దేముడు పని ఏమి
ఓ రాజు గారికి ఓ సందేహం వచ్చింది - " దేవుడు ఎక్కడ ఉంటాడు, ఏ ప్రక్కకు చూస్తూంటాడు, ఎప్పుడూ ఏమి చేస్తూంటాడు " - అని. సరే చాటింపు వేయించాడు - ఎవరైనా చెప్పి అతన్ని ఒప్పిస్తే మంచి బహుమానం ఒప్పించలేకపోతే శిక్ష అని. శిక్ష ఉండడం తో ఎవరూ ముందరికి రావటం లేదు. ఓ బ్రాహ్మణుడి కి కొన్ని గోల్స్ ఉన్నాయి " మనకి " లాగానే. వచ్చాడు రాజ దర్బార్ కి - నేను చెబుతానంటే చెప్పమన్నాడు రాజు. ఈయన అన్నాడు " మీరు అడిగిన వారు, నేను చెప్పే వాణ్ణి , నేను మీకు గురువుని కదా , మీరు కూర్చోవడం నేను నిల్చోవడం బాగుండదు కదా " అని. వెంటనే రాజు ఈయన్ని సిం హాసనం మీద కూర్చోమని తను ఆయన ముందర నుంచున్నాడు " - సరే ఈయన " ఎక్కడున్నాడు " కి పాలలో నెయ్యి ఉన్నట్లుగా నీలోనూ ఉన్నాడు సాధించి శోధించాలి అని , ఓ దీపం ని వెలిగించి అది అన్ని దిక్కులా చూసినట్లు దేవుడు అన్ని వేపులా చూస్తాడు అని చెప్పాడు. ఇప్పుడు ముఖ్యమైనది " దేవుడు ఏమి చేస్తూంటాడు " అని - ఈయన అన్నాడు " మీరు మహారాజులు నేను అతి సామాన్యుణ్ణి - నన్ను మీ సిం హాసనం లో కూర్చోపెట్టి నా ముందర మిమ్మల్ని నుంచోపెట్టాడు - దేవుడు ఆయన పిల్లలతో ఇలా ఆటాడుకుంటూ ఆనందిస్తాడు " అని.
జనతా ప్రభుత్వం వచ్చినప్పుడు వేసుకున్న జోక్ ఏమిటంటే " ఆవు దూడా కూడా ఓడిపోయాయి " అని (అప్పుడు కాంగ్రెస్ గుర్తు అది ) - పి వి నరసిం హరావు గారు నాకు ఇంక రాజకీయాలు వద్దని తప్పుకున్నాడు, కంటెష్ట్ చెయ్యలేదు " ఏమిటి ఈ వేళాకోళం " అని ఆయన్ని పి ఎం సీట్లో కూర్చోపెట్టించేడు. మన్మోహన్ సింగ్ గురించి చెప్పుకోనే అక్కరలేదు - అందరూ ఆ దేవుడి పిల్లలే - అందుకనే ఒకరిని పైకి ఇంకొకరిని కిందకి లాగుతూ ఆటాడుకుంటూ ఉంటాడు - కాని మనం అతను ఎలా ఓడిపోయాడు ఇతను ఎలా నెగ్గాడు అని ఆశ్చర్య పోతూంటాం - అంతా విష్ణుమాయ - శుభం భూయాత్

Comments
Post a Comment