కొద్దిగా దోషం ఉన్నట్లు కనబడినా స్వధర్మమే మేలు, పరధర్మం ఏమీ ఎక్కువ మేలు చేయదు

 🙏" శ్రీరస్తు శుభమస్తు "🙏

" శ్రేయాన్ స్వధర్మో విగుణః 

           పరధర్మాత్ స్వనుష్ఠితాత్,

   స్వభావనియతం కర్మ 

           కుర్వన్నాప్నోతి కిల్బిషం " 

                           -  భ.గీత 18:47

" బాగుగా ఆచరించబడిన పరధర్మంకంటే గుణరహితమైన స్వధర్మాచరణమే మంచిది/శ్రేష్ఠమయినది. స్వధర్మరూప వర్ణాశ్రమ ధర్మములను అనుసరించి కర్మలను ఆచరించు మనుష్యులకు ఎట్టిపాపములును ఏమాత్రమూ అంటవు ".

ఎలా అనిపించినా  స్వధర్మమే ఉత్తమమని చెప్పారు పరమాత్మ. 

వైద్యుడు అత్యవసరమయితే ప్రాణానికే ముప్పు అయినప్పుడు కాలో చెయ్యో తొలగిస్తాడు. అంతేకాని " అయ్యోపాపం " అని ఊరుకోడు. అది వృత్తిధర్మం.

ఒక విషయం చూద్దాం. ఒకాయన మాంసంకొట్టు నిర్వహిస్తున్నాడు. ఎన్నో దశాబ్దాలుగా ఆయన కుటుంబీకులు దానిని నిర్వహిస్తున్నారు. స్వామి చెప్పినది అదేమీ జీవహింస క్రిందకూరాదు, అతనికి పాపమూ అంటదు అని. 

ఆ కొట్టుముందర బ్రతికున్న ప్రాణులను వ్రేలాడదీసి ఉంచుతాడు. ఒకాయన వచ్చి ఓ ప్రాణిని చూపిస్తాడు.

కొందరికి అనిపిస్తుంది " అలా వ్రేలాడదీయడమేమిటి, ఒకతను వచ్చి దానిని కొనడమేమిటి " అని. కొందరు సున్నితమనస్కులకి వెగటుగా కూడా అనిపించి " అయ్యో పాపం " అని బాధపడతారు కూడా.

ఇక్కడ ఒక ముఖ్యవిషయం గమనించాలి. అసలు ఆ జీవికి అంత భయంకరమైన మరణం ఎలా సంభవిస్తూంది అని. 

" ప్రారబ్దం భోగతో నశ్యేత్ " అని చెబుతూంది శాస్త్రం. ఏ పుణ్యమయినా పాపమయినా అనుభవిస్తేనే తరుగుతుంది అని. మరి అంత భయంకర మరణం పొందుతూందంటే ఎంత పాపం చేసి/ప్రోగుపడి ఉండాలి. ఆ పాపఫలితమే ఇప్పుడు ఈరకంగా అనుభవిస్తూంది అని అనుకుంటే జాలివేస్తుంది కాని ఎలాంటి వికారమూ కలగదు. ఎవరినైనా స్వలాభంకోసం చంపాలనుకున్నప్పుడు ఈ జీవి జ్ఞానపకానికి వచ్చి జాగ్రత్తపడే అవకాసం ఉంది, అంత సులభం కాకపోయినా.

నేడు " భానుసప్తమి " - దుర్లభయోగం. పైగా ఈరోజు పవిత్రమయిన మాఘపాదివారం. ఆరోగ్యప్రదాత భాస్కరుడిని అందరికీ ఆరోగ్యాన్ని ప్రసాదించమని కోరుకుందాం.

ఏతత్ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు - సూర్య.

శుభం భూయాత్

Comments

Popular posts from this blog

సీతమ్మతల్లికి సాటి ఎవరు? - చీమలపాటి సూర్యనారాయణ

అన్నదానం వల్ల ఎవరెవరికి పుణ్యం వస్తుంది - చీమలపాటి సూర్యనారాయణ

శ్రీసరస్వతీ దేవి పుట్టినరోజు నేడు,, శుభాకాంక్షలు అందరికీ - చీమలపాటి సూర్యనారాయణ