" చదువుకున్న వాడికన్నా మడేలన్న మేలు
" చదువుకున్న వాడికన్నా మడేలన్న మేలు " అని సామెత ( సామెత అని గ్రహించవలెను) - నేను ఎస్ ఎస్ ఎల్ సి లో ఉండగా మా హెడ్ మాస్టర్ మా చేత " స్వచ్ఛ భారత్ " చేయించారు - స్కూల్ చుట్టూ ముళ్ళ మొక్కలుండేవి - అప్పుడు ఎవరికీ చెప్పులూ అవీ ఉండేవి కాదు ముళ్ళు గుచ్చుకుంటూ ఉండేవి. పూర్తిగా శుభ్రం చేసాక సాయంత్రం మమ్మల్ని ఉద్దేశించి మాట్లాడుతూ చదువే ముఖ్యం కాదు అంటూ ఓ కధ చెప్పారు - ఓ మానసిక వికలాంగుల ఆసుపత్రి ఉంది - ఓ ఆగస్ట్ 15 న రోగులకి మంత్రిగారి చేత స్వీట్స్ పళ్ళు ఇప్పిద్దామనుకున్నారు డాక్టర్లూ , సిబ్బంది. మంత్రి గారు వచ్చి రోగులనుద్దేశించి మాట్లాడడం మొదలెట్టారు - ఆయన ముందరున్న చిన్న బల్లమీద ఉన్న పేపర్లు ఎగిరిపోకుండా చిన్న కంకర రాయి ముక్క పెట్టారు - ఎదర కూర్చున్న ఓ రోగి ( అన్యధా భావించవలదు వాడుక మాటే ) ఆ రాయిని మింగేసాడు , గుండెలు ఝల్లు మన్నాయి మంత్రి గారికి డాక్టర్లకి. బయటకు లాగడానికి ట్రై చేసారు కుదరలేదు , ఆపరేషన్ చెయ్యాలి వెంటనే లేకపోతే చచ్చిపోతాడు అని హడావిడి పడుతున్నారు. ఈ రోగి ప్రక్కనే ఇంకో రోగి కూర్చుని ఉన్నాడు. వాడికి వీళ్ళ హడావిడి చూసి చిర్రెత్తుకొచ్చింది. " ఈ వెధవ ( మొదటి రోగి ) ఎప్పుడూ ఓవర్ ఏక్షనే ఎప్పుడూ వెధవ వేషాలేస్తూంటాడు " అని అరుస్తూ మొదటి వాడి మెడ వంచి మెడ మీద ఒక్క గుద్దు గుద్దేటప్పటికి ఆ రాయి క్రింద పడిపోయింది, అందరూ ఊపిరి పీల్చుకున్నారు ముఖ్యం గా మంత్రి గారు డాక్టర్లూను - ఇప్పుడు ఈ రెండో పిచ్చివాడికి సన్మానం చెయ్యాలా , అది మీరే నిర్ణయించుకోండి " అని ముగించారు - ఆ నిర్ణయం అప్పుడు మా వంతు , ఇప్పుడు మన వంతు - శుభం భూయాత్
Comments
Post a Comment