Posts

Showing posts from May, 2025

సాధనతో మనస్సు శుద్ధి అవుతుంది - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏 " సర్వాంతర్యామినీ " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్య నామాలలో 819 వ నామం.  " సర్వాంతర్యామినీ " అంటే అందరి అంతఃకరణాలని నిర్ణయించేది , అన్ని జీవుల్లోనూ కొలువై ఉంటుంది అని అర్ధం. కఠోపనిషత్తు అమ్మవారు అంగుష్టప్రమాణంలో ప్రతీ జీవుడి హృదయంలో ఉంటారని తెలియచేస్తూంది. బహిఃకరణాలు లాగే జీవుడి లోపల అంతఃకరణాలు ఉంటాయి. ఇవి నాలుగు: మనస్సు - సంకల్పవికల్పాలు చేసేది. బుద్ధి - గ్రహ్యనిర్ణయం - గ్రహించడం. వేడి, చల్లదనం, మంచి, చెడు అహంకారం - నేను అనే భావన ( ఇది చెడు పదం కాదు, మనం వాడుతూన్నట్లుగా ) చిత్తం - స్మృతి  ఇవి నాలుగూ అమ్మవారి ( ఆత్మ ) అధీనంలో ఉంటాయి. అలాగని ఇవి చేసే మంచిచెడులకు అమ్మవారికి సంబంధం ఉండదు. అమ్మవారు సాక్షి మాత్రమే. ఎవరి కర్మఫలాలను వారే అనుభవిస్తారు.  జీవుడి జన్మజన్మల కర్మఫలాల వాసనలు ఈ అంతఃకరణాలని ఆవరించుకుని ఉంటాయి. అవే మంచిచెడులను ప్రేరేపిస్తాయి. అందుకే ముక్తి పొందాలంటే ఆ వాసనల క్షయం కోసం సాధన చేస్తూ ఉండాలి.  ఆదిశంకరులు " చిత్తస్య శుద్ధయే కర్మ " అన్నారు. కర్మలు ఎలా ఉండాలంటే చిత్తం శుద్ధి అయ్యేలా. దీనినే మనం తరచుగా ...

కలియుగం ఒక వరం తరించడానికి - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏 " కలికల్మషనాశినీ " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్య నామాలలో 555 వ నామం . " కలికల్మషనాశినీ " అంటే కలికాలమందలి పాపములను పోగొట్టునది అని అర్ధం. " కల్యంతే కలహం కుర్వన్ యశ్మిన్ కలిః " - " కలికాలం ఎప్పుడూ కలహాలతో గడుస్తూ ఉంటుంది " అని భావం. కలహాలు దేనికి?. ద్వేషం, అసూయ జీవులలో పెరిగిపోవడం వలన. ఈ కలి కలియుగంలోనే ఉంటారు అనుకోకూడదు. ధర్మంతో నిండి ఉన్న సత్యయుగంలో కూడా ఉన్నాడు. నలదమయంతుల కధ మనం చదివేయున్నాం. త్రేతాయుగంలో రావణకుంభకర్ణులు, ద్వాపరంలో దుర్యోధనాదులు కలిపురుషులే. ఇప్పటి కలియుగంలో కూడా ధర్మపరులు ఉంటారు.  వ్యాసర్షి మహాభాగవతంలో ఇలా తెలియచేసారు: " యత్ఫలం నాస్తి తపసా    న యోగేన సమాధినా    తత్ఫలం లభతే సంయక్    కలౌ కేశవకీర్తనాత్ " ఇతర యుగాలలో తపస్సు యోగం సమాధితో ఏ ఫలాన్ని పొందుతారో ఆ ఫలాన్ని కలియుగంలో కేవలం కేశవనామ కీర్తనతోనే లభించేస్తుంది.  " యజ్ఞానాం జపయజ్ఞో2స్మి ( భ.గీత 10:25 ) అన్నారు పరమాత్మ గీతలో. అంటే కలియుగంలో భగవన్నామ స్మరణ చాలు తరించడానికి. సులభంగా తరించడానికి కలియుగం ఒక వరం జీవులకు. అ...

విగ్రహం మన తృప్తి కోసం, సాధనకోసం - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏 " వ్యక్తావ్యక్త స్వరూపిణీ " - అమ్మవారి అద్భుతనామం. ఇది శ్రీలలితాసహస్రరహస్య నామాలలో 399వ నామం. అమ్మవారు వ్యక్తము, అవ్యక్తమూ కూడా. కొందరు సాధకులు ఉంటారు. వారికి మనస్సు నిర్మలంగా ప్రశాంతంగా ఉండి నిలుస్తుంది. వారికి ధ్యానం చేయడానికి అమ్మవారి రూపం అక్కరలేదు. కాని కొందరికి మనస్సు అంత సులువుగా నిలవదు. వారికి అమ్మవారి ఒక చక్కటి రూపం కావాలి ధ్యానం చేయడానికి.  విగ్రహారాధన మంచిదా, అవసరమా అని చాలామందికి సందేహం కలుగుతూ ఉంటుంది. ఇది ఇప్పటి సమస్యకాదు. పరమాత్మ గీతను బోధించినప్పుడే అర్జునుడికి ఈ సందేహం వచ్చింది.  " ఏవం సతతయుక్తా    యే భక్తాస్త్వాం పర్యుపాసతే,    యే చాప్యక్షర మవ్యక్తం  ‌  తేషాం కే యోగవిత్తమాః "               - భ.గీత 12:1 " నీ విశ్వరూపాన్ని ( దివ్యమంగళవిగ్రహాన్ని ) పూజించేవారు కొందరు, అవ్యక్తము నాశనరహితము అయిన పరబ్రహ్మరూపాన్ని కొలిచేవారు కొందరు వీరిలో ఎవరు శ్రేష్ఠులు " అని అడిగాడు అర్జునుడు. ఇద్దరూ శ్రేష్ఠులే అన్నారు స్వామి. కృష్ణపరమాత్మ అవతారాన్ని ముగించే ముందు ఉద్దవుడికి ఎన్నో ధర్మసూక్ష్...

అమ్మవారు ఆకాశంలో వృక్షంలా కూర్చుని ఉంటారు - చీమలపాటి సూర్యనారాయణ

 🙏" శ్రీమాత్రేనమః "🙏 " గగనాంతస్థా " - అమ్మవారి అద్భుతనామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 855 వ నామం. " గగనాంతస్థా " అన్నది ఒక అద్భుతనామం. అమ్మవారు ఆకాశం మధ్యలో కూర్చుని ఉంటారు అని తెలుసుకోవాలి. ఆకాశమే ( ఆకాశం అంటే వెలుగు. శూన్యం కాదు ) అమ్మవారు కదా మరి ఈ అర్ధమేమిటి. దీనికి ఉపనిషత్తులు ఇలా చెబుతున్నాయి : " వృక్ష ఇవ స్తబ్దో దివితిష్టతి "  అంటే చెట్టువలె స్తబ్దుగా ( పరమప్రశాంతంగా, గంభీరంగా ) ఆకాశంలో కూర్చుని ఉంటారు అని. ఎంత అద్భుత భావన/పోలిక. చెట్టు చూడండి చిగురిస్తుంది, ఆకులు పువ్వులు కాయలు పళ్ళు వస్తాయి. మళ్ళీ అన్నీ రాలిపోయి మోడు అవుతుంది. దీనిని " నిర్వికారం " అనుకోకూడదు - మళ్ళీ చిగురిస్తుంది కదా. అంటే చైతన్యం ఉన్నట్లేకదా. ఒకతను కాయలను/పళ్ళను జాగ్రత్తగా గౌరవంగా కోస్తాడు. ఇంకొకతను రాళ్ళతో కొడతాడు కాయల కోసం. చెట్టుకు ఎన్నో చోట్ల రాళ్ళదెబ్బలు తగులుతాయి. అలా అని అతనికి రుచిలేని లేక చేదు కాయ ఇవ్వదు. ఇద్దరికీ రుచికరమైన కాయలు, పళ్ళు ఇస్తుంది. అలాగే " అమ్మవారు " తనకళ్ళముందే ఎందరో జన్మలను తీసుకూంటూ ఉండడం, ఎందరో సంతోషాలను దుఃఖాలను అన...

