Posts

Showing posts from July, 2025

అమ్మవారికి అమ్మవారే సాటి - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏 " నిస్తులా " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 184 వ నామం . " నిస్తులా " అంటే సాటిలేనిది, ఉపమానము లేనిది అని అర్థం. లోపరహితమయిన ఈ సృష్టిచక్రాన్నంతా ఒంటి చేతితో నడిపిస్తున్నారు అమ్మవారు. అమ్మవారికి సాటి ఎవరయినా ఉన్నారా అనే ఆలోచనే సరికాదు. అమ్మవారు ఏర్పాటుచేసిన భూమి నీరు గాలి లోహాలు తప్ప వేల సంవత్సరాలు అయినా క్రొత్తదేమీ కనిపెట్టలేకపోతున్నారు. వేదంలో " న తస్య ప్రతిమా అస్తి ( యజుర్వేదం 32:3 )" అని ఉంది. ప్రతిమ అంటే విగ్రహం అనుకుని వేదాలలోనే దేముడికి విగ్రహం లేదు అని ఉంది, విగ్రహారాధన ఏమిటి అని కొందరు వితండవాదం చేస్తున్నారు. ఇక్కడ ప్రతిమ అంటే విగ్రహం అని కాదు, సాటి - ఉపమానం లేదు అని. అర్జునుడు పరమాత్మ విశ్వరూపం చూసి ఇలా ప్రార్థిస్తాడు: " పితాసి లోకస్య చరాచరస్య   త్వమస్య పూజ్యశ్చ      గురుర్గరీయాన్,   న త్వత్సమోఽస్త్యభ్యధికః      కుతోఽన్యోలోకత్రయేఽప్య      ప్రతిమప్రభావ "             - భ.గీత 11:43 " నీవే సమస్త విశ్వమునకు, చరాచర ప్రాణులన్నిటికీ తండ్రివి. నీవే సర్వశ్ర...

నచ్చని వారిని విస్మరించడమే మంచిది - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏 " మైత్ర్యాది వాసనాలభ్య " - అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్య నామాలలో 570 వ నామం.  ఇక్కడ " మైత్రి " మొదలగునవి అంటే " మైత్రి, ముదిత, కరుణ, ఉపేక్ష " అని భాష్యం చెప్పారు భాస్కరరాయలు.  ఒక మనిషికి ఇంకో మనిషికి ఉన్న సంబంధాలు/తేడాలు 4 రకాలుగా ఉంటాయని చెబుతున్నాయి మన శాస్త్రాలు. ఒక మనిషి ఉన్నాడు అనుకుందాం. ఇంకో మనిషి ఇతనికన్నా ఎక్కువవాడు, తక్కువవాడు అవచ్చు, సమానుడు అవచ్చు, అతనికి ఇతనిమీద లేక ఇతనికి అతనిమీద శతృత్వభావం ఉండవచ్చు. ఇంతకన్నా వేరేలా ఉండే అవకాశమే లేదు. " అశాంతస్య కుతః సుఖం ( భ.గీత 2:66 )" - ఎప్పుడూ అశాంతితో ఉండే వానికి సుఖం ఎక్కడిది - అన్నారు పరమాత్మ. ఎవరికైనా కావలసినది సుఖమయ జీవితం. ఆఖరికి మరణంలో కూడా సుఖమరణాన్నే కోరుకుంటాడు. మరి శాంతిని పెంచుకుని సుఖం ని పొందాలంటే ఏమి చెయ్యాలో స్పష్ఠంగా చెప్పాయి శాస్త్రాలు.  అవి - 1. నీతో సమానమయిన వారితో స్నేహాన్ని ( మైత్రి ) పంచుకో. 2. నీకన్నా ఎక్కువవారిని చూసి సంతోషించు ( ముదిత ). 3. నీకన్నా తక్కువవారిపై జాలి ( కరుణ ) కలిగి ఉండు. 4. నీకు నచ్చని వారిని, నువ్వంటే ఇష్టం...

విగ్రహం భక్తులకు ఆలంబన - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏 " లీలావిగ్రహధారిణీ " అమ్మవారి అద్భుతనామం. ఇది శ్రీలలితాసహస్రరహస్య నామాల్లో 865 వ నామం. " లీలా " అంటే అనాయాసంగా అని అర్ధం. భక్తులని అనుగ్రహించడానికి, తరింపచేయడానికి అమ్మవారు ఓ రూపాన్ని తీసుకుని " ఆలంబన " కలిగిస్తారు. ఇందరు దేవుళ్ళు అవసరమా, విగ్రహారాధనకి అర్ధం ఉందా అని కొందరు కుహనా మేధావులు అంటూంటారు/అనుకుంటూంటారు. ఈ విషయం గురించి మాట్లాడుతూ పూజ్యులు సామవేదం వారు ఒక చక్కటి విషయం తెలియచేసారు. దీనిని " డేవిడ్ ఫ్రాలే " గారి అభిప్రాయంగా చెప్పారు. " మంచు " అంటే ఏమిటి అని ఎవరినైనా ( మనల్ని అయినా ) అడిగితే వెంటనే చెప్పేది " తెల్లగా చల్లగా ఉంటుంది, వేడితగిలితే కరిగి నీరవుతుంది " అని. ఇదే విషయాన్ని ధృవప్రాంతాల్లో ఉండే " ఎస్కిమోలని " అడిగితే వారు " ఏ మంచు " గురించి అడుగుతున్నారు అంటారు. ఎందుకంటే మంచులో 48 రకాలు ఉన్నాయి కనుక. మంచులోనే జీవిస్తూ దానితో మమేకం అవడంవల్ల, మంచుతో ఉన్న సాన్నిహిత్యం వలన వారికి తేడాలు తెలుస్తాయి. అలాగే మన ఋషులు వారి జ్ఞానంతో, ధ్యానంతో, సన్నిహితత్వంతో ఎందరో దేవీదేవతల...

