అణుబాంబు1944
🙏" శ్రీరస్తు శుభమస్తు "🙏
ఈరోజు 1944లో తయారుచేయబడిన " అణుబాంబు " సమయంలో జరిగిన కొన్ని వింతలు తెలుసుకుందాం.
" తదేజతి తన్నైజతి తద్దూరే
తద్వంతికే,
తదంతరస్య సర్వస్యతదు
సర్వస్యాస్య బాహ్యతః "
ఉపనిషద్ మంత్రం ఇది, శంకరుడిని స్తుతిస్తూ ( చిజ్జడక్రాంతి - చిత్ చైతన్యం + జడం చైతన్యంలేని - ని వర్ణిస్తూ, క్రాంతి అంటే ముడి ). దీని అర్ధం " కదులుతూ ఉంటుంది, కదలదు. దూరంగా ఉంటుంది, అదే దగ్గరగా ఉంటుంది. అన్నిటిలోపలా ఉంటుంది, అన్నిటి బయటా ఉంటుంది " అని.
1944 లో మన్హట్టన్ " అణుబాంబు " ప్రోజెక్టులో " ఓపెన్ హైమర్ " అనే అణుశాస్త్రవేత్త ఒక భాగస్వామి. ఈయనని " అణుబాంబు పిత " అంటారు. అణుబాంబును పరీక్షించినప్పుడు ఆయన తెలుసుకున్న " అణువు " లక్షణాలు పై మంత్రంలోలా ఉన్నాయని ఆశ్చర్యపోవడం జరిగింది.
1930లో అమెరికాలోని బర్కిలీలో ఉపాధ్యాయవృత్తిలో ఉన్నప్పుడు ఈ హైమర్ ఆసక్తివల్ల సంస్కృతం నేర్చుకుని భగవద్గీతని పూర్తిగా చదివారు.
1944లో ఎడారిలో అణుబాంబు పరీక్ష జరిగినప్పుడు హైమర్ ని " మీ అభిప్రాయం చెప్పండి " అన్నప్పుడు " విస్ఫోటనం చూసి కొంతమంది నవ్వారు, కొంతమంది బాధపడ్డారు, కొంతమంది మౌనంగా ఉండిపోయారు " అన్నారు. ఇక్కడ గుర్తుకొస్తూన్న భ.గీతలోని శ్లోకం:
" త్రిభిర్గుణమయైర్భావైరేభిః
సర్వమిదం జగత్ .."
- భ.గీత 7:13
" 3 గుణాలప్రభావంతో వ్యామోహంలోపడి నన్ను తెలుసుకోలేకపోతున్నారు " అన్నారు పరమాత్మ. ఒకవిషయం మంచిదా చెడుదా అని అందరూ ఒకేవిధంగా చెప్పలేకపోవడమే మిధ్య/మాయ.
బాధపడుతున్నారా అంటే " Now I am become death, the destroyer of worlds " అన్నారు. ఈమాటలు భ.గీతలోని క్రింది శ్లోకం ని ఉదహరిస్తూ అన్నట్లుగా విశ్లేషకులు భావించారు:
" కాలో2స్మి లోకక్షయకృత్ప్రవృద్ధో
లోకాన్ సమాహర్తుమిహ ప్రవృత్తః"
- భ.గీత 11:32
" నేను లోకసంహారకుడనై ( the destroyer of worlds ) విజృంభించిన కాలుడనై ఉన్నాను " అన్నారు పరమాత్మ.
" ఓ యుద్ధవీరుడిగా ( అర్జునుడిలా - పరమాత్మ ఆదేశించినట్లుగా ) నా ధర్మాన్ని నేను నెరవేర్చాను " అని అన్నారు హైమర్.
విస్ఫోటనం ఎలా ఉంది అంటే :
" వెయ్యిసూర్యులు ఒకేసారి ఆకాశంలో ఉదయిస్తే ఎలా ఉంటుందో అలా అనిపించింది " అని అన్నారు హైమర్. ఆయన అన్నది దేనిని జ్ఞాపకానికి తెస్తూందంటే:
" దివి సూర్యసహస్రస్య
భవేద్యుగపదుత్థితా "
- భ.గీత 11:12
ఆకాశమునందు వెయ్యిసూర్యులు ఒకేసారి ఉదయించినట్లున్నారుట పరమాత్మ విశ్వరూపంలో.
ఆయన హిందువునని నేరుగా చెప్పకపోయినా హిందూత్వాన్ని ( ముఖ్యంగా భగవద్గీతను ) ఎక్కువగా ఇష్టపడి ఆనందించారని విశ్లేషకుల అభిప్రాయం.
" మతం " అంటే అభిప్రాయం అని అర్ధం. మన సనాతనధర్మం అందరికీ సమ్మతమైనవే తెలియచేసింది, అందుకే అది నిత్యనూతనం.
ఈరోజు పరమపవిత్రమయిన ముక్కోటి ఏకాదశి/ వైకుంఠ ఏకాదశి. అందరికీ సుఖమయజీవితాన్ని ప్రసాదించమని పరమాత్మని కోరుకుందాం - సూర్య.
ఏతత్ సర్వం శ్రీపరమాత్మార్పణమస్తు.
శుభం భూయాత్
Comments
Post a Comment