Conversation with a friend
మా ఎం ఎస్ సి ఏ యు బేచ్ గ్రూప్ ఉంది - ఓ మిత్రుడు ఆ కాలం లో కమ్యూనిష్ట్( అతనే అన్నాడు లెండి సైన్స్ కాలేజ్ ప్రెసిడెంట్ ఎలక్షన్ టైం లో ) ఇప్పుడు అమ్మవారి భక్తుడు ( మొన్న గెట్ టుగెదర్ లో చెప్పాడు) - మనిషి మంచివాడు. మొన్న అన్నాడు " మిత్రమా నీ పోష్ట్స్ చాలా ఆధ్యాత్మికం గానూ ఆహ్లాదకరంగా ఉంటాయి కాని కొంచెం వ్యంగ్యం గా అనిపిస్తాయి పైగా నీకు మోడీ అంటే నచ్చనట్లుగా అనిపించింది " అని. నేనన్నాను నాకు ఆయన నచ్చడని ఎక్కడైనా వ్రాసానా అని. మన సంస్కృతి చెప్పింది ఏమిటంటే " మనిషిని ద్వేషించకు, అతని భావాన్ని అవసరమైతే ద్వేషించు - మంచి విషయం చెప్పాడు అభినందించు, చెడ్డగా మాట్లాడాడు ఖండించు - అంతే అంతటితో ఆ విషయం సరి ". పెద్దాయన మాటిచ్చిన ఆయన చెయ్యగలిగిన చిన్న చిన్న పనులు కూడా చెయ్యనప్పుడు ఖండించడం లో తప్పేముంది - అది కూడా ఆయన నిష్క్రియాపర్వాన్నే సుమా అనడం జరిగింది. అతనన్నాడు అవినీతి లేకుండా పాలిస్తున్నాడు కదా అన్నాడు. దానిలో కూడా ఆయన ఫెయిల్ అయినట్లే అన్నాను. ద్రౌపది ని అవమానించింది ఎవరు - దుర్యోధనుడు దుశ్శాశనుడు - మరి కృష్ణుడు - భీష్ముణ్ణి ద్రోణుణ్ణి కృపాచార్యులని - ఎందుకు చంపించాడు - ఎందుకంటే ఆ తప్పుని వీళ్ళందరూ అక్కడే ఉండి చూస్తూ ఊరుకున్నారు కనుక - మరి అవినీతి ఆరోపణలున్నవాళ్ళతో కౌగిలింతలు, షేక్ హేండులు , క్లోజ్డ్ డోర్ మీటింగులేమిటండీ - అంటే దారి తప్పినట్లేగా అధికారం కోసం - ఇవన్నీ చూస్తూ సదభిప్రాయం ఏర్పర్చుకోవడమెలాగ మిత్రమా " అంటే , అందుకే నీతో డైరెక్టుగా మాట్లాడి క్లారిఫై చేసుకుందామని అభిప్రాయపడ్డాను " అన్నాడు. " ఎప్పుడూ మిత్రుల మధ్య అదే ఉత్తమ మార్గం అపోహలు తొలగించుకోవడానికి " అని నేను అన్నాను.
సర్వే జనాః సుఖినో భవంతు
శుభమస్తు
Comments
Post a Comment