సాధన గమ్యం జన్మరాహిత్యమే అవాలి - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీరస్తు శుభమస్తు"🙏 " మోక్షస్య కారణం సాక్షాత్    తత్వజ్ఞానం ఖగేశ్వరా "              - గరుడపురాణం  " మోక్షానికి కావలసినది ఆత్మజ్ఞానమే.‌ ఇది లేకుండా ఎన్ని వేదాలు, శాస్త్రాలు చదివినా సత్కర్మలు చేసినా ప్రయోజనం లేదు. ఆత్మజ్ఞానం లేకుండా యజ్ఞాలు యాగాలు చేయడం గాడిదలు గంధపుదుంగలు మోసుకుంటూ వెళ్ళడం లాంటిది. గంధపు సుగంధం గాడిదలకు తెలియదు అని. ఉపవాసం చేసి దేహాన్ని బాధపెట్టడం పాము చావాలని పుట్టను కొట్టడం లాంటిది. పాము ఆత్మ, పుట్ట దేహం. ముందు ఆత్మజ్ఞానం పొందు " అన్నారు విష్ణువు. అలా అని ఇవన్నీ చేయడం తప్పుకాదు, మానకూడదు. వీటి వల్ల పాపాలు నశిస్తాయి కాని మోక్షం కలుగదు. జీవుడి ఆశయం మోక్షం, జన్మరాహిత్యం కావాలి. వేల కోట్ల సంపదలు ఉన్నా కొందరికి సుఖం ఉండదు, కొందరు భయంకరమైన మరణంని పొందుతూంటారు. కాని ఇటువంటివన్నీ చూస్తూన్నా అశాశ్వతమైన వాటివెంట ఎందుకు పడుతున్నారు జీవులు అన్నది ఆశ్చర్యంగా అనిపిస్తుంది కాని ఆశ్చర్యమేమీ లేదు ఇందులో. " లోకో మోహా సురాం    పీత్వా న విభేతి కదాచన "                - గరుడపురాణం....

భక్తి ఎంత ఉత్తమమయినదిగా ఉంటే అమ్మవారికి అంత ఇష్టం - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏 " భక్తిప్రియా " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 118వ నామం. " భక్తిప్రియా " అంటే భక్తి ( భక్తియే ) ఇష్టముగా గలది అని. భక్తి " భజ్ " ధాతువు నుంచి వచ్చింది. గరుడపురాణం భజ్ అంటే సేవ అని తెలియచేస్తూంది. అమ్మవారి పూజలో చివరన " నృత్య గీత వాద్యాది సమస్త రాజోపచారాన్ సమర్పయామి " అని ముగిస్తాం. నృత్యం, కీర్తన వంటివన్నీ సేవలు.  గరుడపురాణం భక్తి కలిగిన మ్లేచ్ఛుడు కూడా " శ్రేష్టుడు, యతి, పండితుడు, ముని " అవుతాడు అని తెలియచేస్తూంది. మ్లేచ్ఛుడు అంటే వర్ణాశ్రమాచారధర్మములు లేని/ఆచరించని దేశములలో పుట్టినవారు అని తెలియచేస్తూంది. ఇప్పుడు విదేశీయులు కూడా సంప్రదాయాలను పాటిస్తూ చక్కటి మన వస్త్రధారణలో కీర్తనలు పాడడం, దేవీదేవతల నామపారాయణం చేయడం చూస్తున్నాం. అటువంటి భక్తి కలిగి ఉండడంతో విదేశీయులు కూడా శ్రేష్టులుగా గౌరవింపబడుతున్నారు నేడు.  ఉద్దవుడు గోపికలతో " మీరు భక్తితో కృష్ణుడిని కీర్తిస్తూ చేసిన గానం మూడు లోకాలనూ పవిత్రం చేసింది. అందుకని మీ పాదధూళిని నా నుదుటిన పెట్టుకున్నాను " అన్నారు. కంచర్ల గోపన...

సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకోవాలి - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏 " సామరస్యపరాయణా " - అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్య నామాలలో 792 వ నామం. " సామరస్యపరాయణా " అంటే హెచ్చుతగ్గులు లేని శివశక్తి భావము నివాసముగా గలది అని భాష్యం చెప్పారు. " సామరస్యం " అనే మాటను తరచుగా వింటూంటాం. కొంచెం సామరస్యంగా వ్యవహారాన్ని పరిష్కారించుకుంటే నయమేమో అంటూంటారు పెద్దవారు, ఆలోచనాపరులు. ఎంత పెద్దవారయినా పరిస్థితులను చూసి ఎదరకు అడుగు వేయాలి. ఎల్లప్పుడూ " నాకు ఎదురు లేదు " అనే అహం పనికిరాదు. హనుమ " జ్ఞానినాం అగ్రగణ్యం ".‌ అమ్మవారి అనుగ్రహం కూడా ఎక్కువే. ఇటువంటి లక్షణాలన్నీ హనుమలో కనబడుతాయి.  సుగ్రీవుడు తామున్న చోటికి వస్తూన్న రామలక్ష్మణులను గమనించి భయపడి పోతాడు. తనను చంపడానికని వాలియే ఎవరినో పంపించాడని ఊహించుకుని. హనుమ " అసలు వారు ఎవరో, ఎందుకు వస్తున్నారో తెలిసుకోకుండా ఎందుకు అంత అతిగా ఆలోచించడం. నేను వెళ్ళి విషయాలు తెలుసుకుని వస్తాను. భయపడకండి " అంటారు సుగ్రీవుడితో. మొదటిసారి హనుమ రాముడితో మాట్లాడినప్పుడు రాముడు హనుమ మాటతీరుకి ఆశ్చర్యపోయి లక్ష్మణుడితో అంటారు " ఇటువంటి వా...

సంతోషం మనస్సును శుద్ధి చేస్తుంది - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏 " శుద్ధా " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 765 వ నామం.  " శుద్ధా " అంటే పరిశుద్ధమయినది, అవిద్యచే కలిగిన మాలిన్యములు లేనిది. అవిద్య అంటే అజ్ఞానం. అజ్ఞానం వలన కామక్రోధలోభాల వంటి దోషాలు/మాలిన్యాలు అలవడుతాయి. అమ్మవారు ఇవేవీ లేకుండా శుద్ధంగా ఉంటారు. శుచి వేరు, శుద్ధి వేరు. శుచి అంటే మామూలుగా శుభ్రపరచుకోవడం. రోజూ చేసుకునేది. శుద్ధి అంటే మంత్రపూర్వకంగా శుభ్రపరచుకోవడం. అశౌచాలు ఏర్పడినప్పుడు శుద్ధి చేసుకుంటారు.  శుద్ధి గురించి మహాభాగవతంలో వ్యాసర్షి అద్భుతమయిన విషయాన్ని ఇలా తెలియచేసారు: " కాలేన స్నానశౌచాభ్యాం    సంస్కారైస్తపసేజ్యయా,   శుధ్యంతి దానైః సంతుష్ట్యా    ద్రవ్యాణ్యాత్మాఽఽత్మ     విద్యయా "     - భాగవతం 10:05:04 మానవుడు సకాలంలో చేయవలసిన కార్యాలు చేస్తే శుద్ధుడవుతాడు అంది శాస్త్రం. స్నానం, శౌచం అంటే సదాచారంతో దేహం శుద్ధమవుతుంది. ఉతకడం వలన వస్త్రం, దున్నడం వలన భూమి, చెక్కడం వలన కర్ర, గర్భాదానాది సంస్కారములచేత గర్భం, తపస్సు చేత ఇంద్రియములు, యాగముచేత బ్రాహ్మణుడు, దానంచేత ధనం, సంతోషంచేత మన...

