అంటే భక్తుల మనస్సనెడి సరస్సునందలి హంసవలె ఉండునది అని అర్థం. హిమాలయాలలోని మానససరోవరం గురించి తెలుసు అందరికీ. జీవుడి మనస్సే ఒక సరోవరం. అందులో అమ్మవారు హంసలా విహరిస్తూ ఉంటారు. హంస నీళ్ళు కలిపిన పాలలోంచి పాలను మాత్రమే గ్రహిస్తుంది. అలాగే తమ మనస్సులో అమ్మవారు హంసరూపంలో ఉన్నవారు మంచిచెడులలోని మంచిని మాత్రమే గ్రహిస్తారు. వీరిని పరమహంస అని పిలుస్తారు. ఉదా: రామకృష్ణ పరమహంస. వీరు భౌతికవిషయాలను విస్మరించి అమ్మవారి ధ్యానంలోనే గడుపుతూ ఉంటారు. వీరు జీవన్ముక్తులు. అమ్మవారు అన్నారు: " నాహం తీర్థే, న కైలాసే,    వైకుంఠేవా న కర్హచిత్ " అని. అంటే తీర్థాలలోనూ, కైలాసంలోనూ ఆఖరికి వైకుంఠంలోనూ ఉండను నేను " అని. " వసామికింతు " - మరి ఎక్కడుంటావమ్మా అని అడిగితే ఆవిడ అన్నారు " మత్ జ్ఞాని హృదయాంభోజమధ్యమే " అంటే జ్ఞానుల హృదయాలలో ఉంటాను అని. శంకరులు సౌందర్యలహరిలో అమ్మవారిని ఇలా స్తుతిస్తారు: " సమున్మీలత్ సంవిత్      కమలమ కరందై...

కదలిక ముఖ్యం జీవికి, అమ్మవారు కదలికను ఇస్తారు - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏 " క్షోభిణీ " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 466 వ నామం . " క్షోభిణీ " అంటే సృష్టి చేయుటకై భగవంతునియందు క్షోభను కలిగించినది అని అర్ధం చెప్పారు. క్షోభ అంటే కదలిక. శ్రీ బాలాత్రిపురసుందరీదేవికి అష్టోత్తర శతనామావళి పూజ చేస్తూ అమ్మవారిని " ఓం సర్వసంక్షోభిణ్యైనమః " అని పూజిస్తాం. మంచి కదలికలను కలిగిస్తుంది తల్లి. విష్ణుసహస్రంలో క్షోభణః అని ఒక నామం. దానికి సృష్టికాలమునందు కల్లోలము కలిగించువాడు అని భాష్యం చెప్పారు ఆదిశంకరులు. మనిషికి ఈ కదలిక చాలా ముఖ్యం. కదలిక లేకపోతే ఉత్సాహం ఉండదు. అసలు జీవితానికి అర్ధమే ఉండదు. కదలిక లేకుండా పడుకుని ఉంటే అతనికే కాదు, అతని సంబంధించిన వారికందరికీ నరకమే. " యోజనానాన్ సహస్రాణి    యాతిగచ్ఛన్ పిపీలికాః,    అగచ్ఛన్ వైనతేయో2పి    పదమేకం నగచ్ఛతి "  " నడక మొదలెడితే చీమలు కూడా వ్రేలమైళ్ళు వెడతాయి కాని మొదలుపెట్టకపోతే గరుత్మంతుడు కూడా ఒక్కడుగు ( పదమేకం ) కూడా వెళ్ళలేడు  " అని తెలియచేస్తూంది సుభాషితం. క్షోభని బాధకు బదులుగా వాడుతూంటారు సాధారణంగా. క్షోభ పెట్టకండి అంటూంటారు. ...

