మిత్రులు - ఉత్తములు
🙏"శ్రీరస్తు శుభమస్తు"🙏 " ఉత్తమానాం స్వభావోయం, పరదుఃఖః అసహిష్ణుత, మయం దుఃఖంచ సంప్రాప్తం, మన్యతే అన్యస్యవార్యతే " . - వ్యాసర్షి, మహాభారతం ఉత్తములు ఇతరుల దుఃఖాన్ని తట్టుకోలేరు. తాము బాధపడతారు ఇతరుల దుఃఖాన్ని పోగొట్టడానికి. మిత్రులు అందరూ ఉత్తములే, తోటి మిత్రుల బాధలను పంచుకునేవారే. కిం సంశయం? పూజ్యులు చాగంటివారి దగ్గరకు ఓ పెద్ద కాలేజి నడిపే ఆయన వచ్చి " మా కాలేజీ ఆడిటోరియంలో మహాభారతం ప్రవచనం చేయమని మిమ్మల్ని అడగడానికి వచ్చాను " అన్నారుట ( ఈ విషయం చాగంటివారే చెప్పారు ). " భేష్ మంచి ఆలోచన, తప్పకుండా చేస్తాను " అన్నారు గురువుగారు. కాలేజీ ఆయన అన్నారు " అందరూ యువతీ యువకులు కనుక మీరు దయచేసి ద్రౌపదీ వస్త్రాపహరణం, దుర్యోధనుడి తొడలు విరగ్గొట్టడం లాంటివి వదిలేసి మిగతావి చెబితే బాగుంటుంది " అనడంతో ఈయన నవ్వి " మహాభారతం అంటే అన్నీ ఉంటాయి, అన్నీ ఉంటేనే భారతం, అందుకని అన్నీ చెబుతాను " అన్నారుట. అలాగ వాట్సప్ అన్నాక అన్నీ ఉంటాయి. మనకు నచ్చేవి నచ్చనివి అన్నీ ఉంటాయి. ఎవరికి కావలసినవి వారు చూసి ఆనందిస్తారు. పట్టుబట్టకట్టుకుని...