అమ్మవారికి కీర్తనలంటే ఇష్టం - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏 " సామగానప్రియా " - అమ్మవారి అద్భుతనామం. ఇది శ్రీలలితాసహస్రరహస్య నామాలలో 909 వ నామం. " సామ " అంటే మనస్సుకు శాంతి. కీర్తనలు/పాటలు మనస్సుకు శాంతి కలిగిస్తాయి. అమ్మవారు కీర్తనలను, వాటిని గానం చేసేవారిని ఇష్టపడుతుంది. గౌరీఅష్టోత్తరశతనామావళిలో రెండు నామాలు అద్భుతంగా అనిపిస్తాయి. అవి " గద్యపాద్యాదికారణాయైనమః, పదవాక్యార్ధనిలయాయైనమః " అన్నవి. గద్యం పద్యం లకు కారణం అమ్మవారు. పదం, వాక్యం అర్ధాలలో కొలువై ఉంటుంది అమ్మవారు. అందుకే వాటి సాహిత్యం అంత అద్భుతంగా ఉంటుంది. మరి సినీమాపాటల, లలితగీతాల సాహిత్యమే అద్భుతంగా అనిపిస్తే అమ్మవారిని కీర్తిస్తూ చేసే కీర్తనలలోని సాహిత్యం ఎంత అద్భుతంగా ఉంటుంది. ముత్తుస్వామిదీక్షితులుగారు అమ్మవారి ఉపాసకులు. అమ్మవారి రూపం, స్వభావం పూర్తిగా తెలిసినవారు. వాటిని దృష్టిలో పెట్టుకుని సాహిత్యం, దానికితగ్గ రాగంలో అద్భుతమయిన కీర్తనలు చేసారు. అందరూ ఎంతో తరచుగా వినే " వాతాపి గణపతిం భజే " కీర్తన దీక్షితార్ విరచితమే. ఆయన చేసిన నవగ్రహకీర్తనలు, గణేశస్తుతులు, కామాక్షీ మీనాక్షీ అమ్మవార్ల కీర్తనలు అన్నీ అద్భుతమే అయినా...
 🙏"శ్రీమాత్రేనమః"🙏 " నాదరూపిణీ " - అమ్మవారి అద్భుతనామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 901 వ నామం.  " నాదరూపిణీ " అంటే కేవలనాదస్వరూపురాలు. అమ్మవారు నాదరూపంలో అందరిలోనూ ఉంటారు. శబ్దానికి పూర్వస్థితి నాదం. నాదం శబ్దరూపంలో బయటకు వస్తే పాట, స్తోత్రం, మంత్రం అవుతుంది.  అమ్మవారి రూపమయిన నాదసాధనతో దీక్షితార్, శ్యామశాస్త్రి, త్యాగయ్య, అన్నమయ్య వంటివారు తరించారు, చిరస్మరణీయులయారు. కీర్తనం ఎక్కడ ఉంటే అక్కడ అమ్మవారు ఉండి విని ఆనందిస్తూ ఉంటారు. శిశువు ఎంత బాధలో ఉన్నా అమ్మ మాట, పాట వినబడగానే ఠక్కున ఆపేస్తాడు ఏడుపుని. అమ్మ జోలపాటకు చక్కగా నిద్రపోతాడు. అంత మహత్తు నాదానికి. " శంకరా! నాదశరీరా      పరా వేదవిహారా హరా    జీవేశ్వరా ప్రాణము నీవని,    గానమె నీదని, ప్రాణమె     గానమని మౌన విచక్షణ,     ‌ ధ్యాన విలక్షణ, రాగమే      యోగమని నాదోపాసన    చేసినవాడను, నీవాడను నేనైతే " అని వేడుకున్నారు శంకరశాస్త్రి గారు. కృష్ణోపనిషద్ " మోక్షం/ముక్తి/జన్మరాహిత్యం పొందే సమయం ఆసన్నమయినప్పుడు వేణునాదం వినబడుతుంది జీవుడి...

తను ఆచరిస్తూ ఆచరింపచేసేవారు ఆచార్యులు - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏 " విప్రప్రియా " అమ్మవారి అద్భుతనామం. ఇవి శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 887 వ నామం. " విప్రప్రియా " అంటే విప్రులను ఇష్టపడేది. " విప్ర " అంటే బ్రాహ్మణుడు అని ఒక అర్ధం. విపులంగా తెలుసుకుందాం ఈ పదాన్ని గురించి. పుట్టుకతో బ్రాహ్మణుడు అయినవాడు సంస్కారం/ఉపనయనంతో " ద్విజుడు " అవుతాడు. ఈ ద్విజుడు వేదాల్ని అభ్యసించి విప్రుడు అవుతాడు. ఈ మూడు అర్హతలు పొందినవారిని శ్రోత్రియులు అంటారు. అతడు వేదజీవనం పాటించాలి. ఆచారాలను పాటించాలి. " ఆచారహీనం నపునంతి వేదాః " అన్నారు. అంటే " ఆచారహీనుడిని వేదం కూడా పవిత్రుడిని చెయ్యలేదు " అని తెలుసుకోవాలి. కంచిపరమాచార్యులు విప్రులు గురుస్వరూపులు, వారిని గౌరవించినప్పుడే సమాజం బాగుంటుంది అని చెప్పారు. వేదాల్ని అభ్యసించి విప్రుడు అయిన వారికి ధర్మానికి, అధర్మానికి తేడా తెలుస్తుంది. ధర్మపాలన కోసం శ్రమిస్తూ ధర్మాన్ని నిలబెట్టడానికి తనవంతు ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. అమ్మవారి ఇంకోనామం " ధర్మాధారా " - అంటే " ధర్మానికి ఆధారమయినది " అని అర్ధం. సృష్టి అంతా ధర్మం మీదే ఆధారపడింద...

,యజ్ఞం అంటే త్యాగం - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏 " యజ్ఞరూపా " - అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 769 వ నామం.  అమ్మవారు యజ్ఞస్వరూపురాలు.  లలితాసహస్రం లోనూ విష్ణుసహస్రం లోనూ చాలా నామాలు ఒకలాగే అనిపిస్తాయి. విష్ణుసహస్రం లో ఇలా ప్రార్ధిస్తాం: " యజ్ఞో యజ్ఞపతిః యజ్వా  యజ్ఞాంగో యజ్ఞవాహనః "  అంటే ఆయన యజ్ఞస్వరూపుడు. యజ్ఞం అంటే ఉపనిషత్తులు చెబుతూన్నది " త్యాగం " అని. దీనికి " నేను, నాది " అన్నది ప్రక్కనపెట్టి కొంత త్యాగం చేస్తూ ఉండాలి. ఏపని అయినా యజ్ఞంలా అంటే క్రమశిక్షణతో శ్రద్ధగా చెయ్యాలని చెబుతారు. తల్లిదండ్రులు, గురువులు, సన్నిహితస్నేహితులు ప్రతీరోజూ చేసేది యజ్ఞమే అని గ్రహించాలి. ఏదయినా పని అవకపోతే " దేనికయినా పెట్టిపుట్టాలి " అని అంటూంటారు. ఈ పెట్టడమే త్యాగం క్రిందకు వస్తుంది. " యధాశక్తి " మనకు ఉన్నదాంట్లో కొంత దానధర్మాలకి ఖర్చుపెడితే తిరిగి అదే మనల్ని అవసరమయినప్పుడు ఆదుకుంటుంది. శ్రీగరికిపాటివారు ప్రవచనం చేస్తూ ఓ చక్కటి విషయం చెప్పారు. ఓ పండితుడు జుట్టు బాగా పెరిగిపోవడంతో సెలూన్ కి వెళ్ళాడు క్షవరానికి. షాపతను " గురువుగారూ రం...

శుభప్రదమయిన శ్రావణమాసం నేటినుంచి, శుభాకాంక్షలు - చీమలపాటి సూర్యనారాయణ

 🙏 శ్రీమాత్రేనమః🙏 " శ్రావణమాస వైశిష్ట్యం " పవిత్రమయిన శ్రావణమాసం ఈరోజు ప్రారంభమయినది. శ్రవణం నక్షత్రంతో కూడిన పౌర్ణమి ఉన్న మాసాన్ని శ్రావణమాసంగా పిలుస్తారు. శ్రావణం అంటే శుభం అని అర్ధం. ఈ మాసంలో అన్నీ శుభదినాలే అయినా అత్యంతశుభకరమైన రోజులు కొన్ని ఉన్నాయి.  శ్రావణమంగళవారాల్లో " మంగళగౌరీవ్రతం " చేసుకుంటారు పెళ్ళి అయిన స్త్రీలు. ముత్తయిదువులని ఆహ్వానించి కాళ్ళకి పసుపురాసి బొట్టుపెట్టి సెనగలు వాయినం ఇస్తారు. ఈ పసుపు వ్రాయడం ఓ అద్భుతమైన సంప్రదాయం. శ్రావణభాద్రపదాలు వర్షఋతువు, వర్షాలు పడి ఎక్కడ చూసినా నీరు ఉంటుంది. ముఖ్యంగా స్త్రీలు నీళ్ళలో ఎక్కువగా తిరగడం పాదాలు తడిసి వ్రేళ్ళమధ్య ఒరుసుకుపోవడం జరగుతుంది. పసుపు రాయడం పాదాలకు వ్రేళ్ళకు మంచిదని తెలుస్తూంది. రెండవ శుక్రవారం వరలక్ష్మీవ్రతం చేసుకుంటారు. మహాలక్ష్మిని సౌభాగ్యం ప్రసాదించమని కోరుకుంటారు. కొబ్బరికాయను తీసుకుని దానిమీద తడిపిన వరిపిండితో కళ్ళు, ముక్కు, చెవులు, నోరు ఏర్పాటుచేసి అలంకరించిన ఆ మూర్తికి పూజచేసుకుంటారు కొందరు.  ఈ వరలక్మీవ్రతం అత్యంత అద్భుతమైనది. పార్వతీదేవి ఈశ్వరుణ్ణి అడిగింది. గృహిణి ఒక్కరూ ఏ వ్రతం చేస్తే ...

