పాపపు భవంతులకు పునాది అయిన లోభాన్ని పోగొడుతారు అమ్మవారు - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏


" లోభనాశినీ " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 171 వ నామం.

" లోభనాశినీ " అంటే లోభమును పోగొట్టునది. ఎవరిది?. భక్తులది, తనను నమ్ముకున్నవారిది.

" త్రివిధం నరకస్యేదం
  ద్వారం నాశనమాత్మనః,
  కామక్రోధః తధా లోభః
  తస్మాత్ యేతత్ త్రయం త్యజేత్ "
                               - భ.గీత 16:21

" కామక్రోధలోభాలు నరకద్వారాలు - కనుక వాటిని వదిలేయాలి " అని తెలియచేసారు పరమాత్మ గీతలో. ఈ దుర్గుణాలు అన్నీ నరకానికి తీసుకుని పోయేవే. జాగ్రత్తగా ఉండాలి.

వ్యాసర్షి మహాభారతంలో అసలు మనుషుల పాపాలకి ( కష్టాలకి ) మూలం " లోభము " అన్నారు:

" పాపశ్చతు యదధిష్టానం
  తత్ శృణుష్వ నరాధిపా,
  ఏకో లోభో మహాగ్రాహో
  లోభాత్ పాపం ప్రవర్తతే ".

లోభం అంటే కావాలనుకోవడం. అది అక్కడితో ఆగదు - తనకే కావాలనుకోవడం, ఇంకెవరికీ ఉండకూడదు, ద్రక్కకూడదు అనుకోవడం, అసూయ, కోపం, హింస అన్నీ ఒకటి తరువాత ఒకటి కలుస్తూంటాయి. అంటే పాపపు భవంతులకు " పునాది " లోభం అన్నారు.

అమ్మవారి పాదాలను ఆశ్రయిస్తే అన్ని కష్టాలు/పాపాలకు మూలమైన లోభాన్ని నశింపచేస్తారు. అంతకన్నా కావలసినది ఏముంటుంది.

అమ్మవారి పాదాలను ఆశ్రయించి లోభం మాయలో పడిపోకుండా అనుగ్రహించమని వేడుకుందాం.

ఏతత్ సర్వం శ్రీపరదేవతార్పణమస్తు - సూర్య.

శుభం భూయాత్ 

Comments

Popular posts from this blog

సీతమ్మతల్లికి సాటి ఎవరు? - చీమలపాటి సూర్యనారాయణ

అన్నదానం వల్ల ఎవరెవరికి పుణ్యం వస్తుంది - చీమలపాటి సూర్యనారాయణ

శ్రీసరస్వతీ దేవి పుట్టినరోజు నేడు,, శుభాకాంక్షలు అందరికీ - చీమలపాటి సూర్యనారాయణ