గుర్రానికి కళ్ళెంవేసి గంతలు కట్టినట్లు ఇంద్రియాలను నిగ్రహించుకోవాలి - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏 " పశుపాశ విమోచనీ " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 354 వ నామం. " పశుపాశ విమోచనీ " అంటే ఆజ్ఞానులగు జీవులను బంధములనుండి విడిపించునది అని భాష్యం చెప్పారు. ఇక్కడ బంధాలు అంటే అనవసరపు బంధాలని అర్ధం చేసుకోవాలి. జీవితం ప్రశాంతంగా గడిచిపోవడానికి కొన్ని బంధాలు అవసరమవుతాయి.  ఉదాహరణకు గురుశిష్య బంధాలు, తల్లిదండ్రుల పిల్లల బంధాలు అవసరమే, వదులుకునేవి కావు.  కఠోపనిషత్తు అద్భుతమయిన విషయం తెలియచేసింది: " ఆత్మానం రథినం విద్ధి,    శరీరం రథమేవ తు   బుద్ధిం తు సారథిం విద్ధి    మనః ప్రగ్రహమేవ చ.   ఇన్ద్రియాణి హయానాహు   ర్విషయాంస్తేషు గోచరాన్   ఆత్మేన్ద్రియమనోయుక్తమ్    భోక్తేత్యాహుర్మనీశిణః "                - 1.3.3,4 ఆత్మ రథికుడని తెలుసుకో.  శరీరం రథం, బుద్ధి సారథి, మనస్సు పగ్గాలు, ఇంద్రియాలు గుర్రాలు, ఆ గుర్రాలు విషయాల వైపుకు పరుగులు తీస్తాయి.  ఇటువంటి శరీరేంద్రియ మనస్సులతో కూడిన జీవుడు భోక్త అని పెద్దలు అంటారు. శరీరస్థుడైన ఆత్మ మనోబుద్దుల ద్వారా ఇంద్రి...

పునర్జన్మను ప్రతిపాదించినది మన సనాతనధర్మం - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీరస్తు శుభమస్తు"🙏 " ప్రాప్య పుణ్యకృతాం    లోకానుషిత్వా శాశ్వతిః సమాః,   శుచీనాం శ్రీమతాం గేహే    యోగభ్రష్టో2భిజాయతే "                 - భ.గీత 6:41 " అథవా యోగినామేవ    కులే భవతి ధీమతామ్,   ఏతద్ధి దుర్లభతరం    లోకే జన్మ యదీదృశం "           - భ.గీత 6:42 " విజయవంతం కాని యోగులు, మరణం తరువాత, సద్గురువుల నివాసాలకు వెళతారు. అనేక యుగాలు అక్కడ నివసించిన తరువాత, వారు మళ్లీ భూతలంలో పుణ్యాత్ములు మరియు సంపన్నుల కుటుంబంలో జన్మిస్తారు. లేకుంటే, దీర్ఘకాలంగా యోగాభ్యాసం చేయడం వల్ల వారు వైరాగ్యాన్ని పెంచుకున్నట్లయితే, వారు దైవిక జ్ఞానంతో కూడిన కుటుంబంలో పుడతారు. అటువంటి జన్మ ఈ లోకంలో పొందడం చాలా కష్టం " అని తెలియచేసారు పరమాత్మ. ఇక్కడ పరమాత్మ " సంపన్నుల గృహంలో " అన్నారు. సంపన్నులు అంటే డబ్బున్న వారు అని కాదు. ఆధ్యాత్మికంగా సంపన్నులు. ఎప్పుడూ దైవధ్యానం చేస్తూ, సంప్రదాయాలు పాటిస్తూ సాత్వికంగా జీవించేవారు అని గ్రహించాలి. అప్పుడే ఆ జీవుడు తరించి జన్మరాహిత్యాన్ని పొందడానికి వీలవుతుంది. ...

హనుమజ్జయంతి శుభాకాంక్షలు అందరికీ - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీరస్తు శుభమస్తు"🙏  " అష్టసిద్ధ నవనిధికే దాత    అసవరదీన్హ జానకీమాత " " ఎనిమిది సిద్ధులు, తొమ్మిది నిధులు ఇవ్వగలిగిన శక్తిని సీతమ్మ నీకు వరంగా ఇచ్చినది స్వామి " అని ప్రార్ధిస్తాం హనుమని. అటువంటి అద్భుత వరం ఎందుకు ఇచ్చారో సీతమ్మ చూద్దాం. సీతమ్మ హనుమతో " రాముడు తన సైన్యంతో ఇన్ని యోజనాల సముద్రాన్ని దాటి ఇక్కడకు రావడం, రావణుడిని చంపడం అనే విషయం నాకు నమ్మశక్యంగా లేదు " అంటారు నిస్పృహతో. కొన్ని నెలలుగా పరాయి దేశంలో క్రూరులైన రాక్షసుల మధ్య బందీగా ఉన్న స్త్రీకి ధైర్యం చెప్పడం, నమ్మకం కలిగించడం చిన్న విషయం కాదు. ఒక్క మాటతో హనుమ సీతమ్మను నమ్మించి, ఆవిడ ముఖంలో చిరునవ్వు తెప్పించారు. హనుమ అంటారు సీతమ్మతో: " మద్విశిష్టాశ్చ తుల్యాశ్చ    సంతి తత్ర వనౌకసః   మత్తః ప్రత్యవరః    కశ్చిన్నాస్తి సుగ్రీవ సన్నిధౌ            - (సుందరకాండ) 5:39:38 " నా కంటే గొప్పవారు, మరియు నాకు సమానమైన వారు వేలమంది వానరులు ఉన్నారు సుగ్రీవుని సైన్యంలో " అంటారు హనుమ. నాకన్నా తక్కువ శక్తిమంతులు ఎవరూ లేరక్కడ అని అర్ధం. మరి నేనే రాగలిగానంటే వారందరూ రావడ...

దేవతలకు కూడా మూడు గుణాలూ ఉంటాయి - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏 " గుణనిధిః " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 604 వ నామం. " గుణనిధిః " అంటే గుణముల నిధి, గని. గుణాలు మూడు - సత్వరజోతమస్సులు. అమ్మవారు చల్లనితల్లి. సత్వగుణమే కదా కలిగి ఉండాలి. అన్ని గుణములకు నిధి ఎలా. " అతి సర్వత్ర వర్జయేత్ " అన్నారు. ఏ గుణమయినా ఎక్కువ అయితే సమస్యే. మంచితనం వల్ల కూడా సమస్యల పాలవుతూంటాం అప్పుడప్పుడు. అలాగే రజోతమో గుణాలు కూడా కొంతవరకూ అవసరమే.  రుద్రనమకంలో మొదటిశ్లోకంలో " నీ కోపమునకు నమస్కారము " అని ప్రార్థిస్తాం. ఆయనకు కోపంలేకపోతే మనకు రక్ష ఎలా, మనకు ఎవరయినా హానిచేస్తే ఆయనకు కోపం రాకపోతే ఎలా. పిల్లవాడు చేయకూడని, వాడికే హానిచేసే పని చేస్తూన్నప్పుడు తల్లి ఏయ్ అంటుంది కళ్ళు ఎర్రచేసి. అవసరమయితే వీపుమీద ఒకటి వేస్తుంది. అప్పుడే ఆ పని తప్పు అని పిల్లవాడు తెలుసుకుంటాడు. ముద్దుగా నవ్వుతూ " తప్పమ్మా " అంటే వాడికి తెలియదు. తమోగుణం అంటే అజ్ఞానం. మరుపు. కొన్ని విషయాలలో మరుపు ఒక వరం. మరుపు లేకపోతే జీవితం దుర్భరం. కొన్ని సమయాలలో అజ్ఞానం కూడా సంతోషాన్ని ఇస్తుంది. పిల్లవాడు ఎంత ఆనందంగా ఉంట...

అమ్మవారు భక్తులకు నిధి వంటివారు, ఆన్ని కోరికలు తీరుస్తారు - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏 " భక్తనిధిః " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 567 వ నామం. " భక్తనిధిః " అంటే భక్తుల కోరికలను తీర్చు గని వంటిది అని భాష్యం చెప్పారు. అమ్మవారు భక్తుల కోరికలన్నీ తీరుస్తారు. ఎప్పుడు?. కోరిక ధర్మబద్ధమయినప్పుడు.  కోరిక తప్పు కాదు. సాధారణంగా దేవతలకు సత్వగుణం, మనుషులకు రజోగుణం, జంతువులకు తమోగుణం పాలు అధికంగా ఉంటాయి. మన సౌకర్యాలకోసమో, ఆనందం కోసమో కోరికలు కోరుకుంటూంటాం. దీనిని రజోభక్తి అంటారు. ఎవరయినా తమోగుణం పాలు ఎక్కువయి మరీ వికృతంగా ప్రవర్తిస్తే " మనిషివా పశువ్వా " అంటూంటాం అందుకే.  హిరణ్యకశిపుడిని సంహరించిన తరువాత నరసింహస్వామి ఓ ఎత్తైన సింహాసనంమీద కూర్చుంటారు. గోళ్ళనుంచి రక్తపు బొట్లు కారుతూ చాలా ఉగ్రంగా ఉంటారు. బ్రహ్మ శివుడు ఇంద్రాది దేవతలు చివరకు లక్ష్మీదేవి కూడా స్వామి దగ్గరకు వెళ్ళడానికి సంకోచించి ప్రహ్లాదుడిని పంపిస్తారు.  స్వామి ప్రహ్లాదుడిని రెండు చేతులతో ప్రేమగా పైకి ఎత్తి తన తొడమీద కూర్చోపెట్టుకుని " నీకు ఇష్టమయిన ఓ చక్కని కోరిక కోరుకో " అంటారు. ప్రహ్లాదుడు ఆశ్చర్యపోతాడు " స్వామి కోరిక ...