మృత్యువు అంటే ఏమరుపాటు, మరణం కాదు - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏 " సర్వమృత్యునివారిణీ " - అమ్మవారి అద్భుతనామం. ఇది శ్రీలలితాసహస్రరహస్య నామాలలో 552 వ నామం.  " సర్వమృత్యునివారిణీ " అంటే అన్నిమృత్యువులనీ నివారించేది అని. మరణం అనేది ఒకసారే కదా వచ్చేది. మరి అన్ని మరణాలను నివారించడమేమిటి అమ్మవారు.  అమ్మవారి ప్రతీనామానికి ఓ పరమార్ధం ఉంది. ఒక్కోనామాన్ని జపంచేసుకుంటే ఒక్కో ఫలితం కనిపిస్తుంది. మృత్యువు అంటే ఉపనిషత్తులు చెప్పిన అర్ధం " ఏమరుపాటు " అని. అంతే కాని చావుకాదు. శరీరాన్ని " నేను " అనుకోవడమే ఏమరుపాటు. తను " ఆత్మ " అని ఎరుకలేకపోవడమే అజ్ఞానం. అదే మృత్యువు. శంకరాచార్యులు " బ్రహ్మ సత్యం, జగన్మిధ్య, జీవో బ్రహ్మ ఏవ నపరః " అన్నారు. జీవుడు ( మనం ) బ్రహ్మ ఒకరే అన్నారు. అది తెలుసుకోలేకపోవడమే ఏమరుపాటు, అజ్ఞానం, మృత్యువు.  కంచిపరమాచార్యులు, రమణమహర్షి, రామకృష్ణపరమహంస లాంటివారికి ఈ శరీరం ఒక వాహకమే. జీవుడు ముక్తిపొందడానికి తగిన కర్మలు చేయడానికి దీనిని వాడుకుంటాడు అంతే.  విమానాశ్రయానికి వెళ్ళడానికి టాక్సీ మాట్లాడుకుని వెడతాం. అక్కడికి చేరడంతో సరి, ఆ తరువాత ఆ టాక్సీ గురించి ఆలోచన...

అమ్మవారు భక్తులను ఇతరుల కుట్రలనుంచి కాపాడుతూ ఉంటుంది - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏 " పరమంత్రవిభేదినీ " - అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్య నామాలలో 812 వ నామం. పరమంత్రవిభేదినీ అంటే ఇతర ( లోకకళ్యాణం కోసం కానివి ) మంత్రాలను ఛేదిస్తుంది.  మంత్రం లోకకల్యాణం కోసం ఉపయోగపడాలి. జీవితం ధర్మబద్ధంగా ఉండాలి. సాధన సాత్వికంగా ఉండాలి. ఆలోచనలు సాత్వికంగా ఉండాలి. అలా లేని మంత్రాలని అడ్డుకుంటుంది.  " మననాత్ త్రాయతే ఇతి మంత్రః " అని తెలియచేస్తున్నాయి శాస్త్రాలు. మంత్రాలు రక్షణని ఇస్తాయి. ఎవరికి?. జపం చేసుకునే వారికి, లోకానికి కూడా. లోకం సురక్షితంగా ఉంటేనే కదా మనం సుఖంగా జీవించేది. ఎప్పుడూ కొట్టుకు చస్తూ, పరాయి దేశాలపై ద్వేషంతో ఉండే దేశాలలో ఆనందం ఎలా ఉంటుంది. అమ్మవారి ఈ నామ శక్తి/అనుగ్రహం హనుమ లంకలో ప్రవేశించినప్పుడు తెలుస్తుంది. చిన్నరూపంలో ( పిల్లి అంత వానరం ) హనుమ లంకలో ప్రవేశించి భవనాలని, రక్షణవ్యవస్థని, మనుషులనీ, అన్నివైపులా పరిస్థితులు ఎలా ఉన్నాయో అని నిశితంగా గమనిస్తున్నారు. ఆయుధాలు పట్టుకుని యోధులు తిరుగుతున్నారు. కొందరు మంత్రవేత్తలు దర్భలు పట్టుకుని తిరుగుతున్నారుట. దేనికి?. ఎవరయినా శతృవులు కనబడకుండానో సూక్ష్మరూపంలోన...

అమ్మవారు అక్షరాలకు అధిదేవత - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏 " క్షరాక్షరాత్మికా " - అమ్మవారి అద్భుతనామం. శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 757 వ నామం. " క్షరాక్షరాత్మికా " ఒక అద్భుతనామం. క్షర అంటే నాశనమయ్యేది అని అక్షర అంటే నాశనము లేనిది అని సాధారణంగా చెప్పుకునే అర్ధం. కాని ఇక్కడ సంఖ్యలేనన్ని అంటే సంఖ్య " ఇంత " అని తెలుసుకోలేనన్ని అక్షరముల స్వరూపముగలది అమ్మవారు అని అర్ధం చెప్పుకోవాలి. వేదం చెప్పినవిషయం " ఓం ఇత్యేకాక్షరం (ఇతి+ఏక+అక్షరం ) బ్రహ్మ " - ఓంకారమనే అక్షరమే బ్రహ్మం, ఆ అక్షరాన్నుంచే అన్ని అక్షరాలు జనించాయి అని తెలుసుకోవాలి అని. " అ ఆ....." లకు " అక్షరం అంటే నాశనము లేనిది అని పేరుపెట్టడమే ఒక అద్భుత ప్రక్రియ.  అక్షరం ని అమ్మవారుగా భావించి కొలిచే అద్భుత సంప్రదాయాన్ని మనకు ఇచ్చింది మన సనాతనధర్మం. అక్షరాభ్యాసం దగ్గరనుంచి పిల్లలకు చదువులతల్లి సరస్వతీదేవిని ఎలా గౌరవించాలో నేర్పించడం, పుస్తకాలను ఎంత జాగ్రత్తగా గౌరవప్రదంగా ఉంచుకోవాలో నేర్పడం కూడా జరుగుతూంది.  అద్భుతవిషయమేమిటంటే ప్రతి అక్షరానికి ఒక అధిస్టానదేవత ఉంటుంది. ఆవిడ ఏ రంగులో ఉంటుందో ఏ వస్త్రం ధరిస్తుందో ఆవిడని ఎల...

అమ్మవారికి తనను నమ్ముకున్న వారు అంటే ఎంత ప్రేమో - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏 " ప్రేమరూపా " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 730 వ నామం .  " ప్రేమరూపా " అంటే ప్రేమయే స్వరూపముగా కలవారు అమ్మవారు అని భాష్యం చెప్పారు. అమ్మవారు చండిక, రాక్షసులను సంహరిస్తారు అనుకుంటాం. సంహరించడం కూడా వారిమీద దయతో ముక్తినివ్వడం కోసమే. పుణ్యకర్మలు చేయడానికి ఎన్నో అవకాశాలను ఇస్తారు. ఇక ప్రయోజనం లేదు అనుకున్నప్పుడే శిక్షిస్తారు.  పోతనగారి ఆంధ్రభాగవతంలో ఓ అద్భుత శ్లోకం ఉంది: " పాయని గేహశృంఖలలఁ    బాసి నిరంతర మత్పరత్వ   ముంజేయుచు నున్న మీకుఁ    బ్రతిజేయ యుగంబుల నైన      నేర; నన్ బాయక కొల్చు    ‌‌మానసము    ప్రత్యుపకారముగాఁ    దలంచి నాపాయుటఁ      దప్పుగాఁ      గొనక భామినులార!    కృపన్ శమింపరే " " ఓ భామలారా, వీడరాని సంసారమనే సంకెళ్ళను వీడి నాయందే ఎడతరగని మనస్సు లీన మొనర్చిన మీకు యుగపరిమాణం గల దీర్ఘకాలం చెల్లిపోయినా ప్రత్యుపకారం చేయలేను. నేను మిమ్మెడబాయుట కృతజ్ఞత లేనందుకు కాదు. నన్ను నిరంతరం స్మరించడం కోసమే. ఇదే మీకు నేనొర్చిన ప్రత్...