కలికాలంలో భగవన్నామస్మరణ చాలు - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏 " కలికల్మషనాశినీ " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 555 వ నామం . " కలికల్మషనాశినీ " అంటే కలికాలమందలి పాపములను పోగొట్టునది అని అర్ధం. " కల్యంతే కలహం కుర్వన్ యశ్మిన్ కలిః " - " కలికాలం ఎప్పుడూ కలహాలతో గడుస్తూ ఉంటుంది " అని భావం. కలహాలు దేనికి?. ద్వేషం అసూయ జీవులలో పెరిగిపోవడం వలన. ఈ కలి కలియుగంలోనే ఉంటారు అనుకోకూడదు. ధర్మంతో నిండి ఉన్న సత్యయుగంలో కూడా ఉన్నాడు. నలదమయంతుల కధ మనం చదివేయున్నాం. త్రేతాయుగంలో రావణకుంభకర్ణులు, ద్వాపరంలో దుర్యోధనాదులు కలిపురుషులే. ఇప్పటి కలియుగంలో కూడా ధర్మపరులు ఉంటారు.  వ్యాసర్షి మహాభాగవతంలో ఇలా అన్నారు: " యత్ఫలం నాస్తి తపసా    న యోగేన సమాధినా    తత్ఫలం లభతే సంయక్    కలౌ కేశవకీర్తనాత్ " ఇతర యుగాలలో తపస్సు యోగం సమాధితో ఏ ఫలాన్ని పొందుతారో ఆ ఫలాన్ని కలియుగంలో కేవలం కేశవనామ కీర్తనతోనే లభించేస్తుంది.  " యజ్ఞానాం జపయజ్ఞో2స్మి ( భ.గీత 10:25 ) అన్నారు పరమాత్మ గీతలో. అంటే కలియుగంలో భగవన్నామ స్మరణ చాలు తరించడానికి. అమ్మవారి పాదాలను ఆశ్రయిస్తే ఈ కలిప్రభావ లక్షణాలు మన...

అమ్మవారు పెద్ద ముత్తైదువ - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏 " సువాసినీ " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 970 వ నామం . " సువాసినీ " అంటే చక్కని ఉనికి కలిగినది అని. ఇక్కడ ఉనికి అంటే భర్తతో ఉండడం అని. ఎల్లప్పుడూ భర్త గలది.  భూలోకంలో సువాసిని " జీవత్పతిక " అంటే భర్త బ్రతికి ఉన్న స్త్రీ. మరి అమ్మవారు?. " సర్వకాలజీవత్పతిక " అంటే శాశ్వతంగా ఉండే ఆయన్ని ( పరమేశ్వరుడిని ) భర్తగా కలిగినది.  సువాసిని భర్తకు విద్యుత్కర్మలు చేయడానికి అర్హతనిస్తుంది. భార్యలేనివారు అన్ని కార్యక్రమాలు చేయకూడదు. కూతురుకు పెళ్ళిచేస్తే కన్యాదానం కూడా చేయడానికి వీలు లేదు. అందుకే పూర్వం భార్య అకాలమరణం చెందితే వెంటనే మళ్ళీ వివాహం చేసుకునేవారు. ఇంటికి దీపం ఇల్లాలు అన్నారు. స్త్రీ అనలేదు. అంటే సువాసిని ఇంటికి వెలుగుని, గౌరవాన్ని ఇస్తుంది. కుంతి పాండురాజుతోకానీ, సీతమ్మ రాముడితో కాని, ద్రౌపది పాండవులతో కాని అరణ్యానికి వెళ్ళనక్కరలేదు. కాని భర్త ధర్మాన్ని అనుసరిస్తూ జీవించాలంటే భార్య తోడ్పాటు అవసరం. అందుకే భర్త సంపాదించిన పుణ్యంలో సగభాగం భార్యకు లభిస్తుంది అన్నాయి శాస్త్రాలు. " అరణ్యవాసం పూలపాన...

