రమణమహర్షి A

 🙏 " శ్రీరస్తు శుభమస్తు " 🙏

ఈరోజు పూజ్యులు రమణమహర్షి జయంతి.

జ్ఞానప్రదాత. ప్రజల అజ్ఞానాన్ని పోగొట్టడానికి అవతరించిన మహానుభావుడు.

శరీరం మీద ధ్యాసలేదు, లౌకికవిషయాలపై ఆశక్తిలేదు. " బ్రహ్మసత్యం, జగన్మిధ్య " అని సంపూర్ణంగా నమ్మిన జీవన్ముక్తులు. ఒకరిపై ద్వేషం/కోపం లేదు. అసలు ఎవరిపైనా ఇష్టం/అభిమానమే లేదు.

దేశంలోనే కాదు విదేశాలలోనూ ఎందరో శిష్యులు. ఈయన సందేశాలతో తరించినవారు ఎందరో.

మొదట్లో మహర్షి బట్ట ఏమీ కట్టుకునేవారు కాదుట. ఈ శరీరం నేను కాదు అని తెలుసుకున్నాయన కనుక. దగ్గరగా ఉండే ఒకాయన " మీకు తేడా ఏమీ లేకపోవచ్చు కాని మీ దర్శనానికి వచ్చేవారికి ముఖ్యంగా స్త్రీలకి ఇబ్బందికరంగా ఉంటూంది " అని చెప్పడంతో అప్పటినుంచీ ఓ కౌపీనం ( గోచి ) పెట్టుకోవడం మొదలెట్టారుట.

ఓ సారి దగ్గరగా మసిలే ఒకాయన " ఎప్పుడూ ఇక్కడే కూర్చుంటే ఎలాగండి. కేదారినాధ్, బదరినాధ్, హరిద్వార్ అవీ వెళ్ళివస్తే అన్నీ చూసినట్లు ఉంటుంది " అంటే ఈయన " నాకూ వెళ్ళాలనే ఉంది, ఎక్కడైనా పంచభూతాలు ( భూమి నీరు గాలి నిప్పు ఆకాశం ) కాక 6వది కనిపిస్తే చెప్పు, వెళ్ళి చూసివస్తాను " అన్నారుట. 

ఎప్పుడూ మౌనంగా ధ్యానంలో అలా కూర్చుని ఊండేవారుట. 

కనబడేదంతా మాయ అని తెలుసున్నవారికి అంతా సత్+చిత్+ఆనందమే కదా.

కారణజన్ములు.

ఏతత్ సర్వం శ్రీఅరుణాచలశివార్పణమస్తు - సూర్య. 

శుభం భూయాత్

Comments

Popular posts from this blog

సీతమ్మతల్లికి సాటి ఎవరు? - చీమలపాటి సూర్యనారాయణ

అన్నదానం వల్ల ఎవరెవరికి పుణ్యం వస్తుంది - చీమలపాటి సూర్యనారాయణ

శ్రీసరస్వతీ దేవి పుట్టినరోజు నేడు,, శుభాకాంక్షలు అందరికీ - చీమలపాటి సూర్యనారాయణ