అమ్మవారు విశ్వమంతా వ్యాపించి ఉన్నారు - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏 " సర్వాంతర్యామినీ " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్య నామాలలో 819 వ నామం. " సర్వాంతర్యామినీ " అంటే జీవులందరియందు ప్రవేశించు దేవి అని భాష్యం చెప్పారు. అమ్మవారి చైతన్యం సృష్టి అంతా వ్యాపించి ఉంటుంది. రాళ్ళు రప్పలలో కూడా చైతన్యం ఉంటుంది. మన ఇంద్రియాలు కూడా జడమని ( పనిముట్లు మాత్రమే), వాటితో పనిచేయించే శక్తి బ్రహ్మమని, అదే బ్రహ్మం మనలో జీవాత్మగా ప్రవేశిస్తుందని, అందుచేత మనకేదో స్వతంత్రమైన శక్తి ఉందని అహంకరించ కూడదనే సందేశంతో కేనోపనిషత్తు ముగుస్తుంది.    ఈశావాస్యోపనిషత్తులో ఈశ్వరుడి విశ్వవ్యాపకత గురించి బాగుగా వివరించారు: " ఈశావాస్య మిదగ్ం సర్వం   యత్కించ జగత్యాం జగత్ " ఈ సూక్తి ఈ ఉపనిషత్తులో మొదటి మంత్రంలో మొదటి పాదం.  ఈ కనబడుతూన్న విశ్వం అంతా ఈశ్వరుడి చేత కప్పబడి ఉంది - అంటే భగవంతుడు విశ్వవ్యాపకుడని అర్థం. ఈ విషయం వేదంలో కూడా అనేక చోట్ల ప్రస్తావించ బడింది.   ప్రసిద్ధమైన నారాయణ సూక్తంలో ఇలా తెలియచేసారు: " యచ్చ కించిజ్జగత్సర్వమ్    దృశ్యతే శ్రూయతే2పివా   అంతర్బహిశ్చ తత్సర్వం    వ్యాప్య నారాయణః స్థితః...

అమ్మవారు కష్టాలు పోగొడుతారు - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమ"🙏 " కాష్టాకాంతా " - అమ్మవారి అద్భుతనామాలు. ఇవి శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 859,860 వ నామాలు. " కాష్టా " అంటే కాలభాగాదిస్వరూపురాలు. శ్రీలలితాసహస్రనామాలలో " కాంతా " అనే నామం రెండుచోట్ల వస్తుంది. కాంతా అంటే కమనీయమైనది/అందమైనది అని. అమ్మవారు అందంగా ఉండకుండా ఎలా ఉంటారు. అమ్మవారి వర్ణం అగ్నివర్ణం ( దుర్గా సూక్తం ), పైగా అమ్మవారు ఎప్పుడూ దరహాసోజ్వలముఖి, ఆకర్ణదీర్ఘనయని. కాని రెండుచోట్లా అదే అర్ధం వ్రాస్తే ఎలా అని ఆలోచనచేసి రెండోసారి వచ్చిన చోట " కాష్టాకాంతా " ని " కాష్టా + కాంతా " అని కాకుండా " కాష్టా + అకాంతా " గా విడగొట్టారు. అకాంతా అంటే అందంగా లేదని కాదు. కం అంటే సుఖం, అకం అంటే కష్టం కనుక అకాంతా అంటే కష్టాలను అంతంచేసేది/పోగొట్టేది అని భాష్యం వ్రాసారు. అమ్మవారిని " అందంగా ఉన్నావు " అని మళ్ళీ స్తుతించడంకన్నా " మాకష్టాలు తీర్చే తల్లివి " అని స్తుతిస్తే ఎంత అద్భుతంగా ఉంది.  శంకరుల తరువాత వెయ్యి సం.లకు శ్రీభాస్కరరాయలు శ్రీలలితాసహస్రనామాలకు భాష్యం వ్రాసారు. ఈయన మహాపండితుడు, అమ్మవారి ఉపాసకుడు...

అమ్మవారికి అమితమైన ప్రేమ పిల్లలంటే - చీమలపాటి సూర్యనారాయణ

🙏"శ్రీమాత్రేనమః"🙏 " ఇచ్ఛాశక్తిజ్ఞానశక్తిక్రియాశక్తిస్వరూపిణీ " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 658 వ నామం. " ఇచ్ఛాశక్తిజ్ఞానశక్తిక్రియాశక్తిస్వరూపిణీ " అంటే చేద్దామనే సంకల్పం/కోరిక, ఎలా చేయాలనే జ్ఞానం, చేయడానికి ప్రయత్నం/పని చేయడం - ఇది కర్మ. ఇది మనుషులకే కాదు దేవతలకయినా ఆఖరికి అమ్మవారి కయినా అవసరమే.  కృష్ణుడు గోపికలకు ముక్తిని ఇద్దామని నిర్ణయించారు. ఇది ఇచ్ఛ/కోరిక. ఏ రకంగా ఇవ్వాలి అంటే రాసలీల ద్వారా. ఇది జ్ఞానం. రాసలీల చేయడం క్రియ. అమ్మవారు సృష్టి చేద్దామనుకుంటే ఏమిటి చేద్దామన్నది సంకల్పం, ఎలా చేయాలన్నది జ్ఞానం, చేయడానికి పని మొదలుపెట్టడం క్రియ. అమ్మ మనకోసం వంట చేయడం మొదలుపెడుతుంది. వంట చేయాలి అనేది కోరిక - ఇచ్ఛాశక్తి. వంటకు కావలసిన సరకులు ఉంటేనే కదా వంట. ఈ సరకులు సంపద/లక్ష్మి. ఎలా చేయడం అన్నది జ్ఞానం - సరస్వతి. వంటచేయడం క్రియ, శక్తి - పార్వతి. ఇవి ఉంటే సరిపోతుందా, ముఖ్యంగా కావలసినది పిల్లలపై ప్రేమ, ఏదో ఒకటి చేసి తినిపించాలని. ఆ ప్రేమ‌స్వరూపిణియే రాధాదేవి. ప్రతీ అమ్మలోనూ ఈ నలుగురూ స్ధితులై ఉంటారు. అందుకే మాతృదేవోభవ అనమన్నారు ప్రధమంగ...