భక్తులకే అమ్మవారు సుందరంగా దర్శనం ఇస్తారు - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏 " దంష్ట్రోజ్వలా " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 488 వ నామం .  " దంష్ట్రోజ్వలా " అంటే వరాహ సమాన దంతములతో శోభించునది అని అర్థం తెలియచేసారు. అదేమిటండీ కోరలతో ఉన్న అమ్మవారు శోభతో ఉండటమేమిటి అనుకోవచ్చు. శిష్టులకు అలాగే కనిపిస్తుంది. నృసింహస్వామి ఉగ్రరూపుడు. కాని ప్రహ్లాదుడికి ప్రసన్నమూర్తి. రక్షకుడు. నరసింహస్వామి ప్రహ్లాదుడిని ఒళ్ళో కూర్చోపెట్టుకుని " ఈ దేవతలు, యక్షులు అందరూ నన్ను చూసి గజగజ లాడుతున్నారు, నా దగ్గరకు రావడానికి భయపడుతున్నారు. మరి నీకు భయంగా లేదా " అని అడుగుతారు. ప్రహ్లాదుడు " భయం ఎందుకు, కోరలు ఎర్రటి కళ్ళతో కూడిన మీ ముఖం ఎంత మనోహరంగా ఉందో " అని అంటాడు. భక్తుడి మొదటి లక్షణం భయం లేకపోవడం. మనల్ని దుష్టులనుంచి, అధర్మపరులనుంచీ రక్షించేవారు ఎలా ఉండాలి. నవ్వుతూ మెత్తగా ఉంటే మనం ధైర్యంగా ఎలా ఉండగలం.  అర్జునుడు పరమాత్మ యొక్క అసలు రూపాన్ని చూడాలని ఉందని కోరుతాడు. పరమాత్మ విశ్వరూపాన్ని ధరించారు. ఆ రూపాన్ని చూసిన సంజయుడు ధృతరాష్ట్రునికి ఇలా తెలియచేసాడు: " అనేకవక్త్రనయనం       అనేకాద్భుతదర్శన...

అమ్మవారి ముఖం ప్రసన్నంగా ఉంటుంది - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏 " సుముఖీ " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 459 వ నామం . " సుముఖీ " అంటే ప్రకాశించుచున్న ముఖము గలది అని అర్ధం. అమ్మవారు కోటిసూర్య సమప్రభ. అంత కాంతిగా ఉంటారు. ఒక సూర్యుడినే నేరుగా చూడలేము. మరి అమ్మవారిని ఎలా చూసి ఉంటారు. కఠోర సాధన చేస్తే అమ్మవారు దర్శనం ఇచ్చి అనుగ్రహిస్తారు. మనం కూడా కళ్ళు మూసుకుని అమ్మవారి ముఖలక్షణాలను ఊహచేస్తే చూడగలం. చూసి ఆనందించగలం. గురువు లక్షణాలు ఎలా ఉండాలో/ఉంటాయో శాస్త్రాలు స్ఫష్టంగా తెలియచేసాయి: " సుందరస్సుముఖస్స్వచ్ఛః  ‌  సులభో బహుతంత్రవిత్,   అసంశయత్ సంశయచ్చిన్    నిరపేక్షో గురుర్మతః "  ఇక్కడ " సుముఖః " అన్నారు. అంటే గురువు ప్రసన్నమయిన ముఖంతో ఉంటారుట. ఎంత ప్రసన్నత అంటే శిష్యుడు హాస్యాస్పదమైన చిన్న సందేహాన్ని కూడా భయంలేకుండా చొరవగా అడిగేటంత. మరి అమ్మవారు గురురూపిణి. గురుపరంపరలో ఆది. మరి అమ్మవారి ముఖం ఎంత ప్రసన్నంగా ఉంటుందో ఊహించడం కష్టం కాదు కదా. దుర్గాసూక్తంలో అమ్మవారిని " తాం అగ్నివర్ణాం " అని ప్రార్థిస్తాం. ఎరుపు పసుపు కలిసిన చక్కటి రంగు అమ్మవారిది. శంకరులు ల...

అమ్మవారి పాదాలను ఆశ్రయిస్తే అనవసరమయిన బంధాలు తగ్గిస్తారు - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏 " విశృంఖలా " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 834 వ నామం . " విశృంఖలా " అంటే ప్రతి బంధకములు లేనిది.  అమ్మవారికి కర్మలూ ఉండవు, కర్మఫలాలూ ఉండవు. ప్రతిబంధకాలు ఎలా ఉంటాయి.  మనకే ప్రతిబంధకాలు ఉండేది. సమాజం మనల్ని మనంగా బ్రతకనివ్వదు. పుణ్యకార్యం చేయాలన్నా ఎన్నో ప్రతిబంధకాలు. పాపఫలమే కాదు పుణ్యఫలము కూడా నశించాలి. అప్పుడే మళ్ళీ జన్మ లేకుండా ముక్తి లభిస్తుంది. కొద్దిగా పుణ్యఫలం మిగిలినా దానిని అనుభవించడానికి మళ్ళీ జన్మ తీసుకోవలసి వస్తుంది.  మనకు ఇష్టంలేని, చేయకూడదనుకున్న పనులు కూడా మనప్రమేయం లేకుండా చేసేస్తూంటాం.  పరమాత్మ గీతలో ఇలా అంటారు: " స్వభావజేన కౌంతేయ    నిబద్ధః స్వేన కర్మణా,    కర్తుం నేచ్ఛసి యన్మోహాత్    కరిష్యస్యవశో2పి తత్ "            - భ.గీ 18:60. " నీవు చేయుటకు ఇష్టపడని పనులు కూడా పురాకృత స్వాభావిక కర్మలచే బంధింపబడి  చేయుదువు " అన్నారు పరమాత్మ. ఆయనకేమండీ మొదట్లో కష్టపడ్డా సమస్తభోగాలూ అనుభవించాడు అని తరచు వింటూంటాం. అంటే పాపఫలం పుణ్యఫలం రెండూ అనుభవించాడు ...

