పండితరాజ 9
🙏" శ్రీరస్తు శుభమస్తు "🙏
" దిగంతే శ్రూయంతే
మదమలినగండాః కరటినః,
కరిణ్యః కారుణ్యా2స్పద
మనమశీలాః ఖలు మృగాః,
ఇదానీంలోకే2స్మిన్ననుపమ
శిఖానాం పునరయం,
నఖాణాం పాండిత్యం
ప్రకటయత్య కస్మిన్మృగపతిః "
" మృగరాజు అనిపించుకున్న సింహం తన వాడిగోళ్ళ పాండితిని ప్రదర్శించుటకు సరిపడిన దిగ్గజాలు తనకు అందుబాటులో లేకపోవటం చేతను, లేళ్ళు మొదలగునవి ఉజ్జీగా తనకు సరిపడకపోవటం చేతను తన వాడిగోళ్ళ పాండితిని ప్రదర్శించుటకు తగిన ఉజ్జీ లేదని బాధపడుతూంది " అని.
మాగ్రామవాసి, బంధువు పండితరాజ జగన్నాధరాయలు ( 17వ శతాబ్దం ) వ్రాసిన ఈ శ్లోకం చదివిన పండితులు, విమర్శకులు ఈ శ్లోకం గురించి అభిప్రాయపడినది " ఏకసంథాగ్రాహి అవడంవలన తన 16 ఏళ్ళకే వేదవేదాంగాలను, శాస్త్రాలను, మీమాంస, వ్యాకరణాదులను ఔపాసన పట్టేయడం వలన తన పాండిత్యప్రకటనకు సరైన ఉజ్జీలేదే అని విచారిస్తూ వ్రాసినది అయి ఉంటుంది " అని.
ఈయన వాదనలోకి దిగినప్పుడు పండితులు ఉక్కిరిబిక్కిరయి మౌనం వహించేవారుట. వారిలో ఆ కాలంలో కాశీలో ముఖ్యపండితులయిన " అప్పయ్యదీక్షితులు, భట్టోజీదీక్షితులు " కూడా ఉన్నారని తెలుస్తూంది.
శ్రీ సవాయీ జయసింహమహారాజు తనయొక్క తనలాంటి మహారాజులయొక్క పరువు కాపాడినందులకు ఈ " బాలపండితుడి " ని తన జయపురం రాజ్యానికి తీసుకునివెళ్ళి కనకాభిషేకం చేసి " కవిసార్వభౌమ " అనే బిరుదుతో గౌరవించి తనకు కాశీలో ఉన్న సంస్కృతకళాశాలకు ముఖ్యాధికారిగా నియమించుకున్నారు.
" స్పర్ధయా వర్ధతే విద్యా " అని శాస్త్రోక్తం. స్పర్ధతో అద్భుత కావ్యాలు పుడతాయి. నలుగురు కూర్చుని ఆలోచనచేస్తే మంచి నిర్ణయాలు వస్తాయి అంటారు అందుకే.
ఏతత్ సర్వం శ్రీపరదేవతార్పణమస్తు - సూర్య.
శుభం భూయాత్
Comments
Post a Comment