అమ్మవారిని పాదాలను ఆశ్రయిస్తే మాయ తొలగుతుంది - చీమలపాటి సూర్యనారాయణ

 🙏 " శ్రీమాత్రేనమః "🙏 " కూటస్థా " - అమ్మవారి అద్భుత నామం. ఇవి శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 896 వ నామం‌. " కూటం " అంటే మాయ/అజ్ఞానం. " కూటస్థా " అంటే మాయ మీద/లోపల కూర్చుని ఉన్నారు అమ్మవారు అని తెలుసుకోవాలి. కూటం అంటే పర్వతశిఖరం ( ఉదా: చిత్రకూటం ), సమూహం ( ఉదా: ఇంద్రియసమూహం ) అని కూడా అర్ధాలు ఉన్నాయి.  అస్తమానూ " మాయ " అంటారు, వేరే పనిలేదా అనుకుంటారు.  " మాయ " అంటే " ఊహకందనిది " అని తెలుసుకోవాలి. అంతేకాని అందరూ అనుకునే వింతపదం కాదు. అమ్మవారు కాని, వారి లీలలు కాని ఊహకెలా అందుతాయి.  శ్వేతాశ్వతరోపనిషత్ ఇలా తెలియచేస్తూంది: " మాయాంతు ప్రకృతిం విద్యాం  మాయినంతు మహేశ్వరం " అని. ప్రకృతి అంతా మాయే కదా. ఇప్పటికీ మనం ( తిని కూర్చోక ) ఇంట్లో పిల్లలు బయటకు వెడుతూంటే 100 జాగ్రత్తలు చెబుతాం ( వాళ్ళు విసుక్కున్నా ). అదే మన సనాతనధర్మం చేసేది. కనబడేది అంతా మాయ, జాగ్రత్తగా ఉండు, అగ్నిలో పడే మిడతవు కాకు, కోరి కష్టాలు తెచ్చుకోకు అని పదే పదే తెలియచేస్తూనే ఉంటుంది, కొందరేనా బాగుపడతారని.  రామకృష్ణపరమహంసని ఓ భక్తుడు అడిగాడు " స్వ...

సాధనకు కూడా అమ్మవారి అనుగ్రహం కావాలి - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏 " భక్తహార్దతమోభేదభానుమద్భాను సంతతిః " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 404 వ నామం. ఈ నామానికి " భక్తుల హృదయమందున్న అజ్ఞానమనే చీకటిని పోగొట్టుటయందు సూర్యుని కిరణ పరంపర అయినట్టిది " అని భాష్యం చెప్పారు. సూర్యుడు తన కిరణాలతో చీకటిని తొలగించినట్లు అమ్మవారి పాదాలను ఆశ్రయిస్తే మన హృదయం లోని అజ్ఞానాన్ని తొలగిస్తారు. " అంగుష్ఠమాత్రః పురుషో    మధ్య ఆత్మని తిష్ఠతి "        - కఠోపనిషత్తు 2:1:12 మన హృదయంలోనే బ్రొటకనవ్రేలు పరిమాణంలో అమ్మవారు ఉంటారు అని తెలియచేస్తూంది కఠోపనిషత్తు.  అమ్మవారు హృదయంలో చిన్న మొగ్గ రూపంలో ఉంటారు. అది పువ్వుగా చైతన్యంగా అవాలంటే నిరంతర కృషి ఉండాలి.  రమణమహర్షి తరచూ అనేవారు " పరమాత్మ గురించి తరువాత ఆలోచించవచ్చు, ముందర నీ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం మొదలు పెట్టు " అని. అంటే లోపలికి ప్రయాణం చేయాలి, హృదయలోనే ఉన్న అమ్మవారిని తెలుసుకో అని. దానికి కఠిన సాధన అవసరం.  రమణమహర్షి తన " అరుణాచల పంచరత్నం " లో ఇలా ప్రార్థిస్తారు: " కరుణా పూర్ణ సుధాబ్ధే   కబళిత ఘన విశ్వరూప    కిరాణ...

అమ్మవారు ధనానికి అధ్యక్షులు - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏 " ధనాధ్యక్షా " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 885 వ నామం. " ధనాధ్యక్షా " అంటే ధనమునకు అధ్యక్షురాలు అని. ధనమునకు స్వామిని అయినది. ధనం అశాశ్వతం కదా మరి దానికి అధ్యక్షురాలు ఏమిటి? పైగా అమ్మవారు. ధన్యతను ఇచ్చేది ధనం అన్నాయి శాస్త్రాలు. ఏ మంచి పనిచేయాలన్నా ధనం కూడా అవసరం.  యజుర్వేదం/అధర్వణవేదాల్లో అధికసంపద కోసం చేసే యాగం ఉంది. కోరికలు తప్పుకాదు. వివిధరకాలైన కోరికలు తీర్చుకోవడానికి వీలుగా చాలా కార్యక్రమాలు తెలియచేసాయి మన వేదాలు/శాస్త్రాలు. ఈ యాగంలో చివరన " సంపదను చేతిలో ఉంచు " అని కోరడం ఉందిట. " ఎవరి చేతిలో ఉంచాలి, ఎందుకు నా చేతిలో ఉంచు అని అనలేదు " అనే సందేహం వచ్చిందిట పండితులకు. " పాహిమాం - నన్ను రక్షించు, దేహిమాం - నాకు ప్రసాదించు " అని కదా ప్రార్ధిస్తాం అమ్మవారిని, ఆ మంత్రం లో అలా స్ఫష్టంగా ఎందుకు లేదు అన్నది సందేహం. శృంగేరీపీఠం 12వ పీఠాధిపతి శ్రీశ్రీ విద్యారణ్యస్వాముల వారు ఈ సందేహాన్ని తీర్చారు. ఏమని అంటే " నీ " అని తీసుకోవాలి అందుకే " నా " అని చేర్చలేదు అని. అదేమిట...

మంచి మంచి పూలతో పూజ చేసినా శ్రద్ధ ముఖ్యం - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏 " చైతన్యకుసుమప్రియా " - అమ్మవారి అద్భుతనామం. ఇది శ్రీలలితాసహస్రరహస్య నామాలలో 919 వ నామం. " చైతన్యకసుమప్రియా " అంటే చైతన్యకుసుమాలతో చేసే పూజను ఇష్టపడుతారు అని. " జ్ఞాతా హోతా, జ్ఞానం అర్ఘ్యం, జ్ఞేయం హవిః......" - అని తెలియచేస్తూంది భావనోపనిషత్తు.  అమ్మవారికి జ్ఞానకుసుమాలని సమర్పించాలి. ఏదో మ్రొక్కుబడిగా చేసేయకూడదు పూజని. పువ్వులు కూడా జడమే. కోస్తేనే ఇంట్లోకి వస్తాయి, వేస్తేనే అమ్మవారి పాదాలపై పడతాయి. కాని ఆ జడపువ్వుని కూడా చైతన్యపూవుగా భావించి పూజచేస్తే ఆవిడ సంతుష్టురాలయి అనుగ్రహిస్తారు.  పూజలో నైవేద్యం తరువాత ముఖ్యమయినది " మంత్రపుష్పం ". ఓ పువ్వు ని చేతిలో పట్టుకుని అమ్మవారి గుణగణాలను స్మరించుకుని ఆ పువ్వుని ఆవిడ పాదాలపై వేస్తాము. అప్పుడు ఆ పువ్వు చైతన్యపుష్పంగా అవుతుంది. గణపతిని కూడా ప్రత్యేకంగా గరికతోటే కాకుండా 21 పత్రులతో ఒక్కొక్కపత్రి పేరు చదువుతూ పూజిస్తాం. అంటే వాటిని చైతన్యపత్రిగా సమర్పిస్తాము.  " ఏకబిల్వం శివార్పణం " అంటారు. అలా పేరు చెబుతూ పూజచేస్తారు భక్తితో. " మిరా అల్ఫాసా " అనే ఓ ఫ్రెం...