ధనం సంపాదనే కాదు, ఖర్చు కూడా ధర్మబద్ధంగా ఉండాలి - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏 " పురుషార్ధప్రదా " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 291 వ నామం. " పురుషార్ధప్రదా " అంటే పురుషార్ధాలను అనుగ్రహించునది అని అర్ధం. పురుషార్ధాలు అంటే చతుర్విధ పురుషార్ధాలు. ధర్మ అర్థ కామ మోక్షాలు. కామం అంటే కోరిక. అది తప్పు కాదు. ఉండాలి కూడా. కోరిక కలిగితే దాన్ని పొందడానికి సాధన చేస్తారు. కోరిక ధర్మబద్ధంగా ఉండాలని మాత్రమే సనాతనధర్మం చెబుతూంది. అర్ధం అంటే ధనం. అదీ ముఖ్యమే. ఓ యాగం చేయాలన్నా కాశీయో రామేశ్వరమో వెళ్ళాలన్నా ధనం అవసరమే కదా. కాని ఆ ధనం కూడా ధర్మబద్ధంగా సంపాదించినదే అయి ఉండాలి. ఆశ్చర్యం ఏమిటంటే భారతం ఉద్యోగపర్వంలో ఓ అద్భుత శ్లోకం ఉంది: " న్యాయాగతస్య ద్రవ్యస్య    బోద్ధవ్యౌ ద్వావతిక్రమౌ,   అపాత్రే ప్రతిపత్తిశ్చ    పాత్రేచ అప్రతిపాదనం "  ధనం సంపాదనే కాదు ఖర్చుచేయడం కూడా ధర్మబద్ధంగా ఉండాలి అని తెలియచేసారు. శంకరాచార్యులు సౌందర్యలహరి గానంచేస్తూ ఇలా ప్రార్థిస్తారు: " త్వదన్యః పాణిభ్యా-మభయ   వరదో దైవతగణ  స్త్వమేకా నైవాసి   ప్రకటితవరాభీత్యభినయా     భయాత్త్రాతుం దాతుం ఫలమపి చ   ...

అమ్మవారు అడిగినదానికన్నా ఎక్కువ ఇస్తారు, జాగ్రత్తగా ఉండాలి - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏 " వాంఛితార్ధప్రదాయినీ " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 989 వ నామం  " వాంఛితార్ధప్రదాయినీ " అంటే కోరినవన్నీ ఇస్తారు అని. అమ్మవారు ఇవ్వలేనిది ఏముంటుంది. ఆవిడ అమ్మ కనుక అడగకుండానే ఇస్తుంది. భక్తితో కోరుకుంటే కోరుకున్నదానికన్నా ఎక్కువే ఇస్తుంది. మనం ధర్మార్ధకామాలనే కోరుకున్నా అమ్మవారు సంతోషిస్తే ఊహించని మోక్షాన్ని కూడా ప్రసాదిస్తారు. మూకశంకరులు ఆర్యాశతకంలో కామాక్షీదేవిని ఇలా కీర్తిస్తారు: " కామపరిపంథికామిని కామేశ్వరి      కామపీఠమధ్యగతే,   కామదుఘా భవ కమలే    కామకలే కామకోటి కామాక్షి"                    - శ్లోకం 49 " కామపీఠము మధ్యనున్నదానా, లక్ష్మీస్వరూపము గలదానా కోట్లాది కామములు నీయందున్నవి. భక్తుల కోరిన కోర్కెలు అనుగ్రహించుదానవు. నీవు నా కోర్కెలు తీర్చు తల్లీ " అని. ఈ శ్లోకంలో అమ్మవారిని " కామకోటి " అన్నారు మూకశంకరులు. కోట్లకొలదీ కోరికలు ఉంటాయిట అమ్మవారి దగ్గర, భక్తులకు ఇవ్వడానికి. ఏది కోరినా లేదనరు. హిరణ్యకశిపుడిని సంహరించాక నరసింహస్వామి ప్రహ్లాదుడిని ఒడిలో కూ...