అమ్మవారి చిన్న అంశ జీవులన్నిటికీ చైతన్యాన్ని ఇస్తారు - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏 " చిత్కలా " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 728 వ నామం. " చిత్కలా " అంటే అఖండ చైతన్యములో అంశ మాత్రమే గలది. ఎక్కడ?. సృష్టిలోని జీవులలో. అంతఃకరణ చైతన్య స్వరూపురాలు. భారతీయ సంగీతంలో నాదోపాసన ఓ ముఖ్యమయిన సాధన. సంగీత కళాకారులకు భక్తులకు ఈ నాదోపాసన చక్కటి ఫలితాలను ఇస్తుంది. నాదోపాసన దశవిధానాలు. నిష్టతో సాధనలో ఉన్నప్పుడు కుండలినీ శక్తి మేల్కొని అనాహత చక్రం చైతన్యమంతమవుతే దశవిధనాదాలు అనుభవానికి వస్తాయి. కుండలినీ శక్తి ఆజ్ఞాచక్రంలో స్థిరపడితే రకరకాల కాంతులు అనుభవానికి వస్తాయి. ఈ కాంతులనే చిత్కళలు అంటారు. అమ్మవారు అలా చైతన్యంని అనుగ్రహిస్తారు సాధకులకు. కళ అంటే శోభ/ప్రకాశం. చైతన్యం ఉంటేనే శరీరానికి శోభ. ఆ చైతన్యమే అమ్మవారు. అమ్మవారి అంశ చిత్కళ. కళిక అంటే శిఖ/మొగ్గ. దీపశిఖ చిన్నదిగానే ఉంటుంది కాని ఇల్లంతా వెలుగు నింపుతుంది. అలాగే అమ్మవారి చిన్న అంశయే శరీరానికంతటకీ ప్రకాశాన్ని ఇస్తుంది. ఇదే విషయాన్ని పరమాత్మ అర్జునుడికి తెలియచేసారు గీతలో: " అథవా బహునైతేన    కిం జ్ఞాతేన తవార్జున ।   విష్టభ్యాహమిదం కృత్స్నమ్    ఏకాంశేన స్థిత...

అమ్మవారు బ్రహ్మానందంని అంటే జన్మరాహిత్యంని అనుగ్రహిస్తారు - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏 " జన్మమృత్యుజరాతప్తజనవిశ్రాంతిదాయినీ " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 851 వ నామం. " జన్మమృత్యుజరాతప్తజనవిశ్రాంతిదాయినీ " అంటే పుట్టుక, చావు, ముసలితనం అనువానిచో తపించబడిన జనులకు పరమసుఖమును ఇచ్చునది అని భాష్యం చెప్పారు. విశ్రాంతి అంటే బాధలు తొలగిన తరువాత వెల్లడయే బ్రహ్మానందస్థితి అని తెలియచేసారు. మృత్యువు అంటే ఏమరుపాటు అని తెలియచేస్తున్నాయి ఉపనిషత్తులు. కొద్ది ఏమరుపాటు వల్ల కలిగే పర్యవసానం మరణం కన్నా బాధగా అనిపిస్తుంది. ఏదీ మన చేతుల్లో లేకున్నా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఆ జాగ్రత్తను అమ్మవారు కలుగచేస్తారు. ఇవన్నీ లేకపోవడం అంటే జన్మరాహిత్యం, ముక్తి పొందడం. అదే కదా జీవుడు కోరుకునేది, కోరుకోవలసినది. పరమాత్మ గీతలో ఇదే విషయాన్ని ఇలా తెలియచేసారు: " గుణానేతానతీత్య త్రీన్     దేహీ దేహసముద్భవాన్,   జన్మమృత్యుజరాదుఃఖైః     విముక్తో2మృతమశ్నుతే '                - భ.గీత 14:20 " దేహోత్పత్తికి కారణరూపములైన ఈ మూడు ( సత్వ రజో తమో) గుణములను అధిగమించిన పురుషుడు జన్మ,మృత్యు జరా(వార్ధక్య),...

రాగద్వేషాలు వదిలేస్తే సంసార బాధలు ఉండవు - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏 " భవారణ్యకుఠారికా " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 114 వ నామం. " భవారణ్యకుఠారికా " అంటే సంసారమనెడి అడవికి గొడ్డలి వంటిది అని భాష్యం చెప్పారు. ఎంత పెద్ద అడవి అయినా ఓ చిన్న గొడ్డలి చాలు మొత్తం నరికేయడానికి. సంసారబంధాలవల్ల కలిగే బాధలు ఎంతటివి అయినా అమ్మవారి పాదాలను ఆశ్రయిస్తే చాలు పటాపంచలవుతాయి. అది అంత సులభమా?. అమ్మవారి పాదాలపై చంచలమయిన మనసు నిలవద్దూ. పరమాత్మ గీతలో దీనికి సులభమయిన మార్గం తెలియచేసారు: " జ్ఞేయః స నిత్యసన్న్యాసీ            యో న ద్వేష్టి న కాంక్షతి,   నిర్ద్వంద్వో హి మహాబాహో     సుఖం బంధాత్ ప్రముచ్యతే"                     - భ.గీత 5:3  " మహాబాహూ, ఎవ్వరినీ ద్వేషింపని, దేనినీ కాంక్షింపని కర్మయోగిని నిత్యసన్న్యాసిగా ఎఱుంగ వలెను. ఏలనన రాగద్వేషాది ద్వంద్వములను అధిగమించినవాడు అవలీలగా సంసారబంధములనుండి ముక్తుడగును " అని. రాగద్వేషాలను అధిగమించమన్నారు పరమాత్మ. రాగం అంటే కోరిక. కోరికలు తప్పు కాదు. అవి ధర్మబద్ధంగా ఉండాలి. ద్వేషం వదిల...

అమ్మవారు భక్తసులభురాలు, శుభాలను ఇస్తారు - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏 " శోభనాసులభాగతిః " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 683 వ నామం.  " శోభనాసులభాగతిః " అంటే వైభవములు కలిగినది, సులభముగా చేరతగినది అని భాష్యం చెప్పారు. మోక్షాది పురుషార్ధాలను పొందడానికి అమ్మవారు భక్తసులభురాలు అని కూడా తెలియచేసారు. అమ్మవారి అనుగ్రహం పొందితే పునర్జన్మ ఉండదు. మూకశంకరులు తన మూకపంచశతిలోని ఆర్యాశతకములో శ్రీకామాక్షి అమ్మవారిని స్తోత్రం చేస్తూ " చిరతరసుచరితసులభా " అంటారు. అంటే అమ్మవారి అనుగ్రహం పొందడం చాలా సులువుట. కాని దానికి బహుకాలం మంచిగా/శ్రద్ధగా అమ్మవారిని సేవించుకోవాలి అని. ఆయన " బహుకాలం " అన్నారు. మనం ప్రతిదినం పూజచేసేటప్పుడు సంకల్పంలో " మమ సమస్త దురితక్షయద్వారా శ్రీ పరమేశ్వరముద్దిస్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్ధం శుభాభ్యాం...." అని ప్రార్థిస్తాం. పరమేశ్వరుడి ఆనందంకోసం, ప్రీతికోసం, మన పాపాలు నశించడంకోసం ఈ పూజ అని. ఈ భక్తిని సాత్వికభక్తి అంటారు. ఇది సాధన చేయగా చేయగా నిర్గుణభక్తిగా మారుతుంది. ఆ స్థితిలో ఏ కోరికలు అంటే పాపాలు నశింపచేయి అనే అభ్యర్ధన కూడా ఉండదు. కేవలం పరమేశ్వరుడి ధ్య...

