పండితరాజ 5

 🙏" శ్రీరస్తు శుభమస్తు "🙏

" గురుర్భ్రహ్మః గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః, 

  గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మైశ్రీ గురవేనమః " 

గురువును ఎలా గౌరవించాలో తెలియచేసింది మన సనాతనధర్మం.

" పండితరాజ " జగన్నాధపండితులు ( 17వ శతాబ్దం ) రచించిన " రసగంగాధరం " గ్రంధంపై 400 సం లు అయినా ఎవరూ " ఖండన " చెయ్యలేదు. అది అంతటి అద్భుతగ్రంధం అని వ్రాయడం జరిగింది. వ్యాకరణశాస్త్రాన్ని " శ్రీపాణిని " వ్రాసారు. ఈ రసగంగాధరం చదువుతే పాణిని వ్యాకరణశాస్త్రంతో పని ఉండదని పండితుల అభిప్రాయం. 

ఏ గ్రంధమైనా అందరికీ నచ్చాలని లేదు, కొందరికి అభ్యంతరకరంగా కూడా అనిపించవచ్చు. వారు " ఖండన " చేస్తారు. అది ఒక గ్రంధరూపంలో కూడా రావచ్చు. ఉదా: విశ్వనాధ సత్యనారాయణ గారు " శ్రీమద్రామాయణ కల్పవృక్షం " అనే గ్రంధం వ్రాసారు. దానికి " ఖండన " గా ముప్పాళ రంగనాయకమ్మ గారు " రామాయణ విషవృక్షం " వ్రాసారని అనుకోవచ్చు.

జగన్నాధ పండితులు ఒక " ఖండన " గ్రంధం వ్రాసారు. దానికి " మనోరమా కుచమర్దనం " అని పేరు పెట్టారు. ఆశ్చర్యం కలగవచ్చు, అంతటి మహాపండితుడు అటువంటి పేరు పెట్టారేమిటి అని.

విషయం చూద్దాం. శ్రీ భట్టోజీ దీక్షితులు అని ఒక పండితుడు ఉండేవారు మరాఠాలో. ఆయన గురువు శ్రీకృష్ణపండితుడు. ఈ గురువుగారు జగన్నాధపండితుల గురువు శ్రీశేషవీరేశ్వరపండితులకు తండ్రి. 

భట్టోజీ మహాపండితుడు. భట్టోజీ " పాణిని " వ్యాకరణాన్ని సామాన్యులకు కూడా అర్ధమయేలా " వ్యాకరణ సిద్ధాంత కౌముది " ని వ్రాసారు. దీనికి కొనసాగింపుగా " మనోరమా " అనే గ్రంధాన్ని వ్రాసారు.

భట్టోజీ గారు ఈ " మనోరమా " వ్యాకరణగ్రంధం లో తన గురువు శ్రీకృష్ణపండితుడు గారిని, ఆయన గురుమతాన్ని కించపరుస్తూ కొన్ని వ్యాఖ్యలు చేసారు. కించపరచడం అంటే ఇప్పట్లా " నీ అమ్మమొగుడు " లాంటి తిట్లతోకాదు. గురువు అనుసరించే విధానాన్ని తప్పుపట్టడం. ఉదా: కుమరిలభట్టు/మందనమిశ్ర కర్మకాండ, ఆదిశంకరులు జ్ఞానకాండ గొప్పదనేవారు. ఎవరి విధానం వారిది.

అది జగన్నాధపండితులను బాధించింది. గురువు తండ్రి " పరమగురువు " అవుతారు, అటువంటి తన పరమగురువును, ఆయన గురువును కించపరచడం వలన ఆయన్ని " గురుద్రోహి " గా తలచి ఆయన " మనోరమా " గ్రంధానికి " ఖండన " గా ఈ " మనోరమా కుచమర్దనం " అనే గ్రంధాన్ని రచించి తన " పరమగురువు " ఋణాన్ని తీర్చుకున్నారనుకోవాలి. ఇటువంటి పేరు పెట్టడంతోటే ఆయన ఎంత బాధపడి ఉంటారో తెలుస్తూంది. అంతటి సనాతన ధర్ముడు కనుకే అంతటి గొప్పపేరు తెచ్చుకున్నారు.

ఎందరో మహానుభావులు, అందరికీ " 🙏 ".

ఏతత్ సర్వం శ్రీపరదేవతార్పణమస్తు - సూర్య.

శుభం భూయాత్

Comments

Popular posts from this blog

సీతమ్మతల్లికి సాటి ఎవరు? - చీమలపాటి సూర్యనారాయణ

అన్నదానం వల్ల ఎవరెవరికి పుణ్యం వస్తుంది - చీమలపాటి సూర్యనారాయణ

శ్రీసరస్వతీ దేవి పుట్టినరోజు నేడు,, శుభాకాంక్షలు అందరికీ - చీమలపాటి సూర్యనారాయణ