ప్రళయం/లయం దేనికి?- చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏 " మహాప్రళయసాక్షిణీ " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్య నామాలలో 571వ నామం. కల్పాంతంలో సృష్టి అంతా తనలో లయమయి పోతూ ఉంటే అమ్మవారు సాక్షిగా నిర్వికారంగా చూస్తూ ఉంటారు( ట ). అసలు లయం దేనికి?. ప్రస్తుతం కలియుగం ప్రారంభం. ఇప్పుడే ఎందరో అధర్మపరులను, స్వార్ధపరులను చూస్తున్నాం. సమాజాన్ని ఎంత భ్రష్టు పట్టిస్తున్నారో చూస్తున్నాం. 20/25 ఏళ్ళ వయసున్న పచ్చటి చెట్లను అరగంట " నాయకుడి సభ " కోసం నిర్దాక్షిణ్యంగా కొట్టిపడేస్తున్నారు. అతిధి గృహాలకోసం రక్షణనిచ్చే కొండలను త్రవ్వి పడేస్తున్నారు. మరి కలియుగాంతంలో పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు.  అప్పుడప్పుడు వార్తలు చదువుతూంటాం. ప్రమాద స్థితిలో ఉన్న భవనాలను వంతెనలను ప్రభుత్వం కూల్చేయడం.  అమ్మవారు ఇంక ఏమాత్రం బాగు చేయడానికి అవకాశం లేని తన సృష్టినంతా తనలో లయం చేసేసుకోవడంలో ఆశ్చర్యం ఏముంటుంది. క్రొత్త భవనం కట్ఠాలంటే పూర్తిగా పాడయిపోయిన ప్రాత భవనం కూల్చక తప్పదు. క్రొత్త సృష్టి చేయాలంటే పూర్తిగా భ్రష్టు పట్టిన ప్రాత సృష్టిని లయం చేయక తప్పదు. ఆదిశంకరులు శివానందలహరి చేస్తూ ఇలా ప్రార్థిస్తారు: " ...

మాయ ఆంటే ఊహకందనిది అని - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏 " మాయా " - అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 716 వ నామం. " మాయ " అంటే " ఊహకందనిది ". అమ్మవారి లీలలను మనమెలా ఊహించగలం. ఏదయినా ఒక విషయం ఎలా జరిగిందో ఊహకి అందకపోతే " మాయ " అని అనుకుంటాం. సృష్టిలో ఎన్నో వింతలు గమనిస్తూంటాం, అలా వింతలు లేకపోతే అందమే లేదు. ఈ " మాయ " జీవుల మంచికోసమే. కొన్ని విషయాలను తట్టుకోలేం. ఉదా: చాలా కావలసినవారు ఒకరు కాలం చేస్తే తట్టుకోలేరు. కాని అది ఒకటి రెండు రోజులే. మాయా ప్రభావంతో బయటపడిపోతారు, అది జరిగిందన్న స్పృహ కూడా ఉండదు. లేకపోతే నిరాశా నిస్పృహలకు లోనవడం, సృష్టి అంతరించడం జరుగుతుంది. ఈ మాయ తొలగుతేనే అమ్మవారు తెలుస్తారు. కాని మహామహులకు కూడా మాయ తొలగడం కష్టమే. భగవద్గీతలో పరమాత్మ అంటారు: " దైవీ హ్యేషా గుణమయీ    మమ మాయా దురత్యయా " - భ.గీత 7:14 అంటే " త్రిగుణాల ప్రభావం వలన నా మాయ నుంచి తప్పించుకోవడం ఎవరికీ సాధ్యం కాదు " అని. కాని ఆయన్ని/అమ్మవారిని ఆశ్రయించి శరణుకోరినవారు మాయను దాటడానికి అవకాశం ఉంది.  అర్జునుడు అంటాడు " మహామహులకే ఈ మనస్సును నిగ్రహ...

అమ్మవారు అందరినీ గమనిస్తూ ఉంటారు - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏 " విశాలాక్షీ " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 936 వ నామం. " విశాలాక్షీ " అంటే విశాలమయిన కన్నులు గలది అని అర్ధం. 84 లక్షల జీవరాశులను గమనించుకుంటూ ఉండాలంటే ఎంత పెద్ద కనులు ఉండాలి. ఆదిశంకరులు శ్రీలలితా పంచరత్న స్తోత్రం చేస్తూ అమ్మవారిని " ఆకర్ణదీర్ఘనయినీ " అని ప్రార్థించారు. చెవులదాకా సాగి ఉన్నాయిట అమ్మవారి కనులు. మూక శంకరులు కామాక్షీ అమ్మవారి కన్నుల ప్రభావాన్ని వర్ణిస్తూ 100 శ్లోకాలతో కీర్తించారు. అది కటాక్షశతకంగా ప్రసిద్ధి చెందింది. ఈ శ్లోకంలో ఇలా ప్రార్థించారు: " కల్లోలితేన కరుణారసవేల్లితేన    కల్మాషితేన కమనీయమృదుస్మితేన    మాముంచితేన తవ కించన కించితేన   కామాక్షి తేన శిశిరీకురు వీక్షితేన " అమ్మా కామాక్షీ నీ శరీరము ఒక కరుణాసముద్రము, కన్ను అందు తరంగమువలె ఉన్నది. అందు దయారసము పొంగుచున్నది. ఆ కన్ను కొంచెము వంగి పూజింపదగినదిగా తోచును. అందు అందమైన మందహాసము చిందులు త్రొక్కును. దానికి కాటుక దిద్దబడియున్నది. అట్టి నీ కంటి చూపుతో సంసారతప్తుడనయిన నన్ను చల్లబరచుము. కామాక్షీ అంటేనే కంటిచూపుతో కోరికలను తీర్చ...

శ్రీ వ్యాస పూర్ణిమ/గురు పూర్ణిమ శుభాకాంక్షలు అందరికీ - చీమలపాటి సూర్యనారాయణ

 🙏" శ్రీరస్తు శుభమస్తు "🙏 శ్రీశ్రీశ్రీవేదవ్యాసుల జయంతి నేడు. ఈరోజుని గురుపూర్ణిమగా జరుపు కుంటారు. " గురుర్భ్రహ్మ గురుర్విష్ణుః    గురుర్దేవో మహేశ్వరః,    గురుస్సాక్షాత్ పరబ్రహ్మ    తస్మైశ్రీ గురవేనమః "  గురువును ఎలా గౌరవించు కోవాలో తెలియచేసింది మన సనాతనధర్మం. తల్లిదండ్రులలాగే గురువు కూడా ప్రతిఫలం ఆశించకుండా జ్ఞానంని ప్రసాదిస్తారు. సనాతనధర్మానికి మూలపూరుషుడు వ్యాసర్షి. వేదాలన్నీ కలిసిపోయి ఉన్నప్పుడు వ్యాసులు వాటిని విభజించి ఓ క్రమపద్ధతిలో అందించారు మనకు. అవి అర్ధం చేసుకోవడానికి కష్టపడతారేమోనని 18 పురాణాలను అందించారు. పంచమవేదంగా కొనియాడబడుతున్న మహాభారతాన్ని 100700 శ్లోకాలతో అందించారు.  ఇప్పటికి ఎప్పటికీ నిత్యనూతనమైన భగవద్గీతని అందించారు. పరమపవిత్రమయిన విష్ణుసహస్రం, శివసహస్రం, ఎన్నో నీతికధలు మనకు అందించారు. అయినా ఆయన మనస్సు సంతృప్తిచెందక వ్యాకులపడుతూన్నప్పుడు నారదమహర్షి సలహాతో మహాభాగవతాన్ని రచించి మనకు అందించారు. మహాభారతంలో ఆయన ఇలా అన్నారు : " యదిహాస్తి తదన్యత్ర    యన్నేహాస్తి నతత్ క్వచిత్ ". దీని అర్ధం " భారతంలో ఉన్నదే ఎక్కడా ఉంటుంద...