శ్రీసరస్వతీ దేవి పుట్టినరోజు నేడు,, శుభాకాంక్షలు అందరికీ - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏 శ్రీసరస్వతీదేవి " పుట్టినరోజు నేడు. శ్రీపంచమి/వసంతపంచమి/మాఘపంచమి అని వేడుక చేసుకుంటారు భక్తులు. " సరస్వతీ " - అమ్మవారి అద్భుతనామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాల్లో 704 వ నామం. " సరస్వతీ " అంటే జ్ఞానాధిష్టానదేవత. అంటే అజ్ఞానాంధకారాన్ని పోగొట్టేది. అజ్ఞానం తొలగుతే సచ్చిదానందమే కదా. " విద్యా దదాతి వినయం,    వినయాత్ యాతి పాత్రతాం,    పాత్రత్వాత్ ధనమాప్నోతి,    ధనాత్ ధర్మం తతో సుఖం " అని చెబుతూంది నరసింహ సుభాషితం .  ఏ జీవి అయినా సుఖాన్నే కోరుకుంటాడు, ఆఖరికి మరణంలో కూడా. ఈ సుఖానికి మూలం విద్య అని తెలుసుకోవాలి. విద్యనుంచే వినయం, అర్హత, ధనం, ధర్మం, సుఖం వరుసగా లభిస్తాయి. ఈనాడు మధ్యతరగతివారి జీవితాలు సుఖమయంగా ఉన్నాయంటే విద్యవలనే అని అర్ధం అవుతూంది. ఇక్కడ విద్య నుంచి వినయం అన్నారు. వినయం అంటే అందరూ అనుకునేది కాదు. ఆదిశంకరులు వినయః అంటే ఉపశమః అని భాష్యం చెప్పారు. అంటే శాంతి. మన పూర్వపు విద్య శాంతిని కలిగించేది. జీవితం సుఖంగా ఉండేది. ఇప్పటి విదేశీవాడు పెట్టిన చదువులు " అశాంతి " ని కలిగిస్తున్నాయి. అందుకే యువత నిస్పృహలో ఉండి...

అమ్మవారు లేని వస్తువులలో కూడా ఉంటారు - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏 " భావాభావవివర్జితా " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్య నామాలలో 680 వ నామం. " భావాభావవివర్జితా " అంటే భావరూపములగు ద్రవ్యాదులచేతను, అభావములచేతను విడువబడినది అని భాష్యం చెప్పారు. భావం అంటే ఉండేది, కనబడేది. అభావం అంటే ఉండనిది, కనబడనిది.  ఇంద్రియాలకు గోచరించేవి అన్నీ భావములు.‌ కనబడనివి అభావములు. ఈ రెండు " స్థితులు " అమ్మవారికి లేవు.  ఈ అభావం ఒక అద్భుత విషయం. కనబడేవాటికి స్థితి ఉంది అంటే అర్ధం తెలుస్తూంది. చెట్టు, నీరు, మట్టి, సూర్యుడు మొదలగునవి. కనబడని దానికి స్థితి ఏమిటి?  ఈ అభావాన్ని నాలుగు రూపాలలో తెలియచేసారు భాష్యకారులు: 1. ప్రాగాభావం - ప్రాక్ + అభావం - ఒక వస్తువు తయారుకాక పూర్వం ఆ వస్తువు ఉండని స్థితిని ప్రాగభావం అన్నారు. మట్టిముద్ద ఉంది. దానిని మట్టిముద్ద అంటాం. దానితో కుండని తయారు చేసాం. దానిని కుండ అంటాం. కుండ తయారుకాక పూర్వం కూడా మట్టిముద్దలో కుండ ఉంది. కాని కనబడదు. కుండ ఉండని స్థితి మట్టిముద్ద. 2. ప్రధ్వంసాభావం - ప్రధ్వంస + అభావం - ఒక వస్తువు పూర్తిగా ధ్వంసమయిపోయాక ఆ వస్తువు ఉండని స్థితి. కుండని, బ్రద్దలవుతే ...

కంచి పరమాచార్య శ్రీశ్రీశ్రీ చంద్రశేఖర సరస్వతి జయంతి నేడు - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీరస్తు శుభమస్తు"🙏 ఒకరోజు కంచి పరమాచార్యులవద్దకు ఓ భక్తుడు వచ్చాడు. దైవభక్తి మెండుగా ఉన్నవాడు, పరమాచార్యులంటే భక్తి గౌరవం ఉన్నవాడు. భక్తుడు అన్నాడు " స్వామీ ఎప్పుడు కళ్ళుమూసుకుని అమ్మవారిని తలచుకున్నా ఓ ప్రముఖ ' నటి ' మొహం గుర్తుకొస్తూంది, ఏమి చెయ్యడం " అని. స్వామి అన్నారు " మొహం ఎందుకు గుర్తుచేసుకోవడం, నువ్వు పట్టుకోవలసినవి, కోరుకోవలసినవి అమ్మవారి పాదాలు, అందుకని పాదాలు గుర్తుచేసుకో " అని. అమ్మవారి పాదాలు అగ్నివర్ణంలో ఉంటాయి. పసుపువ్రాసి, పారాణి అలంకరించి ఉంటాయి. కాలికి పట్టీలు , వేళ్ళకు మెట్టెలు. ఇంద్రాది దేవతలు అమ్మవారి పాదాల వద్ద కూర్చుని ఉంటారు. ఆ ఊహే అద్భుతం. శంకరులు శివానందలహరి గానం చేస్తూ ఇలా అంటారు : " సదా మోహాటవ్యాం చరతి    యువతీనాం కుచగిరౌ,    నటత్యాశాశాఖా స్వటతి    ఝడితి స్వైర మఖికః,   కపాలిన్ భిక్షో మే హృదయకపి    మత్యంత చపలం ,    ధృఢం భక్త్వా బద్ధ్వా శివ    భవదధీనం కురు విభో " . " ఓ ఈశ్వరా - నా హృదయం ( మనస్సు ) మోహం అనే అడవిలో తిరుగుతూంది. నా మాట వినడం లేదు. అతి చపలమైన నా మనస్సనే కోతిని దయచేసి నా భ...

అమ్మవారు చూపులతో మోహాన్ని తొలగిస్తారు - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏 " మృగాక్షీ " అమ్మవారి అద్భుత నామం  ఇది శ్రీలలితాసహస్రరహస్య నామాలలో 561 వ నామం. " మృగాక్షీ " అంటే లేడి కన్నుల వంటి కన్నులు కలది అని భాష్యం చెప్పారు. మృగము అంటే లేడి, జంతువు అని కాదు. మృగాక్షి, మృగనయని అని స్త్రీలను అంటూంటారు . లేడి కనులు పెద్దవిగాను, సొగసుగాను, చంచలంగానూ ఉంటాయి. ఎంతో అమాయకంగా, కరుణతో నిండి ఉంటాయి. అమ్మవారి కనులు కరుణతో నిండి ఉంటాయి. 84 లక్షల జీవరాశుల బాగోగులను చూడవలసిన కారణంగా ఇటూ అటూ కదులుతూ కొంచెం చంచలంగా కూడా ఉంటాయి. అందుకే అమ్మవారి కనులను లేడి కనులతో పోలుస్తారు. మూక శంకరులు తన మూకపంచశతి లోని కటాక్షశతకంలో అమ్మవారి కళ్ళను అద్భుతంగా ఇలా వర్ణిస్తారు: " ఆశ్చర్యమంబ మదాన   అభ్యుదయావలంబః కామాక్షి    చంచలనిరీక్షణవిభ్రమస్తే    ధైర్యం విధూయ తనుతే    హృది రాగబంధం శంభోస్తదేవ    విపరీతతయా మునీనామ్ "                                   - 61 " అమ్మవారి చంచలమైన చూపులు మన్మధుని అభివృద్ధికి ఆధారమయిన శివుని హృదయమున ధైర్యమును ...