శ్రీ గాయత్రీదేవి మంచిచెడులను తెలియచేస్తారు - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏 " ధర్మాధర్మవివర్జితా " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 255 వ నామం. " ధర్మాధర్మవివర్జితా " అంటే ధర్మాధర్మములు రెండునూ లేనిది అని. ధర్మం దేశకాలవర్ణాశ్రమాలను బట్టి మారుతూ ఉంటుంది. దేశం అంటే ప్రదేశం. ఒకచోట ధర్మమయినది ఇంకో చోట అధర్మం అవచ్చు. ఇప్పుడు ధర్మమయినది తరువాత అధర్మం అవచ్చు. ఒక్కోసారి ధర్మాధర్మ నిర్ణయం కష్టం కావచ్చు. పాము కప్పను పట్టుకుంది. కప్పను కాపాడడం ధర్మం. కాని పాము నోటినుంచి ఆహారాన్ని లాగేయడం ధర్మమా?. దేవహూతి భర్త కర్దమునితో " ఇంతకాలం ఈ దేహంతో భోగాలన్నీ అనుభవించాను కాని జ్ఞాని అయిన భర్త లభించినా సత్యం ఏమిటో తెలుసుకునే ప్రయత్నమే మొదలు పెట్టలేదు " అని చెబుతూ ఇలా అంటారు:  " నేహయద్కర్మ ధర్మాయ    న విరాగాయ కల్పతే    నా తీర్థపద సేవాయై    జీవన్నపి మృతోహితః " " ధర్మకార్యాలు చేయనివాడు జీవించి ఉన్నా మరణించినవాని క్రింద లెక్క. ధర్మకార్యాలు చేస్తూ ఉన్నా ఫలాన్ని ఆశించకుండా చేయకపోతే జీవన్మృతుడి క్రింద లెక్క. ఫలితాన్ని ఆశించకుండా ధర్మకార్యాలు చేస్తూన్నా అది భక్తిగా మారకపోతే మరణించినవాని క్రింద లె...

శ్రీఅన్నపూర్ణాదేవి పాయసం గిన్నె, గరిటితో తిరుగుతూ ఆకలితో ఎవరయినా బాధపడుతున్నారా అని గమనిస్తూ ఉంటారుట - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏 " అద్భుతచారిత్రా " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 988 వ నామం . " అద్భుతచారిత్రా " ఆశ్చర్యకరమగు చరిత్ర గలది. అమ్మవారి లీలలు చదివినప్పుడు, విన్నప్పుడు ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది. మూకశంకరులు మూకపంచశతి ఆర్యాశతకంలో కామాక్షీదేవిని ఇలా కీర్తిస్తారు: " కుసుమశరగర్వసంపత్కోశ   గృహం భాతి      కాంచిదేశగతమ్,   స్థాపితమస్మిన్కథమపి    గోపితమంతర్మయా      మనోరత్నమ్ "             - ఆర్యాశతకం:65 మన్మధుడి గర్వానికి కారణం అమ్మవారుట. శివుడు మన్మధుడిని భస్మం చేసేసారు. కాని అమ్మవారు అనుగ్రహించారు. తనకు అమ్మవారి అనుగ్రహం ఉందనే గర్వంతో అందరినీ తన బాణాలతో బాధిస్తున్నాడుట మన్మధుడు. రతీదేవిమీద దయతో మన్మధుడిని అనుగ్రహించారు అమ్మవారు. అంత కరుణామయురాలు. శుకమహర్షి పరీక్షిత్తుకి వృత్రాసుర వృత్తాంతం చెబుతూ అతని పూర్వజన్మ గురించి చెబుతారు. వృత్రాసురుడు పూర్వజన్మలో చిత్రకేతువు అనే చక్రవర్తి. ఎందరో భార్యలు కాని సంతానం లేదు. అంగీరమహర్షిని సేవిస్తే యాగఫలంతో కొడుకు పుట్టాడు. అసూయతో మిగతా రాణులు కుర్రాడిన...