ఆచరణాత్మక జ్ఞానం కూడా గొప్పదే - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏 " అమతిః " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 537 వ నామం . " అమతిః " అంటే అవిద్యాస్వరూపురాలు అని అర్ధం. విద్య అంటే కేవలం అమ్మవారి గురించి తెలుసుకునే జ్ఞానం మాత్రమే అని వేదం చెబుతూంది. మిగతావన్నీ అవిద్యలే. ఉద్యోగాల కోసం మనం చదివే చదువులన్నీ ఎంత పెద్దవి అయినా అవిద్యలే. మరి అమ్మవారు విద్యాస్వరూపురాలు కాని అవిద్యాస్వరూపురాలు ఎలా?.  సైద్ధాంతిక జ్ఞానం వేదం, పురాణాలు, పుస్తకాలు, గురువు నుండి పొందవచ్చు. ఆచరణాత్మక సాక్షాత్కారం సాధనతో వస్తుంది.  అమ్మవారి అంశ/చైతన్యం పండితులలోనే కాదు, పశుపక్ష్యాదులు, క్రిమికీటకాలలో కూడా ఉంటుంది. మరి సాలెపురుగు తన రక్షణ, ఆహారం కోసం చక్కటి గూడు ఎలా అల్లుకుంటూంది. పక్షి తమ పిల్లల కోసం గూడు ఎలా కట్టుకుంటూంది. వీటికి పుస్తక/బ్రహ్మ జ్ఞానం లేదు. సాధనజ్ఞానం ఉంది. దానిని అమ్మవారు " అవిద్యాస్వరూపురాలు " గా ప్రసాదిస్తారు. పరమాత్మ గీతలో ఇలా తెలియచేసారు: " న హి జ్ఞానేన సదృశం    పవిత్రమిః విద్యతే,   తత్స్వయం యోగసంసిద్ధ:    కాలేనాత్మని విన్దతి "            - భ.గీత 4:38 ఈ ప...

భేషజం కాదు, భక్తి/భావన ముఖ్యం - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏 " అనిత్యతృప్తా " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 815 వ నామం. " అనిత్యతృప్తా " అంటే నిత్యములు కాని ఉపచారాలతో సంతోషించునది. అటువంటి ఉపచారాలతో " కూడా " సంతోషించునది అని భావించాలి. సాధారణంగా మనం చేసే పూజలో చేసే ఉపచారాలన్నీ అనిత్యాలే. సమర్పించే పూలు పళ్ళు నైవేద్యాలు పానీయాలు అన్నీ అనిత్యమే. ఏదీ రెండు మూడు రోజులకన్నా నిలవ ఉండవు. కాని ఏదో ఒకటి సమర్పించాలి అనే భక్తుల భావనకు అమ్మవారు తృప్తి చెందుతారు. భక్తకన్నప్ప ఓ చేత్తో పూలు ఇంకో చేత్తో నైవేద్యం పట్టుకున్నాడు. మరి అభిషేకానికి నీరు ఎలా పట్టుకెళ్ళడం. నోటితో పట్టుకుని వెళ్ళి శివలింగం మీద ఊసాడు. అది తప్పని కన్నప్పకు తెలియదు. ఆ పూజకే మురిసిపోయి మోక్షాన్ని ప్రసాదించాడు శివుడు కన్నప్పకు. పరమాత్మ గీతలో ఇదే తెలియచేసారు: " పత్రం పుష్పం ఫలం తోయం    యో మే భక్త్యా ప్రయచ్ఛతి,   తదహం భక్త్యుపహృతమ్    అశ్నామి ప్రయతాత్మనః "             - భ.గీత 9:26  " నాకు ఎవరైనా భక్తితో ఒక ఆకుగాని, ఒక పువ్వు గాని, ఒక పండు గాని, లేదా నీరైనా గాని సమర్పిస్తే, ఆ స్వచ్ఛమైన మన...

గోవు, భూమి ఒకరే, గౌరవించుకోవాలి - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏 " గోమాతా " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 605 వ నామం .  " గోమాతా " అంటే ఆవులకు తల్లియగు సురభిస్వరూపురాలు అని భాష్యం చెప్పారు. గో శబ్దానికి నానార్ధాలు చాలా ఉన్నాయి ‌ అందులో ఒక అర్థం భూమి అని. శ్రీవారాహీదేవి తన కోరలమీద భూదేవిని కూర్చోబెట్టుకుని సదా రక్షిస్తూ ఉంటుంది. పురాణాలలో భూమి ప్రస్తావన వచ్చినప్పుడల్లా భూదేవి గోవు రూపంలో రావడం కనబడుతూంటుంది. మనుషులకే కాదు దేవతలకు రాక్షసులకు కూడా భూమే ఆధారం. దేవతలకు కావలసినది యజ్ఞ హవిస్సులు. యజ్ఞం జరిగేది భూమిమీదే. సమిధలు మొ.గునవి ఇచ్చేదీ భూమే. మహాభాగవతంలో ఓ అద్భుత ఘట్టం ఉంది.  పృధుచక్రవర్తి భాగవతోత్తముడు,  చక్కటి ధర్మపాలన చేస్తున్నారు. అయినా కరువుకాటకాలు వచ్చాయి. కారణం ఏమిటి అని భూమిని నిలదీశాడు పృధువు. భూమి గోవు రూపంలో వచ్చి అంది " నీ తండ్రి అధర్మపాలనే ఈ పరిస్థితికి కారణం. నువ్వు ధర్మపాలన చేస్తున్నావు. నిజమే కాని దాని ఫలితం రావడానికి కొంత సమయం పడుతుంది. కాని నువ్వు ధర్మపరుడివి, అడిగావు కనుక నేను నుంచుంటున్నాను. నీకు కావలసినది పితుక్కో/తీసుకో అంది. గోవునుంచి పాలు పితకాలంటే...

ప్రాయశ్చిత్తాలు చేసుకోవడం కష్టం కాదు - చీమలపొటి సూర్యనారాయణ

 🙏"శ్రీరస్తు శుభమస్తు"🙏 " అపి చేత్ సుదురాచారో        భజతే మామనన్యభాక్,   సాధురేవ స మంతవ్యః     సమ్యగ్వ్యవసితో  హి సః "               - భ.గీత 9:30 " మిక్కిలి దురాచారుడైనను అనన్యభక్తితో నన్ను భజించినచో అతనిని  సత్పురుషునిగానే భావింపదగును. ఏలనన, యధార్ధముగా అతడు నిశ్చయబుద్ధి గలవాడు. అనగా పరమాత్ముని సేవించుటతో  సమానమైనది మఱియొకటి ఏదియును లేదని గట్టిగా నిశ్చయించుకొనినవాడు " అని. గరుడపురాణం నరకాన్ని ఎలా తప్పించుకోవాలి అనే అద్భుత విషయాన్ని తెలియచేసింది: " తస్మాత్ పురైవాద్దిహ పాప నిష్కృతౌ,    యతేత మృత్యోరవిపధ్యరాత్మనా " " ఈ జీవితంలోనే మరణానికి ముందే దేహం రోగగ్రస్తం కాకముందే చేసిన పాపాలకు నిష్కృతి చేసుకోవాలి " అని. రోగాన్ని గుర్తించి వైద్యులు చికిత్స చేసినట్లుగా మనకు మనమే మనం చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తాలు చేసుకోవాలి. ప్రాయశ్చిత్తాలు ఏమీ అంత కష్టమయినవి కావు. పూజలు వ్రతాలు చేసుకోవడం, పుణ్యక్షేత్రాలు దర్శించడం, నామజపం పారాయణం, సహాయం ఆశించి వచ్చినవారికి శక్తికి తగ్గ సహాయం చేయడం, ఇంటికి వచ్చిన అత...