అన్నమయ్య జయంతి నేడు, శుభాకాంక్షలు - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీరస్తు శుభమస్తు"🙏 అన్నమయ్య జయంతి నేడు. అన్నమయ్య కీర్తన  రాగం నాట, తాళం ఖండవతి ఎవ్వరెవ్వరి వాడో ఈ జీవుడు  ఎవ్వరికి ఏమౌనో ఈ జీవుడు చరణం : ఎందరికి కొడుకుగాడీ జీవుడు  ఎందరికి తోబుట్టడీ జీవుడు ఎందరికి కొడుకుగాడీ జీవుడు వెనక ఎందరికి తోబుట్టడీ జీవుడు ఎందరిని భ్రమియింపడీ జీవుడు దుఃఖ మెందరికి గావింపడీ జీవుడు …..ఎవ్వరెవ్వరి వాడో ఈ జీవుడు  ఎవ్వరికి ఏమౌనో ఈ జీవుడు….. " కీర్తన అచ్చతెలుగులో ఉండి బాగా అర్ధమవుతుంది. ఎంతటి ఉపనిషత్తుల సారాంశం, వేదాంతం నిండి ఉందో ఈ కీర్తనలో. భాగవతంలో జీవుడి గురించిన ఓ అద్భుత కధ ఉంది.  వృత్రాసురసంహారం - ఇంద్రుడు వృత్రాసురుడిని సంహరించడానికి వజ్రాయుధం సంపాదించడం, ఆ వజ్రాయుధంతో వృత్రాసురుడిని సంహరించడం అందరికీ తెలిసినదే.  వృత్రాసురుడు తన గత రెండవ జన్మలో చిత్రకేతువు అనే మహారాజు. ఈయనకు ఎందరో రాణులు కాని పిల్లలు లేరు. అంగీరమహర్షిని ఆశ్రయించాడు ఏదయినా మార్గం తెలియచేయమని. ఆయన ఓ యాగం చేయించడం, ఓ చక్కటి పిల్లాడు పుట్టడం జరిగింది. లేక లేక వారసుడు పుట్టడంతో రాజు మహదానందపడి పోయాడు. పిల్లాడి తోడిదే లోకం అయిపోయింది రాజుకు. మిగతా రాణులు, బంధువుల...

మాతృదినోత్సవం నేడు, శుభాకాంక్షలు - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీరస్తు శుభమస్తు"🙏 నేడు " మాతృదినోత్సవం " గా జరుపుకుంటారు అందరూ. భారతీయులకు ప్రతీరోజూ మాతృదినోత్సవమే. తైత్తిరీయోపనిషత్తు ( 1:11:2 ) మొదట " మాతృదేవోభవ " అని ప్రార్థించమంది. మన వేదాలని ( 20500 మంత్రాలు ), ఉపనిషత్తులని, పురాణాలని, శాస్త్రాలని, రామాయణం ( 24000 శ్లోకాలు ), మహాభారతం ( 100700 శ్లోకాలు ), శృతులు, స్మృతులు ముఖ్యంగా మనుస్మృతిని రకరకాల కట్టుకధలు చెప్పి చెప్పి భ్రష్టుపట్టించేసారు.  వేదవిజ్ఞానం ఎంత ఉత్కృష్టమయినది. ఎన్నిరకాల శాఖలు ఎన్ని ఋక్కులు ఎన్ని సూక్తాలు. ఒక వేదంలోని ఒకశాఖని పూర్తిగా చదివి అర్ధం చేసుకోవడానికి దశాబ్దాలు పడుతుంది. అ ఆ లు రానివాడు కూడా వేదాలు గురించి మాట్లాడడమే. మాక్స్ ముల్లర్ (1823–1900) అనే జర్మనీ పండితులు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో సంస్కృత ప్రొఫెసర్ గా ఉండేవారు. ఆయనకు భారతదేశం మీద అపారమైన గౌరవం. వేదాలూ , ఎన్నో ఉపనిషత్తులూ చదివి , వాటిని ఇంగ్లీషులోకి అనువదించారు. 50 మహాగ్రంథాలు రచించారు. ఆయన విద్వత్తుకు ముచ్చటపడి జీవితాంతం ఆ యూనివర్సిటీలో పనిచేసే అవకాశం ఇచ్చింది బ్రిటిష్ ప్రభుత్వం. మన ఆంధ్రదేశం నుండి ఇంగ్లాండ్ వెళ్లిన మన వేదపండ...

శ్రీనృసింహస్వామి జయంతి నేడు, శుభాకాంక్షలు - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీరస్తు శుభమస్తు"🙏 శ్రీనృసింహస్వామి జయంతి నేడు. హిరణ్యకశిపుడిని సంహరించిన తరువాత నృసింహస్వామి ఓ ఎత్తైన సింహాసనంమీద కూర్చుంటారు. గోళ్ళనుంచి రక్తపు బొట్లు కారుతూ చాలా ఉగ్రంగా ఉంటారు. బ్రహ్మ శివుడు ఇంద్రాది దేవతలు చివరకు లక్ష్మీదేవి కూడా స్వామి దగ్గరకు వెళ్ళడానికి సంకోచించి ప్రహ్లాదుడిని పంపిస్తారు.  స్వామి ప్రహ్లాదుడిని రెండు చేతులతో ప్రేమగా పైకి ఎత్తి తన తొడమీద కూర్చోపెట్టుకుని బ్రహ్మాది దేవతలు భయపడుతున్నారు నా దగ్గరకు రావడానికి, నీకు భయంగా లేదా అని అడుగుతారు. స్వామి " మీరు నా రక్షకులు, నన్ను తరింపచేయడానికి వచ్చారు. నాకు భయమెందుకు కలుగుతుంది " అంటాడు ప్రహ్లాదుడు. " నీకు ఇష్టమయిన ఓ చక్కని కోరిక కోరుకో " అంటారు స్వామి. ప్రహ్లాదుడు ఆశ్చర్యపోతాడు " స్వామి కోరిక కోరుకోమన్నారేమిటి. నాలో ఇంకా తీరని కోరిక ఏమయినా మిగిలిపోయిందా " అని.  " మా మాం ప్రలోభయా - నన్ను ప్రలోభపెట్టకు స్వామి " అన్నాడు ప్రహ్లాదుడు. కోరిక అంటే శరీరమమకారం కలుగుతుంది. ఊబిలోకి లాగేస్తుంది. ఓ కోరిక అంటూ మొదలవుతే అది అక్కడితో ఆగదు కదా.  స్వామి అంటారు " అందరి కోరికలు తీ...

అమ్మవారు అవసరమయితే చాలా కఠినంగా కూడా ఉంటారు - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏 " వైఖరీరూపా " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 371 వ నామం .  " వైఖరీరూపా " అంటే మిక్కిలి కఠినమైన రూపము గలది. అమ్మవారి హృదయం, మాట, చూపు అన్నీ కరుణతో నిండి ఉంటాయి సాధారణంగా. అవసరమయితే చాలా కఠినంగా కూడా ఉంటారు. ప్రతీ తల్లికీ బిడ్డలంటే అమిత ప్రేమ. అలా అని పిల్లవాడు తప్పు చేస్తూన్నా, పాడయి పోతూన్నా మెత్తగా ఉండదు. కోపగిస్తుంది, అవసరమయితే వీపుమీద నాలుగు తగిలిస్తుంది. లేకపోతే భవిష్యత్తులో ఆ పిల్లవాడు కుటుంబానికి, సమాజానికి శాపమవుతాడు. జడ భరతుడు కఠినసాధనతో ముక్తికి చేరువయి కూడా జింక పిల్ల బంధంలో కూరుకుపోయి తదుపరి జన్మలో జింకపిల్లగా పుట్టాడు. తరువాత జన్మలో ఓ సాంప్రదాయ కుటుంబంలో పుట్టినా దేనిని పట్టించుకోకుండా అవధూతలా ఉండేవాడు. మహాజ్ఞాని. ముక్తికోసం ఎదురు చూస్తూ జీవితం గడుపుతున్నాడు. ఓ రోజు పొలంగట్టుమీద కూర్చుని ఉండగా కొందరు ఆటవికులు అమ్మవారికి బలి ఇవ్వడానికి తీసుకుని పోతారు. ఇతను ఏమీ పట్టించుకోనే లేదు.  ఇటువంటి అవధూత, మహాజ్ఞానిని బలి ఇస్తూంటే అమ్మవారు సంతోషిస్తారా. బలి ఇచ్చే సమయంలో ప్రత్యక్షమై అక్కడ ఉన్న అందరినీ నరికేసారు. జడ...

