రామాయణం
🙏" శ్రీరస్తు శుభమస్తు "🙏
రామాయణం చదవడంవల్ల ప్రయోజనమేమిటండీ అంటూంటారు కొందరు మేధావులు.
రామాయణం పూర్తిగా చదువుతే దానిలో ఉన్న అద్భుతవిషయాలు తెలుస్తాయి.
అలాకాకుండా ఏవో కొన్ని విషయాలను ప్రస్తావిస్తూ వ్రాసిన " రామాయణ విషవృక్షం " లాంటి పుస్తకాలు చదువుతే జాతి ఎదుగు బొదుగూ లేకుండా ఇలాగే ఉంటుంది.
జీవితమన్నాక దుఃఖాలేకాదు, సుఖాలూ ఉంటాయి. ఇది మర్త్యలోకం. సుఖానికి దుఃఖస్పర్శ, దుఃఖానికి సుఖస్పర్శ ఉంటాయి ఇక్కడ. స్వర్గంలో దుఃఖస్పర్శ ఉండదు. అదే రెండు లోకాలకీ తేడా.
హనుమ సీతమ్మతో అంటారు " ఇలాంటిచోట ఇటువంటి మనుషులమధ్య ఎలా ఉండగలుగుతున్నావమ్మా " అని. సీతమ్మవారు హనుమతో అంటుంది " నూరేళ్ళబ్రతుకులో పోయేక్షణాన్నయినా ఆనందం కలిగించే వార్త వింటావు. అందుకే బ్రతుకును కొనసాగించాలి. నువ్వుంటేనే కదా ఆ క్షణాన్ని ఆస్వాదించగలవు " అని.
సీతమ్మ అంటారు " సుఖాలు చిన్నసెలయేరుల్లాగ, చిన్నకొండల్లాగ చిన్నవిగా అనిపిస్తే కష్టాలు సముద్రాలలాగ, ఆకాశంలాగ పెద్దవిగా కనిపిస్తాయి " అని.
అంటే ఆత్మహత్యలు ఎట్టిపరిస్థితుల్లోనూ వద్దంది సీతమ్మ. ఎటువంటి అద్భుతమయిన సందేశం. అందుకే అది ఇతిహాసం ( ఇతి+హా+సం - ఇది ఇలాగే జరిగింది ) అయింది.
అదీ మనకు మన ఋషులిచ్చిన అద్భుత సంపద.
ఒకటో తరగతినుంచీ రామాయణం చెప్పడం మొదలుపెడితే 10వ తరగతికొచ్చేసరికే బాధ్యతగల పౌరులుగా తయారవుతారు, ఒత్తిడి తట్టుకునే శక్తిని పొందుతారు పిల్లలు. ఇప్పటికయినా ప్రారంభిస్తారని ఆశిద్దాం - సూర్య.
శుభం భూయాత్
Comments
Post a Comment