మైఖేల్ మమస్

 🙏" శ్రీరస్తు శుభమస్తు "🙏

మైఖేల్ మమస్ అని ఒకాయన అమెరికాలో పుట్టారు. చిన్నప్పటినుంచి కొంచెం ఆధ్యాత్మికంగా ఉండేవారు. ఈయన మానసికశాంతికోసం మనదేశానికి వచ్చి హిమాలయాలలో తిరగడం మొదలెట్టారు. ఒకరోజున ఈయన అలా తిరుగుతూండగా ఓ గుహలోంచి ఒక ముని బయటకు వచ్చి ఈయనకు ఒక శివలింగం శ్రీచక్రం ఇచ్చి, అమెరికాలో ప్రతిష్ఠించు, శాంతి కలుగుతుంది అని చెప్పి అంతర్ధానమయారు.

వాటిని జాగ్రత్తగా భద్రపరచుకుని ఈయన మనదేశమంతా తిరిగారు. ఎందరో పండితులని కలిసి ఇష్టంతో సంస్కృతం నేర్చుకుని ఎన్నో గ్రంధాలను చదివారు. వేదాలను వేదవిజ్ఞానాన్ని అద్భుతసంపదగా భావించి అవే ప్రపంచశాంతిని ఇవ్వగలవనే నమ్మకంతో అమెరికాకి తిరిగివెళ్ళి నార్త్ కరోలినాలోని బ్లూ రిడ్జ్ పర్వతాలలో ఒక ఓ పర్వతాన్ని కొన్నారు. అది 450 ఎకరాలు. దానికి సోమపర్వతం అనిపేరుపెట్టి దానిమీద శ్రీసోమేశ్వర దేవాలయాన్ని కట్టారు. అందులోనే గణపతి హనుమ నవగ్రహాల విగ్రహాలను ప్రతిష్ఠించి వేదపాఠశాలను స్థాపించారు. ఇప్పుడు అక్కడ ఎందరో సంస్కృతవిద్యను అభ్యసిస్తున్నారు.

కొందరు పండితులనేది మన ఋషి ఒకరు ప్రపంచమంతా మన వేదవిజ్ఞానాన్ని వ్యాప్తిచేయడానికని ఈయనగా పునర్జన్మ తీసుకున్నారని.

పూజ్యులు సామవేదం వారు ఆయన్ని " ఆధ్యాత్మిక విద్యలో యోగి " అని గౌరవించారు.

యాజ్ఞవల్క్య సంస్కృత విశ్వవిద్యాలయ్, గుజరాత్ వారు " ఆధ్యాత్మిక విద్యా విశారద్ " అనే బిరుదుతో గౌరవించారు. 

ఎందరో పండితులు " బ్రహ్మర్షి, మహర్షి " అని కొనియాడారు.

కారణజన్ములు, పుణ్యపురుషులు. అటువంటివారిని తలచుకున్నా మానసికశాంతి కలుగుతుంది. సంశయం నాస్తి.

అలా ఎందరో పాశ్చాత్యులు మన సనాతనధర్మం, వేదవిజ్ఞానం గొప్పదనం తెలుసుకుని వాటి మీద గౌరవంతో వాటి వ్యాప్తికోసం అహర్నిశలు కృషి చేస్తూంటే మనవారు ఇక్కడ " పబ్బులు క్లబ్బుల " సంస్కృతిని ప్రోత్సహిస్తూ వాటిలో కాలక్షేపం చేస్తున్నారు.

" తన్మే మనః శివసంకల్పమస్తు " - " మా మనసుల్లో ఎల్లప్పుడూ శుభసంకల్పాలనే కలిగిస్తూ ఉండు తల్లీ " అని అమ్మవారిని వేడుకుందాం.

సర్వే జనాః సుఖినో భవంతు.

ఏతత్ సర్వం శ్రీపరదేవతార్పణమస్తు - సూర్య.

శుభం భూయాత్

Comments

Popular posts from this blog

సీతమ్మతల్లికి సాటి ఎవరు? - చీమలపాటి సూర్యనారాయణ

అన్నదానం వల్ల ఎవరెవరికి పుణ్యం వస్తుంది - చీమలపాటి సూర్యనారాయణ

శ్రీసరస్వతీ దేవి పుట్టినరోజు నేడు,, శుభాకాంక్షలు అందరికీ - చీమలపాటి సూర్యనారాయణ