బంగారులేడి
🙏 " శ్రీరస్తు శుభమస్తు " 🙏
" న నిర్మితో వై నచ దృష్ట పూర్వో
న శ్రూయతే హేమ మయం
కురంగ:
తథా2పి తృష్ణా రఘు నందనస్య
వినాశ కాలే విపరీత బుద్ధి: "
" బంగారు లేడి ఉన్నదని ఎన్నడయినా విన్నామా ? ఎప్పుడయినా ఎక్కడయినా చూసామా ? అయినప్పటికీ రాముడు తన చెలి కోరిందని ముందు వెనుకలు యోచించ కుండా బంగారు లేడిని తెస్తానని వెళ్ళాడు. వినాశ కాలం దాపురించిన నాడు ఇలాంటి విపరీత బుద్ధులే పుడుతూ ఉంటాయి. చెడ్డ కాలం వచ్చి నప్పుడు తర్కం పని చెయ్యదు. బుద్ధి మందగిస్తుంది.
మనమిత్రుడు " నిజమేనండి, నేనంత తెలివైనవాడిని కాదు " అన్నారు.
అసలు తెలివితేటలు అంటే ఏమిటి. ఎవరికన్నా తక్కువ, ఎవరికన్నా ఎక్కువ.
సృష్టిలో అన్నీ తమతమ పనులు చేసుకుంటూ జీవిస్తున్నాయిగా.
రాముడు వాలిని చంపగానే సుగ్రీవుడు మొ.గువారు అందరూ " అహా ఏమి తెలివితేటలు " అనుకున్నారు. సుగ్రీవుడు, హనుమ అందరూ శూరులేకదా, పర్వతం మీద దాక్కున్నారు. హనుమ రావణుడితో సభలో " వాలిగురించి తెలుసుగా, రాముడు అతన్ని ఎలా చంపాడో కూడా వినే ఉంటావు " అన్నారు. ఇక్కడ శూరత్వం కాదు, తెలివితేటల గురించే.
సీతజాడ తెలియగానే అందరూ ఉత్సాహంతో దక్షిణంవైపు ప్రయాణం మొదలెట్టి సముద్రతీరానికి చేరారు. రాముడు డీలాపడిపోయాడు. సముద్రపు అంచు కనబడటమేలేదు, దీనిని దాటడం ఎలా అని. సుగ్రీవుడు అంటాడు " నేను, జాంబవంతుడు, అంగదుడు, నీలుడు తో సహా ఎందరో వీరులు ఉన్నారు, అందరం సముద్రాన్ని అవలీలగా దాటేస్తాం. అవసరమయితే వారధి కడదాం అని. అప్పటికి రాముడి మనస్సు కుదుటపడుతుంది. ఇక్కడ సుగ్రీవుడు రాముడుకన్నా తెలివైనవాడంటే అందరూ ఒప్పుకోకపోవచ్చు.
అలాగ తెలివితేటలు ఎవరికీ సొంతంకావు. కాలం కలసివస్తే " అహా, ఓహో, ఎన్ని తెలివితేటలు " అంటారు. కలసిరాకపోతే " పాపం " అనుకుంటారు - సూర్య.
శుభం భూయాత్
Comments
Post a Comment