అమ్మవారు చిత్ర విచిత్ర వేషాలు ధరిస్తారు - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏 " సువేషాఢ్యా " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 969 వ నామం .  " సువేషాఢ్యా " అంటే చక్కని మంగళకరమయిన వేషముతో ఒప్పుచున్నది అని. శంకరులు అమ్మవారి సౌందర్యాన్ని వర్ణిస్తూ నూరు శ్లోకాలతో సౌందర్యలహరి చేసారు. మూక శంకరులు 500 శ్లోకాలతో మూకపంచశతి చేసారు. అమ్మవారి అందాన్ని వర్ణించడం సామాన్యులకు సాధ్యమా. అమ్మవారు అంత అద్భుత సౌందర్యవతి కనుక ఏ వేషంలో అయినా అద్భుతంగానే ఉంటారు. భక్తితో శరణాగతి అన్న మహామహులకు బాలగా, శ్యామలాదేవిగా, కామాక్షీదేవిగా, కమలాంబగా అనుగ్రహిస్తారు.  మూకశంకరులు ఆర్యాశతకంలో ఓ అద్భుత వర్ణన చేస్తారు: " మదజలతమాలపత్రా    వసనితపత్రా      కరాదృతఖానిత్రా,   విహరతి పులిందయోషా    గుంజాభూషా      ఫణీంద్రకృతవేషా "          - ఆర్యాశతకం:85 అమ్మవారు ఆకులను వస్త్రాలుగా చుట్టుకుందిట. పూసలు వేసుకుందిట. గడ్డపార చేతిలో పట్టుకుందిట. దొప్పలలోని మదజలాన్ని త్రాగుతూందిట. కిరాతస్త్రీ యొక్క విచిత్రవేషంతో వెలిగిపోతూందిట.  ఆశ్చర్యంగా ఉందికదా. అర్జునుడు పాశుపతాస్త్రం కోసం ఘ...

ఈరోజు పవిత్రమయిన మహాలయ అమావాస్య - శుభాకాంక్షలు - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏 " చిదగ్నికుండసంభూతా, దేవకార్యసముద్యతా " - అమ్మవారి అద్భుతనామాలు. ఇవి శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 4,5 వ నామాలు. " దేవకార్యార్ధమై అమ్మవారు అగ్నికుండంలోంచి పుట్టారు " అని. ఎప్పుడు, ఎలా అన్నది తెలుసుకుందాం. భండాసురుడు, అతని తమ్ముళ్ళు విశుక్రుడు విషంగుడు అనేవారు దేవతలను, ప్రజలను తమ మాయాబలంతో పీడించుకు తినేవారు. దేవతలు దెబ్బలు తిని తిని నిస్సత్తువతో బాధపడేవారు. వెళ్ళి అందరూ త్రిమూర్తులకు మొరపెట్టుకున్నారు కాపాడమని. భండాసురుడి శక్తులు తెలుసు కనుక అమ్మవారే దిక్కు అని త్రిమూర్తులు తలచి శివుడి ఆధ్వర్యంలో మహాయాగం చేసారు. శివుడు తన మూడవకన్ను ఫాలనేత్రంనుంచి అగ్నిని సృష్టించి హోమగుండంలో వేసారు.  యాగం అయాక ఆ అగ్నికుండంలోంచి అమ్మవారు ఉద్భవించారు. అందుకే అమ్మవారిని " చిదగ్నికుండసంభూతా " అని కొలుస్తున్నారు. ఆవిడే శ్రీలలితామహాత్రిపురసుందరీదేవి. బ్రహ్మ ఆజ్ఞతో విశ్వకర్మ అమ్మవారికోసం ఒక మహానగరాన్ని సృష్టించారు. దానిపేరు శ్రీమన్నగరం.  అమ్మవారు ముందర మంత్రిణీదేవిగా శ్యామలాదేవిని, దండనాధాదేవిగా వారాహీదేవిని ఏర్పాటుచేసారు. అమ్మవారి చిరునవ్వులోంచి 64 కో...