మరక మంచిదే

నేను ఓ బ్రాంచ్ లో మేనేజర్ గా చేరిన 2,3 నెలలకి గోదావరికి ఉధృతం గా వరదలొచ్చాయి - ప్రక్క గ్రామాలలోకి కూడా బ్యాక్ వాటర్ వచ్చేసింది. లంక గ్రామాలన్నీ మునిగిపోయాయి - 2 రోజుల తరువాత కొంచెం తగ్గుముఖం పట్టేక ఇద్దరు స్టాఫ్ తో కలిసి ఓ పడవ మీద లంక గ్రామాలలోకి వెళ్ళాను - తమలపాకు తోటలు , కూరగాయల తోటలు మునిగిపోయాయి, ఇళ్ళలోకి నీళ్ళు , అరుగుల మీద బిక్కు బిక్కు మంటూ ప్రజలు - అయ్యో పాపం అనిపించింది గోదావరి జిల్లాలో  అదీ కోనసీమ లో పుట్టి పెరిగిన నాకే. తిరిగి రాగానే ఓ పెద్దాయన ఇంటికి వెళ్ళాం, ఓ 75 ఏళ్ళు  ఉంటాయి ఆయనకి , అందరికీ తలలో నాలుకలా ఉంటారంటారు. " ఏమండీ వరద  పరిస్థితి దారుణం గా ఉంది - తలో చెయ్యి వేస్తే నయమేమో మా ఆర్ ఎం గారి తో కూడా మాట్లాడుతాను , మీ అభిప్రాయం ఏమిటి " అని అడిగాను. ఆయన నా వేపు " అదోలా " చూసి - మరీ సెంటిమెంట్ ఫీల్ అయిపోయి కన్నీళ్ళు పెట్టేసుకోకండి , 4  ఏళ్ళకొకసారైనా ఇలా వరదలొచ్చి  మొత్తం కొట్టుకుపోకపోతే వీళ్ళని పట్టుకోగలమాండీ  , భూమ్మీద  నుంచోరు వీళ్ళు  , అందుకని ఎమోషనలవక ఇంటికి పోయి వేడన్నం తిని హాయిగా పడుకోండి " అన్నారు ఆ పెద్దాయన - జీవితాన్ని కాచి వడపోసి ఉంటారు.మేము మొహామొహాలు చూసుకుని , ఆయన ఇచ్చిన కాఫీ తాగి సెలవు  తీసుకున్నాం.
అందుకని ఆంధ్రా వాళ్ళకి వాళ్ళని ఎలా రక్షించుకోవాలో ఎలా " బాగు " చేసుకోవాలో బాగా తెలుసు కనుక ఎలక్షన్ రిజల్ట్స్ చూసి మనం ఎమోషనల్ అయిపోవడం , ఫీల్ అయిపోయిపోవడం ,  మన ఆరోగ్యాలు పాడు చేసుకోవడం చేయనక్కరలేదు - 4 రోజులు పోతే అదే  అలవాటైపోతుంది - ఓం తత్ సత్   

Comments

Popular posts from this blog

సీతమ్మతల్లికి సాటి ఎవరు? - చీమలపాటి సూర్యనారాయణ

అన్నదానం వల్ల ఎవరెవరికి పుణ్యం వస్తుంది - చీమలపాటి సూర్యనారాయణ

శ్రీసరస్వతీ దేవి పుట్టినరోజు నేడు,, శుభాకాంక్షలు అందరికీ - చీమలపాటి సూర్యనారాయణ