దేశంకోసం ప్రాణాలు అర్పించేవారు రుద్రాంశ సంభూతులు - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీరస్తు శుభమస్తు"🙏  భారత్ శాంతిని, సౌఖ్యాన్ని, అందరి క్షేమాన్ని కోరుకునే దేశం. అలా అని ప్రస్తుతం మాత్రం " ఓ చెంప మీద కొడితే ఇంకో చెంప చూపించు " లాంటి చచ్చు సలహాలు ఇవ్వదు. ఇంతకాలం ఒకవేపే చూసింది ప్రపంచం, ఇకపై రెండో వైపు చూస్తుంది. పాకిస్తాన్ వి కోతి చేష్టలు. ఇంతకాలం సాగాయి దాని ఆటలు. ఇప్పుడు కల్లు తాగింది, ముల్లు గుచ్చుకున్నట్లుంది. రెచ్చి పోతూంది.  " పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇంటి సమీపంలో భారీ పేలుడు. అజ్ఞాతంలోకి ప్రధానమంత్రి. బంకరులో దాక్కొన్నట్లు వార్తలు " అనే వార్త అబ్బుర పరచలేదు. అక్కడి ప్రజలే తిరగబడుతారు వారిమీద 4 రోజులు పోతే. రెండూ అణ్వాయుధ దేశాలు అంటూ సన్నాయి నొక్కులు కొందరు. భారత్ కి అణ్వాయుధం వేసే ఆలోచనా ఉండదు, అవసరమూ లేదు. పాకిస్తాన్ అణ్వాయుధం వేస్తే ఏమవుతుంది. 5/10 శాతం భారత్ దెబ్బ తింటుంది. అప్పుడు మనం చూస్తూ ఊరుకోముగా, మనమూ వేస్తాం. అప్పుడు పాకిస్థాన్ ప్రపంచ పటంలో ఉంటుందా.  గరికిపాటి వారు తరచూ అంటూంటారు " ధైర్యం అంటూ ప్రత్యేకంగా ఏమీ ఉండదు. ఒకడి పిరికితనమే ఇంకొకడి ధైర్యం " అని. ఇంతకాలం ఇలాగే దేశం లోపల బయట కొందరు కుప్పిగంతులు వేసా...

అతి మంచితనం చేతకాని తనంలా అనిపిస్తుంది, మంచిది కాదు - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీరస్తు శుభమస్తు"🙏 " అహింసా పరమో  ధర్మః ,    ధర్మ హింసా తథైవచ " అహింసే అత్యుత్తమమయిన ధర్మం అయినా ధర్మాన్ని నిలపడంకోసం చేసే హింస కూడా అహింసే అని చెబుతున్నారు. ఇది వేదాల్లోనూ, ఇతరాల్లోనూ లేకపోయినా పరమాత్మ స్వయంగా చెప్పారు కదా: " పరిత్రాణాయ సాధూనాం,     వినాశాయచ దుష్కృతాం "  సరిహద్దుల్లో సైనికులు చేసేది హింస అనరాదు. చరిత్రలో జరిగిన ఓ అద్భుత సంఘటన చూద్దాం. 733 వ సం.లోనే మహమ్మదీయులు దండయాత్రకు వచ్చి కనౌజ్ రాజ్యాన్ని ముట్టడించారు. చీకటి పడడంతో రాజ్యం బయట విశ్రాంతి తీసుకుంటున్నారు. తెల్లవారగానే రాజ్యం మీద పడదామని. వారి అభిప్రాయం ఏమిటంటే హిందూరాజులు " అహింసా పరమో ధర్మః " ని అనుసరిస్తారు కనుక ధర్మయుద్ధమే చేస్తారు, రాత్రి దాడిచెయ్యరు అని. ఎంత నమ్మకం.  అందుకని హాయిగా తిని నిద్రపోయారు. కనౌజ్ రాజు నాగభట(1), సేనాని తక్షకుడు. శత్రువుల సైన్యం అధికంగానే ఉంది అని చారులు తెచ్చిన వార్త కలవరపాటును కలిగించింది. ఓటమి ఖాయం, ఏమి చెయ్యాలి. సేనాని తక్షకుడు రాత్రి ఒంటిగంటకు సైన్యంతో చప్పుడుకాకుండా వెళ్ళి పడుకున్న శత్రువుల తలలు నరకడం మొదలెట్టారు. అలజడికి లేచి పారి...

అమ్మవారి రూపం ఊహింపశక్యమా? - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏 " అచింత్యరూపా " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 554 వ నామం. " అచింత్యరూపా " అంటే ఊహింపశక్యము కాని రూపము గలది అని భాష్యం చెప్పారు. తైత్తిరీయోపనిషత్తు ఇలా తెలియచేస్తూంది: "యతో వా ఇమాని భూతాని   జాయంతే యేన జాతాని  జీవంతి,   యత్ప్రయంతి అభిసంవిశంతి,   తద్విజిజ్ఞాసస్వ తద్బ్రహ్మేతి"              - తైత్తిరీయోపనిషత్తు  " దేని నుంచి ఈ భూతకోటి పుడుతున్నదో, దేనివలన పుట్టిన భూతకోటి జీవిస్తున్నదో అంత్యమున దేనిలో లీనమవుతున్నదో దానిని తెలుసుకొనుటకు ప్రయత్నించు. అది బ్రహ్మ అని " అని. మన ఆత్మలు అంటే జీవుల ఆత్మలన్నీ అమ్మవారి అంశలే.  కఠోపనిషత్తు ఆత్మని ఇలా వర్ణించింది:  " అణోరణీయాన్మహతో     మహీయాన్ " - 1.2.20 " చాలా చిన్న దాని కంటే చిన్నది, చాలా పెద్ద దాని కంటే పెద్దది " అని. ఆత్మ సర్వవ్యాపకమైన తత్త్వం అని దీని అర్థం.  అంటే శరీరమంతా వ్యాపించి ఉండి అన్ని ఇంద్రియములచేత పని చేయిస్తూంది. మన ఆత్మస్వరూపాన్నే ఎవరూ ఊహించలేకపోతున్నారంటే అమ్మవారి రూపం ఊహకెలా అందుతుంద...

అమ్మవారికి రాగద్వేషాలు ఎందుకుంటాయి - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏 " దోషవర్జితా " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 195 వ నామం . " దోషవర్జితా " అంటే రాగద్వేషాది దోషములు లేనిది అని భాష్యం చెప్పారు. రాగం అంటే మమకారం. రాగం, ద్వేషం దోషాలు. ఇవి అమ్మవారికి ఎందుకుంటాయి. అమ్మవారు " పద్మపత్రమివాంభసా " - తామరాకు మీద నీటిబొట్టులా ఉంటారు. జీవులమీద అమ్మవారికి మమకారమూ ఉండదు, ద్వేషమూ ఉండదు. వారి వారి కర్మలకు అనుగుణంగా ఫలితాలను ఇస్తూ ఉంటారు. పరమాత్మ గీతలో ఇలా తెలియచేసారు: " ఇంద్రియస్యేంద్రియస్యార్ధే       రాగద్వేషౌ వ్యవస్థితౌ,    తయోర్న వశమాగచ్ఛేత్         తౌ హ్యస్య పరిపంధినౌ "              - భ.గీత 3:34 " ప్రతి ఇంద్రియార్ధము నందును ( ప్రతి ఇంద్రియ విషయమునందును ) రాగద్వేషములుదాగియున్నవి. మనుష్యుడు ఈ రెండింటికిని వశము కాకూడదు.  ఏలనన ఈ రెండే మానవుని శ్రేయస్సునకు విఘ్నకారకములు. మహాశత్రువులు " అని.  ఇక్కడ ఇంద్రియార్ధము అంటే ఫలితం అని.  కుంతీదేవి మహాపతివ్రత. రాగద్వేషాలను రెండింటినీ వదిలేసింది. కృష్ణుడు కుంతీదేవిని " అత్తా ఇంతవ...

