వైదికవిజ్ఞానం

 🙏 " శ్రీరస్తు శుభమస్తు " 🙏

వైదికవిజ్ఞానం, మహాభారతం, రామాయణం మొ.గునవి మహాసముద్రాలు. శ్రద్ధగా లోపలికి వెళ్ళేకొలదీ ముత్యాలు అపురూపమైన శంఖాలు లాంటి విలువైనవి దొరుకుతాయి. ఒడ్డున కూర్చుని చూస్తూంటే ఏమి ఒరుగుతుంది, గుల్లలు ఏరుకోవడం జరుగుతుంది తప్ప. మన సంస్కృతి/విజ్ఞానం గురించి మాట్లాడడం ఒడ్డునకూర్చుని సంపాదించే " మిడిమిడిజ్ఞానం " తోనే. 

జీవితాంతం కష్టపడితే ఒక వేదంలో నాలుగవ వంతు అర్ధంచేసుకోగలరు. సామవేదం వంటివారే " నాకు తెలిసినంతవరకూ " అని చెబుతారు.

అమెరికా పండితుడు " మీనార్డ్ " మన దేశానికి వచ్చినప్పుడు అమెరికా గ్రంధాలయాల్లో 6700 సంస్కృతలిఖితగ్రంధాలు ఉన్నాయని తెలియచేసారు. మన ఋషులు వ్రాసిపెట్టారు. మనల్ని చదవనివ్వలేదు, వారు మన ఋషుల గ్రంధాలు చదివి " ఆ విషయాలనే " ప్రపంచానికి తెలియచేస్తున్నారు. లార్డ్ మెకాలే ( 1935 ) జిందాబాద్. 

మన ఋషులు వారి జ్ఞాననేత్రంతో చూసి అర్ధంచేసుకుని మన ఉన్నతికోసం ఇచ్చిన సంపద మన సనాతనధర్మం. దీనికి సాటి అయినది లేదు, రాదు.

అందరికీ " కనుమ పండుగ " శుభాకాంక్షలు - సూర్య. 

శుభం భూయాత్

Comments

Popular posts from this blog

సీతమ్మతల్లికి సాటి ఎవరు? - చీమలపాటి సూర్యనారాయణ

అన్నదానం వల్ల ఎవరెవరికి పుణ్యం వస్తుంది - చీమలపాటి సూర్యనారాయణ

శ్రీసరస్వతీ దేవి పుట్టినరోజు నేడు,, శుభాకాంక్షలు అందరికీ - చీమలపాటి సూర్యనారాయణ