పండితరాజ10
🙏" శ్రీరస్తు శుభమస్తు "🙏
" ఢిల్లీశ్వరోవా జగదీశ్వరోవా,
మనోరధాన్ పూరయితుం
సమర్ధః,
అన్యైః నృపాలైః పరిధీయమానం,
శాకాయ వాస్యాల్లవణాయ
వాస్యాత్ "
అనగా " కోరికలను తీర్చేవారు ఇద్దరే ఇద్దరు. ఒకరు డిల్లీకి ఈశ్వరుడు/ప్రభువు. ఇంకొకరు జగత్తుకు ఈశ్వరుడు/ప్రభువు పరమేశ్వరుడు. మిగతా రాజులు నాకు ఇచ్చే ద్రవ్యం నాకు ఓరోజు పప్పుకో ఉప్పుకో సరిపోతుంది " అని అన్నారు మాగ్రామవాసి, బంధువు పండితరాజ జగన్నాధరాయలు ( 17వ శతాబ్దం ).
ఆ సమయంలో ఈయన సనాతనధర్మానికి పూర్వపువెలుగు తేవడానికి చాలా శ్రమించారని, సఫలీకృతులయారని పండితుల/విజ్ఞుల/విదేశీయాత్రీకుల అభిప్రాయం.
ప్రసిద్ధ ఫ్రెంచ్ వైద్యుడు అయిన " ప్రాంచెస్ బర్నియర్ " తన యాత్రా గ్రంధంలో " పండితరాయలు " అనే ఆయన ముఖ్యపండితుడుగా ఉండేవారని, పండితులందరిలోనూ ముఖ్యాచార్యుడిగా ఉండేవారని వ్రాసారు.
ఈయన విద్వత్తు తెలిసి ఎందరో చక్రవర్తులు ఈయన్ని తమ రాజ్యానికి రమ్మని, సభాద్యక్షపదవిని అలంకరించమని, సన్మానం స్వీకరించమని ఆహ్వానించేవారు. ఆ సందర్భంగా ఈయన పై శ్లోకం చెప్పి ఉంటారని పండితుల అభిప్రాయం.
మొన్న చాగంటివారి వీడియో ఒకటి చూసాం. టిటిడికి సలహాదారుగా వెడుతున్నారా అంటే ఆయన అన్నారు " పరమాత్మ కోసం పనిచెయ్యడానికి పదవే అవసరంలేదు. అవసరమవాలేగాని నేను అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుని సేవకు 24×7 తయారుగానే ఉంటాను " అని.
" బ్రహ్మసత్యం జగన్మిధ్య " అని తెలుసుకున్నవారికి, సంతృప్తి ఉన్నవారికి సదా " సత్+చిత్+ఆనందమే ". శాంతితో సుఖంగా ఉంటారు.
పరమాత్మ " అశాంతస్య కుతః సుఖం " అన్నారు భ.గీతలో ( 2:66 ).
ఏతత్ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు- సూర్య
శుభం భూయాత్
Comments
Post a Comment