ప్లానింగ్
పేకాట ఆడే ఆయన డబ్బుని దానధర్మాలు చెయ్యడానికి కాదు కదా పేకాట లో కూర్చునేది - తన కి ఎడమప్రక్క ఎవడొస్తాడో తెలియదు, ఆట ఆడతాడో డ్రాప్ వేస్తాడో తెలియదు - ఈయన ఆట అయిపోయేలా చేసే 3 విడి ముక్కలు ప్రక్కాయన దగ్గిరున్నాయి అనుకుందాం - ఈయన హేండ్ రైజ్ అయితే ప్రక్కాయన 2 జోకర్లు ఉన్నాయి కనుక 2 రౌండ్స్ చూద్దామని ఆడచ్చు, ఈయన హేండ్ డౌన్ అయితే ఎందుకొచ్చిన గొడవని డ్రాప్ చేయవచ్చు. ఆట ఆడేవాళ్ళందరికీ వాళ్ళ వాళ్ళ చక్కటి ప్లాన్ లు ఉంటాయి - మరి అందరూ ఎలా నెగ్గుతారు, చక్కటి ప్లాన్ ఉన్నా హేండ్ రైజ్ తోడవ్వాలి.
మొహమ్మద్ గజనీ , ఘోరీ , బ్రిటిషర్స్ అందరూ చక్కటి ప్లాన్లు వేసుకునే వచ్చారు - వాళ్ళ భక్తులకి అవి చక్కటి ప్లాన్లు గా అనిపిస్తాయి కాని మనకి అవి కుట్రలు , దాడి గా అనిపిస్తాయి - అంతెందుకు పుల్మా దాడి చూస్తే ఉగ్రవాదులు ఎంతో చక్కటి ప్లాన్ తో దాడి చేసి సక్సెస్ అయేరని వాళ్ళని మెచ్చుకుంటామా మనం , కాని వాళ్ళ భక్తులు గొప్పగా నలుగురికీ చెప్పుకుంటారని అనుకోవచ్చు. చక్కటి ప్లాన్ తో వెడుతున్నామనుకుని కమ్యూనిష్టులు జ్యోతిబసుకు పి ఎం పదవి ని వద్దన్నారు , తరువాత తెలుసుకున్నారు వారు చేసింది చారిత్రాత్మిక తప్పిదం అని . ప్రస్తుతం " చక్కటి ప్లానింగ్ " అనుకునే భక్తులకి అది సరయినదా కాదా ( దేశానికి , ప్రజలకి ) అనేది కాలం తెలియచేస్తుంది - ఓం తత్ సత్
Comments
Post a Comment