అమ్మవారు భక్తులను చక్రవర్తిని చేస్తారు - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏 " సామ్రాజ్యదాయినీ " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 692 వ నామం. " సామ్రాజ్యదాయినీ " సామ్రాజ్యమును ఇచ్చునది అని భాష్యం చెప్పారు. సామ్రాజ్యం అంటే ఏదో చిన్న రాజ్యం కాదు. మనం సామ్రాట్ అని వింటూంటాం. ఉదాహరణకు రాజసూయయాగం చేసిన వారిని సామ్రాట్ అంటారు. భూమండలంమీద ఎక్కడికయినా వెళ్ళవచ్చు యాగాశ్వం. ఏ రాజ్యంలో అయినా దాన్ని బంధిస్తే ఆ రాజుతో యుద్ధం చేసి గెలిచి గుర్రాన్ని విడిపించుకుంటూ ఎదరకు సాగాలి. చిన్న విషయం కాదు అమ్మవారి అనుగ్రహం పొందడం. అమ్మవారి అనుగ్రహం ఎంత అద్భుతంగా ఉంటుందో ఊహించుకున్నప్పుడల్లా శ్రీ తాడేపల్లి రాఘవనారాయణశాస్త్రి గారిని తలుచుకుని నమస్కరించుకోవాలి. తాడేపల్లి రాఘవనారాయణశాస్త్రిగారి తండ్రి గారు వెంకటప్పయ్యశాస్త్రి, తల్లి శ్రీదేవి. రాఘవగారి చిన్నతనంలో వారి ఇంటికి ఓ సిద్ధపురుషుడు వచ్చారు. ఈపిల్లవాడిని చూసి వారి తండ్రితో " మీ పిల్లవాడికి బాలమంత్రాన్ని ఉపదేశిద్దాం అనుకుంటున్నాను, మీరు అనుమతిస్తే " అని అడిగి ఆయన అనుమతిని తీసుకుని " బాల " ను ఉపదేశించారు. మరి శాస్త్రిగారు ఎన్నికోట్ల " బాల ...

అమ్మవారు భక్తులమీద అమృత వర్షం కురిపిస్తారు - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏 " సుధాసారాభివర్షిణీ " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్య నామాలలో 106 వ నామం. " సుధాసారాభివర్షిణీ " అంటే సుధా+ఆసార+అభివర్షిణీ - అమృతమును జడివానగా కురిపించునది అని భాష్యం చెప్పారు.  కఠిన సాధనతో ఆరు చక్రాలను, మూడు ముడులను ఛేదించుకుని తన వద్దకు చేరిన సాధకుడిని చూసి వేయి దళాల పద్మంలో కూర్చుని ఉన్న అమ్మవారు మురిసిపోతారు. సాధకుడు " నేను " అనే భావన తొలగిపోయి బ్రహ్మానంద స్థితిలో ఉంటాడు. సాధారణంగా రకరకాల ఆనందాలు ఉంటాయి, ఒకదానికి మించి ఇంకో ఆనందం. బ్రహ్మానందం అంటే ఆ ఆనందానికి మించిన ఆనందం లేనిది. అమ్మవారు ఎంతటి అమృతమూర్తి అంటే కఠిన సాధన చేసే జీవుడు తనదాకా రాకమునుపే మరణిస్తే అతని సాధన స్థాయిని బట్టి మణిద్వీపానికి తీసుకుని రావడమో లేక వేరే పుణ్యలోకాలకు పంపడమో చేసి వారిచేత సర్వభోగాలు అనుభవింప చేసి తొందరగా తరించగలిగే మరుజన్మను అనుగ్రహిస్తారు. మిగతా జీవితమంతా అమ్మవారి సన్నిధిలో ఆనందంగా గడిపిన సాధకుడి ప్రాణవాయువు మరణించిన తరువాత సహస్రారంపై ఉండే బ్రహ్మరంధ్రం గుండా బయటకు వెడుతుంది. ఇదే కపాలమోక్షం. బ్రహ్మరంధ్రాన్ని మాడు అంటారు. పుట్టిన...

ప్రాణం శిరస్సుపై నుంచి పోయేలా సాధన చేయాలి - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏 " సహస్రారాంబుజారూఢా " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్య నామాలలో 105 వ నామం. " సహస్రారాంబుజారూఢా " అంటే వెయ్యి దళముల పద్మములో కూర్చుని ఉంటారు అని భాష్యం చెప్పారు. శిరస్సు మీద బ్రహ్మరంధ్రం ఉంటుంది. దాని క్రింద ఉన్న వెయ్యి దళాల పద్మంలో అమ్మవారు కూర్చుని ఉంటారు. సాధనతో ఇక్కడకు చేరుకున్న జీవుడికి " నేను " అనే భావన పోతుంది. ఇక ముక్తే అంటే బ్రహ్మరంధ్రం గుండా పైకి పోయి ఆకాశంలో కలిసిపోవడమే. ఆకాశమే అమ్మవారు. ఇక్కడ ఓ అద్భుతమయిన విషయం ఉంది. శరీరం పంచభూతాల కలయిక. పంచభూతతత్త్వం.  తైత్తిరీయ ఉపనిషత్తు ఇలా తెలియ చేస్తూంది: " ఆకాశాత్ వాయుః,       వాయోరగ్నిః, అగ్నేరాపః,       అద్భ్యః పృధివీ " - 2:1:2              ‌  ‌  ఆకాశం నుండి వాయువు, వాయువు నుండి అగ్ని, అగ్ని నుండి జలము, జలము నుండి భూమి కలుగుతున్నాయి అని. శిరస్సుపై ఉన్న బ్రహ్మరంధ్రం గుండా శరీరంలోకి ప్రవేశించిన ప్రాణము రుద్రగ్రంధిలో ఆకాశ వాయు తత్త్వాలుగాను, విష్ణుగ్రంధిలో అగ్ని తత్త్వంగాను, బ్రహ్మ గ్రంధిలో జల పృథ్వీ తత్త్వాలు...

సాధన పూర్తి కాకపోయినా బాధపడనక్కరలేదు -చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏 " రుద్రగ్రంథి విభేదినీ " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్య నామాలలో 104 వ నామం. " రుద్రగ్రంథి విభేదినీ " అంటే రుద్ర ముడిని విప్పువారు అని భాష్యం చెప్పారు. కంఠంలో విశుద్ధిచక్రం ఉంటుంది. అది ఆకాశతత్త్వం. విష్ణుగ్రంధి విడివడిన తరువాత జీవుడిలోని వాయుతత్త్వం విశుద్ధిచక్రం లోని ఆకాశం ద్వారా ప్రయాణించి సాధనతో రుద్రగ్రంధిని ఛేదిస్తే బ్రహ్మరంధ్రంగుండా పైకి వెళ్ళి ఆకాశంలో కలుస్తుంది. అప్పుడు లోపలా బయటా ఆకాశమే. చిదానంద స్థితి. ఆజ్ఞాచక్రానికి చేరిన జీవుడికి మూడవ కన్ను తెరుచుకుంటుంది.  ఇక్కడ మనసు నిలిపి సాధన చేస్తే అమ్మవారు రుద్రగ్రంధిని భేదనము చేస్తారు. " నేను " అనే భావన తొలగి ముక్తికి మార్గం సుగమం అవుతుంది. విష్ణుగ్రంధి విడివడిన తరువాత సాధన శ్రద్ధగా కొనసాగిస్తే రుద్రగ్రంధి ఛేదనకు మూడు సంవత్సరాల సమయం పడుతుందని సాధకులు అనుభవంతో తెలియచేసారు.  సాధకులకు ఓ అద్భుతమయిన సందేహం కలుగుతుంది. మూడు ముడులు అంటే అడ్డంకులు తొలగడానికి కఠిన సాధన చేస్తేనే 18+6+3 - 21 సంవత్సరాలు పడుతుందని అనుభవజ్ఞులు చెబుతున్నారు కదా. మరి అంతకాలం సాధన సాధ్యమా. మధ...