పండితరాజ 4

క్రమశిక్షణ గురించి పండితరాయలు ఇంకో అద్భుతవిషయం చెప్పారు.

కుండ కి ఒక పరిమాణం (సైజ్) ఉంటుంది. నదిదగ్గరకు తీసుకెళ్ళినా సముద్రం దగ్గరకు తీసుకెళ్ళినా దానిలో పట్టే నీళ్ళనే తెచ్చుకోవచ్చు.

కుండ కొడుకు కుండే అవుతాడు. కాని మా తండ్రిగారు ( కుండ ) అమలుపరిచిన క్రమశిక్షణ, మహాగురువుగా నాకు నేర్పిన విద్య నన్ను " కుంభసంభవుడు " గా చేసాయి.

అగస్త్యుడు కూడా కుంభసంభవుడే. ఈ అగస్త్యుడు మొత్తం సముద్రాన్ని 3 పురుషిళ్ళతో ( గుటకలు )త్రాగేసాడు. అంటే కొద్ది నీళ్ళతో సరిపెట్టుకోకుండా మొత్తం సముద్రాన్నే త్రాగగలిగే విద్వత్తుతో నన్ను మాతండ్రి ఇచ్చిన క్రమశిక్షణ, విద్య తీర్చిదిద్దాయి అని. 

ఎంత అద్భుత అలంకారం. అందుకే ఆయన వ్రాసిన అలంకారకావ్యం " రసగంగాధరం " అంత పేరుగడించింది.

శుభం భూయాత్

Comments

Popular posts from this blog

సీతమ్మతల్లికి సాటి ఎవరు? - చీమలపాటి సూర్యనారాయణ

అన్నదానం వల్ల ఎవరెవరికి పుణ్యం వస్తుంది - చీమలపాటి సూర్యనారాయణ

శ్రీసరస్వతీ దేవి పుట్టినరోజు నేడు,, శుభాకాంక్షలు అందరికీ - చీమలపాటి సూర్యనారాయణ