అమ్మవారి అనుగ్రహం పొందడానికి ఇంద్రియనిగ్రహం ముఖ్యం - చీమలపాటి సూర్యనారాయణ
🙏" శ్రీమాత్రేనమః"🙏 " దురారాధ్యా " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 771వ నామం. " దురారాధ్యా " అంటే ఇంద్రియనిగ్రహములేని చపలులచే ఆరాధింపశక్యము కానిది అని అర్థం. ఇంద్రియాలను నిగ్రహించుకున్నవారే అమ్మవారిని ఆరాధించడానికి ఎంతో సాధనచేయాలి. ఆ సాధనకు వైరాగ్యం కూడా తోడవాలి. మరి చపలులకు అమ్మవారి ఆరాధన ఎలా సాధ్యపడుతుంది. ఆదిశంకరులు సౌందర్యలహరి స్తోత్రం చేస్తూ ఓ అద్భుత శ్లోకం చేసారు: " పురారాతేరన్తః పురమసి తాత స్త్వచ్చరణయో స్సపర్యామర్యాదా తరళకరణానా మసులభా తథా హ్యేతే నీతాశ్శత మఖముఖాస్సిద్ధి మతులాం తవ ద్వారోపాన్తస్ధితిభి రణిమాద్యాభిరమరాః " దీనిలో " తరళకరణానాం అసులభా " అన్నారు. తరళ అంటే చపలం, కరళానాం అంటే ఇంద్రియాలు. చపలమైన ఇంద్రియాలు ఉన్నవారికి అమ్మవారు అసులభం, దొరకడం కష్టం అన్నారు. ఎందుకంటే ఇంద్రాది దేవతలు కూడా అమ్మవారి వాకిలి యందున్న అణిమాదైశ్వర్యాలచే అధికంగా సుఖం పొందుతున్నారుట. ఇంద్రాది దేవతలు లాంటి పుణ్యపురుషులే తాత్కాలికమయిన ఐశ్వర్యాల వెంట పడుతూంటే సామాన్యమానవుల పరిస్థితి ఏమిటి అని ఆలో...