తరించడానికి ఉపయోగపడే కర్మలనే చేస్తూండాలి - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏 " ఆత్మవిద్యా " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 583 వ నామం. " ఆత్మవిద్యా " అంటే ఆత్మవిద్యా స్వరూపురాలు అని భాష్యం చెప్పారు. విద్యా అంటే జ్ఞానం, మంత్రం అని కూడా అర్ధం. అందుకే అమ్మవారు ఆత్మవిద్యా స్వరూపిణి. గరుడపురాణం కర్మ విద్యల గురించి వివరిస్తూ ఇలా తెలియచేసింది: " తత్కర్మ యన్న బంధాయ    సా విద్యా యా విముక్తయే "                - గరుడపురాణం  " ఏ కర్మ బంధవిముక్తుడిని చేస్తుందో అది అసలు కర్మ. ఏ విద్య ముక్తిని ఇస్తుందో అది అసలు విద్య " అని. ముక్తిని అంటే జన్మరాహిత్యంని పొందాలంటే మన ఆత్మ గురించి తెలుసుకోవాలి.  పాముని చంపాలంటే పాముని కొట్టాలి అంతేకాని పుట్టను కొడితే ప్రయోజనం ఏముంటుంది అంటుంది గరుడపురాణం. ఇక్కడ పాము ఆత్మ, పుట్ట శరీరం. ఉపవాసాలు అవీచేసి శరీరాన్ని బాధపెట్టడం ఎందుకు, ఆత్మ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం మొదలు పెట్టాలి కాని అని భావం. కఠోపనిషత్తు అంతా ఆత్మ గురించిన జ్ఞానమే. ఆత్మ స్వరూపం, కర్మలు, శక్తులు గురించి విస్తారంగా ప్రస్తుతించింది ఈ ఉపనిషత్తు. మరి ఆత్మ గురించి తెలుసుకోవడం...

తాత్కాలిక సుఖాలవెంట పడకూడదు - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏 " బ్రహ్మానందా " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 676 వ నామం .  " బ్రహ్మానందా " అంటే బ్రహ్మానందస్వరూపిణి అని భాష్యం చెప్పారు. ఈ స్థితికి మించిన ఆనందం లేదు. కఠోపనిషత్తు మనిషికి రెండు జీవనమార్గాలు ఉంటాయని తెలియచేసింది: " శ్రేయస్చ ప్రేయస్చ మనుష్యమేతః   తౌ సంపరీత్య వివినక్తి ధీరః " - 1.2.2 " జీవనయానంలో మానవుని ముందు రెండు మార్గాలున్నాయి.  మొదటిది శ్రేయోమార్గం - ఇది జ్ఞాన సముపార్జన ద్వారా శ్రేయస్సు వైపుకు నడిపించి శాశ్వతానందాన్ని, పరిపూర్ణతను చేకూరుస్తుంది.  రెండవది ప్రేయో మార్గం - ఇది ప్రియం కలుగజేసేది.  కర్మానుష్టానం ద్వారా కొంత అభ్యుదయం కలిగించినా అది అశాశ్వతము, దుఃఖ హేతువు అవుతుంది " అని. కంచి, శృంగేరి పీఠాధిపతుల వంటివారు ముక్తిని, శాశ్వతానందాన్ని కోరుకుంటారు కనుక జ్ఞానసముపార్జనతో శ్రేయోమార్గంని అనుసరిస్తారు. సామాన్యులమయిన మనం తాత్కాలిక సుఖాలవెంట పడతాం. అంటే ప్రేయోమార్గంని అనుసరిస్తున్నాం. నైతిక విలువలను పాటిస్తూ, శ్రేయోమార్గంలో పయనిస్తూ ఉంటే ఇంద్రియ నిగ్రహం సాధ్యమవుతుంది.  అప్పుడు ఇంద్రియాలను బాహ్...

త్యాగయ్య జయంతి ( 04/05/1767 ) నేడు. శుభాకాంక్షలు అందరికీ - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీరస్తు శుభమస్తు"🙏 త్యాగరాజ కృతి   - రాగం:కళ్యాణి, తాళం:ఆది  పల్లవి: శివే పాహి మాం అంబికే శ్రిత ఫల దాయకి అనుపల్లవి: కావేరిజోత్తర తీరవాసిని కాత్యాయని ధర్మసంవర్ధని (శివే) చరణములు: 1.స్వభావమౌ నీ ప్రభావము    మహానుభావురాలైన     భారతికి పొగడ    భారమైయుండ      భావజారాతి భామ       నేనెంత? భాగ్య దాయకి        ‌                (శివే) 2.కలార్థమిది శశి కలాధరి      యుప- వలారి మాయా      విలాసిని సకలాగమనుతే   ‌   బలారియన శుభ    ఫలాలొసగు పరమ       లాలనమ్మున (శివే) 3.చరాచర మయి      కరారవిందమున    రామ చిలుకను బిరాన       బూని పరాకు జూడరాదు     శ్రీరఘు-వరాప్తుడగు      త్యాగరాజ వినుతే (శివే) త్యాగయ్య అమ్మవారిని స్తుతిస్తూ చేసిన కీర్తన ఇది. మొదటి చరణంలో " నిన్ను పొగడడం భార...

నడక కూడా సత్ప్రవర్తనను తెలియచేస్తుంది - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏 " మరాళీమందగమనా " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 47 వ నామం. " మరాళీమందగమనా " అంటే ఆడుహంసవలె నెమ్మదిగా నడుచును అని. హడావిడిగా తొట్రుపడుతూ నడిచేది ఎవరు?. ప్రమాదంలోనో, సమస్యలోనో చిక్కుకున్నవారు, పని తనవల్ల అవుతుందో లేదో అని సందేహంతో సతమతమయేవారు అలా హడావిడిగా నడుస్తూంటారు. అమ్మవారికి అటువంటి పరిస్థితి ఎందుకు వస్తుంది.‌ అమ్మవారికి చేతకాని పనీ ఉండదు, సమస్యా ఉండదు. అందుకే అమ్మవారు ప్రశాంతంగా నెమ్మదిగా నడుస్తారు. అమ్మవారి రూపం, మాటలు, చూపులు, నడక అన్నీ కోమలమే. సందేహం ఏముంది. ఆదిశంకరులు సౌందర్యలహరి గానం చేస్తూ అమ్మవారిని ఇలా ప్రార్థిస్తారు: " పదన్యాసక్రీడాపరిచయమి వారబ్ధు    మనసః స్ఖలంత స్తే ఖేలం    భవనకలహంసా న జహతి,    అత స్తేషాం శిక్షాం సుభగమణి   మంజీర రణితచ్ఛలా దాచక్షాణం    చరణకమలం చారుచరితే "                                       - 91  " అమ్మా! నీ వనములో నున్న హంసలు నిన్ను చూసి నీలాగ నడవాలని ప్రయత్న...

శ్రీ ఆదిశంకరాచార్యుల జయంతి నేడు, శుభాకాంక్షలు - చీమలపాటి సూర్యనారాయణ

 🙏" శ్రీరస్తు శుభమస్తు"🙏 ఈ రోజు జగద్గురువులు శ్రీశంకరాచార్యుల జయంతి.  శంకరులు సనాతనధర్మ పరిరక్షకులే కాదు, హిందూజాతి రక్షకులు. గొప్ప దార్శనికులు. ఆయన సమయంలో కర్మకాండ ఉచ్ఛస్థితిలో ఉంది. కర్మకాండ శ్రద్ధగా చేయవలసినది, శ్రమతోనూ ఖర్చుతోనూ కూడుకున్నది. యజ్ఞాలు యాగాలు క్రతువులు చేసేవారే కాదు, చేయించేవారు కూడా ఉపవాసాలు, మడి వంటి కఠిన నియమాలు పాటించాలి. లేకపోతే లాభం కన్నా నష్టం ఎక్కువ జరుగుతుంది.  కర్మకాండ రోగానికి చికిత్స లాంటిది. మధుమేహం రోగికి కొన్ని నియమాలు ఉంటాయి. మాత్ర వేసుకున్న పదిహేను నిమిషాల లోపున భోజనం చేయమని చెబుతారు వైద్యులు. మాత్ర వేసుకుని పనిలో పడో, మర్చిపోయో గంట దాకా భోజనం చేయకపోతే అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోతాడు. నియమపాలన తప్పనిసరి. జ్ఞానకాండ అటువంటిది కాదు. విష్ణుసహస్రనామాలో, అష్టకాలో, శ్లోకాలో చదవడానికి, ఏదయినా నామజపం చేసుకోవడానికి అయితే కాళ్ళు చేతులు కడుగుకోవడం, శుభ్రమయిన బట్ట కట్టుకోవడం చేస్తే చాలు. శ్రద్ధ కొంచెం తక్కువ అయినా లాభం ఉండదేమో కాని నష్టం ఉండదు. అందుకని జ్ఞానకాండ గొప్పది అని సమాజానికి తెలియచేయడానికి ఆరోగ్యాన్ని కూడా లెక్కచేయకుండా దేశమంతా కాలినడకన త...