విషవృక్షం

ఎం అడ్మిషన్ కి లేక ఏదైనా పెద్ద కంపెనీ లో ఉద్యోగానికి వెళ్ళిన వాళ్ళకి గ్రూప్ డిస్కషన్స్ , విషయం ఇచ్చి 10 ని లు మాట్లాడమనడం  జరుగుతుంది - ఇది ఎలా ఉంటుందంటే 10 ని లలో 5 ని ఫర్  గాను 5 ని ఎగైనస్ట్ గాను  మాట్లాడాలంటారు - అంటే ప్రతీ విషయం లోనూ + , - ఉంటాయనడం లో  అనుమానమక్కరలేదు. " రాముడి " మీద కూడా మాట్లాడమనచ్చు. దీని కోసం రంగనాయకమ్మ గారి " రామాయణ విషవృక్షం " చదవక్కరలేదు - శ్రద్ధ పెట్టాలే కాని మనకే బోల్డన్ని పోయింట్స్ దొరుకుతాయి. ఈవిడ నవల " కూలిన గోడలు " 1968/69 లో అనుకుంటా చదివాను - ఎంత అద్భుత శైలి- కన్నీళ్ళు వస్తాయి కొన్ని చోట్ల - తరువాత స్వీట్  హోం సీరీస్. ఇలాంటి ఆవిడ " విషవృక్షం " ఎలా వ్రాయగలిగింది అని ఆశ్చర్యం వెయ్యకమానదు. కారణం చెప్పుకోవచ్చు. మన గ్రూప్ లో ఉన్న మిత్రులనే తీసుకుందాం - ఎవరికీ నాయకుడి మీద ప్రత్యేకమైన అభిమానం కాని ద్వేషం కాని ఉండడానికి ఆస్కారం లేదు ఎందుకంటే ఎవరికీ నాయకుల వల్ల డైరక్ట్ గా కాని ఇండైరక్ట్ కాని లాభం కాని నష్టం కాని నాకు తెలిసి జరిగి ఉండదు. అందరితో పాటు మనం. మరి ఎందుకు ఏదైనా పోస్ట్ చదివి రియాక్ట్ అయిపోతూంటారు. ఎందుకు ఏమిటి అని చెప్పలేము కాని ఒకళ్ళని చూస్తే ముద్దు పెట్టుకోబుద్ధి , ఇంకొకళ్ళని చూస్తే మొత్త బుద్ధి  - అది మానవ నైజం. విషయం లో కూడా ఎవరూ బయటపడరు. ఏమి జరుగుతుందంటే ఎవరో పార్టీ కార్యకర్త/ఏజెంట్ పోస్ట్ పెడతాడు - నాయకుడు అధికారం లోకి రాకపోతే దేశం మట్టికొట్టుకుపోతుందని - దేశం ఏమీ అయిపోదని అందరికీ తెలుసు, పోనీ నిజమే అనుకుందాం విక్రమార్కుడిలాగ 1000 ఏళ్ళు పాలిస్తాడా - 10 ఏళ్ళ తరువాతైనా  మట్టికొట్టుకుపోవలసిందేగా. పోస్ట్ ని ఇందాక మనం అనుకున్న " మానవ నైజం" కారణం గా అభిమాని ఫార్వర్డ్ చేస్తాడు - అదే " మానవ నైజం " కారణం గా నాయకుడంటే అభిమానం లేని వాడికి కాలుతుంది. కాలడం , పొగడ్త ఎంత ఎక్కువగా ఉంటే అంత ఎక్కువగా ఉంటుంది. వెంటనే రియాక్ట్ అయిపోతారు. వెంటనే లైకులు డిజ్లైకులు వచ్చేస్తాయి. వింత ఏమిటంటే వివేకానందుడు " చల్లదనం అని విడిగా ఏమీ ఉండదు , వేడి లేకపోవడాన్నే చల్లదనం అంటారు " అన్నట్లు ఒకరిమీద అభిమానం ఏమీ ఉండదు ఇంకొకతని మీద ద్వేషమే ఇతని  మీద అభిమానమవుతుంది. రంగనాయకమ్మ కూడా విశ్వనాధ సత్యనారాయణ గారి " రామాయణ కల్పవృక్షం " చదివే " విష వృక్షం " వ్రాసి ఉంటుందని  నాకనిపిస్తూంది - శుభం భూయాత్ 

Comments

Post a Comment

Popular posts from this blog

సీతమ్మతల్లికి సాటి ఎవరు? - చీమలపాటి సూర్యనారాయణ

అన్నదానం వల్ల ఎవరెవరికి పుణ్యం వస్తుంది - చీమలపాటి సూర్యనారాయణ

శ్రీసరస్వతీ దేవి పుట్టినరోజు నేడు,, శుభాకాంక్షలు అందరికీ - చీమలపాటి సూర్యనారాయణ